అసెంబ్లీ ఎదుట గన్‌పార్కు వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బుధవారం నివాళులర్పించారు.
హైదరాబాద్ : అసెంబ్లీ ఎదుట గన్‌పార్కు వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు బుధవారం నివాళులర్పించారు. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. శాసనసభ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు అమరులకు నివాళులర్పించాలని టీఆర్‌ఎస్‌ఎల్పీలో నిర్ణయించిన మేరకు నేతలు స్థూపం వద్దకు చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు. అక్కడి నుంచి అసెంబ్లీ సమావేశాలకు బయల్దేరారు. మంత్రులు హరీష్ రావు, పద్మారావుతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మరోవైపు తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆపార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కు నివాళులు అర్పించి అసెంబ్లీకి బయల్దేరారు.