
సాక్షి, పశ్చిమ గోదావరి: తణుకు శాసనసభ నియోజకవర్గం వైఎస్సార్ సీపీ అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు కనుమూరి రఘురామకృష్ణంరాజు, కార్యకర్తలు, వేలాది మంది అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎటు చూసినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రభంజనం కనబడుతుందని అన్నారు. సుదీర్ఘ పాదయాత్రలో ప్రజలకు ఏమి కావాలో వైఎస్ జగన్ దగ్గరగా చూసారని.. వారికి ఏమి కావాలోఆయనకు తెలుసనని వ్యాఖ్యానించారు.
నవరత్నాలు, బీజీ డిక్లరేషన్‌తో వైఎస్ జగన్ బుడుగు, బలహీన వర్గాల మనసు గెలుచుకున్నారని తెలిపారు. దేశంలో తనే సీనియర్ అని చెప్పుకునే సీఎం చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్ పథకాలను ఎందుకకు కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. వృద్ధులకు రెండు వేల రూపాయల పింఛన్ వస్తుందంటే అది వైఎస్ జగన్ వల్లనే అని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలంతా వైఎస్ జగన్‌ను గెలిపించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment