వైఎస్సార్సీపీ సిద్ధాంతం కోసం దుట్టా పని చేస్తారు | Vallabhaneni Balasouri Meet YSRCP Dutta Ramachandra Rao In Krishna Over Gannavaram Politics - Sakshi
Sakshi News home page

జగన్‌ కోసం, వైఎస్సార్సీపీ సిద్ధాంతం కోసం పని చేసే వ్యక్తి దుట్టా

Published Sat, Aug 26 2023 4:32 PM | Last Updated on Mon, Feb 12 2024 10:57 AM

Vallabhaneni Balasouri Meet YSRCP Dutta Ramachandra Rao  - Sakshi

సాక్షి, కృష్ణా:  గన్నవరం నియోజకవర్గంపై యెల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారం, రాద్ధాంతం అంతా ఇంతా కాదు. ఈ తరుణంలో వైఎస్సార్సీపీ అప్రమత్తమైంది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత దుట్టా రామచంద్రరావును మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో వీళ్ల భేటీ జరిగింది.

పార్టీ ఆవిర్భావం నుండి కష్టపడిన వ్యక్తి దుట్టా రామచంద్రరావు. దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో దుట్టా ఒకరు. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిని సైతం దుట్టా కలిశారు. జగన్‌మోహన్‌ రెడ్డి కోసం.. పార్టీ సిద్దాంతం కోసం పనిచేసే వ్యక్తి దుట్టా అని బాలశౌరి తెలిపారు. 

‘‘ఎంపీ బాలశౌరికి నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద్దరూ రాజశేఖర్ రెడ్డి శిష్యులుగా సుదీర్ఘకాలం పనిచేసాం. మూడు నెలలు క్రితం సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశాను. ఆరోజు సీఎం జగన్మోహన్ రెడ్డికి నాఅభిప్రాయం చెప్పాను. నేడు ఎంపీ బాలశౌరికి అదే చెప్పాను అని దుట్టా మీడియాకు వివరించారు. మరికొందరు నేతలు సైతం ఈ భేటీలో పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement