
సాక్షి,విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ నుంచి గెలిచే వారికి మాత్రమే సీట్లు ఇస్తామని, ఈ విషయంలో కాంప్రమైజ్, కన్విన్స్ ఉండదని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. వీరభద్రరావు పార్టీని వీడటంపై గుడివాడ స్పందించారు. సీటు ఇస్తేనే ఉంటామని చెప్పే వ్యక్తులు పార్టీలో ఉండొద్దని పార్టీ ఇప్పటికే పార్టీ చెప్పిందని గుర్తు చేశారు.
‘కొద్ది రోజుల క్రితం కొన్ని నియోజకవర్గాల్లో సమన్వయ కర్తల పేర్లు ప్రకటించారు. అప్పటి నుంచి చర్చ మొదలైంది. సీటు ఇస్తేనే ఉంటామని చెప్పే వ్యక్తులు పార్టీ లో ఉండొద్దని స్పష్టంగా పార్టీ చెప్పింది. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేని వారికి ప్రత్యామ్నాయం ఇస్తామని వైవి సుబ్బారెడ్డి కూడా చెప్పారు. టికెట్లు రాని వ్యక్తులు ఎన్నికల వేళ పార్టీ కి దూరంగా ఉండటం వల్ల నష్టం లేదు’
‘ఏపీలో 175 సీట్లే ఉన్నాయి. అంత మందికి మాత్రమే సీట్లు ఇవ్వ గలరు. దాడి వీరభద్రరావు కుటుంబానికి ఇప్పటికే పార్టీ కొన్ని అవకాశాలు ఇచ్చింది. ఆయన వాటిని తిరస్కరించారు. కొందరు పార్టీలో ఉండి వెన్నుపోటు పొడవటం కంటే వెళ్లిపోవడమే పార్టీకి మంచిది’ అని గుడివాడ స్పష్టం చేశారు.
ఇదీచదవండి..బాబు, పవన్‌లే అలా రాయిస్తున్నారు: వైవీ సుబ్బారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment