
సాక్షి, కృష్ణా జిల్లా: లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగింపుపై ఆయన స్పందిస్తూ.. వాళ్లది నీచాతినీచమైన బుద్ధి. వెయ్యిమంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్‌ను ఏం చేయలేరు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రాన ఏమీ చేయలేరు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వారు ఎన్టీఆర్ వర్ధంతి చేస్తారా?’’ అంటూ కొడాలి నాని మండిపడ్డారు.
ఎన్టీఆర్ సమాధి సాక్షిగా నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు బాలకృష్ణ అనుచరులు. బాలకృష్ణ ఆదేశాల మేరకే ఫ్లెక్సీలు తొలగించినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ వచ్చి వెళ్లిన మరుక్షణమే ఫ్లెక్సీలు తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment