
సాక్షి, కృష్ణా: అధికారం కోసం చంద్రబాబు గాడిద కాళ్లైన పట్టుకుంటాడని మండిపడ్డారు ఎమ్మెల్యే కొడాలి నాని. చంద్రబాబు ఒంటరిగాపోటీ చేస్తే గెలవలేమని తెలిసి పవన్, బీజేపీ కాళ్లు పట్టుకున్నారని విమర్శించారు. అందితే జుట్టు.. లేదంటే కాళ్లు పట్టుకునే వ్యక్తి చంద్రబాబని దుయ్యబట్టారు. జూన్ 4 తర్వాత చంద్రబాబును తలుచుకునే వారెవరూ ఉండరని అన్నారు.
గుడివాడ ఒకటవ వార్డు నుంచి ఎమ్మెల్యే కొడాలి నాని బుధవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. నాగవరప్పాడులోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గుడివాడలో అయిదవసారి తానే గెలవబోతున్ననని తెలిపారు. ఎన్నికల సమయంలో తనను ఓడించేందుకు బయటి వ్యక్తులను తెస్తున్నారని విమర్శించారు. ఎంతమంది వచ్చినా వైఎస్సార్‌సీపీ తరపున హ్యాట్రిక్ కొడతానని ధీమా వ్యక్తం చేశారు.
గుడివాడ టీడీపీ అడ్డా...గాడిద గుడ్డు.. అంటూ చంద్రబాబు సొల్లు చెబుతున్నాడని మండిపడ్డారు. ‘నన్ను ఓడించాలనుకుంటున్న చంద్రబాబు, లోకేష్‌కు ఇదే నా సవాల్. చంద్రబాబు, లోకేష్ గుడివాడలో తన పై పోటీ చేసి గెలవాలి. టీడీపీ పుట్టిన తర్వాత గుడివాడలో టీడీపీకి 50% ఓటింగ్ మూడు సార్లు మాత్రమే వచ్చింది. నాపై పోటీకి భయపడి గంటకో వ్యక్తిని...పూటకో వ్యక్తిని తెచ్చే బతుకులు టీడీపీవి.
ఈ ఎన్నికల్లో అమెరికా నుంచి వచ్చిన వ్యక్తిని చంద్రబాబు నాపై పోటీకి పెట్టాడు. వచ్చేసారికి అంతరిక్షం నుంచి తెచ్చుకుంటారు. చంద్రబాబు ఎంత 420నో చంద్రగిరి, గుడివాడ, పామర్రు ప్రజలకు తెలుసు. ఆయన తలకిందులుగా తపస్సు చేసినా నన్ను ఓడించలేడు. ఏపీలో మళ్లీ వచ్చేది వైఎస్సార్‌సీపీనే. గుడివాడలో గెలిచేది నేనే. మళ్లీ జగన్ సీఎం అయితేనే ప్రజలకు మేలు జరుగుతుంది. మేం ప్రజల్లోకి వెళ్లి ఇదే చెబుతున్నాం’ అని పేర్కొన్నారు.
చదవండి: Memantha Siddham Day-1: మేమంతా సిద్ధం డే-1 అప్‌డేట్స్
Comments
Please login to add a commentAdd a comment