Tanuku constituency
-
ఎన్నికల నాటికి 'తణుకు' ఎన్ని మలుపులు తిరుగుతుందో..? ఏ ముగింపునిస్తుందో..?
'తెలుగుదేశం-జనసేన పొత్తు వ్యవహారంలో చాలా చోట్ల టిడిపి అభ్యర్ధుల్లో గుబులు రేపుతోంది. పొత్తులో భాగంగా తమ నియోజక వర్గాన్ని జనసేనకు కేటాయిస్తారేమోనని టిడిపినేతలు కంగారు పడుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా లో ఓ నియోజక వర్గంలో టిడిపి-జనసేన నేతలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయేది నేనంటే నేనే అంటూ పోటా పోటీగా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే జనసేన అభ్యర్ధి పట్ల పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగా ఉన్నట్లు సంకేతాలు రావడంతో టిడిపి శ్రేణులకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. జనసేనకే ఆ సీటు ఇస్తే వారికి సహకరించే ప్రసక్తి లేదని టిడిపి శ్రేణులు భీష్మించుకుని ఉన్నాయంటున్నారు.' స్థానిక టీడీపీ నేతల్లో సెగలు..! తణుకు నియోజకవర్గం నుండి రాష్ట్ర మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన టిడిపికి చెందిన ఆరిమిల్లి రాధాకృష్ణపై విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి తణుకు నుంచే పోటీ చేయాలని ఆరిమిల్లి భావిస్తున్నారు. అయితే ఆ మధ్య వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ తణుకు సభలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తణుకు నుండి తమ పార్టీ తరపున విడివాడ రామచంద్రరావు పోటీ చేస్తారని ప్రకటించి సంచలనం సృష్టించారు. అది స్థానిక టీడీపీ నేతల్లో మంట పుట్టించింది. టిడిపి-జనసేనల మధ్య పొత్తు అప్పటికి ఖరారు కాలేదు. పొత్తు పెట్టుకుంటాం అని అన్నా కూడా సీట్ల సద్దుబాటు కాలేదు. అలాంటిది పవన్ కళ్యాణ్ ఏకపక్షంగా విడివాడ రామచంద్రరావు పేరు ప్రకటించడం ఏంటని టిడిపి నేతలు భగ్గుమంటున్నారు. అయితే పవన్ అలా ప్రకటించిన క్షణం నుంచి వచ్చే ఎన్నికల్లో తణుకు నియోజక వర్గంలో టిడిపి-జనసేనల తరపు అభ్యర్ధిని తానే అని విడివాడ రామచంద్రరావు ప్రచారం చేసుకుంటున్నారు. మరో వైపు టిడిపి మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయేది తానే అని చెప్పుకుంటున్నారు. తణుకు సీటు నాదంటే నాదే..! ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి విడుదలైన సందర్బంగా ఆయన విజయవాడ దాకా ర్యాలీగా వెళ్తూ తణుకు వద్ద ఆగారు. అక్కడ జనసేన అభ్యర్ధి విడివాడ రామచంద్రరావు అమాంతం వచ్చి చంద్రబాబు కాళ్లకు నమస్కరించేశారు. ఆయన్ను చంద్రబాబు కూడా ఆప్యాయంగా లేవదీసి భుజం తట్టారు. టిడిపి అభ్యర్ధి ఆరిమిల్లి కూడా చంద్రబాబుకు అభివందనం చేశారు. కానీ విడివాడ రామచంద్రరావును రిసీవ్ చేసుకున్నంత సన్నిహితంగా ఆరిమిల్లిని చంద్రబాబు రిసీవ్ చేసుకోలేదని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. తణుకు సీటును జనసేనకు కేటాయించేసినట్లే అని చంద్రబాబు సంకేతాలు ఇచ్చారని చర్చించుకుంటున్నారు. చంద్రబాబు వెళ్లిపోయిన తర్వాత తిరిగి ఆరిమిల్లి, విడివాడ ఎవరికి వారే రాబోయే ఎన్నికల్లో తణుకు సీటు నాదంటే నాదే అని తమ తమ శిబిరాల ద్వారా ప్రచారాలు చేయించుకుంటున్నారు. ఎన్నికల నాటికి ఇది ఎన్ని మలుపులు తిరుగుతుందో..? ఏ ముగింపునిస్తుందో..? అని రాజకీయ పరిశీలకులు అనుకుంటున్నారు. ఇవి చదవండి: భీమిలి సీటుపై గంటా కర్చీఫ్.. టికెట్ ఇస్తే ఓటమి ఖాయం! -
పవన్ కల్యాణ్‌పై పోటీకి సిద్దం: మంత్రి కారుమూరి కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఏలూరు: రానున్న ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మంత్రి కారుమూరి నాగేశ్వర రావు తెలిపారు. చంద్రబాబు, లోక్‌శ్ బాబు ఎన్ని పాదయాత్రలు చేసినా ఒరిగేదేమీలేదని ఆయన స్పష్టం చేశారు. కాగా, మంత్రి కారుమూరి బుట్టాయగూడెంలో మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీచేసినా గెలుపు మాత్రం మాదే. 175 స్థానాల్లో వైఎస్సార్సీపీ గెలుస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి. రానున్న ఎన్నికల్లో పవన్ కల్యాన్ తణుకు నుంచి పోటీ చేస్తే పవన్‌పై పోటీ చేసేందుకు నేను సిద్థంగా ఉన్నాను. చంద్రబాబు, లోకేశ్ బాబు ఎన్ని పాదయాత్రలు చేసినా ఒరిగేదేమీలేదు. లోకేశ్ పాదయాత్రను ప్రజలు జోకర్లా చూస్తున్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సీఎం జగన్‌పై నమ్మకంతో ఉన్నారు అంటూ కామెంట్స్ చేశారు. -
తణుకు వైఎస్ఆర్సీపీ అభ్యర్ధిగా కారుమూరి నాగేశ్వర్రావు నామినేషన్
-
‘ప్రజలకు ఏమి కావాలో వైఎస్ జగన్‌కు తెలుసు’
సాక్షి, పశ్చిమ గోదావరి: తణుకు శాసనసభ నియోజకవర్గం వైఎస్సార్ సీపీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు కనుమూరి రఘురామకృష్ణంరాజు, కార్యకర్తలు, వేలాది మంది అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎటు చూసినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రభంజనం కనబడుతుందని అన్నారు. సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలకు ఏమి కావాలో వైఎస్ జగన్ దగ్గరగా చూసారని.. వారికి ఏమి కావాలోఆయనకు తెలుసనని వ్యాఖ్యానించారు. నవరత్నాలు, బీజీ డిక్లరేషన్‌తో వైఎస్ జగన్ బుడుగు, బలహీన వర్గాల మనసు గెలుచుకున్నారని తెలిపారు. దేశంలో తనే సీనియర్ అని చెప్పుకునే సీఎం చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ పథకాలను ఎందుకకు కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. వృద్ధులకు రెండు వేల రూపాయల పింఛన్ వస్తుందంటే అది వైఎస్ జగన్ వల్లనే అని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలంతా వైఎస్ జగన్‌ను గెలిపించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. -
తణుకు.. టీడీపీలో వణుకు
ప్రధాన అభ్యర్థులు చీర్ల రాధాకృష్ణ (రాధయ్య) (వైఎస్సార్ సీపీ ) ఆరిమిల్లి రాధాకృష్ణ (టీడీపీ) బొక్కా భాస్కరరావు (కాంగ్రెస్) తణుకు, న్యూస్‌లైన్ : జిల్లాలో పారిశ్రామిక ప్రగతిలో ముం దున్న తణుకు నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. అసెంబ్లీ బరిలో 13 మంది అభ్యర్థులున్నా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్, జైసమైక్యంధ్ర పార్టీలు నామమాత్రంగా మారాయి. ఈ సారి ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులంతా కొత్తవారు కావడం విశేషం. అధికారం, ధనప్రవాహాన్ని పక్కనపెట్టి సామాన్యులకు సైతం పట్టం కట్టిన ఘనత తణుకు నియోజకవర్గానికి ఉంది. ఇక్కడ ఓటర్లు విలక్షణ తీర్పు ఇచ్చిన సంఘటనలూ ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చీర్ల రాధాకృష్ణ (రాధయ్య), టీడీపీ తరఫున ఆరిమిల్లి రాధాకృష్ణ, కాంగ్రెస్ అభ్యర్థిగా బొక్కా భాస్కరరావు తలపడుతున్నారు. వైసీపీకి అనుకూలం సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వైఎస్సార్ సీపీ అభ్యర్థి చీర్ల రాధయ్య 25 ఏళ్లుగా ప్రజాజీవితంలో ఉన్నారు. నిత్యం ప్రజలతో మమేకం కావటంతో పాటు సర్పంచ్‌గా, ఏఎంసీ చైర్మన్‌గా పనిచేసి గ్రామీణ ప్రాంత, రైతు సమస్యలు, పాలన వ్యవస్థపై అవగాహన ఉన్న వ్యక్తిగా పేర్గాంచారు. ఇది వైసీపీ విజయానికి అనుకూల అంశం కానుంది. తణుకులో 2004, 2009 ఎన్నికల్లో వరుసగా తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా ఉన్న ఆరిమిల్లి రాధాకృష్ణ సింగపూర్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూ ఏడాది క్రితమే రాజకీయాల్లోకి రావడం ఆ పార్టీకి ప్రతికూల అంశం. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి బొక్కా భాస్కరరావు దీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నా వివిధ వర్గాలతో సత్సంబంధాలు నెరపటంలో వెనుకంజలో ఉన్నారు. అభివృద్ధి ప్రదాత వైఎస్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత తణుకు నియోజకవర్గంలో ఐదుసార్లు ఆ పార్టీ అభ్యర్థులే గెలిచారు. తణుకుకు చెందిన బోళ్ల బుల్లిరామయ్య ఏలూరు ఎంపీగా నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించి కేంద్ర మంత్రి పదవిని కూడా అలంకరించారు. అయినా ఏ ఒక్క నాయకుడు తణుకులో దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇటువంటి తరుణంలో 2004, 2009 ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ ప్రభంజనంతో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. తణుకులో అభివృద్ధి అంటూ జరిగిందంటే అది ఒక్క మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే అని చెప్పవచ్చు. పట్టణంలో మౌలిక వసతులను కల్పించడంతో పాటు ఇళ్ల నిర్మాణం, వరద ముంపు ప్రాంతాల్లో డ్రెయిన్లు ఆధునికీకరణ, ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఆర్వోబీ నిర్మాణం, సమ్మర్‌స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణానికి రూ.28 కోట్లు మంజూరు, పాఠశాలల అభివృద్ధి, పేదలకు కాలనీల నిర్మాణం వైఎస్ హయాంలోనే జరిగాయి.