
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబును అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించినందుకు ఏపీ ప్రజలపై ఆయన కక్ష సాధిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 5 వేల కోట్లు నిధులు నిలిపివేయడంలో సఫలం అయ్యారని ఆయన మండిపడ్డారు. సుప్రీం కోర్టు కొన్ని విషయాల్లో ఎన్నికల కమిషన్‌కు అక్షింతలు వేసిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికలు నిలిపివేయడంలో ఉన్నత న్యాయస్థానం ఎన్నికల కమిషన్‌ను తప్పుపట్టిందన్నారు. (ఉనికి కోల్పోతామనే చంద్రబాబు కుట్రలు..)
చంద్రబాబు సలహాలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు పాల్పడి, తీరని అన్యాయం చేసిందని దాడి వీరభద్రరావు అన్నారు. చంద్రబాబుకు స్థానిక సంస్థలపై ఎప్పుడూ విశ్వాసం లేదని దుయ్యబట్టారు. బాబు కుటుంబసభ్యులు తప్ప ఎవరూ ముఖ్యమంత్రి అయినా ఆయన అంగీకరించలేరని తెలిపారు. చంద్రబాబు ఎన్ని కుట‍్రలు, కుతంత్రాలు పన్నినా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం ఖాయమని వీర భద్రరావు ఆశాభావం వ్యక్తం చేశారు. (ఎన్నికలంటే విపక్షాలకు భయమెందుకు)
Comments
Please login to add a commentAdd a comment