Visakhapatnam Assembly Constituencies
-
వైఎస్సార్సీపీ అరకు పార్లమెంట్ సమన్వయకర్త
అడ్డతీగల: వైఎస్సార్సీపీ అరకు పార్లమెంట్ సమన్వయకర్త ప్రస్తుత పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్ళ భాగ్యలక్ష్మి సోమవారం రాత్రి రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మిని, ఎమ్మెల్సీ అనంతబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఎల్లవరంలోని ఎమ్మెల్సీ అనంతబాబు కార్యాలయంలో ఇరువురు నేతలను భాగ్యలక్ష్మి కలిశారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేసి మరలా సీఎం జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో సంక్షేమ సర్కారుని తెచ్చుకోవాలని నేతలు నిర్ణయించారు. రంపచోడవరం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. కొయ్యూరు ఎంపీపీ బడుగు రమేష్, కొయ్యూరు మండల పార్టీ అధ్యక్షులు జల్లి బాబులు, జేసీఎస్ కన్వినర్ సుధాకర్, నాయకులు సత్తిబాబు పాల్గొన్నారు. -
ఆ 23 మంది బలైనారా!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: నమ్మించి మోసగించడమే జన్మ లక్షణమైన టీడీపీ అధినేత చంద్రబాబును రాజకీయంగా వెంటాడే సంఖ్య 23. నమ్మకద్రోహానికి ప్రజలు విధించిన శిక్ష ఈ 23. ఈ సంఖ్య వెనుక కథ చాలా పెద్దదే కాదు.. అత్యంత హేయమైంది కూడా. 2014లో... అన్నీ తానై.. తనవారిని గెలిపించుకున్న ఎంఎల్ఏల్లో 23 మంది, ఎంపీల్లో ముగ్గురు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నమ్మకద్రోహం చేశారు. వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అయిన చంద్రబాబు నాయుడు విసిరిన నోట్ల కట్టలకు లొంగిపోయారు. పదవులకు ఆశపడ్డారు. భవిష్యత్తును ఊహించుకుని పార్టీ ఫిరాయించారు. ఆ తరువాత 2019 నాటికి చంద్రబాబు కాటుకు వారంతా రాజకీయంగా బలయ్యారు. చంద్రబాబుకూ ఆ ఎన్నికల్లో 23 సంఖ్య శాపమై నిలిచి,, చరిత్రగా మారింది. ఆనాడు రాజకీయ వెన్నుపోటుకు పాల్పడిన వారు నేడేం చేస్తున్నారు? పశ్చాత్తాపం పడిన వారెందరు? రాజకీయంగా కనుమరుగైన వారెవరు? కుంగిపోయి కునారిల్లుతున్న వారి భవిష్యత్తు ఏమిటి?.. వివరించే కథనమే ఇది. 23 మందిలో అద్దంకి నుంచి పోటీచేసిన గొట్టిపాటి రవికుమార్ మినహా తక్కిన 22 మంది మాజీలయ్యారు. వీరిలో ఎస్సీ వర్గాలకు చెందిన ఉప్పులేటి కల్పన (పామర్రు), పాలపర్తి డేవిడ్‌రాజు (యర్రగొండపాలెం), టి. జయరాములు (బద్వేలు), మణిగాంధీ (కోడుమూరు), మైనార్టీ వర్గానికి చెందిన అత్తార్ ఛాంద్బాషా (కదిరి), ఎస్వీ మోహన్‌రెడ్డి (కర్నూలు) వరుపుల సుబ్బారావు (ప్రత్తిపాడు)కు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు టికెట్లు ఇవ్వలేదు. రాయలసీమలో గుర్తింపు కలిగిన భూమా నాగిరెడ్డి కుటుంబం పరిస్థితి రాజకీయంగా దుర్భరంగా మారింది. ఆళ్లగడ్డ నుంచి భూమా అఖిలప్రియ టికెట్ కోసం తంటాలు పడుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో గెలుపొందిన భూమా బ్రహ్మానంద రెడ్డిని కొన్ని నెలల కిందటి వరకు నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగించిన చంద్రబాబు ఇప్పుడు ఎం.డి.ఫరూక్‌కు బాధ్యతలు అప్పగించారు. వైఎస్ కుటుంబంతో అత్యంత సాన్నిహిత్యం ఉన్న సి.ఆదినారాయణరెడ్డి కుటుంబీకులదీ అదే దుస్థితి. గత ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి వైఎస్ అవినాష్‌రెడ్డి చేతిలో ఓటమిపాలైన నాలుగు రోజుల్లోనే బీజేపీ తీర్థం పుచ్చుకోక తప్పలేదు. ముగ్గురు ఎంపీల దుస్థితి అంతా ఇంతా కాదు 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందిన ఎంపీలలో ముగ్గురు ప్రలోభాలకు లొంగి టీడీపీలో చేరి రాజకీయంగా దెబ్బతిన్నారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి టీడీపీలో చేరినా టికెట్ నిరాకరించడంతో జనసేన నుంచి నామినేషన్ వేశారు. ఆ తరువాత అనారోగ్యంతో మృతి చెందారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత పరిస్థితీ అంతే. ఆమెకు టికెటు దక్కకపోవడంతో పార్టీ పెట్టి చేతులు కాల్చుకున్నారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతూ అరకు లోక్‌సభ పరిధిలో పర్యటిస్తున్నారు. కర్నూలులో బుట్టా రేణుక పార్టీ మారినా ఆమెకు టీడీపీ టికెట్ ఇవ్వలేదు. ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు. కందుకూరు: పోతుల రామారావు తన సామాజిక వర్గానికి చెందిన పోతుల రామారావు టీడీపీలోకి ఫిరాయించినందుకు పొగాకు, గ్రానైట్ వ్యాపారాలకు సంబంధించి చంద్రబాబు భారీగానే లబ్ధి చేకూర్చారన్నది బహిరంగ రహస్యం. 2019లో టికెట్ ఇచ్చినా వైఎస్సార్సీపీ అభ్యర్థి మానుగుంట మహీధర్‌రెడ్డి చేతిలో 14 వేల పైచిలుకు ఓట్లతో పోతుల ఓడిపోయారు. ఆ తరువాత ఆయన క్రమంగా నియోజకవర్గానికి దూరమయ్యారు. పార్టీ అధిష్టానం సైతం రామారావును పూర్తిగా పక్కన పెట్టేసింది. యర్రగొండపాలెం (ఎస్సీ): పాలపర్తి డేవిడ్‌రాజు టీడీపీలోకి ఫిరాయించేందుకు పెద్దమొత్తంలో ముట్టజెపుతానని, వెలిగొండ ప్రాజెక్టులో ప్యాకేజీలిచ్చి భారీగా లబ్ధి చేకూర్చుతానని నమ్మబలికిన బాబు మాట తప్పారని డేవిడ్‌రాజు వాపోని రోజంటూ లేదని ఆయన సన్నిహితులు గుర్తుచేస్తుంటారు. 2019 ఎన్నికల్లో సీటు తిరస్కరించడంతో తాను వైఎస్సార్సీపీలో చేరినట్లు అప్పట్లోనే డేవిడ్‌రాజు ప్రకటించుకున్నారు. బాబు మాటలను నమ్మి మోసపోయిన ఆయన తాజాగా కాంగ్రెస్ వైపు దృష్టి సారించారనేది సమాచారం. గిద్దలూరు: ముత్తుముల అశోక్‌రెడ్డి 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి అన్నా రాంబాబు చేతిలో దాదాపు 79 వేలకు పైగా ఓట్లతో ఓడిపోయారు. రానున్న ఎన్నికల్లో పోటీకి సిద్ధం అంటున్నప్పటికీ జనసేనకు టికెట్ కేటాయిస్తారనే చర్చ జరుగుతోంది. జనసేన నుంచి తానే పోటీ చేయనున్నట్లు ఆమంచి స్వాములు ప్రకటించుకోవడంతో ముత్తుముల రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. పాడేరు (ఎస్టీ): గిడ్డి ఈశ్వరి 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన గిడ్డి ఈశ్వరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి చేతిలో దాదాపు 43 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. పాడేరు నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్నప్పటికీ ఆమెకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీలో అనేక వర్గాలు పనిచేస్తున్నాయి. గిడ్డి ఈశ్వరికి సీటు దక్కుతుందా లేదా అన్నది అనుమానమే. పాతపట్నం– కలమట వెంకటరమణ టీడీపీలోకి ఫిరాయించిన కలమట 2019 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నప్పటికీ రానున్న ఎన్నికల్లో టికెట్ అనుమానాస్పదమే. మామిడి గోవిందరావు టికెట్ కోసం గట్టి పోటీ ఇస్తున్నారు. అరకు (ఎస్టీ): శ్రావణ్‌కుమార్ 2014లో వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందిన కిడారి సర్వేశ్వరరావు టీడీపీలో చేరిన రెండేళ్ల తర్వాత మావోయిస్టుల చేతిలో హతమయ్యారు. అనంతరం ఆయన కుమారుడు కిడారి శ్రావణ్ కుమార్‌కు ఎన్నికలకు ఆరు నెలల ముందు చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారు. 2019 ఎన్నికల్లో అరకు అసెంబ్లీ నుంచి పోటీచేసిన శ్రావణ్‌కుమార్ మూడో స్థానంలో నిలిచారు. రెండేళ్ల కిందట కిడారిని నియోజకవర్గ ఇన్చార్జిగా తొలగించి అరకు పార్లమెంట్ సమన్వయకర్తగా నియమించి చంద్రబాబు ఝలక్ ఇచ్చారు. గతంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన సివేరి దొన్ను దొరను అరకు అసెంబ్లీ ఇన్చార్జిగా నియమించారు. ఈయనే అసెంబ్లీ బరిలో ఉండవచ్చంటున్నారు. రంపచోడవరం (ఎస్టీ): వంతల రాజేశ్వరి టీడీపీలో చేరిన వంతల రాజేశ్వరి 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి చేతిలో 39 వేలకు పైగా ఓట్లతో ఓటమిపాలయ్యారు. నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న రాజేశ్వరికి వ్యతిరేకంగా పనిచేస్తూ గొర్లె సునీత , కారం పోచమ్మ , మిరియాల శిరీష తదితరులు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు సైతం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. గూడూరు (ఎస్సీ): పాశం సునీల్ కుమార్ టీడీపీ కండువా కప్పుకున్న పాశం సునీల్ కుమార్ 2019లో పోటీచేసి వి.వరప్రసాద్ చేతిలో 45 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. గూడూరు నియోజకవర్గ ఇన్‌చార్‌్జగా కొనసాగుతున్న సునీల్‌కు 2024 ఎన్నికల్లో టికెట్ గ్యారంటీ లేదు. మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి పోటీపడుతున్నారు. మరోవైపు జనసేన కూడా ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఆశిస్తోంది. జగ్గంపేట– జ్యోతుల నెహ్రూ సీనియర్ నాయకుడైన జ్యోతుల నెహ్రూ 2019లో టీడీపీ టికెట్ దక్కించుకున్నప్పటికీ జ్యోతుల చంటిబాబు చేతిలో 23 వేలకు పైగా ఓట్లతో ఓడిపోయారు. నియోజకవర్గ ఇన్చార్జిగా నెహ్రూ కొనసాగుతున్నప్పటికీ జగ్గంపేట నుంచి పోటీకి జనసేన పట్టుపడుతోంది. ఆ పార్టీ ఇన్చార్జి పాఠంశెట్టి సూర్యచంద్రరావు సీటు కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్తిపాడు– వరుపుల సుబ్బారావు టీడీపీ కండువా కప్పుకున్న వరుపులకు చంద్రబాబు గత ఎన్నికల్లో టికెట్ కాదుకదా కనీసం నియోజకవర్గ ఇన్చార్జిగా కూడా బాధ్యతలు ఇవ్వలేదు. సుబ్బారావును కాదని వరుపుల రాజా(గతేడాది చనిపోయారు)కు ఇచ్చారు. తిరిగి వైఎస్సార్సీపీలోకి వచ్చిన వరుపుల సుబ్బారావు నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. పలమనేరు– ఎన్.అమర్నాథ్రెడ్డి వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అమరనాథ్ రెడ్డి టీడీపీలోకి వెళ్లి మంత్రి పదవిని పొందారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి వెంకటేగౌడ చేతిలో 33 వేల ఓట్లతో చిత్తుగా ఓడిపోయారు. నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. బొబ్బిలి– ఆర్వీఎస్కే రంగారావు (సుజయ్‌కృష్ణ రంగారావు) టీడీపీలోకి ఫిరాయించి మంత్రి అయిన సుజయ్ కృష్ణ రంగారావు 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి శంబంగి వెంకట చినప్పలనాయుడు చేతిలో 8,352 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. రానున్న ఎన్నికల్లో ఆయన సోదరుడు బేబినాయనకు టికెట్ ఇవ్వనున్నారనే ప్రచారం జరుగుతోంది. పామర్రు (ఎస్సీ): ఉప్పులేటి కల్పన పామర్రు నియోజకవర్గం నుంచి 2014లో వైఎస్సార్సీపీ తరఫున గెలుపొందిన ఉప్పులేటి కల్పన టీడీపీలో చేరారు. 2019లో ఆమెకు టికెట్ ఇవ్వలేదు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. విజయవాడ వెస్ట్– జలీల్‌ఖాన్ టీడీపీలో చేరిన జలీల్‌ఖాన్ కుమార్తెకు 2019 ఎన్నికల్లో టికెట్ ఇచ్చినప్పటికీ ఆమె ఓటమి పాలై రాజకీయాలకు దూరమయ్యారు. ఆ తరువాత పరిణామాలలో జలీల్‌ఖాన్ నియోజకవర్గ ఇన్చార్జిగా కోరినా ఫలితం లేకుండా పోయింది. జమ్మలమడుగు: సి.ఆదినారాయణరెడ్డి వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందిన సి.ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరి మంత్రి పదవి దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ కడప పార్లమెంటు అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగి 3.80 లక్షల ఓట్లు తేడాతో వైఎస్సార్సీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరిపోయారు. ఇప్పటికీ అదే పార్టీలో రాష్ట్ర ఉపా«ధ్యక్షుడి హోదాలో ఉన్నారు. బద్వేలు (ఎస్సీ) టి.జయరాములు బద్వేల్ ఎమ్మెల్యేగా గెలుపొంది పార్టీ ఫిరాయించిన తిరువీధి జయరాములుకు 2019లో టీడీపీ టికెట్ నిరాకరించింది. ఓబులాపురం రాజశేఖర్‌ను అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఆ ఎన్నికల తర్వాత జయరాములు రాజకీయంగా కనుమరుగయ్యారు. కదిరి– అత్తర్ చాంద్ బాషా కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అత్తర్ చాంద్ బాషా 2014లో వైఎస్సార్ సీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరారు. 2019లో టికెట్ కూడా ఇవ్వలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గుర్తింపు కోసం పాకులాడుతూనే ఉన్నారు. శ్రీశైలం– బుడ్డా రాజశేఖర్ రెడ్డి టీడీపీలోకి వెళ్లిన బుడ్డా రాజశేఖర్ రెడ్డి 2019 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. నియోజకవర్గ ఇన్ చార్జిగా కొనసాగుతున్నా ఈ ఎన్నికల్లో టికెట్ దక్కడం అనుమానమే. ఏరాసు ప్రతాప్ రెడ్డి పోటీపడుతున్నారని పరిశీలకులు అంటున్నారు. ఆళ్లగడ్డ– భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ నుంచి గెలుపొందిన భూమా అఖిల ప్రియ టీడీపీలోచేరి మంత్రి పదవి పొందారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన ఆమె ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఈ స్థానం నుంచి టికెట్ కోసం భూమాకు పోటీ ఎదురవుతోంది. ఆళ్లగడ్డ కోసం జనసేన కూడా డిమాండ్ చేస్తోంది. నంద్యాల– భూమా బ్రహ్మానందరెడ్డి భూమా నాగిరెడ్డి చనిపోవడంతో 2017లో జరిగిన నంద్యాల ఉప ఎన్నికల్లో భూమా బ్రహ్మానంద రెడ్డి గెలిచారు. 2019 ఎన్నికల్లో బ్రహ్మానంద రెడ్డికి టికెట్ ఇచ్చినా ఓడిపోయారు. కొన్ని నెలల కిందటి వరకు అతన్నే ఇన్చార్జిగా కొనసాగించిన చంద్రబాబు ఆయన్ను తప్పించి మాజీ మంత్రి ఎండీ ఫరూక్‌ను ఇన్చార్జిగా నియమించారు. కర్నూలు– ఎస్వీ మోహన్‌రెడ్డి కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి టీడీపీలో చేరినా ఆయనకు టికెట్ ఇవ్వలేదు. తిరిగి వైసీపీ గూటికి చేరుకున్నారు. కోడుమూరు– మణిగాంధీ మణిగాంధీ టీడీపీలో చేరినా టికెట్ ఇవ్వలేదు సరికదా కనీసం ఇన్చార్జి పదవి కూడా కట్టబెట్టలేదు. తిరిగి వైసీపీలో కొనసాగుతున్నారు. -
ప్రతిపక్షాలవి నక్కజిత్తుల రాజకీయాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ప్రతిపక్షాలు నక్కజిత్తుల రాజకీయాలు చేస్తున్నాయని మంత్రులు పీడిక రాజన్నదొర, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు ఘాటుగా విమర్శించారు. త్వరలో జరగబోయే ఎన్నికల మహా యుద్ధానికి అంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అమలు కాని హామీలిచ్చే మోసగాళ్లొస్తున్నారు జాగ్రత్త అని హెచ్చరించారు. శనివారం విశాఖపట్నం జిల్లా సంగివలస వద్ద జరిగిన ‘సిద్ధం’ సభలో వారు ప్రసంగించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నప్పటికీ, ప్రతిపక్షాలు దు్రష్పచారం చేస్తున్నాయని, వాటిని తిప్పికొట్టాలని కోరారు. గత టీడీపీ ప్రభుత్వానికి, ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వ పాలనకు తేడాను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు చెప్పారు. సభలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఏమన్నారంటే.. పంచుతున్నాడంటున్నారే గానీ.. గ్రామాల్లో మన కార్యకర్తలు ప్రజాధనం మింగేశారని ప్రజలెవరూ అనడంలేదు. పథకాలు అందలేదని, వివక్ష చూపారని, ధనబలం, కండబలం, కుల బలం చూశారని ఎవ్వరూ అనడంలేదు. మనం నిజాయితీగా పని చేయడం వల్ల దక్కిన గౌరవం ఇది. జగన్మోహన్రెడ్డి ప్రజలకు అన్నీ పంచుతున్నాడు, ఇస్తున్నాడు అని అంటున్నారు గానీ, ఒక్కరు కూడా జగన్ తినేస్తున్నాడు అని అనడంలేదని ఒక మహిళ నాతో అన్నది. ఇదీ ఒక సాధారణ మహిళ సూక్ష్మ పరిశీలన. ఇదీ మన నాయకుడికి ఉన్న గుడ్‌విల్. ప్రజాస్వామ్యంలో యుద్ధాన్ని ఎన్నుకొనే వారు వీరులు. కొద్దిరోజుల క్రితం చంద్రబాబు ఊరూరా ప్రచారం చేస్తూ విద్యుత్ ఛార్జీలు పెంచారని, ఓటు వేయొద్దని చెబుతున్నారు. విద్యుత్ ధరలు తగ్గిస్తానని మాత్రం చంద్రబాబు చెప్పడంలేదు. దేశంలో ఏ రాష్ట్రంలో పప్పులు, ఇతర నిత్యావసరాల ధరలు తక్కువగా ఉన్నాయో చెప్పాలని టీడీపీ వారిని అడుగుతున్నాను. ఇతర రాష్ట్రాల్లో జగన్ ముఖ్యమంత్రి కాదు. ఇటువంటి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ పాలనలో పెన్షన్, ఇళ్లు, స్థలం, సంక్షేమం అందాయి. గ్రామాల్లో మనం ఉన్నంత గౌరవంగా మరే ఇతర రాజకీయ పార్టీ కార్యకర్తలూ లేరు. టీడీపీ కార్యకర్తల్లా దోచుకుని ఉంటే గ్రామాల్లో గౌరవంగా ఉండగలమా? రానున్న ఎన్నికల్లో అనేక బలాలు కలిగిన మన ప్రత్యర్థులు అనేక అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. వాటిని ప్రజలెవ్వరూ నమ్మడంలేదు. 60 శాతం ప్రజలు మన పార్టీకే ఓటు వేస్తున్నామని చెబుతున్నారు. – రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సీఎం జగన్‌కు చెడు తలపెట్టాలని కుట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు చేస్తున్న మేళ్లను, అందిస్తున్న సుపరిపాలనను చూసి ఓర్వలేక ఆయనకు చెడు చేయాలని ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయి. సీఎం జగన్ దేశంలో మరే ముఖ్యమంత్రీ అందించనంత సంక్షేమాన్ని అందిస్తున్నారు. మరే సీఎం చేయనంత అభివృద్ధి చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ రూ.కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నారు. బడుగు, బలహీన వర్గాలకు, గిరిజనులను, మహిళలను ఉన్నత స్థితిలోకి తెస్తున్నారు. సామాజిక సాధికారతకు శ్రీకారం చుట్టారు. మంత్రులే ప్రజల ఇంటికి వెళ్లి మాట్లాడిన రాష్ట్రం ఏపీ ఒక్కటే. ప్రజల అవసరాలు తెలుసుకుని ప్రతి ఒక్కటీ పరిష్కరించాం. నక్క జిత్తుల నాయకులు మనల్ని చెడు మార్గంలో నడిపించి అధికారం పొందాలని చూస్తున్నారు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతాయి. మన నాయకుడు జగన్ సింహంలా సింగిల్‌గానే వస్తారు. ప్రతిపక్షాల ప్రచారంపై తిరుగుబాటు చేయాలి. దేనికైనా రెడీ అన్నట్టు మనం ఉండాలి. పొత్తులతో వస్తున్న మాయగాళ్లతో, హామీలిచ్చి మోసం చేసిన బాబులున్నారు జాగ్రత్త. – ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర సీఎం జగన్‌ను మరోసారి సీఎంని చేసే వరకు విశ్రమించొద్దు పేదలను ఉన్నత స్థితికి తెస్తూ, సంక్షేమం, అభివృద్ధితో సుపరిపాలన అందిస్తున్న నాయకుడు సీఎం వైఎస్ జగన్. సీఎం జగన్ దేశంలో నంబర్ వన్ నాయకుడు. నాయకుడంటే ఇలా ఉండాలని నిరూపించారాయన. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి వచ్చినా 2024లో మళ్లీ జగనే ముఖ్యమంత్రి అవుతారు. జగన్‌ను సీఎంను చేయడానికి మనమంతా సిద్ధంగా ఉండాలి. జగనన్నను సీఎంగా కూరోబెట్టే వరకు విశ్రమించకూడదు. సైనికుల్లా పోరాడుదాం. – భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రతి ఒక్కరూ సైన్యమై కదలాలి జగనన్న సైనికులుగా, వైఎస్సార్ కుటుంబ సభ్యులుగా అందరూ ఎన్నికలకు సిద్ధం కావాలి. ప్రతి ఒక్క కార్యకర్తా సైన్యమై కదలాలి. రాష్ట్రంలో ప్రతి పేద విద్యారి్థకి నాణ్యమైన విద్య, ఆంగ్ల విద్య అందాలన్నా, రాష్ట్రంలో రైతుకు మంచి జరగాలన్నా, గౌరవంగా వ్యవసాయం చేయాలన్నా, ఇంటి వద్దకే ఎరువులు రావాలన్నా, పంటను అక్కడికక్కడే అమ్ముకోవాలన్నా జగనన్నే మళ్లీ సీఎం కావాలి. పేదవాడు జన్మభూమి కమిటీల వద్ద తలదించుకోకుండా, ఎవరి వద్దా చేతులు కట్టుకోకుండా నేరుగా ఇంటింటికి సంక్షేమ ఫలాలు చేరాలన్నా, మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్నా జగనే ముఖ్యమంత్రి కావాలి. అందుకే ప్రతి వైఎస్సార్సీపీ సభ్యుడు, జగనన్న శ్రేయోభిలాషులు అందరూ సైన్యమై కదలాలి. – మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అంబేడ్కర్ ఆశయాలు అమలు చేసే ఏకైక సీఎం జగన్ పేదల పెన్నిధి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నాలుగేళ్ల తొమ్మిది నెలల పాలనలో రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలకు ఎవ్వరికీ ఆకలి చావు లేకుండా, ప్రతి ఒక్కరూ గౌరవంగా తలెత్తుకుని బతికేలా సుపరిపాలన అందించారు. స్వాతంత్య్ర భారత దేశ చరిత్రలో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ వారిని అక్కున చేర్చుకొన్న మొట్టమొదటి నాయకుడు సీఎం వైఎస్ జగన్. సామాజికంగా వెనకబడిన వారిని అభివృద్ధి దిశగా నడిపిస్తూ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేసిన నాయకుడు జగన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు అనేక పదవులిచ్చారు. ఎవ్వరూ ఊహించని విధంగా నా వంటి దళితుడిని రాజ్యసభకు పంపుతున్న మహానుభావుడు. ఇది నాకిచ్చిన కానుక కాదు. పేద దళిత, అణగారిన వర్గాలకు, ఉత్తరాంధ్రకు ఇచ్చిన కానుక. రాజ్యసభలో మన ప్రభుత్వ సంస్కరణలను వినిపిస్తాను. సీఎం జగన్ మరోసారి గెలిస్తేనే సంక్షేమ ఫలాలు కొనసాగుతాయి. లేదంటే ప్రజలకు అందవు. అందుకే జగన్నీ ముఖ్యమంత్రిగా మళ్లీ గెలిపించుకోవాలి. – పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు -
Vizag : భీమిలిలో పోరుకు ‘సిద్ధం’
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/తగరపువలస (విశాఖ జిల్లా) : రాష్ట్రంలో రానున్న ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు వైఎస్సార్సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్ సిద్ధమయ్యారు. ప్రజాక్షేత్రంలో వైఎస్సార్సీపీని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఒంటరిగా ఎదుర్కోలేక జనసేన సహా వివిధ పార్టీల జెండాలతో జతకట్టి.. కుటుంబాలను చీల్చుతూ పన్నుతున్న కుట్రలు, కుతంత్రాలను చిత్తుచేసి, విజయభేరి మోగించడానికి.. పార్టీ శ్రేణులను సిద్ధంచేయడానికి ఆయన నడుం బిగించారు. ఇందుకు ‘సిద్ధం’ పేరుతో రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో నాలుగుచోట్ల పార్టీ శ్రేణులతో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి సభను ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం సంగివలసలో శనివారం నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి భారీఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరుకానున్నారు. సుమారుగా 15 ఎకరాల స్థలంలో ఈ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో పార్టీ కార్యకర్తలనుద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగిస్తారు. అంతేకాక.. నియోజకవర్గాల వారీగా పలువురు కార్యకర్తలతో కూడా సీఎం ముఖాముఖి మాట్లాడనున్నారు. ఇక మ.3.30 గంటల నుంచి సా.5 వరకూ ఈ బహిరంగ సభ జరుగుతుంది. కదనరంగంలో ముందడుగు.. ఎన్నికల పరుగు పందెంలో ఎవరి అడుగు ముందుపడితే విజయం వారినే వరిస్తుందంటూ రాజకీయ విశ్లేషకులు స్పష్టంచేస్తున్నారు. ఓ వైపు పొత్తులో ఎవరు ఏ స్థానాల్లో పోటీచేయాలన్నది తేల్చుకోలేక.. పోటీ చేయడానికి అభ్యర్థులు దొరక్క, మరోవైపు బీజేపీని జతచేసుకునేందుకు పాకులాడుతూ టీడీపీ–జనసేన సతమతవుతున్నాయి. మరోవైపు.. జనబలమే గీటురాయిగా.. సామాజిక న్యాయం చేకూర్చడంలో మరో అడుగు ముందుకేస్తూ శాసనసభ, లోక్‌సభ స్థానాల సమన్వయకర్తలను సీఎం జగన్ మారుస్తున్నారు. ఇప్పటికే 58 శాసనసభ, 10 లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తలను నియమించారు. గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాల కోసం అవసరమైన చోట్ల సమన్వయకర్తలను మార్చడంపై కసరత్తు కొనసాగిస్తూనే.. ఎన్నికల శంఖారావాన్ని పూరించడం ద్వారా సీఎం జగన్ కదనరంగంలో దూసుకుపోతున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రతి ఇంటా విప్లవాత్మక మార్పు.. ఇక ప్రజా సంకల్ప పాదయాత్రలో తాను గుర్తించి, ప్రజలు తన దృష్టికి తెచ్చిన సమస్యల పరిష్కారానికి ఇచ్చిన హామీలను రెండు పేజీలతో మేనిఫెస్టోగా వైఎస్ జగన్ రూపొందించి 2019 ఎన్నికలకు వెళ్లారు. ఆ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి.. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 95 శాతం హామీలను అమలుచేశారు. ఇప్పటికి 99.5 శాతం హామీలు అమలుచేశారు. గత 56 నెలల్లో సంక్షేమ పథకాల ద్వారా అర్హతే ప్రమాణికంగా.. పారదర్శకంగా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో రూ.2.53 లక్షల కోట్లు.. నాన్ డీబీటీ రూపంలో రూ.1.68 కోట్లు వెరసి రూ.4.21 లక్షల కోట్ల ప్రయోజనాన్ని పేదలకు చేకూర్చారు. ఇందులో 75 శాతం నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చేరాయి. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారు. సీఎం జగన్ సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో వచ్చిన విప్లవాత్మక మార్పులు ప్రతి ఇంటా, ప్రతి గ్రామం, ప్రతి నియోజకవర్గంలో కళ్లకు కట్టినట్లు కన్పిస్తున్నాయి. ఇదే అంశాన్ని గుర్తుచేస్తూ ప్రభుత్వంవల్ల మంచి జరిగిందని భావిస్తేనే తనకు అండగా నిలబడాలని ప్రజలకు సీఎం జగన్ పిలుపునిస్తున్నారు. ఇదే అంశాన్ని పార్టీ శ్రేణులకు వివరించి.. ప్రతి ఇంటికీ చేసిన మంచిని చాటిచెప్పి.. మరింత మంచి చేసేందుకు ఆశీర్వదించాలని కోరాలని దిశానిర్దేశం చేయనున్నారు. 2022, మే 11 నుంచే గడప గడపకూ.. నిజానికి.. సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రతి ఇంట్లో వచ్చిన మార్పును గుర్తుచేసి.. మరింత మంచి చేయడానికి ఆశీర్వదించాలని కోరేందుకు 2022, మే 11న ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం చేసిన మంచి కళ్లెదుటే కన్పిస్తున్నప్పుడు 175కు 175 స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం సుసాధ్యమేనని ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ వర్క్‌షాప్‌లలో ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అలాగే, ప్రతి ఇంటికీ చేసిన మంచిని వివరించడానికి చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో 80 శాతం ప్రజలు ‘మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ నినదించి, ప్రభుత్వానికి మద్దతు పలికారు. ఇది జాతీయ మీడియా సంస్థలు నిర్వహించిన సర్వేల్లో ప్రస్ఫుటితమైంది. ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే 25కు 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించడం తథ్యమని టైమ్స్ నౌ వంటి ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే గడాది అక్టోబరు 10న విజయవాడలో పార్టీ ప్రతినిధుల సదస్సు నిర్వహించి 175కు 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా చేపట్టాల్సిన చర్యలపై సీఎం వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తి.. మరోవైపు.. గత మూడ్రోజులుగా జరుగుతున్న ‘సిద్ధం’ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభా ఏర్పాట్లను శుక్రవారం సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కోలా గురువులు, శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాసు, ఎమ్మెల్సీలు పెనుమత్స సురేష్, వరుదు కల్యాణి, విశాఖ పశ్చిమ సమన్వయకర్త ఆడారి ఆనంద్, సాంస్కృతిక శాఖ చైర్మన్ వంగపండు ఉష పరిశీలించారు. హెలికాప్టర్ ట్రయల్ రన్ కూడా పూర్తయింది. సుమారు 3 వేలకు పైగా పోలీసులు శుక్రవారం సాయంత్రానికే సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ట్రాఫిక్‌కు ఎటువంటి అవాంతరాలు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటున్నారు. సీఎం పర్యటన ఇలా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి శనివారం మ.2.05 గంటలకు బయల్దేరి 3 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్లో సభాస్థలికి చేరుకుంటారు. సభానంతరం తిరిగి హెలికాప్టర్లో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుని గన్నవరానికి బయల్దేరుతారు. జగన్‌ను మళ్లీ సీఎం చేసుకునేందుకు ప్రజలు ‘సిద్ధం’ వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై చంద్రబాబు, పవన్ తదితర ప్రతిపక్ష నేతలు చేస్తున్న దు్రష్పచారాలను తిప్పికొట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. సంగివలస జాతీయ రహదారి వద్ద జరగనున్న సభకు సంబంధించి ఏర్పాట్లను ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాల దు్రష్పచారాలను తిప్పికొట్టేందుకు సీఎం జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారన్నారు. పక్క రాష్ట్రాల్లో ఆదరణ కోల్పోయిన నాయకులు ఇక్కడి ప్రజలకు సేవ చేయడానికి వచ్చినట్లు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి సమర్థవంతంగా సంక్షేమాభివృద్ధి పథకాలు అమలుచేశారని.. ఆ నమ్మకంతోనే మళ్లీ ఆయననే ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వారే వైఎస్సార్సీపీ క్యాంపెయినర్లన్నారు. ఈ సభకు రెండున్నర లక్షల మంది తరలిరానున్నారని అందుకు తగిన ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. -
నిందలు వేసే ముందు షర్మిల ఆలోచించుకోవాలి: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విశాఖపట్నం: మాపై నిందలు వేసే ముందు షర్మిల ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి. అలాగే, చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం కుటుంబాల మధ్య చిచ్చు పెడతారని సీరియస్ కామెంట్స్ చేశారు. కాగా, వైవీ సుబ్బారెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. మాకు ఏ పార్టీతో పొత్తు ఉండదు. ఒంటరిగానే పోటీ చేస్తాం. చంద్రబాబులా బీజేపీతో లాలూచీ పడాల్సిన అవసరం లేదు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించరు. రాష్ట్రానికి కాంగ్రెస్ చేసిన ద్రోహాన్ని ప్రజలు మర్చిపోరు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసింది. ప్రత్యేక హోదా రాకపోవడానికి కాంగ్రెస్ పార్టీనే ప్రధాన కారణం. అమరావతి పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. విశాఖ రాజధాని కాకుండగా కేసులు వేసింది కూడా చంద్రబాబే. చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం కుటుంబాల మధ్య చిచ్చు పెడతారు. పదవి కోసం ఎన్టీఆర్ కుటుంబంలో చంద్రబాబు చిచ్చు పెట్టారు. ఇప్పుడు షర్మిలను చంద్రబాబే కాంగ్రెస్‌లోకి పంపారు. వైఎస్సార్ కుటుంబాన్ని కాంగ్రెస్ ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టింది. మాపై నిందలు వేసే ముందు షర్మిల ఒక్కసారి ఆలోచించుకోవాలన్నారు. ఇదే సమయంలో ఎన్నికలకు సమాయత్తమవ్వాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు సూచించారు. ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ, ఐదు ఎంపీ స్థానాలను గెలిపించుకోవాలన్నారు. ఉత్తరాంధ్ర నుంచి అధిక స్థానాలు గెలిచే ప్రయత్నం చేయాలన్నారు. పదవుల్లో ఉన్న నేతలు, కార్యకర్తలు యాక్టివ్‌గా పనిచేయాలన్నారు. తరగపువలస సమీపంలొ జరిగే వైఎస్సార్సీపీ సభను మనం విజయవంతం చేయాలన్నారు. రాష్ర్టవ్యాప్తంగా సంకేతం పంపే విధంగా సభ ఉండాలన్నారు. -
భీమిలి నుంచి వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావం
సాక్షి, విశాఖపట్నం/తగరపువలస(విశాఖ): వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజియన్ పరిధిలోని నాయకులు, ప్రజాప్రతినిధులను రానున్న ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు ఈ నెల 27వ తేదీన భీమిలి నియోజకవర్గంలోని సంగివలసలో సభ నిర్వహించనున్నట్లు పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ సభలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొని నాయకులు, ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయడం ద్వారా భీమిలి నుంచి ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుడతారని వెల్లడించారు. సంగివలసలో జాతీయరహదారి పక్కన ఎంపిక చేసిన సభా స్థలాన్ని బుధవారం మధ్యాహ్నం మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. సభాస్థలం, పార్కింగ్, హెలీప్యాడ్ వద్ద ఏర్పాట్ల గురించి భీమిలి సీఐ డి.రమేష్ ను అడిగి తెలుసుకున్నారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులకు మరోసారి తెలియజేసి వారిని ఉత్తేజితులను చేయడమే ఈ సభ ఉద్దేశమని చెప్పారు. ఈ సభలో ఉత్తరాంధ్రలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 5 వేలు చొప్పున 2లక్షల మంది వరకు ప్రజాప్రతినిధులు, గృహ సారథులకు స్థానం కల్పించనున్నట్లు తెలిపారు. ఇలాంటి సభలే రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగుచోట్ల నిర్వహిస్తామన్నారు. సీఎం ప్రోగ్రాం కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పెన్మత్స సురేష్, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, నెడ్‌క్యాప్ చైర్మన్ కేకే రాజు, రీజనల్ యూత్ కో–ఆర్డినేటర్ ముత్తంశెట్టి శివనందీష్, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ కె.వెంకటరెడ్డి, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. తొలుత విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్, డీసీపీ శ్రీనివాస్, ఏడీసీపీ జాన్ మనోహర్, ఏసీపీ జి.శ్రీనివాసరావు, భీమిలి ఆర్డీవో ఎస్.భాస్కరరెడ్డి, ట్రాఫిక్ సీఐ ఎస్.కాంతారావు సభా స్థలాన్ని పరిశీలించారు. -
షర్మిల కాదు.. ఎవరు వచ్చినా ఏమీ చేయలేరు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర అభివృద్ధి గురించి షర్మిలకు ఏం తెలుసు. మాతో పాటు షర్మిల వస్తే రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూపిస్తామన్నారు వైఎస్సార్సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి. అలాగే, వైఎస్సార్‌కు నిజమైన వారసులెవరో ప్రజలే నిర్ణయిస్తారని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, విశాఖలో వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. షర్మిల తొలిసారి రాష్ట్రానికి వచ్చారు. రాష్ట్ర అభివృద్ధి గురించి ఆమెకు ఏమీ తెలియదు. పక్క రాష్ట్రం నుండి వచ్చి ఇక్కడ అభివృద్ధి జరగలేదంటే ఎలా?. వైఎస్సార్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చిన కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరారు. వైఎస్సార్ కుమారుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్యాయంగా జైలులో పెట్టిన కాంగ్రెస్‌లో ఆమె చేరారు. వైఎస్సార్‌కు నిజమైన వారసులు ఎవరో ప్రజలే నిర్ణయిస్తారు. మొన్నటివరకు తెలంగాణ బిడ్డగా అక్కడ తిరిగారు. ఆమె అక్కడ ఎందుకు పోటీ చేయలేదు అనేది తెలియదు. షర్మిల కాదు ఎవరు వచ్చినా మా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టలేరు. వైఎస్సార్ కుటుంబాన్ని సోనియా గాంధీ ఇబ్బందుల్లో పెట్టారు. ఢిల్లీ కాంగ్రెస్‌లో చేరి మమ్మల్ని టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది సమీక్షించుకోవాలి. అవినీతికి పాల్పడ్డ చంద్రబాబును షర్మిల ప్రశ్నించాలి. మేము ఎప్పుడు కూడా బీజేపీతో కాంప్రమైజ్ కాలేదు. ఈనెల 27వ తేదీన భీమిలిలో ఎన్నికల శంఖారావాన్ని సీఎం జగన్ పూరిస్తున్నారు. రెండు లక్షల మంది 34 నియోజకవర్గాల నుండి హాజరవుతున్నారు’ అని తెలిపారు. ఇది కూడా చదవండి: షర్మిల వాడిన భాష, యాస సరికాదు: సజ్జల -
పొత్తులమారి నక్క!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సహచర పక్షాలను మోసగించే ‘పొత్తులమారి నక్క’ తెలుగుదేశం పార్టీ ఎప్పటిలానే ఈసారి జనసేనకు ఝలక్ ఇచ్చేందుకు వ్యూహం పన్నుతోంది. ఉత్తరాంధ్రలో ఉన్న 35 సీట్లలో కేవలం విశాఖ దక్షిణ, భీమిలి నియోజకవర్గాలతోపాటు పెందుర్తి/యలమంచిలిలో ఏదో ఒక స్థానాన్ని కలిపి మొత్తం మూడు మాత్రమే జనసేనకు కేటాయించేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఈ విషయాన్ని అంతర్గతంగా టీడీపీ అధినాయకత్వం ఆ పార్టీ నేతలకు చెబుతుండటం గమనార్హం. సర్వేల సాకుతో పొత్తు ధర్మానికి తూట్లు పొడిచేందుకు కుట్ర పన్నుతున్నట్టు సమాచారం. టీడీపీ ఎత్తులను పసిగట్టిన జనసేన తన బలం పెంచుకునేందుకు కొత్త నేతలకు ఆహ్వానం పలుకుతోంది. పెద్దగా ప్రజాబలం లేకున్నా.. గతంలో ఎన్నడో రాజకీయాలు చేసిన వారిని పార్టీలో చేర్చుకుంటోంది. దీనిలో భాగంగానే ఇప్పటికే పడాల అరుణను చేర్చుకుంది. తాజాగా అనకాపల్లి నుంచి కొణతాల రామకృష్ణను ఆహా్వనిస్తోంది. తమ వద్ద బలమైన నేతలు ఉన్నారని చూపించుకునేందుకు తహతహలాడుతోంది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య ‘సీట్ల ముడి’ అంత సులువుగా వీడేలా కనిపించడం లేదు. నాలుగు జిల్లాల్లో జనసేనకు ‘సున్న’ం! ఉత్తరాంధ్ర జిల్లాల పునర్విభజన తర్వాత శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాలుగా రూపాంతరం చెందింది. ఈ ఆరు జిల్లాల్లో 35 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిల్లో విశాఖ జిల్లాలో రెండు సీట్లు, అనకాపల్లి జిల్లాలో ఒక్క సీటు మాత్రమే జనసేనకు ఇవ్వాలని టీడీపీ యోచిస్తోంది. అంటే నాలుగు జిల్లాల్లో జనసేనకు మొండిచేయి చూపనుందన్నమాట. దీంతో జనసేన నేతలు రగిలిపోతున్నారు. వీరందరికీ మొండిచేయేనా..! ♦ శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల నుంచి విశ్వక్సేన్, పాతపట్నం నుంచి గేదెల చైతన్య జనసేన తరఫున సీట్లను ఆశిస్తున్నారు. ఈ రెండు స్థానాల్లో కాపు ఓటు బ్యాంకు అధికంగా ఉంది. ♦ విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, గజపతినగరం నుంచి పడాల అరుణ జనసేన తరఫున పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆమె జనసేన పొలిటికల్ కమిటీ మెంబర్‌గా కూడా ఉన్నారు. ♦ పార్వతీపురం జిల్లాలో సాలూరు సీటును తమకు కేటాయించాలని జనసేన నేతలు కోరుతున్నారు. ♦అయితే, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల నుంచి ఒక్క సీటు కూడా జనసేనకు కేటాయించే అవకాశం లేదని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. ♦ విశాఖ జిల్లాలో భీమిలి, విశాఖ దక్షిణంలో ఏదో ఒక సీటును జనసేన తరఫున వంశీకృష్ణ యాదవ్ ఆశిస్తుండగా.. పెందుర్తి సీటు తనదే అన్న రీతిలో పంచకర్ల రమేష్ బాబు మొన్నటివరకు కార్యక్రమాలు చేశారు. గట్టి హామీ లేకపోవడంతో ఆయన సందిగ్ధంలో పడిపోయారు. ♦ యలమంచిలి నుంచి జనసేన తరఫున సుందరపు విజయ్‌కుమార్ పోటీకి యత్నింస్తున్నారు. అనకాపల్లి నుంచి పరుచూరి భాస్కర్‌రావు రేసులో ఉన్నారు. విశాఖ దక్షిణం నుంచి కందుల నాగరాజు, సాదీక్‌లు, విశాఖ ఉత్తరం నుంచి ఉషాకిరణ్, భీమిలిలో పంచకర్ల సందీప్ జనసేన తరఫున సీటు కోసం యత్నాలు చేస్తున్నారు. వీరిలో ఇప్పటివరకు తమకు కచ్చితంగా సీటు వస్తుందని బలంగా నమ్ముతున్న నేతలు ఒక్కరూ లేకపోవడం గమనార్హం. ♦ కొత్తగా చేరుతున్న కొణతాల రామకృష్ణ తనకు అనకాపల్లి ఎంపీ సీటు ఇస్తారని చెబుతున్నా.. ఇప్పటికే టీడీపీ నుంచి ఆర్థికంగా బలంగా ఉన్న ఒకరికి హామీ ఇచ్చారని తెలుస్తోంది. -
ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డిపై ఎల్లో మీడియా ఏడుపునకు కారణాలెన్నో..!
ఏయూ ప్రగతిని అడ్డుకునే కుట్రలో భాగంగా విద్యా వ్యాపార రంగంలో పాతుకుపోయిన ఎల్లోగ్యాంగ్.. మీడియా ముసుగులో తెర వెనుక చేరి.. వీసీ ప్రసాద్‌రెడ్డిపై విషం చిమ్ముతోంది. ప్రైవేటు వర్సిటీల అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిష్టాత్మక యూనివర్సిటీని తెలుగుదేశం పార్టీ పట్టించుకోకపోవడంతో మసకబారిన ఆంధ్ర విశ్వవిద్యాలయం.. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చొరవతో కొత్త ఊపిరులందుకుంది. ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా మరలా ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి నియామకంపై ఎల్లో ఏడుపులు మాములుగా లేవు. ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి 2019లో మొదటిసారి వీసీగా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి చాలా ధైర్యంగా తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల మూలంగా సామాజిక, రాజకీయ, ఆర్ధిక ఇబ్బందులను ఎల్లో గ్యాంగ్ ఎదుర్కొంది. ఎల్లో మీడియా ఏడుపునకు కారణాలు చాలానే ఉన్నాయి. నారా లోకేష్ తోడల్లుడుకి చెందిన గీతం సంస్థకు పోటీగా ఏయూలో సౌకర్యాలను మెరుగుపరిచి, క్యాంపస్ రూపురేఖలు మార్చి, తరగతి బోధన విధానాలను మెరుగుపరిచి, హాస్టళ్లను ఆధునీకరించి, 150కి పైగా ఇంక్యుబేషన్ సెంటర్లు, స్టార్టప్‌లను మొదలుపెట్టి ఏయూని దేశంలోనే ఒక ప్రఖ్యాత సంస్థగా మార్చారు. దీనికి రుజువు ఈమధ్యనే ఏయూని సందర్శించిన NAAC (National Assessment Accreditation Council) టీమ్ ఏయూకి 4 మార్కులకుగాను 3.74 మార్కులను వేసి ఏయూకి ప్రతిష్టాత్మక NAAC A++ ర్యాంక్ ప్రకటించింది. నగరం నడిబొడ్డున ఏయూని ఆనుకుని ఏయూ చుట్టూ ఉన్న భూములను దశాబ్దాలుగా ఆక్రమించి వ్యాపార సముదాయాలు నిర్మించి వ్యవహారాలు నడిపిన కుహనా ఖద్దరు చొక్కాల చెర నుంచి వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను విడిపించి ఆక్రమణదారుల పీచమనిచారు. దీంతో ఎల్లోగ్యాంగ్ గుక్కపట్టి ఏడ్చారు. యూనివర్శిటీ గ్రౌండ్, చుట్టూ ఉండే పరిసరాలను పూర్తిగా ప్రక్షాళించి తుప్పలు పొదలు లేకుండా పరిశుభ్రం చేసి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు సాగించేందుకు ఏ చిన్న అవకాశం లేకుండా కట్టడి చేయడంతో ఎల్లో గ్యాంగ్ ఆపసోపాలు పడ్డారు. ఇంతకుముందు ప్రభుత్వాన్నో, ఏయూ ఉన్నత అధికారులనో ఇబ్బందులు పెట్టాలంటే ఏయూ క్లాసుల్లోకి వెళ్లి బలవంతంగా విద్యార్థులను బయటకు తీసుకొచ్చి ధర్నాలు చేయించి పబ్బం గడుపుకునే కుహనా యువ రాజకీయ విద్యార్థి లీడర్స్ తోకలను కత్తిరించి వారిని క్యాంపస్ నుంచి బయటకు పంపారు. ఎల్లోగ్యాంగ్ హాహాకారాలు చేశారు. రాజకీయ మీటింగ్‌లకు కుల సంఘాల మీటింగ్‌లకు బలవంతంగా ఏయూ ఉద్యోగులు విద్యార్థుల నుంచి చందాలు వసూలు చేసే కుల విద్యార్థి సంఘాల కుహనా వ్యక్తులను క్యాంపస్ లోకి అడుగుపెట్టకుండా కట్టడి చేయడంతో ఎల్లోగ్యాంగ్ పెడబొబ్బలు పెట్టారు. హాస్టళ్లలో మత్తు పదార్థాలను చొప్పిస్తూ అసాంఘిక కార్యకలాపాలు సాగించే బేవర్స్‌లను మెడ పట్టుకుని బయటకు గెంటి ఏయూ ప్రశాంతతని కాపాడటంతో ఎల్లోగ్యాంగ్ విలవిల్లాడిపోయారు. ఒకప్పుడు దెయ్యాల కొంపగా ఎల్లో గ్యాంగ్‌తో అభివర్ణించిబడిన ఏయూ నేడు ప్రభుత్వ విధి విధానాలు, ప్రసాద్‌రెడ్డి అకుంఠిత దీక్ష మూలంగా అత్యంత సుందరంగా రూపుదిద్దుకోవడంతో రాబోయే పరిణామాలను ముందుగానే బేరీజు వేసుకుని లెక్కలు వేసుకుంటూ, తర్జనభర్జనలు పడుతూ పచ్చ గ్యాంగ్ ఉడికిపోతుంది. ఏం చెయ్యాలో పాలుపోక, ఏయూ ప్రగతిని అడ్డుకునే కుట్రలో భాగంగా విద్యా వ్యాపార రంగంలో పాతుకుపోయిన ఎల్లోగ్యాంగ్.. మీడియా ముసుగులో తెర వెనుక చేరి.. ప్రసాద్ రెడ్డిపై విషం చిమ్ముతోంది. ఇదీ చదవండి: భయపెట్టి.. ప్రభుత్వ భూములూ హాంఫట్! -
లోకేష్ పెళ్లిపై చంద్రబాబు నాన్సెన్స్ అన్నారు: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
సాక్షి, విశాఖపట్నం: నారా లోకేష్ పెళ్లి అంశంపై మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేనరికం సంబంధాలు మంచివి కాదని చంద్రబాబు అనేవారు. నాన్సెన్స్ అని నన్ను తిట్టేవారు. కానీ, తర్వాత బాలకృష్ణ కూతురును నారా లోకేష్‌కు ఇచ్చి చంద్రబాబు వివాహం చేశారని చెప్పుకొచ్చారు. కాగా, యార్లగడ్డ శుక్రవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా టీడీపీ నేతలు ఓవరాక్షన్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఆకాశమంత ఎత్తు ఎదిగారు. ఆకాశం మీద ఉమ్ము వేయాలని చూస్తే వారి మొహం మీదనే పడుతుంది. తారక్ ప్లెక్సీలు తొలగిస్తే ఆయనకు ఏమీ నష్టం లేదు. తారక్‌పై ఎవరు విమర్శలు చేస్తే అది వారికే నష్టం. గతంలో బాలకృష్ణ కూతురును లోకేష్‌కు ఇచ్చి పెళ్లి చేస్తున్నారా? అని చంద్రబాబును అడిగాను. నాన్సెన్స్ అని నన్ను చంద్రబాబు తిట్టారు. మేనరికం సంబంధాలు మంచివి కాదని చెప్పారు. తర్వాత లోకేష్‌కు బాలకృష్ణ కూతురినిచ్చి చంద్రబాబు వివాహం చేశారు. అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ మంచి నిర్ణయం. అంబేడ్కర్ దేశానికి ఒక ఐకాన్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటే నాకు వ్యక్తిగతంగా అభిమానం. సీఎం జగన్‌పై పిచ్చి కేసులు పెట్టారు. లక్ష కోట్ల అవినీతిని అని తప్పుడు ప్రచారం చేశారు. సీఎం జగన్ ఒక హీరో. నేను మంచి చేస్తేనే ఓటు వేయండని ధైర్యంగా చెప్పిన నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమే. అలాంటి నేత దేశంలో మరొకరు లేరు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
అమాయక చక్రవర్తి కాదు
మహారాణిపేట (విశాఖ): చంద్రబాబు ‘స్కిల్’ దొంగేనని, ఆయన అమాయక చక్రవర్తి అని ఏ కోర్టూ సర్టిఫికెట్ ఇవ్వలేదని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. చంద్రబాబు అన్ని కేసుల్లోనూ బెయిల్ తెచ్చుకొని బయట తిరుగుతున్నారని తెలిపారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో సుప్రీం కోర్టు ఇచ్చింన తీర్పు ఒకటైతే.. ఎల్లో మీడియా మరో రకంగా ప్రచారం చేస్తోందని అన్నారు. కొన్ని చానళ్లు బాబు గొప్ప విజయం సాధించారని, ఆయనకు ఏదో ఊరట కలిగిందని, ఆయన సుప్రీం కోర్టులో వేసిన కేసులో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింనట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. 2019లో చంద్రబాబుకు వచ్చిన 23 సీట్లను గొప్ప విజయంగా చూపిస్తే ఏ రకంగా ఉంటుందో.. నేడూ అదే విధంగా కనిపిస్తోందన్నారు. సుప్రీం కోర్టు తీర్పులో చంద్రబాబుకు ఏ రకమైన రిలీఫ్ కలగలేదన్నారు. వాస్తవానికి ముందుగా గమనించాల్సింది సెక్షన్ 17 ఏ వర్తిస్తుందా లేదా అనేది ఒక ప్రొసీజరల్ సెక్షన్ మాత్రమే అని అన్నారు. 2018లో అమల్లోకి వచ్చింన ఈ సెక్షన్ ఈ కేసుకు వర్తించదని, స్కిల్ స్కాం 2015 ప్రాంతంలోనే జరిగిందని చెప్పారు. చంద్రబాబు, పార్టీ నాయకులు తప్పు చేయలేదని వారి లాయర్లు కూడా ఎక్కడా అనడంలేదన్నారు. రూ. 370 కోట్ల ప్రజాధనాన్ని దోచుకోలేదని ఎక్కడా వారి వాదనల్లో చెప్పలేదని గుర్తు చేశారు. గవర్నర్ అనుమతి లేదనో, స్పీకర్‌కు చెప్పలేదనో 17 ఏని చూపించి క్వాష్ చేయాలని కోరారని తెలిపారు. రిమాండ్ ప్రక్రియలో లోపం లేదని ఇద్దరు న్యాయమూర్తులు ఏకాభిప్రాయాన్ని చెప్పారని, 17 ఏ వర్తించే విషయంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారని చెప్పారు. రిమాండ్ అంతా పద్ధతి ప్రకారమే జరిగిందని ఇద్దరు జడ్జిలూ చెప్పారన్నారు. గతంలోనూ ఇదే ధోరణి చంద్రబాబు గతంలో ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయినప్పుడు కూడా ఇదే రకమైన వాదనలు చేశారని, సెక్షన్ 8 అమల్లో ఉందని, మీకూ పోలీసులున్నారని.. మాకూ ఉన్నారని.. మీకూ ఏసీబీ ఉందని.. మాకూ ఉంది అంటూ చంద్రబాబు మాట్లాడారని మంత్రి గుర్తు చేశారు. ఇలాంటి వితండ వాదం చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. గతంలో కేసులకు సెక్షన్ 17ఏ వర్తించదని దాదాపు ఆరు కోర్టులు చెప్పాయన్నారు. అంత క్లియర్‌గా ఉందని అన్నారు. ఈ రోజు వచ్చింన తీర్పు చూసిన తర్వాత చంద్రబాబు న్యాయస్థానంలో బోనులో, విచారణ సంస్థల ముందు దొంగలా నిలబడి సమాధానం చెప్పాల్సిందేనన్నారు. బాబు 52 రోజులు జైలు శిక్ష అనుభవించి, ఆరోగ్య కారణాలు చెప్పి బెయిల్‌పై ఉన్న ఒక దొంగే తప్ప నిజాయితీపరుడు, అమాయక చక్రవర్తి అని న్యాయస్థానాలు చెప్పలేదని మంత్రి అన్నారు. లేని పార్టీకి ఎవరు అధ్యక్షులయితే మాకేంటి? ఈ రాష్ట్రంలో లేని పార్టీకి ఎవరు అధ్యక్షులు అయితే మాకేంటి అని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మంత్రి వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వచ్చిన ఓట్లు 0.4 శాతమేనని, నోటా కంటే తక్కువని అన్నారు. అటువంటి పార్టీ గురించి చర్చించుకోవడం అనవసరమన్నారు. రాజకీయాల్లో ఉన్న వాళ్లకు చాలా మందికి తోబుట్టువులు ఉంటారని, వారంతా ప్రధానులు, రాష్ట్రపతులు కాలేరు కదా అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కి సీట్లు కాదు కదా ఓట్లేసే వారూ లేరన్నారు. ఈ రాష్ట్రానికి వారు చేసిన అన్యాయమే అందుకు కారణమన్నారు. కలిసి నిర్మించుకున్న ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టి, రాష్ట్ర భవిష్యత్తును గొడ్డలితో నరికిన పార్టీ కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి పార్టీ ఈ రాష్ట్రానికి ఉండకూడదని ప్రజలు అనుకున్నారని, అలానే లేకుండా చేశారని మంత్రి అన్నారు. -
ప్రజా కోర్టులో కూడా చంద్రబాబు శిక్ష తప్పదు: మంత్రి అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: పలు కేసుల్లో బెయిల్ మీద బయట తిరుగుతున్న దొంగ చంద్రబాబు అని ఘాటు విమర్శలు చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. కాగా, స్కిల్ స్కాం కేసులో సుప్రీంకోర్టు తీర్పులపై అమర్నాథ్ స్పందించారు. చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఎలాంటి ఊరట లభించలేదన్నారు. మంత్రి అమర్నాథ్ కామెంట్స్.. – చంద్రబాబు బోనులో దొంగలా నిలబడి సమాధానం చెప్పాల్సిందే. – సుప్రీం కోర్టు తీర్పును తప్పుదోవ పట్టించేలా ఎల్లో మీడియా ప్రచారం. – కోర్టులో చంద్రబాబుకు ఏ రకమైన రిలీఫ్ దొరకలేదు. – ఓటుకు నోటు కేసులో దొరికిపోయినప్పుడు సెక్షన్ 8 అన్నాడు. – నేడు 17ఏ అంటున్నాడు..కానీ తప్పు చేశాడా లేదా అన్నది మాత్రం చెప్పడం లేదు. – చంద్రబాబు చేసిన తప్పులను ప్రజలు కూడా గమనిస్తున్నారు. – ప్రజాకోర్టులో మరొకసారి శిక్ష పడే రోజు త్వరలోనే ఉంది. – లేని పార్టీకి ఎవరు అధ్యక్షులు అయితే మాకేంటి? – రాష్ట్ర భవిష్యత్తును గొడ్డలితో నరికిన పార్టీ కాంగ్రెస్. – అలాంటి పార్టీ ఈ రాష్ట్రంలో ఉండకూడదని ప్రజలు నిర్ణయించుకున్నారు. ఇచ్చిన తీర్పేంటి..? మీరు చేసే ప్రచారం ఏంటి..? – కొన్ని చానళ్లు గొప్ప విజయం సాధించాం.. చంద్రబాబుకు ఏదో ఊరట కలిగింది. – ఆయన సుప్రీం కోర్టులో వేసిన కేసులో ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయి. – దీన్ని చూస్తే 2019లో చంద్రబాబుకు వచ్చిన 23 సీట్లను గొప్ప విజయంగా చూపిస్తే ఏ రకంగా ఉంటుందో నేడు అదే విధంగా కనిపిస్తోంది. – అసలు జరిగిన కేసేంటి.. వాదనలేంటి? ఇచ్చిన తీర్పు చూసిన తర్వాత నాకు తెలిసి చంద్రబాబుకు ఏ రకమైన రిలీఫ్ కలగలేదు. – వాస్తవానికి ముందుగా గమనించాల్సింది ఏంటంటే 17ఏ వర్తిస్తుందా లేదా అనేది అది ఒక ప్రొసీజరల్ సెక్షన్ మాత్రమే. – 2018లో అమల్లోకి వచ్చిన ఈ సెక్షన్ ఈ కేసుకు వర్తించదు.. స్కిల్ స్కాం అనేది 2015 ప్రాంతంలోనే జరిగింది. – ఈ క్రమంలో చంద్రబాబు, వారీ పార్టీ వారు, వారి లాయర్లు ఎక్కడా బాబు తప్పుచేయలేదు అనడం లేదు. – రూ. 370 కోట్ల ప్రజా ధనాన్ని నేను దోచుకోలేదని ఎక్కడా వారి వాదనల్లో లేదు. – గవర్నర్ అనుమతి లేదనో, స్పీకర్ చెప్పలేదనో 17ఏ ని చూపించి క్వాష్ చేయండని కోరారు. ఇద్దరు జడ్జిలు రిమాండ్ ప్రక్రియలో లోపం లేదనే ఏకాభిప్రాయాన్ని చెప్పారు.. – ఈ రోజు ఇచ్చిన తీర్పులో జడ్జిలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. – అయితే ఇద్దరూ కామన్‌గా రిమాండ్ తీసుకోవడంలో అంతా పద్దతి ప్రకారమే జరిగిందని చెప్పారు. – గతంలో కూడా ఓటుకు నోటు కేసులో దొరికిపోయినప్పుడు కూడా ఇదే రకమైన వాదనలు చేశారు. – సెక్షన్ 8 అమల్లో ఉంది.. మీకూ పోలీసులున్నారు.. మాకూ ఉన్నారు.. మీకూ ఏసీబీ ఉంది మాకూ ఉంది అంటూ మాట్లాడారు. – ఇలాంటి వితండ వాదం చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. – గతంలో సెక్షన్ 17ఏ అనేది వర్తించదని దాదాపు 6 కోర్టులు చెప్పాయి. – అంత క్లియర్‌గా ఉంటే.. దానికి అనుగుణంగా విచారణ సంస్థలు ఫైట్ చేస్తున్నాయి. – ఈ రోజు వచ్చిన తీర్పు చూసిన తర్వాత చంద్రబాబు బోనులో నిలబడి న్యాయస్థానం, విచారణ సంస్థల ముందు దొంగలా నిలబడి సమాధానం చెప్పాల్సి ఉంది. – 52 రోజులు జైలు శిక్ష అనుభవించి, ఆరోగ్య కారణాలు చెప్పి బెయిల్‌పై ఉన్న ఒక దొంగే తప్ప నిజాయితీపరుడు, అమాయక చక్రవర్తి అని న్యాయస్థానాలు చెప్పలేదు. – ఈ రోజు వచ్చిన తీర్పును వారికి నచ్చినట్లు అన్వయించుకుని ప్రచారం చేసుకుంటున్నారు. – ఎంత సేపూ తప్పు చేయలేదని చెప్పరు.. చేసిన విధానం బాగాలేదంటూ మాట్లాడుతున్నారు. – మీరు చేసిన దొంగపని విచారణ సంస్థలు, కేంద్ర సంస్థలు అంగీకరించాయి కాబట్టి ఆయన రిమాండ్‌కు వెళ్లాడు. – ఈ రోజు కేసు కొట్టేసినట్లు ఎల్లో మీడియా బాకాలు కొట్టుకుంటోంది. – ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు చేతికి పడిన సంకెళ్లు, ఆయనపై పడ్డ మచ్చను నిరూపించుకోవాలి. – వీటన్నిటికన్నా మించి రేపు ప్రజా క్షేత్రంలో ప్రజలు నిర్ణయిస్తారు. చంద్రబాబు చేసిన తప్పును ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా ప్రజాకోర్టులో మరొకసారి శిక్ష పడే రోజు త్వరలోనే ఉంది. ప్రశ్నలు–సమాధానాలు: – క్యాబినెట్లో పెట్టినదానికి, స్కిల్ స్కాంలో చేసిన దానికి అసలు సంబంధమే లేదు. – అసలు ఫైల్ ముఖ్యమంత్రి వద్దకే రాదంటూ మంత్రిగా చేసిన వ్యక్తి మాట్లాడుతున్నాడు. అసలు గెలవకుండానే మంత్రి అయిన వ్యక్తికి అంతకంటే ఏం తెలుస్తుంది..? – 17ఏ అనేది నీకు, జరిగిన అవినీతికి సంబంధం లేదు అనేది కాదు కదా? – దాన్ని కేసుకు ముడిపెట్టి ప్రజల్ని తప్పుదోవపట్టిస్తున్నారు. – నా సీటు గురించి మీరెందుకు గాబరా పడుతున్నారు..? మూడు లిస్టులు కాకపోతే.. నాలుగు.. లేదంటే పార్టీకి పనిచేస్తా. లేని పార్టీకి ఎవరైతే మాకెందుకు..?: – ఈ రాష్ట్రంలో లేని పార్టీకి ఎవరు అధ్యక్షులు అయితే మాకేంటి? – గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 0.4 శాతం నోటా కంటే తక్కువ వచ్చింది. – అటువంటి లేని పార్టీ గురించి చర్చించుకోవడం అనవసరం. – రాజకీయాల్లో ఉన్న వాళ్లకు అన్నదమ్ములు చాలా మందికి ఉంటారు. ఉన్నోరంతా ప్రధానులు, రాష్ట్రపతులు కాలేరు కదా? – ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సీట్లు కాదు కదా ఓట్లేసే వారు లేరు. – దానికి ఈ రాష్ట్రానికి వారు చేసిన అన్యాయం కారణం.. మనం కలిసి నిర్మించుకున్న ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టింది వారు. – రాష్ట్ర భవిష్యత్తును గొడ్డలితే నరికిన పార్టీ కాంగ్రెస్. అలాంటి పార్టీ ఈ రాష్ట్రానికి ఉండకూడదు అని ప్రజలు అనుకున్నారు. అలానే లేకుండా చేశారు. – నాకు తెలిసి ఆ పార్టీ ప్రభావం జీరో అనేదే నా అభిప్రాయం. -
విశాఖలో బడుగుల విజయవిహారం
సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన చేయూతతో సాధికారత సాధించిన బడుగు, బలహీన వర్గాల ప్రజలు శనివారం విశాఖ తీరంలో విజయ విహారం చేశారు. వేలాదిగా తరలివచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నిర్వహించిన సామాజిక సాధికార బస్సు యాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సీఎం జగన్ అందించిన పథకాలతో తాము సాధించిన విజయాలను, సామాజిక న్యాయాన్ని వివరిస్తూ ముందుకు సాగారు. నెడ్‌క్యాప్ చైర్మన్, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కె.కె రాజు ఆధ్వర్యంలో మాధవధార నుంచి కైలాసపురంలో ఇనార్బిట్ మాల్ వరకూ వందలాది బైకులు, కార్ల ర్యాలీతో యాత్ర సాగింది. జై జగన్.. జై జై జగన్ అంటూ వారికి స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు. కైలాసపురం వద్ద జరిగిన బహిరంగ సభకు తరలివచ్చిన ప్రజలతో ఆ ప్రాంతం జనసంద్రమే అయింది. సభ ఆద్యంతం ‘జగనే కావాలి.. మళ్లీ జగనే రావాలి’ అంటూ ప్రజలు నినాదాలతో హోరెత్తించారు. పేదల అభ్యున్నతి జగన్‌తోనే సాధ్యం: డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు పేద ప్రజల అభ్యున్నతి సీఎం వైఎస్ జగన్‌తోనే సాధ్యమని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అక్కున చేర్చుకుని, వారిని సాధికారత దిశగా నడిపించిన సీఎం జగన్ ఒక్కరేనని తెలిపారు. ఈ వర్గాలను చంద్రబాబు ఎప్పుడూ ఓటు బ్యాంకుగానే భావించారని, అధికారంలోకి వచ్చాక అవహేళన చేశారని అన్నారు. ఎన్నికలు సమీపించడంతో చంద్రబాబు మరో మారు మాయల పకీరులా మోసం చేయడానికి వస్తున్నాడన్నారు. రుణ మాఫీ పేరుతో రైతులను, మహిళలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. అదే రైతులు, అక్కచెల్లెమ్మలను సీఎం వైఎస్ జగన్ ఆదుకొని, వారి కుటుంబాలను అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం వృద్ధాప్య పింఛన్లు 3 వేలకు పెంచారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 32 లక్షల మంది పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాలు ఇచ్చి దేశ చరిత్రలో రికార్డు నెలకొల్పారన్నారు. అసమానతలు రూపుమాపుతున్నసీఎం జగన్ : మంత్రి మేరుగు సీఎం వైఎస్ జగన్ సమాజంలో అసమానతలను రూపుమాపుతున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. అందరూ సమానంగా ఉండాలనేది సీఎం జగన్ ఆలోచనైతే.. దళితులపై దాడులు, బీసీలను తోకలు కత్తిరిస్తానని బెదిరించిన వ్యక్తి చంద్రబాబు అని తెలిపారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో ప్రతి పేదవాడు ఆర్ధి కంగా బలోపేతమయ్యాడని చెప్పారు. చంద్రబాబు పాలనలో 12 శాతం ఉన్న పేదరికం సీఎం జగన్ పాలనలో 6 శాతానికి తగ్గిందన్నారు. అంబేడ్కర్ కలలు నిజమవుతున్నాయి: మేయర్ హరి వెంకట కుమారి పేదలు అభ్యున్నతి చెందాలన్న అంబేడ్కర్, జ్యోతిరావు పూలే వంటి మహానుభావులు కన్న కలలను సీఎం వైఎస్ జగన్ నిజం చేస్తున్నారని గ్రేటర్ విశాఖ మేయర్ హరి వెంకటకుమారి చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీ్టలు అభివృద్ధి చెందిన తీరే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ వర్గాలకు చట్టసభల్లో, నామినేటెడ్ పదవుల్లో రాజకీయంగా సముచిత స్థానం కల్పించారన్నారు. నియోజకవర్గంలో రూ.3467.76 కోట్లతో సంక్షేమం, అభివృద్ధి: కె.కె.రాజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో రూ.3,467.76 కోట్లతో సంక్షేమం, అభివృద్ధి జరిగిందని నియోజకవర్గ సమన్వయకర్త కె.కె. రాజు తెలిపారు. విశాఖను పారిశ్రామిక, పర్యాటక, విద్యా, వైద్య రంగాల్లో దేశంలోనే అగ్ర నగరాలకు దీటుగా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. 17 ఎకరాల్లో రూ.500 కోట్లతో ఇనార్బిట్‌మాల్, ఐటీ టవర్, మెగా కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం ప్రారంభమవుతున్నాయని తెలిపారు. ఇది పూర్తయితే 2 వేల మందికి ఉద్యోగావకాశాలు, కంచరపాలెం ఇండస్ట్రీయల్ ఎస్టేట్ ప్రాంతంలో ఎఎస్ఎన్ మెఘా మాల్ ద్వారా 1500 మందికి పైగా ఉపాధి పొందుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్‌కుమార్, కంబాల జోగులు, తిప్పల నాగిరెడ్డి, గొల్ల బాబురావు, పెట్ల ఉమాశంకర గణేష్, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పండుల రవీంద్రబాబు, కుంభా రవిబాబు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర, మాజీ ఎమ్మెల్యే ఎస్.ఎ. రెహా్మన్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌లోకి షర్మిల.. వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసి.. ఆ పార్టీ కండువా కప్పుకున్నారు షర్మిల. ఈ పరిణామంపై వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఎవరు ఏ పార్టీలో చేరినా.. తమకు వచ్చిన ఇబ్బందేమీ లేదని అన్నారు. ఏపీ ప్రజలు మళ్లీ జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారని తెలిపారాయన. ఎవరు కలిసినా, కూటములుగా వచ్చినా మాకు భయం లేదు. మళ్లీ జగన్ సీఎం కావాలి.. మాకు దేవుడి, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. ఎవరు ఏ పార్టీలో చేరినా మాకు ఇబ్బంది ఉండదని పేర్కొన్నారాయన. అలాగే.. తాను వ్యక్తిగతంగా ఎవరి గురించి మాట్లాడనన్నారు. ఇక.. వచ్చే ఎన్నికల్లో అన్నిస్థానాల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం జరుగుతున్న మార్పుల గురించి స్పందిస్తూ.. పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నామని, అన్నినియోజకవర్గాల్లో మార్పులు చేస్తున్నామని, ఇది కొంతమందికి నచ్చకపోవచ్చని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. -
అలాంటివాళ్లు వెళ్లిపోతేనే మంచిది: ఏపీ మంత్రి అమర్నాథ్
సాక్షి,విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచే వారికి మాత్రమే సీట్లు ఇస్తామని, ఈ విషయంలో కాంప్రమైజ్, కన్విన్స్ ఉండదని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. వీరభద్రరావు పార్టీని వీడటంపై గుడివాడ స్పందించారు. సీటు ఇస్తేనే ఉంటామని చెప్పే వ్యక్తులు పార్టీలో ఉండొద్దని పార్టీ ఇప్పటికే పార్టీ చెప్పిందని గుర్తు చేశారు. ‘కొద్ది రోజుల క్రితం కొన్ని నియోజకవర్గాల్లో సమన్వయ కర్తల పేర్లు ప్రకటించారు. అప్పటి నుంచి చర్చ మొదలైంది. సీటు ఇస్తేనే ఉంటామని చెప్పే వ్యక్తులు పార్టీ లో ఉండొద్దని స్పష్టంగా పార్టీ చెప్పింది. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేని వారికి ప్రత్యామ్నాయం ఇస్తామని వైవి సుబ్బారెడ్డి కూడా చెప్పారు. టికెట్లు రాని వ్యక్తులు ఎన్నికల వేళ పార్టీ కి దూరంగా ఉండటం వల్ల నష్టం లేదు’ ‘ఏపీలో 175 సీట్లే ఉన్నాయి. అంత మందికి మాత్రమే సీట్లు ఇవ్వ గలరు. దాడి వీరభద్రరావు కుటుంబానికి ఇప్పటికే పార్టీ కొన్ని అవకాశాలు ఇచ్చింది. ఆయన వాటిని తిరస్కరించారు. కొందరు పార్టీలో ఉండి వెన్నుపోటు పొడవటం కంటే వెళ్లిపోవడమే పార్టీకి మంచిది’ అని గుడివాడ స్పష్టం చేశారు. ఇదీచదవండి..బాబు, పవన్‌లే అలా రాయిస్తున్నారు: వైవీ సుబ్బారెడ్డి -
చంద్రబాబు మోసం.. నక్కాకు చేదు అనుభవం
సాక్షి, అల్లూరి: చంద్రబాబు చేసిన దారుణ మోసాన్ని ప్రస్తావిస్తూ.. టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అరకులో మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబుకు చేదు అనుభవం ఎదురైంది. సొంత పార్టీ నేతల నుంచే నిరసన సెగ తగిలింది ఆయనకి. నక్కా ఆనంద్ బాబు తాజాగా అరకు పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో టీడీపీ స్థానిక నేతలు, కార్యకర్తలు ఆయన్ని అడ్డుకున్నారు. టీడీపీ నేత అబ్రహాంకు అన్యాయం చేశారంటూ నినాదాలు చేశారు. మావోయిస్టుల చేతిలో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే సోము తనయుడు అబ్రహాం. అబ్రహాంకు టికెట్ ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారు. దీంతో నక్కా ఆనంద్‌బాబును అడ్డుకోవడం ద్వారా టీడీపీ అధిష్టానానికి తమ నిరసన గళం వినిపించారు కార్యకర్తలు.