టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌తో చంద్రబాబు(పాత ఫొటో) (ఇన్‌సెట్‌లో బాలకృష్ణ)
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ తర్వాత టీడీపీని ఘనమైన శైలిలో నడుపుతున్నది చంద్రబాబేనని సినీనటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కితాబిచ్చారు. రాజకీయ జీవితంలో ఎన్నో సంక్షోభాలు చూసిన చంద్రబాబు ఇప్పుడు నమ్మకద్రోహం-కుట్రరాజకీయాలపై ధర్మపోరాటం చేస్తున్నారని, 68ఏళ్ల వయసులోనూ రాష్ట్రం కోసం అహర్నిషలూ పాటుపడుతున్నారని కీర్తించారు. విజయవాడలో జరుగుతోన్న టీడీపీ మహానాడు రెండో రోజైన సోమవారం ఆయన ప్రసంగించారు. సహజశైలికి భిన్నంగా బాలయ్య ప్రసంగం చప్పగా, సాదాసీదాగా సాగడం గమనార్హం.
ఏ కొడుకుకూ దక్కని అదృష్టం నాది: ‘‘ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జ్ఞాపకార్థం మహానాడును జరుపుకొంటున్నాం. భావితరాలకు ఎన్టీఆర్ గుర్తుండేలా ఆయన జీవితచరిత్రను సినిమాగా రూపొందిస్తున్నాం. ఏ కొడుకూ ఇంతవరకు తండ్రి పాత్రను చేయలేదు. అలా చేసే అదృష్టం నాకే దక్కింది. సామాన్యుడికి పట్టెడన్నం పెట్టాలన్న ఉద్దేశంతో ఎన్టీఆర్ పార్టీని స్థాపించారు. ఆయన తర్వాత చంద్రబాబుగారు ఘనమైన శైలిలో టీడీపీని ముందుకు నడిపిస్తున్నారు. పార్లమెంట్ తలుపులు మూసి, అశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్‌ను విడగొట్టారు. హామీల సాధన కోసమే చంద్రబాబు నమ్మకద్రోహం-కుట్రరాజకీయాలపై ధర్మపోరాటం చేస్తున్నారు. దగ్గర్లోనే ఎన్నికలున్నాయి.. నమ్మకద్రోహులకు బుద్ధిచెప్పే సమయం ఆసన్నమైంది’’ అని బాలకృష్ణ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment