
సాక్షి, కృష్ణా: ప్రతిపక్ష పార్టీకి చెందిన ఏ ఎమ్మెల్యేలు వచ్చినా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమస్యను పరిష్కరించేవారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని గుర్తుచేశారు. వైఎస్సార్, చంద్రబాబు నాయుడి పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. వారు వీరు అని చూడకుండా ఎవ్వరు వెళ్లినా సమస్యను పరిష్కరించగలిగే దయాహృదయం కలిగిన నేత వైఎస్సార్ అని అన్నారు. ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేను చంద్రబాబు ఏవిధంగా చూసేవారో ఆయన మాటల్లోనే అర్థమవుతోందని విమర్శించారు.
గుడివాడ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొడాలి నాని బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రనాబు నాయుడు ఐదేళ్ల పాలనలో ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. తన నామినేషన్‌కు భారీగా తరలివచ్చిన ప్రజలే చంద్రబాబు పాలనపై వ్యతిరేకతకు నిదర్శమని స్పష్టం చేశారు. గుడివాడలో తాను ఎమ్మెల్యేగా, మచిలీపట్నం ఎంపీగా బాలశౌరి భారీ మెజార్టీతో గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment