Krishna Assembly Constituencies
-
అది కొల్లు రవీంద్ర దిగజారుడుతనం: పేర్ని నాని
సాక్షి, కృష్ణా: రాజకీయాల్లో టీడీపీ నేత కొల్లురవీంద్ర వంటి దిగజారుడు మనిషిని ఇంకొకరిని చూడలేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై బురదజల్లి ఎన్నికల్లో పబ్బం గడుపుకోవాలని కొల్లు రవీంద్ర చూస్తున్నారని, ఇది ఆయన దిగజారుడు తననానికి నిదర్శనమని నాని మండిపడ్డారు. ‘‘గుమ్మటాల చెరువులో డబ్బులు తీసుకుని ఇళ్లు అమ్మిందెవరు?. పేదల దగ్గర వేల రూపాయలు వసూలు చేసిందెవరు?. సంపత్ అనే మున్సిపల్ కమీషనర్‌ను బూతులు తిట్టి అవమానించి పంపిందెవరు? మీరు కాదా? అని కొల్లు రవీంద్రను పేర్ని నాని ప్రశ్నించారు. పేర్ని నాని ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదు.. చేయడు కూడా. రాజుపేట కరెంట్ సబ్ స్టేషన్ వెనుక పేదల పాకలు తొలగిస్తుంటే పోరాడిన వ్యక్తిని నేనే. పేదవాళ్లకు అండగా ఉండే వ్యక్తి పేర్నినాని అయితే.. తప్పుడు పనులు చేసే వ్యక్తి కొల్లు రవీంద్ర. ఎవరెన్ని కుయుక్తులు పన్నినా కుమ్మరిగూడెం ప్రజలకు తాను అండగా నిలబడతా అని పేర్ని నాని ప్రకటించారు. చాలా మంది టీడీపీ నేతలు, ప్రత్యర్ధులతో తాను రాజకీయాల్లో పోటీ పడి నెగ్గిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. -
చంద్రబాబుకు కేశినేని నాని ఓపెన్ సవాల్
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబుకు కేశినేని నాని ఓపెన్ సవాల్ విసిరారు. చంద్రబాబుకు తన మీద గెలిచే దమ్ముందా అని కామెంట్స్ చేశారు. అలాగే, నారా లోకేష్ ఓ పనికిమాలిన వ్యక్తి అంటూ ఘాటు విమర్శలు చేశారు. కాగా, కేశినేని నాని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘విజయవాడలో అంబేద్కర్ ఉన్నారు, నేను ఉన్నాను. నాని మీద నేను గెలుస్తా అంటూ మీడియా ముందు మాట్లాడుతున్నారు. నేను మూడు లక్షల ఓట్లతో గెలుస్తున్నా. కాల్ మనీ గాళ్లు కాదు బస్తీమే సవాల్.. దమ్ము, ధైర్యం ఉంటే చంద్రబాబే నాపై పోటీచేయాలి. నారా లోకేష్ ఒక పనికి మాలినోడు. జనవరి మూడో తేదీ చంద్రబాబు నాయుడికి తిరువూరు నియోజకవర్గం సమాధి కట్టింది. #Siddham విజయవాడ MP అభ్యర్థి Kesineni Nani గారు ఈరోజు maa vurilo జరిగిన సమావేశంలో pic.twitter.com/Ut5ubb6Scq — Nagarjuna Jupudi (@NagarjunaJupud1) January 28, 2024 చంద్రబాబుకు రాబోయే ఎన్నికలే చివరివి. దానికి మూల కారణం తిరువూరు సంఘటనే. ఆస్తులు అమ్ముకున్నా, వ్యాపారాలు మూసుకున్నా అవమానాలు పడ్డాను. సీఎం జగన్ మమ్మల్ని ఆలింగనం చేసుకుని మీలాంటి వ్యక్తులు మా పార్టీలో ఉండాలని ఆహ్వానించారు. కొడుకు లోకేష్‌ను సీఎం చేయాలనే అజెండాతో చంద్రబాబు పని చేస్తున్నాడు. 33వేల ఎకరాలు రైతుల వద్ద తీసుకుని మోసగించాడు. అందుకే సొంతిల్లు కూడా కట్టలేదు. చంద్రబాబు మూటాముల్లె సర్దుకుని హైదరాబాద్ వెళ్లిపోవడానికి సిద్దంగా ఉన్నాడు. సీఎం జగన్ నిజమైన అంబేద్కర్‌వాది. కొన్ని మీడియా సంస్థలు ఏపీ అభివృద్ధి జరగలేదంటూ గొంతు చించుకుంటున్నాయి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటే అదే మానవ అభివృద్ధి. మళ్లీ సీఎం జగన్ గెలిస్తేనే పేదవాళ్లందరూ సంతోషంగా ఉంటారు. చంద్రబాబు గెలిస్తే ధనికులు హ్యాపీగా ఉంటారు. సీఎం జగన్‌ను మొదటగా స్వామిదాస్ అడిగింది ఒక్కటే వినగడప కట్టలేరు బ్రిడ్జి. రూ.26కోట్ల వ్యయంతో ఫిబ్రవరి మూడో తేదీన కట్టలేరు బ్రిడ్జికు శంఖుస్థాపన చేయబోతున్నాం. స్వామిదాస్ పక్కా లోకల్.. మనకు అన్ని చేసిపెట్టే వ్యక్తి సీఎం జగన్ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
టీడీపీలో ఫ్లెక్సీల లొల్లి
కొవ్వూరు: తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు టీడీపీలో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ తన పుట్టిన రోజును వేదికగా చేసుకుని నియోజకవర్గవ్యాప్తంగా గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఫ్లెక్సీల్లో జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నట్లు వ్యక్తుల పేర్లు కాకుండా గ్రామ టీడీపీ అని పేర్కొనడం వివాదానికి కారణమైంది. నియోజకవర్గ టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న పెండ్యాల అచి్చబాబు స్వగ్రామమైన దొమ్మేరులో ఆయన ఫొటో లేకుండా ఈ తరహా ఫ్లెక్సీల ఏర్పాటును ఆ పార్టీ స్థానిక నాయకులు తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో అచ్చిబాబు వర్గీయులు శుక్రవారం గ్రామంలో సమావేశమై మరీ జవహర్‌పై బహిరంగ విమర్శలకు దిగారు. గ్రామ కమిటీ, స్థానిక నాయకుల ప్రమేయం లేకుండా ‘దొమ్మేరు టీడీపీ’ అని పేర్కొంటూ తమ గ్రామంలో ఫ్లెక్సీలు ఎలా ఏర్పాటు చేస్తారని, ఇది జవహర్ దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. పార్టీని రెండు గ్రూపులుగా చేసేందుకు ఆయన ప్రయతి్నస్తున్నారని సీనియర్ నాయకుడు, ఎంపీటీసీ సభ్యుడు యలమర్తి శ్రీరామచంద్రమూర్తి (రాంబాబు)మండిపడ్డారు. దొమ్మేరు గ్రామ కమిటీని సంప్రదించకుండా ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అచి్చబాబు చెప్పినట్లే నడుస్తాం తప్ప, జవహర్ చెప్పినట్లు కాదని స్పష్టం చేశారు. సీనియర్ నాయకుడు కేవీకే రంగారావు, ఉప సర్పంచ్ కలగర సుబ్బారావు, టీడీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కొక్కిరిపాటి శ్రీహరి కూడా జవహర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పారీ్టకి, ఆ ఫ్లెక్సీలకు ఎటువంటి సంబంధమూ లేదని ప్రకటించారు. గతంలో అచ్చిబాబు చెబితేనే జవహర్‌కు 13 రోజుల ముందు టికెట్ ఇచ్చినా ఎమ్మెల్యేగా గెలిపించామని అన్నారు. దొమ్మేరులో జవహర్‌కు మద్దతుదారులు లేరని ప్రకటించారు. అందువల్లే సొంతంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారన్నారని అన్నారు. కొవ్వూరులో శుక్రవారం జరిగిన జవహర్ పుట్టిన రోజు వేడుకలకు సైతం అచి్చబాబు వర్గీయులు దూరంగానే ఉన్నారు. ఇటీవల అభ్యర్థుల ఖరారులో భాగంగా అధిష్టానం నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలో కూడా జవహర్ పేరు ప్రస్తావించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజా వివాదానికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎనిమిదేళ్లుగా..: జవహర్, అచ్చిబాబు వర్గాల మధ్య ఏడెనిమిదేళ్లుగా వివాదం నడుస్తోంది. దీంతో నియోజకవర్గంలో టీడీపీ రెండు గ్రూపులుగా పనిచేస్తోంది. గతంలో అచి్చబాబు వర్గం వ్యతిరేకించినందునే జవహర్‌ను అధిష్టానం కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గానికి పంపింది. అక్కడ ఓటమి చవిచూసిన ఆయన మళ్లీ కొవ్వూరుపై దృష్టి సారించారు. పేరుకు జిల్లా అధ్యక్షుడి పదవి కట్టబెట్టినప్పటికీ కొవ్వూరు నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని అధిష్టానం షరతు విధించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్ సవాల్
సాక్షి, కృష్ణా జిల్లా: పెనమలూరులో నాపై పోటీ చేసే దమ్ముందా? అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు మంత్రి జోగి రమేష్. కంకిపాడులో పెనమలూరు నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు సర్వేలు కూడా చేయించుకున్నాడని, ఎవరు పోటీ చేసినా గెలిసేది తానేనన్నారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్‌ను ఎదుర్కోలేరు. ప్రతిపక్షాలను కృష్ణా నదిలో కలిపేస్తామన్నారు. ‘‘ప్రజల గుండెల్లో జగన్ నిలిచిపోయారు. ఢిల్లీలో కాంగ్రెస్ పీఠాన్ని వణికించిన ధీరుడు సీఎం జగన్. ఆయనపై సోనియా, రాహుల్ కుట్రలు పన్నారు. చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తాడు. కాంగ్రెస్ ముందుపోటు పొడుస్తుంది. వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాలు గెలుస్తాం. పెనమలూరు గడ్డ వైఎస్సార్సీపీ అడ్డా’’ అని మంత్రి పేర్కొన్నారు. ఇదీ చదవండి: షర్మిలకు ఏ అన్యాయం చేశామో.. ఆమె చెప్పాలి: సజ్జల -
‘చంద్రబాబు కోసం నేను అమ్ముకున్న ఆస్తుల విలువ రూ.2వేల కోట్లు’
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: చంద్రబాబు రాజకీయ సమాధికి తిరువూరులో జనవరి 3నే పునాది పడిందని విజయవాడ పార్లమెంట్ వైఎస్సార్సీపీ సమన్వయకర్త, ఎంపీ కేశినేని నాని అన్నారు. తిరువూరు వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ‘‘తిరువూరులో నాపై, స్వామిదాస్‌పైకి లోకేష్ గూండాలను పంపాడు. చంద్రబాబు కోసం నేను అమ్ముకున్న ఆస్తుల విలువ రూ.2వేల కోట్లు. సీఎం జగన్ పేదవాడిని ధనికుడిని చేశారు. నా భావజాలం, సీఎం జగన్ భావజాలం ఒక్కటే.. ముక్కు సూటితనం. విజయవాడలో 206 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించి నిజమైన అంబేద్కర్ వాదిగా సీఎం జగన్ నిలిచారు’’ అని కేశినేని ప్రశంసించారు. ‘‘చంద్రబాబుకు రోడ్లు కావాలి.. ఫైవ్ స్టార్ హోటల్స్ కావాలి. సీఎం జగన్‌కు పేదవాడి కడుపుమంట తీర్చి వారిని ధనికుల్ని చేయడం కావాలి. లోకేష్ కోసం చంద్రబాబు అమరావతి నిర్మించాడు. చంద్రబాబు 100 కోట్లు కూడా విజయవాడ అభివృద్దికి ఇవ్వలేదు. తిరువూరులో స్వామి దాస్‌ను 20వేల ఓట్ల మెజారిటీతో గెలుపించుకోవాలి. త్వరలోనే కట్టలేరు బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తాం’’ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. -
పచ్చ మీడియా అంబేద్కర్‌ను అవమానించింది: ఆర్కే రోజా
సాక్షి, విజయవాడ: ప్రభుత్వంపై వ్యతిరేక కథనాలు రాస్తున్న పచ్చపత్రికలపై మంత్రి ఆర్కే.రోజా ఫైర్ అయ్యారు. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ అంటే మీకు (పచ్చ పత్రికలు) గౌరవం లేదా? అని సూటిగా ప్రశ్నించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చూపించేందుకు మనసు రాలేదా? అని మండిపడ్డారు. అంబేద్కర్‌కు నిజమైన వారసుడు సీఎం జగన్మోహన్రెడ్డి అని తెలిపారు. సీఎం జగన్మోహన్రెడ్డిని అందరూ అభినందిస్తుంటే పచ్చ మీడియా తట్టుకోలేకపోతోందని అన్నారు. పచ్చ మీడియాను..పత్రికలను బహిష్కరించాలన్నారు. శుక్రవారం రోజున ఒక్క నిమిషం కూడా అంబేద్కర్‌ను చూపించలేకపోయారని మంత్రి రోజా తెలిపారు. అంబేద్కర్‌ను పచ్చమీడియా అవమానించిందని..అంబేద్కర్‌కు అండగా నిలబడిన వర్గాలను కూడా అవమానించిందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ అంశాన్ని డైవర్ట్ చేయడానికి అంబేద్కర్ విగ్రహాన్ని వాడుకున్న వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు. వంద అడుగుల విగ్రహం పెడతానని చెప్పిన చంద్రబాబు.. ఒక్క విగ్రహమైనా పెట్టాడా? అని ప్రశ్నించారు. ప్రచారాలు, సమస్యల డైవర్షన్‌కు చంద్రబాబు అంబేద్కర్‌ను వాడుకున్నారని అన్నారు. తోపు.. తురుము అని చెప్పుకునే చంద్రబాబు విజయవాడ నడిబొడ్డులో ఏరోజైనా ఇలాంటి కార్యక్రమం చేయగలిగారా? అని నిలదీశారు. అంబేద్కర్ స్మృతివనం చూసేందుకు రెండు కళ్లూ సరిపోవని, మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. విజయవాడను ప్రపంచ పటంలో నిలిపిన వ్యక్తి జగన్మోహన్రెడ్డి అని తెలిపారు. తమ సామాజిక వర్గమైన చంద్రబాబును కాపాడుకోవడం కోవడమే ఎల్లోమీడియా పని అని విమర్శించారు. టీడీపీ,జనసేన తోక పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని మంత్రి ఆర్కే రోజా అన్నారు. చదవండి: ‘ఎల్లో’ ఏడుపులకు సీఎం జగన్ దిమ్మదిరిగే సమాధానం -
దళిత ద్రోహి ఎవరు.. సామాజిక న్యాయం చేసిందెవరు?
హవ్వా.. దళిత ఎమ్మెల్యేలనే ట్రాన్స్ఫర్ చేస్తారా? ఏంటిది?.. అంటూ టీవీ5 సాంబ చౌదరి పెడుతున్న కితకితలు రాజకీయ వర్గాల్లో నవ్వులు పూయిస్తున్నాయి. ఫ్లాష్‌బ్యాక్ తెలియక మనోడు వేస్తున్న వేషాలకు.. కాలమే సరైన సమాధానమే చెబుతుంది. ఏపీ(ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక..) రాజకీయాల్లో అసలు దళితులకు న్యాయం చేసిందెవరు? అన్యాయం చేసిందెవరు? పరిశీలిస్తే.. కాలిఫోర్నియా నుంచి ఓ ప్రవాసాంధ్రుడు పంపిన కథనం యధాతథంగా.. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశారో సాంబడికి గుర్తు లేనట్లుంది!.విశాఖ జిల్లాలో 2019 ఎన్నికలప్పుడు దళిత వర్గానికి చెందిన పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనితను అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి బరిలోకి దించారు. కొవ్వూరు(ఎస్సీ) ఎమ్మెల్యే, అప్పటి మంత్రి కేఎస్ జవహర్‌ను కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేసి పోటీ చేయించారు. ఇదే రీతిలో పలువురు ఎస్సీ, బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను జిల్లాల సరిహద్దులు దాటించి ఇతర నియోజకవర్గాల నుంచి చంద్రబాబు పోటీ చేయించారు చంద్రబాబు. వైఎస్సార్సీపీ ఇప్పుడు రాబోయే ఎన్నికల కోసం మార్పులు చేర్పులు చేస్తోంది. ఈ క్రమంలో నాలుగు జాబితాలకు కలిపి 58 అసెంబ్లీ, 10 ఎంపీ స్థానాలకు మార్పులు చేసింది. అందులో.. అగ్రవర్ణాలు పోటీ చేసిన 7 అసెంబ్లీ స్థానాలను.. ఐదు బీసీలకు, రెండింటిని మైనారిటీలకు కేటాయించారు వైఎస్ జగన్మోహన్రెడ్డి. సీట్ల కేటాయింపులో తన సొంత సామాజిక వర్గాన్ని కూడా ఆయన లెక్క చేయలేదు. మంగళగిరి ఆళ్ల రామకృష్ణ రెడ్డి ,కదిరి సిద్ధారెడ్డి ,ఎమ్మిగనూరు చెన్న కేశవరెడ్డిలకు అలాగే.. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి గతంలోనే సీటు ఇవ్వలేనని తేల్చి చెప్పారాయన. సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం.. వైఎస్సార్సీపీ జాబితా ఎస్సీలు- 21 ఎస్టీలు -3 బీసీలు- 17 మైనార్టీలు- 4 ఓసి - 13 10 లోక్‌సభ స్థానాల సమన్వయకర్తల్లో.. బీసీలు -6 ఎస్సీలు -2 ఎస్టీ -1 ఓసీ -1 ఏపీ కేబినెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ ఇచ్చిన మంత్రి పదవులు - 17 (కేబినెట్లో 70 శాతం) బీసీ మంత్రులు : బాబు పాలనలో-8 జగన్ పాలనలో-11 ఎస్సీ మంత్రులు : బాబు పాలనలో-2 జగన్ పాలనలో-5 జగన్ పాలనలో ఉప ముఖ్యమంత్రులు -4 (80 శాతం) తొలిసారిగా ఒక ఎస్సీ మహిళను హోంశాఖ మంత్రిగా నియమించారు స్పీకర్ బాబు పాలనలో-కోడెల (కమ్మ) జగన్ పాలనలో -తమ్మినేని సీతారాం (బీసీ) బీసీలకు రాజ్యసభ స్థానాలు బాబు పాలనలో-0 జగన్ పాలనలో -4 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు : ఎమ్మెల్సీలు లు బాబు పాలనలో-48 మంది ఎమ్మెల్సీలకుగానూ ఆయా సామాజిక వర్గాల నుంచి 18 మంది (37 శాతం ) జగన్ పాలనలో-43 మంది ఎమ్మెల్సీలకుగానూ ఆయా సామాజికవర్గాల నుంచి 29 మంది (68 శాతం) జగన్ హయాంలో మిగతావి.. 13 జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవులలో - 9 (69 శాతం) 14 కార్పొరేషన్ మేయర్ పదవుల్లో -12 (86 శాతం) గెలిచిన 84 మున్సిపల్ చైర్మన్ పోస్టుల్లో -58 (69 శాతం ) 137 వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల ఛైర్మన్ పదవులలో - 79 (58 శాతం) నామినేటెడ్ డైరెక్టర్ పదవులు-280 (58 శాతం) 196 వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లలో -117 (60 శాతం) 7,006 ఆలయ బోర్డు మెంబర్ల పదవుల్లో- 3,503 (50 శాతం ) బీసీ వర్గాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు ఎస్టీలకు 1 కార్పొరేషన్ ఏర్పాటు ఆ కార్పొరేషన్లలో ఆయా వర్గాలకు 684 డైరెక్టర్ పదవులు ఓసీల స్థానాలను.. బీసీ, మైనారిటీలకు ఇచ్చారు సీఎం జగన్. అయినా.. దళితుల స్థానాల్ని మళ్లీ దళితులకే కదా కేటాయించాల్సింది!. ఇందులో దళితులకు అన్యాయం ఎక్కడుంది సాంబా?.. జగనన్న ప్రభుత్వంలో ఎంత సామాజిక న్యాయం జరిగిందో.. అలాగే మీ బాస్ టైంలో ఎంత సామాజిక (అ)న్యాయం జరిగిందో క్రాస్ చెక్ చేస్కో. ::చిరు, కాలిఫోర్నియా -
ఉచ్ఛ నీచాల్లేని వ్యక్తి చంద్రబాబు
గుడివాడ టౌన్: రాజకీయాల్లో ఉచ్ఛం, నీచం లేని వ్యక్తి చంద్రబాబు నాయుడని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా నాని గురువారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియం వద్ద ఉన్న కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని, ఆయన చూపిన మార్గమే తనకు ఆదర్శమని అన్నారు. ప్రజల ఆశీస్సులతో అధికారంలోకి వచ్చింన ఎన్టీఆర్ సొంత కుటుంబ సభ్యుల చేతిలో, అధికార దాహంతో అల్లాడుతున్న ఒక మోసకారి చేతిలో వంచనకు గురై పార్టీని, ముఖ్యమంత్రి పదవిని కోల్పోయి మనో వేదనతో మృతి చెందారన్నారు. ఎవరైతే ఎన్టీఆర్ పనికిరాడని చెప్పాడో, పార్టీ అధ్యక్ష పదవిని, ముఖ్యమంత్రి పదవిని లాక్కుని అధికారంలోకి వచ్చాడో వాడే, ఆ గజదొంగే ఇప్పుడు ఓట్ల కోసం ఎన్టీఆర్ బూట్లు నాకుతున్నాడన్నారు. ఇటువంటి నక్కజిత్తుల వేషాలను ప్రజలు తిప్పికొడతారని చెప్పారు. తెలంగాణలో ప్రజలు ఇప్పటికే తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేశారన్నారు. 2024 ఎన్నికల అనంతరం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సైతం టీడీపీని, చంద్రబాబు నాయకత్వాన్ని కనుమరుగు చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. బ్రతికుండగా దుర్మార్గుడని, పార్టీ నాయకుడిగా పనికిరాడని చెప్పి పదవి నుంచి దింపేసిన కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ గ్రామానికి వచ్చి విగ్రహాలకు దండలెయ్యడం, వర్ధంతులు చేస్తామనడం మోసపూరిత చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబుని రా కదలిరా.. అంటున్న సెంట్రల్ జైలు చంద్రబాబు రా కదలిరా అని జనంలోకి వస్తుంటే రాజమండ్రి సెంట్రల్ జైలు ఆయన్ని రా కదలిరా.. అని పిలుస్తోందని కొడాలి నాని వ్యాఖ్యానించారు. కన్ను పని చేయడంలేదు, కిడ్నీ పని చేయడంలేదు, ఇంకా ఏదో పని చేయడంలేదు అంటూ జిత్తులమారి నక్కలా తప్పించుకుంటున్న 420 గాడిని రాజమండ్రి సెంట్రల్ జైలు కదలి రమ్మనిపిలుస్తోందని, ఆయన త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. త్వరగా జైలుకు వెళ్లు అని సుప్రీంకోర్టు బాబును ఆదేశించిందన్నారు. ఎన్టీఆర్ వారసుడు జూనియర్ ఎన్టీఆరే ఎన్టీఆర్ వారసులమని కుటుంబ సభ్యులు చెప్పుకుంటుంటే.. ప్రజలు మాత్రం జూనియర్ ఎన్టీఆర్‌నే ఆయనకు నిజమైన వారసుడిగా గుర్తిస్తున్నారని నాని చెప్పారు. ఫ్లెక్సీల తొలగింపు కుటుంబ సభ్యుల నీచమైన బుద్ధిని తెలియజేసిందే తప్ప జూనియర్ ఎన్టీఆర్‌కు జరిగే నష్టం ఏమీలేదన్నారు. తన అల్లుడు పప్పుగాడిని పైకి లేపేందుకు బాలకృష్ణ ఇటువంటి నీచమైన కార్యాలకు తెరలేపారన్నారు. బాలకృష్ణ, చంద్రబాబు లాంటి వారు వందల మంది వచ్చింనా జూనియర్ ఎన్టీఆర్‌కు ఊడేదేమీలేదన్నారు చంద్రబాబు ఇంతకు ముందు కూడా తనకు డిపాజిట్లు రాకుండా చేస్తానంటూ వీరంగం వేశారని, కానీ తాను నాలుగుసార్లు శాసన సభ్యునిగా గెల్చానని తెలిపారు. గుడివాడలో తనపై పోటీ చేస్తున్న అభ్యర్థులు మారుతున్నారు తప్ప తన గెలుపులో ఏమాత్రం తేడా లేదన్నారు. వైఎస్ జగన్ అధికారంలో ఉండటం, ఆయన పాలన కొనసాగడం తనకు ముఖ్యమని, పదవులు ఈకతో సమానమని అన్నారు. ప్రతి పార్టీకీ గెలవాలనే లక్ష్యం ఉంటుందని, గెలిచే వారికే టిక్కెట్లు ఇవ్వడం పార్టీ అధినేత ఆలోచన అని చెప్పారు. ఇవన్నీ సర్వ సాధారణమని, వీటితో చంద్రబాబుకు ఏం పని అని ప్రశ్నించారు. 1978లో చంద్రగిరిలో గెలిచిన చంద్రబాబు ఆ తర్వాత ఓడిపోలేదా అని ప్రశ్నించారు. ఆయన సీఎం అయ్యాక జరిగిన 5 ఎన్నికల్లో చంద్రగిరిలో ఒక్కసారైనా గెలిచారా అని అన్నారు. గన్నవరంలో గెలిచిన గద్దె రామ్మోహన్‌రావును విజయవాడలో, నందిగామలో గెలిచిన దేవినేని ఉమను మైలవరంలో, కొవ్వూరు నుంచి తెచ్చిన జవహర్‌ను తిరువూరులో బాబు ఎందుకు పోటీ చేయిస్తున్నాడని అన్నారు. బాలయ్య హిందూపూర్‌లో పుట్టాడా? వాడికి కొంపాగోడు ఉందా అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ నక్కజిత్తుల చంద్రబాబు మాటలు నమ్మరని స్పష్టంచేశారు. -
చంద్రబాబు.. నువ్వెంత నీచుడివో చెబుతూనే ఉంటా : కొడాలి నాని
సాక్షి, గుడివాడ : టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం గుడివాడలో జరిగిన చంద్రబాబు సభపై నాని మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు టీడీపీ వర్దంతి సభ నిర్వహించడానికి గుడివాడ వచ్చాడు. సొల్లు నాయుడు ఏదేదో మాట్లాడాడు. 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు గుడివాడ అభివృద్ధి కోసం ఏం చేశాడు. వైఎస్సార్, జగన్ హయాంలో పేదల ఇళ్ల నిర్మాణం కోసం 275 ఎకరాలు కొనుగోలు చేశారు. టీడీపీ హయాంలో ఒక్క ఎకరం కూడా పేదల కోసం కొనుగోలు చేయలేదు. మంచి నీటి అవసరాల కోసం 216 ఎకరాల్లో చెరువుల కోసం మేం ఏర్పాటు చేశాం. చంద్రబాబుకు ఇదే నా సవాల్. చంద్రబాబు మగాడైతే నా సవాల్ స్వీకరించాలి. పేదల కోసం చంద్రబాబు ఒక్క ఎకరా సేకరించాడా. నిరూపిస్తే గుడివాడలో పోటీ నుంచి తప్పుకుంటా. నేను గంజాయి మొక్కని కాదు. గుడివాడ ముద్దు బిడ్డని. టీడీపీ తులసివనంలో చంద్రబాబే గంజాయి మొక్క. చంద్రబాబు సభకు 10 నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేశారు. చంద్రబాబువి 420 మాటలు. గుడివాడలో టిడ్కో ఇళ్లు కట్టించింది మేమే. టీడీపీ హయాంలో కేవలం 1200 ఇళ్లకు పునాదులు మాత్రమే వేశారు. జగన్ మోహన్ రెడ్డికి పుట్టిన బిడ్డకు నీ పేరు పెట్టుకోవడానికి సిగ్గులేదా. చంద్రబాబు ఎందుకు పుట్టాడో తెలియదు చంద్రబాబువన్నీ అబద్దాలే. చంద్రబాబు ఎన్టీఆర్‌నే గంజాయి మొక్క అన్నాడు. ఎన్టీఆర్ మంచివాడైతే చంద్రబాబు ఎన్టీఆర్‌ను ఎందుకు తొలగించారు. చంద్రబాబు ఓనమాలు నేర్చుకున్నది కాంగ్రెస్‌లో కాదా. చంద్రబాబు నా వెంట్రుక ముక్క కూడా పీకలేడు. తిరుపతి బస్టాండ్‌లో జేబులు కొట్టే వెదవలకు నేను భయపడను. చంద్రబాబు ఎంత నీచుడో అందరికీ చెప్తా. చావనైనా చస్తాను కానీ చంద్రబాబు ఉడత ఊపులకు బెదరను మరదల్ని చంపిన 420 చంద్రబాబు. మరదలు ఎందుకు ఆత్మహత్య చేసుకుందో చంద్రబాబు చెప్పాలి. గెలుపు కోసం పవన్ కళ్యాణ్ కాళ్లు పట్టుకుంటున్నారు. శత్రువుకు కూడా లోకేష్ లాంటి కొడుకు పుట్టకూడదు. చంద్రబాబుకు ఏ కోటాలో పదవి వచ్చింది...నీతుల కోటాలోనా..? కోతల కోటాలోనా..? వెన్నుపోటు కోటానా..? జూనియర్ ఎన్టీఆర్ ను అడ్డుకోవడం కోసం పిచ్చిబాలయ్యను ఉసిగొల్పారు’అని చంద్రబాబుపై నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
చంద్రబాబు చిట్టా విప్పితే తట్టుకోలేరు: కేశినేని నాని
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కలలకు రూపం ఈ అంబేద్కర్ విగ్రహమని అన్నారు ఎంపీ కేశినేని నాని. అంబేద్కర్ విగ్రహంపై రాజకీయం చేయడం టీడీపీకి సమంజసం కాదు. నేను చంద్రబాబు చిట్టా విప్పితే తట్టుకోలేరంటూ నాని వార్నింగ్ ఇచ్చారు. కాగా, కేశినేని నాని గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘దేశంలో ఎక్కడా లేని విధంగా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సీఎం జగన్ ఆలోచనలకు స్ఫూర్తి అంబేద్కర్. వివక్ష లేని సమాజం కావాలని అంబేద్కర్ ఆశించారు. సీఎం జగన్ ఇప్పుడు వివక్ష లేని పాలన అందిస్తున్నారు. అంటరానితనం, కుల వివక్షపైన అంబేద్కర్ పోరాటం చేశారు. పేదలను ఉన్నత స్థాయితో ఉంచాలని ఆశించే నాయకుడు సీఎం జగన్. ఆరోజు అంబేద్కర్ పోరాడిన వర్గాల కోసం నేడు సీఎం జగన్ పోరాడుతున్నారు. అంబేడ్కర్ విగ్రహాన్ని గతంలో అందరూ ఊరు చివర పెట్టేవారు. సీఎం జగన్ మాత్రం రాష్ట్రం నడి బొడ్డున ఇంత పెద్ద విగ్రహాన్ని పెట్టారు. ఆ ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. అంబేద్కర్ విగ్రహంపై రాజకీయాలు చేయడం టీడీపీకి సమంజసం కాదు. నేను చంద్రబాబు చిట్టా విప్పితే మీరు తట్టుకోలేరు’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో కేశినేని చిన్ని వ్యాఖ్యలపై నాని స్పందించారు. ఈ సందర్బంగా ఉత్తర కుమారుడి ప్రగల్బాలు పట్టించుకోవాల్సిన అవసరంలేదని సెటైరికల్ పంచ్ విసిరారు. అలాగే, రేపు ఎన్నికల బాక్స్‌లు తెరిచాక 80 శాతం ఏ పార్టీ ఖాళీ అవుతుందో తెలుస్తుంది అంటూ కామెంట్స్ చేశారు. -
గుడివాడలో టీడీపీ-జనసేన శ్రేణుల ఓవరాక్షన్
సాక్షి, కృష్ణా జిల్లా: గుడివాడలో టీడీపీ, జనసేన శ్రేణుల ఓవరాక్షన్ ఉద్రిక్తతకు దారితీసింది. రోడ్డుకు అడ్డంగా బైక్‌లను నిలిపిన టీడీపీ, జనసేన కార్యకర్తలు.. వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా వ్యవహరించారు. పోలీసులు నచ్చచెప్పినా వినకుండా రెచ్చగొట్టే చర్యలకు టీడీపీ పాల్పడింది. కాగా, గుడివాడ రాజకీయం హీటెక్కింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో ఎప్పటిలాగే ఎన్టీఆర్ వర్థంతి వేడుకలు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలి రా సభ. గుడివాడ సెంటర్లో ఇద్దరు నేతల పోటాపోటీ ఫ్లెక్సీలు వెలిశాయి. ఇరువర్గాల కార్యకర్తలూ భారీ సంఖ్యలో పోగయ్యారు. అంతే.. దెబ్బకు అక్కడి రాజకీయం వేడెక్కింది. శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉండడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. గుడివాడ మొత్తం పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. -
‘వెయ్యి మంది బాలకృష్ణలు వచ్చినా జూ.ఎన్టీఆర్‌ను ఏం చేయలేరు’
సాక్షి, కృష్ణా జిల్లా: లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగింపుపై ఆయన స్పందిస్తూ.. వాళ్లది నీచాతినీచమైన బుద్ధి. వెయ్యిమంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్‌ను ఏం చేయలేరు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రాన ఏమీ చేయలేరు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వారు ఎన్టీఆర్ వర్ధంతి చేస్తారా?’’ అంటూ కొడాలి నాని మండిపడ్డారు. ఎన్టీఆర్ సమాధి సాక్షిగా నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు బాలకృష్ణ అనుచరులు. బాలకృష్ణ ఆదేశాల మేరకే ఫ్లెక్సీలు తొలగించినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ వచ్చి వెళ్లిన మరుక్షణమే ఫ్లెక్సీలు తొలగించారు. -
గుడివాడలో హై అలెర్ట్
ఎన్టీఆర్ మృతికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా రెండు విధాలుగా కారణమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని తెలుగుదేశంలో ఎవరిని అడిగినా చెబుతారు. అలాంటి మనిషి.. ఎన్టీఆర్ వర్ధంతి రోజున దొంగ నాటకానికి దిగారనీ గుడివాడ వాసులు ఆశ్చర్యపోతున్నారు. ఎన్టీఆర్ సిసలైన రాజకీయ వారసులతో పోటీ పడుతూ.. దుష్ట రాజకీయం ప్రదర్శిస్తున్నారనీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల్ని ఎన్టీఆర్ సొంత జిల్లా వాసులు భరించలేకపోతున్నారు. ఆంధ్రుల అభిమాన నటుడు.. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వర్థంతి నేడు. ఆనవాయితీ ప్రకారం ఎన్టీఆర్ శిష్యుడు.. స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని ప్రతి ఏటా వర్ధంతి వేడుకల్ని నిర్వహిస్తున్నారు. ప్రతీ యేడులాగే.. నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే.. దేనిని వదలకుండా తన పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకోవాలని గోతికాడ నక్కలాగా చూసే చంద్రబాబు కూడా ఎన్టీఆర్ వర్థంతి వేడుకల నిర్వహణకు సిద్ధమయ్యారనీ వైయస్సార్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ ప్రచార కార్యక్రమం.. రా కదలి రా గురువారం గుడివాడలో నిర్వహిస్తున్నారు. దీనిని ఎన్టీఆర్ వర్ధంతి నిర్వహణకు వేదికగా మార్చబోతున్నారు చంద్రబాబు. అది పక్కా ఎన్నికల ప్రచార సభ. కేవలం వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించేందుకే టీడీపీ మొదలుపెట్టింది. అలాంటి సభను ఎన్టీఆర్ వర్ధంతి సభగా మార్చేందుకు శతవిధాల బాబు ప్రయత్నిస్తుండడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ జిల్లావాసుల ఆవేదన ఎన్టీఆర్ మృతికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా రెండు విధాలుగా కారణమైన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అలాంటి మనిషి.. ఎన్టీఆర్ వర్ధంతి రోజున దొంగ నాటకానికి దిగారు. బాబు తొలి నుంచే నందమూరి కుటుంబాన్ని అణగదొక్కుతూ వస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ సిసలైన రాజకీయ వారసులతో పోటీ పడుతూ.. దుష్ట రాజకీయం ప్రదర్శిస్తున్నారు. దీనిని ఎన్టీఆర్ సొంత జిల్లా వాసులు భరించలేకపోతున్నారు. చంద్రబాబు పచ్చి మోసగాడు అని.. తనను వెన్నుపోటు పొడిచాడని మానసిక క్షోభతో ఎన్టీఆర్ చెప్పిన మాటలు ఇప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి. అలాంటిది.. ఇవాళ అదే చంద్రబాబు ఎన్టీఆర్ ఫొటోకు దండ వేసి నివాళులు ఇస్తుండడంపై గుడివాడ వాసులు ఆశ్చర్యపోతున్నారు. హీటెక్కిన గుడివాడ రాజకీయం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో ఎప్పటిలాగే ఎన్టీఆర్ వర్థంతి వేడుకలు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలి రా సభ. గుడివాడ సెంటర్లో ఇద్దరు నేతల పోటాపోటీ ఫ్లెక్సీలు వెలిశాయి. ఇరువర్గాల కార్యకర్తలూ భారీ సంఖ్యలో పోగయ్యారు. అంతే.. దెబ్బకు అక్కడి రాజకీయం వేడెక్కింది. ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం.. శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం ఉండడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. గుడివాడ మొత్తం పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. బాబు మాములోడు కాదుగా! చంద్రబాబు దుష్ట ఆలోచనల గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. అందునా జనం గుమిగూడారంటే.. ఆయన క్రిమినల్ మైండ్ అక్కడ ఏదో ఒక నష్టం జరిగి తీరాలని కోరుకుంటుంది. రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తుంది. దాడులకు ఉసిగొల్పుతుంది కూడా. తొక్కిసలాటలు.. అల్లర్లు అందుకు బోలెడు ఉదాహరణలు. ఇందులో అంగళ్లు అలర్లు ఒకటి. కిందటి ఏడాది ఆగష్టు 4వ తేదీన అన్నమయ్య జిల్లా తంబళపల్లె అంగళ్లు కూడలిలో జరిగిన హింసాత్మక ఘటనలకు చంద్రబాబే కారణం. ‘తమాషాగా ఉందా.. ఆ నా కొడుకులను తరమండిరా.. వేసేయండిరా వాళ్లని’ అని వేలేత్తి చూపించి టీడీపీ శ్రేణులను ఉసిగొల్పారు. ఈ వ్యవహారంలో బాబుపై మర్డర్ అటెంప్ట్, నేరపూరిత కుట్ర కింద కేసు నమోదు అయ్యింది. ఈ కేసులోనూ ముందస్తు బెయిల్ మీదే చంద్రబాబు ఇప్పుడు బయట ఉన్నారు. మరి ఎన్నికల వేళ.. ఈ తరహా అల్లర్లకు ఉసిగొల్పరని గ్యారెంటీ ఏంటి? గుడివాడ ఉద్రిక్త వాతావరణాన్ని చూసి.. చంద్రబాబు తన నేర బుద్ధికి పని చెప్పకుండా ఉండగలరా?. అదీ ఎన్టీఆర్ వర్ధంతి నాడు సభ పెట్టి.. చంద్రబాబు రెచ్చగొట్టుడు ధోరణి ప్రదర్శించకుండా ఉంటారా? అనే చర్చ నడుస్తోంది. -
పచ్చ ‘సేన’
సాక్షి, అమరావతి: పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించే అరకొర సీట్లకూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఎసరు పెట్టారు! పచ్చ ముఖాలకే జనసేన ముసుగు వేసి ఆ పార్టీకి కేటాయించే సీట్లలో పోటీకి దించే ఎత్తుగడకు శ్రీకారం చుట్టారు. వారంతా పైకి మాత్రం జనసేనలో కొనసాగుతూ తాను చెప్పినట్లు నడుచుకునేలా వ్యూహం సిద్ధం చేశారు. పథకం ప్రకారం ఒక్కో నేతను జనసేనలో చేర్చే కార్యక్రమాన్ని ఇప్పటికే మొదలు పెట్టారు. బాబు ఆదేశాలతో బూరగడ్డ..! కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత బూరగడ్డ వేదవ్యాస్ గురువారం మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి వెళ్లి పవన్‌కళ్యాణ్‌తో సమావేశమయ్యారు. వేదవ్యాస్‌తోపాటు మరో టీడీపీ నేత కాగిత కృష్ణప్రసాద్ కూడా పెడన టిక్కెట్ ఆశిస్తుండగా, పొత్తుల్లో భాగంగా తమకు కేటాయించాలంటూ జనసేన ఇప్పటికే ప్రతిపాదించడం గమనార్హం. వేదవ్యాస్ గతంలో ప్రజారాజ్యం పార్టీలో పని చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన పవన్‌ను కలసినట్లు జనసేనలో చర్చ సాగుతోంది. టీడీపీకే చెందిన మాగంటి బాబు, జలీల్‌ఖాన్ తదితరులు కూడా పవన్ కళ్యాణ్‌తో సమావేశం కావడం వెనుక చంద్రబాబు పాత్ర ఉన్నట్లు జనసైనికులు భావిస్తున్నారు. ఎమ్మెల్సీ వంశీకృష్ణ చేరిక కూడా.. వైఎస్సార్సీపీ అసెంబ్లీ టికెట్ నిరాకరించడంతో ఎమ్మెల్సీ వంశీకృష్ణ ఇటీవల జనసేనలో చేరారు. ఆయన తొలుత చంద్రబాబును సంప్రదించారని, టీడీపీ అధినేత ఆదేశాల మేరకే జనసేనలో చేరారనే చర్చ సాగుతోంది. జనసేనకు కేటాయించే సీట్ల సంఖ్య ఇంకా ఖరారు కాకున్నా, అతి తక్కువగా కేటాయించడంతోపాటు అందులోనూ ఇన్నాళ్లూ జనసేనను నమ్ముకున్న నాయకులకు కాకుండా తన మనుషులను చంద్రబాబు ప్రవేశపెడుతున్నట్లు రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఎన్నికల అనంతరం తమ పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని జనసేన నేతలు ఆందోళన చెందుతున్నారు. 2014 పొత్తులే నిదర్శనం.. 2014 ఎన్నికల సమయంలో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు ఇదే ఎత్తుగడ అమలు చేసినట్లు రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బీజేపీకి తొలుత 15 అసెంబ్లీ సీట్లను కేటాయించి నామినేషన్ల సమయానికి 11కి పరిమితం చేశారు. తీరా అందులోనూ మూడు చోట్ల స్నేహపూర్వక పోటీ పేరుతో టీడీపీ అభ్యర్ధులను కూడా బరిలోకి దించినట్లు గుర్తు చేస్తున్నారు. మొత్తంగా ఆ ఎన్నికల ముందు కొత్తగా బీజేపీలో చేరిన చంద్రబాబు మనుషులకే టిక్కెట్లు దక్కాయని పేర్కొంటున్నారు. -
వైఎస్సార్సీపీ సిద్ధాంతం కోసం దుట్టా పని చేస్తారు
సాక్షి, కృష్ణా: గన్నవరం నియోజకవర్గంపై యెల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారం, రాద్ధాంతం అంతా ఇంతా కాదు. ఈ తరుణంలో వైఎస్సార్సీపీ అప్రమత్తమైంది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావును మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో వీళ్ల భేటీ జరిగింది. పార్టీ ఆవిర్భావం నుండి కష్టపడిన వ్యక్తి దుట్టా రామచంద్రరావు. దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో దుట్టా ఒకరు. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సైతం దుట్టా కలిశారు. జగన్మోహన్ రెడ్డి కోసం.. పార్టీ సిద్దాంతం కోసం పనిచేసే వ్యక్తి దుట్టా అని బాలశౌరి తెలిపారు. ‘‘ఎంపీ బాలశౌరికి నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద్దరూ రాజశేఖర్ రెడ్డి శిష్యులుగా సుదీర్ఘకాలం పనిచేసాం. మూడు నెలలు క్రితం సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశాను. ఆరోజు సీఎం జగన్మోహన్ రెడ్డికి నాఅభిప్రాయం చెప్పాను. నేడు ఎంపీ బాలశౌరికి అదే చెప్పాను అని దుట్టా మీడియాకు వివరించారు. మరికొందరు నేతలు సైతం ఈ భేటీలో పాల్గొన్నారు. -
నువ్వెవరు.. ఇక్కడ పెత్తనం మాది!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ నాయకుల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. చంద్రబాబు చేసిన ప్రయోగం వికటించి... కమ్మ, కాపు నేతలు రెండు వర్గాలుగా విడిపోయి గొడవకు దిగారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడి ఎదుటే ఒకరిపై మరొకరు కుర్చీలు విసురుకుని వీరంగం సృష్టించారు. హనుమాన్‌జంక్షన్‌లోని టీడీపీ కార్యాలయంలో గురువారం టీడీపీ నియోజకవర్గ సమన్వయ సమావేశం నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు హాజరైన ఈ సమావేశం ప్రారంభంలోనే రసాభాసగా మారింది.నియోజకవర్గ పరిశీలకుడు హరిబాబు నాయుడుపై గన్నవరం మండల అధ్యక్షుడు జాస్తి వెంకటేశ్వరరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఖర్చు మాది... మేం లోకల్.. నువ్వు నాన్‌లోకల్. మామీద నీ పెత్తనం ఏమిటీ. నాకు నేరుగా చంద్రబాబుతోనే సంబంధాలు ఉన్నాయి. నువ్వెంత. ఇక్కడ మాదే పెత్తనం...’ అంటూ జాస్తి ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. హరిబాబు నాయుడుపై జాస్తి వెంకటేశ్వరరావుతోపాటు మరికొందరు నాయకులు దాడి చేసేందుకు దూసుకెళ్లారు. దీంతో హరిబాబు నాయుడు సైతం తీవ్రంగా స్పందించడంతో సమావేశంలో పాల్గొన్న నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. కమ్మ, కాపు నేతలు రెండు వైపులకు చేరి ఒకరిపై మరొకరు కుర్చీలు విసురుకున్నారు. హరిబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఉంగుటూరు మండల టీడీపీ అధ్యక్షుడిని సైతం స్థానిక నేతలు రెచ్చగొట్టారు. దీంతో గొడవ తారాస్థాయికి చేరింది. ఈ సమయంలో కొనకళ్ల నారాయణరావు జోక్యం చేసుకుని సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఇరువర్గాలు వినకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. వికటించిన చంద్రబాబు ప్రయోగం... టీడీపీ గన్నవరం నియోజకవర్గ పరిశీలకుడిగా గుంటూరు జిల్లాకు చెందిన కాపు నేత వడ్రాం హరిబాబు నాయుడును ఆ పార్టీ అధినేత చంద్రబాబు నియమించాడు. నియోజకవర్గంలోని కాపులను సమన్వయం చేస్తారనే ఉద్దేశంతో ఆయనకు పరిశీలకుడి బాధ్యతలు అప్పగించారు. అయితే, హరిబాబు నియామకం తొలి నుంచి ఇక్కడ కొందరు నాయకులకు నచ్చలేదు. ముఖ్యంగా మాజీ మంత్రి దేవినేని ఉమా అనుచరులుగా ఉంటూ మట్టిదోపిడీ, సెటిల్మెంట్లు చేసినవారికి హరిబాబు నియామకం మింగుడు పడలేదు. దీంతో ఆధిపత్యం కోసం పోరు జరుగుతూనే ఉంది. ఇటీవల నిర్వహించిన ‘భవిష్యత్‌కు గ్యారెంటీ’ బస్సుయాత్రలో హరిబాబు నాయుడు యాక్టివ్‌గా వ్యవహరించడాన్ని స్థానిక నేతలు జీర్జించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే పథకం ప్రకారమే గురువారం జాస్తి వెంకటేశ్వరరావు గొడవకు దిగడంతోపాటు ఆ తర్వాత ఉంగుటూరు మండల అధ్యక్షుడు కూడా నిరసన తెలియజేసినట్లు తెలుస్తోంది. మరోవైపు టీడీపీలో కొందరు నేతల ఆధిపత్య, అహంకారపూరిత ధోరణి వల్లే ఈ గొడవ జరిగిందని, వీరి వైఖరి వల్ల అన్ని సామాజికవర్గాలు పార్టీకి దూరమవుతున్నాయని కార్యకర్తలు బహిరంగంగానే వ్యాఖ్యానించడం గమనార్హం. -
చంద్రబాబుపై వల్లభనేని వంశీ ఫైర్
సాక్షి, కృష్ణా జిల్లా: కాటికి కాలు చాపిన వాడికి స్మశానమే గుర్తుకు వస్తుందంటూ చంద్రబాబుపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మండిపడ్డారు. ఆదివారం ఆయన గన్నవరంలో మీడియాతో మాట్లాడుతూ, ఊరు పొమ్మంటుంది కాడి రమ్మంటుంది అనే స్థితిలో చంద్రబాబు ఉన్నాడంటూ దుయ్యబట్టారు. ‘‘గన్నవరం నియోజకవర్గంలో 27వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇస్తే ఎక్కువ శాతం ఇళ్లు నిర్మించుకొని గృహప్రవేశం చేశారు. అద్దె ఇంట్లో ఉంటూ అనేక ఇబ్బందులు పడుతున్న 30 లక్షల మంది పేదలకు సీఎం జగన్ ఆత్మగౌరవాన్ని ఇచ్చారు.. పేదలకు మంచిచేసే ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్లు పనికిమాలిన సన్నాసులు. అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్నట్లు ఉంది చంద్రబాబు శైలి. గత ప్రభుత్వంలో ఒక్క సెంటు భూమి కుడా పేదలకు ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో సెంటు భూమికుడా ఇవ్వకుండా ఇప్పుడు ఇచ్చే వారిని విమర్శించడానికి సిగ్గుశరం ఉండాలి’’ అంటూ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిప్పులు చెరిగారు. చదవండి: వందల మంది రెడ్ల ప్రాణాలు తీసినప్పుడు ఎక్కడున్నావ్!