simhachalam temple tragedy
-
అర్చకుల మాట వినకుండా గోడ నిర్మాణం.. ఇంత నిర్లక్ష్యమా?
-
సింహాచలం ఘటనపై అశోక్ నోరిప్పలేదేం
సింహాద్రి అప్పన్న చందనోత్సవం సందర్భంగా భారీ ఎత్తున భక్తులు వచ్చిన తరుణంలో ఏర్పాట్లు... భద్రత వంటి చర్యలను గాలికి వదిలేసిన ప్రభుత్వం ఏడుగురు భక్తుల ప్రాణాలను గాలిలో కలిపేసింది. దీనికి సంబంధించి ఇప్పుడు బయటపడుతున్న పలు లోపాలు చూస్తూ భక్తులు విష్టి పోతున్నారు. అతి తక్కువ సమయంలో గోడ నిర్మించలేనని కాంట్రాక్టర్ చెప్పినప్పటికీ పరవాలేదు మేము చూసుకుంటాం ఏదోలా పూర్తిచేసేయ్ అంటూ దేవాలయ యాజమాన్యం మంత్రులు తనపై ఒత్తిడి చేసి తూతూ మంత్రంగా పనులు పూర్తి చేయించారని కాంట్రాక్టర్ అంగీకరించారు. ఇదిలా ఉండగా ఉత్సవానికి ముందు పలువురు మంత్రులు సింహాచలాన్ని సందర్శించి ఏర్పాట్లు పర్యవేక్షించినట్లు పరిశీలించినట్లు సూచనలు సలహాలు ఇచ్చినట్లు పత్రికల్లో కథనాలు ఫోటోలు అయితే వేయించుకున్నారు కానీ వారు ఎక్కడ ఏమి చూసినట్లు లేదు. అలా వచ్చి మామూలుగా అధికారులతో సమావేశమై జ్యూస్ తాగి స్నాక్స్ తిని వెళ్లిపోయారు అన్నది ఈ సంఘటన తర్వాత అర్థమవుతుంది. ఇదంతా ఎలా ఉండగా సింహాచలం దేవస్థానానికి సంబంధించి అనువంశిక ధర్మకర్త ట్రస్ట్ బోర్డు చైర్మన్ అశోక్ గజపతిరాజు ఈ అంశంపై ఇంతవరకు కిక్కురుమనలేదు. గతంలో ఆయన ధర్మకర్తృత్వం లోని రామతీర్థం గుట్టపై శ్రీరాముని విగ్రహాన్ని కొంతమంది దుండగులు ధ్వంసం చేసిన ఘటన కు సంబంధించి ఆయన స్పందన విపరీతంగా ఉండేది. కళ్ళు ఎగరేస్తూ గాలిలో చేతులు తిప్పుతూ నాటి వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని తూలనాడారు. చైర్మన్ అయిన తనకు కూడా ఏమాత్రం సమాచారం లేదని బాధ్యత వహిస్తే పరిస్థితి వేరుగా ఉండేది అన్నట్లుగా ఆయన మాట్లాడారు. నాటి సంఘటనకు వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తి బాధ్యత అని దుమ్మెత్తి పోశారు.నేడు సౌండ్ లేదేం అశోక్ రాజానేడు సింహాచలం అప్పన్న స్వామికి చందనోత్సవం సందర్భంగా తొలి దర్శనం చేసుకుని పట్టు వస్త్రాలు సమర్పించేది కూడా విజయనగరం పూసపాటి కుటుంబీకులే. గతంలో ఆనందగజపతి రాజు ఈ సాంప్రదాయం పాటించగా నేడు అశోక్ గజపతి అప్పన్నకు చైర్మన్ హోదాలో పట్టు వస్త్రాలు సమర్పిస్తూ వస్తున్నారు. మరి దేవాలయ చైర్మన్‌గా ఆయనకు ఈ దుర్ఘటనతో సంబంధం లేదా..? బాధ్యత లేదా ? అంత పెద్ద ప్రమాదం జరిగి ఏడుగురు ప్రాణాలు కోల్పోయి మరికొందరు ఆసుపత్రిపాలవగా ఆయన మాత్రం ఏ మాత్రం నోరు విప్పడం లేదు. ఉత్సవాలకు ముందు మంత్రులతో పాటు ఆయన కూడా సమీక్షలో పాల్గొని ఆహా ఓహో అది చేశాను ఇది చేశాం అంటూ ఫోటోలు ప్రకటనలు ఇచ్చి ఇంటికి వచ్చారు తప్ప ప్రమాదం జరిగి ఇన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోయిన ఆయన ఏమాత్రం స్పందించడం గాని.. దేవాలయ ట్రస్ట్ బోర్డు తరఫున ఓ ప్రకటన కానీ ఇవ్వలేదు.. అసలు ఆ సంఘటన జరిగినట్లే ఆయన గుర్తించినట్లు కనిపించలేదు. ఎందుకంటే తాను కొనసాగుతూ వస్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఏ ఆలయంలో ఏం జరిగినా ఆయనకు కనిపించదు.. వినిపించదు. అదే వైయస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా చిత్ర విచిత్రమైన అభినయాలతో అశోక్ గజపతి మీడియా ముందుకు వచ్చేస్తారు.. ఇప్పుడు ఈ సంఘటన జరిగినప్పుడు కూడా ఆయన నోరు విప్పితే తన హుందాతనానికి మరింత గౌరవం వచ్చేదని ప్రజలు అంటున్నారు::సిమ్మాదిరప్పన్న -
సింహాచలం విషాదం.. గోడ నిర్మాణం వద్దని వైదికులు, అర్చకులు వారించినా..
విశాఖ: సింహాచలం చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్ విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.సింహాచలం గోడ నిర్మాణంలో ఎలాంటి టెండర్ లేదు. నోటి మాటతో నిర్మాణం జరిగింది. దీంతో పాటు వైదిక నిబంధనలను ఉల్లంఘించినట్లు సింహాచలం చందనోత్సవంలో జరిగిన దుర్ఘటనపై త్రిసభ్య కమిటీ చేపట్టిన రెండో రోజు విచారణలో తేలింది. విచారణలో భాగంగా త్రిసభ్య కమిషన్ విషాదానికి సంబంధించి ఆలయ అర్చకులు, వైదికుల నుంచి కీలక సమాచారాన్ని సేకరించింది. సింహగిరిలో కూలిన గోడపై త్రిసభ్య కమిటీ సభ్యుల విచారణలో.. దేవాలయంలో నోటి మాటతో గోడ నిర్మాణం చేపట్టారని, అనుమతులు, ప్రొసీజర్ ఫాలోకాలేదని స్పష్టమైంది. పైగా వైదిక నిబంధనలు సైతం ఉల్లంఘించారని.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిషన్‌కు సింహాచలం ఆలయ అర్చకులు వివరించారు. ‘మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్‌కు విరుద్ధంగా నిర్మాణం చేపట్టొద్దని ముందే చెప్పాం. అయినా మా మాట వినకుండా గోడ నిర్మాణం చేపట్టారని’ సింహాచలం వైదికులు, అర్చకులు వివరించారు. అర్చకులు, వైదికులు ఇచ్చిన సమాచారాన్ని, వివరణలను ఇవాళ ఏపీ ప్రభుత్వానికి సమర్పించే నివేదికలో త్రిసభ్య కమిషన్ పొందుపరచనుంది. -
సింహాచలం ఘటన నుంచి తప్పించుకునేందుకు కూటమి సర్కారు ప్రయత్నాలు
-
నోటి మాటతో గోడ కట్టారు
సాక్షి, విశాఖపట్నం: ఏకంగా ఐదుగురు మంత్రులు స్వయంగా పర్యవేక్షించినా సింహగిరిపై ఏడుగురు భక్తుల ప్రాణాలు బలై పోయిన నేపథ్యంలో తన దారుణ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు కూటమి సర్కారు అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. ఈ క్రమంలో ప్రజల దృష్టి మళ్లించేందుకు గోడ నిర్మాణంలో వైదిక నియమాల ఉల్లంఘన జరిగిందా? ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా చేపట్టారా? అనే అంశాలను తాజాగా తెరపైకి తెచ్చింది. ఇంజనీర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని దేవదాయ – పర్యాటక శాఖల మధ్య సమన్వయం లోపించిందంటూ పక్కదారి పట్టించే ఎత్తుగడలకు తెర తీసింది. మంత్రుల పర్యవేక్షణలోనూ ఇంత దారుణం జరగడం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టంగా తెలుస్తున్నా మభ్యపుచ్చే యత్నాలు చేయడంపై సర్వత్రా విభ్రాంతి వ్యక్తమవుతోంది. సింహాచలంలో భక్తుల మృత్యువాతపై రెండు రోజుల పాటు విచారణ జరిపిన త్రిసభ్య కమిషన్ శనివారం సాయంత్రం ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. తొలిరోజు కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, ఈవో, ఏఈవో, దేవస్థానం అధికారులను విచారించగా రెండోరోజు సర్క్యూట్ హౌస్‌లో విచారణ జరిపారు. నోటిమాటతో గోడ కట్టారని.. ఎలాంటి డిజైన్, అనుమతులు లేవని ప్రాథమికంగా తేలినట్లు కమిషన్ సభ్యులు చెప్పారు. సింహాచలంలో చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన ఘటనపై సురేష్ కుమార్ చైర్మన్‌గా, సభ్యులు ఆకె రవికృష్ణ, వెంకటేశ్వరరావులతో ప్రభుత్వం విచారణ కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. మాస్టర్‌ప్లాన్‌కు సంబంధించిన మ్యాప్‌లు, డ్రాఫ్ట్ కాపీలను కమిషన్ సేకరించింది. గోడ నిర్మాణం చేపట్టొద్దని ముందుగానే అధికారుల్ని హెచ్చరించామని దేవస్థానం అర్చకులు, వైదిక పండితులు పేర్కొన్నట్లు సమాచారం. కలెక్టర్ హరేంధిరప్రసాద్, విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ విచారణకు హాజరై తాము సేకరించిన వివరాలను కమిషన్‌కు అందించారు. ఇంజనీర్ల నిర్లక్ష్యమే ప్రమాదానికి ప్రధాన కారణమని సీపీ తన నివేదికలో స్పష్టం చేసినట్లు సమాచారం. ఏప్రిల్ 29, 30వ తేదీలకు సంబంధించిన ఆలయ ప్రాంగణంలో సీసీటీవీ ఫుటేజీని స్వాదీనం చేసుకున్నట్లు తెలిసింది. విచారణ అనంతరం కమిషన్ చైర్మన్ సురేష్ కుమార్ మీడియాతో శుక్రవారం మాట్లాడారు. ‘శనివారం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పిస్తాం. పూర్తిస్థాయి నివేదికకు నెల సమయం ఉన్నందున మరికొంత మందిని విచారిస్తాం. మాస్టర్‌ప్లాన్‌కు విరుద్ధంగా కొన్ని పనులు జరిగినట్లు మా దృష్టికి వచ్చాయి. ఎవరి ఆమోదంతో మార్పులు చేశారో తెలియాల్సి ఉంది. గోడ నిర్మాణ పనులకు ఎలాంటి అనుమతులు లేవు. ఎవరు అనుమతి ఇచ్చారు? స్ట్రక్చరల్ డిజైన్లు, మెటీరియల్‌కు సంబంధించి ఒక్క రికార్డు కూడా లేదు. కేవలం నోటిమాట ద్వారానే గోడని నిర్మించినట్లు ప్రాథమికంగా నిర్థారించాం. ‘ప్రసాద్’ పథకం కింద మంజూరైన పనులు 2024 ఆగస్ట్ నాటికే పూర్తి కావాలి. ఆలస్యంపై దేవస్థానం, టూరిజం అధికారులు వేర్వేరు కారణాలు చెబుతున్నారు. శాఖల మధ్య సమన్వయ లోపం ఉంది..’ అని కమిషన్ చైర్మన్ పేర్కొన్నారు. -
వర్షం ఉధృతికే కూలింది!
సాక్షి, అమరావతి: సింహగిరిలో భక్తుల మృతి ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి, ఇతర మంత్రులు ప్రచారం చేసిన అంశాలతోనే నివేదిక సిద్ధమైంది! చందనోత్సవం ఏర్పాట్లను ఏకంగా ఐదుగురు మంత్రులు స్వయంగా పర్యవేక్షించినప్పటికీ ఈ విషాదం చోటు చేసుకోగా ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ నివేదికను సిద్ధం చేయించింది. వర్షం ఉధృతికి గోడ కూలిపోయిన కారణంగా భక్తులు మరణించినట్లు దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ మూడు పేజీల ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. సింహాచలంలో ఎలాంటి కాలమ్స్ లేకుండా కేవలం ఫ్లైయాష్‌తో అంత పెద్ద గోడ నిర్మాణాన్ని ఆదరాబాదరాగా చేపట్టడంతో అది కుప్పకూలి ఏడుగురు భక్తులు సజీవ సమాధి కావడం తెలిసిందే. తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తొక్కిసలాట చోటు చేసుకుని ఆరుగురు భక్తులు మృత్యువాత పడితే తన వైఫల్యాలను దాచిపెట్టేందుకు ఆపసోపాలు పడ్డ కూటమి సర్కారు సింహాచలంలో మాత్రం బహిరంగ విచారణ పేరుతో నాటకాన్ని రక్తి కట్టించి కాంట్రాక్టర్, ఉద్యోగులను బలి పశువులుగా మార్చి తప్పించుకునే యత్నాలు చేస్తోంది. సాక్షాత్తూ మంత్రుల పర్యవేక్షణలోనే ఇంత దారుణం జరిగిందంటే ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని ఇంజనీరింగ్ నిపుణులు, పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఏప్రిల్ 19న మౌఖిక ఆదేశాలు.. తర్వాత గోడ నిర్మాణం నూతన మెట్ల మార్గాన్ని గతంలో ఉన్నట్లు కాకుండా ప్లాన్ మార్చి ‘వై’ ఆకారంలో నిర్మాణం చేశారని, దీంతో గతంలో మెట్లు ప్రారంభమైన ప్రదేశంలో కూలిన గోడ నిర్మాణం చేపట్టినట్లు దేవదాయ శాఖ కమిషనర్ నివేదికలో పేర్కొన్నారు. గోడకు దిగువన రెండు వైపులా మెట్లు ఉన్నాయని, చందనోత్సవం సందర్భంగా మెట్ల గుండా ఒక వరుస క్యూలైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మెట్లు, గోడను ఈవో సూచనల ప్రకారం నిర్మించినట్లు తెలిసిందన్నారు. కాగా దుర్ఘటనకు కారణమైన గోడకు సంబంధించి ఏప్రిల్ 19వ తేదీన దేవదాయ శాఖ అధికారుల వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చ జరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. చందనోత్సవం సమీపించినా గోడ నిర్మాణం చేపట్టకపోవడంపై దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలోని ముఖ్య అధికారి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. చందనోత్సవం నాటికల్లా నిర్మాణం పూర్తి చేయాలని ఆలయ ఇంజనీరింగ్ అధికారులకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. దీంతో కూలిన గోడ ఏప్రిల్ 19వ తేదీ తర్వాతే నిర్మాణం జరిగినట్లు స్పష్టంగా వెల్లడవుతోంది. హడావుడిగా ఫ్లైయాష్ తో గోడ కట్టేసి కనీసం నాణ్యత పరిశీలించకుండా పక్కనే భక్తుల క్యూలైన్ ఏర్పాటు చేయడంతో విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు వర్షం కారణంగానే గోడ కూలిందంటూ దుర్ఘటన జరిగిన రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. -
అప్పన్న సన్నిధిలో అపచారం!
శ్రీమహావిష్ణువు వరాహ లక్ష్మీ నృసింహస్వామి రూపంలో వెలిశాడని లక్షలాదిమంది భక్తులు విశ్వ సించే సింహాచల క్షేత్రం గురించి తెలియని వారెవరూ లేరు. ఏటా గంధం అమావాస్య తర్వాత వచ్చే అక్షయ తృతీయనాడు ఎంతో వేడుకగా జరిగే చందనోత్సవం సందర్భంగా భక్తజనం పోటెత్తుతారు. భక్తుల విశ్వాసాలతో అంతగా ముడిపడి వుండే ఈ చందనోత్సవ సమయంలో చిన్న దుర్ఘటనైనా చోటుచేసుకున్న ఉదంతం ఆలయ చరిత్రలో లేదు. అలాంటిచోట కళ్లుమూసుకుపోయిన పాలకుల సాక్షిగా అపచారం జరిగిపోయింది. కొత్తగా నిర్మించిన గోడ కూలి బుధవారం వేకువజామున ఏడు గురు భక్తులు మరణించటం అందరినీ కలచివేసింది. అసలు చందనోత్సవంనాడు అడుగడుగునా చోటుచేసుకున్న అరాచకం గమనిస్తేనే ఈ ప్రభుత్వానికి పవిత్రోత్సవాలపై భక్తిశ్రద్ధల మాటఅటుంచి ఏదైనా అనుకోనిది సంభవిస్తుందేమోనన్న భయం కూడా లేదని అందరికీ అర్థమైంది. వీఐపీ టిక్కెట్లు, పాస్‌లు పంచుకోవటానికి పెట్టిన శ్రద్ధలో వెయ్యోవంతైనా భక్తులకు సౌకర్యాల కల్పనలో, వారి భద్రతకు చర్యలు తీసుకోవటంలో లేవు. ప్రమాదాలు చెప్పి రావు. అందుకేముందస్తు ఏర్పాట్లు చేసుకుంటారు. అంబులెన్స్‌లు, పారా మెడికల్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్బృందాలు అందుబాటులో ఉంచుతారు. కానీ విషాదం సంభవించిన క్షణాల్లో బాధితులది అరణ్య రోదనే అయింది. ప్రమాదంలో చిక్కుకున్నవారూ, ఇతరులూ ఆర్తనాదాలు చేస్తుండగా అరగంటకు అధికారులు వచ్చారు. ప్రయోజనం ఏముంది? 3.05 గంటలకు ప్రమాదం జరిగితే ఆ తర్వా తెప్పుడో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అడుగుపెట్టారు. ముందస్తు ఏర్పాట్లుంటే ఆ ఏడుగురూ... లేదా కనీసం వారిలో కొందరైనా ప్రాణాలతో బయటపడేవారు. వెనక్కి తిరిగిచూస్తే ఈ తరహా విషాద ఉదంతాలు ఆయన అధికారం వెలగబెట్టే సమయంలో ఎన్నో జరిగాయని తెలుస్తుంది. 2015లో రాజమహేంద్రవరంలో గోదావరి పుష్కరాల ప్రారంభంనాడే తీవ్ర తొక్కిసలాట జరిగి 29 మంది భక్తులు ప్రాణాలు కోల్పోవటం ఎవరూ మరిచిపోలేరు. చిన్నపిల్లలూ, వృద్ధులూ తెల్లారుజామున 4 గంటలనుంచి స్నానాల కోసం నిరీక్షిస్తుండగా చంద్ర బాబు సకుటుంబ సమేతంగా ఉదయం 8.30కు స్నానాదికాలు ముగించుకుని నిష్క్రమించేవరకూ ఎవరినీ అనుమతించలేదు. తర్వాత హఠాత్తుగా స్నానఘట్టానికున్న ఏకైక ప్రవేశ ద్వారాన్ని తెరి చారు. తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకొని భక్తులు కన్నుమూశారు. కృష్ణా పుష్కరాల్లో సుందరీకరణ పేరిట వందల ఆలయాలను కూల్చి, వాటిల్లోని విగ్రహాలను చెత్తబండ్లలో తరలించటం కూడా బాబు హయాంలోని ముచ్చటే. మళ్లీ ఈ పదకొండు నెలల కాలంలో వరస విషాద ఉదంతాలు చోటుచేసుకున్నాయి. బాధ్యతాయుత స్థానంలో వున్నానన్న ఇంగితం కూడా లోపించి తిరుమల వేంకటేశుని లడ్డూ కల్తీ జరిగిందంటూ ఆయనే తప్పుడు ప్రచారాన్ని లంకించుకున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన ముందస్తు ఏర్పాట్ల వైఫల్యం కారణంగా తొక్కిసలాట జరిగి తిరుమల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఆరుగురు భక్తులు మరణించారు. ఇక టీటీడీ గోశాలలో గోవుల మృతిఉదంతం సాధారణ భక్తుల ఊహకందనిది. అసలు అలాంటిదేమీ లేదని బాబు బుకాయించగా టీటీడీ చైర్మన్, ఈవోలు మృతిచెందిన గోవుల సంఖ్య గురించి తోచిన అంకెలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. దశాబ్దాలుగా హైందవ ధర్మానికీ, దాతృత్వానికీ ప్రతీకగా వున్న కాశీ నాయన ఆశ్రమాన్ని ఈ ప్రభుత్వమే స్వహస్తాలతో నేలమట్టం చేసింది. పురాతనమైన ఆలయంగా ప్రసిద్ధి చెందిన శ్రీకూర్మం క్షేత్రంలో ఇటీవల తాబేళ్లు చనిపోవటం అందరినీ ఆశ్చర్యంలో ముంచింది. ఏమైంది ఈ సర్కారుకు? పగలూ, ప్రతీకారాలూ తీర్చుకోవటానికి పదకొండు నెలల సమయం చాల్లేదా? పాలనపై దృష్టి పెట్టేదెప్పుడు? అసలు చందనోత్సవం వంటి ముఖ్య ఘట్టం కోసం ప్రభుత్వపరంగా చేసిందేమిటి? ఇందుకోసం నియమించిన కమిటీలో మంత్రులకు లోటులేదు. అయిదుగురున్నారు. హైలెవెల్ కమిటీ అన్నారు. అందులో ఒక్కరంటే ఒక్కరికి కొత్తగా కట్టిన గోడ ఎలా వుంటుందో తెలియదు. ఎలాంటిచోట నిర్మించారో, దేంతో నిర్మించారో, నిర్మించి ఎన్నాళ్ల యిందో అంతకన్నా తెలియదు. చందనోత్సవంనాడు వాన పడటం అక్కడ రివాజని కూడా తెలిసి వుండదు. కొండధారలు, ఆకాశగంగ, మాడవీధుల్లో పడిన వర్షమంతా ఇప్పుడు ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతంలోని మెట్లపై నుంచి కిందకు పోతుందని తెలిసే గతంలోనే రిటైనింగ్ వాల్ నిర్మించారు. కానీ పునర్నిర్మాణం పేరిట పాత గోడను తొలగించి అత్యంత నాసిరకంగా నిర్మించిన పర్యవసానంగా ఘోరం జరిగిపోయింది. ఒకరిద్దరు పెద్దలతోపాటు బంగారు భవిష్యత్తుగల యువభక్తులు కూడా తప్పించుకునే మార్గం దొరక్క సజీవసమాధి అయ్యారు. కూలిన గోడ వెనకున్న గూడుపుఠాణీ కథే వేరు. సొంత మీడియా సైతం దాచలేని కంతలు అందులో ఎన్నెన్నో! మంత్రులు దీనికి బాధ్యత వహించాలి. కానీ, వర్షం మీదా, చిన్న ఉద్యోగుల మీదా దీనిని నెట్టివేసే ప్రయత్నం జరుగుతోంది. తీరి కూర్చుని ఇలాంటి వరస విషాద ఉదంతాలకు కారణమవుతున్న సర్కారుకు ఒక్కరోజైనా అధికారంలో కొనసాగే నైతికార్హత వుందా? లక్షలాదిమంది భక్తుల మనోభావాలు దెబ్బతిని, మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొని రెండ్రోజులైనా గడవకముందే ఆర్భాటంగా అమరావతి పునఃశంకుస్థాపన కార్యక్రమం జరిపారు. కానీ మరణించిన భక్తులస్మృతిలో ఒక్క నిమిషం మౌనం పాటించాలన్న స్పృహ, కనీసం నివాళులర్పించాలన్న ఇంగితం ఒక్కరికీ లేకపోయింది. ఇదే అసలైన విషాదం. -
సింహాచలం గోడ కూలిన ఘటనపై రెండో రోజు త్రీమెన్ కమిటీ విచారణ
-
పరామర్శకూ తీరికలేదా బాబూ!
సింహాచలం అప్పన్న ఆలయంలో హాహాకారాలు.. మృత్యు ఘోష.. ఎవరికైనా బాధనిపిస్తుంది. కాని ఆంధ్రప్రదేశ్ సర్కారుకు మాత్రం అవేమీ పట్టినట్లు లేదు. కూటమి నేతలందరూ అమరావతి సంబరంలో మునిగి తేలుతున్నారు. పలుమార్లు శంకుస్థాపనలు జరిగిన అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఇంకోసారి శంకుస్థాపన చేయిస్తున్నారు.సింహాచలంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలి అయింది సామాన్యులే.. అమరావతి హంగామాతో తీవ్రంగా నష్టపోతున్నదీ పేదలే. హిందూ మతంలో ఒక నమ్మకం ఉంటుంది. ఏదైనా ఒక కుటుంబంలో అశుభం జరిగితే నిర్దిష్టంగా కొన్నాళ్లపాటు ఎలాంటి శుభ కార్యక్రమాలు జరపరు. హిందూ మతోద్దారకులమని ప్రచారం చేసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సనాతన హిందూ అని చెప్పుకునే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. శంకుస్థాపన కార్యక్రమాలను వాయిదా వేసుకోలేదు. పాలకులు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను కుటుంబంలా పరిగణిస్తారు. ఆ ప్రకారం చూస్తే ఒక ప్రముఖ ఆలయంలో జరిగిన ఈ దుర్ఘటనలో కొత్తగా కట్టిన గోడ కూలి ఏడుగురు మరణించినా తమ ప్రోగ్రాం ఆపుకోవడానికి ఇష్టపడలేదు. సింహాచలం మృతుల కుటుంబాలను పరామర్శించడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు వెళ్లలేదు.అంటే వారికి ఏదో అనుమానం ఉండబట్టే అటువైపు వెళ్లకుండా ఉన్నట్లు అనిపిస్తుంది.మామూలుగా అయితే ఒక ప్రసిద్ద పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఘటనలు సంభవిస్తే వెంటనే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు అంతా వెళ్లి సహాయ చర్యలను పర్యవేక్షించి బాధితులకు స్వాంతన చేకూర్చడానికి యత్నిస్తారు. కాని వీరిద్దరూ ఆ పని చేయలేదు. కొద్ది నెలల క్రితం వైకుంఠ ఏకాదశి టిక్కెట్ల కోసం తిరుపతి వెళ్లిన వేలాది భక్తులు తొక్కిసలాటకు గురయ్యారు. ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఆ తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఆ సమాచారం వచ్చిన వెంటనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు పోటీ పడి తిరుపతి వెళ్లారు.ఏదో చేస్తున్నట్లు హడావుడి చేశారు. అలాంటి వారు సింహాచలం ఎందుకు వెళ్లలేదు? ప్రధాని మోడీ అమరావతి వస్తున్నందున వెళ్లలేక పోయారని చెప్పవచ్చు కానీ మూడు గంటల ఖాళీ కూడా లేదనడం అతిశయోక్తి అవుతుంది. పైగా ఇప్పుడు వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కడ నుంచైనా పర్యవేక్షణ చేయవచ్చు. పవన్ కళ్యాణ్ కు ఆ ఇబ్బంది లేదు కదా?మరి ఆయన ఎందుకు సింహాచలం వెళ్లలేదు? దీనికి రెండు,మూడు కారణాలు చెబుతున్నారు. అక్కడకు వెళ్లితే భక్తులలో ఉన్న కోపం అంతా తమపై చూపే అవకాశం ఉందని, వారు ప్రభుత్వ నిర్వాకంపై నిలదీస్తే ఇబ్బంది అవుతుందని అనుకుని ఉండవచ్చ అంటున్నారు. అమరావతి పునః శంకుస్థాపన పనుల పేరుతో తప్పించుకునే అవకాశం ఉండడం. మరొకటి చావుల వద్దకు వెళ్లి రావడం అశుభం అని ఎవరైనా సలహా ఇచ్చారేమో తెలియదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు నిజంగానే హిందూ మతాచారాలపై అంత శ్రద్దగా ఉంటారా అంటే అదీ గ్యారంటీ లేదు. ఏ మతం వారివద్దకు వెళ్లితే ఆ మతమే గొప్పదని చెప్పి వస్తుంటారు. రాజకీయాల కోసం మతాన్ని వాడుకుంటారు.గత గోదావరి పుష్కరాల సమయంలో చంద్రబాబు కుటుంబం స్నానమాచరించే ఘట్టాన్ని సినిమా తీయడం కోసం సామాన్య భక్తులను నిలిపి వేయడం, ఒక్కసారిగా గేటు తెరవడం వల్ల తొక్కిసలాట జరిగి 29 మంది మరణించడం జరిగింది. అప్పుడు చంద్రబాబు తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో యత్నాలు చేశారు. చివరికి రోడ్డు ప్రమాదాలలో చనిపోవడం లేదా? కుంభమేళాలో చనిపోలేదా? అంటూ వితండ వాదం చేశారు. అంతే తప్ప అంత పెద్ద ఘటన జరిగితే మామూలుగా అయితే పదవి నుంచి తప్పుకుంటారు. ప్రాంతీయ పార్టీ కనుక ఆయనను పార్టీలో ఎవరూ ప్రశ్నించరు కనుక ఆ ప్రస్తావనే ఉండదు. పోనీ కనీసం ఒక కానిస్టేబుల్ పై కూడా చర్య తీసుకోకపోవడం విశేషం. తిరుపతి తొక్కిసలాట ఘటన జరిన తర్వాత పవన్ కళ్యాణ్ క్షమాపణల డ్రామా తెలిసిన సంగతే.చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌లు ఏమి మాట్లాడింది అందరికి తెలుసు. అక్కడ చైర్మన్ లేదా, అధికారులపై చర్య తీసుకోలేదు. వారిని పదవుల నుంచి తప్పించలేదు. నిజంగా హిందూ మత విశ్వాసాలు నమ్మేవారైతే అలా చేస్తారా? అన్న విమర్శలను పలువురు చేశారు. చివరికి ఒక రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. గోదావరి పుష్కరాల మరణాలపై వేసిన కమిషన్ ఏ తరహా రిపోర్టు ఇచ్చిందో, తిరుపతి ఘటనపై కూడా రిపోర్టు అందుకు భిన్నంగా వస్తుందా అన్నది కొందరి సందేహం. పుష్కరాల తొక్కిసలాటలో తప్పు భక్తులదే అని ఆ కమిషన్ తేల్చింది. ఇప్పుడు సింహాచలం ఘటనపై కూడా విచారణ కమిటీని నియమించినా, ఎంతవరకు ప్రయోజనం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. గోడ కూలడానికి నాణ్యత లోపమని కాకుండా, భక్తుల రద్దీ, తోపులాట అని నివేదికలు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో ఆలయాలలో ఏ చిన్న ఘటన జరిగినా, దాని వెనుక టీడీపీ, జనసేన రాజకీయ శక్తుల ప్రమేయం ఉన్నా, దానినంతటిని జగన్ కు ఆపాదించి ఎంత రచ్చ చేసేవారో గుర్తు చేసుకుంటేనే కంపరం కలుగుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత సైతం అదే ధోరణి ప్రదర్శించారు. తిరుమల లడ్డూ లో జంతు కొవ్వు కలిసిదంటూ దారుణమైన అసత్యాన్ని చంద్రబాబు, పవన్ లు ప్రజలకు చెప్పారు. దీనివల్ల కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని, దైవానికి అపచారం చేసినట్లు అవుతుందని వారు ఫీల్ కాలేదు. తమ రాజకీయ ప్రయోజనం కోసం ఎంతకైనా దిగజారతామన్నట్లుగా వారు వ్యవహరించారు. ఈ ఘటన తర్వాత పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకు వేసి తాను అన్ అప్పాలజిటిక్ సనాతన హిందూ అని ప్రకటించుకుని కొత్త వేషం కట్టారు.అసలు సనాతన హిందూయిజం ఏమి చెబుతుందో తెలియకుండానే, తానేదో వేద శాస్త్రాలు అన్నిటిని పుక్కిట పట్టినట్లుగా మాట్లాడారు. విశేషం ఏమిటంటే ఆయన భార్య విదేశీయురాలు. క్రైస్తవ మతానికి చెందిన వారు.అలాగే పవన్ కు పుట్టిన వారు సైతం క్రైస్తవమే తీసుకున్నారు. మరి అక్కడ ఈయన సనాతనమేమైందో తెలియదు. అనవసరంగా సినిమా డైలాగులు చదివితే ఇలాంటి అప్రతిష్టే వస్తుంది. చంద్రబాబు తన రాజకీయం కోసం ఏ మతాన్ని అయినా వాడుకోగలరు.ఆయన తెలివితేటలు వేరు.ఆయనను మించి ఏదో చేసి బీజేపీ వారి మెప్పు పొందాలని పవన్ చేస్తున్న ఈ ప్రయత్నాల వల్ల ఆయన పరువు పోగొట్టుకుంటున్నారు. పోనీ నిజంగానే అంత సనాతన హిందూ అయితే సింహాచలం ఎందుకు వెళ్లలేదు.ఒక సంతాప సందేశం ఇచ్చి వదలివేశారే.అమరావతి కార్యక్రమ ఆహ్వానంలో తన పేరు వేయలేదని మొదట అలిగారని, దాంతో ప్రభుత్వం మరో కార్డు వేసిందని చెబుతున్నారు. తన డిమాండ్ నెరవేరకపోతే ఏమైనా సింహాచలం వెళ్లేవారేమో. తిరుమల గోవుల మరణాలు, కాశీనాయన క్షేత్రంలో భవనాల కూల్చివేత, తిరుమల, బ్రహ్మం గారి మఠం తదితర ఆధ్యాత్మిక కేంద్రాలలో మత్తు పదార్ధాల వాడకం వంటి ఆరోపణలు వస్తున్నా ఈ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టలేక పోతోందన్న విమర్శలు వస్తున్నాయి. సింహాచలంలో చందనోత్సవానికి ఐదుగురు మంత్రుల కమిటీ కూడా ఉందట. వారంతా ఏమి చేశారో తెలియదు. కాని గోడ కూలి ఏడుగురు మరణించారు. చిన్న ఆలయ గోడ నిర్మాణమే చేయలేని వారు రాజధాని నిర్మాణం చేస్తారట అంటూ సోషల్ మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యానాలు వచ్చాయి.అదే టైమ్ లో జగన్ విజయవాడ వద్ద కృష్ణానదికి కట్టిన రిటైనింగ్ వాల్ ఏ రకంగా స్ట్రాంగ్ గా ఉందీ వివరిస్తూ కూడా వీడియోలు వచ్చాయి. సింహాచలం ఘటన తర్వాత జగన్ వెంటనే అక్కడకు వెళ్లి మృతుల కుటుంబాలకు భరోసా ఇచ్చివచ్చారు. చంద్రబాబు, పవన్ లు మాత్రం సాకులు వెతుక్కుంటూ కూర్చున్నారు. ఎల్లో మీడియా మాత్రం సింహాచలం ప్రమాదాన్ని తగ్గించి చూపడానికి నానా పాట్లు పడింది. ఏది ఏమైనా మత సెంటిమెంటును రాజకీయాలకు వాడుకోవడం మంచిది కాదు.అది ఎప్పటికైనా వారికే తగులుతుంది.ఈ నేపథ్యంలో పాలకులు చేసే పాపాలు తమకు శాపాలుగా మారుతున్నాయని ప్రజలు సెంటిమెంట్ గా భావించే పరిస్థితి ఏర్పడింది. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మంత్రుల కమిటీ దారుణ వైఫల్యం కారణంగా ఏడుగురు భక్తుల బలి!
-
ఎవరు పోతే మాకేంటి? బాధ్యత ఉండక్కర్లే
-
గోడ చాటున గుట్టు!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: స్వయంగా ఐదుగురు మంత్రుల కమిటీ దాదాపు పక్షం రోజులకుపైగా సింహగిరిపై చందనోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చిన్న చిన్న అంశాలను సైతం పరిగణనలోకి తీసుకొని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత నమ్మకంగా చెప్పారు. అయినా సరే.. అప్పన్న నిజరూప దర్శన వేళ పెను విషాదం చోటు చేసుకుంది. ఏర్పాట్లలో మంత్రుల కమిటీ దారుణ వైఫల్యం ఏడుగురు భక్తుల ప్రాణాలను బలి తీసుకుంది. కనీసం ఓ గోడను కూడా పటిష్టంగా నిర్మించలేని బాధ్యతా రాహిత్యం భక్తులను పొట్టనబెట్టుకుంది. సాక్షాత్తూ మంత్రుల పర్యవేక్షణలోనే ఇలా జరిగిందంటే ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కాదా? దీన్ని కప్పిపుచ్చుకునేందుకు తాజాగా బహిరంగ విచారణ పేరుతో నాటకాన్ని సర్కారు రక్తి కట్టించింది. చందనోత్సవం రోజు వర్షం కురవడం సాధారణమే అయినప్పటికీ అందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పవిత్ర పుణ్యక్షేత్రాల్లో వరుసగా అపచారాలు, కూటమి సర్కారు నిర్వాకాలు, అంతులేని నిర్లక్ష్యం తాజాగా మరోసారి బహిర్గతం కావడంతో ఉలిక్కిపడి కింది స్థాయి ఉద్యోగులు, కాంట్రాక్టర్‌పై నెపం మోపి తప్పించుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే ఇదంతా కాంట్రాక్టర్, ఉద్యోగుల తప్పిదమేనంటూ అనుకూల మీడియాలో ఇప్పటికే లీకులిచ్చింది. తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తొక్కిసలాట చోటు చేసుకుని ఆరుగురు భక్తులు మృత్యువాత పడితే తన వైఫల్యాలను కప్పిపుచ్చి గుంభనంగా వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సింహాచలంలో మాత్రం బహిరంగ విచారణ చేపట్టి ఈ విషాదానికి కాంట్రాక్టర్, ఉద్యోగులను బాధ్యులుగా చేసి తప్పించుకునేందుకు సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. అనుమతి లేకుండానే మాస్టర్ ప్లాన్‌లో మార్పులు ప్రభుత్వ జోక్యం లేకుండా సాధ్యమేనా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.తాత్కాలికమే కదా.. కట్టమన్నారు!‘ప్లానింగ్ ప్రకారం డ్రాయింగ్‌లో అసలు ఈ గోడ నిర్మాణం లేదని చెప్పా. తాత్కాలికమే కదా...! చందనోత్సవం కోసం కట్టమని ఒత్తిడి తెచ్చారు. మీకు తెలియంది ఏముంది సర్? టూరిజం, దేవదాయ శాఖలు గోడ కట్టమన్నాయి. దేవుడి కార్యక్రమం కదా అని డ్రాయింగ్‌లో లేకపోయినా అతిక్రమించి చేశా. ఐదు రోజుల్లోనే గోడ నిర్మించా. ఈ గోడ నిర్మాణంపై పరీక్షలు ఏమీ జరగలేదు..’ అని సింహాచలంలో ఏడుగురి సజీవ సమాధికి కారణమైన గోడను నిర్మించిన కాంట్రాక్టరు లక్ష్మణరావు గురువారం విచారణ కమిషన్ ఎదుట వెల్లడించారు. మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మింంచిన ఈ గోడ కోసం అంచనాలు రూపొందించడంగానీ, అనుమతి గానీ తీసుకోలేదని కమిషన్ ఎదుట తేలిపోయింది. గోడ కట్టిన తర్వాత కనీసం పరీక్షలు కూడా చేయలేదని బట్టబయలైంది. ఒత్తిడి తెచ్చి పనులు హడావుడిగా చేయించారుసింహాద్రి అప్పన్న చందనోత్సవం సందర్భంగా గోడకూలి ఏడుగురు మృతి చెందిన ఘటనపై 72 గంటల్లో నివేదిక సమర్పించాలంటూ మునిసిపల్, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌కుమార్ నేతృత్వంలో ఐజీ ఆకే రవికృష్ణ, జలవనరులశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) వెంకటేశ్వరరావులతో కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయడం తెలిసిందే. గురువారం ఉదయం పదిన్నర గంటలకు సింహాచలంలో విచారణ ప్రారంభించిన కమిషన్ గోడ నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టర్‌తో పాటు దేవదాయ, టూరిజం శాఖ అధికారులను విచారించింది. గోడ కూలిన ప్రాంతాన్ని పరిశీలించి శిథిలాల నుంచి ఇటుకలు, మట్టిని విచారణ అధికారులు సేకరించారు. కేవలం 5 రోజుల్లోనే గోడ నిర్మాణాన్ని పూర్తి చేశామని... తమ మీద ఒత్తిడి తెచ్చి పనులు హడావుడిగా చేయించారని విచారణాధికారి ఎదుట కాంట్రాక్టర్ కుండబద్దలు కొట్టారు. ప్లాన్‌లో లేకుండానే పనులు చేయించారని, గోడ పటిష్టతపై ల్యాబ్‌లో ఎలాంటి పరీక్షలు చేయలేదని తెలిపారు. అనుమతులు లేకుండానే...డ్రాయింగ్‌లో లేని తాత్కాలిక గోడ నిర్మాణం విషయంలో అనుమతులు తీసుకున్నారా? అని కమిషన్ ఆరా తీసింది. దీనికి సంబంధించిన నోట్ ఫైల్, ఎం బుక్, వర్క్ ఆర్డర్, మీటింగ్ మినిట్స్ లాంటివి లేవని విచారణలో వెల్లడైంది. కేవలం నోటి మాట ఆధారంగా పని చేయలేమని.. డ్రాయింగ్, ప్లానింగ్ ఇవ్వాలని కాంట్రాక్టర్ కోరడం నిజం కాదా? అని సురేష్‌కుమార్ ప్రశ్నించగా అవునని అధికారులు అంగీకరించారు. మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా..సింహాచలం కొండ ‘యూ’ ఆకారంలో ఉంటుంది. కొండధారలు, ఆకాశగంగ, మాడవీధులు.. ఎక్కడ వర్షం కురిసినా తాజాగా ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న మెట్ల మీద నుంచే నీరంతా కిందకు వెళ్తుంది. అందుకే ఈ ప్రాంతంలో పటిష్టమైన రిటైనింగ్ వాల్ నిర్మించారు. దాన్ని ప్రసాద్ స్కీమ్‌లో పునర్ నిర్మించేందుకు పాత గోడని తొలగించారు. చందనోత్సవం నేపథ్యంలో తాత్కాలిక గోడని నాసిరకంగా, ఫ్లైయాష్ ఇటుకలతో కట్టారు. అది చిన్నపాటి వర్షానికే కూలిపోయింది. రూ.300 టికెట్ల లైన్ ఫెన్సింగ్ గోడకి ఆనుకొని వేశారు. ఫెన్సింగ్ లేకుంటే శిథిలాలు కొంతమేర తొలగించుకొని భక్తులు బయట పడేందుకు ప్రయత్నించేవారు. కానీ ఫెన్సింగ్ అడ్డుగా ఉండటంతో వాటిని తొలగించడం సాధ్యంకాక భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు స్పష్టమవుతోంది. అంటే కనీస ప్రణాళిక లేకుండా, భక్తుల భద్రత గురించి ఏమాత్రం ఆలోచన చేయకుండా హడావుడిగా పనులు చేసినట్లు తెలుస్తోంది. నాసిరకంగా నిర్మించారు..తాత్కాలికంగా నిర్మించిన రిటైనింగ్ వాల్ నాసిరకంగా కట్టారు. దానివల్ల వర్షం పడే సమయంలో కూలిపోయిందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అలా ఎందుకు నిర్మించాల్సి వచ్చింది..? హడావుడిగా ఎందుకు చేయాల్సి వచ్చింది? నిజంగా అది నాసిరకంగా ఉందా? అనే వాటికి ఆధారాలు తీసుకున్నాం. ప్రసాద్ స్కీమ్ ఒరిజినల్ పనుల్లో మార్పులు చేర్పులు జరిగాయి. దాని ఆధారంగానే ఈ పనులు చేపట్టారు. ఎవరు అనుమతి ఇచ్చారు? డిజైన్ ఏమిటి? ఎవరు పరీక్షించారనేది విచారిస్తున్నాం. చందనోత్సవం ఉన్నందున త్వరితగతిన చేశామని చెబుతున్నారు. గత ఏడాది కాలంలో మాస్టర్‌ప్లాన్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. దానిలో భాగంగా ఈ గోడను నిర్మించారు. మూడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. ఇటువంటివి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నెల రోజుల్లో సవివర నివేదిక సమర్పించాల్సి ఉంది. అందులో పూర్తిస్థాయి ఎస్‌వోపీలను పొందుపరుస్తాం. – సురేష్ కుమార్, విచారణ కమిషన్ అధ్యక్షుడు -
సింహాచలం గోడ కట్టడంపై అధికారుల ఆరా
-
నెలరోజుల్లో పూర్తి నివేదిక.. సింహాచలం ఘటనపై త్రీమెన్ కమిటీ
విశాఖపట్నం, సాక్షి: సింహాచలం ఆలయంలో గోడ ఎందుకు కూలింది అనేదానికి కేవలం ఒక్కరు చెప్పినదాని ప్రకారం నిర్ధారణకు రాలేమని.. అందరినీ ప్రశ్నించిన తరువాత ఒక నిర్ణయానికి వస్తామని త్రిసభ్య విచారణ కమిటీ చెబుతోంది. గురువారం ప్రమాద స్థలాన్ని పరిశీలించిన విచారణ బృందం.. సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడింది.త్రీమెన్ కమిటీ చైర్మన్, మున్సిపల్ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ సాక్షితో మాట్లాడుతూ.. సింహాచలం ప్రమాద ఘటనలో విచారణ కొనసాగుతోంది. సంఘటన స్థలాన్ని పరిశీలించాం. సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నాం. ఇంకా కొన్ని వివరాలు సేకరించాల్సి ఉంది. మూడు రోజుల్లో ప్రాధమిక నివేదిక ఇస్తాం. నెల రోజుల్లో పూర్తి నివేదిక సమర్పిస్తాం..సింహాచలం ఆలయంలో గోడ ఎందుకు కూలింది కారణాలు ఏమిటి అనే దానిపై వివరాలు సేకరిస్తున్నాం. నాసిరకంగా కట్టడం వల్ల జరిగిందా? ప్రణాళిక లేకపోవడం వల్ల జరిగిందా? అనే కోణంలో విచారిస్తున్నాం. కేవలం ఒక్క వ్యక్తి చెప్పిన దాని ప్రకారం నిర్ణయం తీసుకోలేం. అందరినీ ప్రశ్నించిన తరువాత ఒక నిర్ణయానికి వస్తాం. అందరూ అన్ని వివరాలు చెప్పిన తరువాత మళ్ళీ పరిశీలించాల్సిన అవసరం ఉంది అని అన్నారు.ఇక.. గోడ కూలిన ప్రమాద స్థలిలో విచారణ కమిషన్ రీ వెరిఫికేషన్ చేసింది. ఈ క్రమంలో ఈవో సుబ్బారావు, ఈఈ శ్రీనివాసరాజుపై త్రీమెన్ కమిటీ ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే వాళ్లు సరైన సమాధానాలు ఇవ్వలేకపోయారని తెలుస్తోంది. నోట్ ఫైల్, M బుక్, వర్క్ ఆర్డర్, మీటింగ్ మినిట్స్ వంటివి ఏవీ ఫాలో అయ్యారా....? అనే ప్రశ్నలకు అధికారులు తడబడ్డారు. ప్రసాదం స్కీం పై త్రిసభ్య కమిటీ ఇచ్చిన సి ఫార్సులు ఏమయ్యాయన్న ప్రశ్నకు వాళ్ల దగ్గరి నుంచి సరైన సమాధానాలు రాలేదు. మాస్టర్ ప్లాన్ నిబంధనలకు విరుద్ధంగా, ఎటువంటి అనుమతులు పొందకుండా గోడ నిర్మాణం చేసినట్టు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా మంగళవారం అర్ధరాత్రి దాటాకగోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై విచారణ నిమిత్తం కూటమి ప్రభుత్వం మున్సిపల్ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ అధ్యక్షతన, ఈగల్ విభాగాధిపతి ఐజీ ఆకే రవికృష్ణ, జలవనరులశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎం.వెంకటేశ్వరరావు సభ్యులుగా త్రిసభ్య కమిటీని నియమించింది. -
సింహాచలం ఘటన.. ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం
విశాఖపట్నం, సాక్షి: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే సింహాచలం ప్రమాద ఘటన జరిగిందని.. అలాంటిది ప్రభుత్వ అధికారులతోనే విచారణ జరిపిస్తే ఫలితం ఏముంటుందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. గురువారం సింహాచలంలో ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘చంద్రబాబు ఎప్పుడూ అధికారంలో ఉన్న ఇలాంటి సంఘటనలే జరుగుతున్నాయి. సింహాచలంపై జరిగిన బాధాకరం. జరిగిన ప్రమాదానికి ప్రభుత్వం నిర్లక్ష్యం. ప్రచార పిచ్చి ప్రమాదానికి కారణం అయింది. వీఐపీలకు దర్శనం కల్పించడం మీద ఉన్న శ్రద్ధ భక్తులకు సౌకర్యం కల్పించడంపై లేదు. ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరు చనిపోవడం చాలా బాధాకరం.మంత్రులు చందనోత్సవాన్ని చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా జరుపుతామన్నారు. సింహాచలంపై ఏడుగురు గురు భక్తులు చనిపోయిన సంఘటన ఎన్నడు జరగలేదు. మరణాలపై చంద్రబాబు చాలా తేలికగా మాట్లాడుతున్నారు. మరణాలపై ఆయనకు చీమ కుట్టినట్లు కూడా లేదు. మరణాలపై ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం. సింహాచలం ప్రమాద ఘటనపై ప్రభుత్వ అధికారులతో విచారణ జరిపితే ఏమి లాభం?. ప్రభుత్వం జ్యుడీషియల్ విచారణ ఎందుకు వేయలేదు. జ్యుడీషియల్ కమిటీతో విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయి. అందుకే వైఎస్సార్సీపీ తరఫున మేం డిమాండ్ చేస్తున్నాం. కమిటీ ముందు కాంట్రాక్టర్ నిజాలు చెప్పాడు. నాలుగు రోజుల్లో గోడ కట్టామని చెప్పారాయన. ఆ గోడకు డిజైన్, టెండర్ లేవు. కాంట్రాక్టర్ పై ఒత్తిడి చేసిన వాళ్ళు ఎవరో తెలియాలి. దేవాలయాలు భక్తులు అంటే చాలా నిర్లక్ష్యం కనిపిస్తుంది. చంద్రబాబు ఎప్పుడూ అధికారంలో ఉన్న ఇలాంటి సంఘటనలే జరుగుతున్నాయి. కొండపై 7 మంది చనిపోతే కనీసం శుద్ధి చేయాలనే ఆలోచన ఉండాలి కదా. మరణాలు తరువాత సంప్రోక్షణ చేయడం మన సంప్రదాయం. ప్రమాద ఘటనపై పరామర్శకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎందుకు రాలేదు?. జనసేన కార్యకర్త అయితేనే పవన్ పరామర్శ చేస్తారా?. మిగతా వారిని పరామర్శించరా?.ప్రభుత్వంలో ఉండి మీరు చేయాల్సిన పనిని వైఎస్ జగన్ చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. చనిపోయిన వారి కుటుంబాలకు పార్టీ తరుపున 2 లక్షల రూపాయలు ఆర్ధిక సాయం అందిస్తున్నాం అని బొత్స అన్నారు. -
విషాదం నింపిన.. సింహాచల దైవదర్శనం
-
సింహాచలం ఘటన చూస్తుంటే అమరావతి ఆగమైనట్టే
-
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది: బొత్స సత్యనారాయణ
-
సింహాచలంలో ప్రమాద స్థలిని పరిశీలించిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, విశాఖపట్నం: సింహాచలంలో ప్రమాద స్థలిని వైఎస్సార్సీపీ నేతలు పరిశీలించారు. గోడ కూలిన ప్రాంతాన్ని మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ పరిశీలించారు. అనంతరం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్లక్ష్యం వలనే ప్రమాదం జరిగిందన్నారు. ఇవి ముమ్మూటికీ ప్రభుత్వ హత్యలేనని మండిపడ్డారు.కాగా, భక్తుల ప్రాణాలతో కూటమి నేతలు చెలగాటమాడుతున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులపైనే దృష్టి పెట్టిన కూటమి నేతలు.. భక్తుల భద్రతను గాలికి వదిలేశారనే విమర్శలు వస్తున్నాయి. తూతూ మంత్రంగా చందనోత్సవ సమీక్షలు నిర్వహించిన కూటమి నేతలు.. కార్పొరేటర్లతో క్యాంపు రాజకీయాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు కొనుగోలుపై ప్రత్యేక దృష్టి పెట్టారు.మేయర్ డిప్యూటీ మేయర్ పదవుల కైవసంపై ప్రతి రోజు ప్రత్యేక సమావేశాలు నిర్వహించిన కూటమి నేతలు.. అడ్డదారిలో పదవుల కోసం హోటల్లో రోజు ప్రత్యేక మంతనాలు జరిపారు. మేయర్ డిప్యూటీ మేయర్ పదవులపై చూపిన శ్రద్ధ భక్తుల భద్రతపై చూపకపోవడంతో కూటమి నేతల తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. -
చెత్త ప్రభుత్వం.. సింహాచలం భక్తులు సంచలన వ్యాఖ్యలు
-
Big Question: బాబు పాపం - భక్తులకు శాపం
-
ప్రభుత్వమే చంపేసింది
అన్యోన్యంగా ఉండే ఆ సాఫ్ట్వేర్ దంపతులు ఎక్కడికైనా కలిసే వెళ్లేవారు..అలా వీరి ఆనందానికి తోడుగా యువతి తల్లి, మేనత్త కూడా బయల్దేరారు..సొంత కాళ్లపై నిలదొక్కుకున్న ఆ కుర్రాడు స్నేహితుడితో కలిసి వచ్చాడు.. కుమారులు స్థిరపడడంతో జీవితంలో నిశ్చింతగా ఉన్నాడు ఆ ఉద్యోగి....ఇలా చీకూచింత లేని వీరంతా అప్పన్న నిజరూపాన్ని దర్శించుకుని తరించాలని భావించారు. కానీ, గోడ మృత్యు రూపంలో ఎదురొచ్చింది. కూలి.. జీవితాలను కుప్పకూల్చింది.. ..తన ఇంటితో పాటు భర్త లేని చెల్లెలు కుటుంబానికి అండగా ఉంటున్న యువకుడిని బలిగొంది..కుమారుడికి రేపోమాపో పెళ్లి చేయాలనుకుంటున్న తండ్రికి తీరని గుండెకోతను మిగిల్చింది..పిల్లలు ఉద్యోగ రీత్యా దూరంగా ఉన్నప్పటికీ భర్తను చూసుకుంటూ ఉన్న భార్యను కుదేలు చేసింది.....ఇప్పుడు ఈ కుటుంబాల మాట ఒక్కటే.. అప్పన్నా ఇక మాకు దిక్కెవరు అని?మధురవాడ, డాబా గార్డెన్స్/ఆరిలోవ (విశాఖ)/అంబాజీపేట: ‘‘మా పిల్లలు, బంధువులను ప్రభుత్వమే చంపేసింది. చందనోత్సవం పుణ్యమా అని సర్కారు మమ్మల్ని రోడ్డు పాల్జేసింది. మా కుటుంబాలలో నిరాశ నింపింది. ఎన్నికల్లో మా అబ్బాయి ఉమామహేశ్వరరావు బంధువులందరితో టీడీపీకి ఓటు వేయించాడు. చివరకు ఆ ప్రభుత్వమే నా కొడుకు, కోడల్ని పొట్టన పెట్టుకుంది’’ అని సింహాచలం ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఉమామహేశ్వరరావు తండ్రి అప్పలనాయుడు, తల్లి శాంతి గుండెలు బాదుకుంటూ విలపించారు. ‘‘సింహాచలం కొండపై నాణ్యత లేని గోడ కట్టారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారు. మా వాళ్ల ప్రాణాలు తీయడానికే అక్కడ గోడ నిర్మించారు. అధికారులు, కాంట్రాక్టర్‌ను జైలుకు పంపాలి. ప్రభుత్వం నియమించిన కమిటీ ఏమైంది? గోడ పనుల్లో నాణ్యత చూడలేదా?’’ అని శాంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం మధురవాడ చంద్రంపాలేనికి చెందిన పిల్లా ఉమామహేశ్వరరావు (30), శైలజ (28) దంపతులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. వీరికి 2022 నవంబరులో వివాహమైంది. ఉమా మహేశ్వరరావు హైదరాబాద్ హెచ్‌సీఎల్‌లో, శైలజ విశాఖ ఇన్ఫోసిస్‌లో ఉద్యోగులు. అయితే, విశాఖలోని నివాసానికి సమీపంలో ఓ ఫ్లాట్ తీసుకుని అక్కడినుంచే పనిచేస్తున్నారు. అన్యోన్యమైన ఈ జంటకు దైవ భక్తి ఎక్కువ. ఎక్కడికైనా కలిసే వెళ్తారు. తరచూ టూర్లు వేస్తుంటారు. ఇటీవలే ఊటీ, కొడైకెనాల్, పలు ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్లి వచ్చారు. వీకెండ్స్ కచ్చితంగా ఏదో ఒక గుడికి వెళ్తారు. బుధవారం రాత్రి 9.30 ప్రాంతంలో మహేష్, శైలజ సింహాచలం బయల్దేరారు. ఇది తెలిసి హెచ్‌బీ కాలనీలో ఉండే శైలజ తల్లి వెంకటరత్నం (45), మేనత్త గుజ్జారి మహాలక్ష్మి (60) కూడా వారితో పయనమయ్యారు. అప్పన్నను కళ్లారా చూసే తరుణం ఆసన్నం కాగా గోడ రూపంలో మృత్యువు కబళించింది. కుమారుడి మరణ వార్త తెలిసి అప్పలనాయుడు, శాంతి హతాశులయ్యారు. తమ కుటుంబంలోని నలుగురిని ఆ దేవుడు ఒకేసారి తీసుకుపోయాడంటూ రోదించారు. ఉమామహేశ్వరరావు, శైలజ దంపతులు మంచి ఉద్యోగాలతో స్థిరపడుతున్న సమయంలో అర్థంతరంగా తనువు చాలించడం వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. చంద్రంపాలెంలో విషాద ఛాయలు అలముకున్నాయి.రోడ్డునపడ్డ రెండు కుటుంబాలుఉమామహేశ్వరరావు కుటుంబంలో అతడే పెద్ద దిక్కు. మూడేళ్ల కిందట భర్తను కోల్పోయిన చెల్లి చంద్రకళ ఇద్దరు ఆడపిల్లలతో పుట్టింట్లోనే ఉంటోంది. అలా రెండు కుటుంబాలకు ఇతడే ఆధారం. ఉమా మహేశ్వరరావు మృతితో రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి.పెళ్లి చేద్దామనుకుంటుండగా..‘‘విశాఖలో ఇంటీరియర్ వర్క్స్ చేస్తూ పాతిక మందికి ఉపాధి కల్పిస్తున్నా నాన్నా అని మా అబ్బాయి చెప్పేవాడు. దీనికి ఎంతో సంబరపడేవాడిని. వివాహం జరిపించాలనుకునే సమయంలో దేవుడు తీసుకుపోయాడంటూ’’ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట కొర్లపాటివారిపాలెంకు చెందిన పత్తి దుర్గాస్వామినాయుడు (28) తండ్రి వీర వెంకట సత్యనారాయణ బోరున విలపించాడు. దుర్గాస్వామి విశాఖ సీతమ్మపేటలో ఉంటూ.. సీతమ్మధారలో న్యూ డైమండ్ ఇంటీరియర్స్ దుకాణం నడుపుతున్నాడు. సింహాద్రి అప్పన్న నిజ రూప దర్శనానికి తమ ఊరికే చెందిన స్నేహితుడు కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు (శివ) (33)తో కలిసి వెళ్లాడు. గోడ కూలిన ఘటనలో ఇద్దరూ మృత్యువాతపడ్డారు.అధికారుల నిర్లక్ష్యం వల్లే నా భర్త ప్రాణాలు పోయాయి‘‘సింహాచలంలో ఆ గోడ ఇప్పుడు ఎందుకు కట్టారో. నా భర్త ప్రాణాలు తీయడానికేనేమో? వారం క్రితమే నిర్మించారని అందరూ అంటున్నారు. అదీ సరిగా కట్టలేదట. అధికారులు ఏమయ్యారు. వారి నిర్లక్ష్యం వల్లే నా భర్త ప్రాణాలు పోయాయి. ఇప్పుడు నేను ఎలా బతకాలి’’ అని స్టీల్ ప్లాంట్ స్టీల్ మెల్ట్ షాప్ విభాగం ఉద్యోగి, విశాఖ పాత అడవివరంనకు చెందిన ఎడ్ల వెంకటరావు భార్య మహాలక్ష్మి రోదించారు. పల్పెట్ ఆపరేటర్‌గా అందరితో కలివిడిగా ఉండే వెంకటరావు మృతి చెందడాన్ని సహోద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారు. చందనోత్సవ స్వామి దర్శనానికి భార్యతో కలిసి వెళ్దామని అనుకున్నా.. చివరకు ఒక్కడే బయల్దేరారు. ‘‘ఒంటరిగా వెళ్లారు. మమ్మల్ని వదిలేశారంటూ’’ మహాలక్ష్మి రోదించిన తీరు కంటతడి పెట్టించింది. మహాలక్ష్మి అడవివరం దగ్గర్లోని రెసిడెన్షియల్ స్కూల్లో హెల్త్ విభాగంలో పనిచేస్తున్నారు. వీరీ ఇద్దరు కుమారులు బెంగళూరులో ఉంటున్నారు. ఒకరు ఇంజనీర్ కాగా.. మరొకరు డాక్టర్. ఇటీవలే డాక్టర్‌కు వివాహం చేశారు. ఇక వెంకట్రావు సోదరుడు.. ‘‘ఎవరూ లేని నాకు అన్నయ్యే దిక్కు. ఆయన నన్ను వదిలిపోయాడంటూ’’ రోదిస్తూ సొమ్మసిల్లాడు.డాడీ.. నీ పేరిట అన్నదానం చేయిస్తా అన్నాడు..ఈశ్వర శేషారావు మెట్రో కమ్ కంపెనీలో ఫుడ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు. హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేశాడు. తల్లిదండ్రులు కూలి పనులు చేస్తుంటారు. ఎదిగొచ్చిన కుమారుడు ఉద్యోగం చేసి ఆదుకుంటాడని అనుకుంటున్న సమయంలో కానరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ శేషారావు తండ్రి శ్రీనివాసరావు, తల్లి సీతామహాలక్ష్మి రోదించారు. ‘మంగళవారం రాత్రి ఫోన్ చేసి డాడీ.. నీ పేరిట సింహాచలం దేవస్థానంలో అన్నదానం చేస్తున్నా అని చెప్పాడు. తెల్లవారేసరికి మాకు దూరమయ్యాడు’ అని వాపోయారు.చందనోత్సవం ముందు పనులు చేయడమేంటి?ఏటా చందనోత్సవానికి వేలాదిమంది భక్తులు వస్తారని తెలుసు. అయినా దర్శనాల తేదీ దగ్గరగా ఉన్న సమయంలో పనులు చేయడం ఏమిటి? ఒకవేళ చేసినా ప్రమాదం ఉందని గ్రహిస్తే వేరే దారిలో భక్తులను పంపించాలి కదా. పోయిన ప్రాణాలను ఎవరు తెస్తారు? ఆ కుటుంబాలకు దిక్కెవరు?– ఐ.నరసయ్యమ్మ, ఉమామహేశ్వరరావు సమీప బంధువుభక్తిభావంతో మెలిగేవారుమహాలక్ష్మి ఎంతో భక్తిభావంతో మెలిగేవారు. అలాంటి వారి ఇంట ఇంత ఘోరమైన దుర్ఘటన జరగడం హృదయాన్ని కలిచివేస్తోంది.– పొట్నూరి సూర్యకుమారి, వెంకోజీపాలెంకళ్లముందు పెరిగిందిమధురవాడలో ఉంటున్న సాఫ్ట్వేర్ దంపతుల మృతుల్లో ఒకరైన శైలజ వెంకోజీపాలెం శెట్టిబలిజ వీధికి చెందిన పైలా కనకరావు, వెంకటరత్నం కుమార్తె. మా కళ్ల ముందు పుట్టి పెరిగిన అమ్మాయి. మూడేళ్ల క్రితమే పెళ్లయ్యింది. ఇంతలోనే ఇంత విషాదం జరిగింది. –అప్పలనర్సమ్మ, శెట్టిబలిజ వీధిప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం : సీపీఎంఇటీవల నిర్మించిన గోడ అత్యంత నాసిరకంగా ఉందని, చిన్న వర్షానికే కూలిపోయిందంటే ఇందులో ఎంత అవినీతి జరిగిందో అధికారులు, ప్రభుత్వం పాత్ర ఎంత ఉందో అర్థమవుతోందని సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి.గంగారావు అన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు, ఎమ్మెల్యే, ఎంపీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుపతి ఘటన నుంచి ప్రభుత్వం ఏమాత్రం గుణపాఠం నేర్చుకోలేదని.. ఘటనకు పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. సింహాచలం చందనోత్సవం ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, బాధిత కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉపాధి కల్పించాలన్నారు.రూ.కోటి పరిహారం ఇవ్వాల్సిందే : సీపీఐసింహాచలం చందనోత్సవం విశాఖ ప్రజలకు విషాదాన్ని మిగిల్చిందని సీపీఐ విశాఖ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి నష్ట పరిహారం, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ చేసి, కారకులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
చంద్రబాబే బాధ్యుడు: వైఎస్ జగన్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సింహాచలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గోడ కూలి ఏడుగురు మృతి చెందిన ఘటనలో పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదేనని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. దాదాపు ఏడాది కాలంగా గుడులు, గోపురాల్లో జరుగుతున్న ఘటనలన్నింటిలో చంద్రబాబే అసలు దోషి అని మండిపడ్డారు. వైకుంఠ ఏకాదశి, చందనోత్సవం ఎప్పుడు జరుగుతాయో ముందే తెలిసినప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోక పోవడం చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ధ్వజమెత్తారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు, ఇప్పుడు ఇక్కడ చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఏడుగురు చనిపోవడంలో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం కళ్లకు కడుతోందని చెప్పారు. సింహాచలం ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. మొత్తం ఏడుగురు చనిపోగా, ఇందులో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలగాలని, వారి కుటుంబాలకు మంచి జరగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానన్నారు. మృతులు పిల్లా ఉమామహేశ్వరరావు, పిల్లా శైలజ కుటుంబ సభ్యులను చంద్రంపాలెం వద్ద ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింహాచలంలో చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో.. ఎంత మంది భక్తులు వస్తారో తెలిసినా కనీస ఏర్పాట్లు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత ముఖ్యమైన గోడను ముందే ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. 70 అడుగుల పొడవు, 10 అడుగుల ఎత్తున గోడను నాలుగు రోజుల్లో నిర్మాణం పూర్తి చేశారని, ఏమాత్రం నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని ధ్వజమెత్తారు. గాలికి ఫ్లెక్సీ ఊగినట్లు ఈ గోడ కూలిపోయే ముందు ఊగిందని భక్తులు చెబుతున్నారంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో అర్థం అవుతోందన్నారు. ‘ముందస్తు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? మంత్రుల పర్యవేక్షణ ఏమైంది? ఐదుగురు సభ్యుల కమిటీ ఏం చేసింది? టెండర్లు పిలవకుండానే ఇంత పెద్ద గోడ ఎలా నిర్మించారు? కాంక్రీట్ గోడ (రీ ఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ వాల్) కట్టాల్సిన చోట ఫ్లైయాష్ ఇటుకలతో నిర్మించారు. ఎక్కడా కాలమ్స్ లేవు. ఏ మాత్రం నాణ్యత పాటించ లేదు. ఇలాగైతే ఆ గోడ ఎలా నిలబడుతుంది? రెండు రోజుల క్రితం పూర్తయిన ఈ గోడ పక్కనే అంత మంది భక్తులను ఎలా నిలబెట్టారు? ఫలితంగా ఆ గోడ కూలి ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం దారుణం’ అని నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. బాబు పాలనలో అన్నీ దారుణాలే.. చంద్రబాబు పాలన ప్రారంభమైనప్పటి నుంచి అన్నీ దారుణాలే జరుగుతున్నాయి. రాజకీయాల కోసం తిరుమల శ్రీవారి ప్రసాదంపై దు్రష్పచారం చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కనీస ఏర్పాట్లు చేయడంలో విఫలం కావడం వల్లే తిరుపతిలో భక్తుల మధ్య తొక్కిసలాట జరిగి ఆరుగురు చనిపోయారు. భద్రతా సిబ్బందిని చంద్రబాబు పర్యటనకు కుప్పం పంపారు. అదే సమయంలో తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం వచి్చన భక్తులందరినీ ఓ పార్కులోకి పంపారు. వారందరినీ ఒక్కసారిగా వదలడం వల్ల తొక్కిసలాట జరిగింది. గోశాలలో ఆవులు పెద్ద ఎత్తున మృత్యువాత పడ్డాయి. వైఎస్సార్ జిల్లా కాశినాయన క్షేత్రాన్ని కలెక్టర్ సమక్షంలోనే బుల్డోజర్లతో కూల్చి వేశారు. శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మంలో తాబేళ్లు మృత్యువాత పడ్డాయి. చంద్రబాబు గత పాలనలో గోదావరి పుష్కరాల సందర్భంగా ఆయన ప్రచార ఆర్భాటం కోసం భక్తులను గుంపుగా వదలడం వల్ల తొక్కిసలాట జరిగి 29 మంది మృత్యువాత పడ్డారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు చంద్రబాబు వస్తారు.. ఎంక్వైరీ వేస్తున్నామంటారు. తీరా ఎలాంటి చర్యలూ ఉండవు. ఎందుకంటే ఆయా ఘటనలన్నింటికీ చంద్రబాబే బాధ్యుడు కాబట్టి. తిరుపతి క్యూలైన్లలో తొక్కిసలాట ఘటనలో తూతూ మంత్రంగా కంటి తుడుపు చర్యలు తీసుకున్నారు. పైగా వాటన్నిటి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అందుకు సంబంధించిన ఏ అధికారికైనా ఉద్యోగాలు పోతాయి.. యూనిఫాం పోతుందని ఒంట్లో భయం ఉండాలి. అప్పుడే క్రమశిక్షణ ఉంటుంది. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటం ఆగిపోతుంది. పశ్చాత్తాపం ఉండాలి» ఈ ఫొటో చూడండి.. ఎక్కడైనా కాలమ్స్ కనిపిస్తున్నాయా చెప్పండి? 10 అడుగుల ఎత్తు.. 70 అడుగుల పొడవున్న గోడ కూలిపోయేటప్పుడు ఫ్లెక్సీ మాదిరిగా ఊగిందని చెబుతున్నారు. ఏం నిర్మాణం చేశారు? ఏ రకంగా పని చేయిస్తున్నారు? జగన్ ఇచ్చే లోపే ఆ కుటుంబాలకు రూ.కోటి ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నా. బాధ్యులపై, బాధ్యత తీసుకున్న మంత్రులపై, ఆలయాన్ని నడిపే బాధ్యతలో ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఇటువంటివి పునరావృతం కావు.» ప్రతీదీ డైవర్షన్ పాలిటిక్సే.. ఎక్కడా కూడా తప్పు చేశామన్న పశ్చాత్తాపం వీళ్లలో కనిపించడం లేదు. చంద్రబాబులో అది ఎక్కడా కనిపించదు. నేను ఇక్కడకు వస్తున్నానని తెలుసుకుని మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం, ఒక ఉద్యోగం ప్రకటించారు. ప్రభుత్వం అనేది ప్రజలకు భరోసా ఇచ్చేలా ఉండాలి. ప్రజలకు తోడుగా ఉండాలి.» ఏదైనా ప్రమాదం జరిగి ప్రజలు చనిపోతే.. ప్రభుత్వంలో ఉన్నవారు పశ్చాత్తాపం చెందాలి. మనం ఆ కుటుంబానికి ఏం చేస్తున్నామనేది మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. మన ప్రభుత్వంలో ఎల్జీ పాలిమర్స్ ఘటనలో ఒక్కొక్క కుటుంబానికి రూ.కోటి ఇచ్చి ఆదుకున్నాం. ప్రభుత్వం చేసిన తప్పు వల్ల ఈ ఘటన జరిగినప్పుడు ఆ కుటుంబానికి నువ్వేం చేస్తున్నావ్ చంద్రబాబూ? నేను ఒకటే చెబుతున్నా.. మీరు ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. ఈ కుటుంబాల్ని గుర్తు పెట్టుకుంటున్నాను. మేం మళ్లీ అధికారంలోకి వచి్చన తర్వాత రూ.కోటికి మిగిలిన బ్యాలెన్స్ నేను ఇప్పిస్తాను. » ఈ కార్యక్రమంలో మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, విశాఖ, అనకాపల్లి జిల్లాల అధ్యక్షులు కేకే రాజు, గుడివాడ అమర్నాథ్, భీమిలి ఇన్చార్జ్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, తలశిల రఘురాం, జెడ్పీ చైర్పర్సన్ సుభద్ర, మాజీ ఎంపీ బొడ్డేటి మాధవి, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, వాసుపల్లి గణేష్ కుమార్ పాల్గొన్నారు.ఈ గోడ ఎవరు కట్టారో తెలియదట! ప్రతి చోటా నిర్లక్ష్యమే. ప్రతిచోటా డైవర్షన్ పాలిటిక్సే. డైవర్షన్ పాలిటిక్స్ ఏ స్థాయిలో దిగజారిపోయాయో మంత్రుల ప్రకటనలు చూస్తేనే అర్థమవుతోంది. సింహాచలం ఘటనలో మంత్రులు మొదటగా ఏమన్నారంటే.. ఈ గోడ ఎవరి హయాంలో.. ఎవరు కట్టారో చూడాలని మాట్లాడారు. వారి తీరు చూస్తే.. వేరే వాళ్లపై నెట్టేసేందుకేనని అర్థమవుతోంది. వాళ్ల హయాంలోనే వారం రోజుల క్రితమే గోడ కట్టారని ఎప్పుడైతే తెలుసుకున్నారో.. గోడ పిల్లర్లతో కట్టారో.. సిమెంట్‌తో కట్టారో.. బ్రిక్స్‌తో కట్టారో అనేది మాకు తెలీదని మాట్లాడుతున్నారు.ఏమీ తెలుసుకోకపోతే.. ముందస్తు ఏర్పాట్ల పేరుతో మంత్రుల కమిటీ పేరుతో ఎందుకు ఇక్కడికి వచ్చారు? మీ సమక్షంలోనే ముందస్తు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ఈ గోడ ఎందుకు కట్టారు? 70 అడుగుల పొడవు.. 10 అడుగుల ఎత్తుతో ఒక్క కాంక్రీట్ పిల్లర్ కూడా లేకుండా గోడ ఎందుకు కట్టించారు? చందనోత్సవం జరిగిన ప్రతిసారీ వర్షం పడింది. కొత్త గోడ అని తెలిసి.. వర్షం పడుతుందని తెలిసినప్పుడు ఈ గోడ పక్కన ఎందుకు భక్తుల్ని ఉంచారు?అండగా ఉంటాం..మృతుల కుటుంబాలకు వైఎస్ జగన్ భరోసా రూ.కోటి పరిహారం వచ్చేలా చూస్తామని హామీమధురవాడ (విశాఖ): చందనోత్సవంలో గోడ కూలి మృతి చెందిన ఉమా మహేశ్వరరావు, శైలజ కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం మధురవాడ చంద్రంపాలెం ఎన్జీవోస్ కాలనీ శ్మశాన వాటిక వద్ద పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వైఎస్ జగన్‌ను చూసి మృతుల బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఆయన బాధితులతో మాట్లాడారు. వారు ఎన్ని గంటలకు దేవస్థానానికి వెళ్లారు.. ప్రమాదం ఎలా జరిగింది.. పిల్లలు ఎంత మంది.. పరిహారం ఎంత ఇస్తున్నారు.. తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు.తాము రూ.కోటి అడిగామని, రూ.25 లక్షలు, ఉద్యోగం ఇస్తామని మంత్రులు చెప్పారన్నారు. అది ప్రభుత్వ ఉద్యోగమా.. ప్రైవేటు ఉద్యోగమా అని అడగ్గా.. ప్రభుత్వ ఉద్యోగమేనని చెప్పారు. తమ కుటుంబాన్ని అన్ని విధాలుగా పోషించే వ్యక్తి చని పోయాడని, మూడేళ్ల క్రితం అల్లుడు కూడా చనిపోయాడని, చెల్లి పిల్లలను కూడా తమ కొడుకే సాకుతున్నాడని ఇప్పుడు అతడు కూడా చనిపోయాడని మృతుడి తల్లిదండ్రులు అప్పలనాయుడు, శాంతి గుండెలవిసేలా రోదిస్తూ చెప్పారు. తాము అండగా ఉంటామని, రూ.కోటి పరిహారం వచ్చేలా చూస్తామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. బాధితుల తరఫున గట్టిగా మాట్లాడతామని పేర్కొన్నారు. -
జగన్ వస్తున్నారని తెలిసి ప్రభుత్వంలో వణుకు
ఆరిలోవ/డాబాగార్డెన్స్: సింహాచలం ఘటన గురించి తెలిసిన వెంటనే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖకు బయలుదేరారన్న సమాచారం అందుకున్న ప్రభుత్వం కలవరపాటుకు గురైంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతారని వణికిపోయింది. వైఎస్ జగన్ కేజీహెచ్ మార్చురీకి చేరుకునేలోపే మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి వారి బంధువులకు అప్పగించేందుకు రాష్ట్ర హోం మంత్రి అనిత పడరాని పాట్లు పడ్డారు. పోస్టుమార్టంకు అంగీకరిస్తూ సంతకాలు చేయాలంటూ బాధిత కుటుంబాల కాళ్లావేళ్లాపడ్డారు.శవపంచనామాకు సహకరించాలని, ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారంతోపాటు రూ.కోటి పరిహారం అందేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మొరపెట్టుకున్నారు. తమను నమ్మాలని ప్రాధేయపడ్డారు. అయినా మృతుల కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. వారం రోజుల్లోనే నాణ్యత లేకుండా గోడ నిర్మించి తమ కుటుంబీకుల మరణానికి కారణమైన ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదంటూ భీష్మించారు. రాతపూర్వకంగా ఇవ్వాలని, లేదా మీడియా ముందు స్పష్టంగా ప్రకటించాలని తేల్చిచెప్పారు. దీంతో ఏం చేయాలో పాలుపోని హోంమంత్రి అనిత వైఎస్ జగన్ వచ్చేలోపే పోస్టుమార్టం పూర్తిచేసి మృతదేహాలను బంధువులకు అప్పగించాలని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ పి.శివానంద్‌తోపాటు పోలీసు అధికారులను ఆదేశించారు. వారి చేత మృతుల కుటుంబాలపై తీవ్ర ఒత్తిడి చేయించారు. మృతులు భీమిలి నియోజకవర్గం వారు కావడంతో వారిని ఒప్పించాలని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుయాయులనూ బతిమిలాడారు. ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్‌రాజు కూడా మృతుల కుటుంబ సభ్యులకు నచ్చజెప్పేందుకు శతవిధాలా యత్నించారు. చివరకు సంతకాలు లేకుండానే మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తిచేయించారు. సింహాచలం ఘటన గురించి విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ పట్టించుకోలేదు. సింహాచలం దేవస్థానం వైపు కన్నెత్తి చూడలేదు. -
మృతదేహాల వెలికితీతలోనూ నిర్లక్ష్యమే
సాక్షి, విశాఖపట్నం: సింహగిరిపై ఊహకందని విషాదం సంభవించింది. గోడ కూలిన విషయం సింహగిరి మొత్తం దావానలంలా వ్యాపించింది. అదే సమయంలో ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు, మంత్రులు, ఎమ్మెల్యేలు దర్శనాల కోసం బారులుతీరారు. శిథిలాల కింద భక్తులు చిక్కుకున్న విషయం తెలిసినా.. తమకేమీ సంబంధం లేదన్నట్లు వ్యవహరించారు. తమ వారు రూ.300 టికెట్ తీసుకుని దర్శనం కోసం వెళ్లారని, వారి సమాచారం కావాలంటూ భక్తులు కోరుతున్నా సమాధానం చెప్పే వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. ఈ ఘటన బయటకు పొక్కనివ్వకుండా జాగ్రత్తపడేందుకు యత్నించారే తప్ప.. వీలైనంత త్వరగా సహాయక చర్యలు పూర్తి చేసి పరిస్థితి చక్కదిద్దుదామన్న ఆలోచన అధికారులు, ప్రజాప్రతినిధులకు రాలేదు. వీఐపీ దర్శన మార్గానికి 50 మీటర్ల దూరంలో గాలిగోపురానికి సమీపంలో దుర్ఘటన జరిగింది. ప్రజాప్రతినిధులు వెళ్తున్న సమయంలోనే పోలీసులు, వైద్య సిబ్బంది అటుగా పరుగులు తీశారు. దాన్ని చూసిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం జరిగిందని వాకబు చేశారు. విషయం తెలుసుకుని ఆగకుండా దర్శనానికి వెళ్లిపోయారు.కంట్రోల్ రూమ్ ఎక్కడ? ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు బాధిత కుటుంబాల వారు సమాచారం కోసం ఎదురు చూస్తుంటారు. ఇందుకోసం వెంటనే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తుంటారు. కానీ.. ప్రమాదం సంభవించి ఏడుగురు మృత్యువాతపడినా అధికారుల్లో కనీస చలనం లేదు. తమ వారు ఎక్కడున్నారో.. ఏమైపోయారో తెలీక.. చాలామంది భక్తులు నానాఅవస్థలు పడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే రూ.300 టికెట్ క్యూలైన్లో ఉన్న వారంతా చెల్లాచెదురయ్యారు. కొండపై మొబైల్ సిగ్నల్ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యుల జాడ తెలియక ఆందోళన చెందారు. కొందరు భక్తులు కంట్రోల్ రూమ్ ఏమైనా ఏర్పాటు చేశారా? అని అడిగితే.. జిల్లా అధికారులు స్పందించలేదు. అక్కడున్న అధికారుల్ని తమ వారి జాడ గురించి అడిగితే.. తమకేమీ సంబంధం లేదన్నట్లు సమాధానమిచ్చారు. ఓ వలంటీర్ తన కుటుంబ సభ్యుల్ని 2 నిమిషాల ముందే ఆ లైన్లో చూశాననీ, ప్రమాదం జరిగిన తర్వాత వాళ్లు కనిపించడం లేదంటూ కన్నీటిపర్యంతమైనా.. తోటి వలంటీర్లు ఓదార్చి వారి జాడ కోసం ప్రత్యేక బృందంగా ఏర్పడి వెతకాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆంక్షలు.. ఆగ్రహావేశాలు చందనోత్సవ సమయంలో ఏర్పాట్ల విషయంలో విఫలమైన ప్రభుత్వం.. ఘోరం జరిగినా అంతే నిర్లక్ష్యంతో వ్యవహరించింది. అపశ్రుతి చోటుచేసుకుని ఏడుగురు మరణించారన్న విషయాన్ని బయటకు పొక్కనివ్వకుండా చేసేందుకు మంత్రులు, అధికారులు విశ్వ ప్రయత్నం చేశారు. హోం మంత్రి అనిత ఘటనాస్థలానికి వెళ్లే ప్రాంతంలో పహారా కాశారు. కనీసం మీడియా ప్రతినిధులు వెళ్లేందుకు కూడా వీల్లేదని హుకుం జారీ చేశారు. కొందరు వెళ్లేందుకు ప్రయత్నించినా హోంమంత్రి తన సిబ్బందితో కలిసి అడ్డుకున్నారు. అయినా ఈ విషయం అక్కడకు వచ్చిన భక్తులకు తెలిసిపోవడంతో హోంమంత్రి అసహనం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తర్వాత క్యూలైన్లలోనూ ఆంక్షలు విధించడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. బస్సులు లేక అగచాట్లు మరోవైపు ప్రమాదం సంభవించిన తర్వాత ఘాట్‌రోడ్డు నుంచి భక్తుల్ని అనుమతించడం నిలిపేశారు. వేకువజామున 4 గంటల నుంచి 7 గంటల వరకూ బస్సుల్ని పైకి పంపించకపోవడంతో కొండ దిగువనే భక్తులు నిలిచిపోయి అవస్థలు పడ్డారు. మరోవైపు.. అర్ధరాత్రి నుంచి స్వామి దర్శనం కోసం కొండపైకి వచ్చిన భక్తులు తిరిగి వెళ్లేందుకు కూడా బస్సులు లేకపోవడంతో అగచాట్లు ఎదుర్కొన్నారు. ఉదయం 7 గంటల తర్వాత బస్సుల రాకపోకలు ప్రారంభించడంతో వాటిని అందుకునేందుకు యుద్ధాలే చేయాల్సిన దుస్థితి దాపురించింది. గోడ ఎలా కట్టారో మాకెలా తెలుస్తుంది? మృతదేహాల్ని కేజీహెచ్‌కు తరలించిన తర్వాత ప్రమాద స్థలాన్ని హోం మంత్రి అనిత పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ..‘అక్కడ గోడ ఉంది. అది పిల్లర్‌తో కట్టారా... సిమెంట్‌తో కట్టారా... ఇటుకలతో కట్టారా... అనేది మేమెవరం చూసుకోం..’ అని వ్యాఖ్యానించారు. ‘మేమూ వర్షంలో తడుస్తూనే దర్శనం చేసుకున్నాం. అయినా.. ఘటనాస్థలాన్ని పరిశీలించేందుకు వచ్చాను’ అని హోం మంత్రి చెప్పడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గందరగోళ పరిస్థితులు ప్రమాదం తర్వాత రూ.300 క్యూలైన్లను పూర్తిగా నిలిపేశారు. దీంతో ఆ టికెట్లు తీసుకున్న వేలాది భక్తులు దర్శనానికి ఎటువెళ్లాలో తెలియక నిలిచిపోయారు. దీంతో ఆ ప్రాంతమంతా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకానొకదశలో అధికారులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అప్పటికప్పుడు రూ.1,000 టికెట్ క్యూలైన్లను రూ.300 టికెట్ క్యూలైన్లుగా మార్చేశారు. రూ.1,500 టికెట్, రూ.1,000 టికెట్ భక్తుల్ని ఒకే లైన్లో కలిపేశారు. గాలిగోపురం వద్ద ఆయా టికెట్ల వారిని వేరువేరుగా పంపించారు. దీంతో ఎవరు ఎటు వెళ్లాలో తెలీక లైన్లు కిక్కిరిసిపోవడంతో భక్తులు నరకయాతన అనుభవించారు. అనిత.. ఇదేనా మీ బాధ్యత! 27–04–2025 క్యూ లైన్లు, భక్తులకు ఇతర సౌకర్యాలపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ఐదుగురు మంత్రులం ఏర్పాట్లపై సమీక్షించాం. ప్రతి చిన్న విషయాన్ని ఎంతో శ్రద్ధ పెట్టి పర్యవేక్షిస్తున్నాం. 30–04–2024 ఈ ఘటన ఎంతో దురదృష్టకరం. మేం రెండు రోజుల క్రితం ఏర్పాట్ల పరిశీలనకు వచ్చాం. అయితే ప్రమాదానికి గురైన గోడ ఎలా నిర్మించారో మేం చూడలేదు. ఆ గోడ ఇటుకతో కట్టారా? పిల్లర్‌తో కట్టారా? అనేది మేం చూడలేదు. – ఇవీ హోంమంత్రి అనిత వ్యాఖ్యలు -
దైవ సాక్షిగా.. 'మళ్లీ భక్తులే బలి'
‘మా పిల్లలు.. బంధువులను ప్రభుత్వమే చంపేసింది! చందనోత్సవం పుణ్యమా అంటూ ప్రభుత్వం మమ్మల్ని రోడ్డు పాల్జేసింది. మా కుటుంబాలలో విషాదం నింపింది...!’ ‘దగ్గరుండి బంధువులందరితో తెలుగుదేశంకు ఓటు వేయించాడు. ఆ ప్రభుత్వమే మా కొడుకు.. కోడలిని పొట్టనబెట్టుకుంది. ఇంటి దిక్కును కోల్పోయాం...!’‘చేతికి అందివచ్చిన కుమారుడికి త్వరలోనే పెళ్లి చేయాలనుకున్నా...!’ ‘నాకు పెద్ద దిక్కు అనుకున్న అన్నయ్య నన్ను వదిలి వెళ్లిపోయాడు..!’ కేజీహెచ్ మార్చురీ వద్ద మృతుల బంధువుల ఆక్రోశం ఇదీ!సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: టీడీపీ కూటమి సర్కారు పాపాలు భక్తులకు యమపాశాలుగా మారుతున్నాయి! తిరుపతిలో తొక్కిసలాట ఘటన మరువక ముందే.. సింహాచలంలో మరో విషాదం చోటు చేసుకుంది. నాడు వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల కోసం వచ్చిన ఆరుగురు భక్తులు తిరుపతిలో మృత్యువాత పడగా.. నేడు వరాహ లక్ష్మీ నృసింహస్వామి నిజరూప దర్శనం కోసం సింహాచలం వచ్చిన వారు నిర్జీవులుగా మారారు. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం ఏర్పాట్లలో సర్కారు నిర్లక్ష్యం ఏడు నిండు ప్రాణాలను బలి తీసుకుంది! అత్యంత నాసిరకంగా, కాలమ్స్ లేకుండా ఫ్లైయాష్‌తో కట్టిన గోడ గాలివానకు కూలిపోయి భక్తులను సజీవ సమాధి చేసింది. బుధవారం తెల్లవారుజామున ఈ విషాదం చోటు చేసుకుంది. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉండగా వీరిలో ఐటీ ఉద్యోగాలు చేస్తున్న యువ దంపతులున్నారు. చనిపోయిన వారిలో అంబాజీపేటకు చెందిన కుంపట్ల మణికంఠ ఈశ్వర శేషారావు(29), పత్తి దుర్గా స్వామినాయుడు (30), విశాఖ వాసులు ఎడ్ల వెంకటరావు(58), పిల్లా ఉమా మహేశ్వరరావు(30), పిల్లా శైలజ (27), గుజ్జారి మహాలక్ష్మి, పైలా వెంకట రత్నం(45) ఉన్నారు. తమవారి ప్రాణాలు తీసేందుకే నాణ్యత లేని గోడ కట్టారని బాధిత కుటుంబాలు ఆక్రోశిస్తున్నాయి. ఈ విషాదం అందరినీ కలచి వేస్తుండగా విశాఖ ఎంపీ శ్రీభరత్ ఏమాత్రం చలించకుండా చందనోత్సవ దర్శనం చేసుకుని చల్లగా జారుకోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. తనకేమీ పట్టనట్లుగా ఆయన ఢిల్లీ వెళ్లిపోయారు. ఇక టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విశాఖ విడిచి పత్తా లేకుండా పోయారు. ప్రచారం ఘనం.. ఏర్పాట్లు శూన్యంఏడాదికోసారి జరిగే సింహాచలం చందనోత్సవం నిర్వహణ ఏర్పాట్లు ఈసారి భక్తులకు చుక్కలు చూపించాయి. కొండపైకి వెళ్లేందుకు బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక దర్శనానికి 5 నుంచి 8 గంటల పాటు క్యూలైన్లలో నరకయాతన అనుభవించారు. చందనోత్సవం వేడుకను తిలకించేందుకు దాదాపు రెండు లక్షల మంది భక్తులు తరలి వస్తారని అంచనా వేయగా నిర్వహణ ఏర్పాట్ల కోసం ఐదుగురు మంత్రులతో కమిటీని నియమించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చిన్న చిన్న అంశాలను సైతం పరిగణనలోకి తీసుకొని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. అప్పన్న నిజరూప దర్శనం వేళ.. ఏర్పాట్లలో డొల్లతనం బయట పడింది. చందనోత్సవం నిర్వహణ ఏర్పాట్ల విషయంలో మంత్రుల కమిటీ నిర్లక్ష్యం భక్తుల ప్రాణాలను బలి తీసుకుంది. ఏటా చందనోత్సవం రోజు వర్షం పడడం సాధారణం అయినప్పటికీ అందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఫలితంగా వారం క్రితం నిర్మించిన నాసిరకం గోడ కూలి ఏడుగురి ప్రాణాలను బలి తీసుకుంది. అంత ఎత్తు గోడ కట్టినప్పుడు ఫ్లైయాష్ ఇటుక వాడవచ్చా? నీరు దిగేందుకు వీలుగా గోడకు పైపులు ఎందుకు అమర్చలేదు? ఇంజనీరింగ్ డిజైన్ ఇచ్చిందెవరు? అక్కడ ఉన్న షాపులు తొలగించమని ఎవరు చెప్పారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఘటనాస్థలంలో శిథిలాలను తొలగిస్తూ మృతుల కోసం వెదుకుతున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వీఐపీల దర్శనం, టికెట్ల అమ్మకాలపైనే దృష్టిపవిత్ర చందనోత్సవం సమయంలో సైతం సింహాచలం దేవాలయానికి ప్రభుత్వం ఈవోను నియమించకపోవడం గమనార్హం. కేవలం ఇన్చార్జి ఈవోతో ఇంత భారీ కార్యక్రమాన్ని ముగించేందుకు సిద్ధమైంది. ఇన్చార్జి ఈవోను డమ్మీగా మార్చి ప్రభుత్వ పెద్దలు ఇష్టారీతిలో వ్యవహరించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాసుల జారీ మొదలుకుని.. టికెట్ల అమ్మకాలు, చందనోత్సవం కోసం చేపట్టిన వివిధ కాంట్రాక్టు పనులన్నింటిలోనూ అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకున్నారు. వీఐపీల దర్శనం, టికెట్ల అమ్మకాలపై దృష్టి సారించి సాధారణ భక్తుల భద్రతను గాలికొదిలేసినట్లు స్పష్టమవుతోంది.హడావుడిగా తాత్కాలిక గోడకేశ ఖండనం, గాలి గోపురానికి వెళ్లే భక్తులు నడిచేందుకు ఆలయం పక్కన దారి ఉంది. అక్కడి నుంచి కిందకు వెళ్లేందుకు ఉన్న మెట్ల మార్గం పక్కనే గోడ నిర్మాణం జరుగుతోంది. వాస్తవానికి ఈ గోడకు బదులుగా గతంలో రిటైనింగ్ వాల్ ఉంది. పై నుంచి మట్టి ఊడిపడితే కింద వెళ్లే భక్తులకు ఇబ్బంది లేకుండా ఈ రిటైనింగ్ వాల్ కాపాడేది. అయితే, ప్రసాద్ స్కీమ్‌లో భాగంగా పాత రిటైనింగ్ వాల్ స్థానంలో కొత్త రిటైనింగ్ వాల్ నిర్మించాల్సి ఉంది. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సమయం పడుతుందని చందనోత్సవం సందర్భంగా హడావుడిగా తాత్కాలిక గోడను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తాత్కాలిక గోడ నిర్మాణ పనులు నాలుగు రోజుల్లో పూర్తి చేశారు. పునాదులు, కాంక్రీట్, స్టీల్, రెయిన్‌ఫోర్స్‌మెంట్ స్ట్రక్చర్ లేకుండా కేవలం ఫ్లైయాష్ బ్రిక్స్‌తో భారీ గోడను నిర్మించేశారు. ఇటుకకు ఇటుకకు మధ్య కనీసం సిమెంటు లేకుండా ఇసుక ఎక్కువ పాలు వేసి అత్యంత నాసిరకంగా నిర్మించారనే విషయం చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. పాత రిటైనింగ్ వాల్ ఉండి ఉంటే ఈ ప్రమాదం తప్పేదని.. కనీసం గోడ నిర్మాణ సమయంలో ప్రభుత్వం నాణ్యతను పరిశీలించినా ఇంత పెను ప్రమాదం జరిగి ఉండేది కాదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగూ తాత్కాలిక గోడే కదా అనే నిర్లక్ష్యం.. పర్యవేక్షణ లోపంతో నాసిరకంగా నిర్మించడంతో చిన్నపాటి వర్షానికే కూలిపోయి భక్తులు ప్రాణాలు కోల్పోయారు.మృతుల ఫైల్ ఫొటోలు ముందస్తు జాగ్రత్తలేవి?లక్షల మంది భక్తులు తరలివచ్చే ఈ వేడుకల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రమాదం జరిగిన తరువాత కూడా సహాయక చర్యలు అందించడంలో తీవ్ర జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. కొత్తగా నిర్మించిన రిటైనింగ్ వాల్ వైపు రూ.300 టికెట్ల క్యూలైన్లు ఏర్పాటు చేశారు. కానీ అక్కడ ఒక్క సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచలేదు. ప్రమాదం జరిగిందన్న విషయం భక్తుల హాహాకారాలు చేస్తే గానీ అధికారుల దృష్టికి వెళ్లలేదు. భారీగా భక్తులు తరలివచ్చే కార్యక్రమాలకు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అంబులెన్సులు, పారా మెడికల్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి కనిపించలేదు. దుర్ఘటన తెల్లవారుజామున సుమారు 3.05 గంటలకు జరగగా అధికారులు 3.30 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ తరువాత ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించారు. అప్పటికే దారుణం జరిగిపోయింది. ఇటుకల కింద ఏడుగురు భక్తులు సమాధి అయిపోయారు.మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకే పెద్దపీట!ఒకవైపు ఆలయ ఇన్చార్జి ఈవోను డమ్మీని చేసి అన్ని నిర్ణయాలను కలెక్టరేట్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇంటి నుంచే ప్రభుత్వం అమలు చేసింది. ఎవరికి ఎన్ని వీఐపీ టికెట్లు ఇవ్వాలనే విషయాన్ని వారే నిర్ణయించారు. టీడీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలకు ఎన్ని కావాలంటే అన్ని పాస్‌లు కేటాయించారు. వారికి మాత్రమే కారు పాస్‌లు మంజూరు చేశారు. బీజేపీ నేతలకు సైతం వీఐపీ, రూ.1,500 టికెట్లు దక్కలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సాధారణ భక్తులు రూ.300, రూ.1,000 టికెట్లను కొనుగోలు చేసేందుకు బ్యాంకులు, కౌంటర్ల వద్దకు వెళితే లేవని తిప్పి పంపేశారు. అప్పటికే ఆ టికెట్లను తమ వారి కోసం టీడీపీ నేతలు తీసేసుకున్నారు. సాధారణ భక్తులు దేవస్థానం బస్సుల్లోనే కొండపైకి చేరుకోవాల్సి వచ్చింది. బస్సులు తగినంతగా లేకపోవడంతో గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. గంటల పాటు వేచి చూడలేక పలువురు నడక మార్గంలో ఘాట్ రోడ్డు ద్వారా కొండపైకి చేరుకున్నారు. ఘాట్ రోడ్లో నడక దారిలో కిలోమీటరు మేర బారులు తీరి కనిపించారు. ఇన్చార్జి ఈవోనే దిక్కు...!ఏటా చందననోత్సవంతోపాటు గిరి ప్రదక్షిణకు భక్తులు పోటెత్తుతారు. అప్పన్న నిజరూప దర్శన వేడుకను తిలకించేందుకు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ఒడిశా నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఈవోదే ప్రధాన బాధ్యత. అయితే చందనోత్సవం వేళ రెగ్యులర్ ఈవోను ప్రభుత్వం నియమించలేదు. రెగ్యులర్ ఈవోగా ఉన్న వి.త్రినాథరావు 3 నెలలు సెలవులో వెళ్లారు. అప్పటి నుంచి ఇన్చార్జి ఈవోగా కె.సుబ్బారావు కొనసాగుతున్నారు. ఏప్రిల్ 30న చందనోత్సవం ఉందని తెలిసినా రెగ్యులర్ ఈవోను నియమించపోవడం ఇష్టారాజ్యంగా వ్యవహరించేందుకేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మృతుల వివరాలు..పవిత్ర క్షేత్రాల్లో వరుస అపచారాలుపవిత్ర పుణ్యక్షేత్రాల్లో 11 నెలలుగా వరుసగా చోటు చేసుకుంటున్న అపచారాలు, అనూహ్య ఘటనలు భక్తకోటిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతూ వారి భద్రత పట్ల సర్కారు తీవ్ర నిర్లక్ష్యాన్ని బట్ట బయలు చేస్తున్నాయి. తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో ప్రభుత్వమే ‘కల్తీ’ ప్రచారానికి తెర తీయడం మొదలు.. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లలో వైఫల్యం కారణంగా తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆరుగురు భక్తులు మరణించడం.. టీటీడీ గోశాలలో గోవుల మృతి ఘటనను కప్పిపుచ్చుతూ సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా బుకాయించడం.. దశాబ్దాలుగా హైందవ ధర్మం, దాతృత్వానికి ప్రతీకగా నిలిచిన కాశీ నాయన ఆశ్రమాన్ని ప్రభుత్వమే నేలమట్టం చేయడం.. శ్రీకూర్మం గుడిలో తాబేళ్లు చనిపోవడం లాంటి ఘటనలన్నీ భక్తుల మనోభావాలను కలచి వేస్తున్నాయి. గతంలోనూ చంద్రబాబు సర్కారు కృష్ణా పుష్కరాల పేరుతో విజయవాడలో పలు ఆలయాలను నేల కూల్చిందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కనీసం ఓ గోడ కూడా కట్టలేక అప్పన్న సాక్షిగా భక్తుల ప్రాణాలను బలి తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతిమృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50 వేలుసాక్షి, న్యూఢిల్లీ: సింహాచలం క్షేత్రం వద్ద చోటుచేసుకున్న దుర్ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ‘తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు. ప్రధాని స్పందిస్తూ ‘విశాఖపట్నంలో గోడ కూలిన ఘటనలో జరిగిన ప్రాణనష్టం చాలా బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం. మృతుల బంధువులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి రూ.50వేలు అందజేస్తాం’ అని ప్రకటించారు.రాహుల్ విచారంఈ ఘటనపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
సింహాచలం ఘటనపై హోంమంత్రి అనిత
-
సింహాచలం బాధిత కుటుంబాలకు YSRCP ఆర్థిక సాయం
గుంటూరు, సాక్షి: సింహాచలం బాధిత కుటుంబానికి వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మరోవైపు చంద్రంపాలెంలో బాధిత కుటుంబాన్ని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పరామర్శించిన ఓదార్చిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యమే సింహాచలం అప్పన్న ఆలయంలో ఏడుగురి ప్రాణాలు పోయేందుకు కారణమైందని మండిపడ్డారు.మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత.. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మృతి చెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. -
బాబు ఏడాది పాలనలోనే ఇంతటి దారుణాలు చూడాల్సి వచ్చింది: వైఎస్ జగన్
విశాఖపట్నం, సాక్షి: చంద్రబాబు ఏడాది పాలనలోనే దారుణమైన పరిస్థితులు.. అదీ ఆలయాల్లో చూడాల్సి వస్తోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం సింహాచలం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.సింహాచలంలో గోడ కూలిపోయి ఏడుగురు చనిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వైకుంఠ ఏకాదశి నాడు కూడా ఇలాగే చేశారు. నాడు తిరుపతిలో జరిగిన తోపులాటలో ఆరుగురు చనిపోయారు. చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో ఈ ప్రభుత్వానికి తెలీదా?. లక్షల మంది భక్తులు వస్తారని తెలిసి కూడా నిర్లక్ష్యం వహించారు. కనీస సౌకర్యాలు కూడా లేవని భక్తులు చెబుతున్నారు. ఆరు రోజుల కిందట గోడ కట్టడం మొదలుపెట్టారు. రెండు రోజుల కిందట పూర్తి చేశారు. పదడుగుల ఎత్తు.. డెబ్బై అడుగుల పొడవుతో గోడ కట్టారు. కనీసం ఎటువంటి టెండర్లు లేకుండా ఈ గోడ పని పూర్తి చేశారు. దాదాపుగా సంవత్సరం అయ్యింది చంద్రబాబు అధికారంలోకి వచ్చి. చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో చంద్రబాబుకి తెలియదా?. జరుగుతుందని తెలిసి కూడా ముందే గోడ కట్టే కార్యక్రమం చేపట్టలేకపోయారు?. ముందస్తు ఏర్పాట్లపై ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు. మంత్రుల కమిటీ ఏం చేసిందసలు?. కాంక్రీట్ గోడతో కట్టాల్సిన చోట.. ఫ్లైయాష్ ఇటుకలతో నిర్మించారు. కనీసం నాణ్యంగా ఆ గోడను ఎందుకు నిర్మించలేకపోయారు?. వర్షం పడిందని తెలుసు. చందనోత్సవం సందర్భంగా ప్రతీసారి వర్షం పడుతుందని తెలుసు. అయినా రెండు రోజుల కిందట కట్టిన ఆ గోడ పక్కనే క్యూ లైన్ పెట్టారు. చంద్రబాబు ఏడాది పాలనలో దారుణాలు చూడాల్సి వస్తోంది. రాజకీయాల కోసం తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేశారు. తొక్కిసలాట ఘటనలో ఏడుగురిని బలిగొన్నారు. తిరుమల గోశాలలో గోవులు కూడా చనిపోయాయి. కాశినాయన గుడిని బుల్డోజర్లతో కూల్చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం ఆలయంలో తాబేళ్లు మృతి చెందాయి. అంతకు ముందు గోదావరి పుష్కరాల్లో 29 మందిని బలిగొన్నారు. ఇన్ని జరుగుతున్నా చర్యలు లేవు. ఎందుకంటే అన్నింటిలోనూ చంద్రబాబే దోషి. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. ఈ ఘటనలోనూ నిందను మాపైకి నెట్టే యత్నం చేశారు. కానీ, వాళ్ల హయాంలో.. అదీ రెండు రోజుల కిందటే ఆ గోడ కట్టిందని తేలింది. అయినా చంద్రబాబులో ఎక్కడా పశ్చాత్తాపం కనిపించడం లేదు.ప్రభుత్వం అంటే ప్రజలకు భరోసా ఇచ్చేదిగా ఉండాలి. మొక్కుబడిగా రూ.25 లక్షల పరిహారం ప్రకటించారు. జగన్ వస్తున్నాడనే ఈ ప్రకటన చేశారు. ప్రభుత్వం తప్పిదం కాబట్టి పరిహారం పెంచి ఇవ్వాలి. మా ప్రభుత్వంలో ఇలాంటి ప్రమాదాలు జరిగితే.. బాధ్యతగా అధిక పరిహారం చెల్లించాం. ఈ బాధిత కుటుంబాలకు కూడా మా ప్రభుత్వం వచ్చాక ఆ పని తప్పకుండా చేస్తాం’’ అని వైఎస్ జగన్ ప్రకటించారు. కానీ, బాధ్యులపైనా కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటివి పునరావృతం కావని చంద్రబాబుకి వైఎస్ జగన్ హితవు పలికారు. -
ఉమామహేష్, శైలజకు నివాళి.. జగన్ భావోద్వేగం
విశాఖపట్నం, సాక్షి: సింహాచలం బాధిత కుటుంబాన్ని పరామర్శించే క్రమంలో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) భావోద్వేగానికి లోనయ్యారు. ఆ కుటుంబ సభ్యులను ఓదారుస్తూ ధైర్యం చెప్పారు. సింహాచలంలో దైవదర్శనానికి వెళ్లిన పిల్లా ఉమామహేష్, అతని భార్య శైలజ గోడ కూలిన ఘటనలో మృతి చెందారు. వాళ్ల కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు వైఎస్ జగన్ మధురవాడలోని చంద్రంపాలెంకు వెళ్లారు. ఆయన్ని చూసి ఆ కుటుంబ సభ్యులు భావోద్వేగాన్ని లోనయ్యారు. దీంతో ఆయన వాళ్లను హత్తుకుని ఓదార్చారు. అనంతరం.. ఉమా మహేశ్వరరావు, శైలజ భౌతికకాయాలకు నివాళి అర్పించి మీడియాతో మాట్లాడారాయన. -
ప్రభుత్వ వైఫల్యంతోనే సింహాచలం దుర్ఘటన: వెల్లంపల్లి
సాక్షి, హైదరాబాద్: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవంలో పాల్గొని, స్వామివారి నిజరూప దర్శనం కోసం వెళ్లిన భక్తులు ఏడుగురు గోడ కూలి దుర్మరణం చెందడం దురదృష్టకరమని దేవాదాయ శాఖ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. సింహాచలం దుర్ఘటనకు కచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమే కారణమని హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన స్పష్టం చేశారు.హిందువుల మనోభావాలకు విఘాతం:సింహాచలం ఆలయంలో ఏటా ఆనవాయితీగా జరిగే చందనోత్సవాన్ని నిర్వహించడంలోనూ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కూటమి పార్టీలు హిందువులను ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయి. దేవాలయాల సంరక్షణ, వాటి అభివృద్ధితో పాటు, హిందువుల మనోభావాలు కాపాడడంలో ఈ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది.2014–19 మధ్య కూడా చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం, కృష్ణా పుష్కరాల పేరుతో విజయవాడలో అత్యంత దుర్మార్గంగా పదుల సంఖ్యలో ఆలయాలను కూల్చడమే కాకుండా, ఆ దేవతామూర్తుల విగ్రహాలను మున్సిపాలిటీ చెత్త ట్రాక్టర్లలో తరలించి హిందువుల మనోభావాలు గాయపర్చారు. ఇంకా గోదావరి పుష్కరాల సందర్భంగా చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి రాజమహేంద్రవరంలో తొక్కిసలాట జరిగి 29 మంది చనిపోయారు. చంద్రబాబు సీఎం అయ్యాడంటే భక్తులు చనిపోవడం అనేది ఆనవాయితీగా మారింది.ప్రభుత్వ ఉదాసీనత. నాసిరకం పనులు:సింహాచలంలో చందనోత్సవానికి లక్షలాది భక్తులు వస్తున్నారని తెలిసి కూడా సరైన ఏర్పాట్లలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది. తూతూమంత్రంగా నాసిరకంగా చేసిన పనుల కారణంగానే భక్తుల మరణాలు సంభవించాయి. చందనోత్సవం ఏర్పాట్లకు సంబంధించిన రివ్యూ మీటింగ్‌లో ఎమ్మెల్యేలు ఎవరికెన్ని పాసులు పంచుకోవాలని వాదించుకోవడంతోనే సరిపోయింది. అంతే తప్ప, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, ఆలయం వద్ద భక్తుల రద్దీ తట్టుకునే తగిన ఏర్పాట్లపై ఎవరూ చొరవ చూపలేదు.మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్ అక్కడే ఉండి కూడా ఏర్పాట్లపై ఏ మాత్రం శ్రద్ధ పెట్టలేదు. చివరకు టాయ్‌లెట్ సౌకర్యం కూడా కల్పించక పోవడం, ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.ఏదో అపచారం:వైకుంఠ ఏకాదశి రోజు శ్రీవారి దర్శనం కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చనిపోగా, 40 మందికి పైగా గాయపడ్డారు. ఇప్పుడు సింహాచలం స్వామివారి దర్శనం కోసం వచ్చి, ఏడుగురు మృత్యువాత పడ్డారు. వరసగా జరుగుతున్న దారుణాలు చూస్తుంటే, ఎక్కడో ఏదో అపచారం జరిగిందని మాత్రం అర్థమవుతుంది.పవన్‌కళ్యాణ్ ఇప్పుడు దీక్షలు చేయాలి:నాడు ఎక్కడా జరగని అపచారానికి డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఆర్భాటంగా ప్రాయశ్చిత్త దీక్షలు చేశారు. హిందూ మతానికి తానే బ్రాండ్ అంబాసిడర్‌ను అన్నట్లు ప్రచారం చేసుకున్నారు. కాగా ఇప్పుడు సింహాచలం, గత జనవరిలో తిరుపతిలో జరిగిన దారుణాలు కళ్లెదుటే కనిపిస్తున్నాయి. పవన్‌కళ్యాణ్‌కు ఏ మాత్రం మానవత్వం ఉన్నా, ఆయన ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష చేయాలి.అలాగే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఆలయాల్లో జరుగుతున్న అన్యాయాలపై ఇప్పుడు బయటకొచ్చి మాట్లాడాలి. తిరుమలలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. చెప్పులేసుకుని దర్శనానికి వస్తున్నారు. బిర్యానీలు తింటున్నారు. టీటీడీ గోశాలలో వందల సంఖ్యలో గోవులు చనిపోతున్నాయి. శ్రీకూర్మంలో విష్ణుమూర్తి రూపంగా భావించే నక్షత్ర తాబేళ్లు చనిపోతే చడీచప్పుడు కాకుండా కాల్చేశారు. పవన్‌కళ్యాణ్ ప్రకటించిన వారాహి డిక్లరేషన్ ఇదేనా? భక్తులు చనిపోవడం, ఆలయాల్లో అపచారాలు చేయడమేనా మీ ఉద్దేశం?.శిక్షించలేనప్పుడు కమిటీలెందుకు?:తిరుపతిలో తొక్కిసలాటపై దర్యాప్తునకు కమిటీ వేసిన ప్రభుత్వం ఏం తేల్చింది? తప్పు చేసిన వారిపైన చర్యలు తీసుకున్నారా? ఇప్పుడు మళ్లీ త్రిసభ్య కమిటీ వేశామంటున్నారు. తప్పు చేసిన వారిని శిక్షించలేనప్పుడు కమిటీలు వేసి ఏం ప్రయోజనం? ఆలయాల్లో వరుసగా భక్తులు చనిపోతుంటే ప్రభుత్వం బాధ్యత తీసుకోదా?. బాధిత కుటుంబాలకు ఏదో పరిహారం ఇచ్చి, క్షతగాత్రులకు వైద్యం చేయించి చేతులు దులిపేసుకుంటున్నారు. కానీ, ఇది ఏ మాత్రం సరికాదని, భక్తుల మనోభావాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడటం మానుకోవాలని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తేల్చి చెప్పారు. -
సింహాచలం ఘటన.. మూడు రోజుల క్రితం గోడ కట్టడమేంటి?: లక్ష్మీపార్వతి
సాక్షి,తాడేపల్లి: సింహాచలం ఘటన ఎంతో బాధాకరమని.. దేవుడి పేరుతో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే వీరి పాపాలు పరాకాష్టకు చేరుకున్నాయనిపిస్తోందంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నందమూరి లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. బుధవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేవుడి పేరుతో అక్రమాలు, అన్యాయాలు చేస్తున్నారని.. చంద్రబాబు ఎప్పుడు అడుగుపెట్టినా ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయని లక్ష్మీపార్వతి అన్నారు.‘‘తనను తాను నాస్తికుడిగా చంద్రబాబు ఎప్పుడో చెప్పాడు. ఇలాంటి వన్నీ చూసినప్పుడు ప్రత్యక్షంగా ప్రకృతి ప్రకోపిస్తోంది. 2014లో 40 ఆలయాలను కూలగొట్టించింది చంద్రబాబే.. అయినా చంద్రబాబు గొప్పవాడని బీజేపీ వెనకేసుకొస్తోంది. వైఎస్ జగన్ కులమతాలకు అతీతంగా పాలన అందించారు. అది నచ్చక జగన్‌పై బురద చల్లారు. తన మనుషులతో ఆలయాలపై దాడులు చేయించి జగన్‌పై నెట్టేశారు. తిరుపతి లడ్డూని రాజకీయాలకు వాడుకుని మహాపాపం చేశారు. లడ్డూని అపవిత్రం చేయాలని చంద్రబాబు, పవన్ ఎంతో ప్రయత్నం చేశారు’’ అని లక్ష్మీపార్వతి గుర్తు చేశారు‘‘దేవుడు ఇలాంటి వన్నీ చూస్తూ ఉంటాడు. ఇన్నేళ్ల చరిత్రలో తిరుపతిలో తొక్కిసలాట ఏనాడైనా జరిగిందా?. గోదావరి పుష్కరాల తొక్కిసలాట.. తిరుపతి తొక్కిసలాట.. గోవుల మృతి ఇవన్నీ చంద్రబాబు సమయంలోనే జరుగుతాయి. ఎవరు ఎలా పోయినా పర్వాలేదు.. మా దోపిడీ మాకు ముఖ్యం అనేలా ఈ ప్రభుత్వ తీరు ఉంది. మూడు రోజుల క్రితం గోడకట్టడమేంటి?. ముందే కట్టొచ్చుకదా. వీళ్లలాంటి అవినీతి పరులకే పనులు అప్పగించారు.. అందుకే ఇలా జరిగింది’’ అని లక్ష్మీపార్వతి ఆరోపించారు.‘‘అర్హత లేని వాళ్లు అందలం ఎక్కితే ఇలాంటివే జరుగుతాయి. బాధిత కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం అందించాలి. తిరుమతి తొక్కిసలాట విచారణ ఏమైంది?. చంద్రబాబు నీ జీవితం ఇంకెప్పుడూ మారదా?. నీ మార్గంలోనే నీ కొడుకును తీసుకెళ్లాలనుకుంటున్నావా?. ప్రజలు ఏమీ చేయలేనప్పుడు ప్రకృతి తిరగబడుతుంది. పవన్ సనాతన వేషాలు ఇప్పటికైనా మానుకో.. చంద్రబాబు అతని కొడుకు వంటి వాళ్లు అధికారంలో ఉంటే ప్రజలకు రక్షణ ఉండదు. ఎన్నికల ముందు చిన్న చిన్న రోడ్లలో మీటింగ్‌లు పెట్టి ప్రజల చావుకు కారణమయ్యారు. చంద్రబాబు అంటేనే మనుషులను చంపడమా?. ఈకుల, మత పిచ్చేంటి... చంద్రబాబు ఒక్కరోజైనా మనిషిగా బ్రతకండి. చంద్రబాబు,పవన్ అడుగుపెట్టిన నాటి నుంచి ఇలాంటి అపశ్రుతులే చోటుచేసుకుంటున్నాయి’’ అని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. -
సింహాచలం విషాదం.. ఏడుగురి ప్రాణం తీసిన గోడను నిర్మించింది అప్పుడే
విజయవాడ: సింహాచలం ఘటనపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అదే సమయంలో భక్తుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ఎంత విశిష్టత ఉంటుందో. సింహాచలంలో చందనోత్సవానికి అంతే విశిష్టత ఉంటుంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతకాని తనంతో ప్రమాదం జరిగింది. మూడు, నాలుగు రోజుల క్రితం గోడ నిర్మించారు. గోడ నిర్మాణంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. గోడ ప్లెక్సీ ఊగినట్లు ఊగిందని సాక్షులు చెప్పారు. కొండవాల్లో కాంక్రీట్ వాల్ నిర్మించాలి. ఇటుక బెడ్డలతో నిర్మాణం చేపట్టరాదు. ఒకే కుటుంబంలో నలుగురు చనిపోయారు.చనిపోయిన వారి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలి. ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. సంఘటన తెలిసిన వెంటనే వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కేజీహెహెచ్లో బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగింది. కొండపై చాలా గోడలు ఉన్నాయి. అవి ఎందుకు పడుపోలేదు. నాణ్యాత లోపించింది కాబట్టే గోడ పడిపోయింది’ అని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుమల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. ‘ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది...అచేతనంగా మారిపోయింది . ప్రత్యర్ధుల్ని ఇబ్బంది పెట్టడానికి వారికి కావాల్సిన పోలీస్ శాఖ మాత్రమే పనిచేస్తుంది. తిరుపతి లడ్డూ అంశాన్ని తెరపైకి తెచ్చి వైఎస్ జగన్‌పై బురద చల్లాలని చూశారు. చందనోత్సవంలో అపశృతి పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే.మంత్రులు,ప్రభుత్వం చేతకాని తనంతోనే భక్తులు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిని తిరిగి తీసుకురాగలరా. రాష్ట్ర పండుగగా జరుపుకునే ఉత్సవానికి లోపభూయిష్టంగా ఏర్పాట్లు చేయడమేంటి. ఇంతపెద్ద ఘటన జరిగితే తప్పించుకునే ధోరణితో మంత్రులు , అధికారులు వ్యవహరిస్తున్నారు.వరుస అపచారాలు జరుగుతున్నా మొద్ద నిద్ర వీడటం లేదు. ఎంక్వైరీల పేరుతో ట్వీట్లు , ప్రకటనలు చేస్తే సరిపోతుందా?.ఈ ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారు. ఈ ప్రభుత్వానికి హిందూ ఆలయాల పట్ల, దైవ దర్శనాలకు వచ్చే భక్తుల పట్ల చిత్త శుద్ధి లేదు. ఐదుగురు మంత్రులు రివ్యూలు చేశామన్నారు.మీ రివ్యూలు టిక్కెట్ల పంపకాలు ..ప్రోటోకాల్ దర్శనాల కోసమేనా. భక్తుల ప్రాణాలంటే మీకు లెక్కలేదా. వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడటం లేదు. మేం పదే పదే హెచ్చరిస్తున్నా .. ఈ ప్రభుత్వంలో చలనం రావడం లేదు. సనాతన ధర్మం అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు. వైకుంఠ ఏకాదశి రోజున తిరుపతిలో భక్తులు చనిపోయారు. కాశీనాయన క్షేత్రాన్ని కూలదోశారు. శ్రీకూర్మంలో నక్షత్ర తాబేళ్లు మృత్యువాత పడ్డాయి. ఇప్పడు సింహాచలం చందనోత్సవంలో భక్తులు చనిపోయారు. ఏపీలో దైవదర్శనానికి వచ్చిన భక్తులు తిరిగి క్షేమంగా వెళతారనే నమ్మకం లేకుండా పోయింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. -
విశాఖ: సింహాచలం బాధితులకు వైఎస్ జగన్ పరామర్శ
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చేరుకున్నారు. సింహాచలం ఘటనలో మృతిచెందిన బాధిత కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. మృతిచెందిన ఉమామహేష్, శైలజ భౌతికాయాలకు నివాళులర్పించిన వైఎస్ జగన్.. మృతుల కుటుంబాలను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూలి భక్తులు మృతి చెందడంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్ క్యూలైన్ పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ క్రమంలోనే మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు చంద్రంపాలెం బయల్దేరి వెళ్లారు,. తొలుత తాడేపల్లి నుంచి విశాఖకు చేరుకున్న వైఎస్ జగన్.. అక్కడ నుంచి చంద్రంపాలెం వెళ్లారు. -
సింహాచలం విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
సాక్షి, విశాఖపట్నం: సింహాచలం కొండపై తెల్లవారుజామున జరిగిన గోడ కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతులను విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన పిళ్లా ఉమామహేశ్వరరావు (30), ఆయన భార్య శైలజ (26)గా అధికారులు గుర్తించారు. వీరితో పాటు పిల్లా శైలజ తల్లి వెంకటరత్నం, మేనత్త గుజ్జురి మహాలక్ష్మి కూడా ఈ ఘటనలో మృతిచెందారు.అధికారులు అందించిన వివరాల ప్రకారం, ఉమామహేశ్వరరావు, శైలజ ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా హైదరాబాద్‌లోని వేర్వేరు సంస్థల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరూ ఇంటి నుంచే (వర్క్ ఫ్రమ్ హోం) విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజామున 2 గంటల సమయంలో రూ. 300 ప్రత్యేక దర్శనం క్యూలైన్లో వీరు వేచి ఉన్నారు. అదే సమయంలో అక్కడున్న ఒక గోడ ఒక్కసారిగా కూలి వారిపై పడటంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు.ఉమామహేశ్వరరావు, శైలజ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని, అందరితో కలివిడిగా మెలిగేవారని స్థానికులు, బంధువులు చెబుతున్నారు. ఉన్నత చదువులు చదివి, మంచి ఉద్యోగాలు చేస్తూ స్థిరపడుతున్న సమయంలో ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం వారి కుటుంబ సభ్యులను, బంధుమిత్రులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. వారి స్వగ్రామమైన చంద్రంపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ దురదృష్టకర సంఘటనపై పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. -
తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే..
సాక్షి, విశాఖపట్నం: తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే.. సింహాచలంలో మరో ఘోర విషాదం జరిగింది. సింహాచలం అప్పన చందనోత్సవంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ఫలితంగా.. గోడకూలి ఏడుగురు మృతిచెందారు. ఘటన జరిగిన సమయంలో ఒక్క పోలీసు కూడా కనిపించలేదు.. భక్తులను ఆదుకోవడానికి ఒక్క ఎండోమెంట్ ఉద్యోగి కూడా అక్కడ లేరు. అందుబాటులో ఉన్న వాలంటీర్లు, భక్తులు మాత్రమే సహాయక చర్యలు చేపట్టారు. కటిక చీకటిలో భక్తుల కోసం క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో అంతా అంధకారం అలుముకుంది. గోడ కూలిపోవడంతో భక్తుల అరుపులు, రోదనలు మిన్నంటాయి. అప్పటికే భక్తుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి.. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. అన్యాయంగా ఏడుగురు చనిపోయారు. ఘటనపై పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకుంటున్నాం. సరైన చర్యలు చేపట్టకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని వరుదు కల్యాణి అన్నారు. కటిక చీకట్లో భక్తుల కోసం క్యూలైన్లా?. తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే. ఈ ఘటన ప్రభుత్వ వైఫల్యాన్ని బయటపెడుతోందని ఆమె అన్నారు.మరోవైపు, సింహాచలం ఘటనపై వీహెచ్‌పీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సింహాచలం సరైన రీతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని.. నిర్మాణ లోపం వల్లే ప్రమాదం జరిగిందని మండిపడింది.సింహాచలంలో పాలన కాదు.. లాబీయింగ్ నడుస్తోంది. ఎండోమెంట్ వ్యవస్థ ఓ చెత్త.. భగవంతుడికి భక్తులకు దూరం చేయడమే వారిపని.. హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.. పాలకుల కబంధ హస్తాల నుంచి ఎండోమెంట్ వ్యవస్థ బయటకు వస్తేనే భక్తులకు మంచి జరుగుతోంది.. చందనోత్సవంలో ఒక ప్రణాళిక లేదు.. ఓ ప్లాన్ లేదు’’ అంటూ వీహెచ్‌పీ ఆగ్రహం వ్యక్తం చేసింది. -
సింహాచలం అప్పన్న సన్నిధిలో అపశ్రుతి.. ఏడుగురు భక్తులు మృతి
సాక్షి, విశాఖపట్నం: సింహాచలం చందనోత్సవంలో ఘోర అపశ్రుతి చోటుచేసుకుంది. గోడ కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. రూ.300 టికెట్ కౌంటర్ వద్ధ ఈ ప్రమాదం జరిగింది. ఇటీవలే అక్కడ గోడ నిర్మించారు. గోడ నాసిరకంగా నిర్మించడం వలనే కూలిపోయిందని అధికారులు భావిస్తున్నారు. తెల్లవారుజామున 2-3 గంటల మధ్య రూ.300 క్యూ లైన్లో ప్రమాదం జరిగింది. మృతులను యడ్ల వెంకటరావు(48),దుర్గా స్వామినాయుడు(32), మణికంఠ(28)గా గుర్తించారు.ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మృతులను విశాఖపట్నం మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం గ్రామానికి చెందిన పిళ్లా ఉమామహేశ్వరరావు (30), ఆయన భార్య శైలజ (26)గా అధికారులు గుర్తించారు. వీరితో పాటు పిల్లా శైలజ తల్లి వెంకటరత్నం, మేనత్త గుజ్జురి మహాలక్ష్మి కూడా ఈ ఘటనలో మృతిచెందారు. మృతదేహాలను కేజీహెచ్‌కు తరలించారు.👉ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం.. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌తిరుపతిలో వైకుంఠ ఏకాదశి ఎంత విశిష్టత ఉంటుందోసింహాచలంలో చందనోత్సవానికి అంతే విశిష్టత ఉంటుందిప్రభుత్వ నిర్లక్ష్యం చేతకాని తనంతో ప్రమాదం జరిగిందిమూడు నాలుగు రోజుల క్రితం గోడ నిర్మించారుగోడ నిర్మాణంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదుగోడ ప్లెక్సీ ఊగినట్లు ఊగిందని సాక్షులు చెప్పారుకొండవాలులో కాంక్రీట్ వాల్ నిర్మించాలిఇటుక బెడ్డలతో నిర్మాణం చేపట్టరాదుఒకే కుటుంబంలో నలుగురు చనిపోయారుచనిపోయిన వారి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలిప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలిసంఘటన తెలిసిన వెంటనే వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారుకేజీహెచ్ లో బాధిత కుటుంబాలను పరామర్శిస్తారుప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరిగిందికొండపై చాలా గోడలు ఉన్నాయి.. అవి ఎందుకు పడుపోలేదునాణ్యాత లోపించింది కాబట్టే గోడ పడిపోయింది👉సింహాచలం దుర్ఘటన.. భక్తుల మృతిపై విచారణ కమిటీ ముగ్గురు అధికారులతో కమిటి వేసిన ప్రభుత్వం 👉సింహాచలం ఘటన.. ప్రభుత్వ వైఫల్యంపై మల్లాది విష్ణు ఫైర్ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోంది...అచేతనంగా మారిపోయిందిప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టడానికి మాత్రమే పోలీస్ శాఖ మాత్రమే పనిచేస్తుందితిరుపతి లడ్డూ అంశాన్ని తెరపైకి తెచ్చి వైఎస్ జగన్ పై బురద చల్లాలని చూశారుచందనోత్సవంలో అపశ్రుతి పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేమంత్రులు, ప్రభుత్వం చేతకాని తనంతోనే భక్తులు ప్రాణాలు కోల్పోయారుచనిపోయిన వారిని తిరిగి తీసుకురాగలరా?రాష్ట్ర పండుగగా జరుపుకునే ఉత్సవానికి లోపభూయిష్టంగా ఏర్పాట్లు చేయడమేంటి?ఇంతపెద్ద ఘటన జరిగితే తప్పించుకునే ధోరణితో మంత్రులు, అధికారులు వ్యవహరిస్తున్నారువరుస అపచారాలు జరుగుతున్నా మొద్ద నిద్ర వీడటం లేదు 👉మరణించిన వారికి పోస్టుమార్టం చేయడానికి ఒప్పుకోని బంధువులుకోటి రూపాయల పరిహారం ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్తమ డిమాండ్లను ఒప్పుకున్న తర్వాతే పోస్టుమార్టం చేయాలంటున్న బంధువులుపోస్టుమార్టానికి సహకరించాలని బంధువులపై పోలీసులు ఒత్తిడిపోలీసులతో వాగ్వాదానికి దిగిన బంధువులుఎల్జీ పాలిమర్ ప్రమాదంలో చనిపోయిన వారికి కోటి రూపాయల పరిహారం చెల్లించారుఅదే తరహాలో నేడు కూడా పరిహారం చెల్లించాలని డిమాండ్..👉కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యమే: కొట్టు సత్యనారాయణతిరుపతి ఘటన మరవకముందే సింహాచలంలో ఏడుగురు భక్తులు మృతి దారుణంకూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందిలక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేయలేదుసింహాచలం ఘటన బాధాకరంఘటన జరిగి కొన్ని గంటలు అవుతున్నా పవన్ కల్యాణ్ ఎక్కడ ఉన్నారు?క్యూలైన్ల దగ్గర ఎండోమెంట్,రెవెన్యూ అధికారులు ఎందుకు లేరు?గోదావరి పుష్కరాల్లో కూడా పదుల సంఖ్యలో భక్తులు చనిపోయారు.👉విశాఖకు మాజీ సీఎం వైఎస్ జగన్మధ్యాహ్నం 3 గంటలకు విశాఖకు చేరుకోనున్న వైఎస్ జగన్‌బాధిత కుటుంబాలను పరామర్శించనున్న వైఎస్ జగన్👉 సింహాచలం ఘటనపై ప్రధాని మోదీ విచారంవిశాఖ జిల్లా సింహాచలం దేవస్థానంలో గోడ కూలిన ఘటనపై ప్రధాని మోదీ విచారం గోడకూలి భక్తులు చనిపోవడం బాధాకరంమృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిగాయపడిన భక్తులు త్వరగా కోలుకోవాలి పీఎం సహాయ నిధి నుంచి ఎక్స్‌గ్రేషియా మృతుల కుటుంబాలకు PMNRF నుండి రూ. 2 లక్షల పరిహారం గాయపడిన వారికి రూ. 50,000 పరిహారం ఇస్తున్నట్లు పీఎంవో కార్యాలయం ఎక్స్ వేదికగా ట్వీట్ Deeply saddened by the loss of lives due to the collapse of a wall in Visakhapatnam, Andhra Pradesh. Condolences to those who have lost their loved ones. May the injured recover soon.An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The…— PMO India (@PMOIndia) April 30, 2025 👉కేజీహెచ్ మార్చురి వద్ద విషాద ఛాయలుకేజీహెచ్ మార్చురి వద్దకు చేరుకుంటున్న మృతుల కుటుంబ సభ్యులుకన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు...దైవదర్శనానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారంటూ ఆవేదన👉సింహాచలం ఘటనపై వీహెచ్‌పీ ఆగ్రహంసింహాచలం సరైన రీతిలో ప్రభుత్వం చర్యలు చేపట్టలేదునిర్మాణ లోపం వల్లే ప్రమాదం జరిగిందిసింహాచలంలో పాలన కాదు.. లాబీయింగ్ నడుస్తోందిఎండోమెంట్ వ్యవస్థ ఓ చెత్తభగవంతుడికి భక్తులకు దూరం చేయడమే వారిపనిహిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయిపాలకుల కబంధ హస్తాల నుంచి ఎండోమెంట్ వ్యవస్థ బయటకు వస్తేనే భక్తులకు మంచి జరుగుతోందిచందనోత్సవంలో ఒక ప్రణాళిక లేదు.. ఓ ప్లాన్ లేదు👉తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే..ఘటనపై సమగ్ర విచారణ చేసి.. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు. తిరుపతి తొక్కిసలాట ఘటన మరవకముందే సింహాచలంలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని ఆమె అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి. అన్యాయంగా ఏడుగురు చనిపోయారు. ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టకపోవడం వల్లనే ప్రమాదం జరిగిందని వరుదు కల్యాణి అన్నారు.👉వైఎస్ జగన్ దిగ్భ్రాంతివిశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూలి భక్తులు మృతి చెందడంపై మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చందనోత్సవం సందర్భంగా రూ. 300 టికెట్ క్యూలైన్ పై గోడ కుప్పకూలి భక్తులు మృత్యువాత పడటంపై తీవ్రవిచారం వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మరణించిన భక్తుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.👉సింహాచలం ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విచారంగోడ కూలి భక్తులు మరణించిన ఘటన తీవ్ర ఆవేదనను కలిగించిందివారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి ఆంధ్ర ప్రదేశ్ లోని సింహాచలం ఆలయం వద్ద గోడ కూలి భక్తులు మరణించిన ఘటనతీవ్ర ఆవేదనను కలిగించింది. వారి కుటుంబ సభ్యులకునా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ…మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని…భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.— Revanth Reddy (@revanth_anumula) April 30, 2025