
సాక్షి, గుడివాడ: ఆంధ్రప్రదేశ్‌లో గత ఐదేళ్లలో దుర్మార్గపు పాలన సాగిందని, ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రజలు కోరుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ గుడివాడ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం గుడివాడలో జరిగిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. అందిన కాడికి దోచుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు అని, ఆయన పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు మైండ్ పనిచేయడం లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గుడివాడకు ఏమీ చేయని ఆయన ఇప్పుడు ఎన్నికల కోసమే అబద్ధపు హామీలు ఇస్తున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ హయాంలో చేపట్టిన పనులను సైతం ప్రారంభించలేకపోయిన దద్దమ్మ ముఖ్యమంత్రి చంద్రబాబు అని ధ్వజమెత్తారు.
గుడివాడ గడ్డపై తనను ఓడించే దమ్ము లేక విజయవాడ నుంచి దేవినేని అవినాష్‌ను తీసుకొచ్చి ఇక్కడ పోటీకి పెట్టారన్నారు. నిరహారదీక్ష చేస్తున్న వంగవీటి రంగాను, ఆయన అనుచరులను చంపిన ఘనుడు దేవినేని నెహ్రూ అని గుర్తు చేశారు. గుడివాడలో ఎవరు అడుగుపెట్టినా ఎగిరేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా అని స్పష్టం చేశారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడానికి శక్తి వంచన లేకుండా కృషి చేయాలని కొడాలి నాని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment