NTR Jayanthi
-
చంద్రబాబు వల్ల ఎన్టీఆర్‌కు మూడు సార్లు గుండెపోటు : పోసాని
సాక్షి, విజయవాడ: లక్ష్మీ పార్వతి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు చంద్రబాబు నాయుడు చాలా ప్రయత్నించాడని, కానీ ఎన్టీఆర్ మాత్రం అవేవి పట్టించుకోలేదని నటుడు, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి అన్నారు. ఎన్టీఆర్ 100వ జయంతి నేడు. ఈ సందర్భంగా విజవాడలో ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో పోసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఆయన నెంబర్ వన్ హీరో అని తెలుసు.. కృష్ణుడు అని తెలుసు.. వెన్నుపోటు పొడిపించుకున్నవాడని తెలుసు. చంద్రబాబు చేతుల్లో చనిపోయాడని తెలుసు. నేను చెప్పాల్సింది ఏం లేదు. (చదవండి: వాళ్లే ఎన్టీఆర్‌కు నిజమైన వారసులు: లక్ష్మీపార్వతి ) ఎన్టీఆర్ జీవితంలో మీకు తెలియని కొన్ని నిజాలు చెబుతా. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతిని ఆయనే తీసుకొచ్చుకున్నాడు. ఆమెకు అప్పటికే చాలా ఆస్తులు ఉన్నాయి. ఆమె ఓ లెక్చరర్. సంస్కృతం బాగా వచ్చు. గొప్ప మేధావి. అలాంటి వ్యక్తి ఎన్టీఆర్ పక్కన ఉంటే తన ఆటలు సాగవని చంద్రబాబు భావించాడు. ఎలాగైనా ఆమెను బయటకు పంపించాలని కుట్ర పన్నాడు. లక్ష్మీ పార్వతి స్నేహితురాలి కొడుకుతో ఆమెకు అక్రమ సంబంధం ఉందని పుకార్లు పుట్టించాడు. ఇదే విషయం ఎన్టీఆర్ వరకు వెళ్లింది. ఓ రోజు ఎన్టీఆర్.. లక్ష్మీ పార్వతిని, ఆ అబ్బాయిని, చంద్రబాబుని ఇంట్లోకి పిలిపించుకున్నాడు. తిరుపతి లడ్డు ఆ అబ్బాయి చేతిలో పెట్టి.. ‘దీనిపై ప్రమాణం చేసి చెప్పు.. లక్ష్మీ పార్వతికి నీకు మధ్య ఉన్న సంబంధం ఏంటి?’ అని అన్నాడు. అప్పుడు ఆ అబ్బాయి గట్టిగా ఏడుస్తూ..‘లక్ష్మీ పార్వతి నాకు తల్లి లాంటిది సర్. నేను ఏ తప్పు చేయలేదు’ అని చెప్పాడు. అప్పుడు వెంటనే ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులందరిని పిలిచి.. ‘నా ఆరోగ్యం సహకరించడం లేదు. తోడు కోసం ఆ అమ్మాయి(లక్ష్మీ పార్వతి)ని పెళ్లి చేసుకుంటాను’ అని చెప్పాడు. అప్పుడు ఇంట్లో వాళ్లు ఎవరూ ఒప్పకోలేదు. కారణం ఎన్టీఆర్ ఎక్కడ తన ఆస్తులన్నీ ఆమెకు ఇస్తారోననే భయం. కానీ లక్ష్మీ పార్వతి ఎప్పుడూ ఆస్తుల గురించి ఎన్టీఆర్ దగ్గర ప్రస్తావించలేదు. ఓ గొప్ప వ్యక్తికి తోడుగా ఉంటున్నానని సంతోష పడింది. చంద్రబాబు చేసే పనుల వల్ల ఎన్టీఆర్‌కు మూడు సార్లు గుండెపోటు వచ్చింది. ఆ సమయంలో చిన్న పిల్లాడిలా అతన్ని చూసుకుంది లక్ష్మీ పార్వతి గారే. ఎవరూ అతన్ని పట్టించుకోలేదు. ఆయన్ని బతికించుకోవడం కోసం ప్రతి సంవత్సరం అవార్డులు ఇస్తుంది లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్ ఆస్తులన్నీ చంద్రబాబు, అతని వారసులు తీసుకుంటే.. ఈమె మాత్రం ఇప్పటికి అతని పేరుని బతికించుకోవడం కోసం కష్టపడుతోంది. అవార్డులు, సేవా కార్యక్రమాలు చేసుకోవడం కోసం తన గాజులతో సహా అన్ని అమ్ముకుంది. కానీ వైఎస్ జగన్ చేతిలో ఘోరంగా ఓడిన తర్వాత.. ఇప్పుడు ఎన్టీఆర్ బొమ్మను చూసి ఓట్లు వేయండి అంటూ చంద్రబాబు కపట ప్రేమను చూపిస్తున్నాడు. రామరావు ఆత్మ శాంతించాలంటే మళ్లీ ఇదే ప్రభుత్వం అధికారంలోకి రావాలి. చంద్రబాబు లాంటి గుణంలేని నాయకుడికి తగిన బుద్ది చెప్పాలి’అని పోసాని అన్నారు. -
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు దూరంగా జూ.ఎన్టీఆర్!
దివంగత ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నటసార్వ భౌముడు నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలకు ఆయన మనవడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూరంగా ఉన్నాడు. హైదరాబాద్‌లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డును ఆనుకొని ఉన్న కైతలాపూర్మైదానంలో శనివారం సాయంత్రం 5గంటలకు ఈ సభ జరగనుంది. (చదవండి: గ్లోబల్ స్టార్ NTR గురించి మీకు తెలియని విషయాలు! ) ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌ని ఆహ్వానించారు. అయితే తన 40వ పుట్టినరోజు (మే 20) కూడా ఇదే రోజు కావడంతో.. ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్లేందుకు ప్లాన్ వేసుకున్నారు. ముందస్తు షెడ్యూల్ కారణంగానే శత జయంతి ఉత్సవాలకు జూనియర్ ఎన్టీఆర్ గారు హాజరు కావడం లేదని ఆయన టీమ్ మీడియాకు తెలియజేసింది. ఆహ్వాన సమయంలోనే ఆర్గనైజింగ్ కమిటీకి ఈ విషయాన్ని తెలియజేస్తున్నట్లు ఎన్టీఆర్ టీమ్ వెల్లడించింది. -
తనికెళ్ల భరణికి లోక్‌నాయక్ సాహిత్య పురస్కారం ప్రదానం
మద్దిలపాలెం (విశాఖ తూర్పు): లోక్‌నాయక్ ఫౌండేషన్ వార్షిక సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, రచయిత తనికెళ్ల భరణికి సోమవారం ప్రదానం చేశారు. లోక్‌నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియంలో నిర్వహించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఏపీ అధికార భాషా సంఘం చైర్మన్ ఆచార్య యార్లగడ్ల లక్ష్మీప్రసాద్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా మిజోరం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు, సినీ హీరో డాక్టర్ మంచు మోహన్‌బాబు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్, లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్ ఎన్ జయప్రకాష్ నారాయణ్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు పాల్గొన్నారు. వీరి చేతుల మీదుగా తనికెళ్ల భరణికి సాహిత్య పురస్కారం, రూ.2 లక్షల నగదు బహుమతి అందజేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి ఆయనకు సేవలందించిన నాటి ప్రత్యేక అధికారి గోటేటి రామచంద్రరావు, వ్యక్తిగత సహాయకుడు మోహన్, భద్రతాధికారి కృష్ణారావు, డ్రైవర్ లక్ష్మణ్‌లను కూడా సత్కరించారు. వీరికి ఒక్కొక్కరికి రూ. లక్ష నగదు అందజేశారు. 18 సంవత్సరాలుగా సాహిత్య పురస్కారాన్ని అందజేస్తున్నట్లు యార్లగడ్ల లక్ష్మీ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌పై రూపొందించిన లఘు చిత్ర ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. తెలుగు భాషాభివృద్ధికి ఎన్టీఆర్ చేసిన కృషిని అతిథులు కొనియాడారు. -
ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మరో హీరో
స్వర్గీయ మహానటుడు నందమూరి తారక రామారావు వారసులు చాలా మంది టాలీవుడ్లో రాణిస్తున్నారు. తాజాగా మరో వారసుడు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు. ఎన్టీఆర్ మనవడు, నందమూరి జయకృష్ణ తనయుడు చైతన్యకృష్ణ హీరోగా పరిచయం అవుతున్నారు. బసవతారకరామ క్రియేషన్స్ బ్యానర్‌పై నందమూరి జయకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు వంశీ కృష్ణ ఆకెళ్ళ దర్శకుడు. శనివారం బసవతారకరామ బ్యానర్, తొలి చిత్రం ఫస్ట్ లుక్‌ను నందమూరి బాలకృష్ణ రిలీజ్ చేసి, మాట్లాడుతూ – ‘‘మా అమ్మ, నాన్నగార్ల పేర్లు కలిసొచ్చేలా ‘బసవతారకరామ’ అని బ్యానర్‌కు పేరు పెట్టడం సంతోషంగా ఉంది. ఇది మా అన్నదమ్ములందరి బ్యానర్. నాన్నగారికి ఎంతో ఇష్టమైన చైతన్య ఈ బ్యానర్లోని సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నందుకు హ్యాపీ. అన్నయ్య జయకృష్ణ, దర్శకుడు వంశీకి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘డిఫరెంట్ కాన్సెప్‌్టతో ఈ సినిమా రూపొందుతోంది’’ అన్నారు జయకృష్ణ. ‘‘మా నాన్నగారు స్థాపించిన బసవతారకరామ క్రియేషన్స్’ను బాబాయ్ బాలకృష్ణగారు లాంచ్ చేసి, ఆశీస్సులు అందించడం హ్యాపీగా ఉంది’’ అన్నారు చైతన్య కృష్ణ. రెండు షేడ్స్ కల్యాణ్‌రామ్ హీరోగా వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ నిర్మించిన చిత్రం ‘బింబిసార’. ఈ చిత్రంలో కేథరిన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లు. ఈ సినిమా ఆగస్టు 5న రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ శతజయంతి(మే 28) సందర్భంగా ‘బింబిసార’ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో మగధ రాజు బింబిసారుడిగా, మోడ్రన్ కుర్రాడిగా రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కనిపిస్తారు కల్యాణ్ రామ్. ఈ సినిమాకు సంగీతం: ఎమ్ఎమ్ కీరవాణి. -
టీడీపీకి మహానాడు జాకీలు
సాక్షి, అమరావతి: పాతాళానికి పడిపోయిన తెలుగుదేశం పార్టీని కొద్దిగానైనా పైకి లేపి రాజకీయ రేసులో ఉన్నామని చెప్పుకొనేందుకు చంద్రబాబు మహానాడు ద్వారా తాపత్రయపడ్డారు. నిస్తేజంలో కూరుకుపోయిన శ్రేణులు, భవిష్యత్తుపై బెంగతో అస్త్ర సన్యాసం చేసిన నాయకుల్ని కదిలించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయినప్పటి నుంచి టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. స్థానిక ఎన్నికల్లోనూ గతంలో ఎన్నడూ లేని విధంగా కనీస పోటీ కూడా ఇవ్వలేక దారుణంగా ఓడిపోవటంతో పార్టీ యంత్రాంగం నీరసించిపోయింది. చంద్రబాబు ఎన్ని పిలుపులు ఇచ్చినా నాయకులు, శ్రేణులు పట్టించుకోలేదు. సోషల్ మీడియా ద్వారా ఏదో ఉన్నామని చూపించుకోవడం తప్ప పెద్దగా కార్యక్రమాలు కూడా నిర్వహించే పరిస్థితి లేకుండాపోయింది. మెజారిటీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జిలు కూడా లేరు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు హవా చెలాయించిన నేతలు, మంత్రుల్లో నలుగురైదుగురు మినహా మిగిలిన వాళ్లెవరు మూడేళ్లుగా బయటకు రాలేదు. దీంతో కొంత కాలంగా యువతకు అవకాశం పేరుతో జూనియర్ నాయకులను తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహానాడు ద్వారా పార్టీ శ్రేణుల్ని కొంతైనా కదిలించాలని ప్రయత్నించినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బూతులు, తిట్లు పార్టీ ముందడుగు కోసం నిర్వహించే మహానాడు వేదికను పూర్తిగా బూతులమయంగా మార్చివేశారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. జగన్‌ను లక్ష్యంగా చేసుకుని నోటికి వచ్చినట్లు కొందరు నేతలతో మాట్లాడించడం చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకాన్ని వ్యతిరేకించి అభూత కల్పనలతో బురద జల్లేందుకు మహానాడును ఉపయోగించుకున్నారు. అందులో భాగంగానే ఏపీకి సంబంధించి 15 తీర్మానాలు చేసి ప్రతి దాన్ని తిట్లు, శాపనార్థాలతో నింపేశారు. మరోవైపు మహానాడు ముగింపు సభకు కార్యకర్తలు రారనే భయంతో మహానాడును అడ్డుకుంటున్నారంటూ చంద్రబాబు వారం ముందు నుంచే తప్పుడు ప్రచారానికి దిగారు. బస్సులు ఇవ్వడంలేదని ఆరోపణలు చేశారు. చంద్రబాబు, ఇతర నేతలు టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహించి నియోజకవర్గాల వారీగా నాయకులకు టార్గెట్లు ఇచ్చి కచ్చితంగా అంతమందిని ఒంగోలుకు తీసుకురావాలని ఆదేశించారు. అంతమందిని తేలేమని చాలామంది చేతులెత్తేయడంతో జనం రారనే భయంతో మహానాడును అడ్డుకుంటున్నారంటూ ముందస్తుగా ప్రచారాన్ని లేవనెత్తారు. ఎన్టీఆర్‌కు దక్కని సముచిత గౌరవం ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ మహానాడులో ఆయనకు మాత్రం సముచిత గౌరవం ఇవ్వలేదు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కోరుతూ ప్రతి మహానాడులో తీర్మానం చేస్తున్నారు. అయితే, ఆయన శత జయంతి సందర్భంగా నిర్వహించిన మహానాడులో ఈ తీర్మానమే లేదు. ఆయన పేరును చెప్పుకోవడానికే నేతలు పరిమితమయ్యారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నా ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించడం తప్ప ఆయన్ను గౌరవించేలా ఒక్క పనీ చేయలేదు. వైఎస్సార్సీపీ ఎన్టీఆర్‌ను గౌరవించే విషయంలో పార్టీలకు అతీతంగా వ్యవహరించింది. సీఎం జగన్ తాను ఇచ్చిన హామీ మేరకు విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి గౌరవించారు. -
NTR Jayanthi: ఈ గుండెని ఒక్కసారి తాకిపో తాతా.. ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్
విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 100వ జయంతి నేడు(మే 28). ఈ సందర్భంగా పలువురు సీనీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులర్పించారు. ‘తెలుగు వారి హృదయాలలో అచిరకాలం కొలువయ్యే యుగ పురుషుడు,నవరస నటనా సార్వభౌముడు , తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు జాతి కీర్తి కిరీటం, శ్రీ నందమూరి తారక రామారావు గారు.ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా ఇదే నా ఘన నివాళి’అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశాడు. (చదవండి: పదే పదే తలచు తెలుగుజాతి) ఇక రామరావు జయంతి సందర్భంగా తాతను స్మరించుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్. ‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోందని, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోందని, పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా’ అంటూ ఎన్టీఆర్ ట్విటర్లో ఓ పోస్ట్ పెట్టాడు. వీరితో పాటు పలువురు సినీ ప్రముఖులు సైతం ఎన్టీఆర్‌ను స్మరించుకుంటూ పోస్టులు పెట్టారు. తెలుగు వారి హృదయాలలో అచిరకాలం కొలువయ్యే యుగ పురుషుడు,నవరస నటనా సార్వభౌముడు , తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు జాతి కీర్తి కిరీటం, శ్రీ నందమూరి తారక రామారావు గారు.ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా ఇదే నా ఘన నివాళి! #100YearsOfNTR — Chiranjeevi Konidela (@KChiruTweets) May 28, 2022 సదా మిమ్మల్ని స్మరించుకుంటూ… pic.twitter.com/svo2SUQSlP — Jr NTR (@tarak9999) May 28, 2022 కారణ జననానికి వందేళ్ళు !! నటుడిగా అలరించి, అబ్బుర పరచి.. అఖండ ఖ్యాతినార్జించారు! నాయకుడిగా అండనిచ్చి, అభివృద్ధినందించి.. ఆదర్శప్రాయుడయ్యారు!! వ్యక్తిగా ఆత్మగౌరవానికి నిలువెత్తురూపంగా నిలిచారు!! తెలుగువారి గుండెల్లో మీ స్థానం.. సుస్థిరం.. సమున్నతం.. శాశ్వతం!!#100YearsOfNTR pic.twitter.com/f5ErLiNpJE — Sreenu Vaitla (@SreenuVaitla) May 28, 2022 Some saw him as an ordinary man..Some saw him as a God..but,in the end everybody realised that he was a Man sent by God! The Pride of every Telugu soul! 🙏❤️ #100YearsOfNTR Love..#RAPO pic.twitter.com/tl0WzA8Qsp — RAm POthineni (@ramsayz) May 28, 2022 The man of the people and for the people. #NTR garu's good deeds and service will never be forgotten on and off the screen. We are forever grateful to this legend! Let us come together and celebrate his achievements and greatness!https://t.co/GdiBeUh89M pic.twitter.com/eBgLuTyvex — Vyjayanthi Movies (@VyjayanthiFilms) May 26, 2022 Johar NTR. #100YearsOfNTR pic.twitter.com/uRRpsRbHzV — Raghavendra Rao K (@Ragavendraraoba) May 28, 2022 -
‘చంద్రబాబు జీవితమంతా 420 పనులే’
సాక్షి, తిరుపతి: ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు అని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ మరణానికి కారణమైన వాళ్లే.. ఇప్పుడు ఫొటోకి దండం పెడుతున్నారని, మహానాడులో అయినా ఎన్టీఆర్‌కు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి అని మంత్రి రోజా డిమాండ్ చేశారు. మహానాడులో సీఎం జగన్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు చంద్రబాబు. కానీ, సీఎం జగన్ పార్టీలకతీతంగా సంక్షేమ ఫలాలు అందజేస్తున్నారు. మా ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలూ లబ్ధి పొందుతున్నారు. 95 శాతం హామీలను సీఎం జగన్ అమలు చేశారు. అయితే మేనిఫెస్టోను వెబ్సైట్ నుంచి తీసేసిన ఘనుడు చంద్రబాబు అని ఆమె ఎద్దేశా చేశారు. ఫ్యాన్ గాలి(వైఎస్సార్సీపీని ఉద్దేశిస్తూ..) దెబ్బకు చంద్రబాబు, లోకేష్ పిచ్చెక్కి తిరుగుతున్నారని అన్నారు. మంచి చేశాం కాబట్టే.. ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నాం అన్న మంత్రి రోజా.. అంబేద్కర్ పేరు పెట్టాలని టీడీపీ, జనసేన ఎందుకు డిమాండ్ చేశాయని ప్రశ్నించారు. -
ఎన్టీఆర్ శతజయంతి: ఎన్టీఆర్ ఘాట్ వద్దకు రాజకీయ ప్రముఖులు
సాక్షి, హైదరాబాద్: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు, టాలీవుడ్ లెజెండరీ నటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా.. శనివారం ఎన్టీఆర్ఘాట్ వద్ద ప్రముఖుల సందడి నెలకొంది. పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు ఘాట్ వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా.. ఎన్టీఆర్ తనయ దగ్గుబాటి పురంధేశ్వరి నివాళులు అర్పించి మాట్లాడారు. తెలుగు గడ్డ తరపున నందమూరి తారక రామారావు ఒక సంచలనం. తెలుగు రాష్ట్రాల్లో మే 28 -2022 నుంచి మే 28 -2023 వరకు ఆయన శతజయంతి ఉత్సవాలు నిర్వహిస్తాం. ఇందుకోసం 12 కేంద్రాలను ఏర్పాటు చేశాం. నిర్వహణ బాధ్యతలను చూసుకునేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశాం. కమిటీలో బాలకృష్ణతో పాటు రాజేంద్ర ప్రసాద్ లాంటి ప్రముఖులు ఉన్నారు. అలాగే ఎన్టీఆర్ బొమ్మను వంద రూపాయల నాణెం పై ముద్రణ చేసే విధంగా అర్బీఐతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా.. నిష్ణాతులైన కళాకారులని ఘనంగా సత్కరిస్తాం అని పేర్కొన్నారామె. ఆపై టీఆర్ఎస్ నాయకులు- మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, మల్లారెడ్డి, జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, నామా నాగేశ్వరరావులు నివాళులు అర్పించి.. భారతరత్న డిమాండ్ వినిపించారు. ఒక తెలుగు బిడ్డ ప్రపంచ ఖ్యాతి గడించిన వ్యక్తి ఎన్టీఆర్. అయన అదేశాల మేరకు అభిమానులు పని చేస్తున్నారు. ప్రధాని మంత్రి కావాల్సిన అర్హతలున్న వ్యక్తి. కానీ, కాస్తలో అది జరగలేదు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ వినిపించారు. శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం మా అదృష్టం. రాజకీయాల్లో, సినిమాలలో ఆయనకు తారాస్థాయిలో అభిమానులు ఉన్నారు. పేదల కష్టం తెలుసుకున్న నాయకుడు ఎన్టీఆర్ అని నామ నాగేశ్వరావు అన్నారు. భూస్వాముల పెత్తనం పక్కన పెట్టిన నాయకుడు ఎన్టీఆర్. మహా నాయకుడి స్ఫూర్తిని తీసుకోని సీఎం కెసీఆర్ నడుస్తున్నారు. దళిత బంధు అందులో భాగమే. నా వివాహానికి వచ్చారు.. నన్ను ముందు ఉండి నడిపిన వ్యక్తి ఎన్ టి ఆర్ అని గుర్తు చేసుకున్నారు మోత్కుపల్లి నర్సింహులు. -
ఎన్టీఆర్ గొప్ప మహానీయుడు, తెలుగుజాతి గర్వించదగ్గ నటుడు: రాజేంద్రప్రసాద్
-
ఎన్టీఆర్ ఘాట్‌లో కుటుంబసభ్యుల ఘన నివాళులు
-
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్
-
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన లక్ష్మీ పార్వతి
-
NTR Satha Jayanthi: నివాళులు అర్పించిన లక్ష్మీపార్వతి, జూ.ఎన్టీఆర్
ఎన్టీఆర్ శత జయంతి: నేడు దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటుడు నందమూరి తారక రామారావు శత జయంతి. ఆయన జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో లక్ష్మీపార్వతి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి మాట్లాడుతూ..‘‘స్వచ్ఛమైన రాజకీయాలు నడిపిన వ్యక్తి ఎన్టీఆర్. వెన్నుపోట్ల ద్వారా రాజ్యాన్ని తీసుకురావాలని ఎన్టీఆర్ ఎప్పుడూ అనుకోలేదు. రాబోయే తరాలకు ఎన్టీఆర్ ఆదర్శం’’ అంటూ వ్యాఖ్యానించారు. అంతకుముందు నటులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్‌లు కూడా ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అభిమానులు జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ శతజయంతి: పదే పదే తలచు తెలుగుజాతి -
బాలయ్య నోట శ్రీరామ దండకం.. వీడియో వైరల్
బాలయ్య నోట శ్రీరామ దండకం.. వీడియో వైరల్ విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు(ఎన్టీఆర్) జయంతి నేడు(మే 28). ఈ సందర్భంగా తారకరామారావుకు ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ గాత్ర నివాళులర్పించారు. ఎన్టీఆర్‌ను స్మరించుకుంటూ బాలకృష్ణ శ్రీరామ దండకాన్ని స్వయంగా ఆలపించారు. బాలయ్య నిర్మాణ సంస్థ నందమూరి బాలకృష్ణ ఫిల్మ్స్ ఈ వీడియోని తమ ట్విటర్లో విడుదల చేయగా, ఇది అభిమానులని ఎంతగానో అలరిస్తుంది. ఎంతో కష్టతరమైన సంస్కృత పదాలను ఈజీగా పలికేశారు బాలయ్య. సాహిత్యం పట్ల ఆయనకున్న అభిరుచికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక గతేడాది అత్యంత ‘శివ శంకరి ..’ పాడి, తన అభిమానులకు విందుగా విడుదల చేసిన విషయం తెలిసిందే. చదవండి : గుండె తల్లడిల్లిపోతోంది తాతా: ఎన్టీఆర్ ఎమోషనల్ ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: చిరంజీవి డిమాండ్ -
'బాబు.. విగ్రహం కళ్లలోకి చూసే దండ వేశావా'
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని టీడీపీ నిర్వహించిన మహానాడుపై విమర్శలు సంధించారు. ' ఎన్టీఆర్ జయంతి నాడు ఆయన విగ్రహం కళ్ళల్లోకి చూసే దండ వేశావా? నీ కంట్లో ఒక చుక్క అయినా నీరు వచ్చిందా? పాపం కదా...! ' అంటూ పేర్కొన్నారు. కాగా మరో ట్వీట్లో ' నిన్న, ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి చూస్తే.. పగిలిపోయిన సైకిల్ ట్యూబ్‌కు, లారీ టైరుకు గాలి కొట్టే మిషన్‌తో గాలి కొడుతున్నట్టు ఉంది. ఎవరి పిచ్చి వారికి ఆనందం..' అంటూ తెలిపారు. అన్నిటికీ సీఎంను తప్పుబట్టడం సరికాదు: రామ్‌మాధవ్ -
నిబంధనలు గాలికొదిలేసిన టీడీపీ నేతలు
-
నిబంధనలు గాలికొదిలేసిన టీడీపీ నేతలు
సాక్షి, అనంతపురం : ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జిల్లాలోని శింగనమలలో టీడీపీ నేతలు లాక్డౌన్ నిబంధనలు ఉల్లఘించారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని స్థానిక టీడీపీ నేతలైన బండారు శ్రావణి, ఎంఎస్ రాజు తమ బలం నిరూపించేందుకు పోటాపోటీగా జయంతి సమావేశాలు నిర్వహించారు. ఎంఎస్ రాజు ఆధ్వర్యంలో శింగనమల టీడీపీ కార్యాలయంలో నిర్వహించగా.. రామాలయంలో బండారు శ్రావణి రాజుకు పోటీగా సమావేశం ఏర్పాటు చేశారు. అయితే వీరువురు ఏర్పాటు చేసిన సమావేశాలకు హాజరైన టీడీపీ కార్యకర్తలు కనీస భౌతికదూరం పాటించకుండా గుంపులుగా ఒకేచోట చేరి కేక్ కట్ చేయడం గమనార్హం. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించిన టీడీపీ కార్యకర్తలపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. (ఎల్లో మీడియా తప్పుడు వార్తలు: మోపిదేవి) -
ఎన్టీఆర్ కీర్తి అజరామరం: చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: టీడీపీ వ్యవస్థాపకుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి నేడు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు శ్రద్దాంజలి ఘటించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు నేడు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ జయంతి పురస్కరించుకుని పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులర్పించారు. మెగాస్టార్ చిరంజీవి స్వర్గీయ ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ‘తెలుగు జాతి పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం.. తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం.. నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం.. వారితో కలిసి నటించడం నా అదృష్టం.. పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ..’ అంటూ ఎన్టీఆర్‌తో కలిసి దిగిన ఆనాటి ఫోటోను కూడా ట్విటర్లో షేర్ చేశారు. 1981లో చిరంజీవి, ఎన్టీఆర్‌లు కలిసి ‘తిరుగులేని మనిషి’ అనే చిత్రంలో నటించిన విషయం తెలసిందే. (ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ నివాళి) ‘మీరు లేని లోటు తీరనిది’ అని పేర్కొంటూ ‘మీ పాదం మోపక తెలుగ ధరిత్రి చిన్నబోతోంది.. మీ రూపు కానుక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా సదా మీ ప్రేమకు బానిసను’ అంటూ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. వీరితో పాటు నందమూరి కళ్యాణ్‌రామ్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, తదితర టాలీవుడ్ ప్రముఖులు ట్విటర్ వేదికగా ఎన్టీఆర్ ఘన నివాళులర్పించారు. (అక్కడకు వెళ్లకూడదని నిర్ణయం..) తెలుగు జాతి పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం. వారితో కలిసి నటించడం నా అదృష్టం. పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ... pic.twitter.com/LgSKsItxdO — Chiranjeevi Konidela (@KChiruTweets) May 28, 2020 My cinematic journey has had numerous highs! But the biggest honour, even greater than accolades and awards is surely having had the opportunity to work with the legendary NTR garu. I will forever cherish this and consider it my biggest achievement. 🙏🏻🙏🏻 #JoharNTR pic.twitter.com/Wnqo4h71D4 — Raghavendra Rao K (@Ragavendraraoba) May 28, 2020 మీరు లేని లోటు తీరనిది... pic.twitter.com/FA1uyWaWoS — Jr NTR (@tarak9999) May 28, 2020 -
ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ నివాళి
సాక్షి, హైదరాబాద్ : నేడు టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామరావు 97వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ నివాళులర్పించారు. గురువారం ఉదయం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న బాలకృష్ణ.. పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. బాలకృష్ణతో పాటుగా ఆయన సతీమణి వసుంధర, నందమూరి రామకృష్ణ, సుహాసిని.. ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ నటించిన సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయని తెలిపారు. ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలని అన్నారు. (చదవండి : ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లకూడదని నిర్ణయం..) మరోవైపు ఎన్టీఆర్ మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్‌రామ్‌లు కూడా ట్విటర్ వేదికగా ఆయనను గుర్తుచేసుకుని.. నివాళులర్పించారు. ‘మీరు లేని లోటు తీరనిది. మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక గుండె తల్లడిల్లిపోతోంది. పెద్దమనసుతో ఈ ధరిత్రని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను’ అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ‘మా ఖ్యాతి మీరే, మా కీర్తి మీరే.. ఓ విశ్వవిఖ్యాత, అందుకో మా జ్యోత’ అని కల్యాణ్‌రామ్ పోస్ట్ చేశారు. కాగా, కరోనా పరిస్థితుల నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు నేడు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
అక్కడకు వెళ్లకూడదని నిర్ణయం..
హైదరాబాద్ : టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు జయంతి(మే 28) సందర్భంగా ప్రతి ఏడాది కుటుంబ సభ్యులు, అభిమానులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు నివాళులర్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు గురువారం ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. పెద్ద ఎత్తున జనాలు అక్కడికి చేరుకుంటే కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇంట్లోనే ఉండి ఆ మహానుభావుడికి నివాళులర్పించనున్నట్టు ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లు తెలిపారు. -
ఎన్టీఆర్ జయంతిని వర్ధంతి చేసిన బాలయ్య
-
నాయకుల వల్లే టీడీపీ ఓటమి
నగరంపాలెం (గుంటూరు)/ సాక్షి, అమరావతి: తెలుగుదేశం ఓటమికి కారణం ఆ పార్టీ నాయకులేనని ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం అనంతరం ఎన్టీఆర్ జయంతి వేడుకల సందర్భంగా తొలిసారిగా మంగళవారం గుంటూరులోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చంద్రబాబు తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడిన పలువురు కార్యకర్తలు ఓటమికి కారణం రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవీఎంలే మోసం చేశాయన్న నాయకులు అయితే సభలో మాట్లాడిన నాయకులు మాత్రం ఈవీఎంల వల్లే పార్టీ ఓడిపోయిందని ఆరోపించారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మాట్లాడుతూ టీడీపీ ఓటమి అసహజమైనదని, ఎన్నికల్లో ఏదో జరిగిందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ సాంకేతికంగా మరోసారి నష్టం జరగకుండా దేశవ్యాప్తంగా ఎన్నికల సరళిలో మార్పు కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ.. ఓటమికి గల కారణాలపై సమీక్షించుకొని ముందుకు సాగుదామని కార్యకర్తలకు సూచించారు. నూతన ప్రభుత్వం కొలువుదీరి ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు కొంత అవకాశం ఇద్దామన్నారు. కాగా, గతంలో ఎన్నడూ టీడీపీ కార్యక్రమాల్లో కనిపించని భువనేశ్వరి ఈ సమావేశంలో పాల్గొని చివరివరకూ చంద్రబాబు పక్కనే కూర్చొని ఉండడం చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు, ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్, నేతలు యనమల రామకృష్ణుడు, డొక్కా మాణిక్యవరప్రసాద్, కాల్వ శ్రీనివాసరావు, నక్కా ఆనంద్‌బాబు, గల్లా అరుణకుమారి, యరపతినేని శ్రీనివాసరావు, దివ్యవాణి, సాదినేని యామిని తదితరులు పాల్గొన్నారు. 2024లో మంగళగిరి నుంచే పోటీ చేస్తా: లోకేష్ మంగళగిరి: ఓటమితో సంబంధం లేకుండా తెలుగుదేశంలో లోకేష్‌కి పార్టీ నాయకత్వాన్ని కట్టబెట్టేందుకు రంగం సిద్దమైంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన ఎన్టీఆర్ జయంతి కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హజరైన లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత తనదేనని చెప్పుకొచ్చారు. 2024లో మంగళగిరి నుంచి పోటీ చేసి విజయం సాధిస్తానని, ఎమ్మెల్సీగా ఉండి మంగళగిరి నియోజకవర్గంలో అందరికీ అండగా ఉంటానని చెప్పారు. ప్రభుత్వం చెయ్యకపోతే పార్టీ చెయ్యాలి ఎన్టీఆర్ జయంతినాడు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ను అలంకరించకపోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. గత ఏడాది తెలంగాణ ప్రభుత్వమే అలంకరణ ఏర్పాట్లు చేసిందని, ఈ ఏడాది కూడా చేస్తుందని ఆశించామని, దీనిపై తెలంగాణ టీడీపీ లేఖకూడా ఇచ్చిందని అన్నారు. దీనిపై చంద్రబాబు తెలంగాణ పార్టీ నేతలకు ఫోన్ చేసి ఇటువంటివి మళ్లీ పునరావృతం కారాదని సూచించారు. ప్రభుత్వానికి ముందుగా తెలియజేయాలని, వాళ్లు చేయకపోతే పార్టీ ద్వారా చేయాలని, లేదా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా శుభ్రం చేయాలని సూచించారు. ఇటువంటి విషయాల్లో ఎప్పుడూ సమాచార లోపం ఉండకూడదన్నారు. -
ఎన్టీఆర్ గొప్ప నటుడు
హైదరాబాద్ : నందమూరి తారకరామారావు గొప్ప నటుడని తమిళనాడు మాజీ గవర్నర్ డాక్టర్ కె.రోశయ్య అన్నారు. మంగళవారం ఎన్టీఆర్ విజ్ఞాన్ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ అస్సామీ రచయిత, మాజీ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ నగేన్ సాకియాకు ఎన్టీఆర్ జాతీయ సాహితీ పురస్కారం–2019 ప్రదానం చేశారు. అనంతరం రోశయ్య మాట్లాడుతూ, రాజకీయంగా వైరుధ్యం ఉన్నప్పటికి నటుడిగా ఎన్టీఆర్‌ను ఎంతో అభిమానించానని అన్నారు. ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కె.వి.రమణాచారి మాట్లాడుతూ, రాజకీయం విడదీస్తుందని.. సాహిత్యం మాత్రం అందరినీ కలుపుకుపోతుందని అన్నారు. ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ చైర్పర్సన్ ఎన్.లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరిట సేవచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా నృత్య గురువు ఇందిరా ముస్నూరి శిష్యబృందం చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీనటి జీవిత రాజశేఖర్, ఆర్టీఐ మాజీ కమిషనర్ పి.విజయ్‌బాబు, ప్రముఖ రచయిత్రి డాక్టర్ అనంతలక్ష్మి, చింత కిరణ్‌కుమార్, యువ కళావాహిని అధ్యక్షులు వై.కె.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ ఫ్యాన్ గాలికి టీడీపీ కొట్టుకు పోయింది
-
ఎన్టీఆర్ ఘోష నెరవేరింది: మోత్కుపల్లి
సాక్షి, హైదరాబాద్ : చంద్రబాబు నాయుడు ఘోరపరాజయంతో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఘోష నెరవేరిందని టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఆ మహానేత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చిన మోత్కుపల్లి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై ధ్వజమెత్తారు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించి, నిరంతరం పేదల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని తెలిపారు. తెలంగాణలో పార్టీ పెట్టి ఏ పనైనా తెలంగాణ నుంచే మొదలు పెట్టారన్నారు. దేశానికి ప్రధాని కావాల్సిన వ్యక్తిని చంద్రబాబు పొట్టన పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు వెన్నుపోటుతోనే ఎన్టీఆర్ ప్రాణాలు వదిలారని, ఆయన ప్రాణాలు తీయటమే కాకుండా బ్యాంక్ అకౌంట్స్ కూడా లాక్కున్నారని తెలిపారు. ఎన్టీఆర్ ఘోష ఇప్పుడు నెరవేరిందని, నిశ్చయ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ ఎన్టీఆర్ ఆశీస్సులు ఉంటాయన్నారు. అందరినీ మోసం చేసి ఏదో చేసినట్టు గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు.. ఎలా చిత్తు చిత్తుగా ఓడారని ప్రశ్నించారు. వైఎస్ జగన్ ఫ్యాన్ గాలికి టీడీపీ కొట్టుకు పోయిందన్నారు. ఏమాత్రం మనస్సాక్షి ఉన్న చంద్రబాబు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, ఎన్టీఆర్ కుటుంబానికి అప్పగించాలన్నారు. జగన్ దేవుని దయతో గెలిచానని చెప్పడం ఎంతో సంతోషమన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలో పేదలు, ఎస్సీ లు, బీసీ లకు మేలు జరగాలని ఆకాంక్షించారు. కేసీఆర్ రాజకీయాలకు పోకుండా ఎన్టీఆర్ జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని కోరారు. తనకు కేసీఆర్‌కు ఎంతో మందికి రాజకీయ బిక్ష పెట్టింది ఎన్టీఆరేనని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఎన్టీఆర్ ఘాట్‌ను అలంకరించరా?
సాక్షి, హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి వేడుకలపై ఆయన సతీమణి లక్ష్మీపార్వతి అసహనం వ్యక్తం చేశారు. కనీసం ఆయన ఘట్‌ను కూడా అలంకరించరా? అంటూ మండిపడ్డారు. మంగళవారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన ఘాట్‌కు వచ్చిన ఆమె నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ జయంతి వేడుకలకు సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్ర ప్రదేశంగా భావించాల్సిన టీడీపీ శ్రేణులు ఘాట్‌ను అలంకరించకుండా వదిలేసారన్నారు. ఆ మహానేత ఘాట్ వద్ద ఒక్క బ్యానర్‌ను కూడా ఏర్పాటు చేయరా? అని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన అన్యాయాలు, కుట్రల వల్ల తగిన శాస్త్రి జరిగిందన్నారు. తానేప్పుడు టీడీపీకి వ్యతిరేకం కాదని, కానీ చంద్రబాబు అనే వ్యక్తికి మాత్రం వ్యతిరేకమన్నారు. టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పులన్నిటిని నిశ్చయ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరిదిద్దుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
29న టీడీఎల్పీ సమావేశం
-
29న టీడీపీ శాసనసభాపక్ష సమావేశం
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశం ఈ నెల 29వ తేదీన నిర్వహించేందుకు ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. ఎన్నికల్లో పార్టీ దారుణ ఓటమితో ప్రతిపక్ష నేత బాధ్యతలు తీసుకునేందుకు సైతం చంద్రబాబు వెనకాడుతున్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతగా ఎవరిని ఎన్నుకుంటారనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి గెలిచిన పయ్యావుల కేశవ్ పేరు పరిశీలనలో ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే చంద్రబాబు కాదంటేనే ఆయనకు ఈ అవకాశం దక్కుతుందంటున్నారు. చంద్రబాబు ఆ పాత్రను పోషించేందుకు సిద్ధమైతే పయ్యావులకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నా రెండు పదవులు ఒకే సామాజికవర్గానికి దక్కినట్లవుతుందనే తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడి పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చాయి. మరోవైపు శాసనసభాపక్ష సమావేశాన్ని ఎక్కడ నిర్వహించాలనే దానిపై టీడీపీ నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది. గుంటూరు టీడీపీ కార్యాలయంలోగాని, మంగళగిరి సమీపంలోని హ్యాపీ రిసార్ట్స్‌లోగాని నిర్వహించే అవకాశం ఉంది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి మహానాడు స్థానంలో ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం ప్రతి సంవత్సరం మే 27వ తేదీ నుంచి మూడురోజులపాటు నిర్వహించే పార్టీ మహానాడును ఈసారి రద్దుచేస్తూ ఫలితాలకు ముందే చంద్రబాబు నిర్ణయించారు. ఓటమి ఛాయలు ముందే పసిగట్టి తెలివిగా మహానాడును రద్దు చేసి గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో 28వ తేదీన ఎన్టీఆర్ జయంతిని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడతారని పార్టీ వర్గాలు తెలిపాయి. -
వాస్తవ సంఘటనలతో...
సోమవారం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రాజకిరణ్ సినిమా పతాకంపై ‘విశ్వామిత్ర’ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు చిత్ర యూనిట్. సినిమాకు మాధవి అద్దంకి, రజనీకాంత్ యస్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ‘గీతాంజలి, త్రిపుర’ చిత్రాల దర్శకుడు రాజకిరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శక–నిర్మాత తేజ ఎన్టీఆర్ చిత్ర పటానికి నమస్కరించి, చిత్ర పటంపై క్లాప్‌నిచ్చి సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజకిరణ్ మాట్లాడుతూ–‘‘ఈ సినిమా స్విట్జర్లాండ్, అమెరికాలలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్నాం. సినిమా మొదటి ఫ్రేమ్ నుంచి ఎంటర్టైన్మెంట్తో పాటు క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. నా గత చిత్రాలైన ‘గీతాంజలి, త్రిపుర’ కథలలో ఎన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఈ సినిమాలో కూడా అదే థ్రిల్ మెయింటేన్ చేస్తుంది. జూన్ మూడవ వారం నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. మంచి నాయకా,నాయికలు దొరికారు. అతి త్వరలో మిగతా విషయాలు తెలియజేస్తాం’’ అన్నారాయన. ఈ కథ నచ్చి ‘జక్కన్న’ చిత్ర దర్శకుడైన ఆకెళ్ల వంశీకృష్ణ ఈ చిత్రానికి మాటలు రాస్తుండటం విశేషం. ఈ చిత్రానికి కెమెరా: అనిల్ భండారి, మాటలు: ఆకెళ్ల వంశీకృష్ణ, ఎడిటర్:ఉపేంద్ర, ఆర్ట్:చిన్నా. నిర్మాతలు: మాధవి అద్దంకి, కథ–స్క్రీన్‌ప్లే–దర్శకత్వం: రాజకిరణ్ -
దేశం గర్వించదగ్గ నటుడు ఎన్టీఆర్
సాక్షి, హైదరాబాద్: నందమూరి తారక రామారావు దేశం గర్వించదగ్గ నటుడని తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. ఎన్టీఆర్ గొప్ప గొప్ప పాత్రల్లో నటించి, జీవించి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. సోమవారం ఇక్కడి రవీంద్రభారతిలో ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్సలర్ డాక్టర్ రవ్వా శ్రీహరికి ఎన్టీఆర్ జాతీయ సాహితీ పురస్కారం ప్రదానం చేశారు. ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. రోశయ్య మాట్లాడుతూ అంతమంచి నటనాకౌశలం ఉన్న నటుడిని ఇక చూడబోమన్నారు. సినీ వినీలాకాశంలో అంతటి గొప్ప వ్యక్తి పేరుతో ఇచ్చే పురస్కారాన్ని భాషాసాహిత్యంలో శిఖరసమానుడు, మహామహోపాధ్యాయడు ఆచార్య రవ్వా శ్రీహరికి ఇవ్వటం సముచితంగా ఉందని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఎన్టీఆర్ ధోరణి, తన ధోరణి వేర్వేరైనా ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు వస్తే ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పేవాడినన్నారు. విశిష్ట అతిథి ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు మాట్లాడుతూ మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్య ప్రభావాలు చాలా విశిష్టమైనవని, వాటిని మనం గుర్తించలేకపోతున్నామని అన్నారు. వ్యక్తిత్వంలో ఎన్టీఆర్ భగవంతుడి స్వరూపమన్నారు. గౌరవ అతిథి, ప్రముఖ నటి డాక్టర్ జమున మాట్లాడుతూ ఎన్టీఆర్‌ను మించిన నటుడు మరొకరు లేరని, ఆయనతో కలసి నటించటం తన అదృష్టమని అన్నారు. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఎంతోమందికి రాజకీయ జీవితాలు కల్పించిన మహావ్యక్తి అని కొనియాడారు. ట్రస్టు చైర్పర్సన్ ఎన్.లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఎన్టీఆర్‌కు తాను భార్య కావటం ఎన్నో జన్మల అదృష్టమన్నారు. శ్రీహరి మాట్లాడుతూ ఎన్టీఆర్ సాహితీ పురస్కారాన్ని అందుకోవడం సంతోషంగా ఉందని, ఇది తనకు ప్రత్యేకమైనదని అన్నారు. కార్యక్రమంలో ఏపీ సమాచార హక్కు చట్టం పూర్వ కమీషనర్ పి.విజయబాబు, అవార్డు కమిటీ సభ్యులు డాక్టర్ అనుమాండ్ల భూమయ్య, డాక్టర్ ముక్తేవి భారతి, డాక్టర్ సూర్య ధనంజయ్, వైకే నాగేశ్వరరావు, నటి దివ్యవాణి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ జయంతి.. నారా లోకేశ్ ట్వీట్
సాక్షి, విజయవాడ: విఖ్యాత నటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన అభిమానులు, ప్రార్టీ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ కుటుంబీకుల్లో అధికులు సోమవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి శ్రద్ధాంజలిఘటించారు. విజయవాడలో సీఎం చంద్రబాబు.. రెండో రోజు మహానాడుకు వెళుతూ.. దారిమధ్యలో పటమట వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి సరిపెట్టారు. కాగా, ఎన్టీఆర్ జయంతి నాడు కూడా మహానాడులో చంద్రబాబు భజనే వినిపించడం గమనార్హం. లోకేశ్ ట్వీట్.. ఆసక్తికర వ్యాఖ్యలు: ‘జయంతి శుభాకాంక్షలు’ చెప్పడంలో (గతంలో)సంచలనాలు సృష్టించిన నారా లోకేశ్.. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఒకింత జాగ్రత్త వహించారు. ‘‘సామాన్యుడిగా పుట్టి కఠోరశ్రమ, క్రమశిక్షణలు కలబోసిన ఆకర్షణీయ వ్యక్తిత్వంతో, ప్రతిభతో సమాజాన్ని అత్యంత ప్రభావితం గావించిన అసామాన్యులు నందమూరి తారకరామారావుగారు. ప్రతి తెలుగువాడు గర్వించేలా చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని స్మరించుకుని స్ఫూర్తిని పొందుదాం’’ అని లోకేశ్ ట్వీట్ చేశారు. ఇక మహానాడులో ప్రసంగించిన ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ రోజుల్లో నాన్నగారు ఏమనేవారంటే..: ‘‘చిన్నప్పుడు ఎండాకాలం సెలవుల్లో మా నాన్న నన్ను ఊరికి పంపేవారు. అలా పంపేటప్పుడు.. ‘పల్లెకి సేవ చేస్తే పరమాత్ముడికి సేవచేసినట్లే..’ అని పదేపదే గుర్తుచేసేవారు. ఆ విధంగా చిన్నవయసులోనే నాకు పంచాయితీరాజ్ మంత్రిగా పల్లెలకు సేవచేసే అవకాశం దక్కింది. స్వాతంత్ర్యం తరువాత 70 ఏళ్లలో చేయలేని పనులన్నీ గడిచిన 4ఏళ్లలో పూర్తిచేశాం. మేము వేసిన సీసీ రోడ్ల మీద ప్రతిపక్ష నాయకులు నడుస్తున్నారు. ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తున్న నాపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. వాళ్లకు దమ్ము,ధైర్యం ఉంటే.. నేను ఎక్కడ, ఎలా తప్పు చేశానో ఆధారాలతో సహా నిరూపించాలి. తన సొంత నియోజకవర్గంలో కట్టాల్సిన సుజల స్రవంతి పథకాన్ని ఉద్దానంకు తరలించిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుది. ఆయన 68 ఏళ్ల వయసులోనూ 24 ఏళ్ల యువకుడిలా పరుగులు పెడుతున్నారు. 32 ఏళ్ల యువకుడినైన నేనే ఆయన వేగాన్ని అందుకోలేకపోతున్నాను.. ’’ అని లోకేశ్ చెప్పుకొచ్చారు. సామాన్యుడిగా పుట్టి కఠోరశ్రమ, క్రమశిక్షణలు కలబోసిన ఆకర్షణీయ వ్యక్తిత్వంతో, ప్రతిభతో సమాజాన్ని అత్యంత ప్రభావితం గావించిన అసామాన్యులు నందమూరి తారకరామారావుగారు. ప్రతి తెలుగువాడు గర్వించేలా చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని స్మరించుకుని స్ఫూర్తిని పొందుదాం. — Lokesh Nara (@naralokesh) 28 May 2018 -
చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్/విజయవాడ: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించేందుకు వచ్చిన టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు కన్నీటిపర్యంతమయ్యారు. పార్టీ ప్రస్తుత అధినేత చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు విజయవాడలో జరుగుతోన్న టీడీపీ మహానాడులో కలకలంరేపాయి. ఆ వెంటనే చంద్రబాబు.. తెలంగాణ నేతలచేత మోత్కుపల్లిని తిట్టించారు. నట చక్రవర్తి చంద్రబాబు: ‘‘ఎన్టీఆర్ మహోన్నత ఆశయంతో టీడీపీని స్థాపించారు. ఆయన వల్లే నాలాంటి పేదలు ఎంతోమంది ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాం. అంతటి మహనీయుడిపైనే కుట్రలుపన్నిన నీచుడు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ దగ్గర్నుంచి టీడీపీ జెండాను చంద్రబాబు దొంగిలించాడు. మా నాయకుడి మరణానికి కారకుడు కూడా నటచక్రవర్తి చంద్రబాబే. సరిగ్గా ఎన్టీఆర్‌పై చేసినట్లే కేసీఆర్‌పైనా కుట్రలు చేసేందుకు చంద్రబాబు యత్నించారు. కానీ పట్టపగలే అడ్డంగా దొరికిపోయారు. ఓటుకు కోట్లు కేసులో రేవంత్ రెడ్డి, చంద్రబాబులు ముద్దాయిలు. తన అవసరాల కోసం మాల, మాదిగల మధ్య చిచ్చుపెట్టిన బాబు.. ఇప్పుడు బీసీలకు, కాపులకు మధ్య కొట్లాట పెడుతున్నారు. చివరకు బ్రాహ్మణులు మధ్య చిచ్చురేపిన మేధావి. నిజంగా ఈ వ్యవస్థకు చంద్రబాబు పెద్ద ముప్పు.. నాకు గవర్నర్ పదవి ఇస్తానని..: యూటర్న్ల మీద యూటర్న్లు తీసుకున్న చంద్రబాబు నాయుడు హోదా పేరెత్తడానికి కొంచమైనా సిగ్గుపడాలి. చరిత్రలో చంద్రబాబుకంటూ ఓక నల్లపేజీ ఉంటుంది. ఈ దుర్మార్గుడిని పాతళంలోకి తొక్కడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నాకు గవర్నర్ పదవి లేదంటే రాజ్యసభ ఎంపీ పదవి ఇస్తానని మాటిచ్చాడు. కానీ రాజ్యసభ సీట్లను వంద కోట్ల రూపాయలకు అమ్ముకున్నారు. ఎన్టీఆర్ నుంచి పార్టీని, జెండాను దొంగిలించిన బాబుతో పోల్చితే.. సొంతగా పార్టీలు పెట్టుకున్న వైఎస్ జగన్, పవన్ కల్యాణ్‌లు నిజమైన మగాళ్లు. ఏపీ ప్రజలు ఈసారి చంద్రబాబును ఓడించాలి.. పార్టీని నందమూరి కుటుంబానికి ఇచ్చెయ్: ఎన్టీఆర్‌తోపాటు ఆయన కుటుంబీకులను కూడా చంద్రబాబు మోసం చేశాడు. ముఖ్యమంత్రి అయ్యేదాకా దగ్గుబాటి దంపతులను పక్కన ఉంచుకున్న చంద్రబాబు.. ఆ తర్వాత కుట్రలు చేశారు. నందమూరి హరికృష్ణనూ పార్టీ నుంచి గెంటేశారు. చివరికి బాలకృష్ణను తన పక్కన పెట్టుకున్నాడు. మోసకారి చంద్రబాబు తక్షణమే టీడీపీ అధ్యక్షపదవికి రాజీనామా చేసి, పార్టీని నందమూరి కుటుంబానికి అప్పగించాలి...’’ అంటూ మోత్కుపల్లి గర్జించారు. మహానాడులో కలకలం: టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలతో మహానాడులో కలకలం రేగింది. సభా ప్రాంగణమంతా దీని గురించే చర్చ జరిగింది. ఎన్టీఆర జయంతినాడే తనపై ఇంత తీవ్రస్థాయిలో దాడిజరడంతో చంద్రబాబు అప్రమత్తమయ్యారు. హుటాహుటిన తెలంగాణ తెలుగుదేశం నాయకులను రంగంలోకి దించి.. మోత్కుపల్లిని తిట్టించేప్రయత్నం చేశారు. బాబు ఆదేశాలతో మహానాడు ప్రాంగణంలోనే సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మీడియాతో మాట్లాడారు. పార్టీలో ఉంటూ ఇంతటి తీవ్ర వ్యాఖ్యలు చేయడం మోత్కుపల్లికి తగదని, ఇష్టముంటే టీఆర్ఎస్లోకి వెళ్లిపోవచ్చని సండ్ర అన్నారు. ‘మరి మోత్కుపల్లిపై చర్యలు తీసుకుంటారా?’ అన్న ప్రశ్నకు మాత్రం సండ్ర సూటిగా సమాధానం చెప్పలేదు. ‘‘చాలా సందర్భాల్లో కొన్ని జరుగుతూ ఉంటాయి.. అన్నింటిపైనా చర్యలు తీస్కోలేము’’ అని వ్యాఖ్యానించారు. -
చంద్రబాబుపై మోత్కుపల్లి సంచలన ఆరోపణలు
-
ప్రపంచంలో ఏ కొడుకూ చేయలేదు: బాలకృష్ణ
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ తర్వాత టీడీపీని ఘనమైన శైలిలో నడుపుతున్నది చంద్రబాబేనని సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కితాబిచ్చారు. రాజకీయ జీవితంలో ఎన్నో సంక్షోభాలు చూసిన చంద్రబాబు ఇప్పుడు నమ్మకద్రోహం-కుట్రరాజకీయాలపై ధర్మపోరాటం చేస్తున్నారని, 68ఏళ్ల వయసులోనూ రాష్ట్రం కోసం అహర్నిషలూ పాటుపడుతున్నారని కీర్తించారు. విజయవాడలో జరుగుతోన్న టీడీపీ మహానాడు రెండో రోజైన సోమవారం ఆయన ప్రసంగించారు. సహజశైలికి భిన్నంగా బాలయ్య ప్రసంగం చప్పగా, సాదాసీదాగా సాగడం గమనార్హం. ఏ కొడుకుకూ దక్కని అదృష్టం నాది: ‘‘ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జ్ఞాపకార్థం మహానాడును జరుపుకొంటున్నాం. భావితరాలకు ఎన్టీఆర్ గుర్తుండేలా ఆయన జీవితచరిత్రను సినిమాగా రూపొందిస్తున్నాం. ఏ కొడుకూ ఇంతవరకు తండ్రి పాత్రను చేయలేదు. అలా చేసే అదృష్టం నాకే దక్కింది. సామాన్యుడికి పట్టెడన్నం పెట్టాలన్న ఉద్దేశంతో ఎన్టీఆర్ పార్టీని స్థాపించారు. ఆయన తర్వాత చంద్రబాబుగారు ఘనమైన శైలిలో టీడీపీని ముందుకు నడిపిస్తున్నారు. పార్లమెంట్ తలుపులు మూసి, అశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టారు. హామీల సాధన కోసమే చంద్రబాబు నమ్మకద్రోహం-కుట్రరాజకీయాలపై ధర్మపోరాటం చేస్తున్నారు. దగ్గర్లోనే ఎన్నికలున్నాయి.. నమ్మకద్రోహులకు బుద్ధిచెప్పే సమయం ఆసన్నమైంది’’ అని బాలకృష్ణ అన్నారు. -
ఎన్టీఆర్ చరిత్రను పాఠ్యాంశాలుగా చేర్చాలి: హరికృష్ణ
సాక్షి, హైదరాబాద్ : దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన కుటుంబసభ్యులు నివాళులు అర్పించారు. నందమూరి హరికృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ ఘాట్‌లో సమాధి వద్ద నివాళులు అర్పించి, స్మరించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హరికృష్ణ.. తెలుగు ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన గొప్ప నేత అని కొనియాడారు. నేడు ప్రతి ఇంట ఒక బిడ్డ ఎన్టీఆర్‌లా ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారని ఆయన అన్నారు. తనకు, తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ జయంతి ఒక పర్వదినం లాంటిదని హరికృష్ణ వెల్లడించారు. ఎన్టీ రామరావు గురించి చెప్పడానికి తరాలు, యుగాలు సరిపోవని తెలిపారు. బడుగు బలహీన వర్గాల ఉన్నతి, అభివృద్ధి కోరకున్న గొప్పనాయకుడు ఎన్టీఆర్ అని గుర్తు చేసుకున్నారు. ఎందరో మహానుభావుల జీవిత చరిత్రలు పాఠ్యాంశాలుగా ఉన్నాయని, అలాగే ఎన్టీఆర్ జీవితంలోని కొన్ని ముఖ్యఘట్టలను తెలుగు రాస్ట్రాల్లో పాఠ్యాంశాలుగా చేర్చాలని తెలుగు ప్రభుత్వాలను కోరారు. తెలుగువారికి ఒక భాష ఉందని నిరూపించారని, తెలుగు రాష్ట్ర ప్రజలు తరాలు చెప్పుకొనే సేవ చేశారని హరికృష్ణ అన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఎర్రకోటపై జెండా ఎగరవేసిన మహోన్నత వ్యక్తి అని చెప్పారు. ఒకప్పుడు పార్టీలో రథసారధిగా ఉన్న మీరు మహానాడుకు ఎందుకు వెళ్లలేకపోయారన్న ప్రశ్నకు సమాధానం దాటవేశారు. హరికృష్ణ తనయులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్, ఇతర కుటుంబ సభ్యులు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఏపీకి ప్రత్యేక హోదా ఏమైంది.. హరికృష్ణ ఫైర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తామన్న వాళ్లు ఏం చేస్తున్నారో తెలియడం లేదని రాజ్యసభ మాజీ సభ్యుడు, సినీనటుడు నందమూరి హరికృష్ణ మండిపడ్డారు. నందమూరి వంశ వీరాభిమానులు, తెలుగువాళ్లు ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా గురించి పోరాడాల్సిన తరుణం ఆసన్నమైందని, అలా పోరాడిన రోజునే అన్నగారికి ఘనంగా నివాళులు అర్పించినట్లవుతుందని ఆయన అన్నారు. ఎన్టీ రామారావు 94వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో ఆయనకు నివాళులు అర్పించిన అనంతరం హరికృష్ణ మీడియాతో మాట్లాడారు. ఆనాడు ఇస్తామని మోసం చేశారు, తెస్తామన్నవాళ్లు ఏం చేస్తున్నారో తెలియడం లేదని, అందరం కలిసి పోరాడి హోదా తెస్తేనే మనం సిసలైన తెలుగు బిడ్డలం అవుతామని ఆయన అన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒకరు చొప్పున బయటకు వచ్చి సమరం చేయాలన్నారు. తెలుగువాడన్న ప్రతి ఒక్కరు ప్రత్యేక హోదా కోసం శపథం చేసి పూనుకోవాలన్నారు. అప్పుడే అన్నగారి ఆశయం నెరవేరుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ మహానాడు కంటే తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు నివాళులర్పించడమే గొప్ప కార్యక్రమమని హరికృష్ణ స్పష్టం చేశారు. తెలుగు జాతి మనుగడ ఉన్నంతకాలం ఎన్టీఆర్ చిరస్థాయిగా ఉంటారని.. తెలుగువారి గుండెల్లో గుడికట్టుకున్న మహానుభావుడని కొనియడారు. తిరుపతిలో టీడీపీ తలపెట్టిన మహానాడు కార్యక్రమానికి హరికృష్ణ గైర్హాజరైన విషయం తెలిసిందే.