
సాక్షి, విజయవాడ: జైల్లో వల్లభనేని వంశీతో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, పెనమలూరు వైఎస్సార్‌సీపీ ఇంఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి, వంశీ సతీమణి పంకజశ్రీ ములాఖత్ అయ్యారు. అనంతరం మీడియాతో పంకజశ్రీ మాట్లాడుతూ.. వంశీకి ఆస్తమా ఉందని.. నిన్న కోర్టుకి వచ్చినపుడు కూడా నీరసంగా ఉన్నారన్నారు.
‘‘ఆయనకు కనీసం కూర్చోటానికి ఒక చైర్ కూడా ఇవ్వటం లేదు. మనిషికి కావాల్సిన మినిమం బేసిక్స్ ప్రొవైడ్ చేయాలి. వంశీని మెంటల్‌గా డిప్రెషన్‌కు గురిచేయాలనుకుంటున్నారు. ఇలా చేయటం తప్పు కాదా?. వంశీ మీద రూల్స్ ప్రకారం ఒక్క కేసు లేదు, ఎందుకు ఈ కక్ష సాధింపు. అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం సరికాదు. అధికారంలో ఉంటే ఏమైనా చేయవచ్చా. వంశీని ఇబ్బందులు పడుతున్నారు’ అని పంకజశ్రీ ఆవేదన వ్యక్తంచేశారు.
చంద్రబాబు కుటిల రాజకీయం: ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
చంద్రబాబు కుటిల రాజకీయం ప్రజలకు అర్థమైంది. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయలేక నీచ రాజకీయాలు చేస్తున్నాడు. సత్యవర్ధన్ కిడ్నాప్ జరగలేదు. సత్యవర్ధన్ వాంగ్మూలంలో వంశీకి ఎటువంటి సంబంధం లేదని తేలిపోయింది. 10 తేదీన జడ్జి ముందు వాంగ్మూలం ఇస్తే. 11వ తేదీన కిడ్నాప్ చేశారని వీడియో విడుదల చేశారు. 2004లో గన్నవరానికి వంశీ రాకముందున్న కేసులు కూడా వంశీకి చంద్రబాబు ఆపాదించారు. ఒక సూట్ పెండింగ్ ఉండి, ఒక కుటుంబానికి సంబంధించిన కేసు, వంశీకి ఎటువంటి సంబంధం లేని కేసులో వంశీని ప్రథమ ముద్దాయిగా పెట్టారు. 21 సంవత్సరాల తర్వాత క్రిమినల్ కేసు పెట్టారు. ఇది తప్పుడు సంస్కృతి
ఒక టీడీపీ నాయకుడు గన్నవరం వద్ద కెనాల్ ప్రాంతాన్ని ఆక్రమిస్తే లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా ఆ నిర్మాణాన్ని తొలగించారు. కలెక్టర్ లెటర్ ఇచ్చినా దానిని తప్పు దోవ పట్టించి... వంశీ పై కేసు పెట్టారు. మల్లవల్లి ఇండస్ట్రియల్ క్వారీ ఎవరు పెట్టారు?. 2015లో టీడీపీ ప్రభుత్వంలో ఆ క్వారీ పెట్టారు. క్వారీ ల్యాండ్‌ను జియోకాన్ కంపెనీకి కట్టబెట్టారు. అప్పుడు కేసులు చంద్రబాబు మీద పెట్టాలి. ఈ కేసులన్నీ చూస్తే కేవలం వంశీని ఇబ్బంది పెట్టాలని చేసిన ప్రయత్నమే. తాటికాయంత అక్షరాలతో పచ్చ మీడియా నీతులు వల్లించే కార్యక్రమం చేస్తుంది

హోమ్ మినిస్టర్ అనిత ఆడబిడ్డలను అమ్మ అని పిలిస్తే వారి భర్తలు ఏం అవుతారు...అని బూతులు అర్థం వచ్చే మాటలు మాట్లాడుతున్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడే మాటలు బూతులు కాదా?. కూన రవికుమార్, అచ్చెన్నాయుడు, రాయపాటి అరుణ, గాయత్రీ వీరందరి మాటలు బూతులు కాదా?. జబర్దస్త్ నటులతో డిబేట్‌లు పెట్టి బూతులు తిట్టించారు. వంశీ భార్య గురించి బూతులు మాట్లాడారు.. వీరు మాట్లాడేవన్నీ బూతులు.. చేసే పనులన్నీ దుర్మార్గాలు. పవన్ కల్యాణ్ కొడుకులు అంటే బూతు కాదా?.. లోకేష్ బూతులు మాట్లాడితే నీతులుగా కనిపిస్తున్నాయా..?.
కమ్మ సామాజిక వర్గంలో బలమైన గొంతు గల నాయకుడిగా లోకేష్‌ను పైకి తేవాలంటే అదే సామాజిక వర్గంలో ఉన్న వేరే నాయకుడిని తొక్కేయాలని చూస్తున్నారు. పోలీసులు వీరికి భాగస్వాములుగా చేస్తున్న కుట్రలపై న్యాయపరంగా పోరాడుతున్నాం. కూటమిలో పైన పొత్తులు లోపల కత్తులు పెట్టుకొని ఒకరికి ఒకరికి పడక లోకేష్ ను పైకి తేవాలి, సూపర్ సిక్స్ హామీలు తప్పించుకోవాలని చూస్తున్నారు. వంశీకి వైఎస్సార్‌షీపీ పార్టీ అండగా ఉంటుంది. వంశీ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment