Lakshmi Parvathi Fires on TDP Leaders Over NTR Ghat Decoration on the Occasion of NTR's Birth Anniversary - Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ ఘాట్‌ను అలంకరించరా?

Published Tue, May 28 2019 9:46 AM | Last Updated on Tue, May 28 2019 5:43 PM

Lakshmi Parvathi Fires On TDP  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ జయంతి వేడుకలపై ఆయన సతీమణి లక్ష్మీపార్వతి అసహనం వ్యక్తం చేశారు. కనీసం ఆయన ఘట్‌ను కూడా అలంకరించరా? అంటూ మండిపడ్డారు. మంగళవారం ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా ఆయన ఘాట్‌కు వచ్చిన ఆమె నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ జయంతి వేడుకలకు సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్ర ప్రదేశంగా భావించాల్సిన టీడీపీ శ్రేణులు ఘాట్‌ను అలంకరించకుండా వదిలేసారన్నారు. ఆ మహానేత ఘాట్‌ వద్ద ఒక్క బ్యానర్‌ను కూడా ఏర్పాటు చేయరా? అని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన అన్యాయాలు, కుట్రల వల్ల తగిన శాస్త్రి జరిగిందన్నారు. తానేప్పుడు టీడీపీకి వ్యతిరేకం కాదని, కానీ చంద్రబాబు అనే వ్యక్తికి మాత్రం వ్యతిరేకమన్నారు. టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పులన్నిటిని నిశ్చయ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సరిదిద్దుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement