
కాటికి కాలు చాపిన వాడికి స్మశానమే గుర్తుకు వస్తుందంటూ చంద్రబాబుపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మండిపడ్డారు.
సాక్షి, కృష్ణా జిల్లా: కాటికి కాలు చాపిన వాడికి స్మశానమే గుర్తుకు వస్తుందంటూ చంద్రబాబుపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మండిపడ్డారు. ఆదివారం ఆయన గన్నవరంలో మీడియాతో మాట్లాడుతూ, ఊరు పొమ్మంటుంది కాడి రమ్మంటుంది అనే స్థితిలో చంద్రబాబు ఉన్నాడంటూ దుయ్యబట్టారు.
‘‘గన్నవరం నియోజకవర్గంలో 27వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇస్తే ఎక్కువ శాతం ఇళ్లు నిర్మించుకొని గృహప్రవేశం చేశారు. అద్దె ఇంట్లో ఉంటూ అనేక ఇబ్బందులు పడుతున్న 30 లక్షల మంది పేదలకు సీఎం జగన్ ఆత్మగౌరవాన్ని ఇచ్చారు.. పేదలకు మంచిచేసే ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్లు పనికిమాలిన సన్నాసులు. అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అన్నట్లు ఉంది చంద్రబాబు శైలి. గత ప్రభుత్వంలో ఒక్క సెంటు భూమి కుడా పేదలకు ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో సెంటు భూమికుడా ఇవ్వకుండా ఇప్పుడు ఇచ్చే వారిని విమర్శించడానికి సిగ్గుశరం ఉండాలి’’ అంటూ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిప్పులు చెరిగారు.
చదవండి: వందల మంది రెడ్ల ప్రాణాలు తీసినప్పుడు ఎక్కడున్నావ్!