రాజ్యసభ సభ్యత్వానికి హరికృష్ణ రాజీనామా | Hari Krishna to resign to Rajya Sabha | Sakshi
Sakshi News home page

రాజ్యసభ సభ్యత్వానికి హరికృష్ణ రాజీనామా

Published Sun, Aug 4 2013 9:36 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

రాజ్యసభ సభ్యత్వానికి హరికృష్ణ రాజీనామా - Sakshi

రాజ్యసభ సభ్యత్వానికి హరికృష్ణ రాజీనామా

రాష్ట్ర విభజన తీరుకు నిరసనగా టీడీపీ నాయకుడు నందమూరి హరికృష్ణ ఆదివారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఫ్యాక్స్ ద్వారా రాజ్యసభ చైర్మన్కు పంపించారు. అనంతరం ఆయన నగరంలోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తన తండ్రి నందమూరి తారకరామారావుకు ఘనంగా నివాళులర్పించారు.

 

అనంతరం హరికృష్ణ ప్రసంగిస్తూ... మనమంతా అన్నతమ్ములుగా కలిస ఉన్నాం, ఒకే భాష మాట్లాడుతున్నాం, అలాంటి తెలుగువారని విభజించేందుకు కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. స్వార్థపర రాజకీయ నాయకులు ఆడే నాటకంలో మనమంతా భాగస్వాములం అయిపోతున్నామని హరికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోతే సమైక్యతలో ఉన్న మాధుర్యం దూరం అవుతుందన్నారు.

దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం షష్ఠిపూర్తి చేసుకునే దశలో విడిపోవడం చాలా బాధాకరమని ఆయన పేర్కొన్నారు. గతంలో నెహ్రూ ప్రధానిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు కలపి పెళ్లి చేస్తే, ఆ ఇంటి కోడలు సోనియా సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విడాకాలు ఇస్తుందని హరికృష్ణ ఎద్దేవా చేశారు. గతంలో పాండవులు, కౌరవుల మధ్య శకుని వైరం సృష్టిస్తే, నేడు తెలంగాణ, సీమాంధ్రల మధ్య సోనియా, కాంగ్రెస్ పార్టీలు ఆడుతున్న దుష్ట క్రీడలో భాగమని ఆయన వ్యాఖ్యానించారు.

 

అసలు రాష్టంలో ఏమి జరగుతుందో ఢిల్లీ పెద్దలకు తెలియడం లేదన్నారు. ఢిల్లీలో కూర్చుని కళ్లకు గంతలు కట్టుకుని నిర్ణయం తీసుకుంటే ఏలా అని కాంగ్రెస్ పెద్దలను ప్రశ్నించారు. రాష్ట విభజన వల్ల నీళ్లు, కరెంట్, పాలన పరమైన సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. వాటిపై చర్చించకుండా కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజనపై ఏక పక్ష నిర్ణయం తీసుకోవడం ఏంటని ఆయన ఈ సందర్భంగా నిలదిశారు. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట విభజనపై కేంద్రం ఐదు కమిటీలను వేసిన సంగతిని ఈ సందర్బంగా హరికృష్ణ గుర్తు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement