సాక్షి, విశాఖపట్నం: నారా లోకేష్ పెళ్లి అంశంపై మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేనరికం సంబంధాలు మంచివి కాదని చంద్రబాబు అనేవారు. నాన్సెన్స్ అని నన్ను తిట్టేవారు. కానీ, తర్వాత బాలకృష్ణ కూతురును నారా లోకేష్‌కు ఇచ్చి చంద్రబాబు వివాహం చేశారని చెప్పుకొచ్చారు.
కాగా, యార్లగడ్డ శుక్రవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా టీడీపీ నేతలు ఓవరాక్షన్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఆకాశమంత ఎత్తు ఎదిగారు. ఆకాశం మీద ఉమ్ము వేయాలని చూస్తే వారి మొహం మీదనే పడుతుంది. తారక్ ప్లెక్సీలు తొలగిస్తే ఆయనకు ఏమీ నష్టం లేదు. తారక్‌పై ఎవరు విమర్శలు చేస్తే అది వారికే నష్టం.
గతంలో బాలకృష్ణ కూతురును లోకేష్‌కు ఇచ్చి పెళ్లి చేస్తున్నారా? అని చంద్రబాబును అడిగాను. నాన్సెన్స్ అని నన్ను చంద్రబాబు తిట్టారు. మేనరికం సంబంధాలు మంచివి కాదని చెప్పారు. తర్వాత లోకేష్‌కు బాలకృష్ణ కూతురినిచ్చి చంద్రబాబు వివాహం చేశారు.
అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ మంచి నిర్ణయం. అంబేడ్కర్ దేశానికి ఒక ఐకాన్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంటే నాకు వ్యక్తిగతంగా అభిమానం. సీఎం జగన్‌పై పిచ్చి కేసులు పెట్టారు. లక్ష కోట్ల అవినీతిని అని తప్పుడు ప్రచారం చేశారు. సీఎం జగన్ ఒక హీరో. నేను మంచి చేస్తేనే ఓటు వేయండని ధైర్యంగా చెప్పిన నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమే. అలాంటి నేత దేశంలో మరొకరు లేరు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment