
సాక్షి,విశాఖపట్నం: సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఉక్కు కార్మికులు తమ ఆందోళనలను మరింత ఉదృతం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం కార్మికులు భారీ ఎత్తున మానవ హారం నిర్వహించనున్నారు.
ఢిల్లీ పర్యటనకు వెళుతున్న చంద్రబాబును విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉక్కు ఉద్యమానికి ప్రజలు సహకరించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ విజ్ఞప్తి చేసింది.
శనివారరం అర్ధరాత్రి వరకు ఈడీ వర్క్స్ బిల్డింగ్ వద్ద కొనసాగిన ఉక్కు కార్మికుల నిరసన.. కార్మిక వ్యతిరేక నిర్ణయాలను వెంటనే వెనక్కు తీసుకోవాలని నినాదాలు చేశారు. నేడు నేషనల్ హైవేపై అగనంపూడి నుంచి గాజువాక వరకు భారీ మానవ హారం చేపట్టనున్నారు.