Vallabhaneni balasauri
-
వైఎస్సార్సీపీ సిద్ధాంతం కోసం దుట్టా పని చేస్తారు
సాక్షి, కృష్ణా: గన్నవరం నియోజకవర్గంపై యెల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారం, రాద్ధాంతం అంతా ఇంతా కాదు. ఈ తరుణంలో వైఎస్సార్సీపీ అప్రమత్తమైంది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత దుట్టా రామచంద్రరావును మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో వీళ్ల భేటీ జరిగింది. పార్టీ ఆవిర్భావం నుండి కష్టపడిన వ్యక్తి దుట్టా రామచంద్రరావు. దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో దుట్టా ఒకరు. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సైతం దుట్టా కలిశారు. జగన్మోహన్ రెడ్డి కోసం.. పార్టీ సిద్దాంతం కోసం పనిచేసే వ్యక్తి దుట్టా అని బాలశౌరి తెలిపారు. ‘‘ఎంపీ బాలశౌరికి నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద్దరూ రాజశేఖర్ రెడ్డి శిష్యులుగా సుదీర్ఘకాలం పనిచేసాం. మూడు నెలలు క్రితం సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశాను. ఆరోజు సీఎం జగన్మోహన్ రెడ్డికి నాఅభిప్రాయం చెప్పాను. నేడు ఎంపీ బాలశౌరికి అదే చెప్పాను అని దుట్టా మీడియాకు వివరించారు. మరికొందరు నేతలు సైతం ఈ భేటీలో పాల్గొన్నారు. -
ఏపీలో సోలార్ ఛర్ఖా క్లస్టర్
రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి గడ్కరీ జవాబు సాక్షి, న్యూఢిల్లీ: మిషన్ సోలార్ ఛర్ఖా కింద ఏపీలో సోలార్ ఛర్ఖా క్లస్టర్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం రాజ్యసభలో ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా జవాబిచ్చారు. మహిళలు, యువతకు ఉపాధి కల్పిస్తూ వారు తమ సొంత కాళ్ళపై నిలబడి అభివృద్ధి చెందాలన్నది మిషన్ సోలార్ ఛర్ఖా లక్ష్యాలలో మొదటిదని, తక్కువ ఖర్చుతో కూడిన వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామీణ ప్రాంత నేత కార్మికులకు అందుబాటులోకి తీసుకురావడం మిషన్ ఉద్దేశాలని మంత్రి తెలిపారు. కాగా విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియను వేగిరపరచి కార్యకలాపాలు ప్రారంభించవలసిందిగా విజయసాయి రెడ్డి రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు. రైల్వే జోన్ ఏర్పాటైనా కార్యకలాపాలు ప్రారంభం కాలేదని చెప్పారు. కాగా, కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయాల బిల్లుపై జరిగిన చర్చలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. దేవ భాషగా పరిగణించే సంస్కృత భాషకు తిరిగి జీవం పోసి కొంతమేరకైనా వాడుక భాషగా మార్చాలంటే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. నంబర్‌వన్ రాష్ట్రాల్లో ఏపీ ఒకటి కాంపొజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ (సీడబ్ల్యూఎంఐ)లో ఏపీ అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాల్లో ఒకటని జలశక్తి శాఖ సహాయ మంత్రి రతన్‌లాల్ కటారియా రాజ్యసభకు తెలిపారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. తాజాగా నీతిఆయోగ్ జారీ చేసిన సీడబ్ల్యూఎంఐలో ఏపీ రెండో స్థానంలో నిలిచిందన్నారు. ఏపీలో 49 వేల స్కూళ్లలో మరుగుదొడ్లు స్వచ్ఛ్ భారత్, స్వచ్ఛ్ విద్యాలయ కార్యక్రమం కింద ఏపీలో 49,293 మరుగుదొడ్లు నిర్మించినట్లు కేంద్రం తెలిపింది. స్కూళ్లలో మరుగుదొడ్ల నిర్మాణం గురించి ఎంపీ ఎన్.రెడ్డప్ప లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి నిషాంక్ పోఖ్రియాల్ సోమవారం సమాధానమిచ్చారు. మానసిక అనారోగ్యాన్ని నాలుగు స్థాయిల్లో కొలవనున్నట్లు తెలిపారు. ఎంపీ వంగా గీతావిశ్వనాథ్ అడిగిన ప్రశ్నకు పోఖ్రియాల్ జవాబిచ్చారు. ఆ పథకానికి రిటైర్మెంట్ వయసుతో సంబంధం లేదు సీనియర్ సిటిజన్ల కోసం అమలు చేస్తోన్న పీఎం వయో వందన యోజన పథకానికి రిటైర్మెంట్ వయసుతో సంబంధం లేదని కేంద్రం తెలిపింది. ఈ పథకానికి వయోపరిమితిని సవరించే యోచన ప్రభుత్వానికి ఉందా అని ఎంపీలు రఘురామకృష్ణరాజు, అవినాష్‌రెడ్డి లోక్‌సభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. దానికి ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ సమాధానమిస్తూ.. వడ్డీ రేట్లు పడిపోయినట్లయితే సీనియర్ సిటిజన్లకు వడ్డీ నష్టం కలగకుండా రక్షించే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని, దానికి రిటైర్మెంట్ వయసుతో సంబంధం లేదని చెప్పారు. మహిళల జీవన స్థాయిని మెరుగుపరచడానికి కేంద్రం అమలు చేస్తోన్న అనేక కార్యక్రమాలను కార్మిక, ఉపాధి శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. అసంఘటిత రంగంలో పనిచేసే పేద మహిళల ఆర్థిక స్థితిగతులను పెంచడానికి ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలను గురించి ఎంపీలు పీవీ మిథున్ రెడ్డి, డీఎం కాతిర్ ఆనంద్ అడిగిన ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు. పర్యాటక రంగ ప్రోత్సాహానికి విభిన్న వ్యూహాలు దేశంలో విభిన్న పర్యాటక రంగాలను ప్రోత్సహించడం కోసం కేంద్రం అనుసరిస్తోన్న ప్రచార వ్యూహాల గురించి ఎంపీ బల్లిదుర్గా ప్రసాదరావు లోక్‌సభలో ప్రశ్నించారు. కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ సమాధానమిస్తూ.. విభిన్న భారతీయ పర్యాటక రంగాలను ప్రచారం చేయడానికి ఇంక్రెడిబుల్ æఇండియా బ్రాండ్ లైన్ కింద పర్యాటక శాఖ చేస్తున్న ప్రయత్నాలను వివరించారు. కాగా తొమ్మిది, çపది తరగతి విద్యార్థుల యాప్టిట్యూడ్ను పరీక్షించేందుకు సీబీఎస్ఈ, ఎన్సీఆర్టీ ట్రై అండ్ మేజర్ యాప్ట్యిట్యూడ్ అండ్ నేచురల్ ఎబిలిటీస్ (తమన్నా) అనే యాప్టిట్యూడ్ పరీక్షను రూపొందించాయని మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిషాంక్ పోఖ్రియాల్ చెప్పారు. లోక్‌సభలో ఎంపీలు గోరంట్ల మాధవ్, చంద్రశేఖర్ బెల్లాన అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. చంద్రబాబు మాట మీద నిలబడాలి ఎంపీ వల్లభనేని బాలశౌరి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలతో చంద్రబాబుకు షాక్ తప్పదని, ఆయన మాట మీద నిలబడి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై వైఎస్సార్సీపీ ఎంపీలు సోమవారం లోక్‌సభలో తమ స్థానాల్లో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంపై ఆయన పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఇదే అంశంపై చర్చించేందుకు వీలుగా మంగళవారం వాయిదా తీర్మానం ఇవ్వనున్నట్టు బాలశౌరి తెలిపారు. చంద్రబాబును బ్యాక్ డోర్ బాబు అని పిలవాలని, ఆయన రెండు నాల్కల సిద్ధాంతం మరోసారి బట్టబయలైందని విమర్శించారు. నిన్నటి వరకు ఎన్నికలు జరిపించాలన్న చంద్రబాబు.. ఇప్పుడేమో బ్యాక్ డోర్ పాలిటిక్స్‌కు తెరతీశారని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న మాటలపై చంద్రబాబు నిలబడాలని సవాలు విసిరారు. -
తలసేమియా, హీమోఫిలియా వ్యాధుల చికిత్సకు ఆర్థిక సాయం
సాక్షి, న్యూఢిల్లీ: తలసేమియా, హీమోఫిలియా, సికిల్‌సెల్ ఎనీమియా తదితర వ్యాధుల చికిత్సకు నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఔషధాలకు, రక్త సంబంధిత అవసరాలకు వీలుగా కేంద్రం సాయం అందిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్దన్ తెలిపారు. శుక్రవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ తదితర చికిత్స అవసరమైనప్పుడు రాష్ట్రీయ ఆరోగ్య నిధి (ఆర్ఏఎన్), ఆరోగ్య మంత్రి విచక్షణా నిధి, ప్రధాన మంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి రూ.15 లక్షల వరకు సాయం అందుతుందని వివరించారు. మరో ఉప ప్రశ్నకు కేంద్ర మంత్రి బదులిస్తూ మంగళగిరి ఎయిమ్స్ పూర్తిస్థాయి కార్యకలాపాలు చేపట్టే దశలో ఈ వ్యాధులకు సంబంధించి అన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. 2022 నాటికి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లుగా ఆరోగ్య కేంద్రాలు ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా దేశవ్యాప్తంగా 1.5 లక్షల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), ఆరోగ్య ఉప కేంద్రాలను 2022 డిసెంబర్ నాటికి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లుగా అభివృద్ధి చేయనున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే తెలిపారు. వైఎస్సార్సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. అసంక్రమిత వ్యాధులు, మానసిక ఆరోగ్యం, ఈఎన్టీ, కంటి వైద్యం, దంత వైద్యం, ట్రామాకేర్ వంటి చికిత్సలన్నీ ఉచితంగా అందరికీ అందించనున్నట్టు తెలిపారు. అయితే ఆయుష్మాన్ భారత్ అమలులో అనేక సవాళ్లు ఉన్నాయని మంత్రి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య కేంద్రాల సంఖ్య తక్కువ తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య ఉప కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు (సీహెచ్‌సీ) ఉండాల్సిన సంఖ్య కంటే తక్కువగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ ఏపీలో 1,197 పీహెచ్‌సీలు అవసరం కాగా 1,147 మాత్రమే అందుబాటులో ఉన్నాయని వివరించారు. సీహెచ్‌సీలు 299 అవసరం కాగా 193 మాత్రమే ఉన్నాయని వివరించారు. ఏపీలో పీహెచ్సీ స్థాయిలో 222 వైద్యాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయని, సీహెచ్‌సీ స్థాయిలో 149 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అంధత్వం, వినికిడి లోపం నివారణ పథకం కింద రూ.39 కోట్లు అంధత్వం, వినికిడి లోపం నివారణ జాతీయ పథకం కింద కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు 2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.39 కోట్లు మంజూరు చేసిందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్ చౌబే వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పీఎంఎంవీవై కింద 3.25 లక్షల మందికి ప్రయోజనం ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (పీఎంఎంవీవై) కింద ఆంధ్రప్రదేశ్‌లో 2018–19లో 3.25 లక్షల మందికి లబ్ధి చేకూరిందని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీలు పీవీ మిథున్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కోటగిరి శ్రీధర్, చంద్రశేఖర్ బెల్లాన అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఉపాధి హామీ సగటు పని దినాలు 58.32 ఉపాధి హామీ పథకంలో ఏపీలో 2016–17లో ఒక్కో కుటుంబానికి సగటు పని దినాలు 51.49, 2018–19లో 58.32 లభించాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. శుక్రవారం రాజ్యసభలో వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. -
ఫ్యాను గాలితో ప్రజలకు ప్రశాంత జీవితం
విద్యానగర్(గుంటూరు), న్యూస్‌లైన్ :రాష్ట్రంలో ప్రజలు చల్లని ఫ్యాను గాలితో ప్రశాంతంగా జీవించే సమయం మరో నెల రోజుల్లో రానుందని వైఎస్సార్సీపీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పేర్కొన్నారు. గురువారం్ల కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజలు చూపుతున్న ఆదరణ చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందన్నారు. నామినేషన్‌కు తరలివచ్చిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు కృతజ్ఞతాభినందనలు తెలిపారు. ర్యాలీలో పాల్గొన్న ప్రజలు జాగ్రత్తగా తమ నివాసాలకు వెళ్ళాలని కోరారు. ప్రతి గ్రామానికి వెళ్లానని, ప్రజలు పడుతున్న బాధలు చూశానని చెప్పారు. ప్రజలను ఆ బాధల నుంచి విముక్తులను చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరుని ఆశయాలతో ఆయన కుమారుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కానున్నారన్నారు. నేడు నగరంలో జనసంద్రాన్ని చూస్తుంటేనే పార్టీ ప్రభంజనం ఏవిధంగా ఉంటుందో తెలుస్తుందన్నారు. చంద్రబాబు ప్రవర్తన ప్రజలకు అర్థమమయ్యే ఉంటుందని, తెలంగాణలో పొత్తు ఉందని నామినేషన్లు పూర్తయి స్క్రూట్నీ సమయంలో ప్లేటు ఫిరాయించారన్నారు. ప్రస్తుతం సీమాంధ్ర పరిస్థితి కూడా అంతే ఉందన్నారు. బీజేపీకి మాటిచ్చి మళ్ళీ ఇప్పుడు జిమ్మిక్కులు చేస్తున్నారన్నారు. చంద్రబాబు అధికార దాహంతో ఏమి చేస్తున్నారో తెలియని పరిస్థితిలో ప్రజలకు మాయమాటలు చెబుతున్నారన్నారు. పార్టీ ఏర్పాటయిన నాటినుంచి నేటి వరకూ మాటకు కట్టుబడిన పార్టీ వైఎస్సార్సీపీ మాత్రమేనన్నారు. సీమాంధ్ర అభివృద్ధి వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని, గుంటూరును ఐటీ హబ్‌గా మార్చి, ప్రతి కుటుంబంలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కృషిచేస్తానన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావటం ఖాయమని తెలిపారు. ఫ్యాను గాలి విసృ్తతంగా వీస్తోందని, ఈ ప్రభంజనానికి కొన్ని పార్టీలు కొట్టుకుపోనున్నాయన్నారు. చంద్రబాబు చేస్తున్న జిమ్మిక్కులకు వచ్చేనెల 7న ప్రజలు బుద్ధి చెప్పనున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి(మంగళగిరి), మేకతోటి సుచరిత(ప్రత్తిపాడు), లేళ్ళ అప్పిరెడ్డి(గుంటూరు పశ్చిమ), మొహమ్మద్ ముస్తఫా(గుంటూరు తూర్పు), రావి వెంకటరమణ(పొన్నూరు), కత్తెర క్రిష్టినా(తాడికొండ), అన్నాబత్తుని శివకుమార్(తెనాలి), పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు, థామస్‌నాయుడు, ఆతుకూరి ఆంజనేయులు, మెట్టు వెంకటప్పారెడ్డి, షేక్ షౌకత్, నసీర్ అహ్మద్, గులాంరసూల్, కిలారి రోశయ్య, విజయసారధి, రాతంశెట్టి సీతారామాంజనేయులు(లాలుపురంరాము), పులగం శివరామిరెడ్డి, కొలకలూరి కోటేశ్వరరావు, కిక్కురు అర్లారెడ్డి, డొక్కు కాటం రాజు, రాజరెడ్డి సాంబశివరావు, షేక్ సలీం, కలేసా, యోగేశ్వరరెడ్డి, నడవ వీరయ్య, సాంబిరెడ్డి, ఎన్ కోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా కేంద్రం జనసంద్రం
పాత గుంటూరు/విద్యానగర్, న్యూస్‌లైన్ :వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గుంటూరు నగరం జనసంద్రంగా మారింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున నామినేషన్ కార్యక్రమానికి తరలివచ్చారు. గురువారం ఉదయం నలందానగర్లోని బాలశౌరి కార్యాలయం వద్దకు పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. కార్యాలయానికి అప్పటికే చేరుకున్న పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థులు ఆళ్ళ రామకృష్ణారెడ్డి(మంగళగిరి), మేకతోటి సుచరిత(ప్రత్తిపాడు), లేళ్ళ అప్పిరెడ్డి(గుంటూరు పశ్చిమ), మొహమ్మద్ ముస్తఫా(గుంటూరు తూర్పు), రావి వెంకటరమణ(పొన్నూరు), కత్తెర క్రిష్టినా(తాడికొండ), అన్నాబత్తుని శివకుమార్(తెనాలి) బాలశౌరిని కలిసి పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. కార్యాలయంలో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. కార్యాలయం బయట వేచి ఉన్న జనానికి అభివాదంచేసి, ఫ్యాను గుర్తును చూపుతూ పార్టీ జెండాఊపి బాలశౌరి, ఎమ్మెల్యే అభ్యర్థులు ర్యాలీని ప్రారంభించారు. ఇటి వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వాహనంపై ఎమ్మెల్యే అభ్యర్థులతోపాటు 9గంటలకు ర్యాలీగా బాలశౌరి బయలుదేరారు. విద్యానగర్, సాయిబాబారోడ్డు మీదుగా కొరిటెపాడుకు ర్యాలీ చేరింది. కొరిటెపాడు సెంటర్ మహాత్మాగాంధీ, లక్ష్మిపురం సెంటర్లో మదర్‌థెరిస్సా, లాడ్జ్ సెంటర్లో అంబేద్కర్, హిందూకళాశాల సెంటర్లో పొట్టి శ్రీరాములు విగ్రహాలకు బాలశౌరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ర్యాలీలో కళాకారులు పలు వేషదారణలతో చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. మండుటెండను సైతం లెక్కచేయకుండా ప్రజలు వేలాదిగా తరలిరావడంతో వీధులన్నీ జనసంద్రంగా మారాయి. ర్యాలీ మార్గంలో నగరంలో ఏవీధిలో చూసిన జనసంద్రాన్ని తలపించింది. ప్రతి కార్యకర్త చేతిలో పార్టీ జెండా పట్టుకుని జైజగన్, జైజైజగన్. జైబాలశౌరి, వైఎస్సార్ జోహార్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్థిల్లాలి, రాజన్న రాజ్యం జగనన్నకే సాధ్యం, పులివెందుల పులిబిడ్డ జగన్ అంటూ చేసిన నినాదాలతో నగరం మార్మోగిపోయింది. కార్యకర్తలు ఫ్యానుగుర్తు చూపిస్తూ స్థానికులను ఉత్సాహపరిచారు. ప్రజలు ఎదురు వచ్చి బాలశౌరికి అడుగడుగునా అభినందనలు తెలిపారు. కలెక్టరేట్రోడ్డులోని మూడు బొమ్మల సెంటర్ సమీపంలో మహిళలు ఘనంగా స్వాగంతం పలికారు. బాలశౌరికి గుమ్మడికాయతో దిష్టితీసి తిలకం దిద్దారు. అనంతరం బిందెలతో వాహనానికి కాడిపోసి హారతులు పట్టారు. నగరంపాలెంలోని స్టేట్ బ్యాంక్ సమీపంలో వాహనాన్ని దిగి ఎమ్మెల్యే అభ్యర్థులు, ముఖ్యనాయకులతో పాదయాత్రగా కలెక్టరేట్‌లోకి వెళ్లారు. గేటు వద్ద బాలశౌరితోపాటు మరో నలుగురిని మాత్రమే అనుమతించడంతో మేకతోటి సుచరిత, ఆళ్ళ రామకృష్ణారెడ్డి, రావి వెంకటరమణ, మొహమ్మద్ ముస్తఫాలతో కలిసి వెళ్లి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ కావటి మనోహర్‌నాయుడు, థామస్‌నాయుడు, ఆతుకూరి ఆంజనేయులు, మెట్టు వెంకటప్పారెడ్డి, షేక్ షౌకత్, నసీర్ అహ్మద్, గులాంరసూల్, కిలారి రోశయ్య, విజయసారథి, రాతంశెట్టి సీతారామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.