
చైతన్యకృష్ణ, జయకృష్ణ
స్వర్గీయ మహానటుడు నందమూరి తారక రామారావు వారసులు చాలా మంది టాలీవుడ్‌లో రాణిస్తున్నారు. తాజాగా మరో వారసుడు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడు. ఎన్టీఆర్ మనవడు, నందమూరి జయకృష్ణ తనయుడు చైతన్యకృష్ణ హీరోగా పరిచయం అవుతున్నారు. బసవతారకరామ క్రియేషన్స్ బ్యానర్‌పై నందమూరి జయకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు వంశీ కృష్ణ ఆకెళ్ళ దర్శకుడు.
శనివారం బసవతారకరామ బ్యానర్, తొలి చిత్రం ఫస్ట్ లుక్‌ను నందమూరి బాలకృష్ణ రిలీజ్ చేసి, మాట్లాడుతూ – ‘‘మా అమ్మ, నాన్నగార్ల పేర్లు కలిసొచ్చేలా ‘బసవతారకరామ’ అని బ్యానర్‌కు పేరు పెట్టడం సంతోషంగా ఉంది. ఇది మా అన్నదమ్ములందరి బ్యానర్. నాన్నగారికి ఎంతో ఇష్టమైన చైతన్య ఈ బ్యానర్‌లోని సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నందుకు హ్యాపీ. అన్నయ్య జయకృష్ణ, దర్శకుడు వంశీకి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘డిఫరెంట్ కాన్సెప్‌్టతో ఈ సినిమా రూపొందుతోంది’’ అన్నారు జయకృష్ణ. ‘‘మా నాన్నగారు స్థాపించిన బసవతారకరామ క్రియేషన్స్’ను బాబాయ్ బాలకృష్ణగారు లాంచ్ చేసి, ఆశీస్సులు అందించడం హ్యాపీగా ఉంది’’ అన్నారు చైతన్య కృష్ణ.
రెండు షేడ్స్
కల్యాణ్‌రామ్ హీరోగా వశిష్ఠ్ దర్శకత్వంలో కె. హరికృష్ణ నిర్మించిన చిత్రం ‘బింబిసార’. ఈ చిత్రంలో కేథరిన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లు. ఈ సినిమా ఆగస్టు 5న రిలీజ్ కానుంది. ఎన్టీఆర్ శతజయంతి(మే 28) సందర్భంగా ‘బింబిసార’ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో మగధ రాజు బింబిసారుడిగా, మోడ్రన్ కుర్రాడిగా రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో కనిపిస్తారు కల్యాణ్ రామ్. ఈ సినిమాకు సంగీతం: ఎమ్‌ఎమ్ కీరవాణి.
Comments
Please login to add a commentAdd a comment