విశాఖపట్నం, సాక్షి: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వ విధానం ఏంటో సీఎం చంద్రబాబు నాయుడు చెప్పాలని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. శనివారం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.
‘‘కేంద్ర మంత్రులు చెప్తున్నది వేరు.. క్షేత్ర స్థాయిలో జరుగుతున్నది వేరు. స్టీల్ ప్లాంట్‌లో జరుగుతున్న తాజా పరిణామాలపై చంద్రబాబు వైఖరి ఏమిటి?. కేంద్ర ప్రభుత్వ విధానాలను బాబు సమర్థిస్తున్నారా?. ఈ ప్రాంత మనోభావాలను గౌరవించాలి. స్టీల్ ప్లాంట్ కోసం రాజకీయం చేయోద్దు. ఉమ్మడి ఆంధ్రుల హక్కు ఇది. చంద్రబాబు ఖచ్చితంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్‌పై ద్వంద్వ వైఖరితో వెళ్తే ప్రజలు ఉపేక్షించరు. ఉన్న స్టీల్ ప్లాంట్‌ను కాపాడాలి. ఇంకో స్టీల్ ప్లాంట్ వస్తే సంతోషమే. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కొనసాగాలి. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణపై ఒక్క నిర్ణయం కూడా జరగలేదు.
..పాల డైరీల చరిత్రలో ఎన్నడూ పాల సేకరణ ధర తగ్గించలేదు. చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు పాల సేకరణ ధర తగ్గించింది. చంద్రబాబు వెంటనే పాడి రైతులకు న్యాయం చెయ్యాలి. అమూల్ వచ్చాక రాష్ట్రంలో పాల సేకరణ ధర పెరిగింది. విశాఖ డెయిరీలో పాల సేకరణ ధర ఎందుకు తగ్గించారో సమాధానం చెప్పాలి. పాడి రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి.
మరోవైపు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. చట్టం ఒక పక్షం వహిస్తుంది. చట్టం నాలుగు పాదాలపై ఉండాలి. ఏకపక్షం వహించడం మంచిది కాదు. ఇసుక ఉచితం అని చెప్పి ప్రజలను మోసం చేశారు. గతంలో ఇసుక పాలసీ చాలా సులభంగా ఉండేది.నాడు విశాఖలో ఇసుక రూ రూ. 13వేలకు వచ్చేది.
Comments
Please login to add a commentAdd a comment