
సాక్షి, ఏలూరు: రానున్న ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి కారుమూరి నాగేశ్వర రావు తెలిపారు. చంద్రబాబు, లోక్‌శ్ బాబు ఎన్ని పాదయాత్రలు చేసినా ఒరిగేదేమీలేదని ఆయన స్పష్టం చేశారు.
కాగా, మంత్రి కారుమూరి బుట్టాయగూడెంలో మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీచేసినా గెలుపు మాత్రం మాదే. 175 స్థానాల్లో వైఎస్సార్‌సీపీ గెలుస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి. రానున్న ఎన్నికల్లో పవన్ కల్యాన్ తణుకు నుంచి పోటీ చేస్తే పవన్‌పై పోటీ చేసేందుకు నేను సిద్థంగా ఉన్నాను. చంద్రబాబు, లోకేశ్ బాబు ఎన్ని పాదయాత్రలు చేసినా ఒరిగేదేమీలేదు. లోకేశ్ పాదయాత్రను ప్రజలు జోకర్‌లా చూస్తున్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సీఎం జగన్‌పై నమ్మకంతో ఉన్నారు అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment