dadi veerabhadra rao
-
కొణతాల మదిలో ఓటమి భయం
సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి నియోజకవర్గంలో టీడీపీ–జనసేన పొత్తు పాట్లు తారస్థాయికి చేరుకున్నాయి. సోమవారం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఆధ్వర్యంలో అనకాపల్లిలో నిర్వహించిన “టీడీపీ–జనసేన’ పార్టీల విస్తృత స్థాయి ఉమ్మడి సమావేశానికి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి పరుచూరి భాస్కర్‌రావు డుమ్మా కొట్టారు. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన కుమారుడు దాడి రత్నాకర్, వారి వర్గీయులు ఈ సమావేశానికి హాజరవుతారని విస్తృత ప్రచారం చేశారు. సమావేశం చివరి వరకూ అందరూ ఎదురుచూశారు. కానీ వారెవరూ రాలేదు. వీరికి తోడుగా జనసేన నేత పరుచూరి భాస్కర్‌రావు, ఆయన వర్గీయులు కూడా ఈ సమావేశానికి హాజరుకాలేదు. కేవలం 150 నుంచి 200 మందితోనే నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం జరగడం, జనసేన, టీడీపీ కేడర్ రాకపోవడంతో కొణతాల రామకృష్ణ వర్గీయులు డీలా పడ్డారు. కొణతాల మదిలో ఓటమి భయం టీడీపీ–జనసేన పార్టీల తొలి విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించిన మరుక్షణం నుంచి అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ, జనసేన శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, జనసేన నాయకుడు పరుచూరి భాస్కర్‌రావు వర్గీయులైతే పదేళ్లుగా నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తే.. నిన్న కాక మొన్న పారీ్టలో చేరిన వారికి టికెట్ ఎలా ఖరారు చేస్తారని ఆందోళనలు, నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. వీరికి తోడుగా మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా టికెట్ ఆశించారు. టీడీపీ–జనసేన పారీ్టల మొదటి జాబితాలో అనూహ్యంగా అనకాపల్లి ఎమ్మెల్యే టికెట్‌ను మాజీ మంత్రి కొణతాలకు ఖరారు చేశారు. దీంతో పీలా, పరుచూరి, దాడి అసంతృప్తి వ్యక్తం చేస్తూనే వచ్చారు. అధిష్టానం ఆదేశాల మేరకు కొణతాలకు మద్దతు ఇస్తామని చెప్పినప్పటికీ.. వారి మదిలో కొణతాలను ఓడించాలనే ఉంది. వ్యతిరేక వర్గంగా ఉన్న పీలా, దాడి వీరభద్రరావులను కొణతాల స్వయంగా కలిసి సయోధ్య కుదుర్చుకున్నారు. అంతేకాకుండా మీడియా ముందు తామంతా కలిసి ఉన్నట్లుగానే చెప్పుకొచ్చారు. ఇదే సరైన సమయంగా భావించిన కొణతాల సోమవారం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి అందరం కలిసి ఉన్నారనే సంకేతాన్ని కేడర్‌కు అందిద్దామని ఆశించారు. కానీ విస్తృత స్థాయి సమావేశానికి కీలకమైన దాడి వీరభద్రరావు, పరుచూరి భాస్కర్‌రావుతో పాటు వారి వర్గీయులు సైతం రాకపోవడంతో కొణతాల మదిలో ఓటమి భయం పట్టుకుంది. అనకాపల్లి నియోజకవర్గం జనసేన కేడర్ కూడా పూర్తిగా హాజరు కాలేదు. అలిగిన నాగ జగదీష్ టీడీపీ–జనసేన పార్టీల విస్తృత స్థాయి సమావేశాన్ని పీలా గోవింద సత్యనారాయణతో కలిసి కొణతాల నడిపించడంతో పీలా వ్యతిరేకవర్గ నాయకుడైన బుద్ధ నాగజగదీష్ అలకబూనారు. విస్తృతస్థాయి సమావేశానికి వచ్చిన జగదీష్ ను, ఆయన వర్గీయులను పట్టించుకోకుండా పీలాకు ప్రాధాన్యం ఇవ్వడంతో చిన్నబుచ్చుకున్నట్టు సమాచారం. మొత్తం మీద అనకాపల్లి నియోజవర్గంలో టీడీపీ–జనసేన పొత్తుతో కేడర్ పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. -
అలాంటివాళ్లు వెళ్లిపోతేనే మంచిది: ఏపీ మంత్రి అమర్నాథ్
సాక్షి,విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచే వారికి మాత్రమే సీట్లు ఇస్తామని, ఈ విషయంలో కాంప్రమైజ్, కన్విన్స్ ఉండదని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. వీరభద్రరావు పార్టీని వీడటంపై గుడివాడ స్పందించారు. సీటు ఇస్తేనే ఉంటామని చెప్పే వ్యక్తులు పార్టీలో ఉండొద్దని పార్టీ ఇప్పటికే పార్టీ చెప్పిందని గుర్తు చేశారు. ‘కొద్ది రోజుల క్రితం కొన్ని నియోజకవర్గాల్లో సమన్వయ కర్తల పేర్లు ప్రకటించారు. అప్పటి నుంచి చర్చ మొదలైంది. సీటు ఇస్తేనే ఉంటామని చెప్పే వ్యక్తులు పార్టీ లో ఉండొద్దని స్పష్టంగా పార్టీ చెప్పింది. ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేని వారికి ప్రత్యామ్నాయం ఇస్తామని వైవి సుబ్బారెడ్డి కూడా చెప్పారు. టికెట్లు రాని వ్యక్తులు ఎన్నికల వేళ పార్టీ కి దూరంగా ఉండటం వల్ల నష్టం లేదు’ ‘ఏపీలో 175 సీట్లే ఉన్నాయి. అంత మందికి మాత్రమే సీట్లు ఇవ్వ గలరు. దాడి వీరభద్రరావు కుటుంబానికి ఇప్పటికే పార్టీ కొన్ని అవకాశాలు ఇచ్చింది. ఆయన వాటిని తిరస్కరించారు. కొందరు పార్టీలో ఉండి వెన్నుపోటు పొడవటం కంటే వెళ్లిపోవడమే పార్టీకి మంచిది’ అని గుడివాడ స్పష్టం చేశారు. ఇదీచదవండి..బాబు, పవన్‌లే అలా రాయిస్తున్నారు: వైవీ సుబ్బారెడ్డి -
ఎమ్మెల్యే గాయపడితే హేళన చేస్తారా!.. వాళ్లు తిరగబడితే ఏం చేస్తారు?
సాక్షి,అనకాపల్లి: విశాఖ పరిపాలన రాజధాని అనేది భావితరాల కోసం జరిగే పోరాటమని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖ గర్జన ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలు తమ ఆకాంక్షను బలంగా వినిపించారని పేర్కొన్నారు. విశాఖ ఉద్యమాన్ని ప్రతిపక్ష పార్టీలు పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రజలు రాజధాని కోరుకోవట్లేదని టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ‘మా దగ్గరకు వచ్చి మా ప్రాంతం నాశనం అయిపోవాలని కోరుకుంటారా. పాదయాత్ర పేరుతో వచ్చే వారిని తరిమి కొట్టడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారు. చెప్పులు చూపించమని, తొడలు కొట్టమని కోర్టు ఎక్కడ చెప్పలేదు. మూడు రాజధానుల ఉద్యమంలో నర్సీపట్నం ఎమ్మెల్యే గాయపడితే ఆయనను హేళన చేస్తున్నారు. ఎమ్మెల్యేను అభిమానించే వాళ్ళు పాదయాత్రపై తిరగబడితే ఏం చేస్తారు. మా ప్రాంతానికి వచ్చి మమ్మల్నే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయనేది సీఎం ఆలోచన’ అని మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యానించారు. కాలగర్భంలో కలిసిపోయే నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు ప్రథముడని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ధ్వజమెత్తారు. చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలు తీసుకోవడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రథముడని కొనియాడారు. మూడు రాజధానుల ఏర్పాటు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయమని పేర్కొన్నారు. 29 గ్రామాల ప్రజలు రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయం తీసుకుంటే శాసన సభ ఎమ్మెల్యేలు ఎందుకని ప్రశ్నించారు. చదవండి: జూనియర్ డాక్టర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. స్టైఫండ్ పెంపు -
చంద్రబాబు ఇక రాజకీయ సెలవు తీసుకో : దాడి వీరభద్రరావు
-
అక్రమాలు చేసేందుకే 'సీఆర్డీఏ'లో సెక్షన్లు
అనకాపల్లి: అమరావతి కోసం దళితవర్గాల అసైన్మెంట్ భూముల సేకరణ, అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు డిమాండ్ చేశారు. దళితులకిచ్చిన ప్రభుత్వ భూములను చంద్రబాబు అనుచరులు అక్రమంగా సేకరించి లబ్ధిపొందారని ఆయన ఆరోపించారు. భూముల సేకరణలో అక్రమాలు, అవినీతి చోటుచేసుకున్నా మంత్రిపై, అధికారులపై కేసులు పెట్టరాదని సీఆర్డీఏ చట్టంలో సెక్షన్ 146 చేర్చడాన్ని చూస్తే.. అక్రమాలు చేయడానికి ముందే సిద్ధపడినట్లు రుజువైందని చెప్పారు. ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి పోస్టులో జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారి చెరుకూరి శ్రీధర్‌ను నియమించడం ఒక నేరమని చెప్పారు. శ్రీధర్‌ను ముందుపెట్టుకొని సీఆర్డీఏను మంత్రి నారాయణ సొంత ఎస్టేట్‌గా వాడుకున్నారన్నారు. చంద్రబాబు ప్రతి విచారణకు కోర్టుల నుంచి స్టే తెచ్చుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్ గవర్నర్ వద్దకుగానీ, ప్రివిలేజ్ కమిటీ వద్దకుగానీ వెళ్లకపోవడం క్రమశిక్షణ ఉల్లంఘనేనని పేర్కొన్నారు. తాను ప్రివిలేజ్ కమిటీ పరిధిలోకి రానని ఆయన చెప్పడం సభాహక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని చెప్పారు. తర్వాత వాయిదాకు హాజరుకాకపోతే ఆయనపై వారెంట్ జారీచేసి అరెస్టు చేసే అధికారం ప్రివిలేజ్ కమిటీకి ఉందన్నారు. ఆరు రోజుల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయకుండా ఎన్నికల కమిషనర్ పారిపోవడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. తన ఉత్తరాలను లీకు చేస్తున్నారంటూ గవర్నర్ కార్యదర్శిపై ఎన్నికల కమిషనర్ ఫిర్యాదు చేయడం సరికాదని చెప్పారు. -
చంద్రబాబు స్టేను ఉపసంహరించుకోవాలి
సాక్షి, విశాఖపట్నం : అమరావతిలో రాజధాని పేరుతో దళితుల భూముల అవినీతిపై తెలుగుదేశం ప్రభుత్వంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు డిమాండ్ చేశారు. భూమి సేకరణలో ఎటువంటి అవకతవకలు, అవినీతి జరిగినా మంత్రులపైగానీ, అధికారులపై గానీ ఎటువంటి కేసులు పెట్టరాదని సీఆర్డీఏ చట్టంలో సెక్షన్ 146 చేర్చినపుడే ఈ అక్రమాలు చేయడానికి చంద్రబాబు అనుచరులు సిద్దపడ్డారని అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత 5 సంవత్సరాల సూపర్ ముఖ్యమంత్రిగా, ఒక నియంతలా అమరావతిపై అధికారం చెలాయించింది మాజీ మంత్రి నారాయణ కాదా? అని ప్రశ్నించారు. సీఆర్డీఏని మాజీమంత్రి నారాయణ తన సొంత ఎస్టేట్‌లా వాడుకున్నారన్నారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరూ కోరుకోరు అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనటం నిజం కాదా అని ప్రశ్నించారు. అమరావతి భూముల విషయంలో స్టే తెచ్చుకున్న చంద్రబాబు స్టేను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషనర్ రిటైర్ అయ్యేలోపు ఆ యన ప్రారంభించిన ఎం పీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను జరపకపోతే రిటైర్మెంట్ బె నిఫిట్స్‌ను రద్దు చేయాలని ప్రభు త్వానికి విజ్ఞ ప్తి చేశారు. చదవండి : స్టేలు తెచ్చుకోవడంలో బాబుది గిన్నిస్ రికా ర్డ్ -
అమరావతిలో దళితుల భూములపై సమగ్ర దర్యాప్తు చేయాలి
-
‘కోడెలకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు’
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో అవినీతిపై యుద్ధం ప్రకటించి సీఎం వైఎస్ జగన్ అక్రమార్కుల భరతం పడుతుంటే చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు ధ్వజమెత్తారు. విశాఖలో ఆదివారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ గత ఐదేళ్లూ రాష్ట్రాన్ని దోచుకున్నారు. వారి హయంలో జరిగిన ప్రతి దోపిడీ వెనుక వీరిద్దరి హస్తం ఉంది. చంద్రబాబు అవినీతిని బయటపెడుతుంటే.. తప్పుడు ఆరోపణలతో విషయాన్ని పక్కదారి పట్టించాలని చూస్తున్నారు. అచ్చెన్నాయుడిని ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్ట్ చేస్తే బీసీ కార్డు వాడుతున్నారు. జేసీ ప్రభాకరరెడ్డి అరెస్టయితే కక్ష సాధింపు అని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. సీఎం జగన్ గేట్లు ఎత్తితే టీడీపీ ఎమ్మెల్యేలు మొత్తం వైఎస్సార్సీపీలో చేరేవారు. కానీ వైఎస్ జగన్ విలువలు కలిగిన వ్యక్తి కాబట్టే మీలాగా పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించలేదు. పార్టీలో చేరాలనుకున్నా వారు రాజీనామా చేసి రావాలని చెప్పారు. మీరు అధికారంలో ఉన్పప్పుడు 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలని కొనుగోలు చేసి కొందరికి మంత్రి పదవి ఇచ్చిన చరిత్ర మీది. చదవండి: 'మీ అలీబాబా 40 దొంగల స్టోరీ అంతా వారికి తెలుసు' సీఎం వైఎస్ జగన్ ఒక సంవత్సరం పాలనలో 4 కోట్ల మంది ప్రజలకి రూ. 44వేల కోట్ల లబ్ధి చేకూరింది. అవినీతికి ఆస్కారం లేకుండా దళారీ వ్యవస్థ లేకుండా నడుపుతున్న ప్రభుత్వం మాది. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎపుడైనా అవినీతి నిర్మూలనపై తగిన ఆదేశాలు ఇచ్చారా..? అవినీతిపరులకి మీరే అండగా ఉంటూ కార్యకర్తలపై ఒత్తిడి తెచ్చి ధర్నాలు చేయమంటున్నారు. ఎన్నికల ముందు పోలవరంలో అవినీతి జరిగిందని ప్రధానిమోదీ చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. పోలవరంపై ప్రధాని మోదీ విచారణ చేసి ఉంటే ఈ రోజు చంద్రబాబు ఎన్నికలలో పోటీచేసే అవకాశమే ఉండేది కాదు. ఈఎస్ఐలో మంత్రి అచ్చెన్నాయుడు 150 కోట్ల కుంభకోణం చేశారు. ఈఎస్ఐ కుంభకోణంలో లోకేష్ పాత్ర, మిగిలిన వారి పాత్ర ఎంత ఉందో వెలికి తీయాలి. ఈఎస్ఐ కుంభకోణంలో మంత్రి ప్రమేయం లేనప్పుడు ఆయన ఎందుకు సిఫార్సు లేఖలు ఇచ్చారు. ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రి ప్రమేయం లేదంటే మీ హస్తముందా చంద్రబాబూ అంటూ ప్రశ్నించారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తిని పరామర్శించాలంటే కోర్టు అనుమతి ఉండాలని మీకు తెలియదా..? అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై చంద్రబాబు, లోకేష్ అతిగా బాధపడటం చూస్తుంటే వీరి పాత్రపై అనుమానాలు కలుగుతున్నాయి. చదవండి: టీడీపీ వ్యూహం.. అట్టర్ ఫ్లాప్ కోడెలపై అవినీతి ఆరోపణలు వచ్చినపుడు కనీసం చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆయన ఆత్మహత్యకి చంద్రబాబు కారణం కాదా..! అచ్చెన్నాయుడిపై చూపిన ప్రేమ మీరు కోడెలపై ఎందుకు చూపలేదు.. కోడెలపై కక్ష సాధింపు చేపట్టారా. అచ్చెన్నాయుడి కుటుంబం మొదటి నుంచి పార్టీకి సేవలు చేశారని చెబుతున్నారు. అయితే వాజ్‌పేయి హయాంలో ఎర్రన్నాయుడికి మీరు స్పీకర్ అవకాశం రాకుండా చేయలేదా..? అచ్చెంన్నాయుడు బీసీలకి నేత కాదు. అతను మీ పార్టీలో మాత్రమే నేత. మాకు ఎవరికీ నేత కాదు. చంద్రబాబు తన హయాంలో బీసీలకి చేసిందేమీ లేదు. ఎన్టీఆర్ బ్రతికున్నప్పుడు మాత్రమే టీడీపీ బీసీలపార్టీగా ఉంది. ఇప్పుడున్న టీడీపీ మనీ పార్టీ. దోచుకో.. దాచుకో..ఎన్నికల సమయంలో ఖర్చుపెట్టుకో ఇదే నినాదం. జేసీ ప్రభాకర్ రెడ్డి ట్రాన్స్ పోర్ట్ అక్రమాలపై గతంలోనే నేను కౌన్సిల్లో ప్రశ్నించాను. నిబంధనలకి విరుద్ధంగా 200 బస్సులు ఫిట్నెస్ లేకుండా జేసీ ఎలా తిప్పుతారు. గత ప్రభుత్వంలో మంత్రుల అవినీతికి చంద్రబాబే బాధ్యత వహించాలి. తను అధికారంలో ఉన్నప్పుడు చట్టం తనపని తాను చేసుకుపోతుంది అన్న బాబు ఇప్పుడు ఎందుకు ఆ మాట చెప్పలేకపోతున్నారు' అంటూ మండిపడ్డారు. -
అవినీతి వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నారు
-
ఏడాదిలోనే 90 శాతం హామీలు పూర్తి: రాష్ట్ర కార్యదర్శి
సాక్షి, విశాఖపట్నం: దేశంలో మొదటి సంవత్సరంలోనే 90 శాతం హామీలను నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... గ్రామస్థాయిలో సచివాలయాలు పెట్టి సుమారు 20 శాఖల పాలనను అందిస్తున్నారన్నారు. ప్రతి 50 గృహాలకు వాలంటీర్లను నియమించి నేరుగా ప్రజల వద్దకే సంక్షేమ పథకాలను అందిస్తూ సీఎం జగన్ ఆదర్శ పాలనను సాగిస్తున్నారన్నారు. (భరోసా కేంద్రాలతో రైతులకు మేలు..) ప్రతి నెల 1వ తేదీన లబ్ధిదారులకు నేరుగా ఇంటివద్దకే నగదు రూపంలో పించన్ అందించడం ఒక ప్రయోగమని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రాల ఉద్యమాలు తలెత్తకుండా 3 రాజ్యాంగ వ్యవస్థలను 3 ప్రాంతాలలో నెలకొల్పి పరిపాలనను వికేంద్రీకరణ చేయడం సీఎం జగన్ తీసుకున్న ఆదర్శ ఆలోచన అన్నారు. ప్రతి పార్లమెంటు, నియోజకవర్గ స్థాయిలో ఒక జిల్లాను ఏర్పాటు చేయడంలో భాగంగా 12 కొత్త జిల్లాలను త్వరలో సీఎం జగన్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
‘ఆయన చెప్పిందే నిజమైంది’
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఇంకా తానే అధికారంలో ఉన్నాననే భ్రమలో ఉన్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు విమర్శించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇంకా అధికారులను తన గుప్పెట్లో ఉంచుకోవాలనే భావనతో అధికారంలో ఉన్నట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ రమేష్ కేంద్రానికి రాశారని చెబుతున్న లేఖ ఆయన రాసింది కాదని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ఫిర్యాదు వాస్తవం అని తేలిందని పేర్కొన్నారు. (టీడీపీ అడ్డా నుంచే నిమ్మగడ్డ లేఖ?) ఆయనకు ఆ బాధే ఎక్కువగా ఉంది.. చంద్రబాబుకు కరోనా కంటే రాజధానిని ఎక్కడ విశాఖకు తరలించేస్తారనే బాధే ఎక్కువగా ఉందన్నారు. విశాఖకు వ్యతిరేకంగా అనేక పిటిషన్లను కోర్టులో వేయించడం వెనుక విశాఖపై ఆయనకి ఉన్న విష సంస్కృతికి నిదర్శనమని నిప్పులు చెరిగారు.గిరిజన ప్రాంతాలలో ఉపాధ్యాయ పోస్టులను 100 శాతం ఎస్టీలకు ఇవ్వకూడదనే తీర్పుపై రాజ్యాంగపరమైన హక్కులను కాపాడాలని సుప్రీం కోర్టులో రివిజన్ పిటిషన్ వేయాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశామని దాడి వీరభద్రరావు తెలిపారు. (అది భయంకరమైన లేఖ : అంబటి) -
చంద్రబాబు కక్ష సాధిస్తున్నారు: దాడి వీరభద్రరావు
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబును అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించినందుకు ఏపీ ప్రజలపై ఆయన కక్ష సాధిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 5 వేల కోట్లు నిధులు నిలిపివేయడంలో సఫలం అయ్యారని ఆయన మండిపడ్డారు. సుప్రీం కోర్టు కొన్ని విషయాల్లో ఎన్నికల కమిషన్‌కు అక్షింతలు వేసిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికలు నిలిపివేయడంలో ఉన్నత న్యాయస్థానం ఎన్నికల కమిషన్‌ను తప్పుపట్టిందన్నారు. (ఉనికి కోల్పోతామనే చంద్రబాబు కుట్రలు..) చంద్రబాబు సలహాలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు పాల్పడి, తీరని అన్యాయం చేసిందని దాడి వీరభద్రరావు అన్నారు. చంద్రబాబుకు స్థానిక సంస్థలపై ఎప్పుడూ విశ్వాసం లేదని దుయ్యబట్టారు. బాబు కుటుంబసభ్యులు తప్ప ఎవరూ ముఖ్యమంత్రి అయినా ఆయన అంగీకరించలేరని తెలిపారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం ఖాయమని వీర భద్రరావు ఆశాభావం వ్యక్తం చేశారు. (ఎన్నికలంటే విపక్షాలకు భయమెందుకు) -
‘చంద్రబాబు స్పీచ్‌నే లేఖగా రాశారు’
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర ఎన్నికల కమిషన్ పొలిటికల్ కమిషన్లా మారిందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు విమర్శించారు. ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్య వ్యవస్థను విచ్ఛిన్నం చేసే పరిస్థితికి రావడం దురదృష్టకరమన్నారు. మంగళవారం జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కరోనా పేరుతో రాజ్యాంగ హక్కులు కాలరాయడం సరికాదన్నారు. ఎన్నికలను ఆరు వారాలపాటు వాయిదా వేసి మళ్లీ సమీక్ష అంటే నిరవధిక వాయిదా వేసినట్లేనని వ్యాఖ్యానించారు. సీఎస్‌కు రాసిన లేఖలో కేంద్ర ఆరోగ్యశాఖాధికారులతో మాట్లాడినట్లు ఎన్నికల కమిషనర్ చెబుతున్నారని. నిన్న చంద్రబాబు ఇచ్చిన స్పీచ్‌నే ఈ రోజు కమిషనర్ సీఎస్‌కు రాసిన లేఖ అని దుయ్యబట్టారు. ఎన్నికల వాయిదా వేయాలనుకునే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలా వద్దా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులను సంప్రదించాలని ఎలా చెబుతారరంటూ.. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే సీఎస్‌ను, ఇక్కడి అధికారులను ఎందుకు సంప్రదించలేదని నిలదీశారు. చంద్రబాబు డైరక్షన్లో ఎన్నికల కమిషనర్ పనిచేస్తున్నారని విమర్శించారు. ఇతర రాష్ట్రాలలో ఎన్నికలు ఆపు చేయాలని కూడా భావిస్తున్నారని చెప్పారని, అక్కడ ఎన్నికల ప్రక్రియే ప్రారంభం కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో మరో మూడు రోజులలో ఎన్నికలు పూర్తి అయిపోతాయని, కేంద్రం నుంచి రూ.5800 కోట్ల నిధులపై మీరు ఎలా మాడ్లాడతారని కమిషనర్‌ను ప్రశ్నించారు. మీరేమైనా ప్రధానమంత్రా.. రాష్ట్రపతా.. మీరు ఏవిధంగా హామినిస్తారని ధ్వజమెత్తారు. చదవండి: 'చంద్రబాబును రాష్ట్ర ప్రజలు క్షమించరు' ‘ఆరువారాల పాటు ఎన్నికల కమిషన్ నిబంధనలు వర్తిస్తాయని చెప్పడం ద్వారా పరిపాలన ఆగిపోవాలని మీరు కుట్రలు చేశారు. పాలన స్తంభించి పోవాలని చంద్రబాబు కుట్రలో మీరు భాగస్వాములయ్యారు. మీరు చేసిన తప్పుపై మీలో పశ్చాత్తాపం లేదు. రిటైర్ అయిన అధికారిని చంద్రబాబు నియమించారు కాబట్టి ఆయనకి ఎన్నికల కమీషనర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. మీరు కరోనా వైరస్ కారణంగా వాయిదా వేశారా..శాంతి భధ్రతల సాకు చూపి వాయిదా వేశారా.. ఎందుకు ఎన్నికలు వాయిదా వేశారో ఎన్నికల కమిషనర్‌కే తెలియదు’ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చదవండి: ‘అందుకే టీడీపీ వీడి.. వైఎస్సార్ సీపీలో చేరా’ -
ఎన్నికల వాయిదా రాజ్యాంగ విరుద్ధం కాదా?
-
వైఎస్సార్సీపీ అభ్యర్ధుల ప్రకటన
-
జీవీఎంసీ ఎన్నికలు: వైఎస్సార్సీపీ రెండో జాబితా
సాక్షి, విశాఖపట్నం: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 54 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. ఈ మేరకు జీవీఎంసీ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల పేర్లను పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్, వైఎస్సార్సీపీ నేత దాడి వీరభద్రరావు శుక్రవారం ప్రకటించారు. (తొలి జాబితా కోసం క్లిక్ చేయండి) వైఎస్సార్సీపీ జీవీఎంసీ అభ్యర్థుల రెండో జాబితా విశాఖ నార్త్- డివిజన్లు 14వ డివిజన్ - కె.అనిల్‌కుమార్ 24వ డివిజన్ - పద్మారెడ్డి 26వ డివిజన్ - పీలా వెంకటలక్ష్మి 43వ డివిజన్ - పెద్దిశెట్టి ఉషశ్రీ 45వ డివిజన్ - కంపా హొనాక 48వ డివిజన్ - నీలి తిరుమలాదేవి 50వ డివిజన్ - వావిలాలపల్లి ప్రసాద్ 51వ డివిజన్ - రెయ్యి వెంకటరమణ 54వ డివిజన్ - చల్లా రజిని 55వ డివిజన్ - శశికళ విశాఖ ఈస్ట్- డివిజన్లు 10వ డివిజన్ - బొండా మాధవి 12వ డివిజన్ - అక్రమాని పుష్ప 17వ డివిజన్ - గేదెల లావణ్య 19వ డివిజన్ - సురడా వెంకటలక్ష్మి విశాఖ వెస్ట్- డివిజన్లు 56వ డివిజన్ - అదాటి శ్రీనివాసరావు 58వ డివిజన్ - జి.లావణ్య 59వ డివిజన్ - పూర్ణశ్రీ 61వ డివిజన్ - దాడి సూర్యకుమారి 62వ డివిజన్ - పల్లా లక్ష్మణరావు 63వ డివిజన్ - పిలకా రామ్మోహన్‌రెడ్డి 89వ డివిజన్ - దొడ్డి కిరణ్ 90వ డివిజన్ - చుక్కా ప్రసాద్‌రెడ్డి 41వ డివిజన్ - వై.ఫాతిమా రాణి విశాఖ సౌత్- డివిజన్లు 30వ డివిజన్ - పి.జ్యోతి. 34వ డివిజన్ - జి.గౌరి 36వ డివిజన్ - కె.స్వర్ణలత 39వ డివిజన్ - కొల్లి సింహాచలం భీమిలి 1వ డివిజన్ - అక్రమాని పద్మ 2వ డివిజన్ - సిహెచ్.కరుణాకర్‌రెడ్డి 3వ డివిజన్- ఎం.భారతి 4వ డివిజన్- ఏడుకొండలరావు 5వ డివిజన్- పి.వెంకటరమాదేవి 6వ డివిజన్ - డా.ప్రియాంక 7వ డివిజన్ - పోతుల లక్ష్మీ 98వ డివిజన్ - వై.వరాహ నరసింహం 65వ డివిజన్ - బి.నరసింహ పాత్రుడు 66వ డివిజన్- మహమ్మద్ ఇమ్రాన్ 70వ డివిజన్ - వి.రామచంద్రరావు 71వ డివిజన్- ఆర్.రామారావు 73వ డివిజన్ - బి.సుజాత 74వ డివిజన్ - టి.వంశీరెడ్డి 75వ డివిజన్- కె.భారతి 76వ డివిజన్ - బి.రమణ 78వ డివిజన్- జి.గోవిందరాజు 86వ డివిజన్- బి.సుబ్బారావు 87వ డివిజన్- పి.విజయలక్ష్మి పెందుర్తి 93వ డివిజన్- డి.అప్పలరాజు 94వ డివిజన్-ఎ.మురళీకృష్ణ 97వ డివిజన్ - జి.వెంకటలీలావతి 84 డివిజన్- పి.యశోద అనకాపల్లి 80వ డివిజన్ - కె.నీలిమ 81వ డివిజన్- పి.లక్ష్మీసౌజన్య 82వ డివిజన్- ఎం.సునీత 83వ డివిజన్ - జె.ప్రసన్నలక్ష్మి -
జీవీఎంసీ ఎన్నికలు: వైఎస్సార్సీపీ తొలి జాబితా
సాక్షి, విశాఖపట్నం: గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 48 మంది అభ్యర్థులతో కూడిన తొలిజాబితాను విడుదల చేసింది. ఈ మేరకు జీవీఎంసీ ఎన్నికల బరిలో దిగే అభ్యర్థుల పేర్లను పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్, వైఎస్సార్సీపీ నేత దాడి వీరభద్రరావు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ... జీవీఎంసీ ఎన్నికల్లో కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జీవీఎంసీ వైస్సార్సీపీ అభ్యర్థుల తొలి జాబితా విశాఖ నార్త్ 44వ డివిజన్ - శ్రీనివాసరావు 25వ డివిజన్ - లీలావతి విశాఖ నార్త్ 46వ డివిజన్ - కె.సతీష్ 49వ డివిజన్ - అల్లు శంకరరావు విశాఖ ఈస్ట్ 9వ డివిజన్ - కె.స్వాతి 11వ డివిజన్- హరికుమార్ 15వ డివిజన్ - ఎన్.రేవతి 18వ డివిజన్ - ధనలక్ష్మి 20వ డివిజన్ - ఎన్.లక్ష్మి 21వ డివిజన్ - వంశీకృష్ణ 22వ డివిజన్- పి.గోవింద్ 23వ డివిజన్- జి.విజయసాయి 52వ డివిజన్ - జి.శ్రీధర్ 60వ డివిజన్ - డీవీ సురేష్ 91వ డివిజన్ - జ్యోత్స్న 92వ డివిజన్ - స్వర్ణలత శివదేవి విశాఖ వెస్ట్ 40వ డివిజన్ - నాగేశ్వరరావు, విశాఖ సౌత్ 27వ డివిజన్ - సర్వేశ్వర్‌రెడ్డి 29వ డివిజన్ నారాయణరావు 31వ డివిజన్ - బత్తిన నాగరాజు 32వ డివిజన్ రామరెడ్డి 33వ డివిజన్ - బచ్చినపల్లి లక్ష్మి 35వ డివిజన్ కనకనాథ్రెడ్డి 37వ డివిజన్ - వడ్డాది రాజు 38వ డివిజన్ - సత్యరూప వాణి *మిగిలిన అభ్యర్థుల పేర్లను త్వరలోనే వెల్లడిస్తారు. -
‘అప్పుడు కోడిగుడ్లు, టమోటాలు విసరలేదా బాబూ’
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రలను తెలివి తక్కువ యాత్రలుగా పరిగణిస్తున్నామని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్ర రావు అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా బాబును ప్రజలు ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు వైఖరి పట్ల విరక్తి చెందిన స్థానిక ప్రజలే ఆయనను అడ్డుకున్నారని తెలిపారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ‘రెండేళ్ల క్రితం ప్రతిపక్ష హోదాలో ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమంలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాండిల్ ర్యాలీకి వస్తే కనీసం ఎయిర్ పోర్టులోకి కూడా పోలీసులు అనుమతించలేదు. కానీ, నేడు పోలీసులు కొన్ని నిబంధనలు పెట్టి చంద్రబాబుకు అనుమతులిచ్చారు. పోలీసులు అనుమతులిచ్చినా ప్రజలు అంగీకరించొద్దా? ఓ వ్యక్తి కోసం పోలీసులు లాఠీఛార్జీ చేశారు. చంద్రబాబు పర్యటన కోసం షూట్ ఎట్ సైట్ చేయాలా? ఓ వైపు ఢిల్లీ అగ్నిగుండం అవుతుంటే, జాతీయ నేతగా చెప్పుకునే చంద్రబాబు వైఖరి ఇదేనా? రాజకీయ బాధ్యత గల వ్యక్తి విశాఖలో అరాచకం సృష్టించడాన్ని ఖండిస్తున్నాం’అన్నారు. ఎన్టీఆర్‌కు అవమానం కళ్లారా చూశాను.. ఎక్కడేం జరిగినా కడప, పులివెందుల అని మాట్లాడ్డం చంద్రబాబుకు అలవాటు. కానీ, అక్కడి ప్రజలను రౌడీలుగా, గుండాలుగా పరిగణించి వారి మనోభావాలను కించపరుస్తున్నారు. 1994లో మీరు చేసిన పనేంటి? ఎన్టీఆర్ వైస్రాయ్ హోటల్‌కు వచ్చినప్పుడు చెప్పులు, కోడిగుడ్లు, టమాటాలు విసరలేదా చంద్రబాబు? ఎన్టీఆర్ చేతులు అడ్డం పెట్టుకుని తనను తాను రక్షించుకోవడం ప్రత్యక్షంగా చూసాను. ఎన్టీఆర్ వెన్నుపోటుకు విశాఖ నుంచే ఎమ్మెల్యేలతో ఆయన పథక రచన చేశారు. రాజకీయాల కోసం ఎంతటి స్థాయికయినా బాబు దిగజారుతారు. చంద్రబాబు మాటలతో ఉత్తరాంధ్ర ప్రజలు బాధపడుతున్నారు. 1994 ఆగస్టు ఎపిసోడ్‌పై సీఎం వైఎస్ జగన్ జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేయాలని డిమాండ్ కోరుతున్నా’అని వీరభద్ర రావు పేర్కొన్నారు. -
గతంలో ఎన్టీఆర్‌పై చంద్రబాబు దాడి చేయించారు
-
ఆ పాపమే చంద్రబాబును వెంటాడుతోంది..!
సాక్షి, అనకాపల్లి: డొల్ల కంపెనీల పేరుతో చంద్రబాబు అండ్ కో చేసిన లూటీలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన పాపం చంద్రబాబును వెంటాడుతుందన్నారు. 20 ఏళ్లగా చంద్రబాబు నాయుడు వద్ద పనిచేసిన పీఏ పెండ్యాల శ్రీనివాసరావు రాసిన డైరీలు, మెయిల్స్ చంద్రబాబు చేసిన అవినీతికి ప్రత్యక్ష సాక్ష్యాలు అని ఆయన పేర్కొన్నారు. (ఓటుకు నోటు కేసుపై కూడా నిగ్గు తేల్చాలి) రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా తన ప్రాబల్యం పెరగాలన్నా ఆశతో ఇటీవల ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో తన అవినీతి సొమ్ము ఖర్చుపెట్టి ఎన్నికలను ప్రభావితం చేయడానికి చంద్రబాబు ప్రయత్నించారని వీరభద్రరావు విమర్శించారు. చంద్రబాబు పీఏ కు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించి పూర్తిగా నిజాలు రాబట్టాలన్నారు. నీతి, నిజాయితీతో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి కళంకం తెచ్చిన చంద్రబాబు.. టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉండాలన్నారు. (రూ. 2 వేల కోట్లు: హైదరాబాద్‌కు చంద్రబాబు పయనం!) -
ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పోడిచిన పాపం బాబును వెంటాడుతుంది
-
బాబు ఏం చేశాడో ఆయనకు తెలియదా..?
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు స్థాయి మరిచి మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు మండిపడ్డారు. శనివారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పై అయ్యన్న చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ‘విశాఖలో మహానేత వైఎస్సార్ చేసిన అభివృద్ధి నీకు కనబడలేదా..? చంద్రబాబు అభివృద్ధి నిరోధకుడని అయ్యన్నకు తెలియదా.. విమ్స్‌ను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నించడం వాస్తవం కాదా.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి బాబు ఏం చేశారో అయ్యన్నకు తెలియదా.. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటిస్తే..ఈ ప్రాంత వ్యక్తిగా వ్యతిరేకించడం అన్యాయం కాదా.. కమర్షియల్ శాఖ ట్రిబ్యునల్ కోర్టును వైఎస్సార్ విశాఖలో ఏర్పాటు చేస్తే విజయవాడ తరలించినప్పుడు అయ్యన్న ఎందుకు అడ్డుపడలేదు’ అంటూ వీరభద్రరావు నిప్పులు చెరిగారు. విశాఖ అభివృద్ధిని చూసి ఓర్వలేకే ముఖ్యమంత్రిపై అయ్యన్న ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. -
‘చంద్రబాబు వేయి పడగల విష సర్పం’
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు వేయి పడగలు ఉన్న మహా విష సర్పమని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రాయలసీమ, ఉత్తరాంధ్రలపై చంద్రబాబు విషం కక్కుతున్నారని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్కసుతో ఉత్తరాంధ్ర ప్రజలపై కక్ష సాధిస్తున్నారని వీరభద్రరావు అన్నారు.అలాంటి చంద్రబాబుకు 23 సీట్లు ఇచ్చి ప్రజలు ప్రతిపక్షనాయకుడిగా చేసి తప్పు చేశారన్నారు. గతంలో ఎన్టీఆర్ బోఫోర్స్ కుంభకోణానికి వ్యతిరేకంగా ఎంపీలును రాజీనామా చేయించి మెప్పు పొందారని గుర్తు చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి అమరావతి అవసరం అనుకుంటే తమ పార్టీ ఎమ్మెల్యేలచే రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళవచ్చు కదా అని ప్రశ్నించారు. ఇంకా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సీఎం అని.. దేశంలో పీఎం అని భ్రమపడుతున్నారని వీరభద్రరావు ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు విశాఖపట్నంపై విషప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తుఫానులు, వరదలు వస్తాయని ప్రజలను భయపెడుతున్నారని దాడి వీరభద్రరావు ధ్వజమెత్తారు. -
పెద్దల సభపై నమ్మకం పోయింది..
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో పెద్దల సభపై నమ్మకం పోయిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. శాసన మండలిలో రాజకీయ ఒత్తిళ్ల వల్ల నిర్ణయాలు తీసుకోవడం చాలా దారుణమన్నారు. దేశంలో ఆరు రాష్ట్రాల్లో శాసన మండళ్లు ఉన్నాయని.. ఏపీలో మండలి తీరు బట్టి మిగతా రాష్ట్రాల్లో కూడా శాసన మండలిని రద్దు చేసే ప్రమాదం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ పార్టీ అధ్యక్షుడు కూడా శాసనమండలి కి వచ్చి చైర్మన్ పై ఒత్తిడి తెచ్చిన సందర్భం లేదన్నారు. శాసన మండలి చైర్మన్ దైవభక్తి, నిజాయితీ గల వ్యక్తి అని.. కానీ చంద్రబాబు ఒత్తిడితో నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ముఖ కవళికల్లో కనిపించిందన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన అంశం శాసన మండలిలో చర్చకు రాకుండా పక్కకు పెట్టడం అత్యంత నిబంధనలకు విరుద్ధం అని దాడి వీరభద్రరావు పేర్కొన్నారు. కౌన్సిల్లో చర్చించాల్సిన అంశాలు ముందుగా సభ్యులకు తెలియజేయాలన్నారు. రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపిస్తాం అని చెప్పడం కూడా రూల్స్‌కు విరుద్ధమేనన్నారు. చైర్మన్‌కు నేరుగా రూలింగ్ ఇచ్చే అధికారం లేదని.. కమిటీకి పంపించాలా లేదా అనే అంశాన్ని సభ్యుల దృష్టికి తీసుకువెళ్లి నిర్ణయం తీసుకోవాల్సిందేనని చెప్పారు. సభ్యులు ఓటింగ్ కోరితే సెలెక్ట్ కమిటీకి బిల్లు పంపిన విషయం పై ఓటింగ్ కూడా నిర్వహించాల్సిన బాధ్యత చైర్మన్ కు వుందని వివరించారు. మండలి లో నిన్న జరిగిన తీరు అప్రజాస్వామికం అని వీరభద్రరావు పేర్కొన్నారు. (చదవండి: బిల్లుపై తొలి నుంచి కుట్రపూరితంగానే...) -
‘మండలిని రద్దు చేసే అధికారం రాజ్యాంగంలో ఉంది’
సాక్షి, విశాఖపట్నం : శాసనమండలిని రద్దు చేసే అధికారం రాజ్యాంగంలో ఉందని వైఎస్సార్సీపీ నేత దాడి వీరభద్రరావు తెలిపారు. శాసన మండలిలో టీడీపీ అనవసరంగా రాద్ధాంతం సృష్టిస్తోందని మండిపడ్డారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోమవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగం అద్భుతంగా ఉందన్నారు. ఆ ప్రసంగం చూడని వ్యక్తులు.. ఒక్కసారైనా చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మూడు ప్రాంతాలకు అభివృద్దిని వికేంద్రీకరణ చేస్తూ సీఎం వైఎస్ జగన్ చారిత్రత్మక నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. శాసనసభలో ఆమోదం పొందిన వికేంద్రీకరణ బిల్లును మండలిలో అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. మండలి చైర్మన్‌కు ఒక బిల్లును అడ్మిట్ చేయాలా, వద్దా అనే అధికారం లేదన్నారు. ఏ బిల్లునైనా యథాతథంగా ప్రవేశపెట్టాలని చెప్పారు. మండలిలో చర్చ జరిగిన తర్వాత దానిని మద్దతు తెలుపాలా వద్దా అన్న అంశాన్ని సభ్యులు నిర్ణయిస్తారని చెప్పారు. టీడీపీకి మెజారిటీ ఉంటే మండలిలో సవరణలు కోరవచ్చన్నారు. కౌన్సిల్లో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని.. ఇది సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ఈ ప్రతిష్టంభన వెనక టీడీపీ ఉద్దేశమేమిటని చంద్రబాబును ప్రశ్నించారు. రాజ్యాంగ ప్రతిష్టంభన తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష నేత బాధ్యతను కూడా చంద్రబాబు నెరవేర్చలేకపోతున్నారని విమర్శించారు. టీడీపీని ఉప ప్రాంతీయ పార్టీగా మారుస్తున్నారని అన్నారు. చంద్రబాబు 29 గ్రామాలకే పరిమితం అవుతారా అని నిలదీశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు అవసరం చంద్రబాబుకు లేదా అని ప్రశ్నించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అమరావతి ఉంటే చాలు ఇతర ప్రాంతాలు వద్దంటున్నారని.. ఈ విషయాన్ని జనసేన కార్యకర్తలు గుర్తించాలని కోరారు. టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ రాజకీయాలు తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. చదవండి : మండలిలో గందరగోళం సృష్టిస్తోన్న టీడీపీ -
ఆ ప్రాంతమంటే ఆయనకు ఎందుకంత కోపం..?
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ప్రజలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు విషం కక్కుతున్నారని వైఎస్సార్సీపీ నేత దాడి వీరభద్రరావు ధ్వజమెత్తారు. విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయత్నాలు చేస్తోంటే.. చంద్రబాబు విషపూరితం చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఆయన ఎప్పుడైనా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో తాము అభివృద్ధి చెందుతామన్న భావన ఉత్తరాంధ్ర ప్రజల్లో కలుగుతుందన్నారు. పరిపాలనా రాజధానిగా సేవలందించేందుకు విశాఖకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పారు. ముంబై, చెన్నై తరహాలో అభివృద్ధి చెందే అవకాశం విశాఖకే ఉందన్నారు. నాలుగు రకాల రవాణా మార్గాలు విశాఖకు మాత్రమే ఉన్నాయని చెప్పారు. ఐఐటీ నిపుణులు కూడా అమరావతిలో భారీ నిర్మాణాలు సరికాదని చెప్పారని వివరించారు. అడగకుండానే ఇచ్చే నేత ఆయన.. అడిగినా ఇవ్వని నాయకుడు చంద్రబాబు అయితే.. అడగకుండానే ఇచ్చే నాయకుడు వైఎస్ జగన్ అని వీరభద్రరావు పేర్కొన్నారు. మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే వైఎస్ జగన్ ఆలోచన అని చెప్పారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయనపై పోటీ చేస్తానని చెప్పిన చంద్రబాబు.. పార్టీ ఓడిపోవడంతో పదవి కోసం ఎన్టీఆర్ చుట్టు తిరిగారని విమర్శించారు. కూతురు కోసం చంద్రబాబును పార్టీలోకి తీసుకుని చివరికి..అతని చేతిలోనే ఎన్టీఆర్ మోసపోయారని తెలిపారు. -
చంద్రబాబు ఇష్టం వచ్చిన విమర్శలు చేస్తున్నారు
-
చంద్రబాబుతో రామోజీకి అవసరమా?
విశాఖపట్నం : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అసాంఘిక శక్తిగా తయారయ్యారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత దాడి వీరభద్రరావు విమర్శించారు. రాజధాని రైతులను చంద్రబాబు కావాలనే రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఉద్యమానికి ఇంటికొకరు రమ్మని చంద్రబాబు పిలవడం చూస్తే.. ఆయన బకాసురుడేమో అనిపిస్తోందన్నారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని అంశంపై ఈనాడు పత్రిక ప్రజలను మభ్య పెడుతోందని తెలిపారు. ఇంకా చంద్రబాబును పట్టుకోని వేలాడటం రామోజీరావు అవసరమా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రయోజనాల కోసం పనిచేయొద్దని రామోజీకి మనవి చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం న్యాయబద్ధంగా వాస్తవాలు రాయాలని కోరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి అపఖ్యాతి తెచ్చేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు భిక్షాటన చేయడం సిగ్గుచేటని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన విరాళాలను చంద్రబాబు ఏం చేశారని నిలదీశారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనంతా అవినీతిమయని దాడి వీరభద్రరావు మండిపడ్డారు. 5 కోట్ల మంది తీర్పుతో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గెలిచారని అన్నారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని చంద్రబాబు గుర్తించం లేదని.. పైగా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే 4 లక్షల ఉద్యోగాలిచ్చారని గుర్తుచేశారు. విశాఖకు వ్యతిరేకంగా ఆందోళన చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. విశాఖ రాజధానిగా ఉంటే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. ఒక్క చంద్రబాబు మాత్రమే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. అరాచక పాలనంతా చంద్రబాబు హయాంలోనే జరిగిందని చెప్పారు. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు రూ. 2.50 లక్షల కోట్లు అప్పు చేశారని.. అందులో కొంత భాగం కేటాయించి రాజధాని నిర్మాణం చేయొచ్చుగా అని సూటిగా ప్రశ్నించారు. అప్పు తెచ్చిన డబ్బును చంద్రబాబు ఏం చేశారని నిలదీశారు. కేంద్రం రూ. 2,500 కోట్లు ఇస్తే చంద్రబాబు ఒక శాశ్వత భవనమైన కట్టలేకపోయారని ఎద్దేవా చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు రాజధానిని నిర్మించలేదని విమర్శించారు. ఉత్తరాంధ్ర ప్రజలు చేతకాని వారు కాదని.. భయపెట్టాలని చూడొద్దని హితవుపలికారు. అవసరమైతే విశాఖ ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. 33వేల ఎకరాలను చంద్రబాబు ప్రజల నుంచి లాక్కున్నారని.. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం రైతులను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్‌కు నారాయణ బ్రోకర్ అని వ్యాఖ్యానించారు. -
అప్పుడు,ఇప్పుడు మనీ కలెక్షనేనా?
-
సీఎం వైఎస్ జగన్.. రైతు పక్షపాతి
-
అభివృద్ధిపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు
-
‘ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటనను వ్యతిరేకిస్తున్నాం’
సాక్షి, విశాఖపట్నం : విశాఖ స్టీల్ ప్లాంట్‌కు చెందిన 3400 ఎకరాల భూమిని పోస్కో సంస్థకు కేటాయించాలన్న కేంద్రమత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటనను వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అన్నారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేస్తే చూస్తూ ఊరుకునే లేదని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కొరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.4,890 కోట్లు కేటాయిస్తే కేంద్రానికి పన్నుల రూపంలో స్టీల్ ప్లాంట్ రూ.40,500 కోట్లు చెల్లిందని పేర్కొన్నారు. రెండు లక్షల కోట్ల విలువైన భూమిని విదేశీ ప్రైవేటు సంస్థలకు రూ.4849 కోట్లకు సెబీ కట్టబెట్టే యత్నం చేస్తోందని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఇనుప గనులు కేటాయించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోని కేంద్రం టాటా, జిందాల్ లాంటి ప్రైవేటు కంపెనీలకు గనులు కేటాయించిందని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నిర్వీర్యం చేయడానికి కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే 1970 తరహాలో మరో మారు భారీ ఉద్యమం తప్పదని వీరభద్రరావు హెచ్చరించారు. -
‘ఆయన ప్రతిపక్ష నేత కాదు..మహానటుడు’
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత కాదని..మహానటుడని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాడి వీరభద్రరావు ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇసుక పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని, దీక్ష చేస్తే సొంత ఎమ్మెల్యేలు కూడా హాజరు కాలేదన్నారు. ప్రజలపై ప్రేమతో ఆయన దీక్షలు చేయడం లేదని..కొడుకు భవిషత్తు కోసమే చేస్తున్నారని విమర్శించారు. ‘బీజేపీతో కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవలే నాగ్‌పుర్‌లో ఆర్ఎస్ఎస్ నేతతో రహస్య మంతనాలు జరిపారు. పరపతి కోల్పోతున్న నేతతో కలిసేందుకు బీజేపీ సుముఖంగా లేదని’ తెలిపారు. పార్టీని వీడేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు రెడీ.. పార్టీని వీడేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు చంద్రబాబు పాట్లు పడుతున్నారని తెలిపారు. అలిపిరి ఘటన లో సానుభూతి కోసం అప్పట్లో స్కూల్ పిల్లల్ని ఆసుపత్రికి రప్పించారన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఇసుక ఎక్కడా ఉచితంగా అందలేదన్నారు. భవన నిర్మాణదారుల పేరిట చందాల వసూళ్లకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. అలజడి కోసమే బ్లూ ఫ్రాగ్ కంపెనీ ద్వారా ఇసుక పోర్టల్‌ను హ్యాక్ చేయించారన్నారు. గతంలో కీలక సమాచారాన్ని బ్లూ ఫ్రాగ్ ద్వారా చోరీ చేశారని దాడి వీరభద్రరావు పేర్కొన్నారు. -
బీజేపిని ఆకర్షించేందుకు బాబు కుప్పిగంతులు
-
చంద్రబాబుకు ఏ శిక్ష విధించాలి
-
వైఎస్ జగన్‌ది ప్రపంచ రికార్డు
సాక్షి, అనకాపల్లి : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన గురించి మాట్లాడే అర్హత ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు లేదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు తేల్చి చెప్పారు. అనకాపల్లిలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఓటమికి కారణం తన విధానాలు కాకుండా ప్రజలదే తప్పనే నియంత చంద్రబాబు అని విమర్శించారు. రాజధానిలో రైతుల నుంచి భూములు సేకరించి తన అనుచరులకు ధారాదత్తం చేయడం న్యాయమేనా? అని ప్రశ్నించారు. ఐదు సంవత్సరాలుగా హైకోర్టును ఆంధ్రప్రదేశ్‌కు రాకుండా చేసిన చంద్రబాబుకు ఏ శిక్ష విధించాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు సూపర్ ప్రధానిగా భావించుకొని ప్రత్యేక విమానాల్లో తిరిగిన బాబు సాధించిందేమీ లేదని పేర్కొన్నారు. మోదీ వ్యతిరేక సభల పేరుతో రాష్ట్రమంతా సభలు పెట్టి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఉచిత ఇసుక పేరుతో దోపిడీ చేసి ప్రభుత్వానికి ఆదాయం రాకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు దేవాలయ భూములను కూడా వదల్లేదని వ్యాఖ్యానించారు. మరోవైపు సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పార్టీ మేనిఫెస్టోని 90 శాతం అమలు పరిచి ప్రపంచ రికార్డు సాధించారని ప్రశంసించారు. -
ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించడం దేశ ద్రోహమే
సాక్షి, అమరావతి : ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించడం దేశ ద్రోహమేనని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు వ్యాఖ్యానించారు. కశ్మీర్ సమస్య పరిష్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమర్ధించడం సాహసోపేత నిర్ణయంగా పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 75 సంవత్సరాల తర్వాత భారత్‌కు అసలైన స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ కుటిల రాజకీయాలతో కశ్మీర్‌ను నాశనం చేసిందని మండిపడ్డారు. పాకిస్థాన్.. చైనాలకు ఆశ్రయం ఇచ్చే శక్తులకు భారత్‌లో చోటు లేకుండా చెయ్యాల్సిందేనని తేల్చిచెప్పారు. -
‘బాబు ఇక తప్పుకుంటే మంచిది’
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో గజ దొంగల పాలన పోయిందని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అన్నారు. ఆదివారం విశాఖలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ఓటమి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేశ్‌లు కారణంగా గుర్తించాలని వ్యాఖ్యానించారు. గత ఏడాది కాలంగా చంద్రబాబు పాలన గాలికి వదిలేసారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడానికి రాష్ట్ర ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. చంద్రబాబు ఇక రాజకీయాల్లో నుంచి వైదొలగడం మంచిదని చెప్పారు. ప్రజలు అత్యంత హీనంగా టీడీపీని తిప్పి కొట్టారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలోనే ఓ మోడల్ సీఎం అని పేర్కొన్నారు. దేశంలోని ఇతర పార్టీలు వైఎస్ జగన్ పాలన వైపు చూస్తున్నాయని తెలిపారు. -
పోస్టల్ బ్యాలెట్ పంపిణీలో అవకతవకలు : దాడి
సాక్షి, విశాఖపట్నం : విశాఖ జిల్లాలో పోస్టల్‌బ్యాలెట్ పంపిణీలో అవకతవకంలు జరిగాయని, జిల్లా కలెక్టర్ బాధ్యతారాహిత్యం బయటపడిందని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్ర రావు ఆరోపించారు. జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి అన్నట్లు వ్యవహరించడం లేదని, 4 వేలకు పైగా ఉద్యోగులు తమ ఓటు హక్కును కోల్పోయారని అన్నారు. ఇతర జిల్లాలకు భిన్నంగా విశాఖ జిల్లా కలెక్టర్ భాస్కర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇదే తీరు కొనసాగితే కౌంటింగ్‌లో కూడా ఇబ్బందులు ఎదురవుతాయని వివరించినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఇచ్చిన పోస్టల్ బ్యాలెట్ వివరాలు కలెక్టర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోజు వారీగా సమాచారాన్ని అందరికీ ఇవ్వాలని తెలిపారు. కౌంటింగ్‌ను నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. -
చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు
-
‘బాబు ఓటమిని ఎవరిపై నెట్టాలా? అని చూస్తున్నారు’
సాక్షి, విశాఖపట్నం : చంద్రబాబు తన హోదాను మరిచిపోయి ప్రవర్తిస్తున్నారని, తన ఓటమిని ఎవరిపై నెట్టాలా? అని చూస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత దాడి వీరభద్రరావు అన్నారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ప్రమాణస్వీకారం చేసినా.. అంగీకరించక చంద్రబాబు మరోచోట ప్రమాణం చేసేటట్లున్నారని ఎద్దేవా చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఐటీ గ్రిడ్స్ ద్వారా డేటా చోరి జరిగిందన్న అంశం నిర్ధారణకు వచ్చిందని, దేశభద్రతకు నష్టం కలిగించేలా డేటా చోరీ జరిగిందన్నారు. ఇందులో టీడీపీ నేత ప్రమేయాన్ని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఐటీ గ్రిడ్స్-టీడీపీ మధ్య వ్యవహారంపై విచారణ జరిపించాలన్నారు. ఆధార్ సంస్థ ఇప్పుడు అన్ని అంశాలు వెల్లడించిందని, ఐటీ మంత్రి లోకేష్ డేటా చోరికి పాల్పడ్డారని, తండ్రీకొడుకులు ఇద్దరు దేశద్రోహానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ఎన్నికల సంఘం వంటి రాజ్యంగ సంస్థను అప్రతిష్టపాలు చేయడం వల్ల చంద్రబాబుకు ఒరిగేదేం లేదన్నారు. ఈవీఎంల విషయంలో ప్రజలను అయోమయానికి గురిచేసేలా మాట్లాడుతున్న చంద్రబాబు.. ఇవే ఈవీఎంలతో 2014లో గెలవలేదా? అప్పుడు చంద్రబాబు ట్యాంపరింగ్ చేశారా? అని ప్రశ్నించారు. 2018లో రెండు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి.. కాంగ్రెస్ గెలిచిందని, మరి అక్కడ ట్యాంపరింగ్ ఎవరు చేశారన్నారు. నిరాదారమైన ఆరోపణలు చేస్తూ చంద్రబాబు.. ఓటమికి సాకులు ఎత్తుకుంటున్నారని మండిపడ్డారు. -
ఓటమి భయంతోనే దాడులు
సాక్షి, విశాఖపట్నం: ఓటమి భయంతో ప్రణాళిక ప్రకారమే పోలింగ్ కేంద్రాల్లో దాడులు చేయడం, ఈవీఎంల మొరాయింపు వంటి దుష్ట రాజకీయాలకు చంద్రబాబు పాల్పడ్డారని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు ధ్వజమెత్తారు. శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. మంత్రి లోకేశ్ తోడల్లుడు, విశాఖ లోక్‌సభ టీడీపీ అభ్యర్థి శ్రీభరత్‌కు పడే ఓట్లను జనసేన ఎంపీ అభ్యర్థికి మళ్లించాలంటూ పోలింగ్ రోజున ఆ పార్టీ నేతలు చేసిన ఫోన్ల రాజకీయం బట్టబయలైందని అన్నారు. అనకాపల్లి జనసేన అభ్యర్థి పోలింగ్ చివరిలో టీడీపీకి ఓట్లు వేయాలని చెప్పడం చూస్తే ఆ రెండు పార్టీల కుమ్మక్కు రాజకీయాలు ఏ స్థాయిలో సాగాయో అర్థమవుతోందన్నారు. స్పీకర్ కోడెల శివప్రసాద్ పోలింగ్ బూత్‌లోకి వెళ్లి తలుపులు వేసుకోవడం, చొక్కా చించుకుని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు తనపై దాడి చేశారని చెప్పడం నీచ రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. చంద్రబాబుకు సీఎం పదవిపై ఉన్న వ్యామోహం ఎన్నికల సందర్భంగా మరోసారి బట్టబయలైందని, తండ్రీకొడుకులిద్దరూ రాష్ట్రాన్ని దోచుకునే ఘోరీ, ఘజనీలాంటి వాళ్లని దుయ్యబట్టారు. ఆ స్వార్థంతోనే ప్రభుత్వ సొమ్ముతో ఓట్లు కొనుగోలు చేయటం, నిరసనలకు దిగటం వంటి కుట్రలకు తెగబడ్డారని ధ్వజమెత్తారు. కలెక్టర్లు చంద్రబాబు ఏజెంట్లు విశాఖ జిల్లాలో 30 ఈవీఎంలు మొరాయించినా.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో కలెక్టర్ విఫలమయ్యారన్నారు. జిల్లా కలెక్టర్లు చంద్రబాబు ఏజెంట్లుగా పనిచేశారని ఆరోపించారు. అదనపు ఈవీఎంలు సిద్ధం చేయకపోవడం వల్లే కొన్నిచోట్ల పోలింగ్ శాతం తగ్గిందన్నారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. విశాఖ జిల్లాలో వైఎస్సార్ సీపీకి 11 నుంచి 12 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని బదులిచ్చారు. తోక మీడియాలో పదేపదే ప్రచారం తన అనుచరులతో దాడులు చేయించిన చంద్రబాబు.. తోక మీడియాలో మాత్రం వైఎస్సార్ సీపీ కార్యకర్తలు దాడులు చేసినట్టుగా పదేపదే ప్రసారం చేయించారని వీరభద్రరావు ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రలో మంత్రులు అచ్చెన్నాయుడు, గంటా, అయ్యన్న అరాచకాలకు, రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మంత్రి గంటా అనుచరులు అపార్ట్మెంట్లలోని ఓటర్లకు రిఫ్రిజరేటర్లు, ఏసీల వంటి తాయిలాలతో ప్రలోభపెట్టేందుకు చేసిన ప్రయత్నాలు వికటించాయన్నారు. గాజువాక టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు చివరి నిమిషంలో జనసేనతో కలిసిపోయారన్నారు. -
పవన్‌ను గెలిపించేందుకు...
సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల సాక్షిగా టీడీపీ అధినేత చంద్రబాబు పదవీ వ్యామోహం మరోసారి వెల్లడైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఓట్లు కొనేందుకు ప్రభుత్వ డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేశారని ఆరోపించారు. చంద్రబాబు వీధి రౌడీలా వ్యవహరించారని, అధికారం ఉందని ఎన్నికల అధికారులను దబాయించారని దుయ్యబట్టారు. ఓటమి భయంతోనే అసహనానికి గురయ్యారని మండిపడ్డారు. 50 లక్షల మంది ఓట్లను ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు తొలగించారన్నారు. చంద్రబాబు వెన్నుపోటు చరిత్ర కనబడకుండా ఆయనను హీరోగా ప్రొజెక్ట్ చేస్తూ రెండు సినిమాలు తీయించారని తెలిపారు. ఆ సినిమాలను కూడా ప్రజలు ఆదరించలేదన్నారు. బావ చాటు బాలయ్య ఈ సినిమాలు తీసి భంగపడ్డారని ఎద్దేవా చేశారు. తన వెన్నుపోటు చరిత్ర బయటపడుతుందన్న భయంతో రాంగోపాల్ వర్మ తీసిన సినిమా విడుదల కాకుండా చంద్రబాబు అడ్డుపడ్డారన్నారు. టీడీపీ నాయకులు పచ్చ చొక్కాలతో పోలింగ్ కేంద్రాలకు వెళ్లి అమ్మా, అయ్యా అంటూ ఓట్లు అడిగారని తెలిపారు. అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు రిగ్గింగ్‌కు ప్రయత్నించారని ఆరోపించారు. జనసేన-టీడీపీ కుమ్ముక్కు జనసేన అభ్యర్థులంతా రాష్ట్రవ్యాప్తంగా చివరి నిమిషంలో టీడీపీకి సహకరించారని వెల్లడించారు. గాజువాకలో పవన్ కళ్యాణ్‌ను గెలిపించేందుకు టీడీపీ అభ్యర్థి సహకరించారని ఆరోపించారు. విశాఖలో బాలకృష్ణ చిన్నల్లుడు, టీడీపీ అభ్యర్థి భరత్‌ను పక్కనపెట్టి జనసేనకు సహకరించమని నారా లోకేశ్ సూచించారని తెలిపారు. అధికార పార్టీ నాయకులు ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు సంయమనంతో వ్యవహరించారని ప్రశంసించారు. మార్పు తీసుకొస్తున్నామన్న భావన ఓటర్ల ముఖాల్లో కనిపించిందని దాడి వీరభద్రరావు అన్నారు. -
ఆ పాపం ఊరికే పోదు చంద్రబాబూ: దాడి
విశాఖపట్నం: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్ర రావు మరోసారి మండిపడ్డారు. సోమవారం దాడి వీరభద్రరావు విలేకరులతో మాట్లాడుతూ..ఎన్టీఆర్‌ను వాడు వీడు అనే నైతిక హక్కు నీకెక్కడిదని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. నీకు దమ్ముంటే ఎన్టీఆర్ పేరు తొలగిస్తున్నట్లు చెప్పు.. ప్రజలు నిన్ను(చంద్రబాబు) తరిమి కొట్టడం ఖాయమన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచావు.. మరో 10 సంవత్సరాలు బతకాల్సిన ఆయన్ని చంపేశావు.. ఆ పాపం ఊరికే పోదని బాబుకు శాపనార్ధాలు పెట్టారు. నీకు నీతి నిజాయతీ అనేది అసలు ఉందా అని సూటిగా అడిగారు. నారా వారి పార్టీ అని పార్టీ పేరు పెట్టుకోండి..అసలు డిపాజిట్ కూడా రాదని ఎద్దేవా చేశారు. ఆ సునామీలో కొట్టుకుపోతావ్ ‘ ఎన్టీఆర్ బిక్షతో నువ్వు బతుకుతున్నావ్. ఖబడ్దార్ ఎన్టీఆర్ అభిమానులకు, ప్రజలకు మండితే ఆ సునామీలో కొట్టుకుపోతావ్. సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నావ్.. చనిపోయిన ఆయన్ని పట్టుకుని వాడు వీడు అంటావా?. కనీసం నీకు ఇంగిత జ్ఞానం ఉందా...? ఎన్టీఆర్ లేకపోతే అసలు నువ్వు ఈ పొజిషన్లో ఉండేవాడివా? పిల్లనిచ్చిన మామను వెన్నుపోడిచావు.. ఇక ప్రజల్ని పొడవడం నీకు అంత కష్టమేమీ కాదు. జాతీయ నాయకుడు అని చెప్పుకుంటావ్.. ఇదే నా నువ్వు ఎన్టీఆర్‌కు ఇచ్చే గౌరమ’ని చంద్రబాబు నాయుడిని దాడి వీరభద్రరావు కడిగి పారేశారు. -
చంద్రబాబు ప్లాన్ అదే..!
సాక్షి, విశాఖపట్నం : సీఎం చంద్రబాబు నాయుడు శాంతి భద్రతలకు విఘాతం కలిగించి ఎన్నికలను వాయిదా వేయించడానికి ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు ఆరోపించారు. శనివారమిక్కడ ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు 10 వేల కోట్ల రూపాయలను ఓటర్లకు పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇందుకోసం హెరిటేజ్ పాల వ్యాన్లు, నారాయణ విద్యాసంస్థల, బ్యాంకు వాహనాలు, ఆఖరికి అంబులెన్సులను కూడా వాడుకుంటున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తప్ప బీజేపీ నేతలందరితో చంద్రబాబుకు సత్సంబంధాలే ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని.. గెలుపు కోసం ఆయన ఎంత నీచానికైనా దిగజారుతారని దుయ్యబట్టారు. చదవండి : (ఎన్నికల వేళ చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు) దాడి వీరభద్రరావు మాట్లాడుతూ.. ఆదివారం ఉదయం 9 గంటలకు అనకాపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచార సభకు నియోజకవర్గ ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని విఙ్ఞప్తి చేశారు. -
‘ఏపీలో అందుకే రూ. 2 వేల నోట్లు మాయం’
సాక్షి, విశాఖపట్నం: ఓడిపోతామనే భయంతో చంద్రబాబు నాయుడు నిస్పృహలో ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రజలు చంద్రబాబు పాలనతో విసిగిపోయారని అన్నారు. 5 ఏళ్ళ పాలనలో 600 హామీలు ఇచ్చినా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. జన్మభూమి కమిటీలకు పాలన అప్పగించి కింది స్థాయి వరకు దోచుకోమని అనుమతి ఇచ్చేశారని మండిపడ్డారు. లోకేష్, చంద్రబాబు.. ఘోరీ, గజనీలుగా మారి ఇసుక కూడా వదలకుండా ఐదేళ్లు దోపిడీ ప్రభుత్వాన్ని నడిపారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు చుట్టూ ఉన్న వారంతా నేరస్తులేనని, రూ. 200 కోట్లు తీసుకుని రాజ్యసభకు పంపుతున్న ఘనత చంద్రబాబుదే అన్నారు. దేశంలోని అత్యధిక సంపద కలిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఏడీఆర్ నివేదించిందని తెలిపారు. రాష్ట్రంలో 2 వేల రూపాయల నోటు కనబడటం లేదు అంటే.. అవన్నీ చంద్రబాబు నగదు పంపిణీ కోసం బ్లాక్ చేశారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి చంద్రబాబు బద్ధ విరోధి అన్నారు. కాంట్రాక్టర్ల కమిషన్లకు కక్కుర్తిపడుతున్న చంద్రబాబుకు పోలవరం నిర్మించాలనే ఉద్దేశం లేదన్నారు. జలయజ్ఞంలో ఏ నిర్మాణాలు ఉన్నాయో అవన్నీ వైఎస్ జగన్ సారథ్యంలో పూర్తి చేస్తామన్నారు. ఎన్టీఆర్ ఆఖరి పుట్టినరోజు నాడు కళలను పోషించమని 5 కోట్లతో 5 ఎకరాల్లో కాంప్లెక్స్ ఏర్పాటు చేయమని పబ్లిక్ గార్డెన్స్‌లో చెబితే, తాను రెండు సార్లు లేఖలు రాసినా చంద్రబాబు పట్టించుకోలేదని వెల్లడించారు. ఎన్టీఆర్ పేరు ఉండకూడదు, నారావారి పార్టీగానే ఉండాలనే దురుద్దేశంతో చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. టీడీపీ కరపత్రాల్లో ఎన్టీఆర్ బొమ్మ లేకుండా, పేరు లేకుండా తెలుగుదేశం పార్టీని నడిపించే దమ్ము చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ నుంచి ఎందుకు పారిపోయివచ్చారని నిలదీశారు. చంద్రబాబు కున్న కులపిచ్చి మరొకరకు లేదని, సిట్ పై చర్యలను వైఎస్సార్ సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత తేలుస్తామని దాడి వీరభద్రరావు అన్నారు. -
‘మే 23న సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం’
సాక్షి, విశాఖపట్నం: అధికార పక్షాన్ని ప్రశ్నించకుండా ప్రతిపక్షాన్ని ప్రశ్నించడంలోనే పవన్ కళ్యాణ్ పరిజ్ఞానం కనబడుతోందని వైఎస్సార్సీపీ నాయకుడు దాడి వీరభద్రరావు ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్పష్టమైన అవగాహనతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. చంద్రబాబు కుయుక్తులకు మరోసారి మోసపోవడానికి మహిళలు సిద్ధంగా లేరన్నారు. అనకాపల్లి లోక్‌సభ స్థానానికి రూ.100 కోట్లు ఖర్చు చేయడం కోసమే విశాఖ డైరీ చైర్మన్ అడారి తులసీరావు కుమారుడు ఆనంద్‌కు చంద్రబాబు కేటాయించారని ఆరోపించారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా మే 23న రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. పాల డబ్బాల్లో డబ్బును తరలిస్తున్నారని, వాటిపై ఎన్నికల సంఘం దృష్టి సారించాలని కోరారు. ఇప్పటికే మాకవరపాలెం, పాయకరావుపేటలో ఆ డబ్బును పోలీసులు గుర్తించారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని సర్వేలు వైఎస్ జగన్‌కు అనుకూలంగా వస్తుంటే చంద్రబాబు తోక పత్రికలో తప్పుడు సర్వేలు చూపిస్తున్నారని దాడి వీరభద్రరావు మండిపడ్డారు. -
వైఎస్సార్సీపీ లో చేరిన టీడీపీ, జనసేన యువకులు
విశాఖపట్నం, అనకాపల్లి టౌన్: పేదల కోసం ఆవిర్భవించిన టీడీపీని నేడు చంద్రబాబు ధనిక పార్టీగా మార్చేశారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు విమర్శించారు. ఆదివారం గవరపాలెంలోని ఆయన స్వగృహంలో తుమ్మపాలకు చెందిన 30 మంది యువకులు వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి దాడి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న పదిరోజులు పార్టీకి కీలకమైన రోజులని, ఈ కాలంలో పార్టీ గెలుపునకు నాయకులు, కార్యకర్తలు కష్టించి పని చేయాలని కోరారు. మండల ఉపాధ్యక్షుడు కాండ్రేగుల రవి, జగదీష్, మధు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీదేవిపేటలో... లక్ష్మీదేవిపేటలో న్యాయవాదులందరూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ సమక్షంలో పార్టీలోకి చేరారు. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. రేబాక రామారావు ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబు, రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్, జాజుల రమేష్ అధికసంఖ్యలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. దాడి క్యాంపు కార్యాలయంలో... పట్టణ, మండలంలో పలు ప్రాంతాలకు చెందిన టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన సుమారు 300 మంది వైఎస్సార్సీపీ పార్లమెంట్ అభ్యర్థిని భీశెట్టి వెంకట సత్యవతి, పార్లమెంట్ పరిశీలకుడు దాడి రత్నాకర్‌ల సమక్షంలో పార్టీలో చేరారు. వారందరికీ రత్నాకర్, సత్యవతిలు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ గెలుపుకు కష్టించి పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోపిశెట్టి ఆనంద్, పవన్, మహేష్, నాగు, శంకర్ పాల్గొన్నారు. -
గాజువాకలో టీడీపీకి షాక్..!
సాక్షి, విశాఖపట్నం: ప్రతిష్టాత్మకంగా మారిన గాజువాక నియోజకవర్గంలో అధికార తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది. టీడీపీకి చెందిన సీనియర్ నేత దొడ్డి రమణ పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాడి వీరభద్రరావు సమక్షంలో ఆయన ఆదివారం పార్టీలో చేరారు. ఆయనతోపాటు నాలుగు వేలమంది కార్యకర్తలు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల తరుణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున వలసలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు సీనియర్ నాయకులు వైఎస్సార్సీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం ఖాయంగా కనిపిస్తుండటం.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యమని సర్వత్రా వినిపిస్తున్న నేపథ్యంలో ఎంపీలు, ఎమ్మల్యేలతోపాటు పలు పార్టీల నేతలు సైతం వైఎస్సార్సీపీలోకి క్యూ కట్టారు. -
‘సీఎం చంద్రబాబు నిరాశ నిస్పృహల్లో వున్నారు’
సాక్షి, విశాఖపట్నం : ఏపీ అంతటా ఫ్యాన్ గాలి వీస్తోందని, అన్ని సర్వేలు కూడా వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పేశాయి. దీంతో చంద్రబాబుకు భయం పట్టుకుందని, అందుకే చంద్రబాబు నిరాశ నిస్పృహల్లో వున్నారంటూ వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తెలిపారు. పదహారు రోజుల్లో చంద్రబాబు పాలన ముగియనుందని.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అవుతారన్న భయంతోనే చంద్రబాబు అనైతికంగా మాట్లాడుతున్నారని అన్నారు. టీడీపీకి 50సీట్లకు మించి రావని జోస్యం చెప్పారు. ప్రత్యేక హోదా సాధనలో కేసీఆర్ సహకరిస్తారనడంలో తప్పు లేదన్నారు. హోదా విషయంలో సహకరించే పార్టీకి తమ మద్దతు ఉంటుందని వైఎస్ జగన్ ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు. కేసీఆర్‌ను ఏపీకి ప్రత్యర్థిగా చిత్రీకరిస్తూ.. చంద్రబాబు పదే పదే విమర్శలు చేయడం వల్ల తెలంగాణలో ఆంధ్రులు ఇబ్బంది పడేలా చేస్తున్నారన్నారు. ఇది మంచిది కాదంటూ వీరభద్రరావు హెచ్చరించారు. -
చంద్రబాబు సైబర్ నేరాలు చేస్తున్నారు
-
వైఎస్సార్సీపీలోకి జోరుగా చేరికలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతోంది. శనివారం పలువురు ప్రముఖులు ఆ పార్టీలో చేరారు. పారిశ్రామికవేత్త, టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు దాసరి జైరమేష్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఆయన తనయుడు రత్నాకర్, టీడీపీకి చెందిన మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్, ఏపీ ఇరిగేషన్ డెవలప్మెంట్ మాజీ అధ్యక్షుడు బుక్కచర్ల నల్లప్పరెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి సతీష్వర్మతోపాటుగా అనంతపురం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన పలువురు నేతలు వైఎస్సార్సీపీలో చేరారు. నేతల చేరికల నేపథ్యంలో తరలివచ్చిన వారి అనుచరగణంతో హైదరాబాద్‌లోని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాస పరిసరాలు కిటకిటలాడాయి. శనివారం ఉదయం నుంచీ ఒక్కొక్కరుగా తమ అనుచరగణంతో తరలివచ్చిన ఈ నేతలు జగన్‌ను కలుసుకున్నారు. ఆయన వారికి కండువాను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వీరభద్రరావు పార్టీలో చేరిన సందర్భంగా అమలాపురం ఎంపీ రవీంద్రబాబు, అదీప్‌రాజు, గుడివాడ అమర్నాథ్, గొల్ల బాబూరావులు ఉన్నారు. మోదుగుల పార్టీలో చేరినప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి, అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యే ముస్తాఫాలు పాల్గొన్నారు. దాసరి జైరమేష్ వెంట పెద్దసంఖ్యలో ఆయన శ్రేయోభిలాషులు హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాష్ పార్టీలో చేరిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఎం.అరుణ్‌కుమార్ ఉన్నారు. ప్రజలకు అర్థమైంది.. చంద్రబాబు ఏం చెప్పినా వారు వినరు: మోదుగుల సీఎం చంద్రబాబుపై ప్రజలకు పూర్తిగా నమ్మకం పోయిందని, ఇక ఆయనేం చెప్పినా నమ్మే పరిస్థితులు లేవని టీడీపీ నేత మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి మీడియాతో అన్నారు. పార్టీలో చేరడానికి ముందు ఆయన టీడీపీకి, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తమ ఆశాజ్యోతి జగన్ ఆహ్వానం మేరకు పార్టీలో చేరానని, పల్నాడులో వైఎస్సార్సీపీని బలోపేతం చేస్తానని చెప్పారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడైనా ఎంపీగా అయినా, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా అయినా పోటీ చేస్తానని పేర్కొన్నారు. తనకు టీడీపీలో సరైన న్యాయం చేయలేదన్నారు. ఎంపీ గల్లా జయదేవ్ తనపైన మాట్లాడాల్సిన మాటలు కాదని, టీడీపీలో ఉన్నప్పుడు ఎందుకు తనపై విమర్శలు చేయలేదని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ప్రజలకు ఎలాంటి న్యాయం జరగట్లేదని తెలిసి వైఎస్సార్సీపీలో చేరానన్నారు. గుంటూరు జిల్లాలో టీడీపీని లేకుండా చేస్తానన్నారు. గతంలో పార్లమెంటులో తనపై దాడి చేస్తే తనకు మద్దతుగా నిలవకపోగా నిందలు వేశారని ఆవేదన వెలిబుచ్చారు. తనలాంటి వ్యక్తికి టీడీపీలో టికెట్ లేదనడం వారికే సిగ్గుచేటన్నారు. గల్లా గుంటూరుకు అతిథిలాంటివారని, ఆయనకు బ్యాలెట్ పేపర్‌తో బుద్ధి చెపుతామని అన్నారు. జగన్ నాయకత్వంలో పనిచేయడానికి వచ్చామని, జగన్ గెలుపు ఖాయమని చెప్పారు. జగన్ ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరం: దాడి నాలుగేళ్ల తర్వాత వైఎస్సార్సీపీలోకి రావడం సొంతగృహానికి వచ్చినట్టుగా ఉందని దాడి వీరభద్రరావు అన్నారు. జగన్ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందని, ఆయన ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వం మంచి పాలనను అందించడంలో ఘోరంగా విఫలమైందన్నారు. ప్రస్తుతం అవినీతి విలయతాండవం చేస్తోందన్నారు. పాలనను చంద్రబాబు గాలికొదిలేశారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు ప్రజలు గుర్తుకొచ్చి పప్పు, బెల్లాలు పంచి ఓట్లు పడతాయని ఆశిస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘ప్రజలు తెలివితక్కువ వారని, గతం మరుస్తారని, తనను నమ్ముతారని చంద్రబాబు అనుకుంటున్నారు. ప్రజలు ఇలాంటివి చాలా చూశారు. విజయభాస్కరరెడ్డి హయాం నుంచి చూస్తున్నారు. ఎన్టీఆర్ టీడీపీ పెడుతున్నపుడు రూ.2 కిలో బియ్యం అంటే కోట్ల విజయభాస్కరరెడ్డి రూ.1.90కి కిలో బియ్యం ఇస్తానన్నా ప్రజలు ఆయన జిమ్మిక్కులను నమ్మలేదు’’ అని గుర్తు చేశారు. టీడీపీని చంద్రబాబు తెలుగు కాంగ్రెస్‌గా మార్చారని, కాంగ్రెస్‌కు అనుబంధ సంస్థగా తయారు చేశారని దాడి విమర్శించారు. టీడీపీని ఎవ్వరు పరిపాలిస్తున్నారో అర్థం కావట్లేదని టీడీపీ అభిమానులు బాధపడుతున్నారన్నారు. టీడీపీ జాతీయ గౌరవాధ్యక్షులుగా రాహుల్ ఉన్నారా, చంద్రబాబు ఉంటారా.. అనుమానంగా ఉందన్నారు. ఏ క్షణంలోనైనా టీడీపీని కాంగ్రెస్‌లో నిమజ్జనం చేసే పరిస్థితి ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు పాలన పోవటం, జగన్ పాలన రావటం చరిత్రాత్మక అవసరమన్నారు. కొన్ని స్థానిక పరిస్థితుల వల్ల పార్టీకి దూరంగా ఉన్నానని, ఏ రకంగా పార్టీ ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడతానని చెప్పారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడానికి కృషి చేస్తానని, పార్టీ ఆదేశిస్తే ఎన్నికల్లో తానుగానీ, తన కుమారుడు రత్నాకర్గానీ బరిలో ఉంటామన్నారు. మంత్రి సునీతకు షాక్ అనంతపురం జిల్లా రాప్తాడుకు చెందిన రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బుక్కచర్ల నల్లప్పరెడ్డి, ఆయన సోదరులు వీరారెడ్డి, సుబ్బారెడ్డి వైఎస్సార్సీపీలో చేరారు. గణనీయమైన అనుచరగణం గల ఈ సోదరులు టీడీపీని వీడటం మంత్రి పరిటాల సునీతకు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, వెన్నపూస రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వ నాలుగోతరగతి ఉద్యోగుల సెంట్రల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు యు.కుళ్లాయప్ప, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజశేఖర్‌యాదవ్ కూడా పార్టీలో చేరారు. -
వైఎస్సార్సీపీలో చేరిన దాడి వీరభద్రరావు
-
‘ఏ క్షణమైనా కాంగ్రెస్‌లో టీడీపీ నిమజ్జనం’
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం చారిత్రాత్మక అవసరమని మాజీ మంత్రి దాడి వీరభద్రరావు అభిప్రాయపడ్డారు. శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ... వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రం బాగుపడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రజాసంకల్పయాత్ర ద్వారా ప్రజల సమస్యలను వైఎస్ జగన్ ప్రత్యక్షంగా తెలుసుకున్నారని, ఆయనలా సుదీర్ఘ పాదయాత్ర చేసిన వారు ఎవరూ లేరని అన్నారు. రాజకీయ నాయకుడిగా ఆయన ఎంతో పరిపూర్ణత సాధించారని పేర్కొన్నారు. మంచి పాలన అందిస్తారన్న నమ్మకంతో గత ఎన్నికల్లో టీడీపీని గెలిపించారని, కానీ ఆ ఆశలన్నీ వమ్ము అయ్యారని వాపోయారు. చంద్రబాబు పరిపాలనను గాలికి వదిలేశారని, రాజకీయమే పరమావధిగా పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, అవినీతి విలయతాండవం చేస్తోందని విమర్శించారు. సామాన్య ప్రజలు డబ్బు చెల్లించకుండా ప్రభుత్వంతో పనులు చేయించుకునే పరిస్థితులు లేవన్నారు. రెండు నెలల్లో ఎన్నికలు ఉంటాయనగా ప్రజలకు పప్పుబెల్లాలు పంచుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు జిమ్మిక్కులను ప్రజలు నమ్మరని, గతంలో జనం ఇలాంటివి చాలా చూశారని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలను పూర్తిగా చంద్రబాబు గాలికి వదిలేసి టీడీపీ ఉనికి కోల్పోయిందన్నారు. టీడీపీని ‘తెలుగు కాంగ్రెస్’గా మార్చి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థగా తయారు చేశారని దాడి వీరభద్రరావు ధ్వజమెత్తారు. ఏ క్షణమైనా కాంగ్రెస్ పార్టీలో టీడీపీని నిమజ్జనం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. సిద్ధాంతాలు, విధానాలను తుంగలో తొక్కి అధికారాన్ని నిలబెట్టుకోవాలన్నదే చంద్రబాబు తాపత్రయమన్నారు. ఇప్పుడు చంద్రబాబు పాలన పోవడం చారిత్రాత్మక అవసరమని, వైఎస్ జగన్ పాలన రావడం చారిత్రాత్మక అవసరమని పేర్కొన్నారు. మార్పు కోరుతున్న ప్రజలు: అవంతి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అవంతి శ్రీనివాసరావు అన్నారు. ప్రజలను చంద్రబాబు అయోమనానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎప్పుడు, ఎవరితో పొత్తు పెట్టుకుంటారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. చదవండి: వైఎస్సార్సీపీలో చేరిన దాడి వీరభద్రరావు వైఎస్సార్సీపీలోకి వలసల వెల్లువ -
టీడీపీ ప్రభుత్వం అన్నింటా విఫలమైంది
-
వైఎస్సార్సీపీలో చేరిన సీనియర్ నేత
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తుండటంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు వేగం పుంజుకున్నాయి. జననేత వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే నాయకుల సంఖ్య రోజుకు రోజుకు పెరుగుతోంది. తాజాగా విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. లోటస్‌పాండ్‌లో తనను కలిసిన దాడి వీరభద్రరావు, ఆయన తనయుడు రత్నాకర్‌ను పార్టీ కండువాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఎంపీ విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాసరావు తదితరులు అక్కడ ఉన్నారు. సతీశ్ వర్మ కూడా.. విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సతీశ్ వర్మ కూడా వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దేవరపల్లి ఎంపీపీ, ఇతర నాయకులు కూడా వైఎస్సార్సీపీలోకి వచ్చారు. చదవండి: వైఎస్సార్సీపీలోకి వలసల వెల్లువ -
‘గవర్నర్‌ను వెంటనే మార్చాలి’
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ను వెంటనే మార్చాలని మాజీమంత్రి దాడి వీరభద్రరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు గడిచిన కొత్త గవర్నెర్‌ను ఎందుకు నియమించలేదని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం కేంద్ర ప్రభుత్వానికి ఆయన లేఖ రాశారు. రాష్ట్ర విభజన జరిగి నాలుగేళ్లు గడచినా గవర్నర్‌ను మార్చకపోవడం ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిన్నచూపుకు నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా గవర్నర్‌ను నియమించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు కూడా ఇంతకుముందు కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. నరసింహన్‌ను మార్చాలని బీజేపీ శాసనసభా పక్షనేత విష్ణుకుమార్‌రాజు కోరిన సంగతి విదితమే. కాగా, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా ఈఎస్ఎల్ నరసింహన్ కొనసాగుతున్నారు. -
కొణతాల, దాడి చేరికపై టీడీపీలో ప్రతిష్టంభన
హైదరాబాద్: కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావులను టీడీపీలో చేర్చుకునే విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. వీరిద్దరినీ పార్టీలో చేర్చుకునే విషయంలో ఇద్దరు మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. నియోజకవర్గ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారని చెబుతున్నారు. కొణతాల అనుచరుడు గండి బాబ్జి చేరికకు గంటా వర్గం ససేమిరా అంటోంది. గండి బాబ్జితో కార్యకర్తలకు చాలా సమస్యలున్నాయని అంటున్నారు. దాడి వీరభద్రరావు చేరికను అయ్యన్నపాత్రుడు వర్గం వ్యతిరేకిస్తోంది. -
మాస్టారూ... రావద్దు
దాడి చేరికను వ్యతిరేకిస్తున్న ‘తమ్ముళ్లు’ బీజేపీలోనైనా చేరేందుకు సన్నాహాలు దాడి వ్యూహంపై గుర్రుగా ఉన్న అనుచరవర్గం ఓడలు బళ్లు కావడమంటే ఇదేనేమో!. ఒకప్పుడు జిల్లాలో రాజకీయ పెత్తనం చెలాయించిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజకీయ ఉనికి కోసం పడరానిపాట్లు పడుతున్నారు. టీడీపీ గుమ్మం ముందు పడిగాపులు కాస్తున్నారు. అయినా సరే ‘ఆయన వద్దంటే వద్దు...ఆయనకు పార్టీ తలుపులు తెరిస్తే సహించేది లేదు’అని టీడీపీ తమ్ముళ్లు కరాఖండీగా చెబుతున్నారు. చంద్రబాబు కూడా ఉద్దేశపూర్వకంగా ఏమీ తేల్చకుండా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దాంతో దాడి పరిస్థితి కక్క లేక మింగలేక అన్నట్లు తయారైంది. టీడీపీలో అవకాశం దక్కకపోతే బీజేపీ తలుపు తట్టాలన్నది ఆయన వ్యూహంగా ఉంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : ఆకాశంలో పిట్టను చూసి మసాలా నూరినట్టుగా తయారైంది దాడి వీరభద్రరావు పరిస్థితి. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాగానే ఆయన ప్లేటు ఫిరాయించారు. ఆ పార్టీలో చేరేందుకు తయారయ్యారు. టీడీపీలోని పాత పరిచయాలు తిరగదోడుతూ మంతనాలు సాగించారు. బయటపడకపోయినప్పటికీ జీవీఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే దాడి చకచకా పావులు కదిపారు. వీలైనంత తొందరగా టీడీపీలో చేరితే... జీవీఎంసీ ఎన్నికల నాటికి తన కుమారుడు రత్నాకర్‌కు మార్గం సుగమం చేసుకోవచ్చన్నది ఆయన దూరాలోచన. మాస్ట్టారు వద్దే... వద్దు కానీ అక్కడే కథ అడ్డం తిరిగింది. దాడి వ్యూహం తెలిసి టీడీపీ తమ్ముళ్లు కంగారుపడిపోయారు. ఇప్పుడు పార్టీలో పరిస్థితి ప్రశాం తంగా ఉంది. మాస్టార్ని తీసుకువస్తే మళ్లీ వర్గపోరు రాజుకుంటుందని ఆందోళన చెందారు. అటు అనకాపల్లిలో, ఇటు విశాఖ నగరంలోని టీడీపీ నేతలు ఆయన రాకను తీవ్రంగా వ్యతిరేకించారు. అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద రావు అయితే పంచాయతీరాజ్ మంత్రి అయ్యన్నపాత్రుడి వద్ద తీవ్రస్థాయిలోనే తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే గణబాబు కూడా దాడిని చేర్చుకోవడానికి ససేమిరా అన్నారు. మంత్రి గంటాతోపాటు అధిష్టానం పెద్దల వద్ద తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. మేయర్ పదవిపై ఆశలు పెట్టుకున్న టీడీపీ నేతలు కూడా మూకుమ్మడిగా దాడి వీరభద్రరావు చేరికను వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా దాడి చేరికకు పచ్చజెండా ఊపలేదని తెలుస్తోంది. పార్టీకి ఆయన అవసరం కూడా లేదన్న అభిప్రాయంతో ఆయన ఉన్నారు. కానీ దాడి తీరుపై గుర్రుగా ఉన్న చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే విషయాన్ని నాన్చుతున్నారు. తద్వారా దాడిని తమ చుట్టూ తిప్పించుకుని మరింత నూన్యతకు గురి చేయాలన్నది టీడీపీ ఉద్దేశంగా ఉంది. కాకపోతే బీజేపీ... : టీడీపీలో పరిస్థితులు సానుకూలంగా లేవని దాడి గుర్తించారు. అందుకే ప్రత్యామ్నాయ అవకాశంగా ఆయన బీజేపీపై కన్నేశారు. పొత్తులో భాగంగా బీజేపీ జీవీఎంసీ మేయర్ స్థానాన్ని బీజేపీకి కేటాయిస్తే ఆ పార్టీలో చేరి తన కుమారుడి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచుతూ టీడీపీలో పునఃప్రవేశానికి మంతనాలు వేగవంతం చేస్తున్నారు. ఈ పరిణామాలను సమీపం నుంచి గమనిస్తున్న ఆయన అనుచరులు మాత్రం తమ నేత తీరును విమర్శిస్తున్నారు. దాడితో కలసి ప్రయాణించి చేతులు కాల్చుకోవడం కంటే ప్రస్తుతానికి ఆయనకు దూరంగా ఉండడమే మేలని భావిస్తున్నారు. -
జగన్‌ను విమర్శిస్తే ప్రజలే బుద్ధిచెబుతారు
విశాఖపట్నం : వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద దాడి వీరభద్రరావు చేసిన వ్యాఖ్యల్ని ఆ పార్టీ నేతలు ఖండించారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, పార్టీ అనకాపల్లి లోక్‌సభ స్థానం నాయకుడు గుడివాడ అమర్నాథ్ బుధవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి రావడంతో చంద్రబాబునాయుడు కాళ్లు పట్టుకుని ఆ పార్టీలోకి వెళ్లేందుకే వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి వీరభద్రరావు విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే సర్వేశ్వరరావు పేర్కొన్నారు. ఇంత దుర్మార్గమైన పెద్ద మనిషికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ద్వారా రాజకీయ లబ్ధిపొందాలని దాడి వీరభద్రరావు వైఎస్సార్ సీపీలో చేరారని పేర్కొన్నారు. చివరకు ఆయన తన కొడుకును గెలిపించుకోలేక తిరిగి జగన్‌పై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. జగన్ లాంటి నేతను విమర్శిస్తే దాడికి పుట్టగతులుండవన్నారు. ఇదే దాడి రాష్ట్రానికి జగన్ ద్వారానే మేలు జరుగుతుందని అనేకసార్లు చెప్పారని గుర్తుచేశారు. తిరిగి మళ్లీ ఆయన జగన్‌ను విమర్శిస్తున్నారన్నారు. ఇదేం పద్ధతని ప్రశ్నించారు. అసలు దాడికి కనీస నైతిక విలువలు లేవని చెప్పారు. ఆయనది తిన్నింటి వాసాలు లెక్కించే నైజమని పేర్కొన్నారు. పార్టీ నాయకుడు గుడివాడ్ అమర్నాథ్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ఓటమికి వైఎస్ జగన్మోహన్రెడ్డి కారణం కాదని, దీనికి ఎన్నో కారణాలున్నాయని చెప్పారు. ఒకపక్క మూడు పార్టీల కూటమి, మరోపక్క ఎల్లోమీడియా.. ఇలా అందరూ ఒకవైపు.. జగన్ ఓవైపు ఉన్నారన్నారు. అయినా రికార్డుస్థాయి ఓట్లు పడ్డాయని గుర్తుచేశారు. దాడి జగన్‌పై ఎన్నికలకు ముందుకాకుండా ఇప్పుడే ఎందుకు విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తుందని పార్టీలో చేరిన దాడి.. తీరా పార్టీ అధికారంలోకి రాకపోవడంతో స్వార్థప్రయోజనంతో బురద జల్లుతున్నారని విమర్శించారు. జగన్ పార్టీకి రానురాను గ్రాఫ్ పెరుగుతోందన్నారు. కొత్తగా పుట్టి అసెంబ్లీ ఎన్నికల్లో దిగిన పార్టీ రికార్డు స్థాయిలో ఓట్లు సాధించడం బహుశా ఎక్కడాలేదని చెప్పారు. కానీ దాడి ఏదో ప్రయోజనంతోనే దుర్బుద్ధితో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. -
వైఎస్సార్సీపీకి దాడి రాజీనామా
విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు దాడి వీరభద్రరావు ప్రకటించారు. తనతోపాటు తన కుమారుడు దాడి రత్నాకర్ కూడా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆయన తెలిపారు. విశాఖపట్నంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతానికి తనకు ఏ పార్టీలో చేరే ఉద్దేశం లేదని చెప్పారు. కొంతకాలం ప్రశాంతంగా ఉండి.. ఆ తర్వాత భవిష్యత్తు రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తానన్నారు. అదే సమయంలో ఆయన తమ రాజకీయ భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందని చెప్పడం గమనార్హం. వైఎస్సార్సీపీలో చేరి చేసిన తప్పును సరిదిద్దుకునేందుకే తాను ప్రస్తుతం ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నానని దాడి చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపైన, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపైన ఆరోపణలు గుప్పించారు. విశాఖ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలో తన కుమారుడు రత్నాకర్ ఓడిపోవడం తనకు సంతోషకరమేనని ఆయన చెప్పడం గమనార్హం. విలేకరుల సమావేశంలో దాడి రత్నాకర్ కూడా పాల్గొన్నారు. -
'పదవుల కోసమే దాడి పిచ్చివాగుడు'
-
'పదవుల కోసమే దాడి పిచ్చివాగుడు'
విశాఖపట్నం: పదవుల కోసమే దాడి వీరభద్రరావు పిచ్చివాగుడు వాగుతున్నారని వైఎస్ఆర్ సిపి మాడుగుల ఎమ్మెల్యే ముత్యాల నాయుడు విమర్శించారు. పలువరు పార్టీ నేతలతో కలిసి ఈరోజు ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసిస్తేనే దాడి అవాకులు, చెవాకులు పేలుతున్నారన్నారు. పార్టీలోకి రమ్మని దాడిని ఎవరూ ఆహ్వానించలేదని చెప్పారు. దాడి ఆరోపణల్లో వాస్తవంలేదన్నారు. పదవుల కోసమే దాడి ఈ విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. పార్టీ నుంచి వెళ్లిపోదలచుకుంటే వెళ్లిపోవాలని, ఇటువంటి మాటలు మాట్లాడటం మంచిదికాదని అన్నారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని, జగన్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇతర నాయకులు మాట్లాడుతూ జగన్ ఓ శక్తి అని, ఆ శక్తిని అడ్డుకునే దైర్యం ఎవరికీ లేదన్నారు. పార్టీ మారాలన్న ఉద్దేశం, అధికార దాహంతో దాడి అలా మాట్లాడుతున్నారన్నారు. టిడిపిలో పదవులు అనుభవించిన దాడి, అధికారంలో ఉండే పార్టీలోకి వెళ్లడానికి ఈ విధంగా మాట్లాడుతున్నారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భావించి పార్టీలో చేరారు. ఇప్పుడు పార్టీ అధికారంలోకి రాకపోవడంతో మళ్లీ పార్టీ మారడానికే ఇలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఊసరవెల్లిలా పార్టీలు మారే దాడి నైజం మరోసారి బయటపడిందన్నారు. దాడి కోవర్టుగా వచ్చినట్లు వారు అనుమానం వ్యక్తం చేశారు. టిడిపిలో ఉన్నప్పుడు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని విమర్శించారు. ఆ పార్టీని వీడి వైఎస్ఆర్ సిపిలో చేరే సమయంలో చంద్రబాబు నాయుడుని విమర్శించారు. ఇప్పుడు జగన్‌ను విమర్శిస్తున్నారు. ఆయన నైజం అదేనన్నారు. ప్రజలు అర్ధం చేసుకుంటారని చెప్పారు. ఆయన ఎక్కువగా మాట్లాడితే తమ పార్టీ కార్యకర్తలు తిప్పికొడతానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో పార్టీలో విలీనం కావలసిన పరిస్థితి లేదన్నారు. జగన్‌పై అభిమానంతో తమ పార్టీకి జనం బాగానే ఓట్లు వేసినట్లు చెప్పారు. కొద్ది శాతం ఓట్ల తేడాతో అధికారాన్ని చేజిక్కించుకోలేకపోయినట్లు తెలిపారు. 2019 ఎన్నికల నాటికి తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
వైఎస్ఆర్సీపీకి దాడి రాజీనామా
విశాఖపట్నం: దాడి వీరభద్రరావు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. ఈ రోజు ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ పార్టీ రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. తనను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయలేదని ఎన్నికలకు ముందు దాడి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. వైఎస్ఆర్ సిపిలో చేరారు. విశాఖ పశ్చిమ నియోజవర్గం నుంచి దాడి వీరభద్రరావు కుమారుడు రత్నాకర్ వైఎస్ఆర్ సిపి తరపున పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. -
అవినీతిపరులంతా టీడీపీలోనే..
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : టీడీపీలో చేరుతున్నవారంతా కాంగ్రెస్ పాలనలో కొనసాగిన అవినీతి మంత్రులేనని వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు దాడి వీరభద్రరావు ఆరోపించారు. పార్టీ 46వ వార్డు నాయకుడు గేదెల రాజు ఆధ్వర్యంలో మల్కాపురంలోని పిలకవానిపాలెం వద్ద సోమవారం రాత్రి భారీ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర లో వైఎస్సార్ సీపీ 130 ఎమ్మెల్యే, 20 ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంటుందని పలు సర్వేలు చెప్పాయన్నారు. ఈ సర్వేలు అబద్ధమని మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు పేర్కొంటున్నారని, నిజానికి ఆయన మనసుకు ఈ సర్వేలు నిజమని తెలుసన్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ పొందుపరిచిన ఒక్క అంశాన్ని టీడీపీ అమలుచేయలేదని ఆరోపించారు. మేనిఫెస్టోను ఉల్లంఘించిన పార్టీలను ఎన్నికల కమిషన్ రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త దాడి రత్నాకర్, మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, ఉత్తరాంధ్ర మున్సిపల్ ఎన్నికల పర్యవేక్షుడు కొయ్య ప్రసాద్‌రెడ్డి, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్, సీఈసీ సభ్యులు పసుపులేటి ఉషాకిరణ్, పక్కి దివాకర్, దామా సుబ్బారావు, భూపతిరాజు శ్రీనివాసరాజు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని, రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం, ప్రచార కమిటీ ప్రతినిధులు గుడ్ల పోలిరెడ్డి, రవిరెడ్డి, డాక్టర్ సెల్ కన్వీనర్ డాక్టర్ జగదీష్ ప్రసాద్, మాజీ కార్పొరేటర్లు కలిదండి బద్రినాథ్, గల్లా శ్రీనివాస్, పిల్లా కన్నబాబు, నాయకులు బైపా అరుణకుమారి, ఆల్ఫా కృష్ణ, అంగ రామ్‌ప్రసాద్, భీశెట్టి గణేష్, దేవాదుల త్రినాథ్, తోనంగి వెంకటరమణి, ఎం.సూర్యనారాయణ, నూకరెడ్డి, ధర్మాల అప్పారావు, కర్రి లక్ష్మి, మసేనమ్మ, గొందేశి సత్య నారాయణరెడ్డి, పెద్దడ వెంకటరమణ, అంగ వర్మ, గుంటా సుందరరావు, గౌరీ, గున్నా ధర్మారావు, తామాడ ధర్మారావు, చట్టి నూకరాజు పాల్గొన్నారు. అంతకు ముందు అక్కడి వైఎస్సార్ విగ్రహానికి వీరభద్రరావు తదితర ముఖ్యనాయకులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. పార్టీలో చేరికలు : 49వ వార్డు ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలకా రా మ్మోహన్‌రెడ్డి, శంకరరెడ్డి, వరహాలరావు, ఎస్.వి.రమణ, బర్ల అప్పారావు, శీరం శ్రీను, కొల్లి అప్పారావు తదితరులు వైఎస్సార్ సీపీలో చేరా రు. వారికి దాడి వీరభద్రరావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో కోశా అప్పలరెడ్డి ఉన్నారు. -
'ప్రజలను మోసం చేయడానికే కిరణ్ 'జై సమైక్యాంధ్ర''
విశాఖపట్నం : 'జై సమైక్యాంధ్ర' పేరుతో రాజకీయ పార్టీ ఆరంభించిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత దాడి వీరభద్రరావు నిప్పులు చెరిగారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దాడి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనకు కిరణ్ కుమార్ రెడ్డి కారణం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశాలను పాటించి.. రాష్ట్రాన్ని విడగొట్టడంలో కిరణ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించారని దాడి విమర్శించారు. రాష్ట్ర విభజనకు కారణమైన కిరణ్ మరోసారి ప్రజలను మోసం చేయడానికి జై సమైక్యాంధ్ర అంటూ సిద్ధమయ్యారని ఆయన ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కిరణ్ కు ప్రజలు బుద్ది చెబుతారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో దాడి వీరభద్రరావు సమక్షంలో 200 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
కిరణ్‌కు కోర్టుధిక్కార నేరం కింద శిక్ష విధించాలి: దాడి
విశాఖపట్నం: స్థానిక ఎన్నికలు నిర్వహించడంలో జాప్యానికి కారణమైన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కోర్టు ధిక్కార నేరం కింద శిక్షి విధించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీ సభ్యుడు దాడి వీరభద్రరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గవర్నర్ నరసింహన్‌కు ఒక లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకు, గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని ఆయన కోరారు. సాధారణ ఎన్నికలు పూర్తయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయాలని ఆ లేఖలో ఆయన విజ్ఞప్తి చేశారు. -
సోనియా... రాష్ట్రాన్ని చిల్లరకొట్టుగా మార్చేసింది
యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాష్ట్రాన్ని చిల్లరకొట్టుగా మార్చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాడి వీరభద్రరావు ఆరోపించారు. గురువారం విశాఖపట్నంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... సీఎం పదవికి కిరణ్ రాజీనామా చేసి తొమ్మిది రోజులవుతున్న ముఖ్యమంత్రిని నియమించాలా లేకా రాష్ట్రపతి పాలన విధించాలా అనేది మాత్రం తేల్చుకోలేక పోతుందన్నారు. రాష్ట్రంలో సీఏం పదవికి కాంగ్రెస్ అధిష్టానం వేలం పాట నిర్వహిస్తున్నట్టుందని దాడి వీరభద్రరావు ఎద్దేవా చేశారు. సీమాంధ్రలో రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం కమిటీ వేస్తామని ప్రకటించడం విచారకరమన్నారు. రానున్న ఎన్నికలలో గెలుపొందే ఎమ్మెల్యేలకు రాజధానిని నిర్ణయించుకునే హక్కు కూడా ఇవ్వరా అంటు ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. అంత అయిపోయాక కొత్త పార్టీ పెట్టి ఏం లాభం అంటూ అపద్ధర్మ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని దాడి ప్రశ్నించారు. తన సీఎం పదవిని కాపాడుకోవడం కోసం కిరణ్ మాయమాటలు చెప్పి విభజనకు సహకరించారని విమర్శించారు. మొదటి నుంచి విభజన వాది అయిన ప్రతిపక్ష నేత చంద్రబాబు సమైక్యం కోసం కృషి చేస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. విభజన కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది బాబే అన్న సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. పార్లమెంట్లో టీడీపీ సవరణలు ఇవ్వకుండా సమైక్యం కోసం పోరాడుతున్నామని ఎలా చెబుతారని ప్రశ్నించారు. తొమ్మిదేళ్ల పాలనలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చయకుండా ఔట్సోర్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి ఉద్యోగులలో అభద్రతభావాన్ని కలిగించింది మీరు కాదా అంటు చంద్రబాబును ప్రశ్నించారు. -
చంద్రబాబు జగన్ నామస్మరణ!
హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సిపి నేత దాడి వీరభద్రరావు మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబుకు కళ్లు మూసినా, తెరిచినా తమ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి కనిపిస్తున్నారన్నారు. ఆయన జగన్ నామ జపం చేస్తున్నారని చెప్పారు. జగన్‌కు ఉన్నంత దమ్ము, ధైర్యం నీకుందా చంద్రబాబు? జగన్‌ను విమర్శించడానికి నీకు సిగ్గులేదా? అని దాడి అడిగారు. తెలుగు జాతి రెండు మక్కులవడానికి కారకుడు చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో కాంగ్రెస్, బిజెపితో పాటు టిడిపి మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందన్నారు. పార్లమెంటులో ఒక్క సవరణ ఇవ్వలేకపోయారన్నారు. తెలంగాణకు కెసిఆర్ ఫాదర్ అయితే, బాబు గ్రాండ్ ఫాదర్ అని చెప్పారు. తెలుగు దేశం అధినేతగా ఉండడానికి ఆయన అర్హులు కారన్నారు. ఆ పార్టీ పేరును తెలంగాణ పేరుగా మర్చుకుని అధ్యక్షులుగా ఉండమని దాడి సలహా ఇచ్చారు. రాజధానికి లక్ష కోట్ల రూపాయలు కావాలన్న చంద్రబాబు ఇప్పుడు నోరు మెదపరే? అని ప్రశ్నించారు. సీమాంధ్ర తగలబడుతుంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. విభజన సమస్యను సృష్టించింది చంద్రబాబు కాదా? అని దాడి అడిగారు. -
'ఎ1 ముద్దాయి సోనియా గాంధీ'
హైదరాబాద్: చంద్రబాబు, కిరణ్ ఇప్పటికీ కల్లబొల్లి మాటలు చెబుతున్నారని వైఎస్సార్ సీపీ నేతలు దాడి వీరభద్రరావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నామని చంద్రబాబు పదేపదే కేంద్రానికి గుర్తు చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. విభజన విషయంలో చంద్రబాబు చారిత్రాత్మక మోసం చేశారన్నారు. ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఖూనీ చేశారని ధ్వజమెత్తారు. విభజన వ్యవహారంలో ఎ1 ముద్దాయి సోనియా గాంధీ, ఎ2 ముద్దాయి చంద్రబాబు, ఎ3 ముద్దాయి కిరణ్ కుమార్ రెడ్డి అని పేర్కొన్నారు. పార్లమెంట్లో కొందరు సభ్యులు దేశప్రతిష్టను మంటగలిపే విధంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారని విమర్శించారు. -
కిరణ్‌వి రాజీనామా డ్రామాలు: దాడి
-
కాంగ్రెస్, బీజేపీతో చంద్రబాబు కుమ్మక్కు: దాడి
హైదరాబాద్: సమైక్య రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని ఎదుర్కొలేకే కాంగ్రెస్, బీజేపీతో కుమ్మక్కై చంద్రబాబు విభజనకు సహకరించారు అని దాడి వీరభద్రరావు ఆరోపించారు. 2008లో తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా ఇచ్చిన లేఖను ఇప్పటికీ చంద్రబాబు వెనక్కి తీసుకోలేదు దాడి అన్నారు. తెలంగాణ బిల్లు పెడతారా లేదా అంటూ మరుగునపడిన విభజన అంశాన్ని బాబు తట్టిలేపారని దాడి విమర్శించారు. సీడబ్ల్యూసీ నిర్ణయం తర్వాతకూడా సీమాంధ్ర కోసం 5 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ అడిగిన చంద్రబాబు ఏ రోజూ సమైక్య రాష్ట్రం కోసం పోరాటం చేయలేదని దాడి అన్నారు. ఎలాంటి షరతులు లేకుండా బిల్లుకు బీజేపీ మద్దతిచ్చేలా ఢిల్లీలో ఉండి చంద్రబాబు లాబీయింగ్ చేశారని దాడి ఆరోపించారు. -
చంద్రబాబుని ప్రజలు నమ్మరు
చోడవరం, న్యూస్‌లైన్ : సమైక్య శంఖారావం సభలో వైఎస్సార్ సీపీ నాయకుల ప్రసంగాలు జనాన్ని ఆలోచింపజేశాయి. ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీల విధానాలను నాయకులు ఈ సందర్భంగా ఎండగట్టారు. చోడవరం సభలో పార్టీనేత దాడి వీరభద్రరావు మాట్లాడుతూ చంద్రబాబునాయుడు హామీలను నమ్మేస్థితిలో ప్రజలు లేరని విమర్శించారు. రాష్ట్ర విభజన విషయంలో చంద్రబాబు వ్యవహారశైలి వలనే ప్రస్తుత పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు. అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జ్ జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు రుణాలు మాఫీ చేయాలని శాసనసభ్యులందరూ అడిగితే అది జరిగే పని కాదన్నారన్న విషయం ఆయన గుర్తుచేశారు. బలిరెడ్డి సత్యారావు మాట్లాడుతూ వైఎస్ పథకాలను ప్రతి పేదవాడు పొందాడని, అందుకే ఆయన రుణం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. చెంగల వెంకటరావు మాట్లాడుతూ తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో జనం పడరాని కష్టాలు పడ్డారని, మూలన వృద్ధురాలికి కూడా అప్పట్లో పింఛన్ ఇవ్వలేదని, కానీ వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అడక్కుండానే అర్హులైన అందరికీ పింఛన్లు, ఇళ్లు, రేషన్‌కార్డులు ఇచ్చారన్నారు. కుంభా రవిబాబు మాట్లాడుతూ జనం కష్టాలు తీరాలంటే రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అన్నంరెడ్డి అదీప్‌రాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ రాజ్యం రావాలంటే జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. పి.వి.ఎస్.ఎన్.రాజు మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధిలో చోడవరం నియోజకవర్గ ఎంతో వెనుకబడి ఉందని, అభివృద్ధి చెందాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని, చోడవరంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థిని గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. పీలా ఉమారాణి మాట్లాడుతూ మహిళల కష్టాలు తీరాలంటే వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావాలన్నారు. చోడవరం కో సమన్వయకర్త, బలిరెడ్డి సత్యారావు కుమార్తె కోట్ని నాగమణి మొదటిసారిగా వేదికపై ప్రజలకు అభివాదం చేస్తూ ప్రసంగించారు. జగనన్నకు ప్రజలంతా అండగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం కొయ్య ప్రసాద్‌రెడ్డి, పెట్ల ఉమాశంకర్‌గణేష్, పూడి మంగపతిరావు ప్రసంగించారు. -
సీఎం కిరణ్ సమైక్య విలన్
కర్నూలు : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య హీరో అనిపించుకోవాలని రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నేత దాడి వీరభద్రరావు అన్నారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డి సమైక్య విలన్ అని వ్యాఖ్యానించారు. ఉవ్వెత్తిన సమైక్య ఉద్యమాన్ని అణిచివేసింది ముఖ్యమంత్రి కాదా అని దాడి వీరభద్రరావు ప్రశ్నించారు. సోనియా గాంధీ కనుసన్నల్లోనే కిరణ్ రాజకీయం చేస్తున్నారని ఆయన అన్నారు. -
బాబుది గర్జన కాదు.. ఈల మాత్రమే
వైఎస్సార్ కాంగ్రెస్ నేత దాడి వీర భద్రరావు ఎద్దేవా సమైక్యం అనే మూడక్షరాలు ఎందుకు అనలేకపోతున్నారు ‘గర్జన’లోనైనా మీ విధానం ప్రకటిస్తారా? వచ్చే ఎన్నికల్లోనూ చంద్రబాబుకు ఓటమి తప్పదు జగన్‌పై కేసులన్నీ కుట్రపూరితంగా పెట్టినవే సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నుంచి మూడక్షరాల సమైక్యం అన్న పదం ఎందుకు రావడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీజీసీ సభ్యుడు దాడి వీరభద్రరావు ప్రశ్నించారు. చంద్రబాబు తిరుపతిలో చేపడుతున్నది ప్రజాగర్జన కాదని, అది ఈల మాత్రమేనని ఎద్దేవా చేశారు. సీమాంధ్రలో నిర్వహిస్తున్న ఆ సభకు సమైక్య గర్జన అని ఎందుకు పేరు పెట్టలేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే దానికి విభజన గర్జనగానైనా నామకరణం చేయాలని సూచించారు. ఆదివారంనాడిక్కడ విలేకరుల సమావేశంలో దాడి మాట్లాడుతూ.. చంద్రబాబు రాష్ట్రపతిని కలసి రాష్ట్ర విభజన రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా జరుగుతోందని చెబుతున్నారు తప్ప రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తూ విభజన చేస్తున్నారని బాబు అనడం చూస్తే నిబంధనలకు లోబడి చేయమని చెబుతున్నట్లుగా ఉందని దాడి మండిపడ్డారు. చంద్రబాబు ప్రజా సమస్యలను గాలికొదిలేసి ఎంతసేపూ జగన్నామస్మరణ చేయడం, దివంగత వైఎస్సార్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. 2004, 2009 ఎన్నికల్లో వైఎస్, జగన్‌లపై అవినీతి ఆరోపణలు చేయడమే ఎజెండాగా పెట్టుకుని పరాజయం పాలయ్యారని, ఇప్పటికీ అదేపని చేస్తున్న చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లోనూ పరాజయం తప్పదని చెప్పారు. అధికారాన్ని పట్టుకుని వేలాడుతూ దండుకుంటున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఒక్క రోజు కూడా చంద్రబాబు విమర్శించిన పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్‌లో ఉంటే జగన్‌పై కేసులు ఉండేవి కావని దిగ్విజయ్‌సింగ్ చెప్పారంటే.. ఇవన్నీ కుట్రపూరితంగా పెట్టిన కేసులే అని తేలిపోతోందన్నారు. తనను ముఖ్యమంత్రిని చేస్తే మూణ్నెళ్లలో విభజన సమస్యను పరిష్కరిస్తానని బాబు చెప్పారని, అంటే ముఖ్యమంత్రిని చేస్తే తప్ప ఆ పరిష్కారం ఏమిటో చెప్పరా? అని ప్రశ్నించారు. దీనర్థం నిప్పుపెడుతున్నదీ, సంక్షోభానికి తానే కారణమని చంద్రబాబు చెప్పకనే చెప్పినట్లు కాదా? అన్నారు. శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలోని 194వ పేజీలో చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాకే పార్టీలో తెలంగాణ కోరుతూ ఒక బృందం ఏర్పడిందని పేర్కొందని చెబుతూ.. అందుకు సంబంధించిన ప్రతులను దాడి వీరభద్రరావు పత్రికలకు విడుదల చేశారు. చంద్రబాబు దీనిని ఏనాడైనా ఖండించారా? అని ప్రశ్నించారు. టీడీపీలోని తెలంగాణ నేతలను రాష్ట్రపతి వద్దకు పంపుతున్న చంద్రబాబు.. వారి చేత రాష్ట్రాన్ని సత్వరం విభజించండని విజ్ఞప్తి చేయిస్తున్నారన్నారు. తిరుపతిలో నిర్వహిస్తున్న సభలోనైనా టీడీపీ విధానం ఏమిటో చంద్రబాబు ప్రకటిస్తారా? రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆ సభలో చెబుతారా.. రాష్ట్ర సమైక్యత కోసం ఏకగ్రీవ తీర్మానం చేస్తారా? అని దాడి ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో గెలిచి ఇంత పెద్ద రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి అవుతారని తెలిసి అలా కాకుండా చేశానన్న ఆత్మసంతృప్తి కోసం చంద్రబాబు రాష్ట్ర విభజనను కోరుకుంటున్నారని ఆరోపించారు. సోనియా ఇటలీ దేశస్తురాలు కనుక రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారని, కానీ తెలుగువాడైన చంద్రబాబు కూడా విభజనకు సహకరిస్తుండటం సిగ్గుచేటని మండిపడ్డారు. -
సమైక్యగర్జన అని ఎందుకు పెట్టలేదు: దాడి
-
సమైక్యగర్జన అని ఎందుకు పెట్టలేదు: దాడి
హైదరాబాద్: నేడు తిరుపతిలో జరిగే టీడీపీ ప్రజాగర్జనలో సమైక్య తీర్మణం చేస్తేనే చంద్రబాబును ప్రజలు విశ్వసిస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాడి వీరభద్రరావు అన్నారు. ప్రజాగర్జనకు సమైక్యగర్జన అని ఎందుకు పేరు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు ధైర్యముంటే విభజన గర్జన అని పేరుపెట్టాలని సవాల్ విసిరారు. చంద్రబాబు ఆంధ్రుడై ఉండి సిగ్గుపడే విధంగా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. ప్రత్యేక తెలంగాణకు కారకుడు చంద్రబాబే కారకుడని ఆరోపించారు. రాష్ట్రపతిని కలిసిన సమయంలో సమన్యాయం అన్నారే గాని, రాష్ట్ర విభజన ఆపండి అనే పదాన్ని ఎందుకు వాడలేదని నిలదీశారు. సమన్యాయం చేయమనడం పరోక్షంగా రాష్ట్రాన్ని విభజించమని చెప్పడమేనని అన్నారు. 2004-2009లో వైఎస్సార్, జగన్‌లను తిడుతూనే రాజకీయాలు చేసినా బాబును ప్రజలు నమ్మలేదన్నారు. రాబోయే ఎన్నికలకు బాబు ఇదే పందాను ఎంచుకున్నారని అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే ఏ రాష్ట్రనికి ప్రతిపక్ష నేతగా ఉండాలో తేల్చుకోవాలని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై చంద్రబాబు స్పందించడం లేదని దాడి వీరభద్రరావు ధ్వజమెత్తారు. -
విభజనకు సోనియా, బాబులే ప్రధాన కారకులు
-
విభజనకు సోనియా, బాబులే ప్రధాన కారకులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు అటు యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఇటు తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముఖ్య కారకులని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ దాడి వీరభద్రరావు ఆరోపించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మద్దతుగా శనివారం హైదరాబాద్ నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమైక్య శంఖారావం సభలో మాట్లాడుతూ...ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఉంటే... వచ్చే ఎన్నికల్లో బలమైన నాయకత్వం అధికారంలోకి వస్తుందనే భయంతో యూపీఏ ప్రభుత్వం రాష్ట విభజనకు పాల్పడుతోందని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేయడంలో భాగంగానే విభజిస్తున్నారని తెలిపారు. దేశంలో ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని 16 రాష్ట్రాల్లో ఉద్యమాలు జరుగుతున్నాయి. అయితే వాటిని పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ విభజనపై యూపీఏ ప్రభుత్వం మొగ్గు చూపుతోందని దాడి తెలిపారు. చంద్రబాబు రెండు నాలుకల ధోరణితో తెలుగు ప్రజలను మోసం చేశారని అన్నారు. చంద్రబాబు, తెలుగు తమ్ముళ్లతోపాటు పీసీసీకి నిజాయితీ ఉంటే సమైక్య రాష్ట్రంపై తీర్మానం చేయాలని వారికి ఈ సందర్బంగా దాడి వీరభద్రరావు సూచించారు. -
జగన్‌కు మద్దతునిచ్చాననే దుష్ర్పచారం: దాడి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్రెడ్డికి మద్దతు ప్రకటించినందుకు తనపై దుష్ర్పచారం మొదలుపెట్టారని ఆ పార్టీ నేత దాడి వీరభద్రరావు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తనను పరుష పదజాలంతో హెచ్చరించారని ఆంధ్రజ్యోతి అసత్య కథనం ప్రచురించిందని ఆయన పేర్కొన్నారు. ఆ కథనంలో ఏమాత్రం నిజం లేదని, ఊహాజనితమైందని అన్నారు. గడిచిన మూడు రోజులుగా జిల్లా నేతలతో జగన్ సమావేశాలు నిర్వహిస్తుండగా, తాను సమైక్య శంఖారావం కమిటీ సమావేశాల్లో నిమగ్నమయ్యానని చెప్పారు. తాను జగన్‌ను కలవడంగానీ మాట్లాడటం గానీ జరగలేదని పేర్కొంటూ... ఆంధ్రజ్యోతి అభూత కల్పనతో సినిమా డైలాగులతో తనపై కథనం ప్రచురించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.