ntr ghat
-
నాపై సోషల్ మీడియాలో వేధింపులు.. బాబుకు బాధ్యత లేదా?: లక్ష్మీపార్వతి
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న వేధింపులపై స్పందించాల్సిన బాధ్యత మీకు లేదా చంద్రబాబు అని ప్రశ్నించారు నందమూరి లక్ష్మీపార్వతి(Lakshmi Parvathi). మీరు అనుకున్నా.. అనుకోకున్నా మీ అత్తగారిని కదా చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. అలాగే, ఎన్టీఆర్ గౌరవం కాపాడేలా తాను బ్రతుకుతున్నట్టు తెలిపారు.నేడు దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు (NTR) వర్ధంతి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు నందమూరి లక్ష్మీపార్వతి. ఇదే సమయంలో ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కడ లక్ష్మీపార్వతి మాట్లాడుతూ..‘29 ఏళ్లుగా ఎన్టీఆర్‌కు దూరమై మనోవేదనకు గురవుతున్నాను. నా ఫోన్ నెంబర్‌ను ఎవరో టీడీపీ వాళ్లు సోషల్ మీడియాలో పెట్టారు. నిన్నటి నుంచి వరుసగా వెయ్యికిపైగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.మీరు అనుకున్నా.. అనుకోకున్నా మీ అత్తగారిని కదా చంద్రబాబు. ఇలాంటి అవమానం నాకు జరుగుతుంటే మీరు చూస్తూ ఉంటారా?. ఇన్నేళ్లు డబ్బులు ఉన్నా లేకున్నా ఎవరినీ చేయిచాచి అడగలేదు. ఎన్టీఆర్ గౌరవం కాపాడేలా బ్రతుకుతున్నాను. నామీద ఎందుకు మీకు కక్ష.. నేనేం తప్పు చేశాను. ఎన్టీఆర్ పేరుతో మీరంతా లక్షల కోట్లు సంపాదించారు. అలాగే పెద్దాయన్న సాగనంపారు. నాపై జరుగుతున్న వేధింపులపై స్పందించాల్సిన బాధ్యత మీకు లేదా చంద్రబాబు’ అని ప్రశ్నించారు.ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ వర్ధంతి సందర్బంగా ఆయనకు కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), కల్యాణ్ రామ్ (Kalyan Ram) పుష్ఫగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. వారితో పాటు నందమూరి బాలకృష్ణ (Nandmuri Bala Krishna), రామకృష్ణ (Rama Krishna)లు కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించి నటుడిగా, నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ (NTR) ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. చంద్రబాబు కూడా ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించనున్నారు. -
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు
-
Balakrishna Vs Jr NTR: రక్తసంబంధాన్ని కూడా లెక్కచేయని బాలకృష్ణ.. ఎందుకీ చర్య..?
సీనియర్ ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా మరోసారి జూ. ఎన్టీఆర్, నందమూరి ఫ్యామిలీల మధ్య విభేదాలు బయటపడ్డాయి. నేడు తెల్లవారుజామున జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తారక్ బ్రదర్స్ అక్కడి నుంచి వెళ్లిపోయిన కొన్ని గంటల తర్వాత బాలకృష్ణ కూడా తన తండ్రికి నివాళి అర్పించేందుకు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నాడు. అక్కడ తారక్, కల్యాణ్ రామ్‌లు ఉన్న ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని బాలకృష్ణ హుకుం జారీ చేశాడు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ నేతలు వాటిని తొలగించారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నందమూరి వంశంలో ఒంటరిగా మిగిలిన తారక్ ఈ క్రమంలో తారక్‌ను నందమూరి ఫ్యామిలీ ఒంటరిని చేసిందని సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతుంది. బాలకృష్ణతో పాటు నందమూరి కుటుంబంలోని ఇతర సోదరులు, అక్కాచెల్లెళ్ల పిల్లలకు సీనియర్ ఎన్టీఆర్‌తో ఎలాంటి రక్తసంబంధం ఉందో అలాంటి వారసత్వపు హక్కు కూడా జూనియర్ ఎన్టీఆర్‌కు ఉంది. కానీ తన బావ చంద్రబాబు రాజకీయం కోసం, తన అల్లుడు లోకేష్ రాజకీయ భవిష్యత్ కోసం నెత్తుటి సంబంధాన్ని కూడా తెంచేందుకు బాలకృష్ణ అడుగులు వేశాడు. తారక్‌ను ఎప్పటికైనా ఒంటరిగానే మిగల్చాలని చంద్రబాబు చేస్తున్న కుట్రలో బాలకృష్ణ పలుమార్లు భాగం పంచుకుంటూనే ఉన్నాడు. నాడు ఎన్టీఆర్ ఘాట్ పరిస్థితి ఎలా ఉండేది ..? విడ్డూరుం కాకపోతే.. ఎలాంటి విలువలు లేని పవన్ కల్యాణ్ కావాలి గానీ సొంత కుటుంబసభ్యుడు అయిన తారక్ మాత్రం పనికిరాకుండా పోయాడా..? తాతకు సిసలైన మనమడిగా మిగిలింది తారక్ మాత్రమే కదా..? అంటూ బాలయ్య తీరుపై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. సుమారు 6 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఘాట్‌లో కనీసం పూలు అలంకరించడానికి కూడా ఎవరూ లేకపోతే, జూనియర్ ఎన్టీఆర్ ఆ బాధ్యత తీసుకొని తన వాళ్లతో జయంతికి, వర్ధంతికి అక్కడ అలంకరణ చేయిస్తున్నారు. అలాంటిది ఈరోజు ఆయన ఫ్లెక్సీలే అడ్డు అయిపోయాయని పీకి పారేస్తున్నారంటే ఎంతటి దుర్మార్గపు చర్య. తన తాత సమాధి వద్ద తారక్ ఫ్లెక్సీలు ఉంటే బాలయ్యకు వచ్చిన నష్టమేమిటి? జీఎచ్ఎంసీ సిబ్బంది మాదిరి ప్లెక్సీలు తొలగించమని ఆదేశించడం ఏంటి..? ఏ హక్కుతో వాటిని తొలగించారు..? అసలు ఎన్టీయార్ ఘాట్ వద్దకు ఎవరు రావాలి..? ఎవరు రాకూడదు..? అని చెప్పడానికి బాలకృష్ణ ఎవరు..? అక్కడ ఎవరి బ్యానర్లు ఉండాలని చెప్పడానికి బాలయ్యకు హక్కు ఎక్కడిది..? నందమూరి తారకరామారావు అనే వ్యక్తి అందరివాడు. ఆయన ఎవరి సొత్తు కాదు. ఎంటో బాలయ్య మాదిరే ఆయన మాటలు కూడా ఏ మాత్రం ఎవరికీ అర్థం కావు. ఏదేమైనా నందమూరి వంశంలో తారక్‌ను ఒంటరిని చేయాలనే చంద్రబాబు కుట్రకు విజయవంతంగా అడుగులు పడుతున్నాయి. అందుకే ఇంత జరిగినా తన రక్త సంబంధీకులు ఎవరూ నోరెత్తి కూడా తిరిగి మాట్లాడటం లేదు. కానీ తారక్ ఫ్యాన్స్ మాత్రం మేమున్నాం అంటూ #WeStandWithNTR అనే హ్యాష్ ట్యాగ్‌తో పాటు #EndOfTDP అంటూ వారు వైరల్ చేస్తున్నారు. జై లవకుశ చిత్రంలోని డైలాగ్స్ షేర్ చేస్తున్న ఫ్యాన్స్ జై లవకుశ చిత్రం నుంచి తారక్ చెప్పిన డైలాగ్స్‌ను కూడా వారు వైరల్ చేస్తున్నారు. అందులో 'మనం అనేది అబద్ధం.. నేను అనేది నిజం. ప్రేమను పగగా మార్చింది మీరే.. మీలో ఒక్కడిగా గుర్తిస్తారని ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాను' అనే డైలాగ్స్ గుర్తు చేస్తూనే.. గతంలో ఎన్నికల కోసం తారక్‌ను ఎడాపెడా వాడేసుకున్నారని చంద్రబాబు అండ్ తెలుగుదేశం బ్యాచ్‌పై తారక్ ఫ్యాన్స్ విరుచుకుపడపుతున్నారు. తారక్‌లో ఫైర్‌ను గుర్తించిన చంద్రబాబు తన కుమారుడికి ఎక్కడ అడ్డు వస్తాడో అని పక్కకు తప్పించే ఎత్తుగడ ఎప్పుడో వేశాడంటూ వారు గుర్తుచేస్తున్నారు. ఏ మాత్రం రాజకీయ జ్ఞానం లేని లోకేష్‌కు తారక్ ఎక్కడ పోటీ అవుతాడో అని చంద్రబాబులో భయం పట్టుకుంది. చంద్రబాబు కన్నింగ్ గేమ్‌ను అర్థం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్ పార్టీని వదిలేశాడు. చివరకు తన సోదరి అయిన నందమూరి సుహాసినికి టీడీపీ టికెట్టు ఇచ్చి ఎన్నికల బరిలో నిల్చోబెట్టినా కూడా తను ప్రచారం చేయలేదు. అలా తన తాత పెట్టిన పార్టీకి తారక్ దూరం అయ్యాడు. లేని వారసత్వం కోసం లోకేష్‌ను తెరపైకి తీసుకొచ్చేందుకు పక్కా ప్లాన్‌తో రక్తసంబంధంలో చంద్రబాబు చిచ్చిపెట్టాడు. అందులో భాగంగానే తారక్ నందమూరి వంశంలో నేడు ఒంటరిగా మిగిలాడని చెప్పవచ్చు. Politics aside, extending our Support to @tarak9999 anna and his fans in this hour of need. 🙌🏻 Stay Strong! Shame on #Balakrishna And Yellow Media😒#WeStandWithNTR #NTR #JrNTR pic.twitter.com/lbTSOFY7vr — smily.chinnu❤️❤️ (@Ishwarya225) January 18, 2024 This is how TDP works CBN didn't support Jr.NTR in Politics. But they need his support in this phase. If they doesn't get any response they start abusing.#WeStandwithNTR in this struggle phase where TDP Leaders and Social Media wantedly targeting Stay Strong @tarak9999 Garu pic.twitter.com/TC0XD8pcSe — Møhámmêd Âfzál محمد افضل (@ShaikAfzal_YSJ) January 18, 2024 We Stand With You @tarak9999 Anna 🥹❤️#WeStandWithNTR #JrNTR #BalaKrishna #EndOfTDP pic.twitter.com/rroN9hSqjI — UrstrulyNani ™ (@Urstrulynanii_) January 18, 2024 -
బాలకృష్ణ చిల్లర రాజకీయం..జూ.ఎన్టీఆర్ కు భారీ అవమానం
-
జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని తీసేయాలంటూ బాలకృష్ణ హుకుం
-
‘వెయ్యి మంది బాలకృష్ణలు వచ్చినా జూ.ఎన్టీఆర్‌ను ఏం చేయలేరు’
సాక్షి, కృష్ణా జిల్లా: లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగింపుపై ఆయన స్పందిస్తూ.. వాళ్లది నీచాతినీచమైన బుద్ధి. వెయ్యిమంది బాలకృష్ణలు, చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్‌ను ఏం చేయలేరు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రాన ఏమీ చేయలేరు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వారు ఎన్టీఆర్ వర్ధంతి చేస్తారా?’’ అంటూ కొడాలి నాని మండిపడ్డారు. ఎన్టీఆర్ సమాధి సాక్షిగా నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు బాలకృష్ణ అనుచరులు. బాలకృష్ణ ఆదేశాల మేరకే ఫ్లెక్సీలు తొలగించినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ వచ్చి వెళ్లిన మరుక్షణమే ఫ్లెక్సీలు తొలగించారు. -
ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగింపు
-
నందమూరి ఫ్యామిలీలో బయటపడ్డ విభేదాలు
సాక్షి, హైదరాబాద్: ఎన్టీఆర్ సమాధి సాక్షిగా నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీ చూసిన ఆగ్రహంతో ఊగిపోయిన బాలయ్య.. ఫ్లెక్సీని తీసేయాలంటూ హుకుం జారీ చేశారు. దీంతో బాలకృష్ణ అభిమానులు.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. బాలకృష్ణ వచ్చి వెళ్లిన మరుక్షణమే ఫ్లెక్సీలు తొలగించారు. ఫ్లెక్సీలు తొలగించడంపై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌కు మధ్య గ్యాప్ మరింత పెరిగింది. గతంలో చంద్రబాబు అరెస్ట్ విషయంలో నందమూరి వంశానికి చెందిన జూనియర్ ఎన్టీయార్ సైతం మౌనంగా ఉండిపోవడంతో నందమూరి, నారా కుటుంబాలకు పెద్ద షాకే ఇచ్చింది. చంద్రబాబు అరెస్ట్ విషయంలో తారక్ స్పందించకపోవడంతో ఆయనపై బాలకృష్ణ బహిరంగంగానే ఐ డోంట్ కేర్ అంటూ ఫైర్ అయిన విషయం తెలిసిందే. 👉: తాత వర్థంతికి సిసలైన మనవడు ఎన్టీఆర్ నివాళి.. బాలయ్య సీరియస్ (ఫొటోలు) -
ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా జూ.ఎన్టీఆర్ నివాళి
-
హైదరాబాదీలకు అలర్ట్.. రేపు పార్కుల మూసివేత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆ పరిసరాల్లోని పార్కులు, వినోద కేంద్రాలను ఆదివారం (30వ తేదీన) మూసివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ప్రకటించింది. కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా డాక్టర్ ఆపరిసరాల్లో నెలకొనే రద్దీ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఉద్దేశంతో ఆదివారం నాడు లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, లేజర్ షో లను మూసి వేస్తున్నట్లు హెచ్ఎండీఏ వెల్లడించింది. చదవండి: హైదరాబాద్‌లో కుండపోత వాన.. హెచ్చరికలు జారీ -
ఎన్టీఆర్ శతజయంతి: ఎన్టీఆర్ ఘాట్ వద్దకు రాజకీయ ప్రముఖులు
సాక్షి, హైదరాబాద్: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, టాలీవుడ్ లెజెండరీ నటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా.. శనివారం ఎన్టీఆర్ఘాట్ వద్ద ప్రముఖుల సందడి నెలకొంది. పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా.. ఎన్టీఆర్ తనయ దగ్గుబాటి పురంధేశ్వరి నివాళులు అర్పించి మాట్లాడారు. తెలుగు గడ్డ తరపున నందమూరి తారక రామారావు ఒక సంచలనం. తెలుగు రాష్ట్రాల్లో మే 28 -2022 నుంచి మే 28 -2023 వరకు ఆయన శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తాం. ఇందుకోసం 12 కేంద్రాలను ఏర్పాటు చేశాం. నిర్వహణ బాధ్యతలను చూసుకునేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశాం. కమిటీలో బాలకృష్ణతో పాటు రాజేంద్ర ప్రసాద్ లాంటి ప్రముఖులు ఉన్నారు. అలాగే ఎన్టీఆర్ బొమ్మను వంద రూపాయల నాణెం పై ముద్రణ చేసే విధంగా అర్బీఐతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా.. నిష్ణాతులైన కళాకారులని ఘనంగా సత్కరిస్తాం అని పేర్కొన్నారామె. ఆపై టీఆర్ఎస్ నాయకులు- మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, మల్లారెడ్డి, జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, నామా నాగేశ్వరరావులు నివాళులు అర్పించి.. భారతరత్న డిమాండ్ వినిపించారు. ఒక తెలుగు బిడ్డ ప్రపంచ ఖ్యాతి గడించిన వ్యక్తి ఎన్టీఆర్. అయన అదేశాల మేరకు అభిమానులు పని చేస్తున్నారు. ప్రధాని మంత్రి కావాల్సిన అర్హతలున్న వ్యక్తి. కానీ, కాస్తలో అది జరగలేదు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ వినిపించారు. శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం మా అదృష్టం. రాజకీయాల్లో, సినిమాలలో ఆయనకు తారాస్థాయిలో అభిమానులు ఉన్నారు. పేదల కష్టం తెలుసుకున్న నాయకుడు ఎన్టీఆర్ అని నామ నాగేశ్వరావు అన్నారు. భూస్వాముల పెత్తనం పక్కన పెట్టిన నాయకుడు ఎన్టీఆర్. మహా నాయకుడి స్ఫూర్తిని తీసుకోని సీఎం కెసీఆర్ నడుస్తున్నారు. దళిత బంధు అందులో భాగమే. నా వివాహానికి వచ్చారు.. నన్ను ముందు ఉండి నడిపిన వ్యక్తి ఎన్ టి ఆర్ అని గుర్తు చేసుకున్నారు మోత్కుపల్లి నర్సింహులు. -
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్
-
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన లక్ష్మీ పార్వతి
-
NTR Satha Jayanthi: నివాళులు అర్పించిన లక్ష్మీపార్వతి, జూ.ఎన్టీఆర్
ఎన్టీఆర్ శత జయంతి: నేడు దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటుడు నందమూరి తారక రామారావు శత జయంతి. ఆయన జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో లక్ష్మీపార్వతి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి మాట్లాడుతూ..‘‘స్వచ్ఛమైన రాజకీయాలు నడిపిన వ్యక్తి ఎన్టీఆర్. వెన్నుపోట్ల ద్వారా రాజ్యాన్ని తీసుకురావాలని ఎన్టీఆర్ ఎప్పుడూ అనుకోలేదు. రాబోయే తరాలకు ఎన్టీఆర్ ఆదర్శం’’ అంటూ వ్యాఖ్యానించారు. అంతకుముందు నటులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లు కూడా ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అభిమానులు జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ శతజయంతి: పదే పదే తలచు తెలుగుజాతి -
ఎన్టీఆర్ ఆత్మతో మాట్లాడాను: లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు
-
ఎన్టీఆర్‌కు మరణం ఉండదు: లక్ష్మీపార్వతి
సాక్షి, హైదరాబాద్: ఎన్టీఆర్‌కు మరణం ఉండదని లక్ష్మీపార్వతి అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్‌లోని సమాధి వద్ద లక్ష్మీపార్వతి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ఎన్టీఆర్ భౌతికంగా దూరమైనా అందరి మనసుల్లో ఉన్నారన్నారు. జాతీయ రాజకీయాల్లో ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారని లక్ష్మీపార్వతి అన్నారు. చదవండి: టీడీపీ కుట్ర బట్టబయలు.. చంద్రబాబు ఆడియో లీక్.. -
ఒవైసీని అరెస్ట్ చేయాలి : బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్ : దేశ మాజీ ప్రధాని తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు తెలుగు జాతి గౌరవానికి ప్రతీకలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు గర్వించదగ్గ గొప్పవారిని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా వారిని అందరూ గౌరవిస్తారని గుర్తుచేశారు. నగరంలోని పీవీ, ఎన్టీఆర్ ఘాట్లను గురువారం బండి సంజయ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. పీవీ, ఎన్టీఆర్ ఘాట్లకు బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. మహానేతలపై ఒవైసీ మాట్లాడిన తీరు దురదృష్టకరమని, ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే స్పందించి అతన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ ఘాట్‌ను కూల్చివేస్తామంటూ ఎంఐఎం నేతలు చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్, టీడీపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. (కమలనాథుల గ్రేటర్ అటెన్షన్) ఈ సందర్భంగా బీజేపీ నేతలతో కలిసి మీడియా సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. ‘ఎన్టీఆర్, పీవీ ఘాట్లకు బీజేపీ రక్షణగా ఉంటుంది. ఎంఐఎం పార్టీ దేశ ద్రోహ పార్టీగా ముస్లీంలే భావిస్తున్నారు. న్టీఆర్ స్కూల్ నుంచే వచ్చి ఈ రోజు సీఎం అయిన కేసీఆర్.. అభిమాన నాయకుడిని అవమనిస్తే ఎందుకు సీఎం ఎందుకు స్పందించడం లేదు. రోహింగ్యాలను ప్రభుత్వం గుర్తించినట్లు భావిస్తున్నాం. ప్రశాంతంగా గ్రేటర్ ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలవబోతుంది. గ్రేటర్ ప్రజలు స్వేచ్చగా ఓటు వేయకుండా టీఆర్ఎస్ నేతలు భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. పార్టీలకు అతీతంగా నివాళులు అర్పించడానికి బీజేపీ నేతలు వస్తే...భారత రత్నకు, ఎన్టీఆర్ ఘాట్ కూల్చడానికి ఎంఐఎం వ్యాఖ్యలకు సంబంధం ఏంటి ?భారతరత్న ఇవ్వాలని బీజేపీ ఖచ్చితంగా కోరుతుంది. ఏపీ, తెలంగాణ రెండు బీజేపీ శాఖలు కలిసి ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కోరుతాం’ అని అన్నారు. (అక్బరుద్దీన్‌ని పిచ్చోడితో పోల్చిన కేటీఆర్) -
అదే జరిగితే.. దారుసలాంని కూల్చుతాం
సాక్షి, హైదరాబాద్ : పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్ది జీహెచ్ఎంసీ ఎన్నికల వేడి రోజు రోజుకి పెరుగుతోంది. మాటల తూటాలు పేలుతున్నాయి. నేతలు కౌంటర్‌కి ఎన్కౌంటర్ గట్టిగానే ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, పీవీ సమాధులను కూల్చాలన్న ఎమ్మెల్యే అక్బరుద్దిన్ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటుగా బదులిచ్చారు. ఒవైసీ నీకు దమ్ముంటే ఆ మహనీయులు సమాధులు ముట్టుకో చూద్దాం.. అదే జరిగితే మా కార్యకర్తలు క్షణాల్లో దారుసలాంని నేల మట్టం చేస్తారు అంటూ బండి సంజయ్ తీవ్రగా హెచ్చరించారు. దారుసలాంలో సౌండ్ చేస్తే ప్రగతి భవన్లో రీసౌండ్ వస్తుందని.. ప్రస్తుతం తెలంగాణలో అలాంటి పాలన ఉందని అన్నారు. కనుక ఓటేసే ముందు అది ఏ పార్టీకి చేరుతుందో ప్రజలు గమనించాలని బండి సంజయ్ సూచించారు. (చదవండి: అక్బరుద్దీన్‌కు కేటీఆర్ కౌంటర్) మాది ఢిల్లీ పార్టీయే అయినా గల్లీ గల్లీకి మా ప్రధాన మంత్రి పథకాలు ప్రజలకు అందుతున్నాయి అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏం ఇచ్చింది అని కేసీఆర్ అంటున్నారు, అలా అయితే కేంద్ర నిధుల లేకుండా సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర నిధులకు పేర్లు, ఫోటోలు మార్చి తన పథకాలుగా కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని ,ఈ విషయాన్నిదుబ్బాక ప్రజలు గ్రహించారు కాబట్టే టీఆర్ఎస్ కు అక్కడ బుద్ది చెప్పారన్నారు బండి సంజయ్. -
ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ నివాళి
సాక్షి, హైదరాబాద్ : నేడు టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామరావు 97వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. గురువారం ఉదయం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న బాలకృష్ణ.. పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. బాలకృష్ణతో పాటుగా ఆయన సతీమణి వసుంధర, నందమూరి రామకృష్ణ, సుహాసిని.. ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ నటించిన సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయని తెలిపారు. ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని అన్నారు. (చదవండి : ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లకూడదని నిర్ణయం..) మరోవైపు ఎన్టీఆర్ మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్‌రామ్‌లు కూడా ట్విటర్ వేదికగా ఆయనను గుర్తుచేసుకుని.. నివాళులర్పించారు. ‘మీరు లేని లోటు తీరనిది. మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక గుండె తల్లడిల్లిపోతోంది. పెద్దమనసుతో ఈ ధరిత్రని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను’ అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ‘మా ఖ్యాతి మీరే, మా కీర్తి మీరే.. ఓ విశ్వవిఖ్యాత, అందుకో మా జ్యోత’ అని కల్యాణ్‌రామ్ పోస్ట్ చేశారు. కాగా, కరోనా పరిస్థితుల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు నేడు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
అక్కడకు వెళ్లకూడదని నిర్ణయం..
హైదరాబాద్ : టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు జయంతి(మే 28) సందర్భంగా ప్రతి ఏడాది కుటుంబ సభ్యులు, అభిమానులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు నివాళులర్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు గురువారం ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. పెద్ద ఎత్తున జనాలు అక్కడికి చేరుకుంటే కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లోనే ఉండి ఆ మహానుభావుడికి నివాళులర్పించనున్నట్టు ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు తెలిపారు. -
ఎన్టీఆర్ వర్ధంతి : నివాళులు అర్పించిన తారక్
-
ఎన్టీఆర్ జయంతి ఏర్పాట్లపై లక్ష్మీ పార్వతి అసహనం
-
ఎన్టీఆర్ ఘాట్‌ను అలంకరించరా?
సాక్షి, హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకలపై ఆయన సతీమణి లక్ష్మీపార్వతి అసహనం వ్యక్తం చేశారు. కనీసం ఆయన ఘట్‌ను కూడా అలంకరించరా? అంటూ మండిపడ్డారు. మంగళవారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన ఘాట్‌కు వచ్చిన ఆమె నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ జయంతి వేడుకలకు సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్ర ప్రదేశంగా భావించాల్సిన టీడీపీ శ్రేణులు ఘాట్‌ను అలంకరించకుండా వదిలేసారన్నారు. ఆ మహానేత ఘాట్ వద్ద ఒక్క బ్యానర్‌ను కూడా ఏర్పాటు చేయరా? అని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన అన్యాయాలు, కుట్రల వల్ల తగిన శాస్త్రి జరిగిందన్నారు. తానేప్పుడు టీడీపీకి వ్యతిరేకం కాదని, కానీ చంద్రబాబు అనే వ్యక్తికి మాత్రం వ్యతిరేకమన్నారు. టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పులన్నిటిని నిశ్చయ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరిదిద్దుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నా గుండెల్లో మంట చల్లారలేదు: లక్ష్మీపార్వతి
సాక్షి, హైదరాబాద్ : ఎన్టీఆర్‌ను చంపిన వాళ్లు యథేచ్ఛగా తిరుగుతున్నారంటూ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఎన్టీఆర్ 23వ వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు. అనంతరం లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ ఎప్పటికి తెలుగు వారి గుండెల్లో ఆరాధ్యుడే అని కొనియాడారు. కానీ తన గుండెల్లో మంట చల్లారలేదని.. కళ్లలో నీరు ఇంకా ఇంకలేదని ఆవేదనం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఆత్మ శాంతించలేదని.. ఆయన ఆత్మ ఘోషిస్తుందని వాపోయారు. ఎన్టీఆర్ మహిళలను ఎంతో గౌరవించేవారని.. కానీ నేటి టీడీపీ నేతలు మహిళల పట్ల చాలా అమానవీయంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ ఘాట్‌ను కూడా సరిగా పట్టించుకోవడం లేదని.. పెచ్చులూడుతున్నాయని తెలిపారు. ఇది ఎన్టీఆర్‌కు అవమానం అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయాన్ని గమనించి ఘాట్‌కు మరమ్మతులు చేయించాలని కోరారు. -
ఎన్టీఆర్ ఘాట్ వద్ద లక్ష్మీ పార్వతి నిరసన
-
‘కాంగ్రెస్‌తో దోస్తీ.. ఎన్టీఆర్ ఫొటో, పేరు వాడుకోవద్దు’
సాక్షి, హైదరాబాద్: ‘తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ఎన్టీఆర్ టీడీపీని నెలకొల్పారు. కానీ, నీచ రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు నేడు కేంద్ర నాయకుల వద్ద వంగివంగి దండాలు పెడుతున్నాడు’ అని స్వర్గీయ నందమూరి తారక రామారావు భార్య లక్ష్మీపార్వతి అన్నారు. ‘ఎన్టీఆర్ భార్యగానే వచ్చాను. రాజకీయాలు చేయడానికి కాదు’ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తుపొట్టుకోవడాన్ని లక్ష్మీపార్వతి ఖండించారు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచాడని నిప్పులు చెరిగారు. ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని ఆమె నిరసన తెలిపారు. చంద్రబాబు దుష్టరాజకీయాలపై లక్ష్మీపార్వతి ఒక లేఖ రాసి ఎన్టీ రామారావు సమాధి వద్ద ఉంచారు. ఏనాడూ కేంద్రానికి దాసోహం అవకుండా, ఎవరికీ తలవంచకుండా ఎన్టీఆర్ పరిపాలన చేశారని గుర్తుచేశారు. నేడు కేవలం తన స్వార్ధం కోసం చంద్రబాబు కాంగ్రెస్‌తో జతకట్టారనీ, మహనీయుడయిన ఎన్టీఆర్ పేరుని కూడా ఉచ్ఛరించే అర్హత చంద్రబాబుకు లేదని లక్ష్మిపార్వతి ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఎన్టీఆర్ పేరు గానీ, ఫోటో గాని పెట్టుకొనే హక్కు టీడీపీ కోల్పోయిందని వ్యాఖ్యానించారు. -
టీడీపీ కార్యకర్తలు ఈ చర్యను అడ్డుకోవాలి
-
ఎన్టీఆర్ చరిత్రను పాఠ్యాంశాలుగా చేర్చాలి: హరికృష్ణ
సాక్షి, హైదరాబాద్ : దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. నందమూరి హరికృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్‌లో సమాధి వద్ద నివాళులు అర్పించి, స్మరించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హరికృష్ణ.. తెలుగు ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన గొప్ప నేత అని కొనియాడారు. నేడు ప్రతి ఇంట ఒక బిడ్డ ఎన్టీఆర్‌లా ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారని ఆయన అన్నారు. తనకు, తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ జయంతి ఒక పర్వదినం లాంటిదని హరికృష్ణ వెల్లడించారు. ఎన్టీ రామరావు గురించి చెప్పడానికి తరాలు, యుగాలు సరిపోవని తెలిపారు. బడుగు బలహీన వర్గాల ఉన్నతి, అభివృద్ధి కోరకున్న గొప్పనాయకుడు ఎన్టీఆర్ అని గుర్తు చేసుకున్నారు. ఎందరో మహానుభావుల జీవిత చరిత్రలు పాఠ్యాంశాలుగా ఉన్నాయని, అలాగే ఎన్టీఆర్ జీవితంలోని కొన్ని ముఖ్యఘట్టలను తెలుగు రాస్ట్రాల్లో పాఠ్యాంశాలుగా చేర్చాలని తెలుగు ప్రభుత్వాలను కోరారు. తెలుగువారికి ఒక భాష ఉందని నిరూపించారని, తెలుగు రాష్ట్ర ప్రజలు తరాలు చెప్పుకొనే సేవ చేశారని హరికృష్ణ అన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎర్రకోటపై జెండా ఎగరవేసిన మహోన్నత వ్యక్తి అని చెప్పారు. ఒకప్పుడు పార్టీలో రథసారధిగా ఉన్న మీరు మహానాడుకు ఎందుకు వెళ్లలేకపోయారన్న ప్రశ్నకు సమాధానం దాటవేశారు. హరికృష్ణ తనయులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, ఇతర కుటుంబ సభ్యులు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
టీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేయటం మంచిది
-
ఈ ఏడాది నుంచే కేజీ టు పీజీ
అంబేడ్కర్ జయంతి వేడుకల్లో సీఎం కె.చంద్రశేఖర్‌రావు 250 రెసిడెన్షియల్ విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తాం దళితులకు 100, గిరిజనులకు 50 రెసిడెన్షియల్ పాఠశాలలు దళిత అమ్మాయిలకు 25, అబ్బాయిలకు 5 డిగ్రీ కాలేజీలు విదేశాలకు వెళ్లే దళిత, గిరిజన విద్యార్థులకు స్కాలర్షిప్ రూ.20 లక్షలకు పెంపు ప్రభుత్వ పనులు, పెట్టుబడులు సమకూర్చి దళిత కాంట్రాక్టర్లను ప్రోత్సహిస్తాం అంబేడ్కర్ వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని వ్యాఖ్య హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ సమీపంలో 125 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహానికి శంకుస్థాపన సాక్షి, హైదరాబాద్: ‘కేజీ టు పీజీ’లో భాగంగా ఈ విద్యా సంవత్సరం నుంచే రాష్ట్రంలో 250 రెసిడెన్షియల్ విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని కేజీ టు పీజీ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఎంత ఖర్చయినా సరే దళిత విద్యార్థుల కోసం ఈ జూన్ నుంచే 100 ఎస్సీ రెసిడెన్షియల్ పాఠశాలలు, గిరిజనులకు 50 రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. నెలన్నర వ్యవధిలోనే ఉపాధ్యాయులను కూడా రిక్రూట్ చేస్తామన్నారు. ఉన్నత విద్యావకాశం కల్పించేందుకు దళిత అమ్మాయిలకు 25, అబ్బాయిలకు 5 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేస్తామని... వాటిని విద్యాశాఖ ఆధ్వర్యంలో కాకుండా సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ సొసైటీ ద్వారా నిర్వహిస్తామని తెలిపారు. మైనారిటీ విద్యార్థులకు 70 రెసిడెన్షియల్ స్కూళ్లను ఇప్పటికే మంజూరు చేశామన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ సమీపంలో ఏర్పాటు చేయనున్న 125 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. దళిత, గిరిజన విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు ప్రస్తుతం ఇస్తున్న రూ.10 లక్షల స్కాలర్షిప్ను రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దళితులు, గిరిజనులు ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. టీఎస్ ప్రైడ్ ద్వారా శిక్షణ పూర్తి చేసిన దళిత యువకులకు ప్రభుత్వ పనులను కాంట్రాక్టుపై ఇస్తామని... అవసరమైన యంత్ర పరికరాలు, పెట్టుబడిని కూడా సమకూర్చి దళిత కాంట్రాక్టర్లను తయారు చేస్తామని చెప్పారు. దళితులకు అద్దెకిచ్చేలా మనసు మార్చుకోండి దళిత సమాజంలో రావాల్సినంత గుణాత్మక మార్పు ఇంకా రాలేదని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. టెన్త్, ఇంటర్ పూర్తిచేసిన దళిత అమ్మాయిలు డిగ్రీ చదివేందుకు పట్టణాలకు వస్తే కొందరు గదులు అద్దెకు ఇవ్వడం లేదని, అటువంటి సన్నాసులు మనసు మార్చుకోవాలని హితవు పలికారు. దేశానికే కాదు ప్రపంచానికే తన జీవితాన్ని ఆదర్శంగా అందించిన వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు. ‘‘అంబేడ్కర్ మనుషుల కోసమే బతికారు. పేదలు, బాధితులు, పీడితులు, దోపిడీకి గురైన వారి పక్షాన ఎలుగెత్తి, గొంతెత్తి నిలబడ్డారు. ద గ్రేటెస్ట్ ఇండియన్ బిరుదు అందుకున్న మహోన్నత వ్యక్తి అంబేడ్కర్. ఆయన స్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి పునరంకితమవుతుంది..’’ అని పేర్కొన్నారు. అంబేడ్కర్‌కు విశ్వవ్యాప్త ఖ్యాతి: దత్తాత్రేయ ఐక్యరాజ్యసమితి అంబేడ్కర్ జయంతిని నిర్వహించడం ఆయనకున్న విశ్వవ్యాప్త ఖ్యాతికి అద్దం పడుతోందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆయన జీవితంతో ముడిపడి ఉన్న ఐదు ప్రాంతాలను కేంద్రం పంచ తీర్థాలుగా అభివృద్ధి చేస్తుందని చెప్పారు. మొదటగా కార్మిక మంత్రిగా ఉన్న అంబేడ్కర్ ఈఎస్ఐ ఆసుపత్రులు, ఈపీఎఫ్‌ను ప్రవేశపెట్టారని, ఇప్పుడదే విధానం కార్మికులకు అండగా నిలుస్తోందని కొనియాడారు. అంబేడ్కర్ వారసత్వాన్ని మోదీ ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. ఇక దళిత విద్యార్థులకు మరిన్ని గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని సీఎంను ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కోరారు. దేశం గర్వించేలా హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనుండడం అభినందనీయమని వ్యాఖ్యానించారు. మంత్రులు మహమూద్ అలీ, జగదీశ్‌రెడ్డి, చందూలాల్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీలు బాల్క సుమన్, పసునూరి దయాకర్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బుద్ధుడు.. అంబేడ్కర్... సచివాలయం ఎంత ఖర్చయినా సరే అద్భుతమైన ప్లాట్‌ఫామ్‌తో, ఆకాశాన్ని ముద్దాడేంత ఎత్తుతో అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని నిర్మిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆషామాషీగా తాము ఈ స్థలాన్ని ఎంపిక చేయలేదని... ముందు బుద్ధుడు తర్వాత అంబేడ్కర్ విగ్రహం, ఆయన వెనుక సచివాలయం ఉండేలా చూశామని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు ల్యాండ్‌మార్క్‌లా ఉండేలా ఈ విగ్రహాన్ని నెలకొల్పుతామన్నారు. ట్యాంక్‌బండ్‌కు ఈశాన్యంలో పాతబడ్డ అంబేడ్కర్ భవన్ స్థానంలో 15 అంతస్తులతో అంబేడ్కర్ టవర్స్ నిర్మిస్తామని... దళిత, గిరిజనుల అభివృద్ధికి అన్ని కార్యక్రమాలు అక్కడ చేపడతామని తెలిపారు. బోరబండలో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్‌కు స్థలం కేటాయించడంతో పాటు రూ.10 కోట్లు కేటాయించామన్నారు. పెద్ద ఎత్తున భూ పంపిణీ అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహిస్తామని సీఎం చెప్పారు. ప్రతి నెలా ఒక కార్యక్రమం చేపడతామని, దళితులకు మూడెకరాల భూపంపిణీని ఒక నెలలో పెద్ద ఎత్తున చేపడతామని చెప్పారు.. పేదల ఆత్మగౌరవం పెంచాలని అంబేడ్కర్ కలలుగన్నారని, అదే బాటలో డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తున్నామని, ఈ ఏడాది 2.60లక్షల ఇళ్ల నిర్మాణం చేయబోతున్నామని, వాటిని వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు. అంబేడ్కర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు అంబేడ్కర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘అంబేడ్కర్‌కు తెలంగాణ సమాజం ఎంతో రుణపడి ఉంది. ఆయన తెచ్చిన చట్టంతోనే ఇవాళ తెలంగాణ స్వేచ్ఛా వాయువులు పీలుస్తోంది. రాజ్యాంగం రాసినప్పుడు రాజ్యాంగ పరిషత్‌లో జరిగిన చర్చలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు కేంద్రం దగ్గరే ఉండాలని వాదించింది అంబేడ్కర్ ఒక్కరే. రాష్ట్రాల్లో బలవంతుల గుప్పిట్లో బలహీనులు నలిగిపోకుండా కేంద్రాన్ని ఆశ్రయించేందుకు వీలుగానే అంబేడ్కర్ ఈ సూచన చేశారు. రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం కేంద్రం దగ్గర ఉండాలని చట్టం చేయడం వల్లే తెలంగాణ సిద్ధించింది. అంబేడ్కర్ దయ వల్లే మనం దోపిడీ నుంచి విముక్తి పొందాం.. ఆయనకు ఎంత గొప్పగా నివాళులర్పించినా తక్కువే..’’ అని చెప్పారు. -
'ఈ ప్రభుత్వానికి రెండు బడ్జెట్లు మాత్రమే పెట్టే అవకాశం'
హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వానికి రెండు బడ్జెట్లు మాత్రమే పెట్టే అవకాశం ఉందని తెలంగాణ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. గతంలో ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్లు అభూత కల్పన మాత్రమే అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ సక్రమంగా అమలుకావడం లేదని ఆరోపించారు. నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ఘాట్‌లో టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్‌కు రేవంత్ రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ... రైతు రుణమాఫీ సక్రమంగా అమలుకావడం లేదని ఆరోపించారు. కేజీ టూ పీజీ ఫీజురియింబర్స్‌మెంట్, ఇతర పథకాలు కూడా సక్రమంగా అమలు కావడం లేదని విమర్శించారు. కేసీఆర్ పాలనలో దళితులు, గిరిజనులకు రక్షణ లేకుండా పోయిందని రేవంత్ రెడ్డి అన్నారు. -
అన్నకు నివాళులు.. అసెంబ్లీకి తమ్ముళ్లు..
-
అన్నకు నివాళులు.. అసెంబ్లీకి తమ్ముళ్లు..
హైదరాబాద్: నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ పార్టీ సంప్రదాయాన్ని అనుసరిస్తూ తెలుగుదేశం నాయకులు.. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు సమాధి వద్ద నివాళులు అర్పించారు. సోమవారం ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు సహా పార్టీ ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ సమాధివద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా 'ఎన్టీఆర్ అమర్ రహే' అంటూ కార్యకర్తలు నినదించారు. పలువురు ఎమ్మెల్యేలతో మాటామంతి జరుపుతూ సీఎం చంద్రబాబు ఉల్లాసంగా కనిపించారు. అనంతరం పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి బయలుదేరారు. -
'ఎన్టీఆర్ కుమార్తెగా పుట్టడం నా అదృష్టం'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌కి కుమార్తెగా పుట్టి... ఆయన 92వ జయంతి జరుపుకోవడం తన అదృష్టమని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ 92వ జయంతి సందర్భంగా గురువారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద మహానటుడికి పురంధేశ్వరి దంపతులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ... పార్లమెంట్ హాల్లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టే అవకాశం తనకు లభించిన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. మహానటుడు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపితేనే కేంద్రం ముందడుగు వేస్తుందని పురందేశ్వరి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. -
ఎన్టీఆర్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నివాళి
-
ఎన్టీఆర్ ఘాట్ వద్ద మోత్కుపల్లి నిరసన దీక్ష
-
ఎన్టీఆర్ ఘాట్ వద్ద మోత్కుపల్లి నిరసన దీక్ష
హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు శనివారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నిరసన దీక్షకు దిగారు. శంషాబాద్ విమానాశ్రయంలో దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర శాసనసభ శుక్రవారం తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దాంతో ప్రభుత్వ తీర్మానాన్ని నిరసిస్తూ మోత్కుపల్లి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ సీఎం కేసీఆర్... ఎన్టీఆర్ పేరును అవమానపరిచే విధంగా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. తీర్మానాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మోత్కుపల్లితో పాటు పలువురు తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తలు దీక్షలో పాల్గొన్నారు. -
అమరవీరులకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల నివాళి
హైదరాబాద్ : అసెంబ్లీ ఎదుట గన్‌పార్కు వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బుధవారం నివాళులర్పించారు. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. శాసనసభ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు అమరులకు నివాళులర్పించాలని టీఆర్ఎస్ఎల్పీలో నిర్ణయించిన మేరకు నేతలు స్థూపం వద్దకు చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడి నుంచి అసెంబ్లీ సమావేశాలకు బయల్దేరారు. మంత్రులు హరీష్ రావు, పద్మారావుతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరోవైపు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆపార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించి అసెంబ్లీకి బయల్దేరారు. -
నందమూరికి ఘన నివాళులు
-
'ఎన్టీఆర్ పేరు చూసి ప్రజలు ఓట్లు వేశారు'
హైదరాబాద్ : ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబును చూసి కాదని ఎన్టీఆర్ పేరును చూసి ఓట్లు వేశారని ఎన్టీఆర్ సతీమణి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత లక్ష్మీ పార్వతి అన్నారు. ఎన్టీఆర్ 91వ జయంతి సందర్భంగా ఆమె బుధవారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించటం కాదని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు. కొత్తగా ఏర్పడనున్న ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ సంక్షేమ పథకాలు కొనసాగించాలని ఆమె డిమాండ్ చేశారు. కొత్త ప్రభుత్వం చిత్తశుద్దితో ఎన్టీఆర్ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ... ప్రజల పక్షాన పోరాడతామని లక్ష్మీపార్వతి తెలిపారు. ప్రజల సంక్షేమానికి తమవంతు సహకారం అందిస్తామని ఆమె అన్నారు. రాష్ట్రం రెండుగా విడిపోయినప్పటికీ తెలుగు ప్రజలు ఎప్పుడూ కలిసి ఉండాలన్నారు. మోడీ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయించాలని లక్ష్మీపార్వతి కోరారు. ఈసారి అయినా ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఇందుకోసం చంద్రబాబు చిత్తశుద్ధితో పోరాడాలని అన్నారు. -
ఎన్టీఆర్ మళ్లీ జన్మించాలి: జూ.ఎన్టీఆర్
-
తెలుగుజాతితో కాంగ్రెస్ ఆటలాడింది: బాబు
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబ సభ్యులు శనివారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పునాదులు వేసి స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దుతానన్నారు. తెలుగు జాతితో కాంగ్రెస్ పార్టీ ఆటలాడిందని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర విబజన హేతుబద్ధంగా లేనందునే ప్రజలు కాంగ్రెస్‌ను భూస్థాపితం చేశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. -
'బాబు ఎన్టీఆర్ ఘాట్‌ను వాడుకుంటున్నారు'
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబునాయుడు తన స్వార్థ రాజకీయాల కోసం ప్రతిసారి ఎన్టీఆర్ ఘాట్‌ను వాడుకుంటుంటే గుండె తరుక్కుపోతుందన్నారు. ఎన్టీఆర్ ఆశయాలు ఏమి అమలు చేశారని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చంద్రబాబు వస్తున్నారో చెప్పాలని ఆమె సోమవారమిక్కడ నిలదీశారు. తెలుగువారంతా ఒక్కటిగా ఉండాలని ఎన్టీఆర్ అనుకున్నారని.....అలాంటిది విభజనకు ఒప్పుకున్నాక ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చంద్రబాబు రావడం ఎందుకు అని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. స్వార్థం కోసమే ఢిల్లీలో బాబు దీక్ష చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. జాతీయ నేతలను పిలిపించుకుని...తన పలుకుబడి చూపించడానికే బాబు దీక్ష చేస్తున్నారన్నారు. చంద్రబాబులా తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన నేత మరొకరు లేరని లక్ష్మీపార్వతి అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్గంలోనే టీడీపీ కూడా పయనించాలన్నారు. ఆర్టికల్ 3 విషయంలో వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పు పట్టడం సరికాదని అన్నారు. 120 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆర్టికల్ 3 గురించి తెలియదా అని లక్ష్మి పార్వతి సూటిగా ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర సరిగా పోషించనందునే రాష్ట్రంలో ఈ దుస్థితి నెలకొందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు ఢిల్లీలో దీక్ష చేపడుతున్న సందర్బంగా ఈరోజు ఉదయం నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కు నివాళులర్పించిన విషయం తెలిసిందే. -
బంధుత్వాలకు తావుండదు: హరికృష్ణ
హైదరాబాద్ : రాష్ట్రం బాగుండాలి... రాష్ట్ర ప్రజలంతా కలసి ఉండాలని కోరుకుంటున్నట్లు నందమూరి హరికృష్ణ చెప్పారు. తన జన్మదినం సందర్భంగా ఆయన సోమవారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగు ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలని కోరుకున్నారని హరికృష్ణ చెప్పారు. భారతంలో శకుని పాత్ర, రామయణంలో కైకేయి పాత్రల స్పూర్తిగా తన కొడుకును ప్రధానిని చేసేందుకే సోనియా తెలుగు వారి మధ్య చిచ్చుపెట్టిందన్నారు. రాహుల్‌గాంధీని ప్రధాని చేసేందుకే సోనియాగాంధీ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం తాను స్వచ్ఛందంగా రాజీనామా చేశానని చెప్పారు. తననెవరూ ప్రభావితం చేయలేదని... అయితే కానీ కొందరు పనిగట్టుకుని మరీ తనపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో అర్థం కావడంలేదని హరికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ స్వగ్రామం కృష్ణాజిల్లా నందమూరి నుంచి ఆయన ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించనున్న విషయం తెలిసిందే. సమైక్యాంధ్ర కోసం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన హరికృష్ణ తన పుట్టిన రోజు వేడుకల్ని జరుపుకోరాదని నిర్ణయించారు. రాష్ట్రం ముక్కలుచెక్కుల అవుతుంటే తను జన్మదినం జరుపుకోకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తండ్రి ఆశీస్సులకోసం ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చిన హరికృష్ణ అనేక విషయాలపై మాట్లాడారు. రాజీనామాకు సంబంధించిన పార్టీ నుంచి వచ్చిన పేపర్‌పై సంతకం చేశానని... అయితే ఆ తర్వాత ఆ ఫార్మెట్ తప్పుదని తేలడంతో మరో రాజీనామా ఇచ్చినట్లు తెలిపారు. మహోద్యమంలో భాగమైనప్పుడు... బంధుత్వాలకు తావుండదని హరికృష్ణ ప్రకటించారు. సోదరులు బాలకృష్ణ, రామకృష్ణ పెళ్లిళ్లకు తన తండ్రి ఎన్టీఆర్ హాజరు కాలేదని గుర్తు చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్న తన తండ్రి ఆశయ సాధన కోసం తాను పోరాటం చేస్తానని హరికృష్ణ ప్రకటించారు. తన పార్టీఎంపీలు చేసిన రాజీనామాలు తప్పుడువని తెలిపారు. టిఆర్ఎస్తో పొత్తు పార్టీకి ముప్పని ఆరోజే చేప్పానని హరికృష్ణ స్పష్టం చేశారు . పొత్తుతో రెండు ప్రాంతాల్లోనూ పార్టీకి నష్టం జరుగుతుందని అధినేతకు చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు. -
కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయం
రాజమండ్రి సిటీ, న్యూస్‌లైన్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేం దుకు దివంగత ముఖ్యమంతి ఎన్టీఆర్ తీవ్రంగా కృషి చేశారని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. మంగళవారం స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్దనున్న ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన క్షీరాభిషేకం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనుకున్న వారు పార్టీలకతీతంగా అభినందనీయులేనన్నారు. రాష్ట్రం ముక్కలు కాకుండా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష నిర్ణయంతో రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చీల్చుతోందని విమర్శించారు. సమైక్యాంధ్రకు కట్టుబడే వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారన్నారు. నేతల విగ్రహాలకు తమ పార్టీ క్షీరాభిషేకం చేస్తుందని, నష్టపరిచే ఉద్దేశం ఉండదన్నారు. కొన్ని స్వార్థశక్తులు చేసిన పనిని తమ పార్టీ కార్యకర్తలపై నెట్టివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కోటగుమ్మం సెంటర్లో 48 గంటల నిరాహార దీక్ష చేపట్టిన వారికి సంఘీభావం ప్రకటించారు. పార్టీ నాయకుడు కర్రి సతీష్ వీఎల్ పురం సెంటర్లో చేపట్టిన 72 గంటల నిరసన దీక్షకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి టీకే విశ్వేశ్వరరెడ్డి, మాజీ కార్పొరేటర్లు అజ్జరపు వాసు, బొమ్మనమైన శ్రీనివాస్, నాయకులు కె.జోగారావు, బుడ్డిగ రవి, కానుబోయిన సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
రాజ్యసభ సభ్యత్వానికి హరికృష్ణ రాజీనామా
రాష్ట్ర విభజన తీరుకు నిరసనగా టీడీపీ నాయకుడు నందమూరి హరికృష్ణ ఆదివారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా రాజ్యసభ చైర్మన్‌కు పంపించారు. అనంతరం ఆయన నగరంలోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తన తండ్రి నందమూరి తారకరామారావుకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం హరికృష్ణ ప్రసంగిస్తూ... మనమంతా అన్నతమ్ములుగా కలిస ఉన్నాం, ఒకే భాష మాట్లాడుతున్నాం, అలాంటి తెలుగువారని విభజించేందుకు కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. స్వార్థపర రాజకీయ నాయకులు ఆడే నాటకంలో మనమంతా భాగస్వాములం అయిపోతున్నామని హరికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోతే సమైక్యతలో ఉన్న మాధుర్యం దూరం అవుతుందన్నారు. దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం షష్ఠిపూర్తి చేసుకునే దశలో విడిపోవడం చాలా బాధాకరమని ఆయన పేర్కొన్నారు. గతంలో నెహ్రూ ప్రధానిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు కలపి పెళ్లి చేస్తే, ఆ ఇంటి కోడలు సోనియా సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విడాకాలు ఇస్తుందని హరికృష్ణ ఎద్దేవా చేశారు. గతంలో పాండవులు, కౌరవుల మధ్య శకుని వైరం సృష్టిస్తే, నేడు తెలంగాణ, సీమాంధ్రల మధ్య సోనియా, కాంగ్రెస్ పార్టీలు ఆడుతున్న దుష్ట క్రీడలో భాగమని ఆయన వ్యాఖ్యానించారు. అసలు రాష్టంలో ఏమి జరగుతుందో ఢిల్లీ పెద్దలకు తెలియడం లేదన్నారు. ఢిల్లీలో కూర్చుని కళ్లకు గంతలు కట్టుకుని నిర్ణయం తీసుకుంటే ఏలా అని కాంగ్రెస్ పెద్దలను ప్రశ్నించారు. రాష్ట విభజన వల్ల నీళ్లు, కరెంట్, పాలన పరమైన సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. వాటిపై చర్చించకుండా కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనపై ఏక పక్ష నిర్ణయం తీసుకోవడం ఏంటని ఆయన ఈ సందర్భంగా నిలదిశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజనపై కేంద్రం ఐదు కమిటీలను వేసిన సంగతిని ఈ సందర్బంగా హరికృష్ణ గుర్తు చేశారు.