విశాఖ: సింహాచలం బాధితులకు వైఎస్‌ జగన్‌ పరామర్శ | YS Jagan To Visit Families Of Simhachalam Temple Tragedy Victims Families, Watch Live Video Inside | Sakshi
Sakshi News home page

విశాఖ: సింహాచలం బాధితులకు వైఎస్‌ జగన్‌ పరామర్శ

Published Wed, Apr 30 2025 11:04 AM | Last Updated on Wed, Apr 30 2025 7:26 PM

Simhachalam Temple Tragedy: Ys Jagan To Visakha Updates

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చేరుకున్నారు.  సింహాచలం ఘటనలో మృతిచెందిన బాధిత కుటుంబాలను వైఎస్‌ జగన్‌ పరామర్శించారు. మృతిచెందిన ఉమామహేష్‌,  శైలజ భౌతికాయాలకు నివాళులర్పించిన వైఎస్‌ జగన్‌.. మృతుల కుటుంబాలను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. 

విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూలి భక్తులు మృతి చెందడంపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్‌ క్యూలైన్‌ పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.  ఈ క్రమంలోనే మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు చంద్రంపాలెం బయల్దేరి వెళ్లారు,.  తొలుత తాడేపల్లి నుంచి విశాఖకు చేరుకున్న వైఎస్‌ జగన్‌.. అక్కడ నుంచి చంద్రంపాలెం వెళ్లారు. 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement