ఎన్టీఆర్ మృతికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా రెండు విధాలుగా కారణమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని తెలుగుదేశంలో ఎవరిని అడిగినా చెబుతారు. అలాంటి మనిషి.. ఎన్టీఆర్ వర్ధంతి రోజున దొంగ నాటకానికి దిగారనీ గుడివాడ వాసులు ఆశ్చర్యపోతున్నారు. ఎన్టీఆర్ సిసలైన రాజకీయ వారసులతో పోటీ పడుతూ.. దుష్ట రాజకీయం ప్రదర్శిస్తున్నారనీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల్ని ఎన్టీఆర్ సొంత జిల్లా వాసులు భరించలేకపోతున్నారు.
ఆంధ్రుల అభిమాన నటుడు.. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వర్థంతి నేడు. ఆనవాయితీ ప్రకారం ఎన్టీఆర్ శిష్యుడు.. స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని ప్రతి ఏటా వర్ధంతి వేడుకల్ని నిర్వహిస్తున్నారు. ప్రతీ యేడులాగే.. నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే.. దేనిని వదలకుండా తన పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకోవాలని గోతికాడ నక్కలాగా చూసే చంద్రబాబు కూడా ఎన్టీఆర్ వర్థంతి వేడుకల నిర్వహణకు సిద్ధమయ్యారనీ వైయస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ ప్రచార కార్యక్రమం.. రా కదలి రా గురువారం గుడివాడలో నిర్వహిస్తున్నారు. దీనిని ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహణకు వేదికగా మార్చబోతున్నారు చంద్రబాబు. అది పక్కా ఎన్నికల ప్రచార సభ. కేవలం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని విమర్శించేందుకే టీడీపీ మొదలుపెట్టింది. అలాంటి సభను ఎన్టీఆర్ వర్ధంతి సభగా మార్చేందుకు శతవిధాల బాబు ప్రయత్నిస్తుండడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఎన్టీఆర్ జిల్లావాసుల ఆవేదన
ఎన్టీఆర్ మృతికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా రెండు విధాలుగా కారణమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అలాంటి మనిషి.. ఎన్టీఆర్ వర్ధంతి రోజున దొంగ నాటకానికి దిగారు. బాబు తొలి నుంచే నందమూరి కుటుంబాన్ని అణగదొక్కుతూ వస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ సిసలైన రాజకీయ వారసులతో పోటీ పడుతూ.. దుష్ట రాజకీయం ప్రదర్శిస్తున్నారు. దీనిని ఎన్టీఆర్ సొంత జిల్లా వాసులు భరించలేకపోతున్నారు. చంద్రబాబు పచ్చి మోసగాడు అని.. తనను వెన్నుపోటు పొడిచాడని మానసిక క్షోభతో ఎన్టీఆర్ చెప్పిన మాటలు ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి. అలాంటిది.. ఇవాళ అదే చంద్రబాబు ఎన్టీఆర్ ఫొటోకు దండ వేసి నివాళులు ఇస్తుండడంపై గుడివాడ వాసులు ఆశ్చర్యపోతున్నారు.
హీటెక్కిన గుడివాడ రాజకీయం
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో ఎప్పటిలాగే ఎన్టీఆర్ వర్థంతి వేడుకలు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలి రా సభ. గుడివాడ సెంటర్‌లో ఇద్దరు నేతల పోటాపోటీ ఫ్లెక్సీలు వెలిశాయి. ఇరువర్గాల కార్యకర్తలూ భారీ సంఖ్యలో పోగయ్యారు. అంతే.. దెబ్బకు అక్కడి రాజకీయం వేడెక్కింది. ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం.. శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉండడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. గుడివాడ మొత్తం పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.
బాబు మాములోడు కాదుగా!
చంద్రబాబు దుష్ట ఆలోచనల గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. అందునా జనం గుమిగూడారంటే.. ఆయన క్రిమినల్ మైండ్ అక్కడ ఏదో ఒక నష్టం జరిగి తీరాలని కోరుకుంటుంది. రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తుంది. దాడులకు ఉసిగొల్పుతుంది కూడా. తొక్కిసలాటలు.. అల్లర్లు అందుకు బోలెడు ఉదాహరణలు. ఇందులో అంగళ్లు అలర్లు ఒకటి. కిందటి ఏడాది ఆగష్టు 4వ తేదీన అన్నమయ్య జిల్లా తంబళపల్లె అంగళ్లు కూడలిలో జరిగిన హింసాత్మక ఘటనలకు చంద్రబాబే కారణం. ‘తమాషాగా ఉందా.. ఆ నా కొడుకులను తరమండిరా.. వేసేయండిరా వాళ్లని’ అని వేలేత్తి చూపించి టీడీపీ శ్రేణులను ఉసిగొల్పారు.
ఈ వ్యవహారంలో బాబుపై మర్డర్ అటెంప్ట్, నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు అయ్యింది. ఈ కేసులోనూ ముందస్తు బెయిల్ మీదే చంద్రబాబు ఇప్పుడు బయట ఉన్నారు. మరి ఎన్నికల వేళ.. ఈ తరహా అల్లర్లకు ఉసిగొల్పరని గ్యారెంటీ ఏంటి? గుడివాడ ఉద్రిక్త వాతావరణాన్ని చూసి.. చంద్రబాబు తన నేర బుద్ధికి పని చెప్పకుండా ఉండగలరా?. అదీ ఎన్టీఆర్ వర్ధంతి నాడు సభ పెట్టి.. చంద్రబాబు రెచ్చగొట్టుడు ధోరణి ప్రదర్శించకుండా ఉంటారా? అనే చర్చ నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment