
సాక్షి, గుడివాడ : టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం గుడివాడలో జరిగిన చంద్రబాబు సభపై నాని మీడియాతో మాట్లాడారు.
‘చంద్రబాబు టీడీపీ వర్దంతి సభ నిర్వహించడానికి గుడివాడ వచ్చాడు. సొల్లు నాయుడు ఏదేదో మాట్లాడాడు. 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు గుడివాడ అభివృద్ధి కోసం ఏం చేశాడు. వైఎస్సార్, జగన్ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణం కోసం 275 ఎకరాలు కొనుగోలు చేశారు.
టీడీపీ హయాంలో ఒక్క ఎకరం కూడా పేదల కోసం కొనుగోలు చేయలేదు. మంచి నీటి అవసరాల కోసం 216 ఎకరాల్లో చెరువుల కోసం మేం ఏర్పాటు చేశాం. చంద్రబాబుకు ఇదే నా సవాల్. చంద్రబాబు మగాడైతే నా సవాల్ స్వీకరించాలి. పేదల కోసం చంద్రబాబు ఒక్క ఎకరా సేకరించాడా. నిరూపిస్తే గుడివాడలో పోటీ నుంచి తప్పుకుంటా.
నేను గంజాయి మొక్కని కాదు. గుడివాడ ముద్దు బిడ్డని. టీడీపీ తులసివనంలో చంద్రబాబే గంజాయి మొక్క. చంద్రబాబు సభకు 10 నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేశారు. చంద్రబాబువి 420 మాటలు. గుడివాడలో టిడ్కో ఇళ్లు కట్టించింది మేమే. టీడీపీ హయాంలో కేవలం 1200 ఇళ్లకు పునాదులు మాత్రమే వేశారు. జగన్ మోహన్ రెడ్డికి పుట్టిన బిడ్డకు నీ పేరు పెట్టుకోవడానికి సిగ్గులేదా. చంద్రబాబు ఎందుకు పుట్టాడో తెలియదు
చంద్రబాబువన్నీ అబద్దాలే. చంద్రబాబు ఎన్టీఆర్‌నే గంజాయి మొక్క అన్నాడు. ఎన్టీఆర్ మంచివాడైతే చంద్రబాబు ఎన్టీఆర్‌ను ఎందుకు తొలగించారు. చంద్రబాబు ఓనమాలు నేర్చుకున్నది కాంగ్రెస్‌లో కాదా. చంద్రబాబు నా వెంట్రుక ముక్క కూడా పీకలేడు. తిరుపతి బస్టాండ్‌లో జేబులు కొట్టే వెదవలకు నేను భయపడను. చంద్రబాబు ఎంత నీచుడో అందరికీ చెప్తా. చావనైనా చస్తాను కానీ చంద్రబాబు ఉడత ఊపులకు బెదరను
మరదల్ని చంపిన 420 చంద్రబాబు. మరదలు ఎందుకు ఆత్మహత్య చేసుకుందో చంద్రబాబు చెప్పాలి. గెలుపు కోసం పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకుంటున్నారు. శత్రువుకు కూడా లోకేష్ లాంటి కొడుకు పుట్టకూడదు. చంద్రబాబుకు ఏ కోటాలో పదవి వచ్చింది...నీతుల కోటాలోనా..? కోతల కోటాలోనా..? వెన్నుపోటు కోటానా..? జూనియర్ ఎన్టీఆర్ ను అడ్డుకోవడం కోసం పిచ్చిబాలయ్యను ఉసిగొల్పారు’అని చంద్రబాబుపై నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment