Visakapatnam
-
పరవాడ ఫార్మాసిటీలో మరో ప్రమాదం
సాక్షి, అనకాపల్లి జిల్లా: పరవాడ ఫార్మాసిటీలో ఇటీవలి కాలంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆదివారం మరో ప్రమాదం చోటు చేసుకుంది. విష వాయువు లీక్ కావడంతో పలువురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. తోరెంట్ ఫార్మాసిటికల్ లిమిటెడ్ పరిశ్రమలో ఈ ఘటన చోటుచేసుకుంది. చికిత్స నిమిత్తం కార్మికులను యాజమాన్యం ఆసుపత్రికి తరలించింది.గత నెల జనవరి 25న విష్ణు కెమికల్స్ ఫ్యాక్టరీలో శనివారం జరిగిన ప్రమాదంలో కాంట్రాక్టు కార్మికుడొకరు ప్రాణాలు కోల్పోయాడు. ఫ్యాక్టరీ కన్వేయర్ బెల్ట్‌లో పడి కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. మృతుడిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్మికుడిగా గుర్తించారు.జనవరి 21వ తేదీన ఇక్కడ ఓ ప్రమాదం జరిగింది. మెట్రోకెన్ పరిశ్రమ స్టోరేజ్ ట్యాంక్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.కాగా, గత ఏడాది డిసెంబర్లో ఫార్మాసిటిలో విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విష రసాయనాలు మీద పడడంతో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రొడక్షన్ బ్లాక్–1లో ఏఎన్ఎఫ్–డి రియాక్టర్ మ్యాన్‌హోల్ ఓపెన్ చేసినప్పుడు మంటలు ఎగసిపడ్డాయి. ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న ఏఎన్ఆర్గా పనిచేస్తున్న రజ్జూ, మరో ఉద్యోగి సీహెచ్ వెంకట సత్య సుబ్రహ్మణ్య స్వామి తీవ్రంగా గాయపడ్డారు. -
ఏపీకి కూటమి ప్రభుత్వం తీరని ద్రోహం
సాక్షి,విశాఖ : ఏపీకి కూటమి ప్రభుత్వం తీరని ద్రోహం చేసింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధి ఖరారు చేసింది. వాల్తేరు డివిజన్ పేరును విశాఖ డివిజన్‌గా మార్చింది. 410 కిమీ ట్రాక్ పరిధి కేటాయించింది. అయితే కొత్త వలస - కిరండూల్ లైన్ లేకుండా దక్షిణ కోస్తా జోన్ పరిధిని మాత్రమే రైల్వే శాఖ నిర్ణయింది. ఒక్క కేకే లైన్ లేని జోన్ వృధా అని మొదటి నుంచి ప్రజా సంఘాలు పోరాటం చేస్తున్నాయి. అయినా జోన్ల విషయంలో రైల్వే శాఖ వెనక్కి తగ్గలేదు. తాజా విభజనతో రాయగడ డివిజన్‌కు కేకే లైన్ ఆదాయం వెళ్లనుంది. అయినా కేంద్రం ఇంతటి ద్రోహం చేస్తున్నా కూటమి ఎంపీలో నోరు మెదపక పోవడంపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ఉక్కు కార్మికులకు కేంద్ర మంత్రి కుమారస్వామి షాక్
సాక్షి,విశాఖ : ఉక్కు కార్మికులకు కేంద్ర మంత్రి కుమారస్వామి షాకిచ్చారు. మరో మూడు నెలల పాటు జీతాల విషయంలో కార్మికులు ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు. గురువారం ఉక్కు హౌస్‌లో కార్మిక సంఘాలతో కుమార స్వామి సమావేశమయ్యారు. ఈ సమావేశం సుమారు గంటపాటు సాగింది. అయితే, ఈ సమావేశంలో కుమారస్వామి మాట్లాడుతూ.. మరో మూడు నెలలు జీతాలకు ఇబ్బంది ఉంటుంది. కార్మికులు సహకరించాలి.. ప్లాంట్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. దీంతో ఆరు నెలలుగా జీతాలు అందక ఆందోళన బాట పట్టిన కార్మికులు కుమార స్వామి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.నిరసన సెగస్టీల్ ప్లాంట్ వద్ద కేంద్ర మంత్రి కుమారస్వామికి నిరసన సెగ తగిలింది. మరో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మతో కలిసి ఆయన ప్లాంట్ వద్దకు చేరుకున్నారు. అయితే దీక్షా శిబిరం ముందు నుంచే ఆయన వెళ్లగా.. కార్మికులు ఒక్కసారిగా నినాదాలకు దిగారు. ‘‘సెయిల్‌లో ఉక్కు పరిశ్రమ విలీనం.. సొంతంగా గనులు కేటాయించాలి’’ అంటూ కుమారస్వామిని ఉద్దేశించి అరిచారు. అయితే ఆ ఆందోళనను పట్టించుకోకుండా కుమారస్వామి ముందుకు వెళ్లారు.ఆరు నెలలుగా జీతాలు అందని కార్మికులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్ర మంత్రుల పర్యటన సందర్భంగా నల్ల బ్యాడ్జీలతో కార్మికులు నిరసన తెలిపారు. -
తిరుపతి తొక్కిసలాట ఘటన : ‘దైవ సన్నిధిలో అసువులు బాసడం అదృష్టం’
సాక్షి,విశాఖ : తిరుపతి తొక్కిసలాటలో చనిపోయిన వారిపై జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దైవ సన్నిధిలో అసువులు బాసడం ఒక రకంగా అదృష్టమని వ్యాఖ్యానించారు. చనిపోయిన వారిని ఉద్దేశించి మాట్లాడిన జ్యోతిల నెహ్రూ.. టీటీడీ చేతగానితనాన్ని సమర్ధించుకునే ప్రయత్నం చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
విశాఖ పర్యటనలో ప్రధాని మోదీ.. శంకుస్థాపన చేయనున్న ప్రాజెక్ట్‌లు ఇవే
సాక్షి,విశాఖ : ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) బుధవారం వైజాగ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) హయాంలో వచ్చిన పలు కీలక ప్రాజెక్ట్‌లపై ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.ప్రధాని మోదీ పర్యటనపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారులతో సమీక్ష జరిపారు. సమీక్షలో ‘సాయంత్రం 4.15 గంటలకు ప్రధాని ప్రత్యేక విమానంలో విశాఖ (Visakhapatnam) కు చేరుకుంటారు. 5.30 గంటల వరకు రోడ్ షోలో పాల్గొంటారు. 5.30 గంటల నుంచి 6.45 గంటల వరకు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం సభా వేదిక వద్ద నుంచి వర్చువల్‌గా పలు శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేసి ప్రసంగిస్తారు. అనంతరం విశాఖ విమానాశ్రయానికి చేరుకుని భువనేశ్వర్ వెళతారు.’ అని సీఎస్ వివరించారు.👉ముందస్తు షెడ్యూల్ ప్రకారం.. సీఎంగా వైఎస్ జగన్ తన హయాంలో రాష్ట్రానికి తెచ్చిన ప్రాజెక్ట్‌లకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్‌తో బల్క్ డ్రగ్ పార్క్,గ్రీన్ హైడ్రోజన్‌తో పాటు పలు పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయి. మోదీ ఇవాళ శంకుస్థాపన చేసే ప్రాజెక్ట్‌లలో ఇవే ప్రధానంగా ఉన్నాయి. 👉వైఎస్ జగన్ హయాంలో లక్ష 85 వేల కోట్ల విలువైన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఒప్పందం కార్యరూపం దాల్చింది. ఇందుకోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనకాపల్లి జిల్లా పుడిమడకలో 1200 ఎకరాల్లో ప్రాజెక్ట్ ఏర్పాటుకు కావలసిన అన్ని అనుమతులు మంజూరు చేసింది. ప్రధాని మోదీ నేడు శంకుస్థాపన చేయనున్న ఈ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ 57 వేల మందికి ఉపాధి కలగనుంది. 👉ఇతర రాష్ట్రాలతో పోటీ పడి బల్క్ డ్రగ్ పార్క్‌ను వైఎస్ జగన్ రాష్ట్రానికి తెచ్చారు. వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్‌కు ప్రధాని మోదీ చేతుల మీదగా శంకుస్థాపన జరగనుంది. రెండు వేల ఎకరాల్లో రూ.1876 కోట్ల రూపాయల ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. 17 రాష్ట్రాలు పోటీ పడగా దక్షిణ భారతదేశం నుంచి ప్రాజెక్టు సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నిలిచింది. గతంలో బల్క్ డ్రగ్ పార్క్ వద్దంటూ ఇదే టీడీపీ వ్యతిరేకించింది. 👉ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి 10 నుంచి 15 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. 25 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగనుంది. దీంతో పాటు గత ఏడాది జనవరిలో 52 ఎకరాల భూమిని రైల్వే జోన్ భవనాల నిర్మాణం కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం కేటాయించింది. రైల్వే జోన్ భవనాలకు ప్రధాని మోదీ నేడు శంకుస్థాపన చేయనున్నారు. -
ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలెర్ట్
సాక్షి, విశాఖ : బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఏపీ, ఉత్తర తమిళనాడు తీరాల వైపు పయనిస్తుందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం కారణంగా మరో రెండు రోజుల పాటు కోస్తా జిల్లాలో వర్షాలు కురవనున్నాయి. అల్లూరి,అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది. కోనసీమ,పశ్చిమ గోదావరి, నెల్లూరు,తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ విభాగం తెలిపింది. పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. -
విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు
సాక్షి,విశాఖ : విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టయ్యింది. కిరండోల్-విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో బాలికల అక్రమణ రవాణా జరుగుతుందనే సమాచారంతో రైల్వే పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 11మంది మైనర్లను రక్షించారు. బాలికల్ని తమిళనాడుకు తరలిస్తున్న ముఠాను నిందితుడు రవి బిసోయ్‌ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఈ దర్యాప్తులో ఒరిస్సాలోని నవరంగ్ పూర్ ప్రాంతానికి చెందిన చిన్నారులుగా గుర్తించారు. పూర్తి స్థాయి దర్యాప్తు కోసం విశాఖ రైల్వే పోలీసులు కేసును ఒరిస్సా పోలీసులకు అప్పగించారు. -
పరవాడ నెహ్రూ ఫార్మాసిటీ.. ఠాగూర్ ల్యాబరేటరీలో విష వాయువులు లీక్
సాక్షి,అనకాపల్లి : జిల్లా పరవాడ జవహర్ లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో విషవాయువులు లీకయ్యాయి. ఫార్మాసిటీలోని ఠాగూర్ ల్యాబరేటరీలో విష వాయువులు లీకవ్వడంతో ఎనిమిది మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన తోటి కార్మికులు బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే బాధితుల్లో ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సి ఉంది. -
లా విద్యార్థినిపై దారుణం.. పోలీస్ కస్టడీకి నిందితులు?
సాక్షి, విశాఖపట్నం: లా విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దారుణానికి ఒడిగిట్టిన నలుగురు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.బుధవారం దారుణంపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సీజ్ చేసిన వారి ఫోన్లను ఫోరెన్సిక్ కి పంపించారు. బాధితురాలి నగ్నంగా ఉన్న వీడియోలని ఎవరికి పంపించారనే అంశంపై దర్యాప్తు చేస్తున్నారు. దారుణ ఘటనలో ఏ2గా ఉన్న జగదీష్ తన ఫోన్లో ఉన్న బాధితురాలి నగ్న వీడియోల్ని రికార్డ్ చేసి ఏ1గా ఉన్న వంశీకి షేర్ చేశాడు. వంశీ ఏ3 ఆనంద్, ఏ4 రాజేష్‌కి పంపించాడు. అయితే, బాధితురాలి వీడియోలను ఈ నలుగురు ఇంకెవరికైనా పంపారా? అన్న కోణంలో ఫోరెన్సిక్ డిపార్ట్ మెంట్ పరిశీలించిన అనంతరం రిపోర్ట్ ఇవ్వనుంది. -
సీబీఐకి చిక్కిన అవినీతి అనకొండ
సాక్షి,విశాఖ: సీబీఐ వలకి అవినీతి అధికారి అడ్డంగా దొరికి పోయారు. ఓ కాంట్రాక్టర్ నుంచి భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.వాల్తేరు డివిజన్ డీఅర్ఎంగా సౌరభ్ కుమార్ పని చేస్తున్నారు. అయితే మెకానికల్ బ్రాంచ్ పనులుకి టెండర్ వ్యవహారంలో ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.25 లక్షల లంచం డిమాండ్ చేశారు. దీంతో సదరు కాంట్రాక్టర్ సౌరబ్‌కు డబ్బులు ముట్ట జెప్పేందుకు సిద్ధమయ్యారు. కానీ ప్లాన్ ప్రకారం.. సదరు కాంట్రాక్టర్ ముడుపుల వ్యవహారంపై సీబీఐ అధికారులు సమాచారం ఇచ్చారు.పక్కా సమాచారంతో కాంట్రాక్టర్ నుంచి రూ.25 లక్షలు లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు డీఆర్ఎం సౌరబ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న సీబీఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. -
అద్భుతం.. అంత్యక్రియలకు సిద్ధమవుతుండగా శిశువులో చలనం
విశాఖ: కేజీహెచ్‌లో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. ప్రాణం లేకుండా పుట్టిన శిశువుకు అంత్యక్రియలు జరిపించేందుకు తరలిస్తుండగా ఒక్కసారిగా చలనం వచ్చింది. దీంతో అప్పటివరకు విషాదం కమ్ముకున్న ఆ ఇంటిలో ఒక్కసారిగా ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి.కేజీహెచ్‌లో శుక్రవారం రాత్రి 9 గంటలకి దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అయితే దురదృష్టవశాత్తూ ప్రాణం లేకుండా శిశువు జన్మించింది. వైద్యులు రాత్రంతా శ్రమించిన..శిశువులో ఎలాంటి చలనం కనిపించలేదు. శిశువు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆసుపత్రి సిబ్బంది సైతం అదే అంశాన్ని ఆస్పత్రి రికార్డ్స్‌లో ఎంట్రీ చేశారు. అనంతరం శిశువును తండ్రికి అప్పగించారు.శిశువు మృతి చెందినట్లు కేజీహెచ్ వైద్యులు నిర్ధారించడంతో అంత్యక్రియలు జరిపించేందుకు తండ్రి బరువెక్కిన హృదయంతో అంబులెన్స్‌లో ఇంటికి బయలు దేరాడు. అప్పుడే ఆశ్చర్య ఘటన చోటు చేసుకుంది. అంబులెన్స్ ఎక్కిన ఆ తండ్రి ఒడిలో ఉన్నశిశువులో ఒక్కసారిగా కదలికలు మొదలయ్యాయి. అప్రమత్తమైన తండ్రి కేజీహెచ్ వైద్యులకు సమాచారం అందించారు. చికిత్స చేసిన వైద్యులు శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. అప్పటి వరకు విగతజీవిగా ఉన్న పసికందులో చలనం రావడంతో కుటుంబ సభ్యులు పసికందును చేతుల్లోకి తీసుకొని ఆనందంలో మునిగిపోయారు. అప్పటివరకు విషాదం కమ్ముకున్న ఆ ఇంటిలో ఒక్కసారిగా ఆనందోత్సవాలు వెల్లివిరిశాయి. -
ఇంటూరి రవికిరణ్‌పై పోలీసుల కుట్ర.. ఇవాళ మరోసారి అదుపులోకి
విశాఖ : రాష్ట్రంలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్లపై కూటమి ప్రభుత్వ వేధింపులు నిత్యకృత్యమయ్యాయి. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవి కిరణ్‌ను పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. నిన్న 41ఏ నోటీసుల పేరుతో ఇంటూరి రవికిరణ్, ఆయన భార్యను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. వివాదం కావడంతో వదిలేశారు.అయితే ఈ రోజు మరోసారి ఇంటూరి రవి కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు వెల్లడించకుండా తరలించారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా తీసుకెళ్లడం కలకలం రేపుతుంది.మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారుశనివారం ఇంటూరి రవికిరణ్ ఇంటికి వచ్చిన పోలీసులు తీవ్ర ఇబ్బందులు గురి చేశారని రవికిరణ్ భార్య మీడియా ఎదుట వాపోయారు. తనతో దురుసుగా ప్రవర్తించడంతో పాటు, తన భర్తను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ఆమె ప్రశ్నించగా.. ఎలాంటి ఇష్యూ చేయొద్దంటూ బెదిరించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. -
వైఎస్ జగన్‌పై తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు
విశాఖపట్నం, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు పోస్టులు పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. శనివారం వైఎస్సార్సీపీ నేతలు సీపీకి వినతిపత్రం అందజేశారు. వైఎస్ జగన్‌పై తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై సీపీకి ఫిర్యాదు చేశారు. అనంతరం గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. ‘‘పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోవాలి. వైఎస్ జగన్‌పై తప్పుడు పోస్టులు పెట్టిన వారిపై సీపీకి ఫిర్యాదు చేశాం. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై పెట్టే అక్రమ కేసులను ఎదుర్కొంటాం. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా లేదని డిప్యూటీ సీఎం ఒప్పుకున్నారు. ఎక్కడ పోయినా ప్రజలు ప్రశ్నిస్తున్నారని డిప్యూటీ సీఎం వపన్ చెప్పారు. 6 నెలల్లోనే 50 మందికిపైగా మహిళలపరై అత్యాచారాలు జరిగాయి. కూటమి ప్రభుత్వం నేరాలను అరికట్టడంలో పూర్తిగా విఫలమైంది’’ అని తెలిపారు. -
గీత దాటితే చర్యలు తప్పవ్.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులకు యాజమాన్యం వార్నింగ్
సాక్షి, విశాఖపట్నం : అధికారంలోకి రాక ముందు విశాఖ ఉక్కు ఉద్యమం సడలనివ్వనంటూ ప్రగల్భాలు పలికారు.. కూటమి పేరుతో గద్దెనెక్కిన తర్వాత.. యాజమాన్యం తమని ఇబ్బంది పెడుతున్నా పట్టించుకోవడం లేదంటూ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకు ప్లాంట్‌లో జరుగుతున్న పరిణామాలేనని అంటున్నారు.ఇటీవల యాజమాన్యం హెచ్ఆర్ఏ తొలగింపుపై గత నెల ఈడీ వర్క్స్ ముందు కార్మికుల నిరసన చేపట్టారు. నాడు నిరసన తెలిపిన కార్మికులకు తాజాగా నోటీసులు జారీ చేసింది. స్టీల్ ప్లాంట్‌లో నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని హెచ్చరించింది. మళ్ళీ పునరావృతమైతే చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చింది. అధికారులను కార్మిక సంఘాల నేతలు కలవకూడదంటూ సర్క్యులర్‌లో తెలిపింది. లోపల జరిగిన ప్రమాద వివరాలను బయట పెట్టకూడదు హూకం జారీ చేసింది.దీంతో గత ఆరు నెలల నుండి జీతాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న కార్మికులు తరుపున సీఎండీతో మాట్లాడేందుకు అపాయింట్మెంట్ కావాలంటూ కార్మిక సంఘాల నేతలు విజ్ఞప్తి చేశారు. ఆ విజ్ఞప్తిపై సీఎండీ ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో పాటు దసరాకు బోనస్ ఇవ్వలేదని, దీపావళికి జీతం లేదంటూ కార్మికులు వాపోతున్నారు. ఇంత జరగుతున్నా కూటమి నేతుల నోరు మెపదకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
చంద్రబాబు కేబినెట్ మొత్తం విఫలం: వరుదు కళ్యాణి ఫైర్
విశాఖపట్నం, సాక్షి: కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు కేబినెట్ మొత్తం విఫలమైందని వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి అన్నారు. ఇందుకు సీఎం చంద్రబాబు నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘శాంతి భద్రతల వైఫల్యానికి హోం మంత్రి కారణమని వైఎస్సార్సీపీ మొదట్నుంచీ చెప్తోంది. ముచ్చుమర్రి బాలిక మృతదేహం ఇంతవరకు దొరకలేదు. ఏపీలో రోజుకో చోట మహిళలపై అత్యాచారాలు జరగుతున్నాయి. హిందూపురంలో అత్తాకోడళ్లపై అత్యాచారం జరిగింది. కనీసం హోంమంత్రి బాధితురాళ్లను పరామర్శించటం లేదు. అత్యాచార ఘటనలపై హోం మంత్రి చర్యలు తీసుకోవడం లేదు. ఏపీలో మహిళలు ఎవరూ ప్రశాంతంగా నిద్రపోవటం లేదు. కానీ, హోంమంత్రి అనిత మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నారు.తప్పులను కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. శాంతి భద్రతలను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ నిర్వీర్యం చేశారు. పిఠాపురంలో ఓ మహిళపై అత్యాచారం జరిగితే.. పవన్ భరోసా ఎందకివ్వలేదు? పంతం నానాజీ అనుచరుల వేధింపులతో ఫీల్డ్ అసిస్టెంట్ సూసైడ్ చేసుకుంది. మరి ఆ బాధితులకు పవన్ ఎందుకు భరోసా ఇవ్వ లేదు?’’అని నిలదీశారు. -
చంద్రబాబు.. కేంద్ర ప్రభుత్వ విధానాలను సమర్థిస్తున్నారా?: బొత్స
విశాఖపట్నం, సాక్షి: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వ విధానం ఏంటో సీఎం చంద్రబాబు నాయుడు చెప్పాలని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. శనివారం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ‘‘కేంద్ర మంత్రులు చెప్తున్నది వేరు.. క్షేత్ర స్థాయిలో జరుగుతున్నది వేరు. స్టీల్ ప్లాంట్‌లో జరుగుతున్న తాజా పరిణామాలపై చంద్రబాబు వైఖరి ఏమిటి?. కేంద్ర ప్రభుత్వ విధానాలను బాబు సమర్థిస్తున్నారా?. ఈ ప్రాంత మనోభావాలను గౌరవించాలి. స్టీల్ ప్లాంట్ కోసం రాజకీయం చేయోద్దు. ఉమ్మడి ఆంధ్రుల హక్కు ఇది. చంద్రబాబు ఖచ్చితంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్‌పై ద్వంద్వ వైఖరితో వెళ్తే ప్రజలు ఉపేక్షించరు. ఉన్న స్టీల్ ప్లాంట్‌ను కాపాడాలి. ఇంకో స్టీల్ ప్లాంట్ వస్తే సంతోషమే. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కొనసాగాలి. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణపై ఒక్క నిర్ణయం కూడా జరగలేదు...పాల డైరీల చరిత్రలో ఎన్నడూ పాల సేకరణ ధర తగ్గించలేదు. చంద్రబాబు ప్రభుత్వం ఎందుకు పాల సేకరణ ధర తగ్గించింది. చంద్రబాబు వెంటనే పాడి రైతులకు న్యాయం చెయ్యాలి. అమూల్ వచ్చాక రాష్ట్రంలో పాల సేకరణ ధర పెరిగింది. విశాఖ డెయిరీలో పాల సేకరణ ధర ఎందుకు తగ్గించారో సమాధానం చెప్పాలి. పాడి రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి.మరోవైపు.. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. చట్టం ఒక పక్షం వహిస్తుంది. చట్టం నాలుగు పాదాలపై ఉండాలి. ఏకపక్షం వహించడం మంచిది కాదు. ఇసుక ఉచితం అని చెప్పి ప్రజలను మోసం చేశారు. గతంలో ఇసుక పాలసీ చాలా సులభంగా ఉండేది.నాడు విశాఖలో ఇసుక రూ రూ. 13వేలకు వచ్చేది. -
ఆంధ్రా యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం
సాక్షి,విశాఖపట్నం : ఆంధ్రా యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేగింది. ఆంధ్రా యూనివర్సిటీ అర్కిటెక్చర్ డిపార్ట్మెంట్లో జూనియర్ మహిళా విద్యార్థినులను సీనియర్ మహిళా విద్యార్థినులు ర్యాగింగ్ చేశారు. అసభ్యకరమైన డ్యాన్సులు చేయాలంటూ ఒత్తిడి చేశారు. అలా చెయ్యలేం. డ్యాన్స్ రాదు అంటే అబ్బాయిలు దగ్గరకి వెళ్లి నేర్చుకొని రమ్మని సీనియర్లు ఇబ్బంది పెట్టారు. అయితే ర్యాగింగ్ అంశం బయటకి రావడంతో వైస్‌ఛాన్సలర్ తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నారు. జూనియర్లను ర్యాగింగ్ చేసిన ఐదుగురు సీనియర్లను 15 రోజులు పాటు సస్పెండ్ చేశారు.ఇదీ చదవండి: స్టీల్‌ప్లాంట్ ఉద్యమం అణిచి వేతలో కూటమి ప్రభుత్వం -
విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యమం అణిచివేతలో కూటమి ప్రభుత్వం
సాక్షి,విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యమంపై ఉక్కుపాదం మోపింది. స్టీల్ ప్లాంట్ కార్మికులు మీడియాతో మాట్లాడొద్దంటూ షరతులు విధించారు. ఇందులో భాగంగా షరతులతో కూడిన సర్క్యులర్ మెమోను స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం జారీ చేసింది.తాజా,స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం నిర్ణయంపై కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై తాము చేస్తున్న ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నాయని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.యాజమాన్యం బెదిరింపులకు తాము భయపడబోమని స్పష్టం చేస్తున్నారు. కాగా,ఆదివారం స్టీల్‌ప్లాంట్ కార్మికులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. అనంతరం యాజమాన్యం సర్క్యులర్ విడుదల చేయడం విశేషం. -
ఉక్కు కార్మికుల భారీ మానవహారం
సాక్షి,విశాఖపట్నం: సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఉక్కు కార్మికులు తమ ఆందోళనలను మరింత ఉదృతం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం కార్మికులు భారీ ఎత్తున మానవ హారం నిర్వహించనున్నారు.ఢిల్లీ పర్యటనకు వెళుతున్న చంద్రబాబును విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఉక్కు ఉద్యమానికి ప్రజలు సహకరించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ విజ్ఞప్తి చేసింది. శనివారరం అర్ధరాత్రి వరకు ఈడీ వర్క్స్ బిల్డింగ్ వద్ద కొనసాగిన ఉక్కు కార్మికుల నిరసన.. కార్మిక వ్యతిరేక నిర్ణయాలను వెంటనే వెనక్కు తీసుకోవాలని నినాదాలు చేశారు. నేడు నేషనల్ హైవేపై అగనంపూడి నుంచి గాజువాక వరకు భారీ మానవ హారం చేపట్టనున్నారు. -
చంద్రబాబు పొలిటికల్ జాదు : గుడివాడ
సాక్షి,విశాఖపట్నం : సీఎం చంద్రబాబు పొలిటికల్ జాదు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించడంలో చంద్రబాబు ఆరితేరారు’అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆదివారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి ప్రతిష్టను సీఎం చంద్రబాబు దెబ్బ తీశారు. తిరుపతి లడ్డుపై ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలి. రాష్ట్రానికి కుల రాజకీయాన్ని పరిచయం చేసింది చంద్రబాబు. నేడు కొత్తగా మత రాజకీయానికి పునాదులు చేశారు. మతాలు మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన చంద్రబాబు తిరుపతి లడ్డు అంశాన్ని తెరపైకి తెచ్చారు.అధికారంలోకి వచ్చిన తరువాత 35 మంది కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నాడు. పెద్ద ఎత్తున ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ద్వసం చేశారు. కలుషిత ఆహారం తిని చిన్న పిల్లలు చనిపోయారు. విజయవాడ వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణ దిశగా అడుగులు వేస్తుంది. స్టీల్ ప్లాంట్‌లో 4000 మంది కాంట్రాక్ ఉద్యోగులను తీసేసారు. స్టీల్ ప్లాంట్ కోసం కూటమి నేతల రాజీనామాలు అవసరం లేదు. ఎన్డీయే ప్రభుత్వం టీడీపీ బలంతోనే నడుస్తుంది.స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అపక పోతే మద్దతు ఉపసంహరిస్తామని చెప్పండి. వీటన్నిటినీ నుంచి ప్రజల దృష్టి మార్చడం కోసం తిరుపతి లడ్డు అంశాన్ని తెరపైకి తెచ్చారు. కల్తీ నెయ్యి వాడ లేదని ఈవో చెప్పారు. జూలై నాలుగో తేదీన వచ్చిన ట్యాంకర్లు వెనక్కి పంపమని ఈవో చెప్పారు. చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టే సీబీఐ విచారణ జరిపించ లేదు. చంద్రబాబు సీబీఐ విచారణ జరిపించాలని ప్రధానికి లేఖ రాయాలి. తిరుపతి మీద మీకు అంత భక్తి ఉంటే తిరుపతి జిల్లాకు ఎక్కువ మద్యం షాపులు కేటాయించారు. తిరుపతి పవిత్రత గురించి మాట్లాడే చంద్రబాబు 264 షాపులు కేటాయించారు. కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయని టీడీపీ గెజిట్ ఈనాడు పేపర్లో రాశారు. గతంలో జేబు నిండా డబ్బులు పట్టుకెళ్తే సంచి నిండా కూరగాయలు వచ్చేవి. నేడు సంచి నిండా డబ్బులు పట్టుకెళ్తె జేబు నిండా కూరగాయలు వస్తున్నాయి.చంద్రబాబు ఒక పొలిటికల్ జాదు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించడంలో చంద్రబాబు ఆరితేరాడు. అపవిత్రమైన టీడీపీ ప్రభుత్వం కోసం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు వేసిన సిట్ మీద మాకు నమ్మకం లేదు అని గుడివాడ అమర్నాథ్ అన్నారు. -
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల ధర్నా
సాక్షి, విశాఖ : విశాఖలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు మరోసారి ఉద్యమం ఉదృతమవుతుంది. ఇవాళ గాజువాకలో మహాధర్నాకు పిలుపునిచ్చారు కార్మికులు. ఎన్నికల ముందుకు కూటమి నేతలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ప్లాంట్‌ను కాపాడుకునేలా ప్రధాని మోదీపై ఒత్తిడి తేవాలని అంటున్నారు. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజల పక్షాన నిలవాలని, తమ అధినాయకత్వంపై ఒత్తిడి తేవాలని సూచిస్తున్నారు. రాష్ట్ర కేబినెట్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని, అఖలి పక్షాన్ని ఢిల్లీకి తీసుకుని వెళ్లాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గని కేంద్రంవిశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేదిలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రైవేటీకరణకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొంది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎంపీలు సజ్దా అహ్మద్ సహా మరో ఇద్దరు ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. అన్నట్లుగానే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం వడివడిగా అడుగులు వేయడంతో కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఇదీ చదవండి : వందే భారత్ ట్రైన్లను ప్రారంభించనున్న మోదీ -
షిప్పింగ్ కంపెనీలో విష వాయువు లీక్
విశాఖపట్నం, సాక్షి: శ్రావణ్ షిప్పింగ్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీళ్లలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎసిటానిలైడ్ బ్యాగ్స్‌ను ఒక కంటైనర్ నుంచి మరో కంటైనర్‌కు మార్చుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎసిటానిలైడ్ అనే విష వాయువును పీల్చటంతో కార్మికులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.అస్వస్థతకు గురైన వారిని హుటాహుటిన గాజువాక సింహగిరి ఆసుపత్రికి కంపెనీ తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం రాత్రి 2:00 గంటల సమయంలో కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గునుపూరు రాము, లక్ష్మి, లత, కుమారి, దేముడు బాబు అస్వస్థతకు గురవ్వగా.. దేముడు బాబు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
విశాఖ రైల్వే జోన్‌కు తీవ్ర అన్యాయం
విశాఖపట్నం, సాక్షి: కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ మరోసారి ఏపీని మోసం చేసింది. విశాఖపట్నం రైల్వే జోన్ విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతూనే ఉంది. తాజాగా విశాఖకు జోన్ ఇవ్వకుండానే ఒడిషాకు రాయగడ డివిజన్ ఇచ్చారు. ఇదే సమయంలో రాయగడ డీఆర్ఎం కార్యాలయానికి టెండర్ కూడా ఇచ్చారు. రాయగడ డివిజన్ ఏర్పాటుతో విశాఖ రైల్వే జోన్ తీవ్రంగా నష్టపోనుంది. ఆదాయం వచ్చే ప్రాంతమంతా ఒడిషాలో కలిసిపోతుందని విశాఖ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. వాల్తేరు డివిజన్ రద్దువైపు అడుగులు పడుతున్నాయి. దశాబ్దాలుగా విశాఖపట్నం రైల్వే జోన్ కల నెరవేరటం లేదు. 2019 ఎన్నికలకు ముందు రైల్వే జోన్ ఇస్తామని కేంద్రం ప్రకటన చేసింది. ఈ మేరకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రైల్వే జోన్ కోసం సరిపడా భూమి ఇచ్చినా కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలేదు. కాగా, వాల్తేర్ డివిజన్‌తో కలిపి విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని ఎప్పటినుంచో డిమాండ్ ఉంది. కానీ, రైల్వే జోన్‌పై కేంద్ర ప్రభుత్వం మాత్రం కేవలం మాటలకు మాత్రమే పరిమితం అవుతోంది. రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై కూటమి నేతలు ఎటువంటి ఒత్తిడి చేయకపోవటం గమనార్హం. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నోరు మెదపటం లేదు. -
మనం చేసిన మంచి బతికే ఉంది: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు : మన ప్రభుత్వ హయాంలో మనం చేసిన మంచి ఎక్కడికీ పోలేదని స్పష్టం చేశారు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. ప్రతీ ఇంటికీ మనం చేసిన మంచి బతికే ఉందని, మేనిఫెస్టో అమలులో విశ్వసనీయతకు అర్థం చెప్పామన్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం (ఆగస్ట్14) యలమంచిలి, భీమిలి నియోజకవర్గాల జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా క్యాడర్‌కు దిశా నిర్దేశం చేశారు వైఎస్ జగన్.చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్లు చిత్రీకరిస్తున్నారని, మన ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు చేసిన అప్పులు ఉన్నాయని, వాటికి వడ్డీలు కూడా ఉన్నాయనే విషయాన్ని వైఎస్ జగన్ మరోసారి గుర్తు చేశారు. ఆ సమయంలో కోవిడ్‌లాంటి విషమ పరిస్థితులు వచ్చాయన్నారు. ఖర్చులు అనూహ్యంగా పెరిగినప్పుడు ఎలాంటి సాకులు చెప్పలేదని, శ్వేతపత్రాలతో నిందలు మోపే ప్రయత్నం చూపలేదని, కోవిడ్‌ను సాకుగా చూపి ఎగ్గొట్టలేదన్నారు. యలమంచిలి నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. వైఎస్సార్సీపీ కేడర్ బలంగా కనిపించడంతో చంద్రబాబులో భయం మొదలైందిదీనివల్లే పోటీనుంచి టీడీపీ విరమించుకుందిగత ఎన్నికలు ఎలా జరిగాయని మీరంతా చూసే ఉంటారుప్రజలకు ఆశ చూపి చంద్రబాబు మోసం చేస్తున్నారుమన ప్రభుత్వ హయాంలో మనంచేసిన మంచి ఎక్కడికీ పోలేదుప్రతి ఇంటికీ మనం చేసిన మంచి బతికే ఉందిమేనిఫెస్టో అమల్లో విశ్వసనీయతకు అర్థం చెప్పాంచంద్రబాబు ఇప్పుడు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్టు చిత్రీకరిస్తున్నాడుమన ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు చేసిన అప్పులు ఉన్నాయివాటికి వడ్డీలు కూడా ఉన్నాయివీటికితోడు కోవిడ్‌లాంటి విషమ పరిస్థితులూ వచ్చాయిఖర్చులు అనూహ్యంగా పెరిగినప్పుడు ఎలాంటి సాకులు చెప్పలేదుశ్వేతపత్రాలతో నిందలు మోపే ప్రయత్నం చూపలేదుకోవిడ్ను సాకుగా చూపి ఎగ్గొట్టలేదుఎన్ని కష్టాలు ఉన్నా.. క్యాలెండర్ ప్రకటించి పథకాలు అమలు చేశాంఐదేళ్లపాటు క్యాలెండర్ తప్పకుండా పథకాలు అందించాంపథకాలను ప్రతి ఇంటికీ డోర్ డెలివరీ చేశాందేవుడి దయతో ఇవన్నీ చేయగలిగాంప్రతి కార్యకర్తకూడా ఇప్పటికీ ప్రతి ఇంటికీ సగర్వంగా వెళ్లగలడుచెప్పించి మేం చేయగలిగాం అని చెప్పుకోగలడుఈ రెండున్నర నెలల పాలనలో ఒక ప్రభుత్వం మీద ఇంతటి వ్యతిరేకత ఎప్పుడూ చూడలేదురెండున్నర నెలల కాలంలో తీవ్రమైన ప్రజావ్యతిరేకత కనిపిస్తోందిప్రతి ఇంట్లో కూడా.. జగనే ఉండి ఉంటే.., వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉండే.. అన్న చర్చ జరుగుతోందిఈపాటికే అమ్మ ఒడి అందేది, రైతు భరోసా అందేది, రైతులకు పంటల బీమా అందేది: ఫీజురియింబర్స్మెంట్నేరుగా ఖాతాల్లో పడేదివసతి దీవెన కూడా అందేదిపొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు సున్నావడ్డీ డబ్బులు పడేవి.. ఇప్పుడు ఇవేమీ అందలేదుపథకాలకోసం ఎవ్వరినీ అడగాల్సిన పనిలేకుండా సాఫీగా అమలు జరగేవిఇప్పుడు ఎవ్వరికీ ఏమీ రాకపోగా, చాలా దుర్మార్గాలు చేస్తున్నారుస్కూళ్లలో టోఫెల్ పీరియడ్‌ను ఎత్తివేశారు ఇంగ్లిషుమీడియం నడుస్తుందన్న ఆశ లేదుమధ్యాహ్న భోజనం ప్రశ్నార్ధకం అయ్యిందిడిసెంబర్లో ఇచ్చే ట్యాబులు లేనట్టేఇప్పుడు ఆర్డర్‌కూడా ఇవ్వలేదు ఆరోగ్య రంగం పూర్తిగా దెబ్బతిందిఆరోగ్య శ్రీ బకాయిలు రూ.1800 కోట్లపైనే దాటిందిప్రభుత్వాసుపత్రుల్లో జీరో వేకెన్సీ అమలు చేశాంఇప్పుడు డాక్టర్లు ఉన్నారా? లేదా? అన్న పరిస్థితి కనిపిస్తోందిఆరోగ్య ఆసరా ఊసే లేదుమందులు లేవు, పరిశుభ్రత అంతకన్నా లేదుఎవ్వరూ పట్టించుకునే పరిస్థితి లేదురైతులు మళ్లీ క్యూలలో ఉండాల్సిన పరిస్థితి విత్తనాలకోసం ఇ- క్రాప్ పక్కనపడేశారుఉచిత పంటల బీమాను వదిలేశారుబియ్యం డోర్ డెలివరీ లేదుతెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ, మళ్లీజన్మభూమి కమిటీల చుట్టూ తిరగాల్సి వస్తోంది రెడ్ బుక్ పాలన కొనసాగుతోందిగ్రామస్థాయిలో కక్షలను ప్రోత్సహిస్తున్నారుమీరు చేయండి.. మేం చూసుకుంటాం అంటున్నారుదిశ యాప్ ఏమైందో తెలియడంలేదుదిశ నొక్కగానే 10 నిమిషాల్లో వచ్చేవారుఅన్నీ కూడా రెండున్నర నెలల్లోనే జరిగాయిఎక్కడా అబద్ధాలు ఆడకుండా, మోసం చేయకుండా ప్రజలకు మంచి చేశాంఇన్ని మోసాలు చేసిన చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండిచంద్రబాబు మోసాలు చూసి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారుకష్టాలు లేకుండా సృష్టే ఉంటుందిచీకటి తర్వాత కచ్చితంగా వెలుగు వస్తుందిరాత్రి తర్వాత పగలు కచ్చితంగా వస్తుందినన్ను 16 నెలలు జైల్లో పెట్టి తీవ్రంగా కష్టపెట్టారు అయినా సరే.. మనం నిబ్బరంతో నిలబడగలిగాంమన వ్యక్తిత్వమే మనకు శ్రీరామ రక్షపార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు ఒక్కటిగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు వెనక్కితగ్గాడుచంద్రబాబు సహజ నైజం ఇది కాదుఫోన్లు చేసి… అది ఇస్తా, ఇది ఇస్తా అనేవాడు ఎన్నికల సమయంలోకూడా చంద్రబాబు ఇదే తరహాలో ప్రచారం చేసేవాడునీకు 15వేలు, నీకు 18 వేలు అని ప్రచారంచేశాడుఅందర్నీ మోసం చేసి ఇప్పుడు అందరికీ క్యాబేజీలు పెట్టాడుఅలాగే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరికీ కాల్స్ చేసి.. అది ఇస్తా, ఇది ఇస్తా అని ఆశ చూపెట్టే ఉంటాడుకాని ధర్మం, న్యాయం గెలిచిందిమీరు ఒక్కటిగా నిలబడ్డారు కాబట్టి చంద్రబాబు మెడలు వంచక తప్పలేదుసంఖ్యాబలం లేనప్పుడు చంద్రబాబు పోటీపెడాననటమే తప్పుకాని మీరంతా ఒక్కటిగా ఉండడం వల్లే విజయం సాధ్యమైంది. భీమిలి నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో వైఎస్ జగన్ ఏమన్నారంటే..ఈ ఎన్నికల్లో ధర్మం, న్యాయానికి పాతరవేయాలని చూశారుఅదే అజెండాతో యుద్ధంచేయాలని చూశారుకాని మనం అంతా ఐకమత్యంగా ఉన్నాంప్రలోభాలకు లోనుకాకుండా మీరంతా గట్టిగా నిలబడ్డారుచివరకు అధర్మ రాజకీయాలు చేయాలనుకునేవాళ్లు తలొగ్గారు:సహజంగా పోటీపెట్టాలనే ఆలోచనకూడా వాళ్లకి రాకూడదుమనకు అంత మెజార్టీ ఉందిపార్టీ సింబల్మీద జరిగిన ఎన్నికల్లో వీళ్లంతా గెలిచారుపోలీసులను పెట్టి బెదిరించాలని చూశారుఏకంగా సీఎం ఇలాంటి వాటిని ప్రోత్సహించడానికి ప్రయత్నించారుమొన్న జరిగిన సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు అన్నీ అబద్ధాలు చెప్పారు:నీకు రూ.15వేలు, నీకు రూ.18వేలు, రైతు కనిపిస్తే నీకు రూ.20వేలు అంటూ మోసపూరితమైన క్యాంపెయిన్ చేశారుచంద్రబాబు చెప్పిన అబద్ధాలకు కొంతమంది ఆశపడ్డారని అనిపిస్తుందిఇప్పుడు అంతా మోసపోయిన పరిస్థితుల్లో ఉన్నారుఐదేళ్ల పాలనలో మనం చేసిన మంచి ఎక్కడకీ పోలేదుఇవ్వాళ్టికీ మన కార్యకర్తలు, నాయకులు తలెత్తుకుని ప్రతి ఇంటికీ వెళ్లగలుగుతారు:చంద్రబాబు అప్పుల భారాన్ని, వడ్డీలభారాన్ని మనంకూడా మోసాంకరోనా లాంటి మహమ్మారి కారణంగా రాష్ట్రం ఆదాయాలు పెరిగిపోయాయిఖర్చులు కూడా పెరిగిపోయాయికాని శ్వేతపత్రాల పేరుతో సాకులు చెప్పలేదు చంద్రబాబు అప్పులుగురించి, ఆ అప్పులు వడ్డీల గురించి మనం ఏరోజూ చెప్పలేదుమేనిఫెస్టోలో మనం చేసిన ప్రతి మాటనూ అమలు చేశాంచంద్రబాబులా చెత్తబుట్టలో వేయలేదుదేశచరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా బడ్జెట్లో క్యాలెండర్ పెట్టి అమలు చేశాంపథకాలను నేరుగా డోర్‌డెలివరీ చేశాంఇప్పడు ఏ ఇంట్లో చర్చ జరిగినా.. జగన్ ఉండి ఉంటే.. అన్నదానిపై చర్చ జరుగుతోందిజగన్ పలావు పెట్టాడు, చంద్రబాబు బిర్యానీ పెడతానని ఆశచూపాడని అంటున్నారుచివరకు పలావు పోయింది, బిర్యానీ పోయిందనే చర్చ ఇప్పుడు ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోందిజగనే ఉండి.. ఉంటే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉండి.. ఉంటే.. అన్న చర్చ జరుగుతోందిటీడీపీ వచ్చాక పథకాలు రాకపోగా వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతున్నాయిప్రభుత్వాసుపత్రుల్లో ఓపీ దగ్గర కుర్చీలు కూడా తీసేస్తున్న పరిస్థితి వైఎస్సార్సీపీ పాలనలో పెన్షన్ నేరుగా ఇంటికే అందేదిఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితిలా అండ్ ఆర్డర్ ఎలా ఉన్నదీ ప్రజలంతా చూస్తున్నారుకక్ష తీర్చుకోండి… పోలీసులు మీకు అండగా ఉంటారని టీడీపీ నాయకులు బాహాటంగా చెప్తోందిరెడ్బుక్ పాలన కనిపిస్తోందిప్రతి అంశంలోనూ ఇదే పరిస్థితిలా అండ్ ఆర్డర్ నుంచి గవర్ననెన్స్, ఆరోగ్య రంగం, వ్యవసాయం, విద్యారంగం… ఇలా ప్రతి వ్యవస్థ కుప్పకూలిపోతోందిమరో మూడు నెలల్లో టీడీపీ కార్యకర్త ఏ గడపకూ వెళ్లలేని పరిస్థితి ఉంటుందిప్రతి కుటుంబం కూడా టీడీపీని నిలదీసే పరిస్థితి వస్తుందినువ్వు చెప్పింది ఏంటి.. ఇప్పుడు జరుగుతన్నది ఏంటని అడిగే పరిస్థితికష్టాలు అనేవి ఉంటాయి, కాని అవి శాశ్వతం కాదుకష్టాలు ఉన్నప్పుడు మనం ధైర్యంగా ఉండాలిప్రజలకు మనం తోడుగా ఉంటే చాలు.. వాళ్లే మనల్ని ఆదరిస్తారుటీడీపీ అబద్ధాలు, మోసాలతో విసుగెత్తిపోయే పరిస్థితి ఉంటుందివైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తొగ్గలేదు, ప్రలోభాలకు లొంగలేదు కాబట్టి.. చంద్రబాబే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. -
విశాఖ బీచ్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం
సాక్షి,విశాఖ : విశాఖ బీచ్ రోడ్డులో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న డైనో పార్క్ రెస్టోకేఫ్లో మంటలు చెలరేగాయి. మంటల దాటికి రెస్టారెంట్ కాలిబూడిదైంది. దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో స్థానికులు ప్రాణభయంతో పరుగులు తీశారు.అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజిన్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. జీవీఎంసీ నుంచి స్థలాన్ని లీజ్‌కు తీసుకొని డైనో పార్క్ రెస్టోకేఫ్ను నిర్వాహిస్తున్నారు. రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాల్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. -
విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలు.. పోటీ నుంచి టీడీపీ ఔట్
సాక్షి, విశాఖ: ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ సమయం ముగిసింది. కేవలం రెండు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. వైఎస్సార్సీపీ నుంచి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేయగా, ఇండిపెండెంట్‌గా షేక్ సఫి ఉల్లా నామినేషన్ వేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ నుంచి టీడీపీ తప్పుకుంది.ఇక విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధి బొత్స సత్యనారాయణ గెలుపు లాంఛనమైనట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణను ధీటుగా ఎదుర్కొనే సత్తా లేకపోవడంతో పోటీ నుంచి అధికార టీడీపీ తప్పుకుంది. సరైన బలం లేకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేయడం లేదని టెలీకాన్ఫరెన్స్‌లో పార్టీ నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు.మంగళవారం నామినేషన్ గడువు చివరి రోజు కావడంతో అభ్యర్ధి పోటీపై విశాఖ టీడీపీ నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానికేతురుడిని నిలబెట్టేందుకు పార్టీ నేతలతో చంద్రబాబు మంతనాలు జరిపారు. అయితే అందుకు పార్టీ నేతలు ఒప్పుకోలేదు.స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానికేతురుడిని ఎలా పెడతారని టీడీపీ నేతలు చంద్రబాబును ప్రశ్నించారు. కోట్లు రూపాయలు కుమ్మరించిన ఓడిపోవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పారిశ్రామికవేత్తలకు సీట్లు ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. ఇప్పటికే స్థానికేతరులతో టీడీపీ నిండిపోయిందన్న టీడీపీ నేతల అభిప్రాయంతో చంద్రబాబు అంగీకరించారు. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్ట్ 6 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. నేటితో నామినేషన్ల దాఖలుకు సమయం ముగిసింది. 14న స్క్రూటినీ, 16న ఉపసంహరణ, 30న పోలింగ్ జరగనుంది. సెప్టెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు.ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో ఈ ఎన్నిక జరుగుతుంది. అంటే విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్ సభ్యులు కలిసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. సెప్టెంబరు 3వ తేదీన ఓట్లను లెక్కిస్తారు.. సెప్టెంబరు 6వ తేదీతో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.విశాఖపట్నం జీవీఎంసీలో కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు ఓటు హక్కు వినియోగించుకుంటారు. మొత్తం 841 ఓట్లు ఉండగా.. అందులో వైఎస్సార్సీపీ బలం 615 ఉంటే.. టీడీపీ, జనసేన, బీజెపీకి కలిపి 215 ఓట్లు ఉన్నాయి.. అలాగే 11 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. -
టీడీపీ ప్రలోభాలకు లొంగిపోవొద్దు: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ 75వ జయంతిని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించామని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఓటమి తరువాత ఎవ్వరూ డీలా పడాల్సిన అవసరం లేదు.. గెలుపు ఓటములు సహజం... కారణం ఏదైనా కానీ ప్రజా తీర్పుగానే భావించాలి. పార్టీ నాయకులంతా ప్రజలకు అండగా ఉండాలి’’ అని వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు.ఆస్ట్రేలియాలో ఉండే ప్రవాసాంధ్రులతో కూడా మాట్లాడి వైఎస్సార్ జయంతి వేడుకల కోసం సందేశం ఇచ్చాను. వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన జడ్పీటీసీ, ఎంపీటీసీ పార్టీకి అండగా ఉంటారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తారు. టీడీపీ ప్రలోభాలకు ఎవరూ లొంగిపోవద్దని సూచించాను. మా పార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీలపై మాకు పూర్తి నమ్మకం ఉంది’’ అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. -
హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు సిట్ ఏర్పాటు
సాక్షి, విశాఖపట్నం: హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. తాజాగా హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు విశాఖపట్నం సీపీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు అయింది. విశాఖ సీపీ రవిశంకర్ ఆధ్వర్యంలో 20 మందితో సిట్ బృందం ఏర్పడింది. జాయింట్ సీపీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, 12 మంది హెడ్ కానిస్టేబుళ్లతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయనుంది. మరోవైపు.. ఆపరేషన్ కంబోడియా విజయవంతమైంది. 360 మంది భారతీయులను ఎంబసీ అఫ్ ఇండియా కాపాడింది. సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్: + 855 10642777 సంప్రదించాలని అధికారులు కోరారు. అయితే.. విదేశీ ఉద్యోగాలంటూ కోటి ఆశలతో కంబోడియా వెళ్లిన భారతీయులు మోసపోయారు. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగమని తీసుకువెళ్లి అక్కడ బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్న చైనా గ్యాంగ్‌పై సోమవారం తిరుగుబాటు చేసిన బాధితులు జైలు పాలయ్యారు. అక్కడ నిర్వాహకులు తమను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని కొంత మంది బాధితులు విశాఖ పోలీసులకు మంగళవారం వాట్సాప్‌తో పాటు ‘ఎక్స్’ ద్వారా వీడియో సందేశాలు పంపించిన విషయం తెలిసిందే.విదేశాల్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు అంటూ గాజువాకకు చెందిన చుట్టా రాజేష్ విజయ్‌కుమార్ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చాడు. అది నిజమని నమ్మి విశాఖ నుంచే కాకుండా రాష్ట్రంలో సుమారు 150 మంది నిరుద్యోగులు రూ.1.5 లక్షలు చొప్పున చెల్లించారు. వారిని బ్యాంకాక్, సింగపూర్ల మీదుగా కంబోడియాకు పంపించారు. అక్కడ మరో గ్యాంగ్ బాధితులను రిసీవ్ చేసుకొని కంబోడియాలో పాయిపేట్ వీసా సెంటర్‌కు తీసుకెళ్లింది. ఓ నెలకు టూరిస్ట్ వీసా చేయించి ఆ గ్యాంగ్ చైనా ముఠాకు విక్రయించింది. నిరుద్యోగుల నైపుణ్యం ఆధారంగా వారిని రూ.2,500 నుంచి రూ.4వేల అమెరికన్ డాలర్లకు చైనా కంపెనీలకు అమ్మేశారు.అక్కడ పని చేసి చైనా వారి చెర నుంచి తప్పించుకున్న నగరానికి చెందిన బొత్స శంకర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరాలతో పాటు మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు.ఈ కేసుని లోతుగా దర్యాప్తు చేయాలని సీపీ రవిశంకర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో జాయింట్ కమిషనర్ ఫకీరప్ప సారథ్యంలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కె.భవానీప్రసాద్, సిబ్బందితో ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
టికెట్ ఎఫెక్ట్.. గంటా రహస్య భేటీ!
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలోని రుషికొండలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌజ్‌లో మాజీ మంత్రి గంటా తన అనుచరులతో రహస్య సమావేశం అయ్యారు. టీడీపీలో కొనసాగాలా? లేదా? అనే అంశంపై అనుచరులతో మంతనాలు జరుపుతున్నారు. గంటా.. టీడీపీ అధిష్టానం వైఖరితో విసిగిపోయారు. టీడీపీ రెండో జాబితాలో కూడా గంటా శ్రీనివాస్‌కు టికెట్ కేటాయించలేదు. మొదటి నుంచీ భీమిలి టికెట్ కోసం గంటా పట్టుబట్టటారు. అయితే చంద్రబాబు మాత్రం గంటాకు భీమిలి టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఇదే విషయంలో తనకు కావాల్సిన టికెట్ లభించకపోతే.. గంటా పార్టీ మారే యోచనలో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. -
‘తుప్పు పట్టిన సైకిల్-పగిలిపోయిన గ్లాసుకు గోల్డ్ కవరింగ్’
సాక్షి, విశాఖపట్నం: తుప్పు పట్టిన సైకిల్, పగిలిపోయిన గ్లాసులకు గోల్డ్ కవరింగ్ ఇస్తూ.. తాము బలంగా ఉన్నామన్న భ్రమలో జనసేన, తెలుగుదేశం పార్టీలు ఉన్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ఎండాడ వైఎస్ఆర్సీపి కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో మా ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచి మేము ఓట్లు అడుగుతామని చెప్పారు. అదే జనసేన, తెలుగుదేశం పార్టీలు ఆ రెండు పార్టీల మధ్య ఉన్న పొత్తే బలమని భావిస్తూ ఎన్నికల బరిలోకి దిగుతున్నాయని మంత్రి అమర్నాథ్ చెప్పారు. కేవలం 24 సీట్లు మాత్రమే జనసేనకి ఇచ్చి చంద్రబాబునాయుడు చేతులు దులుపుకొన్నారని, జనం కోరితే తాను ముఖ్యమంత్రి అవుతానని చెబుతూ వస్తున్న పవన్ కళ్యాణ్ ఈ సీట్లతో ఏ విధంగా ముఖ్యమంత్రి అవుతారని, ఆ పార్టీ కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ ఏం సమాధానం చెబుతారని అమర్నాథ్ ప్రశ్నించారు. కాపులను హింసించిన బాబును ఎలా నమ్ముతారు? గడచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు ఏఏ మేళ్లను చేసిందో ధైర్యంగా చెప్పి మా పార్టీ అభ్యర్థులు ఓటు అడుగుతారని, 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజలకు తాను ఫలానాది చేశానని చెప్పుకునే ధైర్యం చంద్రబాబుకు లేదని అమర్నాథ్ విమర్శించారు. జనసేన టిడిపి విడుదల చేసిన జాబితాను పరిశీలిస్తే కాపుల్ని కమ్మలు... కమ్మ కులస్తులను కాపులు నమ్మడం లేదనేది తేలిపోయిందని అమర్నాథ్ అన్నారు. వంగవీటి మోహన్ రంగా నుంచి ముద్రగడ పద్మనాభం వరకు కాపులను హింసించిన వారిని ప్రజలు ఎలా నమ్ముతారని ఆయన ప్రశ్నించారు. అది ప్యాకేజీ ఇంజినీరింగ్ జనసేన, టిడిపి ఉమ్మడి జాబితాలో సోషల్ ఇంజనీరింగ్ జరిగిందని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని అక్కడ సోషల్ ఇంజనీరింగ్ కన్నా ప్యాకేజీ ఇంజనీరింగ్ కనిపించిందని అమర్నాథ్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న విషయాన్ని స్పష్టత ఇవ్వలేదని అమర్నాథ్ అన్నారు. చంద్రబాబు నాయుడు పొత్తు ధర్మానికి విరుద్ధంగా రెండు సీట్లను ప్రకటిస్తే, పవన్ కళ్యాణ్ అందుకు ప్రతిగా రెండు సీట్లు ప్రకటించారని, అప్పట్లో పవన్ కళ్యాణ్ తీరును అందరు అభినందించారని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు 94 సీట్లను ప్రకటించినప్పుడు, పవన్ కళ్యాణ్ కేవలం ఐదు సీట్లతోటి ఎందుకు సరిపెట్టుకున్నారని మంత్రి అమర్నాథ్ ప్రశ్నించారు. సామాజిక న్యాయం ఎక్కడ? తెలుగుదేశం జనసేన పార్టీలు ప్రకటించిన తొలి జాబితాను పరిశీలిస్తే, ఈ రెండు పార్టీలు సామాజిక న్యాయాన్ని పాటించ లేదన్న విషయం అర్థమవుతోందని అన్నారు. ప్రస్తుతం ప్రకటించిన జాబితాలో ఎంతమంది బీసీ, ఎస్సీ, ఎస్టీలకు స్థానం కల్పించారో ఈ రెండు పార్టీలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని అన్నారు. ఏది ఏమైనా, ఎవరు ఎన్ని పొత్తులతో ఎన్నికల బరిలోకి దిగిన వైఎస్సార్సీపీ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని, మరోమారు జగన్ మోహన్ రెడ్డిగారు ముఖ్యమంత్రి అవుతారని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు. -
MRO రమణయ్య హత్య కేసును చేధించాం: విశాఖ సీపీ
విశాఖపట్నం, సాక్షి: రాష్ట్రంలో సంచలనం రేపిన ఎమ్మార్వో రమణయ్య హత్య కేసును చేధించినట్లు కమిషనర్ రవిశంకర్ ప్రకటించారు. శనివారం మధ్యాహ్నాం ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన హత్య చేసిన నిందితుడిని గుర్తించినట్లు.. అతని కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎమ్మార్వో రమణయ్యను హత్య చేసిన వ్యక్తిని గుర్తించాం. నిందితుడు విమానం ఎక్కి వెళ్లాడు. టికెట్ బుక్ చేసిన ఆధారాలు కూడా ఉన్నాయి. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. పది టీమ్‌లు రంగంలోకి దిగాయి. నిందితుడిపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా? అనేది పరిశీలిస్తున్నాం. అన్ని ప్రాంతాల్లో నిందితుడి కోసం గాలిస్తున్నాం. చాలాసార్లు ఎమ్మార్వో ఆఫీస్‌కు నిందితుడు వెళ్లినట్లు తేలింది. నిందితుడు మరింత దూరం పారిపోతాడనే కారణంతోనే కొన్ని వివరాలను చెప్పట్లేదు అని సీపీ రవిశంకర్ వెల్లడించారు. రాత్రి పది గంటల సమయంలో హత్య జరిగింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. హత్యకు ఆర్ధిక లావాదేవీలు కారణమని భావిస్తున్నాం. రియల్ ఎస్టేట్, భూవివాదాలే హత్యకు కారణమై ఉండొచ్చు. హత్యకు ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు. తనతో మాట్లాడడానికి వచ్చిన వారికి తహశీల్దార్ సెండాఫ్ చెప్పడానికి వెళ్లగా.. అదే అదనుగా నిందితుడు హత్య చేశాడు అని సీపీ మీడియాకు కేసు వివరాలను వివరించారు. ఇదీ చదవండి: విశాఖలో తహసీల్దార్ దారుణ హత్య విశాఖ రూరల్ (చినగదిలి) తహసీల్దార్‌గా సనపల రమణయ్య రెండు రోజుల కిందటి దాకా విధులు నిర్వహించారు. శుక్రవారం రాత్రి సమయంలో కొమ్మాదిలోని చరణ్ క్యాస్టల్ అపార్ట్మెంట్లో రమణయ్య ఇంటికి ఓ వ్యక్తి వచ్చాడు. వచ్చిరాగానే రమణయ్యతో వాగ్వాదానికి దిగాడు. అనంతరం, తన వెంట తెచ్చుకున్న ఐరన్ రాడ్‌తో రమణయ్యపై దాడి చేశాడు. దీంతో, తలకు తీవ్ర గాయాలు కావడంతో కుప్పకూలారు. అది చూసి నిందితుడిని పట్టుకునేందుకు అపార్ట్‌మెంట్‌వాసులు ప్రయత్నించినా లాభం లేకపోయింది. రమణయ్యను వెంటనే స్థానికంగా ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆయన మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. తొలుత నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. -
‘బాబు-పవన్‌ల కుతంత్రాలు.. సీఎం జగన్‌కు తిరుగేలేదు’
విశాఖపట్నం, సాక్షి: వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం వైనాట్-175 లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని.. అందుకే పార్టీలో మార్పులని వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పునరుద్ఘాటించారు. ఈ క్రమంలో అసంతృప్తులు పార్టీని వీడడం షరా మామూలుగా జరిగేదేనని అన్నారాయన. గురువారం విశాఖ ఎయిర్‌పోర్టులో మీడియాతో వంశీకృష్ణా యాదవ్ పార్టీ మారిన సంగతిపైనా స్పందించారు. ఎక్కడైతే మార్పు అవసరమని భావించామో అక్కడే ఇంఛార్జిలను మారుస్తున్నాం. ముందు పని చేసిన నాయకులు కొత్తవాళ్లకు సహకరించాలని సీఎం జగన్ కూడా చెప్పారు. ఎంతమంది ఉన్నా.. బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే పట్టుబట్టి వంశీకి(వంశీకృష్ణ యాదవ్‌ను ఉద్దేశించి..) ఎమ్మెల్సీ ఇప్పించాం. ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన రాజీనామా చేసి వెళ్తున్నారంటే దానికి వారే సమాధానం చెప్పాలి. పార్టీ నుంచి ఎవరు వెళ్లినా మాకు ఇబ్బందేం లేదు అని అన్నారాయన. పవన్, చంద్రబాబు ఎన్ని కుతంత్రాలు పన్నినా జగన్‌కు తిరుగు లేదని, ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలు.. అభివృద్ధి కార్యక్రమాల కారణంగా ప్రజల ఆశీస్సులతో మళ్లీ జగనే సీఎం అవుతారు అని సుబ్బారెడ్డి చెప్పారు. అందుకే రాజధాని ఆలస్యం న్యాయస్థానాల పరిధిలో ఎదురవుతున్న ఇబ్బందుల వల్లే విశాఖపట్నం రాజధాని మార్పు ఆలస్యం అవుతోందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఈ సమస్యను అధిగమిస్తామని.. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి విశాఖ నుంచి పాలన సాగిస్తారని వైవీ సుబ్బారెడ్డి కుండబద్ధలు కొట్టారు. -
వైజాగ్ ఐటీ కంపెనీ ఎవల్యూటిజ్ ఆదాయ లక్ష్యం రూ. 650 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ సేవలు, ఉత్పత్తుల సంస్థ ఎవల్యూటిజ్ వచ్చే రెండేళ్లలో రూ. 650 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రస్తుతం ఇది రూ. 430 కోట్లుగా ఉంది. వైజాగ్ కేంద్రం ప్రారంభించి పదేళ్లయిన సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు, సీటీవో ఎ. శ్రీనివాస ఈ విషయాలు చెప్పారు. భారతీయ టెకీలు 2011లో షికాగో కేంద్రంగా ఎవల్యూటిజ్ను ప్రారంభించారు. ఇది దేశీయంగా 2013లో వైజాగ్‌తో మొదలుపెట్టి హైదరాబాద్, నోయిడా, బెంగళూరు తదితర నగరాలకు కార్యకలాపాలు విస్తరించింది. ప్రస్తుతం భారత్‌లో 650 మంది సిబ్బంది ఉండగా.. వైజాగ్, హైదరాబాద్ కార్యాలయాల్లో 500 మంది పైగా ఉన్నారని శ్రీనివాస వివరించారు. పటిష్టమైన వ్యూహాల దన్నుతో రెండేళ్లుగా ఆదాయం 140% వృద్ధి చెందిందని, రాబోయే రోజుల్లోను ఇదే స్ఫూర్తి తో పని చేయనున్నామని ఆయన పేర్కొన్నారు. కృత్రిమ మేథ, మెషీన్ లెర్నింగ్, బిగ్ డేటా మొదలైన సాంకేతికతల ఆధారిత సొల్యూషన్స్‌కి సంబంధించి పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నామని చెప్పారు. -
విశాఖ ప్రమాదంలో కొత్త కోణం.. యూట్యూబర్ ఎక్కడ?
Updates.. ►విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్లో బోట్లు దగ్ధమైన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధితులను ఆదుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రమాదంపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని ఆదేశించారు. మంత్రి సీదిరి అప్పలరాజును ఘటనాస్థలానికి వెళ్లాలని సూచించారు. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండాలని, తగిన విధంగా వారికి సహాయం చేయాలని వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ►సీఎం జగన్ ఆదేశాలతో ఘటనా స్థలానికి బయలుదేరిన మంత్రి సీదిరి అప్పలరాజు. ►విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అగ్ని ప్రమాద ఘటన సందర్బంగా ఓ యూట్యూబర్ అక్కడ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, సదరు యూట్యూబర్‌పై పోలీసులు కేసు నమోదు చేయనున్నట్టు తెలిపారు. రాత్రి ఫిషింగ్ హార్బర్లో పార్టీ ఏర్పాటు చేసిన యూట్యూబర్. పార్టీలో మద్యం మత్తులో గొడవ జరిగినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, పరారీలో ఉన్న యూట్యూబర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ►విశాఖపట్నంంలోని ఫిషింగ్ హార్బర్లో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఆదివారం అర్ధరాత్రి ఓ బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్నిప్రమాదంలో 30కి పైగా బోట్లు కాలిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. ►ఇక, సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ అగ్నిప్రమాదంలో 40కి పైగా బోట్లు కాలిపోయాయని స్థానికులు చెబుతున్నారు. ఎగిసిపడుతున్న మంటలను అధికారులు మెరైన్ బోట్లు ద్వారా అదుపులోకి తెచ్చారు. బోట్లలో నిద్రిస్తున్న వారు మంటల్లో చిక్కుకుని ఉన్నారేమో అని కార్మికులు తొలుత అనుమానించారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక, ఇది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కావాలనే చేశారని స్థానికులు అనుమానిస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా బోట్ల యజమానులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ►మరోవైపు.. విశాఖ ఫిషింగ్ హార్బర్లో అగ్ని ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనా స్థలంలో వివరాలను పోలీసు కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేశారా? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ప్రమాద స్థలంలో సీసీ కెమెరాల ద్వారా వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. -
ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టి, వ్యవసాయ దిగుబడులను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. ఇంకా ఇతర అప్డేట్స్
-
నేటి నుంచి వైజాగ్ ఓపెన్ గోల్ఫ్
విశాఖ స్పోర్ట్స్: ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఇండియా(పీజీటీఐ) ఆధ్వర్యంలో సోమవారం నుంచి ‘వైజాగ్ ఓపెన్ గోల్ఫ్ 2023’ ప్రారంభం కానుంది. ప్రొఫెషనల్ గోల్ఫ్‌ను ప్రోత్సహించే ఉద్దేశంతో పీజీటీఐ టోర్నీలు నిర్వహిస్తుండగా, విశాఖ ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ వేదికగా ఈ టోర్నీ జరగనుంది. తొలి రోజు ప్రాక్టీస్ రౌండ్స్ రెండో రోజు ప్రోటోర్నీ జరగనున్నాయి. 20 నుంచి 23వ తేదీ వరకు నాలుగు రౌండ్ల పాటు స్ట్రోక్ ప్లే ప్రధాన టోర్నీ జరగనుంది. ఈ సందర్భంగా ఆదివారం క్లబ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్యదర్శి ఎంఎస్ఎన్ రాజు మాట్లాడుతూ ప్రోటోర్నీని వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ ప్రారంభించనుండగా.. విజేతలకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి బహుమతులు అందించనున్నారన్నారు. భారత్‌తో పాటు శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్‌కు చెందిన మేటి గోల్ఫర్స్ 126 మంది ఈ టోర్నీలో పాల్గొననున్నారని తెలిపారు. ఈ టోర్నీలో సత్తాచాటిన వారు ప్రైజ్‌మనీ పొందటంతో పాటు తమ ర్యాంకింగ్‌ను మెరుగుపర్చుకునేందుకు, అంతర్జాతీయ టోర్నీలో అర్హత సాధించేందుకు దోహదపడుతుందని వివరించారు. యూరోస్పోర్ట్స్, సోషల్ మీడియా, దూరదర్శన్ చానల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుందన్నారు. 1984లో నిరి్మంచిన ఈపీజీసీ ఉత్తమ పునఃనిర్మాణ గోల్ఫ్‌కోర్స్‌గానూ గతేడాది అవార్డు అందుకుందని చెప్పారు. -
చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ తోడుదొంగలు
స్కిల్డ్ దొంగను కాపాడేందుకు లోకేశ్, పవన్ ఆరాటపడుతున్నారని, అందులో భాగంగానే ఢిల్లీ మీడియాతో లోకేశ్ సొల్లు కబుర్లు చెబుతున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. మీ తండ్రి అవినీతిపై దర్యాప్తు సంస్థలు పిలుస్తుంటే.. చర్చంటూ సవాళ్లేమిటి లోకేశ్?.. ఏ తప్పూ చేయకపోతే అసెంబ్లీకొచ్చి చర్చించే దమ్ముందా? అని సవాల్ విసిరారు. ఇక పవన్‌కళ్యాణ్ నకిలీ కాపు అని, ఆయన ఏనాడూ కాపు ఉద్యమాలకు సహకరించలేదని మండిపడ్డారు. వంగవీటి హత్య, ముద్రగడపై వేధింపుల్లో చంద్రబాబు కుట్రను ప్రశ్నించలేదని, జనసేన కేడర్‌ను జెండాకూలీలుగా మార్చాడని, టీడీపీలో జనసేన విలీనమే ములాఖత్ ప్రకటన రహస్యమని స్పష్టీకరించారు. విశాఖపట్నం: నగరంలోని సర్యూట్హౌస్లో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే.. ఈడీ, ఐటీ, సీఐడీలతో చర్చించు ఢిల్లీలో నిన్న నారా లోకేశ్ జాతీయమీడియాతో మాట్లాడాడు. తన తండ్రి చంద్రబాబు హయాంలో జరిగిన స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి వివరిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి గురించి ప్రస్తావించాడు. చంద్రబాబు ఏ తప్పూ చేయకుండానే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారని.. జగన్ గారితో తాను చర్చించేందుకు సిద్ధమంటూ లోకేశ్ ఛాలెంజ్ విసిరాడు. అయితే, ఆయనతో చర్చకు ఏ స్థాయి వ్యక్తి ముందుకొస్తారనేది పక్కనబెడితే.. చంద్రబాబు చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించి ముందు వారిని ఈడీ అరెస్టులతో పిలిచింది. ఒకపక్కేమో ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ షోకాజ్ నోటీసులు ఇచ్చి పిలుస్తుంటే.. మరోపక్క సీఐడీ సాక్ష్యాధారాలతో సహా జైలుకు పంపింది. తండ్రీకొడులు కుంటిసాకులతో.. ఒకపక్కన కేంద్ర దర్యాప్తు సంస్థలతో పాటు సీఐడీ చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్‌ను అవినీతిపై నోరు విప్పాలని నోటీసులిస్తుంటే.. మరి, వాటి సంగతి తేల్చాలి కదా..?. సీఐడీ పిలుస్తుంటేనేమో.. నేను సమాధానం చెప్పను. నాకు సంబంధం లేదు. నాకు నోటీసులివ్వలేదు. గవర్నర్ గారికి చెప్పి నన్ను అరెస్టు చేస్తున్నారా..లేదా..? స్పీకర్ చెప్పి నన్ను అరెస్టు చే స్తున్నారా..? అంటూ చంద్రబాబు వితండవాదం చేశాడు. అదేవిధంగా ఐటీశాఖ కూడా బాబూ.. నువ్వు ఆదాయపన్ను లెక్కల్లోకి రాని రూ.118 కోట్లు బొక్కేశావు. రాష్ట్ర ఖజానా నుంచి కాంట్రాక్టర్లకు చెల్లింపుల్లో లంచాలకు సంబంధించి కొట్టేసిన మొత్తానికి సరైన లెక్కలతో సమాధానం చెప్పాలంటూ నోటీసులిస్తే.. దానికి సమాధానం చెప్పడు. లోకేశ్ కూడా నోరుమెదపడు. 2020 నుంచి కేంద్ర ఐటీశాఖ నుంచి నోటీసులు వస్తూనే ఉన్నాయి. వాటికి సంబంధించి ఏవేవో కుంటి సాకులు చెబుతూ రిప్లైలు ఇచ్చినా.. వాటినన్నింటినీ ఐటీశాఖ తోసిపుచ్చింది తెలిసిందే. మరోవైపు ఏపీలో జరిగిన స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే అనేమందిని విచారించింది. అరెస్టులు కూడా చేసింది. రేపోమాపో చంద్రబాబు, లోకేశ్‌ను కూడా విచారణకు పిలుస్తుంది. అయితే, సమాధానం చెప్పుకోవాల్సిన చోట నోరువిప్పకుండా.. తండ్రీకొడుకులు పనికిమాలిన కబుర్లు మాట్లాడుతున్నారు. నువ్వెంత..నీ బతుకెంత..? రాష్ట్రంలో ప్రజలను అడ్డంగా దోచుకుని తిని అవినీతి ఆధారాలతో నీ తండ్రి జైలుకెళ్తే.. నువ్వేమో నాతో చర్చకు ఫలానా వాళ్లు రావాలంటూ జాతీయమీడియాతో మాట్లాడతావా లోకేశ్..? అసలు, అక్కడిదాకా వెళ్లి నీ తండ్రికి పట్టిన గతి గురించి మాట్లాడుకోవడానికి సిగ్గనిపించడం లేదా..? ఒకటీ రెండు కాదు. అక్షరాలా రూ.371 కోట్ల ప్రజాధనాన్ని దోచుకు తిన్న పందికొక్కులు నువ్వు, నీతండ్రి. అందుకే, ఇన్నాళ్లకు మీ పాపం పండి ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు మీ భరతం పట్టేందుకు సిద్ధమయ్యాయి. నువ్వేమో ముఖ్యమంత్రితో చర్చించాలంటున్నావు. లోకేశ్.. నీ బతుకేంటి.? నీ స్థాయేంటి..? అని హెచ్చరిస్తున్నాను. నీ తండ్రి అవినీతిని ఒప్పుకున్నావా..? రిపబ్లిక్ టీవీలో నిన్న లోకేశ్ మాట్లాడుతూ.. ఒక అద్భుతమైన పోలిక చెప్పాడు. ఏదైనా బ్యాంకు బ్రాంచిలో తప్పు జరిగితే బ్యాంకు ఛైర్మన్‌ను అరెస్టు చేస్తారా..? అంటూ లోకేశ్ ప్రశ్నించాడు. అంటే, సిల్క్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు సంబంధించి రూ.371 కోట్లు కుంభకోణం జరిగిందని లోకేశ్ ఒప్పుకున్నట్టే కదా..? ఈ దోపిడీకి గురైన ప్రజాధనం మొత్తం అటూఇటూ తిరిగి చంద్రబాబు ఖాతాకు చేరాయని ఆధారాలు చెబుతున్నాయి. అంటే, నీ తండ్రి అవినీతికి పాల్పడ్డాడంటూ ఒప్పుకున్నట్టే కదా..? అని లోకేశ్‌ను ప్రశ్నిస్తున్నాను. ఈ స్కామ్‌కు సంబంధించి ప్రభుత్వ అధికారులపై ఐదు పర్యాయాలు చంద్రబాబు వత్తిళ్లకు గురిచేసినట్లు నోట్‌ఫైల్స్ చెబుతున్నాయి. అయితే, ఈ తండ్రీకొడుకులు మాత్రం తమకేమీ తెలియదని రూ.371 కోట్ల ప్రజల సొమ్మును కొట్టేసి సుద్ధపూసల్లా మాట్లాడుతున్నారు. దొంగలెప్పుడూ తామెలాంటి తప్పు చేయలేదనే మాటే అంటారు. కానీ, చట్టం ముందు అందరూ సమానమేనని గుర్తించాలి. చట్టం దొంగల్ని సమాజం ముందుకు తెస్తుందని తెలుసుకోవాలి. చంద్రబాబు దేశంలోనే రిచ్ ఎమ్మెల్యే దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలందరిలోకెల్లా నాల్గో ధనవంతుడైన ఎమ్మెల్యేగా చంద్రబాబు రికార్డుల్లోకి ఎక్కాడు. ఇది నా సొంతంగా చెబుతున్న మాట కాదు. తన ఎన్నికల అఫిడవిట్లోనే రూ.683 కోట్ల విలువైన ఆస్థి తనపేరిట ఉన్నట్లు చంద్రబాబు స్వయంగా చెప్పుకున్నాడు. మరి, ఇదే వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు కేవలం 2 ఎకరాల పొలం మాత్రమే ఉండేది. ఆ రెండెకరాల రాజకీయ ప్రస్థానం రూ.683 కోట్లకు ఎలా పెరిగిందని మేం అడుగుతున్నాం. అధికారాన్ని అడ్డంపెట్టుకుని మీరు దోచేసిన రూ.లక్షల కోట్లు గురించి కాకుండా.. మీరు అధికారికంగా చెప్పిన రూ.కోట్లపైనే ప్రశ్నిస్తున్నాను. దీనికి చంద్రబాబు గానీ.. ఆయన సుపుత్రుడు లోకేశ్ గానీ సమాధానం చెప్పాలి. ఆధారాలతో అడ్డంగా దొరికిన దొంగ బాబు ఎక్కడో ఉన్న ఒక కంపెనీని తెరమీదికి తెచ్చి.. ఏపీలో స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పేరుతో యువతకు శిక్షణతో పాటు ఉద్యోగాల కల్పనకు సంబంధించి 90 శాతం పెట్టుబడి పెడుతుందని చెప్పారు. ప్రభుత్వం మాత్రం 10 శాతం వాటా పెట్టాలన్నారు. తీరా 90 శాతం పెట్టుబడి పెట్టాల్సిన కంపెనీ నుంచి ఒక్క పైసా రాకుండానే ప్రభుత్వ ఖజానా నుంచి 10 శాతం చెల్లింపులు చేసుకున్నారు. అంటే, రూ.371 కోట్లు ప్రజాధనాన్ని స్వాహా చేశారు. సీమెన్స్ కంపెనీ పేరిట అబద్ధాలు చెప్పి.. ప్రభుత్వ సొమ్మును అప్పన్నంగా కాజేయడానికి పన్నిన చంద్రబాబు పన్నాగమిది. ఇంతా దోచుకుని మేం కొట్టేసినట్టు ఆధారాలేంటి..? అని తండ్రీకొడుకుల బుకాయింపులు. ఇదేమన్నా హెరిటేజ్ ఫ్రెష్‌లో టమాటాల్ని కొంటే ఇచ్చే రసీదులా..? లంచాలకు రసీదులెక్కడుంటా యి..? దర్యాప్తు సంస్థల విచారణలో ఆధారాలన్నీ బయటపడతాయని లోకేశ్ తెలుసుకోవాలి. ఏపీలో స్కిల్‌డెవలప్‌మెంట్ గురించి తామెలాంటి ఒప్పందం చేసుకోలేదని.. ఎదురుపెట్టుబడి పెట్టి తామెలాంటి ప్రాజెక్టులు చేపట్టిన దాఖల్లాలేవంటూ సీమెన్స్ సంస్థ అధికారికంగా చెప్పింది. మరి, చంద్రబాబు తెరమీదికి తెచ్చిన సీమెన్స్ బోగస్ ఒప్పందాన్ని ఏమంటారు..? అది అవినీతి కార్యక్రమం కాదా..? అని అడుగుతున్నాను. కనుక, చంద్రబాబు స్కిల్‌స్కామ్‌లో ఆధారాలతో దొరికన దొంగ అని స్పష్టమైంది. 13చోట్ల సంతకాలతో అడ్డంగా దొరికాడు చంద్రబాబు అరెస్టు తర్వాత ఆయనతో పాటు న్యాయవాదులు, లోకేశ్, టీడీపీ నాయకులు ఎక్కడా.. తాము అవినీతికి పాల్పడలేదని చెప్పలేదు. కుంభకోణం జరిగిన మాట వాస్తవమే గానీ.. ఈ కేసులో మమ్మల్ని అరెస్టు చేయడానికి పరిమితులు, పరిధులు వర్తిస్తాయంటూ అడ్డదిడ్డంగా ‘లా’ పాయింట్లు పీకుతున్నారు. లోకేశ్ నిన్న జాతీయమీడియాతో మాట్లాడుతూ.. మా నాన్న ఎక్కడా సంతకం చేయలేదని చెబుతున్నాడు. స్కిల్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో బోగస్ కంపెనీల ఒప్పందాలు గానీ.. రాష్ట్ర ఖజానా నుంచి రూ.371 కోట్ల నిధుల విడుదలకు సంబంధించిన ఫైళ్లల్లో మొత్తం 13 చోట్ల చంద్రబాబు సంతకాలున్నట్లు సీఐడీ ఆధారాల్ని కోర్టుకు సైతం సమర్పించింది. మరి, ఆయనకెలాంటి సంబంధం అంటదని లోకేశ్‌తో పాటు పచ్చమీడియా కూడా ఎలా వాదిస్తుంది..? అని అడుగుతున్నాను. ఆ సంతకాలు కూడా బాబువి కాదు.. ఫోర్జరీ చేశారని దీనిపై కూడా రేపోమాపో మరో అబద్ధాన్ని కూడా వీళ్లంతా ప్రచారం చేస్తారేమో.. అంతటి అసాధ్యులే వీళ్లు. అసెంబ్లీకొచ్చి చర్చించే దమ్ముందా..? ఏదిఏమైనా చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి అక్రమాల్లో ఈ స్కిల్‌డెవలప్‌మెంట్ స్కామ్ అనేది కేవలం ఒక తీగమాత్రమే.. ఇంకా కదలాల్సిన డొంక చాలా ఉందని మరోమారు గుర్తుచేస్తున్నాను. రూ.371 కోట్ల ప్రజాధనాన్ని కొట్టేసేందుకే చంద్రబాబు సూత్రధారిగా, పాత్రధారిగా వ్యవహరించినట్లు సీఐడీ అన్నీ ఆధారాలతోనే అరెస్టు చేసింది. ఏసీబీ కోర్టు కూడా సీఐడీ వాదనలతో ఏకీభవించింది కనుకే చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలుకెళ్లాల్సి వచ్చింది. దీనిపై ఇప్పటికైనా తండ్రీకొడుకులతో పాటు తెలుగుదేశం పార్టీ స్పష్టమైన సమాధానం చెప్పాలి. ప్రజాధనం కొట్టేసినందుకు రాష్ట్రప్రజలకు క్షమాపణలు చెప్పి.. చట్టపరంగా శిక్ష అనుభవిస్తామని నేరాన్ని అంగీకరించాలని మేం డిమాండ్ చేస్తున్నాం. తామేమీ అవినీతికి పాల్పడలేదని నిరూపించుకోవాలంటే రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ స్కామ్‌పై చర్చించే దమ్మూధైర్యం ఉందా..? అని ఆ పార్టీ నేతలకు సవాల్ విసురుతున్నాను. నకిలీ కాపు పవన్‌కళ్యాణ్ కాపు ఉద్యమాలకు ఏనాడు సహకరించని నకిలీ కాపు పవన్‌కళ్యాణ్. ఇదే చంద్రబాబు కుట్రలతో వంగవీటి మోహనరంగా హత్యకు గురైనప్పుడు గానీ.. ముద్రగడ పద్మనాభం గారిలాంటి వాళ్లు తీవ్రమైన వేధింపులకు గురైనప్పుడూ ఏరోజూ పవన్‌కళ్యాణ్ స్పందించలేదు. ఆయా సందర్భాలపై ఆయన మాట్లాడింది కూడా లేదు. అలాంటి వ్యక్తి ఈరోజు కాపు నాయకుడిగా చెలామణి అవుతూ టీడీపీకి సపోర్టు చేయాలని పిలుపునిస్తే కాపుసోదరులెవరూ పట్టించుకోరు. అసలు, ఇప్పటికే పవన్‌కళ్యాణ్‌ను పూర్తిగా కాపులు పక్కనబెట్టారు. జెండా కూలీలుగా జనసైనికులు వెనకటికెవరో ఎప్పుడో జరిగిన పెళ్లికి ఇప్పుడు భజంత్రీలన్నాడంట.. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ప్రకటనలు అలా ఉన్నాయి. అవినీతి కేసులో జైలుకెళ్లిన చంద్రబాబుతో ఆయన ములాఖత్ అయ్యాడు. జైలు బయటకొచ్చి తామిద్దరం మిలాఖత్ అయ్యామంటున్నాడు. ఆ రెండు పార్టీల పొత్తు గురించి ఇప్పుడు కొత్తగా చెప్పేదేముంది..?ఒక తండ్రికి ఉత్తపుత్రడితో పాటు దత్తపుత్రుడి ఆట గురించి మా నాయకుడు జగన్ గారు ఎప్పట్నుంచో చెబుతూనే ఉన్నారు. చంద్రబాబు దత్తపుత్రుడైన పవన్‌కళ్యాణ్ లేటెస్టుగా టీడీపీతో పొత్తు అన్నంతమాత్రానా ఏమీ ఊడిపడేదిలేదు. పైగా, జనసేన నాయకులు, కేడర్‌కు ఇన్నాళ్లకు కళ్లు తెరుచుకున్నాయి. పవన్‌కళ్యాణ్‌పై అభిమానంతో ఆ పార్టీ కార్యకర్తలు పనిచేస్తుంటే.. ఆయన మాత్రం చంద్రబాబుకు బానిసత్వం చేస్తున్నారనే చర్చ మొదలైంది. తాము టీడీపీని భుజానికెత్తుకునే జెండాకూలీలుగా ఉండబోమని జనసేన సైనికులంటున్నారు. విలీనం చేయడానికి సరికొత్త ఎత్తుగడ.. జనసేనను టీడీపీలో విలీనం చేయడానికి ఇది సరికొత్త ఎత్తుగడగా చంద్రబాబు, పవన్‌లు పథక రచన చేశారంటూ ఇరుపార్టీల కేడర్ భావిస్తుంది యధార్థమే..అయితే, బాబును భుజానికెత్తుకుంటే పవన్‌కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగానే మారబోతుందనడంలో సందేహం లేదు. -
విశాఖ వృద్ధురాలి హత్యపై పిచ్చి రాతలు
సాక్షి, అమరావతి: పేదల పొట్ట కొట్టాలని చంద్రబాబు కుళ్లు రాజకీయాలు చేస్తున్నాడని.. ఈ క్రమంలోనే పచ్చ మీడియాతో పిచ్చి రాతలు రాయిస్తున్నాడని.. అయితే వాస్తవాలు బయటపడడంతో ఇప్పుడు ఆ నోళ్లు మూతలు పడుతున్నాయని ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయన మాట్లాడుతూ.. పది లక్షల కోట్లు అప్పులు చేశారని.. ఏపీని అప్పుల పాలు చేశారని పచ్చ బ్యాచ్ సీఎం వైఎస్ జగన్‌పై దుష్ప్రచారానికి దిగింది. పచ్చ పార్టీకి.. పిచ్చి రాతలు రాసే వాళ్ల నోళ్లు మూతలుబడేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పారు. టీడీపీ అధికారం నుంచి దిగిపోయే టైంకి రూ. 2.64 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. ఈ నాలుగేళ్లలో రూ. 1,77,991 కోట్ల అప్పులు మాత్రమే చేశారని పార్లమెంట్ సాక్షిగా వెల్లడైంది. ఒక పనికిమాలిన ఎంపి వేసిన ప్రశ్నతో వాస్తవం బట్టబయలైంది. టిడిపి తప్పుడు ప్రచారాలకి ఇది చెంప పెట్టు అని మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. ► సీఎం జగన్ నాలుగేళ్లుగా సంక్షేమపాలన అందిస్తున్నారు.. ప్రజాభిమానమూ పెరిగింది. ఆ ఆదరణ చూసి చంద్రబాబు తట్టుకోలేక రాష్ట్రం అప్పులపాలయ్యిందని.. శ్రీలంకలా మారిందని గోబెల్స్ ప్రచారం చేశారు. పేదలపొట్ట కొట్టాలని చంద్రబాబు కుళ్లు రాజకీయాలు చేశారు. కానీ, వాస్తవాలు బయటపడటంతో నోళ్లు మూతబడుతున్నాయి అని అన్నారాయన. ► విశాఖలో వృద్దురాలు హత్యపైనా ఈనాడు పత్రిక అబద్దాలు ప్రచురించింది. మొత్తం వలంటరీ వ్యవస్థకు ముడిపెట్టి లేనిపోని రాద్ధాంతం చేస్తోంది. పనితీరు సక్రమంగా లేదని తొలగించిన వ్యక్తిని ఇంకా వలంటీర్ అని ఎలా రాస్తారు. కేవలం పిచ్చి రాతల్లో భాగంగానే ఆ కథనం ప్రచురించింది అని మంత్రి మండిపడ్డారు. ► చంద్రబాబు మూడు టర్మ్‌లలో రూ.7.50 లక్షల కోట్లు ఏం చేశారు? మూడు సార్లు సీఎంగా పని చేసి సంక్షేమాన్ని ఎందుకు అందించలేకపోయారు?. మా ప్రభుత్వం నాలుగేళ్లలో నేరుగా ప్రజలకి అందించిన సంక్షేమమే 2.50 లక్షల కోట్లపైనే. చంద్రబాబు చెబుతున్న అబద్ధాలకు ఆస్కార్ ఇవ్వొచ్చు. సీఎంగా ఉండి ఏనాడైనా పోలవరం పేరు ఎత్తాడా?. పోలవరానికి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడ్డుపడ్డాడని చంద్రబాబు ఎలా అంటారు?. అసలు వైఎస్సార్ హయాంలో పోలవరం పనులు ప్రారంభయ్యాయి. కుడి, ఎడమ కాలువలు పూర్తి చేశారు. కమీషన్ కోసం కుక్కుర్తి పడి పోలవరాన్ని నిర్మాణాన్ని చంద్రబాబు చేపట్టలేదా?. ఈనాడు రామోజీరావు వియ్యంకుడికి వందల కోట్ల పనులు అప్పనంగా అప్పగించలేదా? అని నిలదీశారు. ► చంద్రబాబు దుర్మార్గుడు. చంద్రబాబు కొడుకు మాలోకం. అది యువగళమా.. విషగళమా?. ఎవరు ఎక్కువ కేసులు పెట్టించుకుంటే వారికే పెద్ద పదవులట!. టీడీపీ అధికారంమలోకి వస్తే కర్రలు ఇస్తాడట. ఇదీ రాబోయే కాలంలో వాళ్ల అజెండా. జోకర్ కొడుకు.. బ్రోకర్ తండ్రి అని పేర్కొన్నారాయన. పవన్‌ని చూస్తే జాలేస్తోంది చిరంజీవి కుటుంబంపై చంద్రబాబు చేసిన కుట్రలు అందరికి తెలుసు. కాపులని అనాదిగా తొక్కడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. రంగా హత్య నుంచి ముద్రగడ కుటుంబాన్ని వేధించే దాకా కాపులని అడుగడుగునా చంద్రబాబు కుట్ర ఉంది. అలాంటి చంద్రబాబు విష కౌగిలిలో పవన్ చిక్కకుపోయాడు. పవన్ స్టార్ నుంచి ప్యాకేజీ స్టార్ గా మారిపోయాడు. నా పార్టీ పెట్డిన ధ్యేయమే వైఎస్ జగన్ ని గద్దె దించడమే అని పవన్ అంటున్నాడు. పవన్ పై ప్రేమ ఉంటే ప్యాకేజ్ ఇవ్వలేదని ఏనాడైనా చంద్రబాబు చెప్పాడా?. అందుకే చంద్రబాబు విష కౌగిలి నుంచి పవన్ బయటపడాలి అని సూచించారు. -
సీఎం వైఎస్ జగన్ విశాఖ పర్యటన.. షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(గురువారం) విశాఖపట్నంలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 3.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి 3.50 గంటలకు పీఎం పాలెం వైఎస్సార్ స్టేడియంకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం 4.50 గంటలకు ఆరిలోవ అపోలో ఆస్పత్రికి చేరుకుని, అపోలో కేన్సర్ ఆస్పత్రిని ప్రారంభిస్తారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 5.50 గంటలకు బీచ్ రోడ్డుకు చేరుకుంటారు, అక్కడ వీఎంఆర్డీఏ అభివృద్ది చేసిన సీ హారియర్ యుద్ద విమాన మ్యూజియంను ప్రారంభిస్తారు. దీంతోపాటు అక్కడి నుంచే రామ్‌నగర్‌లోని వీఎంఆర్డీఏ కాంప్లెక్స్, ఎంవీపీలోని ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనాను ప్రారంభించనున్నారు. అనంతరం ఎండాడలోని కాపు భవనం, భీమిలిలోని ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు శంకుస్ధాపన చేయనున్నారు. అక్కడి నుంచి 6.15 గంటలకు బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న ఎమ్మెల్యే గొల్ల బాబురావు కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొంటారు, అనంతరం రాత్రి 7 గంటలకు తిరుగు ప్రయాణమై 8.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. చదవండి: ఒక్క రైతూ ఇబ్బంది పడకూడదు.. అధికారులకు సీఎం జగన్ ఆదేశం -
సీఎం జగన్ విజయనగరం, విశాఖ జిల్లాల పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చే నెల 3న విజయనగరం, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్ధాపన, చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం, తారకరామతీర్ధ సాగర్ ప్రాజెక్ట్ మిగులు పనులకు శ్రీకారం చుట్టనున్నారు. విశాఖపట్నం-మధురవాడలో వైజాగ్ ఐటీ టెక్ పార్క్‌కు శంకుస్థాపన చేయనున్నారు. విజయనగరం జిల్లా షెడ్యూల్ ఉదయం 8 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు భోగాపురం మండలం ఎ.రావివలస గ్రామం వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 10.25 గంటలకు జీఎంఆర్ ఎక్స్పీరియన్స్ సెంటర్‌కు చేరుకుంటారు. ఆ సెంటర్‌ను సందర్శిస్తారు. భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి శంకుస్ధాపన చేస్తారు. చదవండి: ఇంటింటా ‘నమ్మకం’.. జగనన్నే మా భవిష్యత్తు.. 1.1 కోట్ల మిస్డ్ కాల్స్ 10.30 గంటలకు భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం, చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం, తారకరామతీర్ధ సాగర్ ప్రాజెక్ట్ మిగులు పనులకు సంబంధించిన శిలా ఫలకాలను ఆవిష్కరిస్తారు. 10.55 గంటలకు సవరవిల్లి వద్ద ఏర్పాటుచేసిన బహిరంగసభ వేదిక వద్దకు చేరుకుంటారు. సభ అనంతరం 1.20 గంటలకు అక్కడి నుంచి విశాఖ పర్యటనకు బయలుదేరుతారు. విశాఖపట్నం పర్యటన మధ్యాహ్నం 1.40 గంటలకు విశాఖ మధురవాడ ఐటీ హిల్స్ నెంబర్ 3 వద్ద గల హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. రోడ్డు మార్గంలో బయలుదేరి ఐటీ హిల్స్ నెంబర్ 4లో గల వేదిక వద్దకు 2 గంటలకు చేరుకుంటారు. 2.30–3.00 వైజాగ్ ఐటీ టెక్ పార్క్ శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ సందర్శిస్తారు, అనంతరం పారిశ్రామికవేత్తలతో నిర్వహించే కార్యక్రమంలో సీఎం ప్రసంగిస్తారు. తర్వాత 3.50 గంటలకు అక్కడినుంచి బయలుదేరి రుషికొండలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసానికి చేరుకుంటారు. అక్కడ ఇటీవల వివాహం చేసుకున్న ఎంపీ కుమారుడు దంపతులను ఆశీర్వదిస్తారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు మధురవాడ హెలిప్యాడ్ నుంచి బయలుదేరి, 5.20 గంటలకు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. సాయంత్రం 5.30 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 6.45 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. చదవండి: జగజ్జనని చిట్ ఫండ్స్.. ఆదిరెడ్డి అప్పారావు, వాసు అరెస్ట్ -
కేంద్రంపై విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల ఆగ్రహం.. సింహాచలానికి పాదయాత్ర..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉక్కు ఉద్యమం ఉధృతమవుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై 24 గంటల్లో మాట మార్చిన కేంద్ర ప్రభుత్వం తీరుపై కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తీరును నిరసిస్తూ.. ఉద్యోగులు మరోసారి రోడ్డెక్కారు. విశాఖ స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ నుంచి సింహాచలం వరకు పాదయాత్ర చేపట్టారు. వీరికి వైఎస్సార్సీపీ శ్రేణులు మద్దతిచ్చాయి. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దని కోరుతున్నారు. చదవండి: చంద్రబాబు నూజివీడు పర్యటనలో అపశ్రుతి.. మహిళలకు విద్యుత్ షాక్.. పట్టించుకోలేదని ఆగ్రహం.. -
విశాఖలో కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం.. ముగ్గురు మృతి..
సాక్షి, విశాఖపట్నం: నగరంలోని పాత రామజోగిపేటలో ఘోర ప్రమాదం జరిగింది. మూడు అంతస్తుల భవనం కుప్పకూలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ కేజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. వారికి ఎమర్జెన్సీ వార్డులో అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. అయితే వారికి ఎటువంటి ప్రాణాప్రాయం లేదని కేజీహెచ్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్ తెలిపారు. వారందరికీ మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామన్నారు. తెల్లవారుజామున 2 గంటలకు ప్రమాదం జరగడంతో తమకేమీ గుర్తులేదని గాపడిన వారు అంటున్నారు. వారు ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోలేని పరిస్థితి నెలకొంది. ఆ భయంతో మాట్లాడలేని పరిస్థితి ఏర్పడింది. -
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని ఎద్దు మృతి..
చింతకాని: సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ వద్ద శనివారం సాయంత్రం అర్ధగంటపాటు నిలిచిపోయింది. విశాఖపట్నం వెళ్తున్న ఈ రైలు నాగులవంచ రైల్వేస్టేషన్ సమీపంలోకి వచ్చేసరికి.. పట్టాలపైకి వచ్చిన ఎద్దును ఢీకొంది. ఎద్దు అక్కడికక్కడే మృతి చెందగా, రైలు ఇంజిన్ ముందు భాగం కొంతమేర దెబ్బతింది. దీంతో రైలును నిలిపివేసిన లోకో పైలట్లు.. లోపాన్ని సరిదిద్దాక అర్ధగంట అనంతరం బయలుదేరారు. చదవండి: గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో సీఎం కేసీఆర్‌కు వైద్య పరీక్షలు.. -
AP Global Investors Summit రెండో రోజూ: వ్యాపార ప్రముఖుల ఫోటోలు
-
ఏపీకి పెట్టుబడుల వరద.. శాఖల వారీగా వివరాలు ఇలా..
సాక్షి, విశాఖపట్నం: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023లో ఏపీకీ పెట్టుబడుల వరద పారింది. రెండు రోజుల్లో 13 లక్షల 5వేల 663 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. మొత్తం 352 ఎంఓయూలు జరిగాయి. శాఖలవారీగా పెట్టుబడుల వివరాలు ఇలా.. ► ఎనర్జీ విభాగంలో రూ.9 లక్షల 7వేల 126 కోట్లు ► ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ విభాగంలో రూ.3లక్షల 35వేల 644 కోట్లు ► ఐటీ అండ్ ఐటీఈఎస్ విభాగంలో రూ.39వేల 636 కోట్లు ► పర్యాటక విభాగంలో రూ.22వేల 96కోట్లు ► వ్యవసాయ విభాగంలో రూ.1,160 కోట్లు ► పశుసంవర్ధక విభాగంలో రూ.1,020 కోట్లు జీఐఎస్ విజయానికి కృషి చేసిన వారందరికీ సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పెట్టుబడుల ద్వారా 6లక్షల 3వేల 223 మందికి ఉపాధి లభించనున్నట్లు తెలిపారు. గత మూడున్నరేళ్లలో ఏపీ ఆర్థికంగా ముందడుగు వేస్తోందని చెప్పారు. పారదర్శక పాలనతోనే విజయాలు సాధిస్తున్నామన్నారు. చదవండి: విశాఖ జీఐఎస్ సూపర్ సక్సెస్.. ఇండస్ట్రీస్ మ్యాప్‌లో ఏపీ సుప్రీం -
AP Global Investors Summit: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సంతోషిస్తున్నాం
విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా జరుగుతోంది. అనేక మంది దిగ్గజ పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు ఈ సదస్సుకు తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలు, పరిశ్రమల ఏర్పాటుకు వైఎస్ జగన్ ప్రభుత్వం కల్పిస్తున్న స్నేహపూర్వక వాతావరణంతో అనేక కంపెనీలు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. రిలయెన్స్ గ్రూపు, ఆదానీ గ్రూప్, ఆదిత్య బిర్లా గ్రూప్, రెన్యూ పవర్, అరబిందో గ్రూప్, డైకిన్, ఎన్టీపీసీ, ఐఓసీఎల్, జిందాల్ గ్రూప్, మోండలీస్, పార్లీ, శ్రీ సిమెంట్స్ వంటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయడంతో పాటు మరికొన్ని తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి రాష్ట్రంలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో పాల్గొన్న పలువురు పారిశ్రామిక వేత్తలు సదస్సును ప్రశంసిస్తూ ట్వీట్లు చేశారు. ఏపీ ప్రభుత్వంతో తాము ఎంఓయూలు కుదుర్చుకున్న విషయాన్ని తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సంతోషిస్తున్నామంటూ ట్విటర్ ద్వారా తెలియజేశారు. Happy to announce that we have signed an MoU with the Andhra Pradesh Govt to set up a 3 MTPA steel plant near Krishnapatnam Port. This plant will provide employment to 10,000 people & will strengthen our association with Andhra Pradesh & its people. #APGlobalInvestorsSummit pic.twitter.com/c7HQPt7LRF — Naveen Jindal (@MPNaveenJindal) March 3, 2023 Proud to represent our chairman @gautam_adani and group @adanionline at #APGIS2023 . @APSEZ will add 100 Million tonnes of new capacity at gangavaram and Krishnapattanam. @AdaniGreen will add 15 GW of renewable plant. @AmbujaCementACL will add 10 MMT of cement in AP state. — Karan Adani (@AdaniKaran) March 3, 2023 ReNew is at the Advantage AP: Global Investors Summit 2023. More information to follow!@Advantage_APGov #APGIS2023 pic.twitter.com/V15yRf8tKB — ReNew (@ReNewCorp) March 3, 2023 -
అచ్చెన్నాయుడు ఇప్పుడే నిద్రలేచారా?: మంత్రి అమర్నాథ్
సాక్షి, విశాఖపట్నం: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు పెట్టుబడిదారుల నుంచి వచ్చిన స్పందనే తమ ప్రభుత్వ పారిశ్రామిక విధానమని మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. కేవలం సంవత్సరం, రెండు సంవత్సరాల్లోనే సాకారమయ్యేలా ఎంఓయూలు కుదుర్చుకున్నట్లు ఆయన వెల్లడించారు. రికార్డు స్థాయిలో తొలి రోజు రూ.11.87 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు తెలిపారు. ఈ రెండు రోజుల సదస్సు ద్చారా రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువస్తున్నామని గర్వంగా చెబుతున్నామన్నారు. వీటి ద్వారా 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలుంటాయన్నారు. కేవలం సీఎం జగన్ బ్రాండ్ వల్లే ఏపీకి ఈ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయని స్పష్టంచేశారు. 14 రంగాలలో ఫోకస్ చేద్దామనుకున్నప్పటికీ 20 రంగాలలో పెట్టుబడులు వచ్చాయి. దేశ, విదేశాల ప్రముఖులకు తమ ప్రభుత్వం ఇచ్చిన నమ్మకం వల్లే పెట్టుబడుల ప్రవాహం వచ్చింది. ఏపీకి సహజ వనరులు ఎన్నో ఉన్నాయి. రాష్ట్ర అభివృద్దికి సీఎం వైఎస్ జగన్ నిరంతరం కృషి చేస్తున్నారు. శనివారం ఉదయం 10 గంటల నుంచి రెండో రోజు సదస్సు ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ‘‘ఏపీకి వచ్చిన పెట్టుబడులపై ఫాలో అప్ ఉండాలని సీఎం జగన్ సూచించారు. ప్రభుత్వానికి మరింత బాధ్యత పెరిగింది. కోవిడ్ వల్ల రెండేళ్ల పాటు ఈ తరహా సమావేశాలు నిర్వహించలేకపోయాం. టీడీపీ హయాంలో చేసుకున్న ఎంఓయూలలో పది శాతం మాత్రమే ప్రారంభమైతే సీఎం జగన్ హయాంలో ఇప్పటి వరకు 80 నుంచి 90 శాతం ప్రారంభమయ్యాయి. ఈ సమ్మిట్ లో చేసుకున్న ఎంఓయూలు నూరు శాతం ప్రారంభమవుతాయి.’’ అని అమర్నాథ్ పేర్కొన్నారు. అలాగే సమ్మిట్‌పై టీడీపీ నాయకులు చేస్తున్న విమర్శలపై అమర్నాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'అచ్చెన్నాయుడు ఇపుడే నిద్రలేచారా?. అంబానీ, అదానీ, దాల్మియా, బజాంకాలని ఆయన ఎపుడైనా చూశాడా?. ఈ సమ్మిట్‌కు వచ్చిన అనూహ్య స్పందనపై ప్రశంసించకపోయినా పర్వాలేదు, కానీ తప్పుడు విమర్శలేంటి?' అంటూ నిప్పులు చెరిగారు. చదవండి: 'కేంద్రం నుంచి ఏపీకి సంపూర్ణ సహకారం.. రోడ్ కనెక్టివిటీ పెంచేందుకు రూ.20వేల కోట్లు..' -
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ఘనంగా ఏర్పాట్లు (ఫొటోలు)
-
Global Investors Summit:గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ఘనంగా ఏర్పాట్లు
విశాఖపట్నంలో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కి వచ్చే అతిథులకు ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. కేంద్ర మంత్రులు, పారిశ్రామిక దిగ్గజాల కోసం హెలికాప్టర్లు, లగ్జరీ కార్లను ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. వీవీఐపీలు, వీఐపీల కోసం నగరంలోని ప్రముఖ హోటళ్లలో దాదాపు 800 గదులని సిద్దం చేశారు. జీఐఎస్ కి వచ్చే దేశ విదేశీ ప్రతినిధులు సంఖ్య పెరుగుతుండగా వాహనాలు, వసతులకు డిమాండ్ ఏర్పడింది. సాక్షి, విశాఖపట్నం: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పారిశ్రామిక వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఏపీలో సుధీర్ఘమైన తీరప్రాంతం, విస్తృతమైన వనరులు దేశంలో ఎక్కడా లేని విధంగా 70శాతం మానవ వనరులు, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ పాలసీలు కారణంగా పెట్టుబడులు పెట్టేందుకు దేశీయ దిగ్గజ కంపెనీలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల విస్తరణ, నూతన పరిశ్రమల ఏర్పాటుకు సంసిద్ధం అవుతున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యమంత్రి సమక్షంలో విశాఖ వేదికగా జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు కీలక ఎంవోయూలకు వేదికగా నిలవబోతోంది. ఈ సమ్మిట్‌కి 35 మంది టాప్ ఇండస్ట్రీయలిస్టులు... 25 దేశాలకు చెందిన వ్యాపార ప్రతినిధులు, హైకమిషనర్లు తరలిరానున్నారు. రెండు రోజుల సమ్మిట్ కోసంఇప్పటికే 12,000కుపైగా రిజిస్ట్రేషన్స్ జరిగాయంటే స్పందన ఏ స్ధాయిలో ఉందో అర్ధంచేసుకోవచ్చు. దీంతో అతిథుల కోసం ఏర్పాటు చేసిన వసతి, రవాణా సౌకర్యాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సమ్మిట్‌లో పాల్గొవడానికి అంబానీ, అదానీ, మిట్టల్, బజాజ్, ఆదిత్య బిర్లా, జీఎంఆర్ తదితర పారిశ్రామిక దిగ్గజాలు 16 ప్రత్యేక విమానాల్లో విశాఖ వస్తున్నారు. అలాగే కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్ రెడ్డి తదితరులు వస్తున్నారు. కేంద్ర మంత్రులని ఎయిర్ పోర్టు నుంచి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతున్న ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్స్ తీసుకుని రావడం కోసం రెండు హెలికాప్టర్లు సిద్ధం చేశారు. అలాగే ముఖేష్ అంబానీ, నవీన్ జిందాల్, మిట్టల్,అదానీ వంటి పారిశ్రామిక వేత్తలను దృష్టిలో ఉంచుకొని ఖరీదైన లగ్జరీ కార్లను రప్పిస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్తల కోసం దాదాపు 30కి పైగా బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి ఖరీదైన వాహనాలను అధికారులు సిద్దం చేశారు. అలాగే 25 దేశాలకి చెందిన సుమారు 50 మంది విదేశీ ప్రతినిధులు, హై కమిషనర్ల కోసం కూడా లగ్జరీ కార్లు రెంట్‌కు తీసుకుంటున్నారు. మొత్తంగా దాదాపు 800 మందికి పైగా విఐపీలు వస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం దాదాపు 800 వాహనాలని విశాఖ జిల్లా యంత్రాంగం అందుబాటులో ఉంచుతోంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కి వచ్చే వీవీఐపీలకి ప్రొటోకాల్ ప్రకారం భధ్రత కల్పించడంతో పాటు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని విశాఖ కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున తెలిపారు. విశాఖలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రెండు రోజుల పాటే జరగనున్నప్పటికీ నగరంలోని అన్ని ప్రముఖ హోటళ్లలో గదులు 6వ తేదీ వరకు ఫుల్ అయ్యాయి. జీఐఎస్ సదస్సుకి వచ్చే వీవీఐపీలు, వీఐపీల కోసం దాదాపు 800 పైగా గదులని అధికారులు సిద్దం చేశారు. కేంద్ర మంత్రులు పారిశ్రామిక దిగ్గజాలు, విదేశీ ప్రతినిధులు, డిప్యూటీ హైకమిషనర్లకి రాడిసన్ , నోవాటెల్, పార్క్ లాంటి స్టార్ హోటళ్లలో గదులు సిద్దం చేశారు. ఈ సమ్మిట్‌కి దాదాపు 15 వేల మంది ప్రతినిధులు వస్తుండగా దీనికి బందోబస్తు కోసం దాదాపు ఆరేడు వేల మంది పోలీసులు వస్తుండటంతో వైజాగ్ లో హోటళ్లు మొత్తం ఫుల్ అయిపోయాయి. స్టార్ రేటింగ్స్ ఉన్న హోటళ్లలో సుమారు 1500 రూములు బుక్కయ్యాయి. ఇక వచ్చే అతిథలకి లోటుపాట్లు రాకుండా జిల్లా యంత్రాంగం 12 బృందాలని నియమించింది. విశాఖ ఎయిర్ పోర్టులో దిగిన దగ్గర నుంచి వారిని హోటల్స్‌కి చేర్చడం, అక్కడ నుంచి సమ్మిట్ జరిగే ప్రాంతానికి చేరవేయడం...తిరిగి ఎయిర్ పోర్టుకి తీసుకెళ్లే వరకు పలు విభాగాల ఉద్యోగులకి బాధ్యతలు అప్పగించారు. విశాఖ ఎయిర్ పోర్టులో, హోటళ్ల వద్ద, సమ్మిట్ వద్ద కూడా హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. మరోవైపు సమ్మిట్ కోసం వచ్చే ప్రతినిధుల సంఖ్య అంచనాలకు మించి పోతోందని రిజిస్ట్రేషన్లను బట్టి అర్థం అవుతోంది. దీంతో వచ్చే అతిథులకు రవాణా, వసతి సౌకార్యాల్లో ఎటువంటి లోపం రాకూడదని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికారులకి ఆదేశాలిచ్చింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: సీఎం జగన్ ఇంటర్వ్యూ: వనరులు పుష్కలం.. అవకాశాలు అపారం -
ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో నిర్వహించనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023 (జీఐఎస్) రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. సచివాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జీఐఎస్ వెబ్‌సైట్‌ను ప్రారంభించి బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అమరనాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కీలకమైన 12 రంగాల్లో దేశీయ, విదేశీ పెట్టబడులను పెద్ద ఎత్తున ఆకర్షించేవిధంగా ఈ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళా శాల గ్రౌండ్స్‌లో జరిగే ఈ సమ్మిట్‌కు సంబంధించిన లో గోను ఇప్పటికే సీఎం ఆవిష్కరించారని గుర్తుచేశారు. దీనికి విస్త్రత ప్రచారం కల్పించే విధంగా ప్రకటనలు ఇవ్వనున్నట్లు తెలిపారు. సీఎంగా జగన్ పదవి చేపట్టిన తర్వాత విజయవాడలో వివిధ దేశాల రాయబారులతో కలిసి డిప్లమాటిక్ సదస్సు నిర్వహించారని, తర్వాత కరోనాతో పెట్టుబడుల సమావేశాలు నిర్వహించలేక పోయామని చెప్పారు. రాష్ట్రంలోని పెట్టుబడుల అవ కాశాలు, వనరులను వివరిస్తూ తైవాన్, యూఏఈ, జర్మనీ, అమెరికా, జపాన్, దక్షిణ కొరియా దేశాల్లోను, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, అహ్మదాబాద్ వంటి నగరా ల్లోను రోడ్‌షోలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ, మారిటైమ్ రంగాలపై రెండు భారీ సదస్సులను నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. సదస్సులకు ఈవెంట్ పార్టన ర్గా సీఐఐ, నాలెడ్జ్ పార్టనర్‌గా కేపీఎంజీ వ్యవహరించనున్నాయని తెలిపారు. వీటి ప్రచారానికి ఈవెంట్ మేనేజర్ ఏజెన్సీ కోసం టెండర్లు పిలిచామన్నారు. అవకాశం కల్పిస్తే.. ఈ రోజునుంచే విశాఖను రాజధాని చేస్తాం.. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తుకోసం జరుగుతున్న ఈ కార్యక్రమానికి మీడి యాతో సహా అందరూ రాజకీయాలకు అతీతంగా సహ కరించాలని కోరారు. విలేకరుల అడిగిన ప్రశ్నకు బొత్స సమాధానమిస్తూ విశాఖను రాజధాని చేయాలన్నది తమ ప్రభుత్వ విధానమని తెలిపారు. అవకాశం కల్పిస్తే ఈ రోజునుంచే విశాఖను రాజధానిని చేస్తామని చెప్పా రు. అంతకుముందు మంత్రులు రాష్ట్ర పరిశ్రమలు, మౌ లిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్యం, ఐ.టి. శాఖల అధికారులు, సీఐఐ, కేపీఎంజీ అధికారులతో సమావేశమై సమ్మిట్ నిర్వహణకు చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికల్వలవన్, హ్యండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.సునీత, పరిశ్రమలు, వాణిజ్యశాఖ సంచాలకులు జి.సృజన, రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ ఎక్స్అఫిషియో కార్యదర్శి టి.విజయకుమార్‌రెడ్డి, ఐటీ శాఖ కార్యదర్శి సుందర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
ఏపీ: ఆపరేషన్ పరివర్తన్ రెండోదశ సక్సెస్
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో గంజాయి సాగు, అక్రమ రవాణాను నిరోధించడానికి పోలీసు శాఖ కార్యాచరణను వేగవంతం చేసింది. అందుకోసం చేపట్టిన ఆపరేషన్ పరివర్తన్ రెండోదశను కూడా విజయవంతంగా నిర్వహించింది. మొత్తం 650 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేసింది. ఈ సందర్భంగా విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. ఐదు జిల్లాలకు సంబంధించి దాదాపు 2 లక్షల కిలోల గంజాయిని పట్టుకున్నాము. దీనిలో 90 శాతం గంజాయి ఒరిస్సా నుండి వచ్చింది. పరేషన్ పరివర్తన ద్వారా గత ఏడాది 7500 ఎకరాల్లో గంజాయిని నిర్మిలించాము. ఈ ఏడాది 650 ఎకరాల్లో ఆపరేషన్ పరివర్తన ద్వారా గంజాయి నిర్మిలించాము. గంజాయి ధ్వంసం చేసిన 7500 ఎకరాల్లో ఆల్టర్ నేట్ పంటలు వేసుకునేలా ప్రోత్సహించడం జరుగుతుంది. 3500 మందిని గంజాయి కేసుల్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి తరలి రాకుండా 14 చెక్ పోస్టులు ఏర్పాటు చేశాము. ఒరిస్సా పోలీసులతో సమన్వయం చేసుకుంటూ గంజాయి రవాణా అరికడుతున్నాము. ఆపరేషన్ పరివర్తన్ నిరంతర ప్రక్రియ. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి గంజాయి తోటలను నాశనం చేస్తున్నాము. గతంలో కూడా 2 లక్షల ఎకరాల గంజాయిని ధ్వంసం చేశాము. ఆపరేషన్ పరివర్తన్ రెండోదశ విజయవంతం.. ఒడిశా సరిహద్దుల్లోని అత్యంత మారుమూల గిరిజన ప్రాంతాల్లో అక్కడక్కడ గుట్టుగా సాగుతున్న గంజాయి సాగును కూడా పూర్తిగా నిర్మూలించడానికి పోలీసు శాఖ ఆపరేషన్ పరివర్తన్ రెండోదశను తాజాగా విజయవంతంగా పూర్తిచేసింది. ఈ నెలలో ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లోని మారుమూల ప్రాంతాల్లో ఐదురోజులపాటు ఒడిశా అధికారుల సమన్వయంతో ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. మరోవైపు రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణాను పోలీసు శాఖ సమర్థంగా కట్టడి చేసింది. ఒడిశా అధికారులతో కలిసి ఏవోబీ పరిధిలో ఆరుమార్గాల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటుచేసి తనిఖీలు ముమ్మరం చేసింది. ఇలా వివిధ మార్గాల్లో అక్రమంగా రవాణా చేస్తున్న 2,45,832 కిలోల గంజాయిని పోలీసు శాఖ స్వాధీనం చేసుకుంది. అందులో 70 శాతం గంజాయి ఒడిశా నుంచి మన రాష్ట్రం ద్వారా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నదే కావడం గమనార్హం. ఈ విధంగా ఆపరేషన్ పరివర్తన్ కింద ధ్వంసం చేసిన గంజాయి, దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్న గంజాయిని పోలీసు శాఖ దహనం చేస్తోంది. ఏలూరు రేంజ్ పరిధిలో శుక్రవారం కాల్చేసింది. -
ఏపీ మార్కెట్లోకి మధుర ఫలాలు.. అన్ సీజన్లో కిలో మామిడి పండ్లు ఎంతంటే?
సాక్షి, విశాఖపట్నం: నగరంలోకి మామిడి పండ్లు అప్పుడే వచ్చేశాయ్! వేసవిలో వచ్చే మామిడి పండ్లు శీతాకాలంలో రావడమేమిటని ఆశ్చర్యపోకండి! నూజివీడు ప్రాంతంలో ప్రత్యేకంగా పండించిన ఈ మధుర ఫలాలు నగరవాసులకు రుచిచూపించడానికి విచ్చేశాయి. సాధారణంగా ఏప్రిల్ నాటికి మామిడి పండ్లు పక్వానికి వస్తాయి. ఎక్కడైనా ముందుగా కాసిన చోట ఒక నెల ముందు మార్కెట్లో కనిపిస్తాయి. కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా నాలుగైదు నెలల ముందుగానే ఇవి దర్శనమిస్తున్నాయి. అనూహ్యంగా మార్కెట్లో కనిపిస్తున్న ఈ మామిడిని చూసిన వారు ఒకింత ఆశ్చర్య చకితులవుతున్నారు. ప్రస్తుతం విశాఖ మార్కెట్లో బంగినపల్లి, సువర్ణరేఖ, పరియా రకాల మామిడి పండ్లు అందుబాటులోకి ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నూజివీడు ప్రాంతంలో కొంతమంది రైతులు వీటిని ప్రత్యేకంగా పండిస్తున్నారు. మూడు నాలుగు రోజుల నుంచి విశాఖ, గాజువాకలకు చెందిన కొందరు పండ్ల వర్తకులు కొనుగోలు చేసి ఇక్కడకు తెస్తున్నారు. వీటిలో ఏ రకమైనా కిలో రూ.250 చొప్పున పండ్ల బండ్లపై విక్రయిస్తున్నారు. ధర ఎక్కువైనా మామిడి పండ్లపై మోజు పడేవారు అర కిలో, కిలో చొప్పున కొనుగోలు చేస్తున్నారు. సాధారణ సీజనులో వచ్చే మామిడి పండ్లకంటే కాస్త రుచి తక్కువగానే ఉంటున్నా కాలం కాని కాలంలో వీటిని తినడం ఓ తీయని అనుభూతిని కలిగిస్తోందని నగరంలోని శాంతిపురానికి చెందిన ఎంకేఆర్ శర్మ ‘సాక్షి’తో చెప్పారు. రోజుకు అర టన్ను పండ్లు అమ్మకం నూజివీడు ప్రాంతం నుంచి కొనుగోలు చేసిన మామిడి పండ్లను నగరంలోని డైమండ్ పార్క్, ఎల్ఐసీ బిల్డింగ్, సీతమ్మధార రైతుబజార్, ఎంవీపీ కాలనీ, పూర్ణామార్కెట్, గాజువాక తదితర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. రోజుకు నూజివీడు ప్రాంతం నుంచి అర టన్ను (500 క్వింటాళ్ల) మామిడి పండ్లు తెస్తుండగా 90 శాతం అమ్ముడుపోతున్నాయని ఈ పండ్ల వ్యాపారులు చెబుతున్నారు. రోజూ తాను 50 కిలోల మామిడి పండ్లను తెస్తే 40 కిలోలకు పైగా అమ్మకాలు జరుగుతున్నాయని డైమండ్ పార్కు వద్ద బండిపై విక్రయించే పండ్ల వ్యాపారి ఎస్.ఈశ్వరరావు ‘సాక్షి’కి చెప్పారు. మామిడిపండ్లు డిసెంబర్లో మార్కెట్లోకి రావడం ఇదే తొలిసారని, సంక్రాంతి వరకు ఇవి అందుబాటులో ఉంటాయని తెలిపారు. -
విశాఖలో ఉక్కు ఉద్యమం ప్రజా వేదిక..
-
ఈరోజు ఏపీకి, విశాఖకు గొప్పదినం: ప్రధాని మోదీ
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం దేశంలోనే ప్రముఖ నగరం అని.. ఇక్కడి ఓడరేపు చారిత్రకమైందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రక్షణ, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో విశాఖది కీలకపాత్ర అని భరోసా ఇచ్చారాయన. శనివారం ఏయూ గ్రౌండ్స్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘ప్రియమైన సోదరీసోదరులారా.. నమస్కారం..’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు తెలుగులో అభివాదం చేశారు. ఆపై వేదిక మీదున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తదితరులకు అభివాదం తెలిపారు. ‘‘కొన్ని నెలల కిందట విప్లవవీరుడు అల్లూరి జయంతి వేడుకలో పాల్గొనే అవకాశం వచ్చింది. దేశంలో విశేషమైన నగరం ఇది. విశాఖ ఓడరేపు చారిత్రకమైంది. ఇక్కడ నుంచి రోమ్ వరకు వ్యాపారం జరిగేది. ఆరోజు కూడా విశాఖపట్నం ప్రముఖ వ్యాపారం కేంద్రంగా విరజిల్లుతోంది. దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఏపీ ప్రజలకు గుర్తింపు ఉంది. అన్ని రంగాల్లో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. స్వభావ రీత్యా స్నేహపూర్వకంగా ఉంటారు. ప్రతీ రంగంలో మెరుగైన మార్పు కోసం తెలుగు ప్రజలు తపన పడతారు. అలాగే సాంకేతిక వైద్య రంగాల్లో ఏపీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇవాళ రూ. 10వేల కోట్ల ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తున్నాం. ఇవాళ ఏపీకి, విశాఖకు గొప్పదినం. ఇవాళ ప్రారంభించిన ప్రాజెక్టులు.. విశాఖ, ఏపీ ప్రజల అభివృద్ధికి ఎంతో ఉపయోగపడతాయి. విశాఖ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి పరుస్తూనే.. ఫిషింగ్ హార్బర్‌ను ఆధునీకరిస్తాం. తీర ప్రాంతం వేగవంతమైన అభివృద్ధిని సాధిస్తుంది. ఓడరేవుల ద్వారా వేల కోట్లలో వ్యాపారం జరుగుతుంది. విశాఖ ఫిఫింగ్ హార్బర్ అభివృద్ధితో మత్స్యకారుల జీవితాల్లో మార్పు వస్తుంది. దేశాభివృద్ధిలో ఏపీ కీలక భూమిక పోషించనుంది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి మా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది. వెనుకంజ అస్సలు వేయదు అని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఈ క్రమంలో తన ప్రసంగంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కంభంపాటి హరిబాబుల ప్రస్తావన తీసుకొచ్చారు ప్రధాని మోదీ. ఏపీ, వైజాగ్ అభివృద్ధికి ఎంతో దోహదం చేశారని వాళ్లపై ప్రశంసలు గుప్పించారు. ఇప్పుడు చాలా దేశాలు వెనుకంజలో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో భారత్ అభివృద్ధి సాధిస్తోంది. వికాస భారత్ దిశగా మనం దూసుకుపోతున్నాం. ప్రపంచ వ్యాప్తంగా భారత దేశమే అందరికీ ఆశావాహ దృక్పథం ఇస్తోంది. మేధావులు, నిపుణులు భారత్‌ను ప్రశంసిస్తున్నారు. భారత్.. ప్రపంచ దేశాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. రైతులకు ఏటా రూ.6వేల సాయం అందిస్తున్నాం.వెనుకబడిన జిల్లాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. పేదల కోసం సంక్షేమ పథకాలను మరింత విస్తరిస్తున్నాం. అంతరిక్షం నుంచి సముద్ర గర్భం వరకు ప్రతీ అవకాశాన్ని వెతికి పట్టుకుంటాం. మా ప్రతి నిర్ణయం సామాన్యుడి జీవితాన్ని మెరుగు పర్చడం కోసమే అని ప్రధాని మోదీ మరోసారి స్పష్టం చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘‘ఎనిమిదేళ్ల క్రితం తగిలిన అతిపెద్ద గాయం నుంచి మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఇంకా కోలుకోలేదు. విభజన హామీల్లో పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకూ.. స్టీల్‌ప్లాంట్ నుంచి రైల్వే జోన్ దాకా పలు అంశాలపై అనేకసార్లు విజ్ఞప్తులు చేశాం. మీరు (ప్రధాని మోదీ) సహృదయంతో వాటిని సానుకూలంగా పరిష్కరించాలని కోరుతున్నాం. రాష్ట్ర ప్రయోజనాలు మినహా మా ప్రభుత్వానికి మరో అజెండా లేదు.. ఉండదు.. ఉండబోదు’’ అని సీఎం జగన్ స్పష్టం చేశారు. శనివారం విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో విభజన హామీలను నెరవేర్చాలంటూ ప్రధాని మోదీని సీఎం జగన్ మరోసారి కోరారు. తొలుత వేదికపైకి ప్రధానికి సాదరంగా స్వాగతం పలుకుతూనే.. రాష్ట్ర పరిస్థితులు, చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కేంద్రం అందించాల్సిన సహాయ సహకారాలు, దీర్ఘకాలంగా ప్రజల ఆకాంక్షలను ఆయన ముందుంచారు. ఉత్తరాంధ్ర గడ్డపై నడయాడిన అభ్యుదయ వాదులు గురజాడ అప్పారావు, శ్రీశ్రీ, వంగపండు సూక్తులను తన ప్రసంగంలో సీఎం జగన్ ప్రస్తావించారు. ఆ వివరాలివీ.. పున్నమి కెరటాలకు మించి.. ఇక్కడకి వచ్చిన ప్రజలను చూస్తుంటే ప్రజాకవి, గాయకుడు వంగపండు మాటలు, పాటలు గుర్తుకొస్తున్నాయి. ‘ఏం పిల్లడో ఎల్దామొస్తవా..!’ అంటూ ఈ రోజు మనం తలపెట్టిన ఈ మహాసభకు ఉత్తరాంధ్ర జనం ప్రభంజనంలా కదలి రావడం కనిపిస్తోంది. ఈ రోజు చారిత్రక ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో ఒకవైపు సముద్రం కనిపిస్తోంది. మరోవైపు జన సముద్రాన్ని తలపిస్తోంది. కార్తీక పౌర్ణమివేళ ఎగసిపడిన కెరటాలకు మించి జన కెరటాలు ఇక్కడ ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. దేశ ప్రగతి రథసారధి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రివర్యులకు, లక్షలాదిగా తరలి వచ్చిన నా అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, అవ్వా తాతలకు ప్రభుత్వం తరపున ఉత్తరాంధ్ర గడ్డ మీద విశాఖలో సాదరంగా స్వాగతం పలుకుతున్నా. ఆకాంక్షలకు అద్దం.. దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అని చాటి చెప్పిన విజయనగరం వాసి, మహాకవి గురజాడ మాటలు మనందరికీ కర్తవ్య బోధ చేస్తున్నాయి. ప్రజల ఆకాంక్షలకు ఇక్కడకు తరలి వచ్చిన జన సాగరం అద్దం పడుతోంది. ఇదే నేలమీద నడయాడిన మహాకవి శ్రీశ్రీ మాటల్లో చెప్పాలంటే ‘‘వస్తున్నాయ్.. వస్తున్నాయ్.. జగన్నాథ రథ చక్రాలొస్తున్నాయ్..’’ అంటూ కదలివస్తున్న లక్షల జనసందోహం మన ఎదుట కనిపిస్తోంది. దాదాపు రూ.10,742 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్న ప్రధాని మోదీకి అశేష జనవాహిని తరపున, రాష్ట్ర ప్రజలందరి తరపున నిండు మనసుతో కృతజ్ఞతలు. ప్రతి కుటుంబం నిలదొక్కుకునేలా.. ప్రజల ప్రభుత్వంగా గత మూడున్నరేళ్లలో పిల్లల చదువులు, వైద్యం, రైతుల సంక్షేమం, సామాజిక న్యాయం, మహిళా సంక్షేమంతో పాటు అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించాం. వికేంద్రీకరణ, పారదర్శకత కోసం గడప వద్దకే పరిపాలన లాంటివి మా ప్రాధాన్యతలుగా అడుగులు వేశాం. ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలదొక్కుకోవడం అంటే ఈ రాష్ట్రంలోని ప్రతి గ్రామం, ప్రతి ఇల్లు, ప్రతి ఒక్క కుటుంబం నిలదొక్కుకోవడమే అని నమ్మి ఇంటింటా ఆత్మ విశ్వాసాన్ని నింపడానికి మా ఆర్థిక వనరుల్లో ప్రతి రూపాయినీ సద్వినియోగం చేశాం. ఒక రాష్ట్ర ప్రభుత్వంగా శక్తి మేరకు మేం చేస్తున్న ప్రయత్నాలకు కేంద్రం మరింత సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నా. ప్రతి రూపాయీ పునర్నిర్మాణానికే.. ఎనిమిదేళ్ల క్రితం తగిలిన అతిపెద్ద గాయం నుంచి మా రాష్ట్రం ఇంకా కోలుకోలేదు. మా గాయాలు మానేలా, మా రాష్ట్రం జాతీయ స్రవంతితో కలసి అభివృద్ధి చెందడానికి వీలుగా విశాల హృదయంతో మీరు కేటాయించే ప్రతి సంస్థ, అదనంగా ఇచ్చే ప్రతి రూపాయీ ఏపీ పునర్నిర్మాణానికి గొప్పగా ఉపయోగపడుతుంది. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని ఏపీ కోసం చేసే ఏ మంచి పనైనా రాష్ట్ర ప్రజానీకం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది. కేంద్ర ప్రభుత్వంతో గానీ, ప్రత్యేకంగా ప్రధాని మోదీతో గానీ మా అనుబంధం పార్టీలకు, రాజకీయాలకతీతం. ఏపీకి, రాష్ట్ర ప్రజలకు గత ప్రభుత్వాలు చేసిన అన్యాయాలను ఇక్కడి ప్రజలు గుర్తు పెట్టుకున్నారు. డీజీపీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభినందన ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసిన డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని సీఎం జగన్ శనివారం అభినందించారు. విశాఖలో ప్రధాని రెండు రోజుల పర్యటన సందర్భంగా డీజీపీ.. సీనియర్ ఐపీఎస్‌ల నేతృత్వంలో పకడ్బందీగా భద్రతా చర్యలు చేపట్టారు. డీజీపీ పర్యవేక్షణలో తగిన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాని నగర పర్యటన, రోడ్ షోకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బహిరంగ సభకు లక్షలాది మంది ప్రజలు హాజరైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖను సీఎం అభినందించారని డీజీపీ కార్యాలయం వెల్లడించింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ముగిసిన పీఎం నరేంద్ర మోదీ విశాఖ పర్యటన
అప్డేట్స్ 11:30AM ముగిసిన పీఎం ప్రధాని మోదీ విశాఖ పర్యటన 10:44AM ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం ►తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ ►ప్రియమైన సోదరీ సోదరమణులకు స్వాగతం ►కొద్ది రోజుల క్రితం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జన్మదిన వేడుకలో పాల్గొనే అదృష్టం కలిగింది ►ఈరోజు ఏపీకి, విశాఖకు గొప్పదినం ►విశాఖ దేశంలోనే విశేషమైన నగరం ►విశాఖ ఓడరేవు చారిత్రాత్మకమైనది ►ఇక్కడ నుంచి రోమ్ వరకూ వ్యాపరం జరిగేది ►ఈరోజు కూడా విశాఖపట్నం ప్రముఖ వ్యాపార కేంద్రం ►ఈరోజు ప్రారంభించే రూ. 10 వేల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులతో విశాఖ, ఏపీ ప్రజలకు ఎంతో అభివృద్ధి జరుగుతుంది ►ఈ ప్రాజెక్టులతో ఏపీ అభివృద్ధి కొత్త శిఖరాలకు చేరుతుంది ►దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఏపీకి ప్రజలకు ప్రత్యేక గుర్తింపు ఉంది ►తమ స్వభావంలో సౌమ్యులైన ఏపీ ప్రజలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను కనబరుస్తున్నారు ►కేవలం సాంకేతిక పరిజ్ఞానం, వృత్తిపరమైన గుర్తింపు మాత్రమే కాదు..తెలుగు ప్రజలకు స్నేహ శీలత సహద్భావం వల్లే ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ►తెలుగు ప్రజలు ప్రతి రంగంలో మెరుగైన మార్పు కోసం తపన పడతారు ►మౌలిక వసుతల కల్పనలో మేమెప్పుడూ వెనక్కి తగ్గలేదు ►మౌలిక వసతుల అభివృద్ధి అన్ని రంగాల పురోగతిని వేగవంతం చేస్తోంది ►ఒకవైపు విశాఖ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి పరుస్తూనే మరోవైపు ఫిషింగ్ హార్బర్‌ను ఆధునీకరిస్తున్నాం ►మౌలిక వసతుల కల్పనతోనే ఏపీ తీర ప్రాంతం వేగవంతమైన అభివృద్ధి సాధిస్తుంది ►విశాఖ ఫిషింగ్ హార్బర్ అభివృద్ధితో మత్స్యకారుల జీవితాల్లో మార్పు వస్తుంది ►ప్రపంచ వ్యాప్తంగా భారతదేశమే అందరికీ ఆశావహ దృక్పథం ఇస్తోంది ►మా ప్రతి నిర్ణయం సామాన్యుడి జీవితాన్ని మెరుగు పర్చడం కోసమే ►ఒక వైపు మేం చేసిన అభివద్ధితో దేశంలో పెట్టబడులు పెరుగుతున్నాయి ►మరోవైపు పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలను మరింత విస్తరిస్తున్నాం ►రైతులకు ఏటా రూ. 6 వేల ఆర్థిక సాయం అందిస్తున్నాం ►అంతరిక్షం నుంచి సముద్ర గర్భం వరకు ప్రతి అవకాశాన్ని వెతికి పట్టుకుంటాం 10: 25AM సీఎం వైఎస్ జగన్ స్పీచ్ ►దేశ ప్రగతి రథసారథి ప్రధాని నరేంద్ర మోదీ గారికి స్వాగతం ►ఏయూలో జన సముద్రం కనిపిస్తోంది ►ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కెరటాల్లా జనం ఇక్కడికి తరలివచ్చారు ►వంగపండు పాట ఏం పిల్లడో ఎల్లమొస్తవా అనే పాటలా జనం తరలివచ్చారు ►జగన్నాథ రథచక్రాలు ఇక్కడికి కదిలి వచ్చాయి ►10,742 కోట్ల ప్రాజెక్టులు ప్రారంభిస్తున్న ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రజలు, అశేష జనం తరఫున ధన్యవాదాలు ►కేంద్ర ప్రభుత్వంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతమైంది ►మాకు మరో ఎజెండా లేదు.. ఉండబోదు ►రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకూ మీకు చేసిన విజ్ఞప్తులను పరిష్కరించాలని మరోసారి కోరుతున్నాం ►గత మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో విద్య, వైద్యం, సంక్షేమం, మహిళా అభివృద్ధి, పారదర్శకమైన గడప వద్దకే పాలన ప్రాధాన్యతగా అడుగులు ముందుకు వేస్తున్నాం ►ప్రతి కుటుంబం నిలదొక్కుకునేందుకే మా ఆర్థిక వ్యవస్థలో ప్రతి రూపాయి ఖర్చు చేశాం ►పెద్దలు సహృదయలైన మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి ►ఎమిమిదేళ్ల క్రితం తగిలిన అతిపెద్ద గాయం ఇంకా మానలేదు ►మీరు మా రాష్ట్రానికి చేసే ప్రతి సాయం మా రాష్ట్రానికిచ్చే ప్రతి సంస్థ, ప్రతి రూపాయి, మా అభివృద్ధికి దోహద పడుతాయి ►విభజన హామీలైన పోలవరం, రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ప్రత్యేక హోదా వరకు అన్ని హామీలు పూర్తి చేయాలని కోరుతున్నాం 10: 20AM ►నమస్కారం.. అంటూ తెలుగులో ప్రజలకు అభివాదం ద్వారా ప్రసంగం ప్రారంభించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అద్భుత ప్రగతి సాధిస్తోంది. రైల్వే శాఖ ఆధునీకరణదిశగా దూసుకెళ్తోంది.. ప్రధాని మోదీకి శాలువ కప్పి గౌరవించిన సీఎం జగన్.. రాముడి చిత్రం బహుకరణ 10:18AM ►సభా వేదికపైకి చేరుకున్న ప్రధాని మోదీ, గవర్నర్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ 10:14 AM ►రోడ్లు, రైల్వే ప్రాజెక్టుల నమునాలను పరిశీలించిన ప్రధాని మోదీ. 10:09 AM ► ఏయూ ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ. వెంట ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ ఉన్నారు. ► కాసేపట్లో విశాఖ ఆంధ్రా యూనివర్శిటీ సభా ప్రాంగణానికి చేరుకోనున్న ప్రధాని మోదీ. ► రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో ఏయూలో నిర్వహించబోయే ఈ భారీ బహిరంగ సభకు జనం పోటెత్తారు. ► ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో నగరంలో భారీ భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. ఉదయం నుంచే ట్రాఫిక్ ఆంక్షలను పటిష్టంగా అమలు చేస్తున్నారు. మరోవైపు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పహారా కాస్తున్నారు. ► సుమారు రూ.10,742 కోట్లతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు ఇప్పటికే పూర్తి అయిన ప్రాజెక్టులను జాతికి అంకితం. ప్రాజెక్టుల వివరాలు.. ► రూ. 460 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు ► రూ. 3,778 కోట్లతో రాయిపూర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ గ్రీన్ ఫీల్డ్ హైవే ► రూ. 566 కోట్లతో కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలా నగర్ వరకు రోడ్డు నిర్మాణం ► రూ. 152 కోట్లతో విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ పనులు ► రూ. 2658 కోట్లతో గెయిల్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం అంగుల్ గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టుకు నిర్మాణ పనులకు శంకుస్థాపన ► రూ. 211 కోట్లతో నరసన్నపేట పాతపట్నం రహదారి అభివృద్ధి పనులు జాతికి అంకితం ► రూ. 2,917 కోట్లతో నిర్మించిన ఓఎన్జీసీ యు ఫీల్డ్ ఆన్ షోర్ డీప్ వాటర్ బ్లాక్ ప్రాజెక్ట్ జాతికి అంకితం -
ప్రధాని విశాఖ సభ: కని విని ఎరుగని రీతిలో ప్రజానీకం
సాక్షి, విశాఖపట్నం: ప్రధాని నరేంద్ర మోదీ నగర పర్యటనలో భాగంగా సభలో పాల్గొనేందుకు పోటెత్తారు జనాలు. విశాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ బహిరంగ సభ నిర్వహించాలనే ఉద్దేశంతో.. ఏపీ ప్రభుత్వం జనసమీకరణ చేపట్టింది. ఈ సభకు కనివినీ ఎరుగని రీతిలో సుమారు మూడు లక్షల మంది ప్రజలు హాజరైనట్లు తెలుస్తోంది. బస్సులు, రైళ్లు, ప్రత్యేక వాహనాల్లో జనాలను సభకు తరలించారు. సభకు వచ్చిన దగ్గర నుండి మళ్లీ తిరిగి వెళ్లే వరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే 1.10 లక్ష మందికి ఆహారం సిద్ధం చేస్తున్నారు అధికారులు. ప్రధాని సభకు హాజరయ్యే వాహనదారులకు సూచనలు ► శ్రీకాకుళం విజయనగరం జిల్లా నుంచి ప్రధాని సభకు వచ్చే వాహనాలు మారికవలస.. తిమ్మాపురం.. కురుపాం సర్కిల్ నుంచి చిన వాల్తేరు మీదుగా ఏయూ గ్రౌండ్స్ కి చేరుకోవాలి ► భీమిలి నుంచి వచ్చే వాహనాలు మారి వలస తిమ్మాపురం జోడుగుల పాలెం చిన్న వాల్తేరు మీదుగా కృష్ణదేవరాయలు అతిథి గృహానికి చేరుకోవాలి ► మాడుగుల నుంచి వచ్చే రూట్ నెంబర్ 170 వాహనాలు పినగాడి వేపగుంట హనుమంతవాక కళాభారతి మీదుగా ఏయూ గ్రౌండ్స్ కు చేరుకోవాలి ► పెందుర్తి ఎస్ కోట చోడవరం నుంచి వచ్చే వాహనాలు అడవివరం శివాజీ పార్క్ మీదుగా రామలక్ష్మి అపార్ట్మెంట్ వద్ద ప్రజలను దించి నిర్దేశించిన ప్రదేశంలో పార్కింగ్ చేయాలి ► నర్సీపట్నం పాయకరావుపేట ఎలమంచిలి అనకాపల్లి నుంచి వచ్చే వాహనాలు ఎన్ ఎ డి కొత్త రోడ్.. తాటి చెట్ల పాలెం గురుద్వారా మీదుగా మద్దిలపాలెం వద్ద ప్రజలను దించాలి ► విశాఖ సౌత్ నుంచి బయలుదేరే ప్రజలు జ్ఞానాపురం ...ఫిషింగ్ హార్బర్ పార్క్ హోటల్ జంక్షన్ నుంచి చిన్న వాల్తేరు మీదుగా ఏయూ గ్రౌండ్స్ కి చేరుకోవాలి ► విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన ప్రజల వాహనాలు అప్పు ఘర్ మీదుగా ఆర్‌సిడి ఆసుపత్రి వద్ద వాహనాలను పార్కింగ్ చేయాలి ► వీఐపీలు తమ వాహనాలను నోవాటెల్... సర్క్యూట్ హౌస్ ...సెవెన్ హిల్స్ జంక్షన్ ఆసిల్ మెట్ట.. స్వర్ణ భారతి స్టేడియం నుంచి మద్దిలపాలెం వద్ద ఏయూ గ్రౌండ్స్ కి చేరుకోవాలి. ఇదీ చదవండి: ప్రధాని పర్యటన.. ట్రాఫిక్ ఆంక్షలు ఇదిగో.. -
ప్రధాని పర్యటన.. వైజాగ్‌లో ట్రాఫిక్ ఆంక్షలివే
సాక్షి, విశాఖపట్నం: ప్రధాని నరేంద్ర మోదీ వైజాగ్ పర్యటన నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలు అవుతున్నాయి. ప్రధాని సభ సందర్భంగా 8,600 మంది పోలీస్ సిబ్బందితో భద్రత ఏర్పాట్లు. ఏయూ సభా ప్రాంగణం వద్ద ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణ లో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. ► ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్ పరిసరాల్లో ఈ రోజు సాధారణ వాహనాల రాకపోకల నిషేధం విధించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 వరకు శ్రీకాకుళం విజయనగరం నుంచి విశాఖ మీదుగా వెళ్లే వాహనాలు ఆనందపురం సబ్బవరం మీదుగా మళ్లిస్తారు. ► అనకాపల్లి నుంచి శ్రీకాకుళం వెళ్లే వాహనాలు లంకెలపాలెం సబ్బవరం పెందుర్తి మీదగా మళ్లింపు ఉంటుంది. ► శనివారం మధ్యాహ్నం మూడు వరకు మద్దిలపాలెం, ఆంధ్ర యూనివర్సిటీ .. పెదవాల్తేరు . కురుపాం సర్కిల్... స్వర్ణ భారతి స్టేడియం.. పరిసరాల్లో పూర్తిగా సాధారణ వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. ► అలాగే జ్ఞానాపురం హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ కు సెలవు ప్రకటించిన మార్కెట్ కమిటీ. ప్రధాని సభకు మూడు లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం 8 నుంచి 11 మధ్య అత్యవసరమైతే బయటకు రండి. ఆ సమయంలో ప్రధాని సభకు వెళ్లే ప్రజల వాహనాలకు ప్రాధాన్యత ఇస్తాం. ప్రధాని సభకు వెళ్లే వాహనాలకు రూట్ మ్యాప్ ఇచ్చాం..వీటిని కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షిస్తూ ఉంటాం. ప్రధాని సభకు వెళ్లే వీఐపీలకు గ్రీన్ ఛానల్ రూట్ ఏర్పాటు చేసినట్లు సీపీ శ్రీకాంత్ వెల్లడించారు. -
బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం!.. పలుచోట్ల వర్షాలు
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి/వాకాడు: నైరుతి బంగాళాఖాతంలో ఈశాన్య శ్రీలంక వద్ద కొనసాగుతున్న అల్పపీడనం శుక్రవారం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. దీనికి అనుబంధంగా సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం తెలిపింది. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో శని, ఆదివారాల్లో రాయలసీమ, దక్షిణ æకోస్తాంధ్రల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి వానలు కురుస్తాయని, ఆదివారం పొడి వాతావరణం నెలకొంటుందని వివరించింది. కోస్తా తీరం వెంబడి గంటకు 40–45, గరిష్టంగా 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, శనివారం మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని సూచించింది. అల్పపీడన ప్రభావంతో తిరుపతి జిల్లా సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. కెరటాలు ఎగసి పడుతున్నాయి. సముద్రం దాదాపు 10 మీటర్లు వరకు ముందుకు చొచ్చుకొచ్చింది. మరోవైపు ఈనెల 16న ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. చదవండి: ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన సీఎం జగన్ -
ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికిన సీఎం జగన్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి శుక్రవారం విశాఖలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలతో పాటు, మరికొన్నింటిని జాతికి అంకితం చేసేందుకు విశాఖకు చేరుకున్న ప్రధానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘన స్వాగతం పలికారు. ప్రత్యేక విమానంలో రాత్రి 7.55కు ఐఎన్ఎస్ డేగా వద్దకు ప్రధాని చేరుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్, సీఎం, స్పీకర్ తమ్మినేని సీతారాం, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, తూర్పు నావికాదళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర, తదితరులు స్వాగతం పలికారు. సీఎం జగన్ పలువురు మంత్రులను ప్రధానికి పరిచయం చేశారు. అనంతరం మారుతి కూడలి నుంచి ఐఎన్ఎస్ చోళా వరకు బీజేపీ చేపట్టిన శోభాయాత్ర రోడ్ షోలో అడుగడుగునా ప్రధానికి ఆ పార్టీ శ్రేణులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఐఎన్ఎస్ చోళా సూటుకు చేరుకున్న ప్రధానితో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీకి చెందిన కోర్ కమిటీ సభ్యులు వేర్వేరుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్టు తెలిసింది. మరోవైపు సీఎం జగన్మోహన్రెడ్డి పోర్టు గెస్ట్‌హౌస్‌కు రాత్రి 8.43కు చేరుకోగా, నోవాటెల్‌లో గవర్నర్ బస చేస్తున్నారు. అంతకు ముందు ప్రధానికి స్వాగతం పలికేందుకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు కలెక్టర్, కమిషనర్‌తో పాటు ఎంపీలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు. ప్రధానికి స్వాగతం పలికినవారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, విడదల రజని, గుడివాడ అమర్నాథ్, మేయర్ గొలగాని హరివెంకట కుమారి, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, భీశెట్టి సత్యవతి, గొడ్డేటి మాధవి, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పలువురు ఎమ్మెల్యేలు, కలెక్టర్ మల్లికార్జున, సీపీ సీహెచ్ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. 40 నిమిషాల పాటు పీఎం ప్రసంగం! రాష్ట్రంలో రూ.10,742 కోట్లతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులతో పాటు ఇప్పటికే పూర్తి అయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేసేందుకు ఆంధ్రా యూనివర్శిటీ (ఏయూ) గ్రౌండ్స్ ఇప్పటికే సిద్ధమైంది. శనివారం (12వ తేదీ) ఇక్కడ జరిగే బహిరంగ సభలో ప్రధానితో కలిసి గవర్నర్, ముఖ్యమంత్రిలు పాల్గొననున్నారు. ప్రధాని ఐఎన్ఎస్ చోళ నుంచి ఉదయం 10.10 గంటలకు బయలుదేరి 10.30 గంటలకు ఏయూ గ్రౌండ్‌కు రోడ్డు మార్గంలో చేరుకుంటారు. గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కలిసి ప్రధాని రూ.10,742 కోట్ల విలువైన 5 ప్రాజెక్టులకు శంకుస్థాపన, రెండు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. ఈ బహిరంగ సభలో ప్రధాని 40 నిమిషాల పాటు ప్రసంగించనున్నట్లు తెలిసింది. ఇదే సభలో సీఎం వైఎస్ జగన్ కూడా మాట్లాడనున్నారు. 11.45 గంటలకు సభ ముగిసిన అనంతరం ప్రధాని మోదీ.. విశాఖ విమానాశ్రయానికి చేరుకుని 12.05 గంటలకు హైదరాబాద్ బయలుదేరనున్నారు. బీజేపీ శోభాయమాన స్వాగతం సాక్షి, విశాఖపట్నం: విశాఖ పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. శోభాయాత్ర పేరిట నిర్వహించిన రోడ్డు షోలో దారి పొడవునా మోదీ.. మోదీ.. అంటూ నినాదాలు చేశారు. ఎయిర్‌పోర్టు వెనక ఉన్న రోడ్డు మార్గంలోని మారుతి జంక్షన్ నుంచి నేవల్ డాక్ యార్డు వరకు దాదాపు రెండు కిలోమీటర్ల మేర ఈ రోడ్డుషో సాగింది. రోడ్డు పక్కన బీజేపీ జెండాలు, బ్యానర్లు కట్టారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు దారి పొడవునా పెద్ద సంఖ్యలో మోదీ ముఖచిత్రం ఉన్న ప్ల కార్డులను చేతబట్టి నిలుచున్నారు. మోదీ వాహనంపై దారి వెంబడి బీజేపీ కార్యకర్తలు పూల వర్షం కురిపించారు. మోదీ.. మోదీ.. భారత మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. ప్రధాని మోదీ వాహనంలోపలి నుంచి వారికి అభివాదం చేస్తూ చిరునవ్వుతో ముందుకు సాగారు. తొలుత ఈ రోడ్డు షోలో ప్రధాని ఓపెన్ టాప్ వాహనంలో పయనిస్తారని భావించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఆ ఆలోచన విరమించుకున్నారు. ప్రధాని రోడ్డు షో కాన్వాయ్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు అవకాశం కల్పించారు. ఆయనతో పాటు ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీ మాధవ్ పాల్గొన్నారు. ఈ రోడ్డు షో వెనుక బీజేపీ నాయకులు సీఎం రమేష్, పురందేశ్వరి, సుజనా చౌదరి, విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులున్నారు. చదవండి: మూడేళ్లుగా ఏపీ నంబర్ వన్.. ఇదీ మన ఘనత -
విశాఖపట్నం రైల్వేజోన్‌కు ఓకే.. రూ.106 కోట్లు మంజూరు
సాక్షి, విశాఖపట్నం: సుదీర్ఘంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలుకుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో విశాఖలో ఘనంగా ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి తీపి కబురు అందింది. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ నిర్మాణానికి రైల్వే బోర్డు నుంచి గురువారం అనుమతులు మంజూరయినట్లు రైల్వే మంత్రి అశ్వినీ కుమార్ వైష్ణవ్ వెల్లడించారు. ప్రధాని మోదీ విశాఖలో పర్యటిస్తున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన విశాఖ వచ్చారు. జోన్‌కు అనుమతులు మంజూరు చేసిన నేపథ్యంలో రైల్వే బోర్డ్ చైర్మన్, సీఈవో వీకే త్రిపాఠీ సైతం కేంద్ర మంత్రితో విశాఖ చేరుకున్నారు. వారికి ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ రూప్ నారాయణ్, వాల్తేరు డీఆర్ఎం అనూప్ కుమార్ శ్రీవాత్సవ స్వాగతం పలికారు. అనంతరం కొత్తగా జోనల్ ప్రధాన కార్యాలయం నిర్మించనున్న వైర్ లెస్ కాలనీని మంత్రి శుక్రవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ వైర్లెస్ కాలనీలో ప్రతిపాదిత ఎస్‌సిఓఆర్ జోనల్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణానికి రూ.106 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని, ఈ మేరకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. చదవండి: మూడేళ్లుగా ఏపీ నంబర్ వన్.. ఇదీ మన ఘనత -
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు రూ. 1,923 కోట్ల లాభం
విశాఖ స్టీల్‌ప్లాంట్ 2021–22 ఆర్ధిక సంవత్సరంలో రూ. 1,923 కోట్ల లాభం అర్జించింది. బుధవారం స్టీల్‌ప్లాంట్ 40వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో, స్టీల్‌ప్లాంట్ సీఎండీ అతుల్ భట్ వాటాదారులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ ఏడాది ప్లాంట్ అత్యధికంగా రూ. 28,215 కోట్లు టర్నోవర్ సాధించిందని, గత ఏడాదితో పోలిస్తే 57 శాతం వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు. అలాగే కంపెనీ ఆరేళ్ల తర్వాత పన్నుకు ముందు లాభాలను (పీబీటీ) అర్జించిందన్నారు. గత ఆర్ధిక సంవత్సరంలో కంపెనీ అంతకు ముందు ఏడాది కంటే 148 శాతం వృధ్దితో రూ.3,469 కోట్ల ఎబిటా సాధించిందన్నారు. కోకింగ్ కోల్ సంక్షోభం కారణంగా క్యూ4లో కార్యకలాపాలు తగ్గినప్పటికి, అన్ని ప్రధాన ఉత్పత్తి రంగాల్లో అత్యుత్తమ పనితీరు నమోదు చేసిందన్నారు. స్టీల్‌ప్లాంట్ డైరెక్టర్లు కె.కె. ఘోష్, ఎ.కె. సక్సేనా, స్వతంత్ర డైరక్టర్లు సీతా సిన్హా, ఘన శ్యాం సింగ్, సునీల్ కుమార్ హిరానీ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఉక్కు మంత్రిత్వశాఖ అండర్ సెక్రటరీ ఎస్. నారాయణస్వామి న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏజీఎంకు హాజరయ్యారు. చదవండి: వెనకాల ఇంత జరుగుతుందా.. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు భారీ షాక్! -
మూడు రాజధానులపై రౌండ్ టేబుల్ సమావేశం.. మేధావులు ఏమన్నారంటే..
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మేధావులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ మాట్లాడుతూ.. ‘జెండాలు లేకుండా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం సంతోషం. పరిపాలన రాజధానిగా కావలసిన అన్ని అర్హతలు విశాఖకు ఉన్నాయి. రోడ్డు, రైల్వే, విమానాశ్రయం, పోర్టు కనెక్టివిటీ ఉంది. శివరామకృష్ణన్ కమిటీ అమరావతిలో రాజధాని వద్దని చెప్పింది. నారాయణ కమిటీ మాత్రమే అమరావతి రాజధాని అని తెలిపింది. బోస్టన్, జీఎన్ రావు, పరిపాలన వికేంద్రీకరణ చేయమని చెప్పాయి. హైకోర్టును కర్నూలుకు తరలించి గుంటూరు, విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ జీఎస్ఎన్ రాజు మాట్లాడుతూ.. విశాఖను పరిపాలన రాజధానిగా అందరూ కోరుకుంటున్నారు. విశాఖ రాజధానిగా వస్తే ఉద్యోగాలు వస్తాయి. పరిశ్రమలు వస్తాయి. ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి చెందుతుంది. మూడు రాజధానులు సమయం ఆసన్నమైంది’ అని వెల్లడించారు. 29 గ్రామాలు కోసం చంద్రబాబు తాపత్రయం పాదయాత్ర పేరుతో ఉత్తరాంధ్ర ప్రజలపై కవాతు చేయడానికి వస్తున్నారు. 29 గ్రామాలు కోసం చంద్రబాబు తాపత్రయం పడుతున్నారు. పాదయాత్రను అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఉత్తరాంధ్ర ప్రజలు 5 లక్షల ఎకరాలు అభివృద్ధి కోసం త్యాగం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజలు త్యాగం కోసం ఎవరు మాట్లాడరు. అమరావతి రైతులకు కౌలు ఇస్తున్నారు. -కొయ్య ప్రసాద్ రెడ్డి, ఉత్తరాంధ్ర రక్షణ సమితి అధ్యక్షుడు హైదరాబాద్ తరహా అభివృద్ధికి విశాఖ మాత్రమే అనువైనది ఉత్తరాంధ్ర రాజధాని విశాఖను పరిపాలన రాజధానిగా గుర్తిస్తే ఆర్థికంగా అభివృద్ధి జరుగుతుంది. తక్కువ వ్యయంతో రాజధానిగా నిర్మాణానికి విశాఖ అనువైన ప్రదేశం. విశాఖ రాజధానిగా మారితే పెట్టుబడులు అన్ని రంగాల్లో వస్తాయి. హైదరాబాద్ తరహాలో అభివృద్ధి జరగాలంటే విశాఖ మాత్రమే అనుకూలమైన ప్రదేశం. -పైడా కృష్ణ ప్రసాద్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు -
షుగర్ టెస్టు కోసం ఆంధ్రా వర్సిటీ అద్భుత ఆవిష్కరణ.. డివైస్ స్పెషల్ ఇదే!
సాక్షి, విశాఖపట్నం: మారుతున్న జీవనశైలి కారణంగా మధుమేహం బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎప్పటికప్పుడు షుగర్ లెవల్స్‌ను తెలుసుకునేందుకు ఖర్చుతో కూడిన పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వాటికి భిన్నంగా టైప్–2 షుగర్‌ను క్షణంలోనే తెలుసుకునేలా, అతి తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో ఉండేలా ఆంధ్రా యూనివర్సిటీ బయోకెమిస్ట్రీ విభాగం పోర్టబుల్ నానో బయోసెన్సార్ పరికరాన్ని ఆవిష్కరించింది. ఏయూ బయోకెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పూసర్ల అపరంజి పూర్తి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ పరికరం పెన్‌డ్రైవ్ తరహాలో సుమారు 5 సెం.మీ. పరిమాణంలో ఉంటుంది. దీనికి వినియోగించే స్ట్రిప్ ఒక సెం.మీ. మాత్రమే ఉంటుంది. సాధారణంగా షుగర్ స్ట్రిప్స్‌ను ఒకసారి వాడి పడేయాలి. కానీ, ఈ లేబుల్ ఫ్రీ స్ట్రిప్‌ను బయో ఫ్యాబ్రికేషన్‌తో తయారు చేయడం వల్ల ఆరు నెలలపాటు ఎన్నిసార్లు అయినా వినియోగించుకోవచ్చు. ఈ బయోసెన్సార్ పరికరంలో ఒక చుక్క బ్లడ్ వేస్తే.. సెకను వ్యవధిలోనే కచ్చితమైన మధుమేహం వివరాలు వచ్చేస్తాయి. ఈ డివైజ్‌ను ఆండ్రాయిడ్ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌కు అనుసంధానం చేస్తే షుగర్ లెవల్స్ వివరాలు డిస్ప్లే అవుతాయి. మరోవైపు ఈ డివైజ్ ద్వారా కేవలం మధుమేహం మాత్రమే కాకుండా కోవిడ్, క్యాన్సర్, బీపీ, ఫ్యాట్, థైరాయిడ్ తదితర వ్యాధులకు పరీక్షలు చేసేలా, గాలిలో కాలుష్యాన్ని కనుగొనేలా అభివృద్ధి చేయాలని ఏయూ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం యాంటీజన్ యాంటీబాడీ ఇమ్మొబలైజేషన్ మెథడ్ ద్వారా చిప్స్ తయారీకి పరిశోధనలు కొనసాగుతున్నాయి. క్యాన్సర్ పరీక్షలకు అనుగుణంగా పరికరాన్ని అభివృద్ధి చేసేందుకు బార్క్, కోవిడ్, ఇతర వ్యాధులకు సంబంధించిన స్ట్రిప్స్ తయారీ కోసం ఢిల్లీకి చెందిన పలు సంస్థలు ఏయూతో చర్చలు జరుపుతున్నాయి. ఏయూ చరిత్రలో తొలి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఆంధ్ర విశ్వవిద్యాలయం చరిత్రలో ఒక పరిశోధన పేటెంట్ పొంది, సాంకేతికత బదలాయింపు జరిగిన తొలి పరికరం ఇదే కావడం విశేషం. ఈ పరికరాన్ని వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు విశాఖకు చెందిన అక్షయ ఇన్నోటెక్ సంస్థ ఇటీవల ఏయూతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా సాంకేతికతను బదలాయింపు చేసుకుని త్వరలోనే ప్రజలకు అతి తక్కువ ధరకు ఈ పరికరాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఆప్టిక్ ఫైబర్ టెక్నాలజీతో.. కోవిడ్ సమయంలో ప్రతి పరీక్షకు ఎక్కువ ఖర్చు చేసేవారు. అందువల్ల పోర్టబుల్ నానో బయోసెన్సార్ పరికరం తయారు చేయాలన్న ఆలోచన మొదలైంది. వీసీ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాదరెడ్డి సహకారంతో ఏయూ ల్యాబ్‌లోనే పరిశోధనలు ప్రారంభించి సఫలీకృతులయ్యాం. ఆప్టిక్ ఫైబర్ టెక్నాలజీతో అన్ని పరీక్షలను ఈ పరికరం ద్వారా తెలుసుకునేలా చేస్తున్నాం. ప్రస్తుతం ఒక డివైజ్ మల్టీపుల్ స్ట్రిప్స్ వాడుతున్నాం. భవిష్యత్తులో ఒక పరికరం.. ఒకే చిప్ అనే విధంగా పరిశోధనలు చేస్తున్నాం. – డాక్టర్ అపరంజి, ఏయూ బయో కెమిస్ట్రీ ప్రొఫెసర్ -
బ్రోకర్లు, జోకర్లకు టీడీపీ వేదికగా మారింది: మంత్రి కొట్టు సత్యనారాయణ
సాక్షి, పశ్చిమ గోదావరి: బ్రోకర్లు, జోకర్లకు టీడీపీ వేదికగా మారింది. అమరావతి రైతుల పాదయాత్ర వెనుక టీడీపీ కుట్ర ఉంది. టీడీపీ కావాలనే రైతులను రెచ్చగొడుతోందని డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర బాబు, లోకేష్ బాబుకు పిచ్చి ముదిరిపోయింది. టీడీపీ బ్రోకర్లకు, జోకర్లకు వేదికగా మారింది. ఉత్తరాంధ్రకి అమరావతి రైతుల పాదయాత్ర వెనుక టీడీపీ హస్తం ఉంది. ఇది టీడీపీ కుట్ర. తెలుగుదేశం పార్టీ నేతలు కావాలని రైతులను రెచ్చగొడుతున్నారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించి, లా అండ్ ఆర్డర్ సమస్య తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. విశాఖ రాజధాని వద్దు అని వారిని రెచ్చ గొడతారా?. విశాఖ వద్దు అమరావతి ముద్దు అంటే వారు ఊరుకుంటారా?. తెలుగుదేశం పార్టీ ఒక ఫేక్ పార్టీ. మీది ఒరిజినల్ తెలుగుదేశం పార్టీ కాదు. అన్యాయంగా ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి పార్టీ లాక్కున్నారు. తెలుగుదేశం పార్టీ ముగిసిపోయిన అధ్యాయం. వెంటిలేటర్ మీద ఉన్న చంద్రబాబు పార్టీని, దత్తపుత్రుడుని బ్రతికించాలని ఎల్లోమీడియా ఎంత కష్టపడ్డా ఏమీ ఉపయోగం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పాలన అందిస్తున్నారు. చంద్రబాబు కుట్రలు పన్ని ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయాలని చూస్తున్నారు. ప్రజల గుండెల్లో ఉన్న సీఎం జగన్‌కు వీరు అంగుళం కూడా కదల్చలేరు. మూడు రాజధానులు మా పార్టీ నిర్ణయం. రాష్ట్ర సమగ్రాభివృద్ధి పాలన వికేంద్రకరణతోనే సాధ్యం అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: ‘ఎన్టీఆర్ కుమార్తెను చంద్రబాబు పెళ్లి చేసుకోకుంటే..’ -
మహాయజ్ఞంలా మెగా బీచ్‌క్లీనింగ్ (ఫొటోలు)
-
సాఫ్ట్ స్కిల్స్‌లో ఇది కొత్త అధ్యాయం: సీఎం జగన్
సాక్షి, విశాఖపట్టణం:ప్రపంచంలోనే తొలిసారిగా మైక్రోసాఫ్ట్ ద్వారా 1.62 లక్షల మంది ఏపీ విద్యార్థులకు సాఫ్ట్‌స్కిల్స్‌లో ఉచితంగా శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. మైక్రోసాఫ్ట్ చరిత్రలోనే ఇంత మందికి శిక్షణ అందించలేదన్నారు. ఉద్యోగాలను సాధించడంతోపాటు నైపుణ్యాలను పెంపొందించుకునేలా పాఠ్య ప్రణాళికలను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. దేశంలో మొదటిసారిగా నాలుగేళ్ల ఆనర్స్ డిగ్రీని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. శుక్రవారం విశాఖలోని సిరిపురం ఏయూ కాన్వొకేషన్ హాల్లో మైక్రోసాఫ్ట్ సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. మొదటి విడతలో శిక్షణ పూర్తి చేసుకున్న 35,980 మందికి ధృవపత్రాల పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. సాఫ్ట్‌స్కిల్స్‌లో కొత్త అధ్యాయం.. మైక్రోసాఫ్ట్ ద్వారా 1.62 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ అందించనుండటం ఇదే మొదటిసారి. మైక్రోసాఫ్ట్ చరిత్రలో ఏ దేశంలోనూ ఇంత భారీ స్థాయిలో శిక్షణ ఇవ్వలేదు. ఇప్పటికే శిక్షణ పూర్తైన విద్యార్థులకు, నవంబర్‌లో పూర్తి చేసుకోనున్న విద్యార్థులకు అభినందనలు. సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్లో ఇది సరికొత్త అధ్యాయం. ఉద్యోగాల సాధనే ధ్యేయంగా నైపుణ్యాలను పెంచేలా పాఠ్య ప్రణాళికను తీర్చిదిద్దాం. సర్టిఫైడ్ కోర్సులను అందిస్తున్నాం. డిగ్రీలు పొందినా ఉద్యోగాలు వస్తున్నాయా? లేదా అని ప్రశ్నించుకోవాలి. అందుకే మైక్రోసాఫ్ట్ సంస్థతో అడుగులు వేశాం. ప్రపంచంలో అన్ని సంస్థలూ మన విద్యార్థుల వైపు చూసే రోజు రావాలని ఆకాంక్షిస్తున్నాం. విశాఖలోని సిరిపురం ఏయూ కాన్వొకేషన్ హాల్లో మైక్రోసాఫ్ట్ సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు తదితరులు 40 భిన్న కోర్సుల్లో.. పట్టా పుచ్చుకున్న ప్రతి విద్యార్థీ పూర్తి స్థాయి నిపుణుడిగా మారి ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా 40 విభిన్న కోర్సుల్లో శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ జారీ చేసేందుకు మైక్రోసాఫ్ట్ ముందుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా ఎనలిటిక్స్, నెట్వర్కింగ్, వెబ్ డిజైనింగ్, ఐవోటీ తదితర కోర్సుల్లో శిక్షణ అందించింది. ఉద్యోగాల సాధనకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక విద్యార్థి దాదాపు రూ.30 వేలు ఖర్చు చేస్తే కానీ పొందలేని ఈ శిక్షణ వ్యయాన్ని ప్రభుత్వమే భరించి ఉచితంగా అందచేశాం. మైక్రోసాఫ్ట్ కూడా చాలా ఉదారంగా ముందుకు వచ్చింది. రూ.465 కోట్ల విలువైన శిక్షణను కేవలం రూ.32 కోట్లకు అందించేందుకు అంగీకరించింది. ఈ మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించడంతో పిల్లలు ఉచితంగా శిక్షణ అందుకున్నారు. కేవలం శిక్షణ ఇచ్చి «ధృవపత్రాలు అందించడంతోనే సరిపెట్టుకోలేదు. వారికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కూడా అడుగులు వేశాం. మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో ప్రపంచంలోనే అతి పెద్ద జాబ్ పోర్టల్ సంస్థ లింక్డిన్తో జతకట్టాం. సర్టిఫికెట్స్ పొందిన విద్యార్థులకు జాబ్‌లు కూడా సెర్చ్ చేసి సలహాలు అందించేలా చర్యలు తీసుకుంటాం. ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం ఇస్తున్న మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు... ప్రాథమికవిద్య నుంచి ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టాం. అమ్మఒడి, మనబడి నాడు–నేడు, విద్యాకానుక, గోరు ముద్ద, సంపూర్ణ పోషణ లాంటి పథకాలు అందిస్తున్నాం. ఉన్నతవిద్యని ప్రోత్సహించేందుకు విద్యాదీవెన, వసతిదీవె న కార్యక్రమాలు చేపట్టాం. విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి విదేశీదీవెన అందిస్తున్నాం. చదువుకునేవారికి ఈ ప్రభుత్వం అన్నిరకాలుగా సహాయ, సహకారాలు అంది స్తోంది. విప్లవాత్మక మార్పులను విద్యారంగంలో తెచ్చాం. పోటీని తట్టుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం. 10 నెలల ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేశాం. బీటెక్ ఆనర్స్ లాంటి కోర్సులను అందిస్తున్నాం. పరిశ్రమల అవసరాలకు తగ్గ ట్లుగా శిక్షణ అందిస్తున్నాం. డిగ్రీ, ఇంజనీరింగ్‌లో ఇండ స్ట్రియల్ ఓరియంటేషన్, డ్యుయల్ డిసిప్లినరీ సర్టిఫికేషన్ కోర్సులు, స్కిల్ కోర్సులు ప్రవేశపెట్టాం. దేశంలో తొలిసారిగా నాలుగేళ్ల ఆనర్స్ అండర్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ని తెచ్చాం. ఆన్లైన్ లెర్నింగ్ ద్వారా మేనేజ్మెంట్ స్కిల్స్, ప్రోగ్రామింగ్ లెర్నింగ్ కోసం 2,500 వీడియోలు, 450 ఆడియో పోడ్కేస్ట్లు ఇందులో పొందుపరిచాం. 13 కంపెనీలతో మ్యాపింగ్.. విద్యాసంస్థలను పరిశ్రమలతో అనుసంధానించేలా ఉన్నత విద్యకు సంబంధించి ఒక పోర్టల్‌ని ప్రారంభించాం. ఇందు లో ఇప్పటి వరకూ 1,65,341 మంది విద్యార్థులు రిజిస్టర్ అయ్యారు. నాస్కామ్, మార్క్బ్రిడ్జి, ఎడ్యుస్కిల్స్తో ఒప్పం దాలు చేసుకున్నాం. వర్చువల్ ఇంటర్న్‌షిప్‌లు చేపడుతు న్నాం. ఇప్పటి వరకూ 1.15 లక్షలమంది విద్యార్థుల్ని 13 కంపెనీలతో ఇంటర్న్‌షిప్‌కు మ్యాపింగ్ చేశాం. బాగా చదు వుకుంటేనే పేదరికం నుంచి బయటకు వస్తారనే తాపత్ర యంతో ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పుడున్న కరిక్యులమ్ జాబ్ ఓరియంటెడ్‌గా ఉందా లేదా? అనే విషయంపై సీఎం స్థాయి నుంచి కిందిస్థాయి వరకూ మనసు పెట్టి ఆలోచన చే స్తున్నాం. రాష్ట్రంలో గ్రాస్ ఎన్రోల్మెంట్రేషియో (జీఈ ఆర్) మారాలి. 18 నుంచి 23 సంవత్సరాల్లోపు పిల్లలు ఎంతమంది కాలేజీల్లో అడుగు పెడుతున్నారనేది బ్రిక్స్ దేశా లతో పోల్చి చూస్తుంటాం. దురదృష్టమేంటంటే అది మన దేశంలో 26 శాతమే ఉంది. మిగిలినవారు కాలేజీల్లో ఎందు కు చేరడం లేదని పరిశీలన చేస్తే ఆర్థిక భారం కారణంగా కాలేజీల్లో అడుగులు పడటం లేదని తెలిసింది. పిల్లల్ని చదివించేలా తల్లిదండ్రులను ప్రోత్సహిస్తూ అన్ని రకాలుగా తోడుగా నిలుస్తున్నాం. ఈరోజు మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ ద్వారా దాదాపు 36 వేలమంది పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు మెరుగుపడటం శుభపరిణామం. సాఫ్ట్ స్కిల్స్‌లో శిక్షణ పొందిన విద్యార్థినికి సర్టిఫికెట్ అందజేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాథమిక విద్య నుంచే ఇంగ్లీష్.. ఇంగ్లీష్ మీడియం లేకపోతే పోటీ ప్రపంచంలో పిల్లలు నెగ్గుకు రాలేరని ప్రాథమిక విద్య నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం పెట్టాం. తల్లులను చైతన్యం చేసేందుకు అమ్మ ఒడి తీసుకొచ్చాం. మన బడి.. నాడు–నేడుతో మెరుగైన మౌలిక సదుపాయాల్ని సమకూర్చాం. విద్యా కానుక కింద వారికి కావాల్సినవన్నీ సమకూర్చాం. గోరుముద్ద, సంపూర్ణ పోషణతో ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్యవరకూ పిల్లల్ని చేయిపట్టి నడిపిస్తూ అడుగులు వేస్తున్నాం. ఇంటర్‌తో ఆగిపోకుండా ప్రతి విద్యార్థీ పై చదువులు చదవాలని ఉద్దేశంతో విద్యాదీవెన, వసతి దీవెన పథకాలను తెచ్చాం. ప్రతి త్రైమాసికంలో విద్యా దీవెన ఇస్తున్నాం. ఏటా క్రమం తప్పకుండా రెండుసార్లు వసతి దీవెన అందిస్తున్నాం. ఇవన్నీ ఒకవైపు చేస్తూనే పాఠ్యప్రణాళికలో రూపు రేఖలు మారుస్తున్నాం. అందరికీ సమాన అవకాశాలు నేను బీఎస్సీ స్టాటిస్టిక్స్ చేశా. చాలామంది నాకు ట్రైనింగ్ ఇవ్వరని అన్నారు. కానీ నాకు శిక్షణ ఇచ్చారు. అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నందుకు కృతజ్ఞతలు సర్. ఆర్థిక స్థోమత కారణంగా విద్యకు దూరం కాకుండా చర్యలు తీసుకున్న గొప్ప ముఖ్యమంత్రిగా మీరు చరిత్రలో నిలిచిపోతారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, విదేశీ దీవెన లాంటి పథకాల ద్వారా ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకూ ఎక్కడా బ్రేక్ లేకుండా చదువు కొనసాగించేలా ఆలోచన చేయడం నిజంగా గ్రేట్ లీడర్‌కే సాధ్యం. – లిఖిత నెక్కంటి, బీఎస్సీ స్టాటిస్టిక్స్ విద్యార్థిని ముఖ్యమంత్రి తపనతో బృహత్తర కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా మన యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్ ఈ అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మైక్రోసాఫ్ట్ ఎక్కడా ఇంత పెద్ద స్థాయిలో శిక్షణ అందించలేదు. శిక్షణకు అయిన ప్రతి పైసానూ ప్రభుత్వమే భరించింది. గత అక్టోబర్‌లో ట్రైనింగ్ ప్రారంభమైంది. పోటీని తట్టుకొని ప్రపంచాన్ని శాసించేస్థాయికి మన విద్యార్థులు ఎదగాలి. – బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి ప్రపంచంలోనే అతి పెద్ద స్కిల్లింగ్ ప్రోగ్రామ్ రాష్ట్ర ప్రభుత్వంతో వేసిన అడుగులు చరిత్రాత్మకం. ఇంత గొప్ప కార్యక్రమానికి మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల రాలేకపోయారు. కానీ సందేశం పంపించారు. కెరీర్లో అద్భుతమైన దిశగా పయనించేందుకు ఏపీ విద్యార్థులు శిక్షణ తీసుకోవడం చాలా ఉద్వేగంగా ఉంది. డేటా సైన్స్, బిజినెస్, ఇతర కీలక అంశాలకు సంబంధించి శిక్షణ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. 35,980 మంది విద్యార్థులు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. లింక్డిన్ సపోర్ట్‌తో ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నాం. – నవ్‌తేజ్ బాల్, మైక్రోసాఫ్ట్ ఇండియా హెడ్ ఇదీ చదవండి: పర్యావరణాన్ని పరిరక్షిస్తేనే ఆర్థిక పురోగతి.. సీఎం జగన్ -
Andhra Pradesh: ప్లాస్టిక్ బ్యానర్లు బ్యాన్
సాక్షి, విశాఖపట్టణం: రాష్ట్రవ్యాప్తంగా ఇకపై ప్లాస్టిక్ బ్యానర్లను నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. అందరూ క్లాత్ బ్యానర్లు మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. 2027 నాటికి ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో అడుగులు వేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ దిశగా ప్రజలందరినీ భాగస్వాములను చేసి అవగాహన పెంపొందించాలని అధికార యంత్రాగానికి సూచించారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్, అప్ సైక్లింగ్‌తో సాగరతీర ప్రాంతాల పరిరక్షణ కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘పార్లే ఫర్ ది ఓషన్స్’తో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) సందర్భంగా శుక్రవారం విశాఖలో సీఎం జగన్ ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రపంచంలోనే తొలిసారిగా ప్లాస్టిక్ నియంత్రణ కోసం ఒప్పందం చేసుకున్నామని, తద్వారా విశాఖలో పార్లే ఫ్యూచర్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు కానుందని తెలిపారు. మూడు దశల్లో రాష్ట్రంలో రూ.16 వేల కోట్ల పెట్టుబడులతో (2 బిలియన్ డాలర్లు) 20 వేల మందికి ఉపాధి కల్పించేలా పార్లే సూపర్ హబ్, రీ సైక్లింగ్, అప్‌సైక్లింగ్ యూనిట్లు ఏర్పాటవుతాయని చెప్పారు. యువత నైపుణ్యాలకు పదును పెట్టేలా ప్రపంచంలోనే తొలిసారిగా 1.62 లక్షల మందికి మైక్రోసాఫ్ట్ ద్వారా సాఫ్ట్‌స్కిల్స్‌లో ఉచిత శిక్షణ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో తొలి విడతలో 35,980 మందికి శిక్షణ పూర్తైంది. ఈ నేపథ్యంలో విశాఖలో సీఎం జగన్ చేతుల మీదుగా సర్టిఫికెట్ల ప్రదానం జరిగింది. ప్లాస్టిక్ వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసి తయారుచేసిన కళ్లద్దాలను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్ ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ చరిత్రలోనే ఇంత మందికి ఎన్నడూ శిక్షణ అందించలేదని సీఎం తెలిపారు. చదివిన డిగ్రీకి అనుగుణంగా ప్రతి విద్యార్థికీ ఉద్యోగం వచ్చేలా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా విశాఖ బీచ్ రోడ్‌లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్, సిరిపురంలోని ఏయూ కాన్వొకేషన్ హాల్లో జరిగిన కార్యక్రమాల్లో సీఎం పాల్గొని మాట్లాడారు. పార్లే సంస్థ ప్లాస్టిక్ నుంచి తయారు చేసిన వివిధ ఉత్పత్తులను (బూట్లు, కళ్లద్దాలు, టీ షర్టులు) సీఎం స్వయంగా పరిశీలించారు. ఎంవోయూపై రాష్ట్ర ప్రభుత్వం తరపున పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, పార్లే ఫర్ ఓషన్స్ సంస్థ సీఈవో సిరిల్ గచ్చ్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. అతిపెద్ద బీచ్ క్లీనింగ్ కార్యక్రమం.. పార్లే ఫర్ ది ఓషన్స్ సంస్థకు చెందిన సిరిల్, గ్లోబల్ అలయన్స్ సహకారంతో రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చేసేలా ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ రోజు ఎప్పటికీ గుర్తుంటుంది. బీచ్ క్లీనింగ్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న విశాఖ ప్రజలకు అభినందనలు. గోకుల్ బీచ్ నుంచి భీమిలి బీచ్ వరకు 28 కి.మీ. పరిధిలో 40 ప్రాంతాల్లో సుమారు 22 వేల మంది ప్రజలు పాల్గొని 76 టన్నుల ప్లాస్టిక్ వ్యర్ధాలను సేకరించడం గొప్ప విషయం. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద బీచ్ క్లీనింగ్ కార్యక్రమం. ఈ సామాజిక స్ఫూర్తి చాలా అద్భుతం. అదే విశాఖను ప్రత్యేక నగరంగా నిలబెట్టింది. అటు పర్యావరణం.. ఇటు ఆర్థికం నాణేనికి రెండు వైపులా అన్నట్లు ఒకవైపు పర్యావరణం, మరోవైపు ఆర్థిక వ్యవస్థ రెండూ కీలకం. పర్యావరణాన్ని పరిరక్షించుకోకుంటే మనకు మనుగడ లేదు. సుస్థిరత, సమగ్రత మన ప్రధాన లక్ష్యాలు. స్వల్పకాలిక లక్ష్యాల కోసం రాజీపడితే దీర్ఘకాలిక మనుగడ సాగించలేం. అందుకే మన ప్రభుత్వం మానవ, ఆర్థిక వనరులతో సుస్థిర ప్రగతి కోసం కృషి చేస్తోంది. పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ‘క్లాప్’ (క్లీన్ ఏపీ – జగనన్న స్వచ్ఛ సంకల్పం) కార్యక్రమాన్ని గతేడాది అక్టోబరు 2న ప్రారంభించింది. 4,097 చెత్త సేకరణ వాహనాలను అందచేసింది. గ్రామ, వార్డు సచివాలయాల కేంద్రంగా ఈ కార్యక్రమాలను ప్రారంభించడంతో చెత్త సేకరణ 22 శాతం నుంచి 62 శాతానికి పెరిగింది. వంద శాతం సేకరణ లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. ప్లాస్టిక్ వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసి తయారుచేసిన బూటును చూపిస్తున్న ముఖ్యమంత్రి జగన్ సాగరాన్ని కాపాడుకుందాం.. భూమి మీద ఆక్సిజన్‌లో 70 శాతం సముద్ర మొక్కల నుంచే లభిస్తోంది. రెయిన్ ఫారెస్ట్ నుంచి కేవలం 28 శాతం ఆక్సిజన్ మాత్రమే వస్తుంది. మెరైన్ ప్లాంట్స్‌లో ఫైటో ప్లాంక్టన్, కెల్ఫ్, ఆల్గల్ ప్లాంక్ట్ లాంటి మొక్కలు కిరణజన్య సంయోగ ప్రక్రియతో ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఫైటో ప్లాంక్ట్లో ముఖ్యమైనదైన ప్లోక్లోరో కాకస్ వాతావరణంలోకి అత్యధికంగా ప్రాణ వాయువును ఉత్పత్తి చేస్తోంది. సముద్రంలోకి చేరుతున్న ప్లాస్టిక్ వ్యర్ధాలు నానాటికీ పెరుగుతూ విస్తరిస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల మత్స్య సంపద, సముద్ర పక్షులు, సముద్ర క్షీరదాలు లాంటి దాదాపు 267 జాతులకు ముప్పు వాటిల్లుతోంది. రూ.16 వేల కోట్లు.. 20 వేల మందికి ఉపాధి సముద్రతీరంతో పాటు సాగర గర్భంలో కూడా ప్లాస్టిక్ కనిపిస్తోంది. దీనికి స్థిరమైన పరిష్కారం దిశగా తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తోంది. గ్లోబల్ అలయన్స్ ఫర్ సస్టైనబుల్ ప్లానెట్ వర్క్స్ (జీఏఎస్‌పీ), పార్లే ఫర్ ది ఓషన్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యమైంది. భాగస్వాములను ఎంపిక చేయడం, ఆర్థిక వనరులను సమకూర్చడంలో గ్లోబల్ అలయన్స్ సంస్థ కీలకంగా వ్యవహరిస్తుంది. ఈ ఒప్పందంలో భాగంగా విశాఖలో పార్లే ఫ్యూచర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు కానుంది. ఇది దేశానికే కాకుండా ప్రపంచానికే దిక్సూచిగా నిలుస్తుంది. అత్యాధునిక పద్ధతుల్లో కొత్త మెటీరియల్ కనుగొనడానికి సంబంధించిన పరిశోధన ఇక్కడ జరుగుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో బూట్లు, అద్దాలు లాంటి మెటీరియల్ తయారు చేసే రీసైక్లింగ్, అప్ సైక్లింగ్ హబ్ ఏర్పాటవుతుంది. వ్యర్థాలతో ఉత్పత్తుల తయారీకి 10 ఇన్నోవేషన్ హబ్స్ ఏర్పాటవుతాయి. వీటిద్వారా ఆరేళ్లలో రూ.16 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి. స్ధానికంగానే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా 20 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఒప్పందపత్రాలు మార్చుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు, పార్లే ఫర్ ది ఓషన్స్ ప్రతినిధులు ప్రఖ్యాత కంపెనీలకు పార్లే ఉత్పత్తులు.. అందమైన బ్యాగుల నుంచి షూస్, కంటి అద్దాల వరకూ రీసైకిల్డ్ ప్లాస్టిక్ నుంచే తయారవుతున్నాయి. పార్లే ఫర్ ది ఓషన్స్ సంస్థ వీటిని తయారు చేస్తోంది. ఈ సంస్థకు ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన కంపెనీలు మెర్సిడెస్ బెంజ్, లూయిస్ విట్ట¯, ఆడిడాస్, అమెరికా ఎక్స్‌ప్రెస్ లాంటి కంపెనీలతో వ్యాపార అనుబంధం ఉంది. వారికి కావాల్సిన ఉత్పత్తులను పార్లే సంస్థ తయారు చేసి అందచేస్తోంది. రీ సైక్లింగ్, అప్ సైక్లింగ్‌లోకి చాలా ఎంఎన్‌సీలు వస్తున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్, గ్లోబల్ అలయన్స్ ఫర్ సస్టైనబుల్ ప్లానెట్ (జీఏఎస్‌పీ) సెక్రటరీ జనరల్ సత్య ఎస్ త్రిపాఠి, పార్లే ఫర్ ది ఓష¯న్స్ సీఈవో సిరిల్ గచ్చ్‌తో పాటు అందరికీ హృదయపూర్వక అభినందనలు. దారంతా ఫ్లెక్సీలే ‘‘విశాఖ విమానాశ్రయం నుంచి కారులో వస్తుంటే దారిపొడవునా నా ఫొటోలతో ఫ్లెక్సీలు కనిపించాయి. ప్లాస్టిక్ నిర్మూలన కార్యక్రమానికి వెళ్తూ ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ప్రజలకు తప్పుడు మెసేజ్ పంపించినట్లు అవుతుందని కలెక్టర్ మల్లికార్జునకు చెప్పా. అయితే అవి ప్లాస్టిక్ ఫ్లెక్సీలు కాదని, క్లాత్‌తో తయారైనవని ఆయన చెప్పారు. ప్లాస్టిక్ ఫెక్సీకి రూ.8 ఖర్చయితే.. క్లాత్‌కు రూ.32 ఖర్చవుతుందన్నారు. ఎవరైనా ఫ్లెక్సీలు పెట్టాలనుకుంటే కాస్త ఖర్చు ఎక్కువైనా క్లాత్‌తో తయారైనవే ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో ప్లాస్టిక్ నిర్మూలనలో తొలి అడుగు వేస్తున్నాం. ఇప్పటికే తిరుమలను ప్లాస్టిక్ రహితంగా చేయడంతో మంచి ఫలితాలు వచ్చాయి’’ – సీఎం జగన్ రీసైక్లింగ్ ద్వారా తయారు చేసిన కళ్లజోడును పెట్టుకున్న సీఎం జగన్ హాజరైన మంత్రులు, ప్రజాప్రతినిధులు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రులు బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, విడదల రజని, ఆదిమూలపు సురేష్, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, సత్యవతి, జీవీఎంసీ మేయర్ హరి వెంకటకుమారి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హామీలను నెరవేరుస్తున్న నాయకుడు ఇది ఆరంభం మాత్రమే. లక్ష్యాన్ని చేరుకోవాలంటే చాలా కష్టపడాలి. అది సాకారమైతే ప్రపంచంలోనే ప్లాస్టిక్ రహిత తొలి రాష్ట్రంగా ఏపీ ఆవిర్భవిస్తుంది. 2027 నాటికి సాధించేలా బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి జగన్‌కు అభినందనలు. పలు దేశాల్లో ఎంతో మంది రాజకీయ నేతలను కలిశాం. అందరూ అనేక హామీలిచ్చి మర్చిపోవడాన్ని చూశా. ముఖ్యమంత్రి జగన్ మాత్రమే ఇచ్చిన హామీలను అమలు చేయడాన్ని చూస్తున్నాం. – సత్య ఎస్ త్రిపాఠి, జీఏఎస్‌పీ సెక్రటరీ జనరల్ చాలా ముఖ్యమైన సందర్భమిది. నేను భారత్‌కు రాకపోతే కీలక ఘట్టాన్ని మిస్ అయ్యే వాడిని. పర్యావరణం ప్రమాదంలో ఉందంటూ అనేక దేశాల ముఖ్యులు రోజుల తరబడి చర్చించడం, భారీగా నిధులు వెచ్చించినా పూర్తి స్థాయిలో విజయవంతం కాలేదు. ఆంధ్రప్రదేశ్‌లో పర్యావరణ పరిరక్షణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో జరిగిన సమావేశం చాలా భిన్నంగా అనిపించింది. సీఎం సమక్షంలో అధికార యంత్రాంగం కేవలం రెండు గంటల్లోనే సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసింది. భవిష్యత్తులో వ్యర్థాల నిర్మూలనలో విశాఖ నంబర్ వన్ స్థానంలో ఉంటుంది. వ్యర్థాల రీసైక్లింగ్ ద్వారా మానవ జీవనానికి అవసరమయ్యే వస్తువులను తయారు చేసుకోవచ్చు. ఆరేళ్ల పాటు నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం పనిచేస్తే ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దగలం. మరో పదేళ్లలో ప్లాస్టిక్ కనిపించదు. ప్రపంచంలోనే ఇది ఒక విప్లవాత్మక మార్పుగా పరిణమించనుంది. – సిరిల్ గచ్చ్, పార్లే ఫర్ ఓషన్స్ సీఈవో ‘‘దేశంలోనే రెండో అతిపెద్ద తీర ప్రాంతం 975 కి.మీ. పొడవు కలిగి ఉన్న మన రాష్ట్రంలో విశాలమైన ఇసుక బీచ్‌లు, వన్య మృగాలు, పక్షుల కేంద్రాలున్నాయి. రాష్ట్ర పౌరులుగా తీర ప్రాంతాన్ని పరిరక్షించుకోవడం మనందరి విధి. ప్లాస్టిక్ వ్యర్థాలు లేని సముద్రాలు మన లక్ష్యం కావాలి’’ – సీఎం జగన్ ఇదీ చదవండి: విశాఖలో మెగా బీచ్ క్లీనింగ్ ప్రోగ్రాం.. -
కురిస్తే కుండపోతే..మారుతున్న రుతుపవన సరళి
సాక్షి, విశాఖపట్నం: కొన్నేళ్లుగా వాతావరణ మార్పులతో భూతాపం పెరిగిపోతోంది. దాని ప్రభావం రుతు పవనాలపై చూపుతోంది. అంతేకాదు.. వర్షపాతం, తేమ, గాలి దిశలపైనా ప్రభావం చూపిస్తోంది. వాయుగుండాలు, తుపానుల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. ఫలితంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు తక్కువ రోజుల్లోనే కుండపోత వర్షాలు కురవడం, గాలుల తీవ్రత పెరగడం వంటి అనూహ్య.. అసాధారణ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఏడాది మే 14న పాకిస్తాన్‌లోని జకోబాబాద్‌లో ప్రపంచంలోనే అత్యధికంగా 51 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది. భారత్ సహా పలు దేశాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలతో తీవ్ర వడగాడ్పులు వీచాయి. మేఘాలయలోని చిరపుంజిలో ఈ నెల 17న 97 సెం.మీ. భారీ వర్షపాతం నమోదైంది. ఇది 122 ఏళ్ల చరిత్రలో మూడో అతి పెద్ద వర్షపాతంగా నమోదైంది. ఇలా అత్యధిక ఉష్ణోగ్రతలు, మరోపక్క అధిక వర్షాలు కురుస్తూ వాతావరణంలో భారీ మార్పులను స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రభావం మన దేశంలో రుతు పవనాలపైనా చూపుతూ వాటి సరళిలోను, గాలి దిశ మార్పునకు దోహదం చేస్తున్నాయి. భవిష్యత్‌లో భారీ వర్షాలే సాధారణంగా రుతు పవనాల సీజన్ మొత్తమ్మీద గాలుల దిశ ఒకేలా ఉంటుంది. ఉదాహరణకు నైరుతి రుతుపవనాల సీజన్లో నైరుతి నుంచి, ఈశాన్య రుతుపవనాల సీజన్లో ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తాయి. కానీ.. వీటి గమనంలోనూ వ్యత్యాసాలు చోటుచేసుకుంటున్నాయి. అరేబియా సముద్రం నుంచి అనూహ్యంగా రుతు పవన గాలులు ఉధృతం కావడంతో అలలు ఎగసిపడుతూ తేమను సరఫరా చేయడం వల్ల భారీ వర్షాలకు కారణమవుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇలా ప్రతి ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుదలతో రుతు పవన వర్షపాతం 5 శాతం వరకు పెరుగుతోందని, ఫలితంగా రానున్న సంవత్సరాల్లో తక్కువ రోజుల్లోనే అత్యధిక వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. తగ్గుతున్న వాయుగుండాలు, అల్పపీడనాలు గతంలో నైరుతి రుతు పవనాల సీజన్లో (జూన్–సెప్టెంబర్) బంగాళాఖాతంలో 10నుంచి 12 వరకు వాయుగుండాలు, అల్పపీడనాలు ఏర్పడతాయి. కానీ.. అవి 3–4కి తగ్గిపోతున్నాయి. అయితే ఆకస్మికంగా ఏర్పడుతున్న అల్పపీడన/ఉపరితల ద్రోణులు, ఆవర్తనాల వల్ల సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. గత ఐదేళ్లలో దేశంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావడం అరుదైన పరిణామంగా చెబుతున్నారు. ఇక ఈశాన్య రుతుపవనాల సీజన్లో బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడే తుపానుల సంఖ్య కూడా తగ్గుతోంది. కానీ.. వాటి తీవ్రత మాత్రం పెరుగుతూ అధిక వర్షపాతం కురుస్తున్నట్టు, తుపాను గాలుల తీవ్రత పెరిగినట్టు నిపుణులు గుర్తించారు. ఇది ప్రజల ప్రాణ, ఆస్తి నష్టాలకు కారణమవుతోంది. మరోవైపు ప్రీ–మాన్సూన్ సీజన్‌గా పిలిచే నైరుతి రుతు పవనాలకు ముందు కాలం (ఏప్రిల్–మే)లో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఉరుములు, మెరుపులతో (థండర్ స్ట్రోమ్స్) అకాల వర్షాలు కురుస్తాయి. కొన్నాళ్లుగా వీటి సంఖ్య తగ్గినా వర్షం, గాలుల తీవ్రత మాత్రం పెరుగుతున్నట్టు గుర్తించారు. వర్షం రోజులు తగ్గి.. ఉధృతి పెరిగి వాతావరణ మార్పుల ప్రభావం రుతు పవనాల సీజన్‌పై పడుతోందని ఇప్పటికే పలు క్లైమేట్ మోడల్స్ నిర్ధారించాయి. నిపుణుల అంచనాల ప్రకారం.. 2025, 2030, 2035 సంవత్సరాలకు రుతు పవనాల సీజన్లో వర్షం కురిసే రోజులు తగ్గుతాయి. కానీ.. వర్షాల ఉధృతి మాత్రం పెరుగుతుంది. తేమ, గాలుల వేగం కూడా పెరుగుతాయి. ఫలితంగా భవిష్యత్‌లో భూమి కోతకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితులపై ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) లోతుగా అధ్యయనం చేస్తోంది. – ఓఎస్ఆర్యూ భానుకుమార్, పూర్వ అధిపతి, సముద్ర అధ్యయన విభాగం, ఆంధ్రా యూనివర్సిటీ -
రాజధానిపై ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు
-
రాధ మిస్సింగ్ కేసు: ఎన్ఐఏ అదుపులో హైకోర్టు అడ్వకేట్ శిల్ప
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ చిలుకానగర్‌లో ఎన్ఐఏ(NIA) అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైకోర్టు అడ్వకేట్ శిల్ప ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. మెడికల్ విద్యార్థి రాధ మిస్సింగ్ కేసులో భాగంగా ఆమె ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా, రాధను శిల్ప.. మావోయిస్టుల్లో చేర్చారనే ఆరోపణలు వెలుగులోకి రావడంతో అధికారులు తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు. ఏక కాలంలో అధికారులు మూడు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా.. పలు డాక్యుమెంట్లను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో శిల్పను ఎన్ఐఏ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, శిల్పను ఎన్ఐఏ కార్యాలయానికి తరలించారు. కాగా, మెదక్ జిల్లా చేగుంటలోనూ ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. మావోయిస్టు నేత శంకర్ కొడుకు ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. అయితే, మూడున్నర సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో రాధ అదృశ్యమైంది. రాధను మావోయిస్టులు కిడ్నాప్ చేశారని ఆమె తల్లి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో మే 31వ తేదీన కేసు రీ-ఓపెన్ చేసి దర్యాప్తు చేయాలని NIA కు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో చైతన్య మహిళా సంఘం నేతలపై, మావోయిస్టు అగ్రనేతలు గాజర్ల రవి, అరుణలపై NIA కేసు నమోదు చేసింది. ఇది కూడా చదవండి: జైలుకు మరో 10 మంది ఆందోళనకారులు -
ముంచెత్తిన భారీ వర్షం
-
ఇన్స్పెక్టర్ రాసలీలలు.. లవ్ యూ అంటూ ఆమెకు దగ్గరై.. ఆ తర్వాత..
రామభద్రపురం : ప్రజలను రక్షించాల్సిన రక్షకభటుడే ఓ యువతిని మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను గర్భవతిని చేసి మోహం చాటేశాడు. తనను మోసం చేసిన ప్రియుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలు శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాల ప్రకారం.. మండలంలోని మిర్తివలస గ్రామానికి చెందిన సువ్వాడ ఉషారాణి అదే గ్రామానికి చెందిన పొట్నూరు గోపాలకృష్ణ 2019 నుంచి ప్రేమించుకుంటున్నారు. గోపాలకృష్ణ హైదరాబాద్ సెంట్రల్ పోలీస్ లైన్స్‌లో రిజర్వ్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నాడు. అయితే 2020లో ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు రావడంతో గ్రామపెద్దల వద్దకు పంచాయితీ చేరింది. దీంతో గోపాలకృష్ణ నుంచి కొంత మొత్తాన్ని ఉషారాణికి ఇప్పించి రాజీ కుదిర్చారు. కొద్ది రోజుల తర్వాత ఇద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు. గోపాలకృష్ణ డిప్యుటేషన్‌పై విశాఖపట్నంలో విధులు నిర్వహిస్తూ, అప్పుడప్పుడూ గ్రామానికి వచ్చి ఉషారాణితో గడుపుతుండేవాడు. ఈ క్రమంలో ఆమె గర్భవతి కావడంతో పెళ్లి చేసుకోవాలని గోపాలకృష్ణపై ఒత్తిడి తీసుకువచ్చింది. అయితే, గోపాలకృష్ణ పెళ్లికి నిరాకరించడంతో తనకు న్యాయం చేయాలని బాధితురాలు విజయనగరం హ్యూమన్ రైట్స్ సంఘ సభ్యులను ఆశ్రయించింది. వారి సూచన మేరకు గ్రామ పెద్దలతో కలిసి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సీఐ ఎం. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సై కృష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: యువతితో ఐదేళ్లుగా ప్రేమ.. నమ్మించి మోసం.. పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో.. -
గ్యాస్ లీకేజీ: ఘటనా స్థలానికి వెళ్లిన మంత్రి గుడివాడ అమర్నాథ్
సాక్షి, అనకాపల్లి: అచ్యుతాపురం గ్యాస్ లీకేజీ ఘటనలో ఎస్ఈజెడ్లోని ప్రమాద ప్రాంతాన్ని మంత్రి గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్యే కన్నబాబు రాజు, ఎంపీ డాక్టర్ సత్యవతి శనివారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఘటనా స్థలంలో కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. గ్యాస్ లీక్ ఎలా అయింది అన్న విషయంపై ఆరా తీశారు. అయితే, దీనిపై స్పష్టత లేకపోవడంతో మంత్రి అమర్నాథ్ ఏపీఐఐసీ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించాము. రెండు కంపెనీల్లో ఉద్యోగులు ఎక్కువగా అస్వస్థతకు గురయ్యారు. ఎక్కడ నుంచి విష వాయువులు వచ్చాయన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఎస్ఈజెడ్లో ప్రమాదాల నివారణ చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తాము. ముందుగా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నదే మా ఉద్దేశ్యం’’ అని అన్నారు కోలుకుంటున్న బాధితులు ఇదిలా ఉండగా.. గ్యాస్ లీక్ ఘటనలో అస్వస్థతకు గురైన బాధితులు కోలుకుంటున్నారు. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బాధితులు డిశ్చార్జి అవుతున్నారు. శనివారం ఉదయం ఎలమంచిలి ఆసుపత్రి నుంచి కోలుకున్న బాధితులు ఇళ్లకు వెళ్లిపోయారు. ఇక, మరికొన్ని ఆసుపత్రుల్లో కొందరు బాధితులు చికిత్స పొందుతున్నారు. వారికి మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి డిశ్చార్జి చేయాలని వైద్యులకు కలెక్టర్ సూచించారు. ఇది కూడా చదవండి: '124 మంది చికిత్స పొందుతున్నారు.. ఎవరికీ ప్రాణాపాయం లేదు' -
క్రికెట్ ఫ్యాన్స్‌కి అలర్ట్.. విశాఖలో టీ20 మ్యాచ్‌కు టికెట్స్ అమ్మకాలు
విశాఖ స్పోర్ట్స్: భారత్ పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా జట్టు ఆడనున్న మూడో టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయాలు ఈ నెల 5వ తేదీ నుంచి ఆన్లైన్లో ప్రారంభం కానున్నాయి. దక్షిణాఫ్రికా–భారత్ మధ్య టీ20 సిరీస్‌లో భాగంగా మూడో మ్యాచ్ ఈనెల 14న విశాఖలోని వైఎస్సార్ ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరగనున్న విషయం తెలిసిందే. రాత్రి 7 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌కు ఏర్పాట్లు చురుగ్గా సాగుతుండగా.. 13వ తేదీనే ఇరు జట్లు విశాఖ చేరుకోనున్నాయి. మ్యాచ్ వీక్షించేందుకు స్టేడియంలో గల 27,251 సీటింగ్ కెపాసిటీలో స్థానిక క్లబ్‌లకు, కాంప్లిమెంటరీలు మినహాయించి మిగిలిన టికెట్లను ఈనెల 5వ తేదీన ఉ.11.30 గంటల నుంచి ఆన్లైన్లో విక్రయించనున్నట్టు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. టికెట్లను పేటీఎం యాప్ www.insider.in.tickets ప్లాట్‌ఫాంలో పొందవచ్చన్నారు. టికెట్ కనీస ధర రూ.600 నుంచి రూ.6 వేల వరకు ఉంటుందన్నారు. 8న ఆఫ్‌లైన్‌లో విశాఖలోని 3 కేంద్రాల్లో విక్రయించనున్నారు. విశాఖతో పాటు విజయవాడ, హైదరాబాద్‌లలో కొన్నవారి టికెట్లను కొరియర్లో పంపనున్నారు. ఇది కూడా చదవండి: అస్సలు బాలేదు.. కోహ్లి, రోహిత్ తమ మార్కు చూపించాలి.. లేదంటే కష్టమే! -
జనసేనలో లుకలుకలు.. నేతల డిష్యుం డిష్యుం!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: జనసేన పార్టీలో నేతల మధ్య మాటామాటా పెరిగి కొట్టుకునే వరకు వెళ్లినట్టు తెలుస్తోంది. పార్టీ పీఏసీ సభ్యుడు నాగబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా విశాఖపట్నంలో శుక్రవారం నిర్వహించిన సమావేశం సందర్భంగా పార్టీ నేతల మధ్య విభేదాలు పొడచూపినట్టు సమాచారం. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఉదయం విశాఖ అర్బన్, మధ్యాహ్నం విశాఖ రూరల్ నియోజకవర్గాల సమావేశాలను నాగబాబు నిర్వహించారు. కాగా, మధ్యాహ్నం సమావేశం ముగిసిన తర్వాత జనసేన ప్రధాన కార్యదర్శి శివశంకర్‌పై ఆ పార్టీ యలమంచిలి నియోజకవర్గ ఇన్చార్జి సుందరపు విజయ్‌కుమార్ ఏకంగా చేయి చేసుకున్నట్టు పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. యలమంచిలిలో పార్టీ ఇన్చార్జి అయిన తనను కాదని.. ఏడాదిక్రితం పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కట్టెంపుడు సతీష్‌ను ప్రోత్సహిస్తున్నారని మండిపడుతూ శివశంకర్‌తో సుందరపు విజయ్‌కుమార్ మొదట వాగ్వాదానికి దిగారు. ఇరువురి మధ్య మాటామాటా పెరగడంతో విజయ్‌కుమార్ ఏకంగా శివశంకర్‌పై చేయిచేసుకోవడమే కాకుండా గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఉదయం జరిగిన అర్బన్ సమావేశంలోనూ తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణపై జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ భీశెట్టి వెంకటలక్ష్మి, ఆమె భర్త గోపీకృష్ణ మండిపడినట్టు తెలుస్తోంది. పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. మొత్తంగా సమావేశం ముగించుకుని నాగబాబు వెళ్లిన వెంటనే పార్టీ కార్యాలయం సాక్షిగా జరిగిన ఈ ఘటనలు జనసేన పార్టీలో నేతల మధ్య ఉన్న విభేదాలను బయటపెట్టాయి. ఇది కూడా చదవండి: చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ.. నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు -
వారెవ్వా అనిపించే వైజాగ్ అమ్మాయి రేఖా భోజ్ (ఫోటోలు)
-
నయనతారలా ఉన్నావ్ అన్నారు..
‘కమిట్మెంట్ ఇచ్చినా నువ్వు హీరోయిన్ అయ్యే చాన్సే లేదు. సైడ్ క్యారెక్టర్.. సిస్టర్ క్యారెక్టర్ లాంటివి ట్రై చేస్కో..’ అన్న మాటలు మొదట్లో ఆమెను నిరుత్సాహ పరిచాయి. సినిమా అవకాశాలు అడిగే అమ్మాయిలంటే ఎందుకంత లోకువ? అని తనలో తానే మదనపడింది. కానీ ఆమె లక్ష్యం హీరోయిన్ కావడం. నటనపై తనకున్న ఆసక్తి.. ప్రతిభ.. పట్టుదలతో అవకాశాల కోసం ప్రయత్నించింది. క్రమంగా సినీ అవకాశాలు వచ్చాయి. హీరోయిన్గా పలు చిత్రాల్లో నటించిన ఆమె.. మన విశాఖ అమ్మాయి.. పేరు రేఖ భోజ్. –సీతమ్మధార(విశాఖ ఉత్తర) నగరంలోని కైలాసపురానికి చెందిన రేఖ సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. చదువుతున్నప్పుడే షార్ట్ ఫిల్మ్స్‌లో నటించే అవకాశం వచ్చింది. నటనపై మక్కువతో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంది. చదువు పూర్తయిన తర్వాత సినిమా హీరోయిన్గా ప్రయత్నాలు మొదలుపెట్టింది. సుమారు 50 వరకు ఆడిషన్స్‌కు వెళ్లింది. అందరూ నయనతారలా ఉన్నావ్ అని అన్నారే తప్పితే అవకాశాలు మాత్రం ఎవరూ ఇవ్వలేదు. అలాంటి సమయంలో రాకేష్‌రెడ్డి అనే యువ దర్శకుడు ఆమెకు సినిమా అవకాశం కల్పించాడు. కాలాయ తస్మై నమః సినిమాలో మూకీ పాత్రకు ఎంపిక చేశాడు. అలా మొదలైంది రేఖ భోజ్ సినీ ప్రస్థానం. ప్రస్తుతం హీరోయిన్గా ఐదు సినిమాలు పూర్తి చేసింది. మూడు సినిమాలు విడుదలయ్యాయి. మరో రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పెద్ద బ్యానర్లు, హీరోల సినిమాల్లో చెల్లెల పాత్రలు వచ్చినా ఆమెను అంగీకరించలేదు. ఇంకేదైనా ప్రోత్సాహం ఉండే ఫీల్డ్ ఎంచుకోవచ్చు కదా అన్న తల్లిదండ్రులు థియేటర్లో కాలాయ తస్మై నమః సినిమా చూసి ‘గో హెడ్’ అన్నారు. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రను ఎంపిక చేసుకుంటూ.. రేఖ భోజ్ ముందుకు సాగుతోంది. షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ ప్రారంభం రాకేష్ రెడ్డి బిగ్‌బాస్ ఫేం షణ్ముఖ్ జశ్వంత్‌ను హీరోగా, రేఖ హీరోయిన్గా ‘లవ్ ఇన్ వైజాగ్’ అనే షార్ట్ ఫిలిం తీశారు. అదే కాంబినేషన్లో ‘డర్టీ పిక్చర్’తెరకెక్కించారు. విశాలమైన కళ్లు.. మంచి భావాలు పలికించడం, నటనలో ప్రతిభను గుర్తించిన రాకేష్ తన వరుస ప్రాజెక్ట్‌ల్లో ఆమెను ప్రోత్సహించాడు. తన దర్శకత్వంలో ‘కాలాయ తస్మై నమః’ సినిమాలో అవకాశం కల్పించాడు. 1980 ప్రాంతపు గ్రామీణ నేపథ్యంతో సాగిన ఈ సినిమాలో పని మనిషి పాత్ర రేఖది. ఆ పాత్రలో ఆమె దుమ్ము దులిపేసింది. దీంతో రాకేష్ తర్వాత ప్రాజెక్ట్ రంగీలా(రంజిత–గీత–లాస్య)లో గీత తనే అయింది. మూడో ప్రాజెక్ట్ ‘దామిని విల్లా’లో డైనమిక్ స్త్రీ వాద జర్నలిస్ట్ పాత్రలో ఆమె కనిపిస్తోంది. ఇందులో ఆదిత్య ఓం హీరో. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా త్వరలోనే విడుదలకానుంది. రవిశంకర్ దర్శకత్వంలో రూపొందిన థ్రిల్లర్ సినిమా స్వాతి చినుకు సంధ్య వేళలో, నిర్బంధం సినిమా ఫేం బండి సరోజ్ కుమార్ హీరోగా స్వీయ దర్శకత్వంలో ఓ సినిమాలో ఆమె నటించింది. మరో మూడు సినిమాలు కథా చర్చల్లో ఉన్నాయి. తల్లిదండ్రుల ప్రోత్సాహం రేఖ తండ్రి కె.భోజరాజు ఏఆర్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. తల్లి సూర్య కుమారి గృహిణి. రేఖ భోజ్కు బీ–ఫార్మసీ చదువుతున్న సోదరి ఉంది. హీరో శోభన్‌బాబుకు ఆమె తల్లి వీరాభిమాని. నిత్యం శోభన్ బాబు సినిమాలు తల్లితో పాటు చూసే రేఖకు సినిమా అంటే ఇష్టం ఏర్పడింది. సహజ నటన, భిన్నమైన పాత్రల పట్ల ఆసక్తి పెంచుకుంది. నిరీక్షణ సినిమాలో అర్చన పోషించిన పాత్ర అంటే ఆమెకు చాలా ఇష్టం. హీరోల్లో ఫేవరేట్ పవన్ కల్యాణ్, ప్రభాస్, దర్శకుల్లో రాజమౌళి. బిచ్చగత్తె, ట్రాన్స్‌జెండర్, మతి స్థిమితం లేని, దగాపడ్డ మహిళ.. తదితర డీ గ్లామరైజ్డ్ క్యారెక్టర్లు చేయడానికి సిద్ధమే అంటోంది రేఖ భోజ్. మరిన్ని అవకాశాల కోసం.. తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో ప్రవేశం ఉన్న రేఖ మంచి పాత్రలతో కూడిన అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లు చెబుతోంది. పెద్ద, చిన్న సినిమాలు ఉండవనీ, సక్సెస్ వైపు మాత్రమే సినిమా పరిశ్రమ చూస్తుందని ఆమె అంటున్నారు. ఈ ఏడాదిలో తనవి మూడు సినిమాలు విడుదల అవుతాయని... ఈ సినిమాల ద్వారా మరింత గుర్తింపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న కథా చర్చలు కొలిక్కి వస్తే ఒకేసారి రెండు, మూడు సినిమాల చిత్రీకరణ ప్రారంభమవుతుందని రేఖ ‘సాక్షి’కి వివరించారు. ఇది కూడా చదవండి: మంచు లక్ష్మిపై ట్రోల్స్.. స్మగ్లర్ అంటూ కామెంట్స్ -
నవ వధువు సృజన మృతిపై వీడిన మిస్టరీ.. అతడి కోసమే ఇలా..
సాక్షి, విశాఖపట్నం: మధురవాడలో నవ వధువు సృజన మృతిపై ఎట్టకేలకు మిస్టరీ వీడింది. సృజన మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలసులు నిర్ధారించారు. పెళ్లి ఆపాలనే ప్రయత్నంలోనే సృజన ప్రాణాలు పోగొట్టుకున్నట్టు వెల్లడించారు. పెళ్లికి 3 రోజుల ముందు ఇన్స్‌స్టాగ్రామ్‌లో పరవాడకు చెందిన ప్రియుడు మోహన్‌తో చాటింగ్ చేసినట్టు పోలీసులు తెలిపారు. కాగా, సరైన ఉద్యోగం లేకపోవడంతో పెళ్లికి సమయం కావాలని మోహన్.. సృజనను కోరినట్టు చెప్పారు. దీంతో పెళ్లి ఆపేందుకు ప్రయత్నిస్తానని ప్రియుడికి చెప్పింది. అనంతరం పెళ్లి ఆపేందుకు సృజన విష పదార్థం సేవించింది. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవ వధువు సృజన మృతి చెందినట్టు స్పష్టం చేశారు. ఇదీ జరిగింది.. విశాఖ నగర శివారులోని మధురవాడ నగరం పాలెంలో నాగోతి శివాజీ, సృజనల వివాహానికి ఏర్పాట్లు జరిగాయి. కళ్యాణ మండపంలో నవ వధువు సృజన ఒక్కసారిగా కుప్పకూలిన విషయం తెలిసిందే. దీంతో ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం వధువు బ్యాగులో గన్నేరు పప్పు తొక్కలు లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: ప్రేమ పెళ్లి.. నా భర్త దగ్గరికి వెళ్లిపోతా.. ఇంతలోనే ఘోరం.. -
బీచ్ ఐటీ @ వైజాగ్ వయా దావోస్
ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద నగరమైన విశాఖపట్నం కేంద్రంగా బీచ్ ఐటీని డెవలప్ చేయాలని సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నారు. విశాఖపట్నంలో ఉన్న మానవ వనరులు, ఇంటర్నేషన్ ఎయిర్పోర్ట్ ఇతర ఎకో సిస్టమ్‌లు ఇక్కడ త్వరగా ఐటీ రంగం నిలదొక్కుకునేందుకు దోహదం చేస్తాయనే అంచనాలు ఉన్నాయి. వీటికి తోడు ఇక్కడ ఐటీ రంగం మరింత ఆకర్షణీయంగా ఉండేందుకు బీచ్ ఐటీ కాన్సెప్టును జోడించారు. ప్రస్తుతం ఏపీలో రమారమి మూడు వందల ఐటీ కంపెనీలు ఉండగా ఇందులో 80 శాతం కంపెనీలు విశాఖ కేంద్రంగానే తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. సంఖ్యా పరంగా ఐటీ కంపెనీలు ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తున్నా.. దిగ్గజ ఐటీ కంపెనీల కన్ను ఇంకా విశాఖ మీద పడలేదు. దీంతో ఐటీ కంపెనీలకు మరింత ప్రోత్సహాం అందిస్తూనే ఐటీ రంగానికి ఆకర్షణీయమైన డెస్టినేషన్‌గా విశాఖను మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీని కోసం ఇప్పటికే అమెరికాలో సక్సెస్ అయిన బీచ్ ఐటీ మోడల్‌ను పరిశీలిస్తున్నారు. అమెరికాలోని అట్లాంటా తీరంలో ఉన్న వర్జీనియా అందమైన బీచ్‌లకు ప్రసిద్ధి. ఇక్కడ ఐటీ రంగాన్ని ప్రోత్సహించేందుకు అక్కడి ప్రభుత్వం బీచ్ ఐటీ విధానం తీసుకువచ్చింది. అదే తరహాలో విశాఖలోనూ బీచ్ ఐటీని ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఉన్నారు. దీని ప్రకారం ఐటీ కంపెనీలు, ఐటీ ఎకోసిస్టమ్‌లో ఉన్న సంస్థలన్నీ విశాఖ సముద్ర తీరంలో కొలువుదీరేలా ప్లాన్ రెడీ చేశారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో బీచ్ ఐటీ కాన్సెప్టును వివరించనున్నారు. చదవండి: దావోస్‌లో సీఎం జగన్‌కు ఘన స్వాగతం -
బాబు పర్యటనకు దూరంగా గంటా శ్రీనివాసరావు
మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు తెలుగుదేశం పార్టీలో ఇబ్బందులు ఎదురవుతున్నాయా? విశాఖ పర్యటనలో చంద్రబాబు కనీసం గంటా వైపు కన్నెత్తి చూసేందుకు కూడా ఇష్టపడలేదా? పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కింద సీటుకే పరిమితమవ్వాల్సి వస్తుందన్న భయంతోనే పార్టీ సమావేశానికి మాజీ మంత్రి దూరంగా ఉన్నారా? గంటాను బాబుకు దగ్గర చేసేందుకు మాజీ మంత్రి నారాయణ చేసిన యత్నాలు విఫలమయ్యాయా? మొదలైన ప్రశ్నల పరంపరకు టీడీపీలోని వర్గాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : తెలుగుదేశం పార్టీలో గంటా, అయ్యన్న ఉత్తర దక్షిణ ధ్రువాలు. సాధారణంగా అధినేతకు ఒకరు దగ్గరైతే మరొకరు దూరంగా ఉంటారు. విచిత్రంగా ఈసారి చంద్రబాబు పర్యటనలో ఇద్దరి పాత్ర పరిమితంగానే కనిపించింది. ఇది ఇప్పుడు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బాదుడే బాదుడు పేరుతో చంద్రబాబు చేపట్టిన విశాఖ పర్యటన మొత్తంలో ఎక్కడా గంటా వాసన లేకుండా పార్టీ కార్యక్రమం నడిచింది. మరోవైపు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కూడా కార్యక్రమంలో ఎక్కడా యాక్టివ్‌గా కనిపించకపోవడం గమనార్హం. కేవలం చంద్రబాబుతో కరచాలనానికే ఆయన పరిమితమవ్వడం ఆ పార్టీ వర్గాలను ఆశ్చర్యచకితులను చేసింది. తనకు, తన కుమారుడికి సీటు ఇవ్వాలంటూ అయ్యన్న పెట్టిన ప్రతిపాదనపై చంద్రబాబు నుంచి సానుకూలత రాకపోవడంతోనే అయ్యన్న కాస్త దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, బాదుడే బాదుడంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని ధరల పెరుగుదల అంశంపై కార్యక్రమం చేపట్టడంపై అంతర్గతంగా ఇష్టం లేకపోవడమూ ఒక కారణమని తెలుస్తోంది. మొత్తంగా చంద్రబాబు విశాఖ పర్యటన సందర్భంగా ఆ పార్టీ నేతల్లో ఉన్న విభేదాలు మరోసారి బహిరంగమయ్యాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మధ్యవర్తిగా నారాయణ....! వాస్తవానికి విశాఖ సిటీలో ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు గెలుపొందారు. అయినప్పటికీ గత మూడేళ్లుగా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. అంతేకాకుండా కాపు మేధావుల సమావేశంలో మాత్రం ప్రత్యక్షమవుతున్నారు. హైదరాబాద్‌తో పాటు విశాఖలో జరిగిన సమావేశంలోనూ ఆయన పాల్గొన్నారు. ఈ వ్యవహారంపై చంద్రబాబు గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవైపు జనసేనతో పొత్తుకు బాబు ప్రయత్నిస్తుండగా.... మరోవైపు కొత్త కేంద్రాన్ని గంటా ప్రోత్సహిస్తున్నారనే కోపంలో బాబు ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే తాజా పర్యటనలోనూ పట్టించుకోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గంటాను బాబుకు దగ్గరకు చేసేందుకు మాజీ మంత్రి నారాయణ ప్రయత్నించినట్టు తెలుస్తోంది. అయితే, చంద్రబాబు మాత్రం ససేమిరా అన్నట్టు సమాచారం. బురదలోంచి వానపాములంటూ...! బురదలోంచి వానపాములు వస్తున్నాయంటూ పరోక్షంగా గంటా గురించి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కొద్దిరోజుల క్రితం వ్యాఖ్యానించారు. పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో గత మూడేళ్లుగా బయటకు రాలేదని... ఇప్పుడు తిరిగి వస్తున్నారని మండిపడ్డారు. ఇదే నేపథ్యంలో తాజాగా చంద్రబాబు పర్యటన సందర్భంగా పాల్గొనేందుకు గంటా శ్రీనివాసరావు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే విశాఖ విమానాశ్రయానికి చంద్రబాబును పలకరించేందుకు వెళ్లినట్టు తెలిసింది. అయితే, కనీసం చంద్రబాబు మాట వరుసకు కూడా గంటా మొహం చూడలేదని పార్టీ వర్గాలే పేర్కొంటున్నాయి. అంతేకాకుండా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కూడా గంటా పాల్గొనలేదు. ఒకవేళ గంటా పాల్గొన్నప్పటికీ కేవలం కింద సీటుకే పరిమితమవ్వాలన్న సంకేతాలు రావడంతోనే వెళ్లలేదన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు గంటా శ్రీనివాసరావుపై అవకాశం వచ్చినప్పుడల్లా అయ్యన్న విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. గతంలోనూ గంటా భూకబ్జాలపై పరోక్షంగా అయ్యన్న విమర్శలు చేశారు. తాజాగా టీఎన్ఎస్ఎఫ్ సమావేశంలోనూ బురద పాములు ఇప్పుడు బయటకు వస్తున్నాయని.... బురద పాములు ఎవరో మీకు తెలుసంటూ మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కూడా గంటాను దూరంగా పెడుతున్నామన్న సంకేతాలు ఇస్తున్నారు. అయినప్పటికీ అయ్యన్న కూడా తనకు, తన కుమారుడికి సీటు ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. దీనిపై చంద్రబాబు నుంచి సానుకూలంగా సంకేతాలు రాకపోవడంతో అలక వహించి అంటీముట్టనట్టు ఉన్నట్టు సమాచారం. ఏదీఏమైనప్పటికీ చంద్రబాబు విశాఖ పర్యటనతో ఆ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమయ్యాయన్న అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది. -
విశాఖ జాబ్ మేళాకు భారీ స్పందన
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర యూనివర్సిటీ(ఏయూ) ప్రాంగణంలో వైఎస్సార్సీపీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళా కార్యక్రమాన్ని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు పొందిన 22,227 మంది యువతకు అభినందనలు. చదువుతో పాటు ఉపాధి కల్పించాలన్న ఆలోచన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే. ఇంత పెద్ద ఉపాధి లభించడం సీఎం జగన్‌కు సంతోషం కలిగించే అంశమని అన్నారు. తొలి రోజు 13, 663 రెండో రోజు 8,557 మందికి ఉద్యోగాలు లభించాయి. మొత్తం 22,227 మంది రెండు రోజుల్లో ఉపాధి కల్పించడం వైఎస్సార్సీపీ సాధించిన రికార్డు. అత్యధికంగా ఏడాదికి 12 లక్షలు 50 వేలు, అత్యల్పంగా నెలకు 15 వేలు వేతనం ఉద్యోగాలు అందించాము. రానున్న రోజుల్లో మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా విద్యార్థులు ఎదగాలి’’ అని అన్నారు. -
వారొస్తేనే మిర్చి కోతలు.. వలస కూలీల బతుకుచిత్రం ఇది..
సాక్షి, ఎటపాక: కాయకష్టం వారికిష్టం..చిన్నా పెద్దా తేడాలుండవు.. సమష్టిగా పనిచేయడం.. వచ్చిన దానినే అంతా సమానంగా పంచుకోవడం వారి నైజం. కల్మషం లేని హృదయాలు వారివి. వారంతా వలస కూలీలు. పొరుగున ఉన్న చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఏటా కూలీ పనుల కోసం ఏజెన్సీకి వలస వచ్చి మూడునెలల కాలం ఇక్కడే జీవనం సాగిస్తారు. ఎటపాక, కూనవరం, వీఆర్‌పురం మండలాలతో పాటు తెలంగాణలోని చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలు, పశ్చిమగోదావరి జిల్లాలోని కుక్కునూరు, వెలేరుపాడు మండలాల్లో సుమారు 10 వేల ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేస్తారు. అయితే మిర్చి కోతలకు జనవరి ప్రారంభంలోనే కూలీలు కుటుంబ సమేతంగా తిండి గింజలు పట్టుకుని పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడకు వస్తారు. వీరిని ఇక్కడకు తీసుకొచ్చేందుకు రైతులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఎందుకంటే వీరొస్తేనే మిర్చి పంట చేతికొచ్చేది. ఏజెన్సీలో సుమారు 8 వేల మంది వలస కూలీలు ఈ నెల చివరి వరకు ఇక్కడే ఉండి కూలి పనులు చేసుకుంటారు. మిర్చి తోటల్లోనే భోజనం చేస్తున్న కూలీలు ఆహారపు అలవాట్లు వలస కూలీలు వారి వెంట తెచ్చుకున్న దంపుడు బియ్యాన్నే భోజనం తయారీకి వాడతారు. అన్నంలో కలుపుకునేందుకు చింత పండు పులుసునే నిత్యం తయారు చేసుకుంటారు. ఘాటుగా ఉండే పచ్చి మిరపకాయలను బండపై నూరి దానినే అన్నంలో కలుపుకుని ఎంతో ఇష్టంగా తింటారు. రైతులు దయతలచి వారానికోమారు ఇచ్చే జుట్టు కోళ్లను(లగ్గారం) కోసుకుని తింటారు. వీరికి నీటి గుంటలు, సెలయేర్లు, సాగునీటి పైపుల వద్ద నీటితోనే స్నానాలు చేయడం అలవాటు. కొందరు ఆ నీటినే తాగుతుంటారు. ఎండ తీవ్రతకు చెట్ల కింద సేదతీరుతున్న ఆదివాసీలు రాత్రి భోజనాల అనంతరం సంప్రదాయ నృత్యాలతో సందడి చేసి నిద్ర పోవడం వీరి దినచర్య. ఇలా వారు పిల్లా పాపలతో కలిసి కూలి పనులు చేస్తారు. తద్వారా వచ్చిన డబ్బులు, మిరపకాయలను భద్రంగా దాచుకుని తిరిగి వారి సొంత గ్రామాలకు పయనమవుతారు. ఇలా వలస కూలీలనే నమ్ముకుని ఇక్కడి రైతులు మిర్చి సాగు చేస్తుంటారు. వీరు ఇక్కడ కూలి పనులకు ఉన్నంత కాలం స్థానిక పల్లెల్లో సందడిగా ఉంటుంది. వ్యాపారాలు జోరుగా సాగుతాయి. కాలువల్లో చెలమ నీటిని తాగుతున్న చిన్నారులు వాగులు వంకల్లోనే నివాసం కూలీ పనులకు వచ్చిన వీరంతా గుంపులు గుంపులుగా వాగులు, గోదావరి ఇసుక దిబ్బలపై నివాసం ఉంటారు. నీటి సౌకర్యం ఉన్న చోట గుడారాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తారు. వారి వెంట తెచ్చుకున్న ఆహార పదార్థాలను కలిసి వండుకుంటారు. సూర్యుడు ఉదయించక ముందే మిర్చి తోటల్లో కాయలు కోసేందుకు వెళ్లిపోతారు. కొద్ది గంటలు పనులు చేశాక వారి వెంట తెచ్చుకున్న భోజనాన్ని సమానంగా పంచుకుని తోటల్లోనే తింటారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటే కొంత సమయం చెట్ల నీడనే సేదతీరి.. ఆ వెంటనే మరలా పనులకు ఉపక్రమిస్తారు. సూర్యుడు అస్తమించాక వీరి నివాస ప్రాంతాలకు క్యూ పద్ధతిలో వెళ్లిపోతారు. పని విరామంలో వారికి వారే క్షవరం చేసుకుంటున్న దృశ్యం -
Paytm: వైజాగ్ వర్తకులకు అదనపు ఆదాయం, వాళ్లకి క్యాష్‌బ్యాక్!
హైదరాబాద్: పేటీఎం (వన్ 97 కమ్యూనికేషన్స్) తన మర్చంట్ భాగస్వాముల ఆదాయం పెంపునకు ప్రత్యేక కార్యక్రమాన్ని విశాఖపట్నంలో ప్రారంభించింది. పేటీఎం యాప్‌తో చెల్లింపులను స్వీకరించడం ద్వారా ప్రతి నెలా రూ.2,100 అదనపు ఆదాయం పొందొచ్చని ప్రకటించింది. డిజిటల్ చెల్లింపులకు ప్రోత్సాహకాలను అందిస్తున్నట్టు పేటీఎం తెలిపింది. పేటీఎం అందిస్తున్న ఈ ఆఫర్ కింద వినియోగదారులు సైతం తమ మొదటి యూపీఐ చెల్లింపు అనంతరం రూ.100 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చని పేర్కొంది. పేటీఎం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి చెల్లింపులు చేయాల్సి ఉంటుందని తెలిపింది. ప్రస్తుత వర్తకులను ప్రోత్సహించడం, కొత్తవారిని ఆకర్షించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్టు సంస్థ ప్రకటించింది. చదవండి: ట్రాఫిక్ ఈ చలాన్స్.. పేటీఎం ద్వారా రూ. 60 కోట్లు వసూళ్లు -
అనుమతుల్లో ఆలస్యం.. ఎన్ఐవో ల్యాబ్ నిర్మాణంలో జాప్యం
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నంలోని రిషికొండలో తలపెట్టిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (ఎన్ఐవో) ల్యాబొరేటరీ నిర్మాణంలో అసాధారణ జాప్యం జరుగుతున్న విషయం వాస్తవమేనని కేంద్ర సైన్స్, టెక్నాలజీశాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ అంగీకరించారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. జాప్యానికి కారణాలను వివరించారు. ఎన్ఐవో ల్యాబొరేటరీ నిర్మాణానికి కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అనుమతి సాధించడంలో జాప్యం జరిగిందని చెప్పారు. అలాగే స్కీమ్‌లకు తుదిరూపం ఇవ్వడంలో, ఇతర పాలనాపరమైన అనుమతులు పొందడంలో జాప్యం జరిగినట్లు తెలిపారు. ల్యాబొరేటరీ భవనాల ఆకృతులను రూపొందించేందుకు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) సంస్థను ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ (పీఎంసీ)గా ఎంపికచేసి 2009లో పని అప్పగించినట్లు చెప్పారు. పీఎంసీ రూ.30 కోట్ల ప్రాథమిక అంచనా వ్యయంతో ల్యాబొరేటరీ భవనాల డ్రాయింగ్లను సమర్పించిందన్నారు. కాంట్రాక్ట్ బాధ్యతల ప్రకారం ఎన్ఐవో క్యాంపస్‌కు సంబంధించి ప్లానింగ్, డిజైనింగ్, ఎగ్జిక్యూషన్ పనులను పీఎంసీనే చేపట్టాలన్నారు. కానీ ఒప్పందంలోని బాధ్యతలను అది నేరవేర్చనందున ఎన్ఐవో క్యాంపస్ నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగిందని చెప్పారు. అందువల్ల బీఎస్ఎన్ఎల్కు అప్పగించిన పీఎంసీ కాంట్రాక్టును రద్దుచేయడానికి ఉభయుల మధ్య అంగీకారం కుదిరిందని తెలిపారు. ఈ ఒప్పందం రద్దయిన వెంటనే ప్రభుత్వం కొత్త పీఎంసీ కోసం టెండరు పిలుస్తుందన్నారు. కొత్త పీఎంసీకి పనులు అప్పగించిన తర్వాత ఆరునెలల్లో పాలనాపరమైన, ఆర్థిక అనుమతులు పొందగలమని భావిస్తున్నట్లు చెప్పారు. క్యాంపస్, భవనాల నిర్మాణం ప్రారంభమైన తర్వాత 18 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. -
కబ్జాల నుంచి.. విశాఖకు విముక్తి
ఈ ఫొటోల్లో కనిపిస్తున్న ఆక్రమణల తొలగింపు కార్యక్రమం 2020, అక్టోబర్ 24 నాటిది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి రుషికొండ ప్రాంతంలో 42.51 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాచేశారు. గీతం యూనివర్సిటీకి సమీపంలో ఉన్న ఈ స్థలాన్ని ఆక్రమించుకుని ఇందులోని రెండెకరాల్లో కళాశాల భవన నిర్మాణాలు చేపట్టారు. మిగిలిన స్థలానికి కాంపౌండ్ వాల్ నిర్మించారు. సుమారు రూ.500 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని దశాబ్దాల పాటు కబ్జా చేసినప్పటికీ.. తెలుగుదేశం నేత కావడంతో ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గీతం యూనివర్సిటీ ప్రహరీ గోడను తొలగించి కబ్జాలో ఉన్న 42.51 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ అంటే అందమైన నగరం.. మరో పేరు చెప్పమంటే ప్రశాంత తీరం.. అటువంటి మహానగరంలో అవకాశమున్న ప్రతీచోటా రూ.వేల కోట్లు విలువచేసే ప్రభుత్వ భూములను కబ్జాకోరులు చెరపట్టేశారు. వీరిలో అత్యధికులు తెలుగుదేశం పార్టీకి చెందిన వారే. ఇప్పుడు వీరి ఆగడాలకు రాష్ట్ర ప్రభుత్వం కళ్లెంవేస్తూ వారి భరతం పడుతోంది. ఆక్రమణలకు గురైన భూములను విడిపిస్తూ విశాఖ నగరానికి విముక్తి కల్పిస్తోంది. ఇలా ఇప్పటివరకు రూ.5,080 కోట్ల విలువైన సర్కారు భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏళ్లుగా కబ్జాల్లో ఉండి.. ప్రభుత్వ కార్యాలయాల్లో మూలనపడిన భూ రికార్డుల దుమ్ముదులిపి ఈ భూముల లెక్కతేలుస్తున్నారు. బినామీ పేర్లతో టీడీపీ నేతల భూదాహం గతంలో అధికారంలో ఉన్న టీడీపీ నేతలు బినామీ పేర్లతో విశాఖ జిల్లా భూములపై తెగబడ్డారు. ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న విశాఖ, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా రూ.వేల కోట్లు ఖరీదుచేసే భూములను చెరపట్టేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. టీడీపీ పెంచి పోషించిన భూబకాసురుల ఆక్రమణలపై ప్రభుత్వాధికారులు ఉక్కుపాదం మోపారు. భూ రాబందుల నుంచి రూ.2,600 కోట్లకు పైగా విలువైన 430.81 ఎకరాల భూములను వారి చెర నుంచి విడిపించారు. వీటి మార్కెట్ విలువ ఏకంగా రూ.5 వేల కోట్లకు పైమాటే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందాలతో.. నిజానికి.. విశాఖ నగరంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో ఆక్రమణలకు గురైన కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూముల సంరక్షణ కోసం జిల్లా రెవెన్యూ అధికారులు మూడేళ్లుగా చర్యలకు ఉపక్రమిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటుచేసి.. రికార్డుల ఆధారంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నారు. మొత్తం 270 ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైన 430.81 ఎకరాల భూములను స్వాధీనం చేసుకున్నారు. వీటి ప్రభుత్వ విలువ రూ.2,638 కోట్లు కాగా.. మార్కెట్ విలువ రూ.5 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. పదేపదే ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడిన వారిపైనా క్రిమినల్ కేసులు సైతం నమోదు చేస్తున్నారు. పీఠాలు కదులుతున్నాయ్.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వేల కోట్లు రూపాయల విలువ చేసే భూములను దోచుకున్న టీడీపీ నేతల భూభాగోతం బట్టబయలైంది. జిల్లా అధికారులు స్వాధీనం చేసుకున్న భూముల్లో సింహభాగం టీడీపీ కబ్జాకోరుల కబంధ హస్తాల్లోనివే కావడం గమనార్హం. గయాలు, పోరంబోకు, గోర్జి, కొండ పోరంబోకు, వాగులు, కాలువలు, గెడ్డలు, రాస్తాలు, గుట్టలు, ఇనాం, జిరాయితీ, గ్రామకంఠాలు, చెరువులు.. ఇలా కాదేదీ కబ్జాకు అనర్హం అన్నట్లుగా అందినకాడికి తమ గుప్పిట బంధించేశారు. ఇప్పుడు వీరి పీఠాలు కదులుతున్నాయి. 430 ఎకరాలకుపైగా స్వాధీనం జిల్లాలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను రక్షించే చర్యలను చేపడుతున్నాం. గత మూడేళ్లల్లో జిల్లావ్యాప్తంగా 430 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని రక్షించాం. వీని బేసిక్ విలువ రూ.2,638 కోట్లకు పైగా ఉందని తేలింది. మార్కెట్ ధరలతో లెక్కిస్తే రూ.5 వేల కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్కారు భూములను రక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. – వేణుగోపాల్ రెడ్డి, జేసీ, విశాఖపట్నం జిల్లా -
అవగాహనే అస్త్రం.. వినియోగదారుడా మేలుకో..
కొనే ప్రతి వస్తువులోనూ, సేవలోనూ లోపం లేకుండా సరైన ధర, తూకం, నాణ్యత, స్వచ్ఛత కలిగినవి పొందే హక్కు వినియోగదారులకు ఉంది. కానీ ప్రస్తుత కాలంలో మోసాలు ఎక్కువై పోయాయి. చివరికి మనం తాగే పాళ్లు, నీళ్లలో కూడా నాణ్యత లేకుండా పోతుంది. తూకాల్లో భారీగా తేడాలు ఉంటున్నాయి. వీటిపై ఎవరైనా ప్రశ్నిస్తే, నిలదీస్తే తప్ప న్యాయం జరగడం లేదు. ఈ తరహా మోసాలను అరికట్టాలంటే వినియోగదారులే మేల్కొనాల్సిన అవసరం చాలా ఉంది. తమ హక్కులపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరముంది. నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా వినియోగదారులకు అవగాహన కల్పిచడంతో పాటు వారి హక్కులు, ఏర్పాటైన పరిరక్షణ చట్టం, ఫిర్యాదు ఏ విధంగా చేయాలనే వివరాలపై ప్రత్యేక కథనం. –తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర) వినియోగదారులెవరు..? వినియోగదారులు హక్కుల చట్టం 1986 ప్రకారం తమ అవసరార్థం వస్తువులు లేదా సేవలు కొనుగోలు చేసే వారు వినియోగదారులు. కొనుగోలు దారుల అనుమతితో ఆ వస్తువులు, సేవలు వినియోగించుకొనే వారు సైతం వినియోగదారులే. ఈ నిర్వచనం ప్రకారం అందరూ ఏదో ఒక రకంగా వినియోగదారులమే. చట్టంలో ఏముంది...? భారత ప్రభుత్వం 1986లో వినియోగదారుల రక్షణకు ఒక విప్లవాత్మకమైన చట్టాన్ని తెచ్చింది. అదే వినియోగదారులు హక్కుల పరిరక్షణ చట్టం. ఈ చట్టాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ‘రీడ్రసల్ ఫోరమ్స్’ను ప్రతి జిల్లా కేంద్రంలోను ఏర్పాటు చేశారు. ఇవి జిల్లా, రాష్ట్ర, కేంద్ర స్థాయి ఫోరమ్స్‌గా మూడు విభాగాలుగా విభజించారు. వినియోగదారుల హక్కులు... భద్రత హక్కు కొనే వస్తువులు, పొందే సేవలు వినియోగదారులు తక్షణ అవసరాలు తీర్చడమే కాకుండా అవి సుదీర్ఘ కాలం మన్నేలా ఉండాలి. అవి వినియోగదారుల జీవితాలకు, ఆస్తులకు నష్టం కలిగించే విధంగా ఉండకూడదు. ఈ భద్రత పొందటానికి వినియోగదారులు కొనే వస్తువుల నాణ్యతను నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. వీలైనంత వరకు ఐఎస్ఐ, అగ్మార్క్, హాల్‌మార్క్, వంటి నాణ్యతా చిహ్నాలు గల వస్తువులనే కొనుగోలు చేయాలి. న్యాయం పొందే హక్కు.. అన్యాయమైన వాణిజ్య విధానాలు, మోసపూరిత పద్ధతుల నుంచి న్యాయబద్ధమైన రక్షణ పొందవచ్చు. న్యాయ సమ్మతమైన ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. ఫిర్యాదు ధనపరంగా చిన్న మొత్తానికో లేదా అంశానికో కావచ్చు... అయినా సమాజంపై దాని ప్రభావం అసమానం కావచ్చు. భారత ప్రమాణాల మండలి... వస్తువుల ప్రమాణాలను గుర్తించేందుకు మన దేశంలో ప్రధానంగా బీఐఎస్, ఎన్టీహెచ్లు పనిచేస్తున్నాయి. ఇవి ఆయా వస్తువులను బట్టి ఐఎస్ఐ, హాల్‌మార్కింగ్, సర్టిఫికెట్లను ఇస్తుంటాయి. వినియోగదారులు అవసరాలు నెరవేర్చే రీతిలో వస్తువులు, సేవల నాణ్యతలు పరిరక్షించడం బీఐఎస్ ప్రధాన విధి. పరిశ్రమలు, వ్యాపార వర్గాలు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను అందుకునే విధంగా తగిన జాగ్రత్తలను సూచించడం కూడా బీఐఎస్ విధులలో భాగమే. అలాగే స్వర్ణాభరణాల, వెండి ఆభరణాల నాణ్యతకు హాల్ మార్కింగ్ విధానం కూడా బీఐఎస్ విధిలో భాగమే. బిఐఎస్ కింద 5 ప్రాంతీయ కార్యాలయాలు, 32 శాఖా కార్యాలయాలు, 8 ప్రయోగశాలలు పనిచేస్తున్నాయి. ప్రమాణాల రూపకల్పన, ప్రొడక్ట్ సర్టిఫికేషన్, మేనేజ్మెంట్ సిస్టం సరి్టఫికేషన్, హాల్ మార్కింగ్‌లలో బీఐఎస్ పనిచేస్తోంది. కొనుగోలు విషయంలో సూచనలు... కొనుగోలు చేస్తున్న వస్తువులు, సేవలపై గరిష్ట పరిమాణం, ఏ గ్రేడ్‌కు చెందినవి, వాటిలో కలిపిన పదార్థాలు, రంగులు, రసాయనాలు, ఎలా ఉపయోగించారో తెలిపే ప్రకటనను వినియోగదారులు కచ్చింతగా గమనించాలి. మందులు–ఆహార పదార్థాల చట్టం ప్రకారం అన్ని ఆహార పదార్థాల ప్యాకేజీలపై విధిగా నికర మొత్తం లేబుల్స్‌పై చూపాలి. దేనిలో నెట్ కంటెంట్స్ ఎక్కువగా ఉన్నాయో చూసి కొనాలి. కాస్మోటిక్ ఉత్పత్తులపై తప్ప కుండా వస్తువు ధర, తయారీ తేదీ, గడువు తేదీ, తయారీదారు చిరునామా, వస్తువు బరువు ముద్రించి ఉండాలి. ఉత్పత్తులపై ముద్రించిన ఎంఆర్పీపై స్టిక్కర్ అంటించి దాని ధరను మార్చి అమ్మడం జరుగుతుంది. ఈ విషయంలో కచ్చితంగా గమనించాలి. ఆటో మీటర్లను టాంపరింగ్ చేసి ఎక్కువ తిరిగేలా చేస్తుంటారు. వీటిని టైం టెస్ట్, బెంచ్ టెస్ట్ ద్వారా కనిపెట్టవచ్చు. పరిహారాన్ని ఎలా పొందుకోవచ్చు. ఎలాంటి కొనుగోళ్లు, లావాదేవీలు చేసినా వినియోగదారుడు బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి. వారంటీ, గ్యారంటీ ద్వారా లబ్ధి పొందాలనుకునే వారు ఇతర బిల్లులు, ఇన్వాయిస్ వంటివి జతచేయాల్సి ఉంటుంది. వినియోగదారుల హక్కులకు చట్టపరంగా రక్షణ ఉంటుంది. కొనుగోలు చేసిన వస్తు, సేవలలో లోపాలు ఉన్నా, అమ్మకం దారులు చెప్పినదానికి, వాస్తవ వస్తుసేవలకు తేడాలు ఉన్నా, వినియోగదారుడు నష్టపరిహారాన్ని కోరే అవకాశం ఉంటుంది. కొన్ని సార్లు వినియోగదారుడికి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. ఇటువంటప్పుడు తనకు కలిగిన డ్యామేజిని బట్టి నష్టపరిహారాన్ని పొందే హక్కు వినియోగదారుడికి ఉంటుంది. సమస్యల పరిష్కారం, నష్టపరిహారం కోసం వినియోగదారులకు ఎదురైన సమస్యలు, నష్టపరిహారం కోసం జిల్లా స్థాయిలో జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లు ఏర్పాటు చేశారు. ఇవి పూర్తి స్థాయిలో 2022 ఫిబ్రవరి నుంచి సేవలందిస్తున్నాయి. గత రెండేళ్లుగా ఇవి ఖాళీగానే ఉన్నాయి. గతంలో వీటిని వినియోగదారుల ఫోరంగా పిలిచేవారు. వీటిని 2019లో వినియోగదారులు వివాదాల పరిష్కార కమిషన్లుగా మార్చారు. విశాఖలో ఇటువంటి రెండు కమిషన్లు ఉన్నాయి. రెండు జడ్జి కోర్టు ఎదురుగా గల వీధిలో ఉన్నాయి. వినియోగదారులు ఏదైనా సమాచారం కోసం డైరెక్టుగా లేదా ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. ఫిర్యాదు ఎలా చేయాలంటే..? ఫిర్యాదు చేసే విధానం చాలా సులభం. అలాగే దానిపై స్పందన కూడా త్వరగా ఉంటుంది. తెల్ల కాగితంపై ఫిర్యాదు వివరాలు రాసి పంపవచ్చు. న్యాయవాది అవసరం లేదు, ఫిర్యాదుదారుడైనా, అతని ఏజెంటైనా ఫోరంలో స్వయంగా ఫిర్యాదు ఇవ్వవచ్చు. అలా వీలు కాకపోతే పోస్టు ద్వారా కూడా పంపే వీలుంది. ఫిర్యాదులో ఏం రాయాలి..? ఫిర్యాదుదారు పూర్తి పేరు, చిరునామా, ఇతర వివరాలు ఏవైనా ఉంటే ఇవ్వడం మంచిది. అలాగే, అవతలి పార్టీ పూర్తి పేరు, చిరునామా, ఫిర్యాదు చేయడానికి గల కారణాలు, ఎప్పుడు.. ఎలా.. జరిగింది, ఏ విధంగా నష్టపోయారనే విషయాలు తెలుపుతూ డాక్యుమెంట్లు, రసీదులు, ఇతర వివరాలు ఏవైనా ఉంటే ఫిర్యాదుకు జత చేయాలి. ఇవి కేసు విచారణ సమయంలో ఉపయోగపడుతాయి. ఫిర్యాదుదారుడు ఏ విధంగా నష్ట పరిహారం అడుగుతున్నాడో వివరణ ఇవ్వాలి. విశాఖలో కమిషన్–1లో ఇప్పటివరకు 383 కేసులు నమోదు కాగా ఫిబ్రవరిలో 7 కేసులు పరిష్కరించారు. (గత రెండేళ్లుగా కోవిడ్ కారణంగా ఇవి పనిచేయలేదు.) కమిషన్ 1 ఫోన్ నంబర్ 0891–2746026 కమిషన్ 2లో ఫిబ్రవరి 2022 వరకు 443 కేసులు నమోదుకాగా, 13 కేసులు ఫిబ్రవరిలో పరిష్కరించారు. కమిషన్ 2 ఫోన్ నంబర్ 0891–2734128 ఇవి కాకుండా కొన్ని స్వచ్ఛంధ సేవా సంస్థలు కూడా వినియోగదారుల హక్కుల కోసం పనిచేస్తున్నాయి. మోసపోతున్నా ముందుకు రావడం లేదు వినియోగదారులు నిత్యం మోసపోతూనే ఉన్నారు. మోసాలపై ఫిర్యాదు చేసేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. కారణం సమయం వెచ్చించలేకపోవడం, సరైన అవగాహన లేకపోవడం. అందుకే విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. హాస్పటల్, డయాగ్నోస్టిక్ సెంటర్స్, పెట్రోల్ పంప్స్, బంగారం షాపులు, ఇలా ప్రతి చోటా వినియోగదారుడు మోసపోతున్నాడు. ఉదాహరణకు ఎంఆర్ఐ స్కాన్‌కు నగరంలో సుమారు రూ.7వేలు వసూలు చేస్తున్నారు. కానీ దీని వాస్తవ ధర రెండు వేల లోపే. కానీ మధ్యవర్తుల కమీషన్ల కోసం ఇలా అమాంతం ధరలు పెంచేస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలో ప్రతి చోటా మా కార్యాలయాలను స్థాపించి, వలంటీర్లను నియమించి అవగాహన కల్పించాలనుకుంటున్నాం. –కొణతాల కృష్ణ, వినియోగదారుల హక్కుల చట్టం ఆర్గనైజేషన్,ఏపీ అధ్యక్షుడు అప్రమత్తంగా ఉండాలి వినియోగదారులు ఏదైనా వస్తువులు, సేవలు కొనుగోలు చేసేటప్పుడు పూర్తిగా దాని గురించి తెలుసుకోవాలి. వినియోగదారుడికి ఏదైనా వస్తు, సేవాలోపం జరిగినట్లయితే వెంటనే కమిషన్‌ను ఆశ్రయించవచ్చు. వినియోగదారులు వాణిజ్య ప్రకటనలు, వ్యాపార సంస్థల డిస్కౌంట్లకు, ఆఫర్లకు ఆకర్షితులై మోసపోతున్నారు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంస్థలు, బిల్టర్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు, ప్రముఖ మాల్స్ ఎక్కువగా ఇటువంటివి చేస్తుంటాయి. కానీ అమలులో ఇవి కనిపించవు. ఫిబ్రవరి 2022 నుంచి ఆంద్రప్రదేశ్‌లోని మొత్తం జిల్లాలో ఈ కమిషన్లు పనిచేయడం ప్రారంభించాయి. గతంలో ఎక్కడ కోనుగోలు చేస్తే అక్కడే ఫిర్యాదు చేయాల్సి వచ్చేది. కొత్త చట్టం ప్రకారం వినియోగదారుడు ఎక్కడైనా ఫిర్యాదు చేయవచ్చు. ఉన్నతాధికారుల అనుమతితో భవిష్యత్తులో స్కూల్స్‌లో, కళాశాలలో, గిరిజన, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటున్నాం. –వర్రి కృష్ణమూర్తి, ప్రిసైడింగ్ మెంబర్, జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్–1 -
అయ్యో అనూష.. భర్త ఊరి నుంచి వచ్చేసరికి..
చీకూ చింతా లేని చక్కని పొదరిల్లు వారిది.. భార్య, భర్త, వారికి ఇద్దరు ముత్యాల్లాంటి బిడ్డలు.. వారి ఆనందం చూసి విధికే కన్నుకుట్టిందో లేదా ఏ దుష్టగ్రహం కన్ను పడిందో గానీ క్షణ కాలంలో తల్లీ బిడ్డలు విగత జీవులుగా మారారు. కుమార్తెలను హతమార్చి, తల్లి ఆత్మహత్యకు పాల్పడినట్టు భావిస్తున్నారు. ఊరు వెళ్లిన భర్త ఇంటికి తిరిగి వచ్చేసరికి ఈ దారుణం జరిగింది. మృతురాలు సూసైడ్ నోట్ రాసి చనిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఆ లేఖలో ఏముందో తెలిస్తే గానీ అసలు విషయం బయటపడదు. అనకాపల్లి: స్వగ్రామానికి వెళ్లి హుషారుగా ఇంటికి తిరిగి వచ్చిన భర్త హతాశుడయ్యాడు.. భార్యా బిడ్డల మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరయ్యాడు.. ఇంతలోనే అంత కష్టం ఏమొచ్చిందని కుమిలిపోతున్నాడు. అనకాపల్లి శివారులో సోమవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. శ్రీకాకుళం జి ల్లా జలుమూరు మండలం శ్రీముఖలింగం మెట్ట పేట గ్రామానికి చెందిన మెట్ట జనార్దన్ ఆరేళ్ల కిందట తన అక్క కుమార్తె అనూష (24)ను వివాహం చేసుకున్నాడు. వారికి సుదీక్ష (5), మెట్ట గీత అన్విత (ఏడాదిన్నర) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జనార్దన్‌కు అచ్యుతాపురంలో ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం రావడంతో ఆరు నెలల నుంచి అనకాపల్లి జాతీయ రహదారికి సమీపంలో అనకాపల్లి–ఉమ్మలాడ రహదారిలో ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం ఉంటున్నాడు. జనార్దన్ ఉంటున్న ఇంటి పరిసరాలు నిర్మానుష్యంగా ఉంటాయి. దూరదూరంగా ఇళ్లు ఉంటాయి. మేడపై ఇంటి యజమాని కుటుంబంతో ఉంటున్నారు. జనార్దన్ శనివారం శ్రీకాకుళం వెళ్లాడు. సోమవారం సాయంత్రం 5.30 నిమిషాలకు తన సోదరుడితో కలిసి ఇంటికి వచ్చి చూడగా ఇద్దరు చిన్నారులు విగత జీవులుగా పడి ఉన్నారు. భార్య ఫ్యాన్‌కు ఉరిపోసుకొని ఉంది. దీన్ని గమనించిన భర్త జనార్దన్ భార్యను కిందకు దించాడు. జనార్దన్ సోదరుడు 100కు ఫోన్ చేసి సమాచారమిచ్చాడు. హుటాహుటిన డీఎస్పీ బి.సునీల్, పట్టణ సీఐ లంక భాస్కరరావులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. అనూష రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. దాని ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నట్లు డీఎస్పీ సునీల్ చెప్పారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. అద్దె ఇంటి యజమాని దుర్భాషలాడడంతో తన భార్య మనస్తాపం చెంది ఈ దారుణానికి పాల్పడినట్టు జనార్దన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారం కిందటే వచ్చారు.. జలుమూరు: నగరికటకం పంచాయతీ పరిధి మెట్టపేటకు చెందిన మెట్ట అనూష పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవడంతో మెట్టపేటలో విషాద ఛాయలు అలముకున్నాయి. అనూష తల్లిదండ్రులు మీనాకుమారి, సంజీవరావులు ఉపాధి రీత్యా పలాసలో ఉంటున్నారు. వారం కిందటే అనూషతో పాటు భర్త జనార్దనరావు స్వగ్రామం మెట్టపేట వచ్చారు. ఇంతలోనే ఈ విషాదకర వార్త వినాల్సి రావడంతో వారంతా విషాదంలో మునిగిపోయారు. -
గుడ్‌న్యూస్ వైజాగ్! నగరంలో ఈవీ చార్జింగ్ స్టేషన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా వైజాగ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసింది. 25 కిలోవాట్ సూపర్‌ఫాస్ట్ చార్జింగ్ కేంద్రాన్ని టాటా పవర్ సహకారంతో అందుబాటులోకి తెచ్చింది. ఎంజీ మోటార్ ఇప్పటికే దేశవ్యాప్తంగా 41 నగరాల్లో 44 సెంటర్స్‌ను ప్రారంభించింది. ఈజీ చార్జ్ బ్రాండ్ కింద టాటా పవర్ 180 నగరాలు, పట్టణాల్లో 1,000కిపైగా ఈవీ చార్జింగ్ కేంద్రాలను స్థాపించింది. -
గూగుల్‌కు నర్సీపట్నం యువకుడి ఎంపిక.. భారీ వేతనం!
విశాఖపట్నం: స్థానిక వెలమ వీధికి చెందిన జయంతి విష్ణు యాష్ భారీ వేతనంతో సాఫ్ట్వేర్ కొలువుకు ఎంపికయ్యాడు. విష్ణు హిమచల్‌ప్రదేశ్ ఎన్ఐటీలో బీటెక్ పూర్తి చేసిన అనంతరం యాక్సించర్ కంపెనీకి రూ.8.50 లక్షల వేతనంతో ఎంపికయ్యాడు. తాజాగా బెంగళూరులో ఉన్న గూగుల్ సంస్థ రూ.47.50 లక్షలు వార్షిక వేతనంతో విష్ణును ఎంపిక చేసింది. విష్ణు తండ్రి సత్యనారాయణమూర్తి రిటైర్డ్ వార్డెన్, తల్లి వేదవల్లి గృహిణి, కుమారుడు గూగుల్ సంస్థకు ఎంపిక కావటం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. -
ఐదేళ్లు ప్రేమాయణం, పెళ్లి చేసుకుంటానని.. వేరే యువతితో
విశాఖపట్నం: ఐదేళ్లుగా ప్రేమాయణం సాగించాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. శారీరకంగా దగ్గరై, ఇప్పుడు వేరే యువతిని వివాహం చేసుకోడానికి సిద్ధమయ్యాడు. ఆ యువకుడిపై స్థానిక పోలీసుస్టేషన్లో బాధితురాలు మంగళవారం ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి బాధిత యువతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదతీనార్లలకు చెందిన కారే ఆశ డిగ్రీ వరకు చదువుకున్నారు. ఆమె 8వ తరగతి చదువుతున్న సమయంలోనే ఇదే గ్రామానికి చెందిన మైలపల్లి రాము అనే యువకుడు ప్రేమిస్తున్నానని నమ్మబలికాడు. ఇద్దరం భార్యాభర్తలమే నువ్వేమి అనుమానం పడక్కర్లేదంటూ కర్నాటక, హంపి,హైదరాబాద్ వంటి ప్రాంతాలకు తీసుకెళ్లాడు. శారీరకంగా అనుభవించాడు. తీరా పెళ్లి చేసుకోమని అడిగితే కట్నం ఇవ్వలేరన్న కారణంతో తిరస్కరించి ఈనెల 2వ తేదీన వేరే యువతిని వివాహం చేసుకునేందుకు మూహూర్తం పెట్టుకున్నాడు. విషయం తెలిసి నిలదీస్తే, నువ్వంటే ఇష్టమేనని కానీ మా తల్లిదండ్రులను ఎదిరించి వివాహం చేసుకోలేనని ముఖం చాటేస్తున్నాడని బాధితురాలు తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ పెద్దలు రాము తల్లిదండ్రులతో చర్చలు జరిపారు. ఇద్దరికీ వివాహం చేయాలని కోరారు.అయితే రాము కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో బాధితురాలు తన కుటుంబ సభ్యుల సాయంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను మోసం చేసిన వ్యక్తితో తనకు పెళ్లి జరిపించి, న్యాయం చేయాలని కోరింది. ఇద్దరూ కలిసి వివిధ ప్రాంతాల్లో తీసుకున్న ఫొటోలు, వాట్సాప్ చాటింగ్‌ను ఆమె పోలీసులకు చూపించింది. దీనిపై ఎస్ఐ వెంకన్నను వివరణకోరగా మెలపల్లి రాముపై బాధితురాలు ఫిర్యాదు చేసిందన్నారు. కేసు నమోదు చేశామని తెలిపారు. -
బెల్టుతో కొట్టి.. బూటుతో తన్ని.. నేరం ఒప్పుకోవాలని ఒత్తిడి!
తగరపువలస(భీమిలి): గడ్డి వాము తగలబెట్టిన కేసులో నేరాన్ని ఒప్పుకోవాలని భీమిలి మండలం దాకమర్రికి చెందిన అన్నదమ్ములు చెల్లూరి ప్రసన్న కుమార్, ప్రభుదాసులపై భీమిలి పోలీసులు ప్రతాపం చూపారు. బెల్టు దెబ్బలతో హింసించి.. బూటు కాలితో తన్నారు. వైఎస్సార్ సీపీ యేతర పార్టీ నాయకుల ప్రమేయంతోనే తమపై కక్ష సాధించినట్టు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వారు తెలిపిన వివరాలివీ.. గత నెల 30 రాత్రి 12.30 సమయంలో గ్రామంలో కె.అప్పలరాజుకు చెందిన గడ్డివామును గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. దీనిపై ఆయన మరికొందరితో కలిసి ప్రసన్న కుమారే తన గడ్డి వామును తగలబెట్టినట్టు భీమిలి పోలీసులకు 31న ఫిర్యాదు చేశారు. ఎస్ఐ ప్రసాద్ ప్రసన్నకుమార్, ప్రభుదాసులను అదే రోజు సాయంత్రం స్టేషన్‌కు తీసుకువెళ్లి విచారణ పేరుతో హింసించారు. ఆయనకు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు తోడయ్యారు. గడ్డి వాము తగలబెట్టినట్టు ఒప్పుకోవాలంటూ వీపుపై బొబ్బలు వచ్చేలా బెల్టుతో కొట్టి, బూటు కాలితో తన్నినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు హింసించి.. రాత్రి 11 గంటలకు విడిచిపెట్టినట్లు చెప్పారు. మంగళవారం సాయంత్రం వరకు వీరి ఒంటిపై దెబ్బలు అచ్చుకట్టి ఉన్నాయి. దీనిపై బాధితులు మాట్లాడుతూ గడ్డి వాము తగలబెట్టినట్టు అనుమానం ఉంటే కేసు పెట్టాలని కోరినా కనికరించలేదన్నారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న తనను విడిచిపెట్టమని కోరినా వినలేదని ప్రభుదాస్ కన్నీరుమున్నీరయ్యారు. పంచాయతీకి చెందిన కొందరి ప్రోద్భలంతోనే ప్రాణాలు పోయేలా కొట్టారని వాపోయారు. ఈ సంఘటన కారణంగా ఈ నెల 23న జరగాల్సిన తన పెళ్లి సందిగ్ధంలో పడినట్టు ప్రసన్న కుమార్ తెలిపారు. ఈ విషయాన్ని భీమిలి సీఐ జీవీ రమణ దృష్టికి తీసుకురాగా.. ఎస్ఐ ప్రసాద్‌కు చార్జ్ మెమో ఇచ్చి విచారణ జరిపిస్తామన్నారు. -
రైల్వే జోన్‌పై ముఖం చాటేసిన కేంద్రం
సాక్షి,అమరావతి: కేంద్ర ప్రభుత్వం 2022–23 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌ను చిన్నచూపు చూసింది. అతి ముఖ్యమైన ప్రాజెక్టులకు సైతం ఆశించిన రీతిలో నిధులు కేటాయించకుండా అన్యాయం చేసింది. విభజన చట్టం ప్రకారం పూర్తిగా తనే నిధులు ఇవ్వాల్సిన పోలవరం ప్రాజెక్టును సైతం నిర్లక్ష్యం చేసింది. రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు అంశంపై ఈ ఏడాది కూడా ముఖం చాటేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించి ఈ ఏడాది శుభవార్తలు విందామనుకున్న ఐదు కోట్ల మంది ప్రజలను నిరాశ, నిస్పృహలకు గురిచేసింది. ► కేంద్ర బడ్జెట్లో విశాఖపట్నం రైల్వే జోన్ అంశాన్ని కనీసం ప్రస్తావించకపోవడం విస్మయం కలిగిస్తోంది. దక్షిణ మధ్య రైల్వే గత ఏడాది సెప్టెంబరు 30న విజయవాడలో నిర్వహించిన సమావేశంలో వైఎస్సార్సీపీ ఎంపీలు జోన్‌కు సంబంధించిన డిమాండ్‌ను గట్టిగా వినిపించారు. ► రైల్వే ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై నిలదీశారు. అయినప్పటికీ పెద్దగా కేటాయింపులు లేవు. పూర్తి వివరాలతో బ్లూ బుక్ వస్తే గానీ రాష్ట్రంలో ఇతర రైల్వే ప్రాజెక్టులకే ఏ మేరకు నిధులు కేటాయించారన్నది స్పష్టం కాదు. ► వాస్తవానికి 2019 ఫిబ్రవరి 27న విశాఖ కేంద్రంగా ‘దక్షిణ కోస్తా రైల్వేజోన్’ ఏర్పాటు చేస్తున్నామని కేంద్రం ప్రకటించింది. రైల్వే శాఖ ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను సిద్ధం చేసింది. భవనాలు, ఇతర అవసరాల కోసం విశాఖలో దాదాపు 950 ఎకరాలు అందుబాటులో ఉందని పేర్కొంది. ► కానీ గత రెండు బడ్జెట్లలోనూ రైల్వే జోన్‌పై కేంద్రం మొండిచేయి చూపించింది. గత బడ్జెట్లో కేవలం రూ.40 లక్షలు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఏడాదీ నిరాశే ఎదురైంది. ఒడిశాలోని భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే ప్రయోజనాలకు పెద్దపీట వేసింది. ► రైల్వే శాఖ ద్వంద్వ వైఖరి రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. కొత్త రైల్వే జోన్లు ఏర్పాటు చేసే ఉద్దేశంలేదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కొన్ని నెలల క్రితం ప్రకటించారు. దీనిపై రాష్ట్రంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దాంతో రైల్వే శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ► ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించినందున విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుందని చెప్పడం రాష్ట్రానికి కాస్త ఊరట నిచ్చింది. అయినప్పటికి మరోసారి మోసపూరిత వైఖరే అవలంబించింది. -
20 ఏళ్లుగా ప్రయత్నిస్తే అప్పుడు జబర్దస్త్‌లో అవకాశం : కమెడియన్
కశింకోట: ప్రముఖ హస్య నటునిగా ప్రేక్షకుల మదిలో సుస్థిరస్థానమే తన లక్ష్యమని జబర్దస్త్ సత్తిపండు (పీఎన్వీ సత్యనారాయణ) పేర్కొన్నారు. కశింకోటలో ఆదివారం ఒక కార్యక్రమంలో తన బృందంతో సందడి చేశారు. భార్యాభర్తల అన్యోన్యతపై స్కిట్ ప్రదర్శించి ప్రేక్షకులను రంజింపజేశారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆయన మాట్లాడారు. జబర్దస్త్‌లో సుమారు 250 వరకు స్కిట్లు ప్రదర్శించినట్టు చెప్పారు. చదవండి: రహస్యంగా పెళ్లి చేసుకున్న యాంకర్ రష్మీ? అబ్బాయి ఎవరంటే.. సుమారు 20 ఏళ్లుగా సినిమాలు, టీవీల్లో ప్రదర్శన కోసం ప్రయత్నిస్తే ఆరేళ్ల క్రితం జబర్దస్త్‌లో అవకాశం వచ్చిందన్నారు. అంతకు ముందు నాటకాలు వేసినట్టు పేర్కొన్నారు. దృశ్యం–2, ఆర్డీఎక్స్ లవ్, విజేత, హలో శ్యామ్, ప్రేమ కోసం తదితర సినిమాల్లో నటించినట్టు సత్తిపండు పేర్కొన్నారు. ప్రస్తుతం హలో ఆది, అతిథి దేవోభవ, గీతా ఆర్ట్స్‌లో అల్లు శిరీష్ సినిమాతోపాటు కల్యాణ్‌రామ్ సినిమాలో నటిస్తున్నట్టు చెప్పారు. చదవండి: అమ్మాయిలు షూటింగ్ చేయడం కరెక్ట్ కాదు: నటుడు -
వింత ఆనవాయితీ.. అక్కడ సంక్రాంతికి అటుకులిచ్చి పంపుతారు!
విశాఖపట్నం: సంక్రాంతి పండక్కి వచ్చిన బంధువులు, స్నేహితులను ఉత్త చేతులతో పంపకుండా.. అటుకులిచ్చి గౌరవంగా పంపడం పల్లెల్లో అనాదిగా వస్తున్న ఆచారం. అటుకుల పేరు చెప్పగానే పురాణాల్లో స్నేహబంధం గుర్తుకు వస్తుంది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడి మీద ప్రేమతో పేద స్నేహితుడైన కుచేలుడు అటుకులు బహుమానంగా ఇవ్వగా.. శ్రీకృష్ణుడు అతనికి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు. రైతులు కొత్తగా పండిన ధాన్యాన్ని తొలి పంటగా శ్రీకృష్ణుడికి నైవేద్యంగా చూపడం ఆనవాయితీ. ఆ ధాన్యాన్ని అటుకులుగా ఆడిస్తారు. రైతు కుటుంబాల్లో అటుకులు ప్రధాన పాత్ర వహిస్తాయి. అటుకులతో బెల్లం ముక్కలు, పాలు చక్కెర, ఉప్పు కారం, పులిహోర ఇలా అనేక రకాలుగా చిరు వంటకాలు తయారు చేస్తారు. ఈ ఏడాది ఆశించినమేర వరి సాగై.. రైతుల ఇళ్లకు ధాన్యం రావడంతో అటుకుల మిల్లుల నిర్వాహకులకు చేతినిండా పని దొరికింది. పెట్టుబడులకు తగ్గట్టుగా 3 నెలల పాటు పని చేసుకునే అవకాశం కలిగిందని మిల్లు యజమానులు చెబుతున్నారు. గతంలో పుట్టగొడుగుల్లా వెలసిన అటుకుల మిల్లులు.. ఇప్పుడు అక్కడక్కడ మాత్రమే దర్శనమిస్తున్నాయి. నక్కపల్లి, గొడిచర్ల, అడ్డురోడ్డు, పాయకరావుపేట, తుని తదితర ప్రాంతాల్లో సుమారు 15 వరకు అటుకుల మిల్లులు ఉన్నాయి. డిసెంబర్ మొదలు మార్చి వరకు ఈ మిల్లుల వద్ద సందడి ఉంటుంది. వేపిన ధాన్యాన్ని మిల్లులో వేసి అటుకులుగా తయారు చేస్తున్న దృశ్యం అటుకుల తయారీ ఇలా.. డీజిల్‌తో ఈ మిల్లులు నడుస్తాయి. ముందుగా ధాన్యాన్ని పొయ్యి మీద వేపుతారు. పొయ్యిని కూడా మట్టితో ఏర్పాటు చేస్తారు. దీని మీద 40 కిలోల బరువు ఉండే బీడు కలాయిలు ఏర్పాటు చేసి ఇసుకలో ధాన్యాన్ని ఒక పర్యాయం వేపిన తర్వాత.. మిల్లు ఆడిస్తే అటుకులు తయారవుతాయి. ధాన్యాన్ని వేపడం కోసం ప్రత్యేకంగా జీడి పిక్కల పరిశ్రమల నుంచి మడ్డి తెస్తారు. జీడి తొక్క నుంచి నూనె తీయగా వచ్చే నల్లటి మడ్డి పదార్థాన్ని వీరు పొయ్యిల్లో వేసి మండిస్తారు. కేడీపేట నుంచి బస్తా రూ.170లకు కొనుగోలు చేస్తారు. కలాయిలో ధాన్యాన్ని వేపుతున్న కార్మికుడు బస్తా మడ్డి 200 కిలోల ధాన్యాన్ని వేపేందుకు సరిపోతుంది. మిల్లును డీజిల్ ఇంజిన్ సహాయంతో నడుపుతారు. ధాన్యం వేపే వారికి కుంచానికి(4 కిలోలు)రూ.8, మిల్లు ఆడే వ్యక్తికి కుంచానికి రూ.5 చెల్లిస్తారు. 20 లీటర్ల డీజిల్‌తో 300 కుంచాల(1200 కిలోల) ధాన్యం అటుకులుగా ఆడొచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. ఇలా ధాన్యాన్ని అటుకులుగా ఆడించినందుకు కుంచానికి రూ.40 వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం సంక్రాంతి సీజన్ కావడంతో అటుకుల మిల్లుల వద్ద సందడి కనిపిస్తోంది. -
లుంగీ, షర్టు ధరించి మారు వేషంలో ఎస్ఐ.. ఏమైందో తెలుసా?
సాక్షి, విశాఖపట్నం: పోలీస్ డ్రెస్సులో దాడికి వెళుతుంటే కోడి పందేల నిర్వాహకులు ముందే అప్రమత్తమవుతున్నారని ఎస్ఐ మారు వేషంలో ప్రత్యక్షమయ్యారు. లుంగీ, షర్టు ధరించి సామాన్య గ్రామీణుడిలా వెళ్లడంతో ఆయననెవరూ గుర్తు పట్టలేదు. కోడి పుంజులతో సహా సునాయాసంగా నిందితులను పట్టుకున్నారు. ఈ ఘటన రోలుగుంటలో బుధవారం రాత్రి జరిగింది. చదవండి: సంక్రాంతి: గంగిరెద్దులతో మాట్లాడగల నేర్పరులు స్థానిక ఎస్ఐ బి.నాగకార్తీక్ సిబ్బందితో కలిసి ఇలా వినూత్న రీతిలో ఎం.కె.పట్నం పరిసర ప్రాంతంలోని కోడి పందెం స్థావరాలపై దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు పట్టుబడగా వారి నుంచి రెండు కోడి పుంజులు, రూ.510 లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. -
ప్రియుడి వేధింపులతోనే సుగుణ ఆత్మహత్య?
ఎంవీపీ కాలనీ(విశాఖ తూర్పు): ఎంవీపీ కాలనీ సెక్టార్–6లోని ఓ ఇంట్లో పత్రుల సుగుణ అనే యువతి ఉరి వేసుకొని ఆత్మహత్య ఘటన కొత్తమలుపు తిరుగుతోంది. ప్రియుడి వేధింపుల కారణంగానే ఆమె మరణించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలినట్టు సమాచారం. ఈ ఘటనపై ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు ఎంవీపీ పోలీసులు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సుగుణ మద్దిలపాలెంలోని ఓ స్టోర్‌లో ఉద్యోగం చేస్తోంది. ఇంటి ఓనర్ ఇచ్చిన సమాచారం మేరకు సుగుణ వివాహిత అని తొలుత ఎంవీపీ పోలీసులు భావించారు. అయితే పోలీసు విచారణలో ఆమెకు ఇంకా పెళ్లికాలేదని తేలినట్లు తెలిసింది. గత కొంత కాలంగా ప్రియుడితో కలిసి సుగుణ సహజీవనం చేస్తుండడంతో పాటు ఎంవీపీ సెక్టార్–6లోని ఓ ఇంటిని అద్దెకు తీసుకొని వారు భార్యభర్తలుగా చలామని అవుతున్నట్లు విచారణలో బయటపడినట్టు సమాచారం. ఆమె తల్లిదండ్రులు గుంటూరులో ఉండగా.. ఒక్కతే ఇక్కడ ఉంటున్నారు. కొద్ది రోజులుగా సుగుణకు ప్రియుడికి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఆమె ఒంటిపై గాయాలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి పోలీసులకు సూసైడ్ నోట్ కూడా లభించినట్లు తెలిసింది. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఇప్పటికే ఈ ఘటనపై ప్రియుడిని విచారించినట్లు సమాచారం. ఈ కేసు సంబంధించి పూర్తి వివరాల కోసం సీఐ రమణయ్యను సంప్రదించగా.. సుగుణకు ప్రియుడి వేధింపులు ఉన్నట్లు తెలిపారు. ఇంకా దర్యాప్తు జరుగుతుందని, పూర్తయ్యాక వివరాలు తెలియజేస్తామని వెల్లడించారు. -
అయ్యారే అరిసెలు భళారే బొబ్బట్లు
తగరపువలస (భీమిలి): సంక్రాంతి పర్వదినాన వినియోగదారుల అభిరుచికి తగ్గట్టుగా హోమ్ ఫుడ్స్ నిర్వాహకులు నోరూరించే పిండివంటలు సిద్ధం చేస్తున్నారు. పూర్వం ప్రతి ఇంట్లో రోలు, రోకలితో పిండ్లు దంచి స్వయంగా పెనం వేసి అరిసెలు, సున్ని పాకుండలు, జంతికలు, గులాబీ పువ్వులు, సున్నుండలు తయారుచేసుకునేవారు. ఇరుగుపొరుగు కుటుంబాల వారు సాయంగా వచ్చేవారు. లేదంటే కిలోల వంతున దంచడానికి లేదా తయారు చేయడానికి మనుష్యులు ఉండేవారు. ప్రస్తుతం ఎవరికి వారు బీజీ జీవితంలో మునిగితేలు తుండటంతో సొంతంగా తయారీ మానుకున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఆర్డర్లు ఇస్తే చిటికెలో కోరిన వందల రకాల పిండివంటలు ఇంటి ముందుంచే వ్యాపారాలు పెరిగిపోయాయి. వినియోగదారుల అభిరుచి మేరకు బెల్లం, పంచదార, నెయ్యి, జీడిపప్పు, నువ్వులు వంటివి జోడించడమే కాకుండా సుగర్‌లెస్ స్వీట్లు కూడా సిద్ధం చేస్తున్నారు. భోగి, సంక్రాంతి, మకర సంక్రాంతి రోజులకు అనువుగా కూడా ప్రత్యేక రకాల పిండివంటలు అందుబాటులోకి వచ్చాయి. అప్పటికప్పుడు బూరెలు, పొంగడాలు కూడా అందిస్తున్నారు. కుటీర పరిశ్రమ నుంచి బేకరీల వరకు ఇళ్లల్లో తయారీ తగ్గిన తరువాత కిలో దగ్గర నుంచి వందల కిలోల వరకు పిండివంటలు తయారుచేసి అందించే కుటీర పరిశ్రమలు విశాఖ నగరంలో వందల్లో వెలిశాయి. స్వీట్లు, బేకరీ అయిటెమ్స్ తయారు చేసే పెద్ద సంస్థలు కూడా రకరకాల పిండివంటలు సిద్ధం చేసి వినియోగదారులకు ఆహా్వనం పలుకుతున్నాయి. పండగ ప్రత్యేకతగా వెదురుబుట్టలలో నింపి ఇళ్లకు డెలివరీ చేస్తున్నారు. సంప్రదాయ పిండివంటలు లభ్యం ప్రస్తుతం మార్కెట్లో నిర్వాహకులు అరిసెలు, జంతికలు, సున్నపాకుండలతో పాటు బుల్లెట్ పాకుండలు, సున్నుండలు, తొక్కుడు లడ్డు, కోవా ముద్ద కుడుములు, బెల్లం మిఠాయి ఉండలు, పొంగడాలు, అప్పాలు, శనగపప్పు, పెసరపప్పు, కొబ్బరి, జున్నుతో తయార చేసే వివిధ రకాల బూరెలు, రవ్వ లడ్లు, గులాబి పువ్వులు, చంద్రకాంతలు, కజ్జికాయలు, గోరు మిఠాయి, సంపంగి పువ్వులు. సజ్జప్పాలు, గవ్వలు, చక్కిలాలు, మురుకులు, చెక్కలు, గోధుమ గొట్టాలు మొదలైన పిండివంటలు లభ్యమవుతున్నాయి. 50కు పైగా రకాలు .. వినియోగదారుల అభిరుచికి అనువుగా 50 రకాలకు పైగా పిండివంటలు సిద్ధం చేస్తున్నాం. ముందురోజు ఆర్డరిచ్చినా మరుసటిరోజు అందించడానికి అనువుగా సిబ్బంది ఉన్నారు. నగరాలతో పోటీపడి నాణ్యమైన పిండివంటలు అందుబాటులో ఉన్నాయి. –ఆదిమూలం సత్యనారాయణ, ఎంఎఫ్సీ, తగరపువలస తయారీలో ఇబ్బందులు పిండివంటలు తయారీ కష్టంతో కూడుకున్నది. గతంలో ఇరుగుపొరుగు సాయంతో తయారు చేసేవాళ్లం. నూనె ధరలు అందుబాటులో లేవు. పిల్లలు ఫాస్ట్ఫుడ్స్కు అలవాటు పడి పిండివంటలు తినడం లేదు. దీంతో కావలసినవి ఆర్డర్ ఇచ్చి తెచ్చుకుంటున్నాం. –వేమల రమ, గృహిణి అభిరుచులు మారుతున్నాయి ప్రస్తుతం ఇళ్లల్లో పిండివంటలపై అభిరుచులు మారాయి. బెల్లం బదులు పంచదార, నువ్వులు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ జోడించి కావలసిన స్వీట్లు అందుబాటులో ఉంటున్నాయి. కేవలం పండగ సమయంలోనే కాకుండా నిత్యం దొరుకుతున్నాయి. పండగవేళ అదనంగా కొనుక్కుంటున్నాం. –కదంబ సత్యవతి, గృహిణి. ఇంట్లో చేసినవి నిల్వ ఉండేవి.. పూర్వం సంక్రాంతికి వారంరోజుల ముందే బియ్యం నానబెట్టి, దంచి పిండివంటలు చేసేవాళ్లం. ఇవి చాలారోజులు నిల్వ ఉండేవి. ప్రస్తుతం ఇంత శ్రమ పడలేక రెడీమేడ్‌గా దొరికే పిండివంటలు కొనుక్కుంటున్నాం. దీంతో ఇళ్లల్లో పిండివంటలు తయారు చేసే సందడి తగ్గింది. వినియోగం మాత్రం యథావిధిగా ఉంటున్నాయి. –కంచుబోయిన లక్ష్మీ, గృహిణి. -
అందరికీ ఆమోదయోగ్యంగా వేట సాగించాలి
మహారాణిపేట (విశాఖ దక్షిణ)/ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు): విశాఖలో సమన్వయంతో చేపల వేట సాగించుకోవాలని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మత్స్యకారులకు విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయంలో బుధవారం పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కలెక్టర్ ఎ.మల్లికార్జున, పోలీసు కమిషనర్ మనీష్ కుమార్ సిన్హాలతో కలిసి మత్స్యకారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చట్టపరిధిలో నిబంధనలను అనుసరిస్తూ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా మత్స్యకారులు వేట సాగించాలన్నారు. మత్స్యకారుల మధ్య ఇంతకాలం లేని పొరపొచ్చాలు ఇప్పుడు ఎందుకు వచ్చాయో ఆలోచించాలన్నారు. మత్స్యకారుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో కార్యక్రమాలను చేపట్టారని గుర్తు చేశారు. మరిన్ని సంక్షేమ పథకాలు తెచ్చేందుకు ఆలోచన చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారులతో టెక్నికల్ కమిటీని వేశామని.. మెరైన్ ఫిషరీస్ రెగ్యులర్ యాక్ట్ ప్రకారం బోట్లు ఉన్నవారందరూ వేట సాగించడానికి, వలలకు సంబంధించి లైసెన్స్‌లు పొందాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ కె.కన్నబాబు, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల, రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కోలా గురువులు, అధికారులు, మత్స్యకార నేతలు పాల్గొన్నారు. అరెస్టులను నిరసిస్తూ మత్స్యకారుల ఆందోళన కాగా, విశాఖలో మత్స్యకారుల మధ్య రాజుకున్న వివాదం బుధవారం మరోసారి ఆందోళనకు దారితీసింది. రింగు వలల వేట నేపథ్యంలో తీరంలోని మత్స్యకార గ్రామాల మధ్య మంగళవారం ఘర్షణ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బోట్లు దగ్ధం చేసిన ఘటనలకు సంబంధించి పిల్లా నూకన్న, వాడమధుల సత్యారావు అనే ఇద్దరిని విశాఖ మెరైన్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో వీరి అరెస్టులను నిరసిస్తూ పెదజాలరిపేట మత్స్యకారులు వాల్తేర్ ఆర్టీసీ డిపో కూడలిలో ఆందోళన నిర్వహించారు. దీంతో పరిస్థితి అదుపు తప్పకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అరెస్ట్ అయిన ఇద్దరు మత్స్యకారులను పూచీకత్తుపై పోలీసులు విడుదల చేశారు. ఈ ఆందోళనల నేపథ్యంలో విశాఖలోని తీరప్రాంత గ్రామాల్లో 144 సెక్షన్ కొనసాగుతుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. -
ఘనంగా గంగమ్మ జాతర
-
హైదరాబాద్ కంటే ముందే విశాఖకి వస్తున్న ఓలా !
కాలుష్యం తగ్గించడంతో పాటు పెరుగుతున్న పెట్రోలు ధరల నుంచి ఉపశమనంగా ఎలక్ట్రిక్ వాహనాలను భావిస్తున్నారు. ఈ తరుణంలో సంచలన రీతిలో మార్కెట్లో అడుగు పెట్టింది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్. ఆగష్టు 15న ఈ స్కూటర్లకు ఆన్లైన్లో బుకింగ్ ప్రారంభం అయ్యింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబరులో ఈ బైకుల డెలివరీ చేయాల్సి ఉంది. అప్పుడు వాయిదా అయితే అనివార్య కారణాల వల్ల ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో మార్కెట్లో హైప్ తగ్గకుండా చూసుకునేందుకు నవంబరులో టెస్ట్ డ్రైవ్ పేరిట దేశమంతగా ఓలా స్కూటర్లను తిప్పారు. కాగా డిసెంబరు ద్వితీయార్థంలో ఓలా స్కూటర్ల డెలివరీ ప్రారంభమైంది. ముందుగా బెంగళూరు, చెన్నైలలో వీటి డెలివరీ చేశారు. అయితే మిగిలిన ప్రాంతాల్లో డెలివరీ ఎప్పుడు చేస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. రెండో విడతలో ఓలా స్కూటర్ల డెలివరీపై ఉన్న సందేహాలకు సమాధానంగా ఆ కంపెనీ సీఈవో భవీశ్ అగర్వాల్ తాజాగా ట్వీట్ చేశారు. బెంగళూరు, చెన్నై తర్వాత ఎక్కడ డెలివరీ చేయబోయే నగరాల వివరాలను వెల్లడించారు. భవీశ్ అగర్వాల్ చెప్పిన వివరాల ప్రకారం రెండో విడత డెలివరీలో వైజాగ్, పూనే, అహ్మదాబాద్, ముంబైతో పాటు మరికొన్ని సిటీలు ఉన్నాయి. అయితే ఇందులో హైదరాబాద్‌లో డెలివరీ ఉందా? లేదా అనే అంశంపై స్పస్టత కరువైంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఓలా స్కూటర్లు తెలుగు రాష్ట్రాల్లో ముందుగా వైజాగ్ వీధుల్లో చక్కర్లు కొట్టనున్నాయి, Addressing the most popular question - yes, deliveries are on! Wonderful to see happy customers with their Ola scooters. Bangalore, Chennai last week. Vizag, Pune, Ahmedabad, Mumbai & many more cities this week & next! Scooters are en-route! Thanks for your patience & ❤️ pic.twitter.com/JLyX0y6nDB — Bhavish Aggarwal (@bhash) December 23, 2021 చదవండి: గుడ్‌న్యూస్.. నెక్సాన్ రేంజ్ పెరిగింది! మార్కెట్లోకి ఎప్పుడంటే? -
INS Khukri: ‘సాహసిక’.. సెలవిక
సాక్షి, విశాఖపట్నం/న్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మొట్టమొదటి క్షిపణి సామర్థ్య యుద్ధ నౌక ఐఎన్ఎస్ ఖుక్రి సేవల నుంచి నిష్క్రమించింది. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ యుద్ధనౌక శత్రు నౌక ఎటువంటిది, ఏ దేశానికి చెందినది అనేది లెక్క చెయ్యకుండా మిసైల్ దాడులతో ధ్వంసం చేయగలదు. మజ్గావ్ డాక్లో తయారైన ఐఎన్ఎస్ ఖుక్రి 1989లో భారత నౌకాదళంలో చేరింది. 32 ఏళ్లపాటు భారత రక్షణలో పాలుపంచుకున్న ఖుక్రి వీడ్కోలు కార్యక్రమాన్ని విశాఖలోని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. తూర్పు నౌకా దళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్ గుప్తా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సూర్యాస్తమయం సమయంలో ఖుక్రి నౌకపై ఉన్న జాతీయ జెండా, నౌకాదళ పతాకాన్ని అవనతం చేసి, డీకమిషనింగ్ పెనెంట్‌ని కిందికి దించారు. అనంతరం ఖుక్రీలో పని చేసి రిటైర్ అయిన కమాండింగ్ అధికారుల్ని వైస్ అడ్మిరల్ బిస్వజిత్ అభినందించారు. ఈ వేడుకల్లో ఇండియన్ ఆర్మీ గూర్ఖా బ్రిగేడ్ లెఫ్టినెంట్ జనరల్ పీఎన్ అనంతనారాయణ్ తదితరులు పాల్గొన్నారు. దేశీయంగా నిర్మించిన తొలి క్షిపణి కార్వెట్టి ఐఎన్ఎస్ ఖుక్రీ సేవలు ఉపసంహరించినట్లు కేంద్ర రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సాహసానికి ప్రతీక ఖుక్రి అంటే సాహసోపేతం అని అర్థం. 1971లో పాక్‌తో జరిగిన యుద్ధ సమయంలో శత్రువుల్ని మట్టికరిపించేందుకు భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ ఖుక్రి పాక్ సముద్రజలాల వైపు దూసుకెళ్లింది. అయితే.. సబ్‌మెరైన్ పీఎన్ఎస్ హన్‌గోర్‌లో పొంచి ఉన్న పాక్ సైనికులు డయ్యు సమీపంలో ఖుక్రీని టార్పెడోలతో ధ్వంసం చేశారు. ఖుక్రీతో పాటు ఆ నౌకలోని 18 మంది అధికారులు, 176 మంది సిబ్బంది జలసమాధి అయ్యారు. ఖుక్రి కమాండింగ్ అధికారి కెప్టెన్ మహింద్రనాధ్ ముల్లా తన లైఫ్ జాకెట్‌ని జూనియర్ ఆఫీసర్‌కి ఇచ్చి రక్షించి.. తాను ప్రాణాలు వదిలారు. ఖుక్రిని నాశనం చేసిన 48 గంటల్లోనే కరాచీ రేవుని భారత రక్షణ దళం స్వాధీనం చేసుకొని పాక్‌పై విజయం సాధించింది. భారత రక్షణ శాఖలో తిరుగులేని పోరాట స్ఫూర్తి రగిలించిన ఖుక్రి పేరుతో ఈ నౌకని నిర్మించారు. 1989 ఆగస్టు 23న పాత ఖుక్రి నౌకలో అసువులు బాసిన కెప్టెన్ మహింద్రనాధ్ ముల్లా సతీమణి సుధా ముల్లా దీనిని జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి తూర్పు, పశ్చిమ నౌకాదళాల్లో సేవలందించింది. కీలకమైన ఆపరేషన్లు నిర్వహించింది. ఇప్పటివరకూ ఖుక్రిలో 28 మంది కమాండింగ్ ఆఫీసర్లు విధులు నిర్వర్తించారు. మొత్తం 6,44,897 నాటికల్ మైళ్లు ప్రయాణించింది. ఈ దూరం 30 సార్లు ప్రపంచాన్ని చుట్టొచ్చినంత. భూమికి, చంద్రునికి మధ్య ఉన్న దూరానికి మూడు రెట్లు ఎక్కువ కావడం విశేషం. -
పెళ్లయిన 42 రోజులకే.. నవ వధువు హత్య!.. మూఢనమ్మకాలతో భర్తే అలా చేశాడా?
కొమ్మాది(భీమిలి): ఎన్నో ఆశలతో అత్తవారింట అడుగుపెట్టిన ఓ యువతి పెళ్లయిన 42 రోజులకే మృత్యుఒడికి చేరింది. కట్టుకున్న భర్తే కాలయముడిగా మారి కిరాతకంగా చంపేశాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జీవీఎంసీ 4వ వార్డు పుక్కళ్లపాలేనికి చెందిన మైలపిల్లి హరితో తగరపువలస వలందపేటకు చెందిన కోనాడ నరసయమ్మ(26)కు 42 రోజుల కిందట వివాహం జరిగింది. పెళ్లయిన వారం రోజులకే హరి అదే వార్డు పరిధి చేపలుప్పాడ సమీపంలోని గోవుపేటలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం పెట్టాడు. నగరంలో ఓ ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఏమైందో తెలియదు కాని నరసయమ్మ శుక్రవారం ఉదయం విగతజీవిగా కనిపించింది. తగరపువలసలో ఉంటున్న తన అన్నయ్య కోనాడ అప్పారావుతో ఆమె రోజూ ఫోన్లో మాట్లాడుతుండేది. శుక్రవారం ఉదయం నుంచి అప్పారావు ఆమెకు ఫోన్ చేస్తున్నా స్పందించకపోవడంతో అనుమానం వచ్చి అతను మధ్యాహ్నం నరసయమ్మ ఇంటికి వచ్చేసరికి తన చెల్లి విగతజీవిగా పడి ఉంది. దీంతో హరిని నిలదీయగా ఎటువంటి సమాధానం చెప్పకపోవడంతో భీమిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాళ్లకు తాడు కట్టి.. నరసయమ్మ శుక్రవారం ఉదయమే చనిపోయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శరీరంపై ఉన్న గాయాలను బట్టి హత్యగానే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాళ్లకు తాడుకట్టి, ఛాతిపై వాతలు పెట్టి, మెడకు తాడు కట్టి హత్య చేసినట్లు పోలీసుల పరిశీలనలో తేలింది. సీఐ వెంకటరమణ, ఎస్సై రాంబాబు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మూఢ నమ్మకాలతోనే.? హరికి మూఢనమ్మకాలపై ఆసక్తి ఎక్కువ అని, జరిగినది.. జరగబోయేది చెబుతానంటూ ఏవో మంత్రాలు.. తంత్రాల వంటివి వేస్తాడని స్థానికులు చెబుతున్నారు. మూఢనమ్మకాల్లో భాగంగానే నరసయమ్మను చిత్ర హింసలకు గురిచేసి చంపి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. ఆమె మరణం విని తండ్రి దుర్గయ్య విలపించిన తీరు అందరినీ కన్నీరు పెట్టించింది. దుర్గయ్యకు ఇద్దరు కొడుకులు, నలుగురు కూతుర్లు కాగా.. ఈమె చివరి కుమార్తె. ఆయన భార్య గతంలోనే చనిపోయింది. పెళ్లయి ఆనందంగా గడుపుతుందని భావించిన తన కూతురు ఇలా హత్యకు గురవుతుందని ఊహించలేదని వాపోయాడు. -
AP: అభివృద్ధి ఎక్స్‌ప్రెస్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పరిపాలన రాజధానిగా నూతన సొగసులు సంతరించుకుంటున్న విశాఖలో పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. నగర చరిత్రలో తొలిసారిగా రూ.247.32 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టులను శుక్రవారం తన పర్యటన సందర్భంగా ప్రజలకు అంకితం చేశారు. విశాఖ వాసుల ట్రాఫిక్ కష్టాలకు తెరదించుతూ రూ.150 కోట్లతో తొలిసారి రోటరీ మోడల్లో అభివృద్ధి చేసిన ఎన్ఏడీ ఫ్లైఓవర్‌తో పాటు దేశంలోనే తొలి మెకనైజ్డ్ ఆటోమేటిక్ పార్కింగ్ ప్రాజెక్టులను ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. సాగర నగరిలో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 33 ఎకరాల్లో రూ.33.50 కోట్లతో స్మార్ట్ పార్కుగా తీర్చిదిద్దిన వుడా పార్కు సీఎం చేతులమీదుగా ప్రారంభమైంది. మూడు జోన్లుగా దీన్ని సుందరీకరించారు. 12 కీలక ప్రాజెక్టులు ప్రారంభం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాయంత్రం 4.30 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, డిప్యూటీ సీఎం కృష్ణదాస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాస్‌తో పాటు ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డాక్టర్ బీవీ సత్యవతి, గొడ్డేటి మాధవి, మేయర్ హరివెంకట కుమారి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు ముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలికారు. ఎన్ఏడీ కూడలి, వుడా పార్కు వద్ద జరిగిన కార్యక్రమంలో మొత్తం 12 కీలక ప్రాజెక్టులను సీఎం ప్రారంభించారు. వివాహ రిసెప్షన్ వేడుకలకు హాజరు అనంతరం ముఖ్యమంత్రి జగన్ పీఎంపాలెంలోని వైజాగ్ కన్వెన్షన్స్‌కు చేరుకొని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలు నిహారిక, రవితేజ వివాహ రిసెప్షన్‌కు హాజరై వధూవరుల్ని ఆశీర్వదించారు. ఏయూ కన్వెన్షన్ హాల్లో జరిగిన విజయనగరం డీసీసీబీ చైర్మన్ నెక్కల నాయుడుబాబు కుమార్తె దివ్యనాయుడు, సుభాష్ వివాహ రిసెప్షన్‌కు కూడా హాజరై వధూవరుల్ని ముఖ్యమంత్రి ఆశీర్వదించారు. రాత్రి 7.30 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి తిరిగి గన్నవరం బయలుదేరారు. సీఎం జగన్ ప్రారంభించిన ప్రాజెక్టులు ఇవీ... వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రులు, నేతలు, అధికారులు ఎన్ఏడీ ఫ్లైఓవర్ రూ.150 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ఫ్లైఓవర్ విశాఖ వాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చనుంది. దేశంలోనే తొలిసారిగా రోటరీ మోడల్లో ఫ్లైఓవర్‌ను అభివృద్ధి చేశారు. ఎటువంటి భూ సేకరణ లేకుండానే దీన్ని పూర్తి చేశారు. 2036 నాటికి గంటకు 23,500 వాహనాలు ఈ ఫ్లైఓవర్‌పై ప్రయాణం చేస్తాయని అంచనా. సీఎం కప్ ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తొలి మెకనైజ్డ్ పార్కింగ్ విశాఖ జగదాంబ జంక్షన్లో మల్టీ లెవల్ సెమీ–ఆటోమెటిక్ కార్ పార్కింగ్‌ను సీఎం జగన్ ప్రారంభించారు. రూ.11.45 కోట్లతో దీన్ని తీర్చిదిద్దారు. 367.89 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో 100 కార్లను పార్క్ చేసే అవకాశం ఉంది. పార్క్ చేసిన వాహనాన్ని గరిష్టంగా 90 సెకన్లలో తిరిగి తీసుకొచ్చే వీలుంది. ► పిఠాపురం కాలనీలో రూ.7.60 కోట్లతో నిర్మించిన వాణిజ్య సముదాయం. ► రూ.7.55 కోట్లతో ఆనందపురం జంక్షన్ నుంచి బొని గ్రామం వరకూ 9 కిలోమీటర్ల పొడవున నిర్మించిన 2 వరసల రహదారి. ► మధురవాడ లా కాలేజీ నుంచి రుషికొండ బీచ్ వరకూ రూ.7.50 కోట్లతో నిర్మించిన రెండు వరుసల రహదారి. ► ఎన్‌హెచ్–16 నుంచి విశాఖ వ్యాలీ స్కూలు మీదుగా బీచ్ రోడ్ వరకూ రూ.6.97 కోట్లతో చేపట్టిన రహదారి. ► రూ. 5.14 కోట్లతో చినముషిడివాడలో నిర్మించిన కళ్యాణ మండపం. ► తాటిచెట్లపాలెం ధర్మానగర్‌లో రూ.1.56 కోట్లతో నిర్మించిన కమ్యూనిటీ హాల్. ► దాదాపు 33 ఎకరాల్లో రూ.33.50 కోట్లతో స్మార్ట్ పార్కుగా సుందరీకరించిన వుడా పార్కును సీఎం ప్రారంభించారు. పార్కును మూడు జోన్లుగా తీర్చిదిద్దారు. ప్రత్యేకంగా స్పోర్ట్స్ ఏరియాను అభివృద్ధి చేశారు. బీఎంఎక్స్ సైకిల్ ట్రాక్ కూడా ఏర్పాటు చేశారు. హెర్బల్ ప్లాంట్స్‌తో ల్యాండ్‌స్కేప్‌ను సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేశారు. ► రూ.4.65 కోట్లతో దండుబజారులో స్మార్ట్ స్కూల్‌గా అభివృద్ధి చేసిన మహారాణి విద్యాదేవి హైస్కూల్. ► శిథిలావస్థలో ఉన్న టౌన్ హాల్ రూ.4.24 కోట్లతో ఆధునీకరణ ప్రాజెక్టుతో పాటు రూ.7.16 కోట్లతో పాత మునిసిపల్ హాల్ ఆధునీకరణ ప్రాజెక్టును కూడా సీఎం ప్రారంభించారు. ► వుడా పార్కులో జరిగిన కార్యక్రమంలో ఈ నెల 21న నిర్వహించనున్న సీఎం క్రికెట్ కప్‌ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. -
విశాఖ: పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన సీఎం జగన్
Live Updates ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం విశాఖపట్నంలో పర్యటించారు. రూ.248 కోట్లతో పలు అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించారు.. 150 కోట్లతో నిర్మించిన ఎన్ఏడీ ఫ్లైఓవర్‌తో పాటు వీఎంఆర్డీఏ రూ. 36.32 కోట్లతో పూర్తి చేసిన మరో 6 ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. బీచ్‌రోడ్డులో రూ. 61.01 కోట్లతో జీవీఎంసీ పూర్తి చేసిన 4 స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్ని సీఎం ప్రారంభించారు. ►వైజాగ్ కన్వెన్షన్‌లో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవరాలు నిహారిక, రవితేజ వివాహ రిసెప్షన్‌కు సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. వధూవరుల్ని సీఎం ఆశీర్వదించారు. ►డీసీసీబీ చైర్మన్ నెక్కల నాయుడుబాబు కుమార్తె దివ్యనాయుడు, సుభాష్ వివాహ రిసెప్షన్‌కు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. వధూవరుల్ని సీఎం ఆశీర్వదించారు. ►విశాఖలో ఎన్ఏడీ ప్లైఓవర్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ►విశాఖలో సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. రూ.248 కోట్లతో అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. ►ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ చేరుకున్నారు. సీఎంకు మంత్రి అవంతి శ్రీనివాస్, మేయర్ హరి వెంకటకుమారి, కలెక్టర్ స్వాగతం పలికారు. కాసేపట్లో ఎన్ఏడీ జంక్షన్లో ప్లైఓవర్‌ను సీఎం ప్రారంభించనున్నారు. ►విశాఖ పర్యటనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బయలుదేరారు. కాసేపట్లో విశాఖకు చేరుకోనున్నారు. ఎన్ఏడీ ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. నగరంలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం చేయనున్నారు. వివాహ రిసెప్షన్లకు హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్, సీపీ పరిశీలించారు. సీఎం జగన్ సాయంత్రం 4.10 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 5 గంటలకు విశాఖకి చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు గేట్–1లో అధికారులు, ప్రజాప్రతినిధుల్ని కలవనున్నారు. అనంతరం రోడ్డు మార్గంలో ఎన్ఏడీ జంక్షన్‌కు సాయంత్రం 5.20 గంటలకు చేరుకోనున్నారు. అక్కడ రూ. 150 కోట్లతో నిర్మించిన ఎన్ఏడీ ఫ్లైఓవర్‌తో పాటు వీఎంఆర్డీఏ రూ. 36.32 కోట్లతో పూర్తి చేసిన మరో 6 ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. 5.45 గంటలకు ఏయూ కన్వెన్షన్ హాల్లో విజయనగరం డీసీసీబీ చైర్మన్ నెక్కల నాయుడుబాబు కుమార్తె దివ్యనాయుడు, సుభాష్ వివాహ రిసెప్షన్‌కు హాజరై వధూవరుల్ని సీఎం ఆశీర్వదించనున్నారు. అక్కడి నుంచి బీచ్‌రోడ్డులో ఉన్న వుడా పార్కుకి చేరుకొని రూ. 61.01 కోట్లతో జీవీఎంసీ పూర్తి చేసిన 4 స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల్ని ప్రారంభిస్తారు. సాయంత్రం 7 గంటలకు పీఎంపాలెం వైజాగ్ కన్వెన్షన్‌లో ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మనవరాలు నిహారిక, రవితేజ వివాహ రిసెప్షన్‌కు హాజరై వధూవరుల్ని ఆశీర్వదిస్తారు. రాత్రి 7.55 గంటలకు విశాఖ నుంచి గన్నవరానికి సీఎం బయలుదేరనున్నారు. -
ఆ కళాశాలకు 50 ఏళ్ల చరిత్ర ఉంది
చదువు చెప్పడమే కాదు..‘కొలువు’ దీరేవరకూ బాధ్యత తీసుకుంటుంది. ఈ కళాశాలలో చదువుకున్న వేల మంది మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కంచరపాలెంలోని ఉన్నకెమికల్ ఇంజనీరింగ్ కాలేజీ (గైస్) ప్రగతి పథంలో దూసుకుపోతోంది. 17వ తేదీనాటికి 50 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ 50 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో విజయాలు..మరెంతో ఖ్యాతి సొంతం చేసుకుంది. విద్యార్థులను తమ సొంత బిడ్డల్లా చూసుకుంటూ వారిని ఉన్నత స్థానాల్లో నిలబెడుతోంది. మురళీనగర్ (విశాఖ ఉత్తర): కళాశాల ప్రారంభించి 50 ఏళ్లు పూర్తి చేసుకుని ప్రతిష్టాత్మక సంస్థగా నిలబడం అంటే మాటలు కాదు. ఇది సాధించాలంటే ఇక్కడ పని చేసే కళాశాల పెద్దలు, సిబ్బందిలో చిత్త శుద్ధి అవసరం. ఇక్కడ పనిచేసిన ప్రిన్సిపాళ్లతోపాటు, అధ్యాపకులు, ఇతర కార్యాలయం సిబ్బంది ఈ కాలేజీ ఎదుగుదలలో విశిష్ట సేవలు అందించారు. ప్రాంగణంలో సౌకర్యాల కల్పన, విద్యార్థులకు అందించే ఉత్తమ విద్యలో రాజీ లేకుండా పనిచేయడంతో పాటు కాలేజీ చదువులు ముగిశాక విద్యార్థులకు ఉద్యోగాలు అందించంలో వీరు కృతకృత్యులయ్యారు. దీంతో రాష్ట్రంలోనే ప్రాంగణ నియాయమాకల నిర్వహణ ద్వారా నూరు శాతం ఉద్యోగావకాశాలు కలి్పంచిన కాలేజీగా ఈ ఏడాది గుర్తింపు పొందింది. దీంతో సగర్వంగా నిలదొక్కుకుని 51వ ఏడాదిలోకి అడుగుపెడుతోంది కెమికల్ ఇంజనీరింగ్ కాలేజీ (గైస్). ఈనెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మూడురోజుల పాటు ఉత్సవాల నిర్వహణకు చురుకుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. కంచరపాలెంలోని ప్రభుత్వ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగు కాలేజీ (కెమికల్ ఇంజినీరింగు కాలేజి) 1985లో ఏర్పాటు చేశారు. దీన్ని మొదట్లో గవర్నమెంటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నిషియన్ కోర్సెస్ (జీఐఏటీసీ)గా ఏర్పాటు చేశారు. 1986లో దీనికి గవర్నమెంటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెస్టు డిప్లమా కోర్సెస్ ఇన్ ఇంజినీరింగు అండ్ టెక్నాలజీ (జీఐపీడీసీఈ అండ్ టి)గా మార్చారు. మళ్లీ 2008లో గవర్నమెంటు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ ఇంజినీరింగు కాలేజీ (కెమికల్ ఇంజినీరింగు కాలేజి)గా పేరు మార్చి దీన్ని కొనసాగిస్తున్నారు. ప్రాధాన్యత ఇక్కడి కెమికల్ ఇంజినీరింగు కాలేజీ రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మక కాలేజీగా గుర్తింపు పొందింది. డిప్లమా స్థాయిలో కెమికల్ అండ్ ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన నాలుగు కోర్సులు నిర్వహిస్తున్న కాలేజీగా ఇదొక్కటే. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, స్టీల్ ప్లాంటు విస్తరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందున ఇక్కడి విద్యార్థులకు మంచి ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఇవి కాకుండా విశాఖ–కాకినాడ పెట్రో కారిడార్ ఏర్పాటుతో మరిన్ని అవకాశాలు పెరుగుతాయి. పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ పార్మాసిటీలో అనేక పార్మా కంపెనీలు ఉన్నాయి. దువ్వాడలోని స్పెషల్ ఎకనమిక్ జోన్, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలోని పారిశ్రామిక కారిడార్స్కు కెమికల్ ఇంజినీరింగు విద్యార్థులు అవసరం ఉంటుంది. ఏఏసీటీఈ గుర్తింపు కాలేజీలో నిర్వహిస్తున్న కోర్సులకు ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ గుర్తింపు ఉంది. నాలుగు కోర్సుల్లో చేరాలంటే పాలిసెట్‌లో ర్యాంకుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వార్షిక ఫీజు రూ.3800లు. ఏడాదికి లక్షలోపు ఉన్న బీసీ/ఓసీ విద్యార్థులకు, రెండు లక్షల లోపు ఆదాయ ఉన్న ఎస్సీ/ఎస్టీ విద్యార్థులకు రూ.600లు మాత్రమే ఫీజు చెల్లించే అవకాశం ఉంది. జూన్‌లో మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయి. మొదటి సంవత్సరంలో బేసిక్ సైన్సు, ఇంజినీరింగు సబ్జెక్టులు, రెండో ఏడాదిలో ప్రతి కోర్సుల్లోనూ కెమికల్ ఇంజినీరింగ్‌తో సంబంధం ఉన్న అల్లీయ్డ్ ఇంజినీరింగు సబ్జెక్టులు మెకానికల్ ఇంజినీరింగు, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌తో పాటు వారి స్పెషలైజేషన్ సబ్జెక్టులు (ప్యూర్ బ్రాంచి)బోధిస్తారు. మూడో ఏడాది 5, 6 సెమిస్టర్లో విద్యార్థులను ఇండ్రస్టియల్ ట్రైనింగ్‌కు పంపిస్తారు. బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్‌షిప్ (బోట్) పర్యవేక్షణలో జరుగుతుంది. ఇండ్రస్టియల్ ట్రైనింగ్ సమయంలో విద్యార్థులకు రూ.2890 స్టైఫండ్ ఇస్తారు. ఏడవ సెమిస్టర్లో మిగతా అకడమిక్ సబ్జెక్టులు బోధిస్తారు. నవంబర్–అక్టోబర్‌లో కోర్సు పూర్తవుతుంది. ఉద్యోగాల సాధనలో బాలికల రికార్డు కెమికల్ ఇంజినీరింగ్ కోర్సు చదివితే బాలికలకు ఉద్యోగావశాలు రావనే పాత నమ్మకాలకు పాతర వేసే విధంగా ఈ కాలేజీ నిర్ణయం తీసుకుంది. అందుకే ప్రతి ప్రాంగణ నియామకాల్లోనూ బాలికలకు ప్రాధాన్యతనిచ్చే విధంగా ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటరమణ ప్రత్యేక ప్రణాళిక అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో ఈ కాలేజీల నుంచి 170 మంది ఉద్యోగాలు సాధించి రికార్డు సృష్టించగా బాలికలు ఉద్యోగాల సాధనలో అర్ధ సెంచరీ సాధించి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచారు. అంతే కాకుండా మల్టీనేషనల్ కంపెనీల్లో వీరు ఉద్యోగాలు సాధించడం మరో కొత్త మలుపుగా చెప్పవచ్చు. ఒక అకడమిక్ సంవత్సరంలో 50 మంది బాలికలు ప్రభుత్వ డిప్లమా ఇంజినీరింగ్ కాలేజీలో ఉద్యోగాలు సాధించడం ఇంత వరకు ఎవరికీ సాధ్యం కాలేదు. దీంతో ఈ కాలేజీకి రాష్ట్ర స్థాయిలో మంచి పేరు వచ్చింది. ఈకాలేజీకి చెందిన ఓ విద్యార్థిని రూ.5.44లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం పొందింది. కెమ్దోసా సహకారం కెమికల్ ఇంజినీరింగ్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం (కెమ్దోసా) కాలేజీ అభివృద్ధికి తన వంతుగా సాయం అందిస్తోంది. కాలేజీ ఏర్పాటు చేసి 50ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాలు, ఆయిల్ టెక్నాలజీ, ప్లాస్టిక్ అండ్ పాలిమర్స్, పెట్రోకెమిల్స్ బ్రాంచ్‌లు ఏర్పాటు చేసి 25ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు ఒకేసారి నిర్వహిస్తున్నారు. దీనికి కెమ్దోసాతోపాటు ఇతర దాతలు పూర్తి సహకారం అందిస్తున్నారు. ఉద్యోగాల కల్పనలో మేటి విద్యార్థులు కోర్సు ఆఖరి సంవత్సరంలోనే అనేక రాష్ట్ర, జాతీయ కంపెనీలతోపాటు మల్టీ నేషనల్ కంపెనీల్లో కూడా ఉద్యోగాలు పొందుతున్నారు. వీరు 19ఏళ్లకే ప్రారంభంలో రూ.18000–50,000లు నెలవారి జీతాలతో ఉద్యోగాలు పొందుతున్నారు. 11 ప్రభుత్వ, 16 ప్రైవేటు కంపెనీల్లో వీరు ఉద్యోగాలు పొందుతున్నారు. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ జరుగుతోంది. దీంతో ఈ కాలేజీకి డిమాండు పెరిగింది. ప్రాంగణ నియామకాల్లో ఈ కాలేజీకి చెందిన విద్యార్థులు రూ.5.54లక్షల అత్యధిక వార్షిక వేతనం పొందడం గమనార్హం. ముఖ్యంగా సౌదీ అరేబియా, ఖతర్, మలేషియా, సింగపూర్లలో ఇప్పటికే అనేక మంది ఉద్యోగాలు చేస్తున్నారు. కోర్సుల వివరాలు డిప్లమా స్థాయిలో కెమికల్ ఇంజినీరింగు, పెట్రో కెమికల్ ఇంజినీరింగ్, ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్, ఆయిల్ టెక్నాలజీ విభాగాల్లో ఒక్కొక్క విభాగానికి 60సీట్లు చొప్పున కోర్సులు నిర్వహిస్తున్నారు. పారిశ్రామిక శిక్షణకు ప్రాధాన్యం విద్యార్థులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తయారు చేయడానికి పారిశ్రామిక శిక్షణ, స్కిల్ డవలప్మెంటుకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్నారు. దీని వల్ల వీరు పాస్అవుట్ కాగానే వివిధ పరిశ్రమాల్లో ఉద్యోగాలు సాధించడానికి వీలవుతుంది. నూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్సు (హైదరాబాదు), ఎంఆర్ఎఫ్ లిమిటెడ్ (మెదక్), సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(ఇస్రో–షార్) (శ్రీహరికోట), కేసీపీ సుగర్స్ అండ్ ఇండ్రస్టియల్ కార్పొరేషన్ లిమిటెడ్ (వుయ్యూరు), ఆంధ్రా సుగర్స్ లిమిటెడ్ (తణుకు), ఇంటర్నేషనల్ పేపర్స్ లిమిటెడ్ (రాజమండ్రి), పరవాడలోని విజయశ్రీ ఆర్గానిక్స్, వెర్డెంట్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ), మైలాన్ ల్యాబరేటరీస్, టయోట్సు రేర్ ఎర్త్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్–అచ్చుతాపురం, విశాఖపట్నంలోని కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, ది ఆంధ్రా పెట్రో కెమికల్స్ లిమిటెడ్, ఈస్టిండియా పెట్రోలియం ప్రైవేట్ లిమిటెడ్, ది ఆంధ్రా పెట్రో కెమికల్స్ లిమిటెడ్, విశాఖపట్నం కోఆపరేటివ్ డైరీ, హెవీ ప్లేట్స్ అండ్ వెసల్స్ లిమిటెడ్ (భెల్), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ లిమిటెడ్–పైడిభీమవరం వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో వీరికి పారిశ్రామిక శిక్షణ ఇస్తున్నారు. అందరికీ ఉద్యోగావకాశాలు అందరికీ ఉద్యోగావకాశాలు నినాదంతో పనిచేస్తున్నాం. ఆదిశగా విద్యార్థులను తీర్చిదిద్దే ప్రణాళిక అమలు చేస్తున్నాం. కాలేజీలో విద్యార్థులకు ఎటువంటి లోటు లేకుండా పూర్తిస్థాయి సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నాం. నూతన భవన సముదాయం నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేసేందుకుందుకు చర్యలు తీసుకున్నాం. త్వరలో ఐఎస్ఓ 9000, ఎన్బీఏ అక్రిడిషన్కోసం వెళ్తాం. ఎన్బీఏ అక్రిడిటేషన్ వచ్చిన తర్వాత ఫెర్టిలైజర్ టెక్నాలజీ కోర్సును ప్రారంభిస్తాం. సేఫ్టీ కోర్సుల హబ్‌గా తయారు చేస్తాం. ప్రస్తుతం ఫైర్ సేఫ్టీ, ఇండస్ట్రియల్ సేఫ్టీ కోర్సులు ఉన్నాయి. ఇతర సేఫ్టీ కోర్సుల ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నాం. కాలేజీ ప్రాంగణంలో బాలికల వసతి, భోజన సౌకర్యాల ఏర్పాటుకు అధునాతన భవనం ఉంది. ఇక్కడ 50 మందికి హాస్టల్ సదుపాయం ఉంది. పరిమిత సంఖ్యలో బాలురకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో హాస్టల్ సదుపాయం ఉంది. –డాక్టర్ కె.వెంకటరమణ, ప్రిన్సిపాల్ -
సాయి సందీప్ పరుగు తీస్తే పతకమే!
సబ్బవరం (పెందుర్తి ): మండలంలోని సబ్బవరానికి చెందిన యువ క్రీడాకారుడు సాయి సందీప్ అథ్లెటిక్స్‌లో విశేషంగా రాణిస్తున్నాడు. జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తున్నాడు. చిన్ననాటి నుంచి క్రీడలపై మక్కువ ఎక్కువ. ఈ నేపథ్యంలో అథ్లెటిక్స్‌లో రాణించాలని కలలుగన్నాడు. వాటిని నిజం చేసుకుంటూ ముందుకు పరుగులు తీస్తున్నాడు. సరైన వసతులు, శిక్షణ అందించే కోచ్‌లు లేకపోయినా ఏకలవ్యుడి మాదిరిగా పరుగులో మేటిగా నిలుస్తున్నాడు సాయి సందీప్. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఇంటర్ స్పోర్ట్స్ గేమ్స్‌లో 400 మీటర్ల రిలేలో స్వర్ణం, 400 మీటర్ల పరుగు పందెం వ్యక్తిగత విభాగంలోనూ వెండి పతకాలను సాధించి జాతీయ స్థాయి పోటీలకు సాయి సందీప్ ఎంపికయ్యాడు. ఈ పోటీలను ఈ నెల 10,11,12వ తేదీలలో ఏయూ బోర్డు ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మొత్తం 57 అనుబంధ కళాశాలలకు చెందిన 300 మంది విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు. ఏయూలో నిర్వహించిన పోటీలో వెండి పతకం అందుకున్న సాయి సందీప్ కుటుంబ నేపథ్యం.. వాండ్రాసి సాయి సంందీప్ తల్లి సంపత వెంకటలక్ష్మి సచివాలయ ఆరోగ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తుండగా, తండ్రి శ్రీనివాసరావు మార్కెటింగ్ విభాగంలో చిరుద్యోగిగా పనిచేస్తున్నారు. తమ్ముడు రోహిత్ విశాఖలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు 4వ తరగతి నుంచి... 4వ తరగతి నుంచి కడప జిల్లాలో డాక్టర్ వైఎస్సార్ స్టేట్ స్పోర్ట్స్ స్కూల్లో చేరాడు. ఈ స్కూల్లో ప్రవేశానికి నిర్వహించిన జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయిలో మంచి ప్రతిభతో తన స్పోర్ట్స్ కెరియర్‌కు గట్టి పునాది వేసుకున్నాడు. పరుగు పందెం, దాంతో పాటు హర్డిల్స్‌లో ప్రత్యేక శ్రద్ధ చూపడంతో అక్కడున్నవారు ఆ దిశగా సాయి సందీప్‌ను ప్రోత్సహించారు. ► 4వ తరగతి నుంచి పదో తరగతి వరకూ స్పోర్ట్స్ స్కూల్లో చదివి మొత్తం రెండు జాతీయ స్థాయిలో వెండి, రజిత పతకాలతో పాటు 18 రాష్ట్రస్థాయి బంగారు పతకాలను సాధించాడు. ► ప్రస్తుతం విశాఖలోని డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. నాటి టీడీపీ నగదు ప్రోత్సాహం ఇంకా అందలేదు ప్రభుత్వం, స్పాన్సర్స్ నుంచి తగిన ప్రోత్సాహం లభిస్తే మరింత రాణించి అంతర్జాతీయ స్థాయిలో రాణించే సత్తా నాలో ఉందని సాయి సందీప్ చెబుతున్నాడు. ప్రభుత్వంలో గుంటూరు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ నిర్వహించిన 100 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించానని , అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తమ క్రీడా పురస్కారం అందజేశారన్నారు. దీంతో ప్రోత్సాహకంగా ప్రశంసాపత్రం, మెడల్‌తో పాటు ట్యాబ్, రూ.30 నగదు ప్రకటించారన్నారు. ఇప్పటి వరకూ ప్రభుత్వం ప్రకటించిన నగదు ప్రోత్సాహక బహుమతి లభించలేదని సందీప్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రోత్సహిస్తే సత్తా చూపుతా సబ్బవరంలో తగిన క్రీడా సౌకర్యాలు, వసతులు లేవు. 400 మీటర్ల సింథటిక్ ట్రాక్, అనుభవం ఉన్న కోచ్ దగ్గర శిక్షణ పొందినట్లయితే మరిన్ని పతకాలు సాధించి, దేశం తరఫున ప్రాతినిథ్యం వహించి మరిన్ని పతకాలు సాధిస్తా. కోవిడ్ నేపథ్యంలో జాతీయ స్థాయి క్రీడలకు అంతరాయం ఏర్పడిందని, వచ్చే ఏడాది నిర్వహించనున్న పోటీలో పాల్గొని బంగారు పతకం సాధిస్తానని సందీప్ చెబుతున్నాడు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉండటంతో డైట్, పౌష్టి కాహరం తీసుకోవడం, స్పోర్ట్స్ కిట్ తదితర వాటి కోసం ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరుతున్నాడు. సాధించిన వివిధ పతకాలతో సాయి సందీప్ కోర్టులో పరుగు తీస్తూ... పరుగు పందెంలో సాయి సందీప్ -
ఏపీకి వర్ష సూచన
మహారాణిపేట (విశాఖ దక్షిణ): బంగాళాఖాతం తీర ప్రాంతాల్లో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది. చదవండి: బ్యాంక్ ఉద్యోగి చేతివాటం.. రూ.కోటికి పైగా బ్యాంకు సొమ్ము మాయం -
శభాష్ విజయ్.. యోగాలో గిన్నిస్ రికార్డ్
అనకాపల్లి: విశాఖ జిల్లా అనకాపల్లిలో పుట్టి చైనాలో యోగా గురువుగా ప్రఖ్యాతి గాంచిన కొణతాల విజయ్ గిన్నిస్‌బుక్‌లో స్థానం సంపాదించారు. చైనాలోని జెంజూ నగరంలో ఆగస్ట్ 4న అష్ట వక్రాసనాన్ని 2.32 నిమిషాలపాటు ప్రదర్శించి ఈ ఘనత సాధించారు. విజయ్ చదువుకునే సమయంలోనే యోగా నేర్చుకున్నారు. తర్వాత నృత్యంలో మెలకువలు సంపాదించి స్టార్ డ్యాన్సర్‌గా గుర్తింపు పొందారు. పలు దేశాల్లో డ్యాన్స్ శిక్షకుడిగా పనిచేసిన ఆయన చైనాలో స్థిరపడి నృత్యం, యోగ విద్యలో శిక్షణ ఇస్తున్నారు. చదవండి: 17 నుంచి గుంటూరులో అగ్రి ఇన్ఫోటెక్–2021 భార్యాభర్తలిద్దరికీ గిన్నిస్‌బుక్‌లో స్థానం విజయ్ భార్య జ్యోతి కొద్ది నెలల క్రితం గిన్నిస్‌బుక్‌లో స్థానం దక్కించుకున్నారు. నిండు గర్భంతో యోగాసనాలు వేసి ఆమె ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు విజయ్‌కు కూడా అదే యోగాలో గిన్నిస్ బుక్‌లో స్థానం లభించడం గొప్పవిషయమని గిన్నిస్‌బుక్ ప్రతినిధులు పేర్కొన్నారు. చైనాలో కుంగ్ ఫూ, కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్‌లో ఎంతోమంది నిష్ణాతులు ఉంటారని, అక్కడ పోటీని తట్టుకొని యోగాసనాల్లో గిన్నిస్‌బుక్‌లో స్థానం పొందడం సంతోషంగా ఉందని విజయ్ ‘సాక్షి’తో చెప్పారు. -
పెళ్లి రోజే ఆమెకు ఆఖరి రోజైంది! క్షణికావేశంలో..
ఆనందపురం (భీమిలి): క్షణికావేశానికి ఓ నిండు ప్రాణం బలైంది. భార్యాభర్తల మధ్య జరిగిన వాదోపవాదాలు తారాస్థాయికి చేరి హత్యకు పురిగొల్పాయి. పెళ్లి రోజే ఆమెకు ఆఖరి రోజైంది. మండలంలోని శొంఠ్యాంలో శనివారం మధ్యాహ్నం జరిగిన హత్య ఘటన రాత్రి వెలుగు చూసింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెందుర్తికి చెందిన పంతుల సూర్య తీర్ధ ప్రసాద్ 20 ఏళ్ల కిందట మండలంలోని శొంఠ్యాం గ్రామానికి వలస వచ్చారు. ఆయనకు విశ్వనాథశాస్త్రి అనే కుమారుడు, వెంకట లలితాదేవి(35) అనే కుమార్తె ఉన్నారు. కాగా వెంకట లలితాదేవికి పదేళ్ల క్రితం వివాహమైంది. ఒక కుమారుడు కలిగిన తర్వాత భర్తతో మనస్పర్థల కారణంగా విడిపోయారు. మళ్లీ ఎనిమిదేళ్ల కిందట విజయనగరానికి చెందిన ఆండ్ర రవికుమార్ అనే వ్యక్తితో వివాహమైంది. అప్పటి నుంచి భర్త, కుమారుడుతో వెంకట లలితాదేవి శొంఠ్యాంలోనే ఉంటున్నారు. భార్యాభర్తలు స్థానికంగా ఉన్న దేవాలయాలలో పూజలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. భార్యాభర్తలు తరచూ గొడవలు పడే వారని స్థానికులు అంటున్నారు. శనివారం ఆ దంపతుల పెళ్లిరోజు. ఈ నేపథ్యంలో పెళ్లి రోజునాడు కూడా భర్త తనకు అచ్చటా, ముచ్చటా చూడలేదని సరదాగా కనీసం బయటకు కూడా తీసుకెళ్లలేదని వెంకట లలితాదేవి భర్తతో గొడవ పడింది. ఇంటి వద్దే ఉన్న వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. కోపాన్ని ఆపుకోలేని రవికుమార్ సుత్తితో లలితాదేవి తలపై కొట్టడంతో కుప్పకూలి పోయింది. తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటన జరిగిన తర్వాత రవికుమార్ పోలీసులకు లొంగిపోయాడు. సంఘటన స్థలాన్ని ఏసీపీ శ్రీనివాసరావు, సీఐ రవి చేరుకుని విచారణ జరిపారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించాయి. సీఐ రవి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: టమాటా.. ఊరట! ఈ రోజు ధర ఎంతంటే.. -
Visakhapatnam: పాడి గేదె పంచాయితీ.. ప్రాణం తీసిన క్షణికావేశం!
నర్సీపట్నం: పాడి గేదె అమ్మకం.. కొనుగోలు వ్యవహారంలో తలెత్తిన వివాదం చివరకు ఒకరి మృతికి కారణమైంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధి బలిఘట్టానికి చెందిన భీమిరెడ్డి నూకరాజు రెండు రోజుల క్రితం ఇక్కడికి సమీపంలోని కృష్ణాపురానికి చెందినబర్ల అప్పారావు వద్ద గేదెను రూ.49 వేలకు కొనుగోలు చేశాడు. అడ్వాన్సుగా రూ.20 వేలు చెల్లించి, మిగతా మొత్తం మూడు రోజుల తరువాత ఇస్తానని చెప్పి గేదెను తీసుకువెళ్లాడు. మూడు రోజులు తరువాత రూ.29 వేలు ఇవ్వలేదు. గేదె కొనుగోలులో మధ్యవర్తిగా వ్యవహరించిన బలిఘట్టానికి చెందిన శెట్టి వెంకటరమణను వెంటబెట్టుకుని అప్పారావు డబ్బులు అడిగేందుకు నూకరాజు ఇంటికి వెళ్లాడు. తీసుకువచ్చిన మరుసటి రోజు నుంచే మేత తినటం లేదని గేదె ను తోలుకు పొమ్మని నూకరాజు అన్నాడు. నూకరాజు, అప్పారావు మధ్య డబ్బులు విషయంలో గీజులాడుకుంటున్నారు. మధ్యవర్తి వెంకటరమణ కలుగజేసుకుని ఇవ్వాల్సిన రూ.29 వేలలో రూ. 2 వేలు తగ్గించి రూ.27 వేలు అప్పారావుకు ఇవ్వాలని, లేకుంటే రూ. 2 వేలు తగ్గించి రూ.18 వేలు ఇస్తాడు నువ్వైనా తీసుకోమని నూకరాజుకు చెప్పాడు. తాను ఇచ్చిన రూ.20 వేలలో పైసా తగ్గించిన తీసుకోనని నూకరాజు భీష్మించాడు. దీంతో మధ్యవర్తి, నూకరాజు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో క్షణికావేశంలో నూకరాజు కర్రతో వెంకటరమణ తలపై గట్టిగా కొట్టడంతో తీవ్ర గాయమైంది. వెంటనే వెంకటరమణను ఏరియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరతలించారు. పరిస్థితి విషమించడంతో కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. విశాఖకు తరలిస్తుండగా వెంకటరమణ మార్గం మధ్యలో మృతి చెందాడు. దీనిపై హత్యగా కేసు నమోదు చేశామని పట్టణ ఎస్ఐ నారాయణరావు తెలిపారు. మృతుడికి భార్య మంగ, ఇద్దరు ఆడపిల్లలు, బాబు ఉన్నారు. చదవండి: ఐయామ్ వెరీ సారీ..! కత్రినాకైఫ్ పెళ్లి ఫొటోలు ప్రచురించడం కుదరదు..! -
తండ్రికి ‘తల్లై’ పునర్జన్మనిచ్చింది..
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): కంటే కూతుర్నే కనాలి అంటారు..నిజమే ఈ సంఘటనతో మరోసారి రుజువైంది. కాలేయవ్యాధితో మృత్యువుకు దగ్గరవుతున్న తండ్రిని కాపాడుకునేందుకు ఏకంగా తన కాలేయంలో సగ భాగమిచ్చి రుణం తీర్చుకుంది ఓ కుమార్తె. సీఎం రిలీఫ్ ఫండ్, కేర్ ఆస్పత్రి వైద్యులు ఒక ప్రాణం నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించారు. వివరాల్లోకి వెళితే..శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలానికి చెందిన నీలకంఠేశ్వరరావు రెండేళ్లుగా లివర్ సమస్యతో బాధపడతున్నాడు. చివరి దశ కాలేయ వ్యాధితో మృత్యువుకు దగ్గరలో ఉన్న తరుణంలో తన కుమార్తె వాణి ముందుకు వచ్చింది. తన కాలేయంలో కొంత భాగాన్ని తండ్రి నీలకంఠేశ్వరరావుకు ఇచ్చేందుకు సిద్ధమైంది. వైజాగ్‌లోని కేర్ హాస్పటల్స్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ మహ్మద్ అబ్దుల్ నయూ మ్ నేతృత్వంలో కేర్ హాస్పటల్స్ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ కింజరాపు రవిశంకర్, లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అనస్థిషియా డాక్టర్ రాజ్‌కుమార్, వైద్య బృందం శస్త్రచికిత్సకు పూనుకున్నారు. అక్టోబర్ 2వ తేదీన ఉదయం 7 గంటలకు ప్రారంభించిన శస్త్రచికిత్స దాదాపు 16 గంటల పాటు సాగింది. ఆపరేషన్ విజయవంతం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నయూమ్ మాట్లాడుతూ కాలేయ వ్యాధిగ్రస్తుల ప్రాణాలు కాపాడడానికి లివింగ్ డోనర్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విధానం సరికొత్త పరిష్కారాన్ని చూపుతుందని, సరైన సమయంలో చికిత్స చేయకపోవడం వల్ల కాలేయవ్యాధిగ్రస్తులు ప్రాణాలు కోల్పోవలసి వస్తుందని చెప్పారు. శస్త్ర చికిత్స విజయవంతమై నీలకంఠేశ్వరరావు సాధారణ స్థితికి చేరుకున్నారని, అలాగే లివర్ ఇచ్చిన వాణి కూడా పూర్తిగా కోలుకుందని, ఆరు వారాల్లో ఆమె కాలేయం యథాస్థితికి చేరుకుందని డాక్టర్ నయూమ్ చెప్పారు. నీలకంఠేశ్వరరావు పోర్టల్ హైపర్ టెన్షన్‌తో డీకంపెన్సేటెడ్ సిర్రోసిస్ ఆఫ్ లివర్ కూడా క్షీణించి హెపటోరెనల్ సిండ్రోమ్ అనే పరిస్థితికి దారి తీసిందని, అతనికి వీలైనంత త్వరగా లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాల్సి వచ్చిందని, అందుకు అతని కుమార్తె వాణి ముందుకు రావడం అభినందనీయమన్నారు. మీడియా సమావేశంలో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ కింజరాపు రవిశంకర్ పాల్గొన్నారు. సైన్స్‌పై పట్టు ఉండడం వల్లే.. తాను బైపీపీ విద్యార్థిని కావడంతో కొంత అవగాహన ఉండడంతో కాలేయం దానం చేసేందుకు ముందుకొచ్చానని, నా కాలేయంలో సగ భాగం తీసి తండ్రి నీలకంఠేశ్వరరావుకు అమర్చారని, ప్రస్తుతం ఇద్దరం బాగానే ఉన్నామని మీడియాకు వాణి వివరించారు. ఆపరేషన్ విజయవంతం చేసిన వైద్యులు..ముఖ్యంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఆదుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Visakhapatnam Road Accident Today: విశాఖప్నటం జిల్లాలోని మధురవాడ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం మధురవాడ వద్దపై బైక్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో భార్యాభర్తలు, కుమార్తె ఉన్నారు. మధురవాడ నుంచి విశాఖ సిటీకి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద స్థలాన్ని స్థానిక పోలీసులు పరిశీలిస్తున్నారు. చదవండి: Gunture: పట్ట‘పగ’లు మాజీ సర్పంచ్ దారుణ హత్య -
అలుపెరుగని అథ్లెటిక్.. పరుగులో రారాజు
మల్కాపురం (విశాఖ పశ్చిమ): ఆయన వయసు 67 ఏళ్లు...అయినా 20 ఏళ్ల యువకుడిలా ఫిట్‌గా ఉంటాడు. ఎవరైనా సరే నాతో పరుగెత్తగలరా అంటూ సవాల్ విసురుతాడు. కచ్చితంగా గెలిచే తీరుతాడు. 60–75 ఏళ్ల విభాగంలో పోటీలో పాల్గొంటూ పతకాలు గొల్లగొడుతున్నాడు. అతనే ఇందిరాకాలనీకి చెందిన ఆకుల కనకరాజు. ఇప్పటికీ అదే ఉత్సాహం కనకరావుకు ఇప్పడు 65 ఏళ్లు. అయినా నిత్యయువకుడిలా పరుగులో రాణిస్తున్నాడు. తెల్లవారు జామునే నిద్ర లేవడం.. రన్నింగ్‌కు వెళ్లడం నిత్య దినచర్య. ప్రస్తుతం కనకరాజు షిప్‌యార్డ్ జూనియర్ కళాశాలలో పీఈటీగా పనిచేస్తున్నాడు. రన్నింగ్‌తో పాటు బాడీబిల్డింగ్, బాక్సింగ్, ఫుట్‌బాల్ వంటి క్రీడలు కనకరాజుకు అనుభవం ఉంది. ఆ క్రీడల్లో కూడా పతకాలు సాధించాడు. 1972లో తొలిసారిగా.. 1972లో ఇండియన్ నేవి విశాఖలో ఏర్పాటు చేసిన పది కిలో మీటర్ల పరుగు పందెంలో తొలి స్థానంలో నిలిచాడు. అప్పటి నుంచి ఏటా వివిధ రాష్ట్రాలలో జరిగే పరుగు పందెంలో పాల్గొని పతకాలు సాధించాడు. 65 ఏళ్ల వయసులో కూడా (2000వ సంవత్సరం) హరియానలో జరిగిన జాతీయ స్థాయి 4 మీటర్ల పరుగు పందెంలో తృతీయ స్థానంలో నిలిచాడు. వంద, రెండు వందలు ,మూడు వందలు, నాలుగు వందల మీటర్ల పరుగు పందెంలో ఇప్పటి వరకు నాలుగు వందల వరకు పతకాలు సాధించాడు. ఇప్పటి వరకు సాధించిన పతకాలు 140 జీవీఎంసీ 60వ వార్డు పరిధి ఇందిరాకాలనీ– 1 ప్రాంతానికి చెందిన ఆకుల కనకరాజు అథ్లెటిక్స్ రాణిస్తు ఆదర్శంగా నిలుస్తున్నాడు. వయసు 67 ఏళ్లయినా వెనుకడుగు వేయకుండా పరుగులో నంబర్–1 గా నిలుస్తున్నాడు. పదో తరగతి పూర్తి చేసిన కనకరాజు ఇండియన్ ఆర్మీలో చేరాడు. అక్కడ అధికారులు ఇచ్చిన పోస్టు నచ్చక ఏడాదికి తిరిగి వచ్చాశాడు. విశాఖలో హోంగార్డుగా ఐదేళ్లు పనిచేశాడు. అనంతరం సీలేరు వద్ద గల ప్రభుత్వ ఐటీఐలో మేల్ నర్స్‌గా చేరాడు. తరువాత విశాఖ సెంట్రల్ జైల్లో మేల్ నర్సింగ్ విధులు నిర్వహించి అక్కడే పదవీ విరమణ పొందాడు. కనకరాజు 13 ఏళ్ల వయసులోనే పరుగు మొదలు పెట్టాడు. షిప్‌యార్డ్, జింక్, పోర్టు గ్రౌండ్లో రన్నింగ్ ప్రాక్టిస్ చేశాడు. -
Gajuwaka: బైక్ రేసింగ్‌లో దూసుకుపోతున్న అవినాష్
గాజువాక: జాతీయ స్థాయి బైక్ రేసులో గాజువాక శ్రీనగర్‌కు చెందిన యువకుడు ప్రతిభ ప్రదర్శించాడు. ది వ్యాలీ రన్ పేరుతో ఈనెల 5న పూణేలో నిర్వహించిన నేషనల్ డ్రాగ్ రేసింగ్‌లో పాల్గొన్న వై.అవినాష్ 1000 సీసీ బైక్ రేసులో ద్వితీయ స్థానం సాధించాడు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది విశాఖ నగరానికి మంగళవారం చేరుకొన్న అవినాష్‌ను పలువురు అభినందించారు. నాలుగేళ్లుగా పోటీలకు బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అవినాష్ నాలుగేళ్లుగా రేసుల్లో పాల్గొంటున్నాడు. కోల్‌కతాలో గతంలో నిర్వహించిన ఎలైట్ ఆక్టేన్, నేషనల్ డ్రాగ్ చాంపియన్‌షిప్‌లలో పాల్గొన్న అవినాష్ తొమ్మిదో ర్యాంకు సాధించాడు. ఆ తరువాత బెంగళూరులో నిర్వహించిన పోటీలకు హాజరై 13వ ర్యాంకు తెచ్చుకున్నాడు. పూణేలోని లోనావాలాలో తాజాగా నిర్వహించిన రేసులో రెండో ర్యాంకు సాధించి పలువురి మన్ననలను పొందాడు. సేవా భావం తండ్రితో కలిసి స్టీల్‌ప్లాంట్‌లో ట్రాన్స్‌పోర్టు వ్యాపారం నిర్వహిస్తున్న అవినాష్ సమాజ సేవలోను పాలుపంచుకొంటున్నాడు. ప్రస్తుతం 20 మంది అనాథ పిల్లల చదువుకు సహాయం చేస్తున్నాడు. -
తెన్నేటి పార్కులో ఫ్లోటింగ్ రెస్టారెంట్‌గా ఎంవీ మా కార్గోషిప్
సాక్షి, విశాఖపట్నం : సిటీ ఆఫ్ డెస్టినీ సాగర తీరంలో మరో సరికొత్త ప్రాజెక్ట్ సందర్శకులకు ఆహ్వానం పలకనుంది. విశాఖ నగర ప్రజలతో పాటు దేశ విదేశీ పర్యాటకులకు విభిన్న అనుభూతిని అందించేందుకు పర్యాటక శాఖ సిద్ధమైంది. సరకు రవాణా కోసం వచ్చి అలల తాకిడికి ఒడ్డుకొచ్చిన బంగ్లాదేశ్ నౌకను నీటిపై తేలియాడే రెస్టారెంట్ గా మార్పు చేస్తోంది. పీపీపీ పద్ధతిలో నాలుగు నెలల్లో నౌకను ఫ్లోటింగ్ రెస్టారెంట్‌గా అభివృద్ధి చేసి..పర్యాటకులకు అందించనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా బలమైన గాలుల ధాటికి 2020 అక్టోబర్ 12 అర్ధరాత్రి 2 గంటల సమయంలో బంగ్లాదేశ్‌కు చెందిన ఎంవీ–మా షిప్ బోల్తా పడకుండా తెన్నేటి పార్కు సమీపానికి కొట్టుకువచ్చింది. ఆ సమయంలో నౌకలో కెప్టెన్ సహా 15 మంది సిబ్బంది ఉన్నారు. విశాఖ పోర్టు ట్రస్ట్, భారత తీరగస్తీ దళం(కోస్ట్ గార్డ్), మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్, మర్చెంటైల్ మెరైన్ డిపార్ట్మెంట్(ఎంఎండీ), ఇండియన్ నేవీ, హిందూస్థాన్ షిప్ యార్డ్ ఇలా.. మొత్తం ఎనిమిది సంస్థలు షిప్‌ను తిరిగి సముద్రంలోకి పంపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినా సాధ్యం కాలేదు. దీంతో ఈ నౌకను ఇక్కడే వదిలేసేందుకు యాజమాన్యం నిర్ణయించుకుంది. ఈ తరుణంలో ఈ కార్గో షిప్‌ను ఫ్లోటింగ్ రెస్టారెంట్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసింది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మారీటైమ్ యూనివర్సిటీకి చెందిన నిపుణుల బృందం నౌకను వారం రోజుల పాటు పరిశీలించి.. టూరిజం శాఖకు నివేదిక ఇచ్చింది. నివేదికను పరిశీలించిన ప్రభుత్వం ఈ కార్గో నౌకను ప్లాటింగ్ రెస్టారెంట్‌గా మార్చాలని నిర్ణయించింది. ఇందుకు కొన్ని నెలల కిందట కేబినెట్ కూడా ఆమోదముద్ర వేసింది. రూ.4.50 కోట్లకు విక్రయించేందుకు యాజమాన్యం పీఎన్‌ఐ క్లబ్ సిద్ధమవగా.. రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు జరిపి రూ.1.25 కోట్లకు పర్యాటక శాఖ సొంత నిధులతో కొనుగోలు చేసింది. ఫ్లోటింగ్ రెస్టారెంట్ ప్రత్యేకతలివే.. నౌకను అరుదైన ఫ్లోటింగ్ రెస్టారెంట్‌గా తీర్చిదిద్దేందుకు టూరిజం శాఖ సిద్ధమవుతోంది. ప్రపంచదేశాల పర్యాటకులను ఇట్టే ఆకర్షించేలా.. టూరిస్ట్ ఎమినిటీస్‌తో కూడిన ప్రాజెక్ట్‌గా డిజైన్ చేశారు. పుట్టిన రోజు, పెళ్లి రోజు, ఇతర శుభ కార్యాలు నిర్వహించేందుకు అనుగుణంగా బాంక్వెట్ హాళ్లు ఏర్పాటు చేయనున్నారు. దేశ విదేశీ రుచులు అందుబాటులో ఉండేలా 500 మందికి సరిపడా మల్టీ క్యూసిన్ రెస్టారెంట్ రానుంది. ఒక సందర్శకుడికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు ఇందులో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. పీపీపీ పద్ధతిలో రూ.10.50కోట్లతో ఫ్లోటింగ్ రెస్టారెంట్‌ను మిస్టర్ గిల్ మెరైన్స్ సంస్థతో కలిపి అభివృద్ధి చేయనున్నారు. తెన్నేటి పార్కుతో కలిపి దీనిని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడంతో.. ఆ పార్కును కూడా తమకు అప్పగించాలని జీవీఎంసీ, వీఎంఆర్డీఏ అధికారులకు పర్యాటక శాఖ లేఖలు రాసింది. అంతర్జాతీయంగా ఆకర్షిస్తుంది విశాఖ తీరంలో ఐఎన్ఎస్ కురుసుర సబ్‌మెరైన్ మ్యూజియం, టీయూ–142 యుద్ధ విమాన మ్యూజియం సందర్శకులకు సరికొత్త అనుభూతిని అందిస్తున్నాయి. త్వరలోనే సీ హారియర్ మ్యూజియం కూడా అందుబాటులోకి రానుంది. ఈ మూడింటితో పాటు ఎంవీ మా ఫ్లోటింగ్ రెస్టారెంట్ అందుబాటులోకి వస్తే.. ప్రపంచ పర్యాటక పటంలో ఈ తరహా మ్యూజియంలు, రెస్టారెంట్లు ఉన్న నగరంగా విశాఖపట్నం వినుతికెక్కనుంది. గిల్ సంస్థ డీపీఆర్ తయారు చేస్తోంది. నాలుగు నెలల్లో షిప్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తాం. రెస్టారెంట్, ఏసీ గదులు, రూఫ్‌టాప్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ నెల 29 నుంచి నౌక సందర్శించేందుకు పర్యాటకులను అనుమతినిస్తున్నాం. – ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి -
ఎక్కడికి పోవాలి? 20 ఏళ్లుగా ఇక్కడే ఉన్నాం
పరవాడ: కూలి పనులు చేసుకుంటూ.. కుటుంబాలను నెట్టుకొస్తూ పూరి గుడిసెల్లో కాలం వెళ్లదీస్తున్న తమ కుటుంబాలను ఉన్నట్టుండీ ఖాళీ చేసి పొమ్మంటే తమ గతేమిటని దేశపాత్రునిపాలెం సమీపంలో పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ స్థలంలో తలదాచుకొంటున్న వలస కూలీలు వాపోతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు వంద కుటుంబాలు 20 ఏళ్ల క్రితం స్టీల్ ప్లాంటు, పరిసర ప్రాంతాల్లో దొరికే కూలి పనుల కోసం వచ్చాయి. సాయినగర్ కాలనీ సమీపంలో ఖాళీగా ఉన్న స్థలంలో చిన్న చిన్న పూరి పాకలు ఏర్పాటు చేసుకొని పిల్లా పాపలతో కాలం వెళ్లదీస్తున్నారు. ఇక్కడ నివసిస్తున్న నిరుపేద కుటుంబాలన్నీ భార్యాభర్తలు కష్టించి పనిచేస్తే తప్ప పొట్ట గడవడం కష్టం. కొందరు స్టీల్ ప్లాంటులో కాంట్రాక్టర్ల వద్ద కూలి పనులు చేస్తుండగా మరికొందరు భవన నిర్మాణం పనులు, మట్టి పనులకు వెళుతున్నారు. ఇక్కడ ఖాళీ స్థలంలో నివాసం ఉంటున్న వలస కూలీలను ఖాళీ చేసి వెళ్లి పొమ్మని కొంత కాలం నుంచి పవర్ గ్రిడ్ అధికారులు ఆదేశిస్తుండడంతో కుటుంబాల్లో ఆందోళన మొదలైంది. పవర్ గ్రిడ్ యాజమాన్యం తమకు పునరావాసం కల్పించి గుడిసెల తొలగింపు చేపట్టాలని కోరుతున్నారు. ఎమ్మెల్యే చొరవ: వసల కూలీల సమస్య తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అదీప్‌రాజ్ ఇటీవల పవర్ గ్రిడ్ అధికారులతో మాట్లాడారు. అప్పటినుంచి అధికారులు వత్తిడిచేయడం లేదని తెలిసింది. న్యాయం చేయాలి నేను, నా భర్త 20 ఏళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లా హిరమండలం గరివిడి గ్రామం నుంచి పొట్ట చేతపట్టుకొని స్టీల్‌ప్లాంటులో కూలి పనులకు వచ్చాం. తన భర్త కొబ్బరి బొండాలు అమ్ముతుంటాడు. దేశపాత్రునిపాలెం సమీపంలో ఖాళీ స్థలంలో చిన్న పూరిగుడిసె నిర్మించుకొని ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్నాం. ఇంతలో పవర్ గ్రిడ్ అధికారులు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లమంటే ఎక్కడికి వెళ్లాలి. – బోర రమణమ్మ, వలస కూలి పునరావాసం కల్పించాలి విజయనగరం జిల్లా గంట్యాడ మండల లక్కిడాం నుంచి 21 ఏళ్ల క్రితం కూలి పనులకు వచ్చి చిన్న పూరి గుడెసె నిర్మించుకొని కుటుంబంతో తలదాచుకుంటున్నాం. పునరావాసం కల్పిస్తే తప్ప గుడిసెలు ఖాళీ చేసేదిలేదు. – బండారు రమణమ్మ, వలస కూలి ప్రభుత్వమే ఆదుకోవాలి పాతికేళ్ల క్రితం గాజువాక నుంచి చిరు వ్యాపారం చేసుకోవడానికి వచ్చి ఇక్కడ గుడిసె వేసుకొని పొట్టపొషించుకొంటున్నాం. ఇళ్ల పట్టాలిప్పిస్తామని కొందరు పవర్ గ్రిడ్ హోం గార్డులు తమ వద్ద ఆధార్ కార్డులు, నగదు తీసున్నారు. ఇప్పుడు ఖాళీ చేయమంటున్నారు. ప్రçభుత్వమే ఆదుకోవాలి. – నడిపిల్లి అరుణ, చిరు వ్యాపారి -
జవాద్ తుపాన్: ఏపీ ప్రజలకు అధికారులు కీలక సూచన
సాక్షి, అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. విశాఖపట్నానికి 960 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న ఈ వాయుగుండం మరింత బలపడి శుక్రవారం మధ్య బంగాఖాళాతంలో జవాద్ తుపానుగా మారుతుందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు. చదవండి: AP Rain Alert: బలపడిన వాయుగుండం ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్) విద్యుత్ వినియోగదారులకు అప్రమత్తం చేసింది. జవాద్ తుఫాన్ వల్ల ఏర్పడే విద్యుత్ ప్రమాదాలు, అవాంతరాలకు సంబందించిన సమాచారాన్ని ఏపిఈపీడీసీఎల్ కంట్రోల్ రూమ్ నంబర్లకు తెలియజేయాలని పేర్కొంది. చదవండి: Cyclone Jawad: బలపడిన వాయుగుండం.. సాయంత్రం నుంచే అతి భారీ వర్షాలు తుఫాన్ ప్రభావానికి తెగిపడిన విద్యుత్ వైర్లు, పడిపోయిన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లపై పడిపోయిన చెట్లకొమ్మల పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపింది. వాటి సమాచారాన్ని టోల్ ఫ్రీ నెం. 1912, కంట్రోలు రూమ్ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి తెలియజేయాలని ఏఎండీ కె.సంతోషరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కంట్రోలు రూమ్ ఫోన్ నెంబర్లు.. ► విశాఖపట్నం కార్పోరేట్ ఆఫీసు- 9440816373 / 8331018762 ► శ్రీకాకుళం- 9490612633 ► విజయనగరం-9490610102 ► విశాఖపట్నం-7382299975 ► తూర్పుగోదావరి-7382299960 ► పశ్చిమగోదావరి-9440902926 -
ఉండమ్మా టీకా వేస్తా..
ముంచంగిపుట్టు: మండలం జర్జుల పంచాయతీ చిన్నతమ్మెగుల గ్రామం. సోమవారం వైద్యసిబ్బంది సూదిమందు (కోవిడ్ టీకా) వేసేందుకు వస్తున్నారని తెలిసి అమాయకులైన ఆ గిరిజన గూడెం వాసులు భయపడ్డారు. ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నం చేశారు. కొందరు పంట కోతల సాకుతో పొలాలకు వెళ్లారు. అయితే వైద్యసిబ్బంది మాత్రం వారిని వదల్లేదు. టీకా ఎక్స్‌ప్రెస్ కేర్ ఇండియా డీఈవో పి.మనోహర్, ఏఎన్ఎంలు వి.దాలిమ్మ, ఎల్.పద్మ పొలాల వద్దకే వెళ్లి గిరిజన మహిళలకు అవగాహన కల్పించారు. పొలంలోనే వారికి కోవిడ్ టీకా వేశారు. చిన్నతమ్మెగుల, అమలగూడ గ్రామాల్లో సోమవారం మొత్తం 58 మందికి వ్యాక్సినేషన్ జరిగింది. -
AP: గంజాయికి చెక్.. ముమ్మరంగా ‘ఆపరేషన్ పరివర్తన్’
సాక్షి, అమరావతి/పాడేరు/గూడెంకొత్తవీధి/చింతపల్లి: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో గంజాయి సాగును నిర్మూలించేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ‘ఆపరేషన్ పరివర్తన్’ను ముమ్మరం చేసింది. దీన్లో భాగంగా గిరిజనుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు అయిదు రోజుల్లో విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లోని గిరిజన ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించింది. గంజాయి సాగుతో కలిగే దుష్పరిణామాలపై పోలీసులు, నిపుణులు గిరిజనులకు అవగాహన కల్పించారు. మరోవైపు ఎస్ఈబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, ప్రధాన మార్గాల్లో తనిఖీలు చేస్తూ నిఘాను పటిష్టపరిచారు. మొత్తం 283 కేసులు నమోదు చేసి 763 మందిని అరెస్టు చేశారు. 9,266 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 179 వాహనాలను జప్తుచేశారు. 260 ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం విశాఖ ఏజెన్సీలో గంజాయి తోటల ధ్వంసం లక్ష్యంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో దాడులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు చెందిన ఎక్సైజ్‌శాఖ అధికారులు, ఇతర సిబ్బంది ఏడు బృందాలుగా పాడేరులో మకాం వేశాయి. జి.మాడుగుల, గూడెంకొత్తవీధి, చింతపల్లి మండలాల్లో ఆదివారం 260 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. అనకాపల్లి అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో జి.మాడుగుల మండలంలోని బొయితిలి ప్రాంతంలో 40 ఎకరాలు, గుప్పవీధిలో 40 ఎకరాలు, ఎగువ వాకపల్లిలో 55 ఎకరాలు, దిగువ వాకపల్లిలో 55 ఎకరాల్లో సుమారు 2 లక్షల గంజాయి మొక్కల్ని వేర్లతోసహా పీకేసి నిప్పంటించారు. గూడెంకొత్తవీధి మండలంలోని రింతాడ, దామనాపల్లి పంచాయతీల పరిధిలో సిగినాపల్లి, నల్లబెల్లి, తుప్పలదొడ్డి, గుర్రాలవీధి, అసరాడ, కాకరపాడు గ్రామాల్లో సుమారు 50 ఎకరాల్లో, చింతపల్లి మండలంలోని టేకులవీధి, గడపరాయిలో 20 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. సీఐ అశోక్‌కుమార్, ఎస్ఐలు మహ్మద్ ఆలీషరీఫ్, షమీర్, ఆర్ఎస్ఐ నరేంద్ర, ఎస్ఈబీ అధికారులు త్రినా«థ్, మణికంఠ, డీవీజీ రాజు తదితరులు పాల్గొన్నారు. గంజాయి నిర్మూలనకు విద్యార్థులతో 2కే రన్ ఏజెన్సీలోని గంజాయి సాగు, అక్రమ రవాణా నిర్మూలనలో గిరిజన యువత భాగస్వాములవ్వాలని పాడేరు ఏఎస్పీ జగదీష్ పిలుపునిచ్చారు. ‘నో టు గంజా’, పరివర్తన కార్యక్రమంలో భాగంగా ఆదివారం విశాఖజిల్లా పాడేరులో గిరిజన విద్యార్థులతో 2కే రన్ నిర్వహించారు. చలిగాలులు ఉన్నప్పటికీ 500 మంది గిరిజన విద్యార్థులు పాల్గొన్నారు. గంజాయికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతకుముందు ఏఎస్పీ జగదీష్ మాట్లాడుతూ గంజాయి సాగు ద్వారా విశాఖ ఏజెన్సీకి చెడ్డపేరు వస్తోందన్నారు. గిరిజనులంతా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. స్మగ్లర్లు గంజాయి రవాణాకు యువతను ఉపయోగించుకుంటున్నారని చెప్పారు. గిరి జన యువత జైలు జీవితం గడుపుతూ భవి ష్యత్తును నాశనం చేసుకుంటున్నట్లు తెలిపారు. గంజాయికి వ్యతిరేకంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. -
Crime News: బంగారం పట్టివేత.. ఆభరణాల రూపంలో అక్రమ రవాణా
సాక్షి, విశాఖపట్నం: బంగారం అక్రమ రవాణా అవుతుందన్న పక్కా సమాచారంతో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ (డీఆర్ఐ)అధికారులు విశాఖపట్నం రైల్వేస్టేషన్లో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో యశ్వంత్‌పూర్-హౌరా ఎక్సప్రెస్లో 3.98కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లభ్యమైన బంగారం విలువ రూ.1.91కోట్ల ఉంటుందని అంచనా వేస్తున్నారు. చదవండి: సీఐడీ షో స్ఫూర్తి: దారుణానికి పాల్పడ్డ మైనర్లు బంగ్లాదేశ్ నుంచి బంగారాన్ని తీసుకొచ్చి కోల్‌కతాలో ఆభరణాల రూపంలో అమర్చి అక్రమ రవాణా చేస్తున్నారని అధికారులు వెల్లడించారు. కస్టమ్స్ యాక్ట్-1962 ప్రకారం బంగారం తరలిస్తున్న ప్రయాణికుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఆర్ఐ అధికారులు పేర్కొన్నారు. -
రైతు ఉద్యమం తరహాలో విశాఖ ఉక్కు పోరు
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ రంగం మొత్తాన్ని మోదీ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతోందని జాతీయ ప్రజా ఉద్యమ ప్రతినిధి మేధా పాట్కర్ నిప్పులు చెరిగారు. అందులో భాగంగానే ప్రజల సంపద అయిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని నిర్ణయించారని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం జాతి సంపదను అత్యంత చౌకగా కార్పొరేట్ సంస్థలకు, ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తోందని దుయ్యబట్టారు. రైతు ఉద్యమం తరహాలో విశాఖ ఉక్కు ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా నడపాల్సిన అవసరం ఉందన్నారు. ఐక్య ఉద్యమాలే దేశ పాలకులు తమ నిరంకుశ నిర్ణయాలను వెనక్కి తీసుకునేలా చేస్తాయన్నారు. ఐక్య ఉద్యమాలను బలోపేతం చేయడం ప్రజలందరి కర్తవ్యమని తెలిపారు. విశాఖపట్నం కూర్మన్నపాలెంలో స్టీల్‌ప్లాంట్ కార్మికుల నిరాహార దీక్షా శిబిరాన్ని శనివారం సందర్శించి మద్దతు తెలిపిన మేధా పాట్కర్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. సాక్షి: ప్రైవేటీకరణపై విశాఖ ఉక్కు కార్మికులు చేపట్టిన ఉద్యమాన్ని మీరెలా చూస్తున్నారు? మేధా పాట్కర్: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన ఐక్య ఉద్యమం అద్భుతం. స్టీల్‌ప్లాంట్ కార్మికులు 261 రోజులుగా పోరాడుతున్నారు. ఇది అనేక ఉద్యమాలకు ప్రేరణగా నిలుస్తోంది. సాక్షి: స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వెనుక కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఏమై ఉండవచ్చు? మేధా పాట్కర్: మొత్తం దేశాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలని మోదీ ప్రభుత్వం చూస్తోంది. అందులో భాగంగానే విశాఖ స్టీల్‌ప్లాంట్ సహా ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటుపరం చేస్తున్నారు. ఈ విధానం వల్ల దేశానికి చాలా నష్టం జరుగుతుంది. జాతి సంపదను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధం కూడా. సాక్షి: ప్రైవేటీకరణ వల్ల ఎలాంటి నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది? మేధా పాట్కర్: ప్రైవేటీకరణతో అన్నీ నష్టాలే. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని కోల్పోతారు. స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్), తప్పనిసరి పదవీ విరమణ (సీఆర్ఎస్), గోల్డెన్ షేక్ హ్యాండ్ పేరుతో కార్మికులను తొలగిస్తారు. ప్రైవేటు యాజమాన్యాలు తమ ఉద్యోగులను కాంట్రాక్టు లేబర్‌గా మార్చుకుంటారు. రిజర్వేషన్లు అమలు కావు. ఇది ఊహాజనితం కాదు.. అనేక చోట్ల రుజువైంది కూడా. ఇప్పుడు రైల్వే రంగాన్ని చూస్తే ఇది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రైల్వేలో అన్ని విభాగాలను ఒక్కొక్కటిగా కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తున్నారు. రేపు ఇక్కడా (విశాఖ స్టీల్ ప్లాంట్‌లోనూ) అదే జరుగుతుంది. దీనివల్ల కార్మికులు తమ హక్కులను కోల్పోతారు. ఇప్పటికే 29 కార్మిక చట్టాలను రాజ్యాంగ విరుద్ధంగా నాలుగు కోడ్లుగా మార్చి హక్కులను హరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సాక్షి: మీరు కొంతమంది నిర్వాసితులను కలిశారు కదా. వారు ఏమంటున్నారు? మేధా పాట్కర్: వారి సమస్యలను తెలుసుకొన్నాను. నిర్వాసితులు దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు. కొంతమందికి ఇంకా పునరావాసం కూడా కల్పించలేదు. ఉద్యోగాలిస్తామన్న హామీ ఇప్పటివరకు పూర్తిస్థాయిలో నెరవేరలేదు. స్టీల్‌ప్లాంట్ కోసం తమ వ్యవసాయాన్ని వదులుకొని భూములిచ్చారు. పబ్లిక్ అవసరాల కోసం భూములను ఇస్తే ప్రభుత్వం మాత్రం వాటిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతోంది. సాక్షి: ప్లాంట్ విలువను చాలా తక్కువకే అంచనా వేశారన్న ఆరోపణలున్నాయి. నిజమేనంటారా? మేధా పాట్కర్: అవును. రెండున్నర లక్షల కోట్ల విలువైన ప్రజా సంపదను కేవలం రెండు, మూడు వేల కోట్లుగా అంచనా వేసినట్టు తెలుస్తోంది. ప్రైవేట్ వ్యక్తులకు కారుచౌకగా దీన్ని ఇచ్చేయాలన్నది మోదీ ప్రభుత్వ ఉద్దేశం. ఇప్పటికే గంగవరం పోర్టును అదానీకి కట్టబెట్టేశారు. స్టీల్‌ప్లాంట్‌ను కూడా ఆయనకే అప్పగిస్తారు. ఆ రెండింటినీ అనుసంధానం చేసి రూ.వేల కోట్ల లాభాలను సంపాదిస్తారు. వారి ఆకలి అక్కడితో ఆగదు. సాక్షి: స్టీల్‌ప్లాంట్ కార్మికుల పోరాటం మరింత బలోపేతం కావాలంటే ఏం చేయాలి? మేధా పాట్కర్: ప్రస్తుతం కార్మికులు, నిర్వాసితులు వేర్వేరుగా ఆందోళన శిబిరాలను నిర్వహిస్తున్నారు. వారిద్దరూ కలిసి పోరాడాలి. రైతు ఉద్యమం తరహాలో విశాఖ ఉక్కు ఉద్యమం కొనసాగాలి. దీనికి మేము కూడా కృషి చేస్తాం. పార్లమెంట్లో పోరాడటానికి అవకాశం లేదు. అందువల్ల పార్లమెంట్ బయట ఉధృతంగా ఉద్యమాలను నడపాలి. కార్మిక సంఘాల నాయకులు, నిర్వాసితులు, రైతులు, ప్రజలు, ఐక్యంగా పోరాడాలి. సాక్షి: పోరాడటం వల్ల ప్రైవేటీకరణను అడ్డుకొనే అవకాశం ఉందా? మేధా పాట్కర్: ఖచ్చితంగా అడ్డుకోవచ్చు. అలాంటి విజయాలు చాలా ఉన్నాయి. మహారాష్ట్రలో ఎన్రాన్ ప్రాజెక్టు ఆగింది.. నర్మదా ప్రాజెక్టుపై పోరాటం జయప్రదంగా సాగింది. పోరాడితే కచ్చితంగా విజయం సాధించవచ్చు. -
సీఎం వైఎస్ జగన్ విశాఖ పర్యటన రద్దు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపటి(శనివారం) విశాఖపట్నం పర్యటన రద్దు అయింది. ఈ మేరకు సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. జీవీఎంసీ, వీఎంఆర్డీఏ పూర్తి చేసిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను సీఎం వైఎస్ జగన్ శనివారం ప్రారంభించాల్సి ఉండగా విశాఖ పర్యటన రద్దు అయినట్లు అధికారులు తెలిపారు. -
మన్యంలో మ్యూజియం.. ప్రకృతి అందాల మధ్య ఏర్పాటు
సాక్షి, అమరావతి: తెల్లదొరలను గడగడలాడించిన మన్యం వీరుల స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. బ్రిటీష్ పాలకులపై వీరు సాగించిన సాయుధ పోరాటానికి కేంద్రంగా నిలిచిన విశాఖ జిల్లా తాజంగిలో మన్యం వీరుల స్మారక మ్యూజియం నిర్మాణం చేపట్టింది. ప్రకృతి సహజసిద్ధమైన రమణీయ అందాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ‘ఆంధ్ర కాశ్మీరం’ లంబసింగి ప్రాంతంలో ఇది ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అందమైన ఉద్యానవనం మధ్య అరుదైన విశేషాలతో రూపుదిద్దుకోనున్న ఈ గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియం మన్యం పోరాటాన్ని ప్రతిబింబించనుంది. మొత్తం రూ.35 కోట్లతో చేపట్టిన ఈ మ్యూజియం నిర్మాణానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, పాడేరు ఎమ్మెల్యే కె. భాగ్యలక్ష్మి శుక్రవారం శంకుస్థాపన చేశారు. గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణా సంస్థ (టీసీఆర్–టీఎం–ట్రైబల్ కల్చరల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ మిషన్) ఆధ్వర్యంలో ఈ గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల మ్యూజియంను 21 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ప్రధాన భవనాన్ని అల్లూరి సీతారామరాజు, ఆయన అనుచరులు గాం గంటందొర, గాం మల్లుదొర చేబట్టిన విల్లు, బాణాలను గుర్తుకు తెచ్చే రీతిలో డిజైన్ చేశారు. యాంపి థియేటర్‌తో పాటుగా వివిధ అంశాల ప్రదర్శనలోనూ డిజిటల్ టెక్నాలజీని, ఆడియో, వీడియోలను సమకూర్చనున్నారు. మ్యూజియం గోడలను, పై కప్పును సంప్రదాయ గిరిజన కళాకృతులతో అలంకరించనున్నారు. మ్యూజియం పరిసరాలను పర్యాటకులకు ఆహ్లాదం కలిగించేలా తీర్చిదిద్దనున్నారు. అలాగే, అక్కడికి వచ్చే పర్యాటకుల కోసం గిరిజన సంస్కృతిని ప్రతిబింబించే ఆధునిక రెస్టారెంట్, రిసార్ట్‌ను కూడా ఏర్పాటుచేయనున్నారు. ఈ నిర్మాణం పనులను 2023 మార్చి నాటికి పూర్తిచేయాలని నిర్ణయించారు. మొదటి తిరుగుబాటు ఇక్కడే.. విశాఖపట్నం జిల్లా పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండలం లంబసింగి సమీపంలోని తాజంగి గ్రామానికి మన్యం విప్లవ చరిత్రలో ఎంతో ప్రాధాన్యం ఉంది. మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు బ్రిటీష్ పాలకులపై సాగించిన సాయుధ పోరాటంలో ఇది చాలా కీలక ప్రాంతం. పోడు వ్యవసాయాన్ని నిషేధించిన అప్పటి బ్రిటీష్ పాలకులు ఉపాధి కోల్పోయిన గిరిజనులను లంబసింగి–నర్సీపట్నం రోడ్డు నిర్మాణంలో కూలీలుగా ఉపయోగించుకునే వారు. వీరికి కూలీ సరిగ్గా చెల్లించకపోగా వారిపై అత్యాచారాలకు, అకృత్యాలకు తెగబడేవారు. దీంతో తెల్లదొరల అరాచకాలపై అల్లూరి సీతారామరాజు తాజంగి ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా తిరగుబాటు బావుటా ఎగురవేశాడు. గాం గంటందొర, గాం మల్లుదొరలతో కలిసి పోరాటం చేసి వారిని తరిమికొట్టాడు. ఇంతటి విశిష్టత కలిగినందునే మన్యం వీరుల మ్యూజియం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తాజంగి ప్రాంతాన్ని ఎంపిక చేసింది. మ్యూజియంలో 4 జోన్లు.. విశాఖ మన్యంలో నిర్మించనున్న ఈ మ్యూజియంను ఏ, బీ, సీ, డి అనే నాలుగు జోన్లుగా విభజించి పలు అంశాలను ప్రదర్శిస్తారు. అవి.. ► జోన్–ఏలో ఉండే మూడు గ్యాలరీలలో బ్రిటీష్ ప్రభుత్వం రాకకు ముందునాటి గిరిజనుల పరిస్థితులు, వారి జీవన విధానం, అప్పటి సాంఘిక, సాంస్కృతిక, ఆర్థిక స్థితిగతులను గురించి తెలియజేసే ప్రదర్శనలు ఉంటాయి. ► జోన్–బిలో గిరిజనుల జీవితాల్లోకి తెల్లదొరలు చొరబడిన కాలమాన పరిస్థితులను ప్రదర్శిస్తారు. వీటి ద్వారా సందర్శకులు ఆనాటి పరిస్థితులను అనుభూతి చెందే విధంగా వృక్ష, జంతు జాలాలను కళ్లకు కడుతూ డిజిటల్ ఆడియో, వీడియో విధానాలను కూడా ఏర్పాటుచేస్తారు. ► జోన్–సీలో బ్రిటీషర్ల అరాచకాలకు వ్యతిరేకంగా గిరిజనుల్లో వచ్చిన తిరుగుబాటు, వారి పోరాటాలను తెలిపే ప్రదర్శనలు ఉంటాయి. ► ఇక జోన్–డీలో ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న గిరిజనుల జీవన ప్రమాణాలను, వారి నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలను తెలిపే ప్రదర్శనలు ఉంటాయి. -
Rushikonda Beach: ఐదుగురిని కాపాడిన లైఫ్‌గార్డ్స్
కొమ్మాది(భీవిులి): రుషికొండ బీచ్‌లో పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఇక్కడ బీచ్‌కు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రికి చెందిన సోమ రాకేష్‌రెడ్డి, దాసరి అజయ్‌రెడ్డి, ఏనుగ విజయ్‌కుమార్‌రెడ్డి, సోమ రామకృష్ణారెడ్డి, పొన్నాల వంశీకృష్ణారెడ్డి వచ్చారు. వీరు సముద్రంలోకి దిగారు. కెరటాల ఉధృతి ఎక్కువగా ఉండటంతో సముద్రంలోకి కొట్టుకుపోయారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ గద్దిపిల్లి రమేష్, దేవాలు స్పందించి వారిని కాపాడారు. -
AP: గులాబ్ తుపాన్‌తో పలు రైళ్లు రద్దు
సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ‘గులాబ్ తుపాన్’ కొనసాగుతోంది. గోపాలపూర్‌కు 310కిలో మీటర్లు, కళింగపట్నానికి 380 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతం అయింది. సాయంత్రానికి కళింగపట్నం-గోపాలపూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ‘గులాబ్’ తుపాను నేపథ్యంలో పలు రైళ్లు రద్దయ్యాయి. పలు రైళ్ల రాకపోకలు మల్లింపు, కొన్ని రైళ్లను రద్దు చేసిన తూర్పు కోస్తా రైల్వే ప్రకటించింది. 08463 భువనేశ్వర్-కే.ఎస్.ఆర్ బెంగళూరు స్పెషల్ ట్రైన్, 02845 భువనేశ్వర్- యస్వంత్ పూర్ స్పెషల్ ట్రైన్‌ను రద్దు చేసినట్లు పేర్కొంది. -
రాగల 12 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాలకు భారీ వర్షం
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. గోపాల్‌పూర్‌కు 580, కళింగపట్నానికి 660 కీలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతం అయినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వాయుగుండం మరో 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. తీరం వైపు 14 కీలో మీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోంది. వాయవ్యంగా కదులుతూ రేపు( ఆదివారం) సాయంత్రానికి వాయుగుండం తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. ఒడిశా, ఉత్తర కోస్తా జిల్లాలకు భారీ వర్షం ఉన్నట్లు సూచించారు. తూర్పుమధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్రవాయుగుండం రాగల 12 గంటల్లో బలపడి తుఫానుగా మారనుందని ఏపీ విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు అన్నారు. పశ్చిమ దిశగా పయనించి రేపు సాయంత్రానికి ఉత్తరాంధ్ర (విశాఖ)- దక్షిణ ఒడిశా(గోపాల్ పూర్) మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో ఈరోజు (శనివారం) కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశంఉందని తెలిపారు. రేపు(ఆదివారం) ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒడిశా- ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 50 -60 కీమీ వేగంతో ఈదురుగాలులు వీచనున్నాయి. రేపు( ఆదివారం) ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంటకు 70 -90 కీమీ వేగంతో బలమైన ఈదురుగాలులతో సముద్రం అలజడిగా మారుందనిమత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లరాదని తెలిపారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. -
AP: రానున్న 48గంటల్లో వర్షాలు
మహారాణిపేట(విశాఖ దక్షిణ): రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో రానున్న 48 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కాగా, దక్షిణ తమిళనాడు తీర ప్రాంతాల్లో, దాని పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీన పడింది. ఈ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్లు ఎత్తు వరకు విస్తరించిన సంగతి విదితమే. అలాగే నైరుతి గాలులు కూడా వీస్తున్నాయి. ఆ ప్రభావంతోనే వర్షాలు పడనున్నాయని అధికారులు పేర్కొన్నారు. చదవండి: లైఫ్ స్టైల్ మార్చుకో గురూ! -
‘మందు ఉంటే మత్తు మాటలు అయ్యన్నకు అలవాటు’
సాక్షి, విశాఖపట్నం: అయ్యన్న నీతి మాటలు వింటే దెయ్యాలు గుర్తుకు వస్తున్నాయని, కోట్ల రూపాయలు అక్రమాస్తులు గడించిన అయ్యన్న బండారం అందరికీ తెలుసని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ విమర్శించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోకుంటే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. సొంత ఇల్లు సహా 358 సర్వే నంబర్లో 22ఎలో ఉంటే అధికార పైరవీలతో మార్చుకున్న నాయకుడు అయ్యన్న అని మండిపడ్డారు. చదవండి: తొడలు గొట్టడం, మీసాలు తిప్పడం కాదు: జోగి రమేష్ రంగు రాళ్ల కుంభ కోణంలో అయ్యన్న దోపిడి అందరికీ తెలుసని, కరక క్వారీ తవ్వకాల్లో అయ్యన్న రంగు ఎప్పుడో బయటపడిందని అన్నారు. మందు ఉంటే మత్తు మాటలు, మందు లేకపోతే మాయమాటలు అయ్యన్నకు అలవాటు దుయ్యబట్టారు. చోడవరం బ్రిడ్జి పూర్తి కాకపోతే ఆరు నెలల్లో గుండు గీయించుకుంటానని కనిపించకుండా పోయాడని ఎద్దేవా చేశారు. అయ్యన్న గుండు గీయించుకోలేక తప్పించుకున్నా సీఎం జగన్మోహన్రెడ్డి హయాంలో ఆ బ్రిడ్జి పూర్తి చేశామని తెలిపారు. -
AP: 21న ఎడ్‌సెట్
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): రాష్ట్ర వ్యాప్తంగా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఎడ్‌సెట్ (2021 ప్రవేశ పరీక్ష)ను ఈ నెల 21వ తేదీ ఉదయం 10.00 నుంచి 12.00 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు సెట్ కన్వీనర్ ఆచార్య కె.విశ్వేశ్వరరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షకు 15,638 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. వీరికి రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 69 కేంద్రాల్లో ఆన్లైన్ విధానంలో పరీక్ష జరుగుతుందన్నారు. చదవండి: Sri Lanka: మీ వ్యవసాయ ఉత్పత్తులు కావాలి పరీక్ష సమయానికి గంట ముందు నుంచి విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా అనుమతించమని పేర్కొన్నారు. పరీక్ష తేదీ, సమయం, పరీక్ష కేంద్రం వివరాలతో అభ్యర్థులకు సంక్షిప్త సందేశాలు (ఎస్ఎంఎస్)లు పంపిస్తామని చెప్పారు. అభ్యర్థులు www.sche.ap.gov.in/edcet వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకుని పరీక్షకు హాజరుకావాలన్నారు. -
ఓ సామాన్య రైతు విజయగాథ.. నెలకు రూ.1.50 లక్షల ఆదాయం
నాతవరం( విశాఖపట్నం): ఓ రైతు సంకల్పానికి ప్రభుత్వ సాయం తోడ్పడింది. కరోనా విసిరిన సవాళ్లతో వారి కృషి మరింత రాటు దేలింది. ఇప్పుడు వారు ఇతరులకు ఆదర్శంగా నిలిచే స్థాయికి ఎదిగారు. విశాఖ జిల్లా నాతవరం మండలంలో పుట్టగొడుగుల పెంపకం చేపట్టిన ఓ సామాన్య రైతు విజయగాథ ఇది. వెదురుపల్లి గ్రామానికి చెందిన చిత్రాడ వెంకటేశ్వరరావుకు చిన్నప్పట్నుంచీ పుట్టగొడుగుల పెంపకం అంటే అమితాసక్తి. పుట్టగొడుగుల (మష్రూమ్స్) ఉత్పత్తిపై అవగాహన పెంచుకున్నారు. తన ఇంటి సమీపంలో ఉన్న 26 సెంట్ల భూమిలో 2018లో శ్రీతులసి పుట్టగొడుగుల యూనిట్ ఏర్పాటు చేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో రుణం ఇచ్చేందుకు బ్యాంకర్లు నిరాకరించడంతో వడ్డీలకు అప్పు చేసి యూనిట్ ఏర్పాటు చేసుకున్నారు. బెంగళూరు నుంచి విత్తనాలు కొనుగోలు చేసి స్ధానికంగా లభ్యమయ్యే వ్యవసాయ వ్యర్ధాలతో తన కుమారుడు దుర్గాప్రసాద్ సాయంతో 2019లో పాల రకం పుట్టగొడుగుల (మిల్కీ మష్రూమ్స్) పెంపకాన్ని ప్రారంభించారు. మొదట్లో రోజుకు 20 కేజీల పుట్టగొడుగులను ఉత్పత్తి చేసి విక్రయాలు చేసేవారు. వీరి పుట్టగొడుగుల పెంపకం గురించి తెలుసుకున్న ఉద్యానవనశాఖ అధికారులు యూనిట్‌ను స్వయంగా పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా రాయితీపై రుణం ఇస్తామని అధికారులు సూచించారు. వెంకటేశ్వరరావు కుమారుడు దుర్గాప్రసాద్ యూనిట్ ఏర్పాటు కావలసిన డీపీఆర్ తయారు చేసి ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమ క్రమబదీ్ధకరణ పథకంలో రుణానికి దరఖాస్తు చేసారు. ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేసి దాంట్లో రూ.8 లక్షలు (40 శాతం) రాయితీని ఇచి్చంది. ప్రభుత్వ సాయంతో ఇప్పుడు నెలకు సరాసరి 1000 కేజీల పుట్టగొడుగులు తయారు చేస్తున్నారు. వీటిని విశాఖపట్నం, నర్సీపట్నం, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి, తుని తదితర ప్రాంతాలలో ఉన్న హోల్‌సేల్ షాపులకు సరఫరా చేస్తున్నారు. మార్కెట్లో డిమాండ్‌ను బట్టి కేజీ ఒక్కంటికి రూ 200 నుంచి 220 వరకు విక్రయాలు చేస్తున్నారు. పెట్టుబడితోపాటు కూలి సొమ్ము పోగా నెలకు లక్షా 50 వేల రూపాయల వరకు ఆదాయం వస్తుందని దుర్గాప్రసాద్ చెప్పారు. విత్తనాల తయారీ యూనిట్ ఏర్పాటు మొదట్లో విత్తనాలను బెంగళూరు నుంచి కేజీ ఒక్కంటికి రూ.120ల చొప్పున నెలకు 100 కేజీలకు పైగా కొనుగోలు చేసేవారు. కరోనా కారణంగా వాహనాల రవాణా నిలిచిపోవడంతో విత్తనాల సమస్య ఏర్పడి ఆరు నెలలపాటు పుట్టగొడుగుల తయారీ నిలిచిపోయింది. వెంకటేశ్వరరావు ఇద్దరు కుమారులు కరోనా కారణంగా కాలేజీ లేక పుట్టగొడుగులు తయారీ పనిలో ఉన్నారు. తమిళనాడుకు చెందిన సీనియర్ శాస్త్రవేత రామాంజనేయులు, రాష్ట్ర ఉద్యానవనశాఖ అధికారులను ఆన్లైన్లో పరిచయం చేసుకున్నారు. ఇద్దరు కుమారులు రెండు నెలలపాటు విత్తనాల తయారీ విధానాన్ని ఆన్లైన్ ద్వారా తెలుసుకున్నారు. విత్తనాల తయారీ యూనిట్‌ను రూ.10 లక్షల వ్యయంతో ఏర్పాటు చేశారు. ఈ యంత్రం ద్వారా డిగ్రీ చదువుతున్న వెంకటేశ్వరరావు పెద్ద కుమారుడు దుర్గాప్రసాద్, బి.ఫార్మసీ చేస్తున్న సాయిరామ్ విత్తనాలు తయారు చేస్తున్నారు. విశాఖ జిల్లాలో పుట్టగొడుగు విత్తనాల తయారీ యూనిట్లు ఎక్కడా లేవు. ఇక్కడ తయారు చేసిన పుట్టగొడుగు విత్తనాలను కేజీ ఒక్కంటికి రూ.80లకు సరఫరా చేస్తున్నారు. వీటిని విశాఖ జిల్లాతోపాటు విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాలలో గల పుట్టగొడుగుల తయారీ యూనిట్లకు సరఫరా చేస్తున్నారు. విత్తనాల తయారీ యూనిట్ ఏర్పాటు మొదట్లో విత్తనాలను బెంగళూరు నుంచి కేజీ ఒక్కంటికి రూ.120ల చొప్పున నెలకు 100 కేజీలకు పైగా కొనుగోలు చేసేవారు. కరోనా కారణంగా వాహనాల రవాణా నిలిచిపోవడంతో విత్తనాల సమస్య ఏర్పడి ఆరు నెలలపాటు పుట్టగొడుగుల తయారీ నిలిచిపోయింది. వెంకటేశ్వరరావు ఇద్దరు కుమారులు కరోనా కారణంగా కాలేజీ లేక పుట్టగొడుగులు తయారీ పనిలో ఉన్నారు. తమిళనాడుకు చెందిన సీనియర్ శాస్త్రవేత రామాంజనేయులు, రాష్ట్ర ఉద్యానవనశాఖ అధికారులను ఆన్లైన్లో పరిచయం చేసుకున్నారు. ఇద్దరు కుమారులు రెండు నెలలపాటు విత్తనాల తయారీ విధానాన్ని ఆన్లైన్ ద్వారా తెలుసుకున్నారు. విత్తనాల తయారీ యూనిట్‌ను రూ.10 లక్షల వ్యయంతో ఏర్పాటు చేశారు. ఈ యంత్రం ద్వారా డిగ్రీ చదువుతున్న వెంకటేశ్వరరావు పెద్ద కుమారుడు దుర్గాప్రసాద్, బి.ఫార్మసీ చేస్తున్న సాయిరామ్ విత్తనాలు తయారు చేస్తున్నారు. విశాఖ జిల్లాలో పుట్టగొడుగు విత్తనాల తయారీ యూనిట్లు ఎక్కడా లేవు. ఇక్కడ తయారు చేసిన పుట్టగొడుగు విత్తనాలను కేజీ ఒక్కంటికి రూ.80లకు సరఫరా చేస్తున్నారు. వీటిని విశాఖ జిల్లాతోపాటు విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాలలో గల పుట్టగొడుగుల తయారీ యూనిట్లకు సరఫరా చేస్తున్నారు. చదవండి: పరుగులు తీసి.. ప్రాణం కాపాడి.. -
HPCL: స్వల్పంగా గ్యాస్ లీకేజీ..
విశాఖ: విశాఖపట్నంలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్) కంపెనీలో బుధవారం స్వల్పంగా గ్యాస్ లీకైంది అయితే, దీన్నిగుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమై గ్యాస్ లీకేజీని అదుపు చేశారు. -
ఫుడ్‌కోర్టుపై రాబంధులు.. ఒక్కో షాపు తెరిచేందుకు..
‘మీరు నైట్ ఫుడ్ కోర్టులో షాప్ పెట్టుకుంటారా? అయితే లక్ష రూపాయలు మా చేతిలో పెట్టండి. మీ బండి మీకు నచ్చిన ప్లేస్‌లో పెట్టిస్తాం.’ కొంతమంది సాగిస్తున్న బేరసారాలివి. కార్పొరేషన్ సాక్షిగా దందా చేస్తూ.. నైట్ ఫుడ్ కోర్టు ప్రారంభించేందుకు వసూళ్ల పర్వానికి తెరతీస్తున్నారు. వీరి వ్యవహారానికి జీవీఎంసీ సిబ్బంది కొందరు సహకారమందిస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: మహా నగర పరిధిలో స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కోసం జీవీఎంసీ 2019 ఫిబ్రవరిలో జైల్ రోడ్డులో 27 ఫుడ్ స్టాల్స్‌తో నైట్ ఫుడ్ కోర్టు ప్రారంభించింది. ఆ తర్వాత క్రాఫ్ట్ బజార్ కూడా ఇందులో ప్రారంభించాలని భావించింది. కరోనా ప్రభావంతో 2020 మార్చి నుంచి వ్యాపారాలు మూతపడ్డాయి. పర్యవేక్షించాల్సిన జీవీఎంసీ అధికారులంతా కోవిడ్ నియంత్రణ చర్యల్లో 24 గంటలూ బిజీ అయిపోయారు. లాక్డౌన్ క్రమక్రమంగా ఎత్తివేస్తున్న నేపథ్యంలో నైట్‌ఫుడ్ కోర్టు తిరిగి తెరుచుకుంటుందని కొందరు ప్రచారానికి తెరతీశారు. దీంతో తాము ఫుడ్ కోర్టులో బండి పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆ కీలక వ్యక్తుల వెనుక షాపుల యజమానులు తిరగడం ప్రారంభించారు. 27 స్టాళ్లకు అనుమతి.. 120 షాపులకు వసూళ్లు నైట్ ఫుడ్ కోర్టులో మొత్తం 27 స్టాళ్లకు మాత్రమే అధికారిక అనుమతులు ఇచ్చినా లాక్డౌన్ ప్రారంభానికి ముందు ఈ దుకాణాల సంఖ్య 138కి చేరుకుంది. ఏ ఒక్కరికీ అనుమతి లేకపోయినా.. అప్పట్లో జీవీఎంసీ అధికారులు, సిబ్బంది వసూళ్ల పర్వంతో అవి నడిపించేశారు. ఇందులోనూ రెండు సంఘాలు ఏర్పడి.. వాళ్లు కూడా దందా సాగించేశారు. ఇప్పుడు మళ్లీ దుకాణాలు తెరిచేందుకు కొందరు బేరసారాలు మొదలు పెట్టేశారు. రెండు యూనియన్ల ద్వారా.. రాయబేరాలు నడుపుతూ పాతవారితో పాటు కొత్తగా వచ్చేవారికి కూడా స్టాల్ ప్లేస్ కేటాయించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు వసూళ్లు ప్రారంభించేశారు. ఒక స్టాల్ పెట్టడానికి అక్షరాలా రూ.లక్ష చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. నైట్ ఫుడ్ కోర్టుకు మంచి డిమాండ్ ఉండటంతో ఇప్పటికే 50 మందికి పైగా డబ్బులు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. మరో 70 మంది వరకూ వీరితో బేరాలు ఆడుతున్నారని.. రూ.లక్షకు ఒక్క పైసా కూడా తగ్గేదేలే అని తెగేసి చెబుతున్నట్లు తెలిసింది. ఈ వసూళ్లకు జీవీఎంసీ సిబ్బంది కూడా సహకరిస్తున్నట్లు సమాచారం. లాక్డౌన్ కొనసాగుతుండగా ఎలా? ఫుడ్ కోర్టు ఏర్పాటు చేసిన కొద్ది రోజులకే మంచి స్పందన రావడంతో నగరంలోని వివిధ స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ జీవీఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 500కు పైగా దరఖాస్తులు వచ్చినా వారికి ఇవ్వకుండా అప్పటి టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి అనుచరులకు దుకాణాలు కేటాయించేశారు. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ గతంలో కథనాలు రాయగా... ఫుడ్‌కోర్టు నుంచి స్టాల్స్ మొత్తాన్ని తొలగించేశారు. ఇప్పుడు మళ్లీ రచ్చ మొదలైంది. దీనిపై జీవీఎంసీ అధికారులను సంప్రదించగా.. లాక్డౌన్ కొనసాగుతుండగా నైట్ ఫుడ్ కోర్టు తెరిచే అవకాశమే లేదని స్పష్టం చేశారు. కొందరు వసూళ్లకు పాల్పడుతున్న విషయం తమ దృష్టికి రాలేదని చెబుతున్నారు. మొత్తంగా ఫుడ్ కోర్ట్ ఏర్పాటు సదుద్దేశాన్ని పక్కదారి పట్టించి.. చిరు వ్యాపారులను మింగేసేందుకు వేస్తున్న స్కెచ్‌పై జీవీఎంసీ అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. చదవండి: ఇసుక మైనింగ్‌పై టీడీపీ అసత్య ఆరోపణలు: గోపాలకృష్ణ ద్వివేది -
విశాఖలో భారీ మానవహారం
-
చంద్రబాబుకు ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ సవాల్
-
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ మానవహారం
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు, నిర్వాసితులు ఆదివారం భారీ మానవహారం చేపట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన రిలేదీక్షలు నేటీతో 200వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా అగనంపూడి నుంచి అక్కిరెడ్డిపాలెం వరకు 10 వేల మందితో నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, నిర్వాసితులు 10కిలో మీటర్ల వరకు మానవహారంలో పాల్గొన్నారు. ఉద్యోగులు కుటుంబ సభ్యులు, నిర్వాసితులు రోడ్లపైకి వచ్చి మానవహారంలో పాల్గొనడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. చదవండి: ధర్మాన కృష్ణదాస్ అంటే జిల్లాల్లో క్రీడాకారుడిగానే తెలుసు -
‘విశాఖ బీచ్ రోడ్లో త్వరలో వంగపండు ప్రసాదరావు విగ్రహం ఏర్పాటు’
సాక్షి, విశాఖపట్నం: దివంగత ప్రజాగాయకుడు వంగపండు ప్రసాదరావు వర్థంతిని విశాఖపట్నంలో రేపు(బుధవారం) నిర్వహిస్తామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏటా ఆగస్టు 4న వంగపండు వర్థంతిని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వంగపడు ప్రసాదరావు స్మారక అవార్డు పేరిట ఉత్తమ జానపద కళాకారునికి రూ.2 లక్షల అవార్డు ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. విశాఖ బీచ్ రోడ్లో త్వరలో వంగపండు ప్రసాదరావు విగ్రహం ఏర్పాటు చేస్తామని మంత్రి అవంతి తెలిపారు. -
ఇదే లాస్ట్ వార్నింగ్.. పనితీరు మార్చుకోండి
సాక్షి, ఎస్.రాయవరం(విశాఖపట్నం): సర్వసిద్ధి పీహెచ్సీ సిబ్బంది పనితీరు మార్చుకోవాలని, విధులకు సక్రమంగా హాజరుకాకుంటే సహించేది లేదని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు హెచ్చరించారు. సర్వసిద్ధి గ్రామంలోని ప్రైవేటు కార్యక్రమానికి ఆదివారం వచ్చిన ఆయన ఆకస్మికంగా స్థానిక పీహెచ్‌సీని సందర్శించారు. పీహెచ్సీలో డాక్టర్ లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది ఎక్కడ ఉంటున్నారని ఆరా తీశారు. అటెండర్‌తో సహా ఎవరూ స్థానికంగా ఉండడం లేదని గ్రామస్తులు చెప్పడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా అందుబాటులోకి వచ్చిన స్టాఫ్ నర్సు, అటెండర్‌తో మాట్లాడుతూ ఇదే లాస్ట్ వార్నింగ్ అని, ఇకపై పీహెచ్సీ ఇబ్బంది ఇలా చేస్తే క్షమించేది లేదన్నారు. రోడ్ల నిర్మాణానికి నిధులు గ్రామంలో ఎస్సీపేట వీధి రోడ్ల నిర్మాణానికి త్వరలో నిధులు కేటాయిస్తానని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తెలిపారు. కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు ఆయన ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పంచాయతీకి మంజూరయ్యే నిధులను ఈ వీధిలోని రోడ్ల అభివృద్ధికి కేటాయించాలని స్థానిక సర్పంచ్ గణేశ్వరరావుకు సూచించారు. ఎమ్మెల్యే వెంట పాయకరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి చంటి, వైఎస్సార్ సీపీ మండల శాఖ అధ్యక్షుడు కొణతాల శ్రీనివాసరావు తదితరులున్నారు. -
AP: విశాఖ అభివృద్ధికి చంద్రబాబే అడ్డు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటుంటే.. టీడీపీ అధినేత చంద్రబాబు నిరంతరం అడ్డుపడుతున్నారని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. సోమవారం విశాఖలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, తిప్పల నాగిరెడ్డి, అదీప్‌రాజ్‌లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి చెందిన పది మంది కార్పొరేటర్ల గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బలం లేకపోయినా పోటీకి దిగడం టీడీపీ నీచ సంస్కృతికి నిదర్శనమని మండిపడ్డారు. కార్పొరేటర్లను కులం పేరుతో ప్రలోభాలకు గురిచేసేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పద్ధతిని మార్చుకోవాలని హితవు పలికారు. టీడీపీ సభ్యులు పోటీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటే.. కాస్త గౌరవమైనా ఉంటుందని సూచించారు. ప్రతిపక్ష నేత ప్రజా సమస్యలపై పోరాడి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలి గానీ.. అభివృద్ధిని అడ్డుకోకూడదన్నారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మట్లాడుతూ.. 2019 నుంచి జరిగిన ప్రతి ఎన్నికలోనూ వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించిందన్నారు. భారీ విజయంతో ఏలూరు కార్పొరేషన్‌నూ కైవసం చేసుకుందన్నారు. ప్రజల్లో సీఎం జగన్‌కున్న విశ్వసనీయతకు, నిబద్ధతకు, నమ్మకానికి ఇవన్నీ నిదర్శనమని చెప్పారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీలో వైఎస్సార్సీపీకి చెందిన సభ్యులే గెలుస్తారన్నారు. జీవీఎంసీలో వైఎస్సార్సీపీకి 61 మంది కార్పొరేటర్లున్నారని చెప్పారు. వీరిలో 58 మంది వైఎస్సార్సీపీ సభ్యులని, ముగ్గురు స్వతంత్రులు మద్దతు ఇస్తున్నారని వివరించారు. -
Waltair Railway Division: ఉన్నట్టా? లేనట్టా..?
సాక్షి, విశాఖపట్నం: శతాబ్దానికి పైగా మహోజ్వల చరిత ఉన్న వాల్తేరు డివిజన్ కొత్త జోన్ ప్రకటనతో కనుమరుగు కానుందని స్పష్టమైపోయింది. విశాఖ కేంద్రంగా సౌత్‌కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటులో భాగంగా వాల్తేరు డివిజన్ నుంచి మేజర్ భాగాలను విడదీసి రాయగడ డివిజన్‌గా ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించడంతో పాటు కొత్త డివిజన్ పనులను శరవేగంగా పూర్తి చేస్తోంది. అయితే తాజాగా రైల్వే మంత్రి చేసిన ప్రకటన మళ్లీ వాల్తేరుకు ఊపిరి పోసింది. కొత్త జోన్లో విశాఖ డివిజన్ కొనసాగుతుందన్న ఆశలు మళ్లీ చిగురించాయి. వాల్తేరు డివిజన్ తూర్పు కోస్తా రైల్వేకు ప్రధాన ఆదాయ వనరు. రాష్ట్ర విభజన తర్వాత విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో 2019 ఫిబ్రవరి 27న కేంద్రం విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. రైల్వే జోన్ రాక ఓవైపు ఆనందాన్ని కలిగించినా వాల్తేర్ డివిజన్ రద్దు చేసి డివిజన్ ప్రధాన కేంద్రంగా రాయగడను ప్రకటించడం అందర్నీ నిరాశకు గురిచేసింది. వాల్తేరును 2 భాగాలుగా చేసి ఒక భాగాన్ని విజయవాడ డివిజన్‌లోనూ మరోభాగాన్ని కొత్తగా ఏర్పాటు చేయనున్న రాయగడ డివిజన్‌లోనూ కలుపుతున్నట్టు ప్రకటించడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. వైఎస్సార్సీపీ ఎంపీలు రాజ్యసభలో పలుమార్లు ఈ అంశాన్ని ప్రస్తావించారు. రైల్వే బోర్డుకు, ప్రధానికి వినతిపత్రాలు అందించారు. కానీ రైల్వే మంత్రిత్వ శాఖ మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. జోన్‌కు వాల్తేరే కీలకం తూర్పు కోస్తా రైల్వే జోన్‌కు వాల్తేరు డివిజన్ ఆదాయాన్ని తెచ్చిపెట్టే అతిపెద్ద డివిజన్. ఏటా మూడున్నర కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు సాగిస్తున్నారు. తూర్పు కోస్తా రైల్వే జోన్ సరకు రవాణా, ఇతరత్రా ఆదాయం ఏటా దాదాపు రూ. 15 వేల కోట్లు కాగా, ఇందులో రూ.7 వేల కోట్లు వాల్తేరు డివిజన్ నుంచే వస్తోంది. సాధారణ టిక్కెట్ల ద్వారా రోజుకు రూ.25 లక్షలు వస్తోంది. ఇది భువనేశ్వర్ (రూ.12–14 లక్షలు) కంటే ఎక్కువ. దేశంలోనే 260 డీజిల్ ఇంజన్లున్న అతిపెద్ద లోకోషెడ్, 160 ఇంజన్లుండే భారీ ఎలక్ట్రికల్ లోకోషెడ్, విశాలమైన మార్షలింగ్ యార్డు కూడా ఇక్కడే ఉన్నాయి. తూర్పు కోస్తాలోనే ఎక్కువ ప్యాసింజర్, సరకు రవాణా వ్యాగన్ ట్రాఫిక్ కలిగిన డివిజన్ విశాఖ. ఇందులో సింహభాగం ఆదాయం ఐరెన్ ఓర్ రవాణా జరిగే కేకే లైన్, మొదలైన ప్రధాన మార్గాల ద్వారానే వస్తుంటుంది. ఇదంతా రాయగడ డివిజన్‌కు సొంతమవుతుంది. ఈ విషయంపైనే అనేక ఫిర్యాదులు బోర్డుకు వెళ్లాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రకటనతో డివిజన్‌పై మళ్లీ ఆశలు మొలకెత్తాయి. ‘వాల్తేరు’ వినతులను పరిగణనలోకి.. పార్లమెంట్ సమావేశాల్లో విశాఖ జోన్ అంశం ప్రస్తావనకు వచ్చింది. జోన్ డీపీఆర్ సమర్పించి 23 నెలలు గడుస్తున్నా రైల్వే బోర్డు మాత్రం ఇంకా పరిశీలనలోనే ఉందని చెబుతున్న నేపథ్యంలో ఎంపీలు వాల్తేరు డివిజన్, రైల్వే జోన్ అంశంపై అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానమిచ్చారు. జోన్ ఏర్పాటుకు సమయాన్ని నిర్దేశించలేదని ప్రస్తుతం డీపీఆర్‌ని బోర్డు పరిశీలిస్తోందని చెప్పారు. వాల్తేరు డివిజన్‌ను విభజించకుండా.. కొత్త జోన్లో కొనసాగించాలని రాష్ట్రం నుంచి అనేక వినతులు వచ్చాయని వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటున్నామని వివరించారు. కొత్త జోన్ ఏర్పాటు, దాని భౌగోళిక పరిధిపై పరిపాలన, నిర్వహణ అవసరాలతో పాటు వాల్తేరు డివిజన్ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాతే రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంటుందని మొత్తం ప్రక్రియకు సమయం పడుతుందన్నారు. మంత్రి ప్రకటనతో ప్రజలకు కొంత ఊరట లభించింది. దక్షిణ కోస్తా జోన్ డీపీఆర్ స్వరూపమిదీ.. (2018–19 అంచనాల ప్రకారం..) ► జోన్ ఆదాయం – రూ.12,200 కోట్లు ► సరకు రవాణా– 86.7 మిలియన్ టన్నులు ► ప్రయాణికులు– 19.25 కోట్లు ► సిబ్బంది– 65,800 మంది ► మొత్తం రైల్వే రూట్ – 3,496 కిమీ ► మొత్తం రైల్వే ట్రాక్– 5,437 కిమీ పోర్టులు ► విశాఖపట్నం, ► గంగవరం, ► కాకినాడ, ►కృష్ణపట్నం ►జోన్ ప్రధాన కార్యాలయానికి ప్రతిపాదించిన వ్యయం: రూ.111 కోట్లు -
హామీ ఇచ్చి పత్తాలేరు.. నాటి మాట మరిచారా మేడం!
సాక్షి, చింతపల్లి: వైఎస్సార్సీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన గిడ్డి ఈశ్వరి టీడీపీకి సన్నిహితంగా ఉంటున్న రోజులవి.. 2018లో అంజలి శనివారం గ్రామంలో జన్మభూమి కార్యక్రమం నిర్వహించాలని తలపెట్టారామె. అప్పటికే రహదారి సమస్యతో సతమతమవుతున్న గిరిజనులు జన్మభూమి కార్యక్రమం అడ్డుకుంటామని ప్రకటించారు. దీంతో మూడు నెలల్లో రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తానని హామీ ఇచ్చి.. రెండు రోజులపాటు జేసీబీలతో రహదారి పనులు చేపట్టినట్టు హడావిడి చేశారు. ఈశ్వరి హామీలను నమ్మిన గిరిజనులు జన్మభూమి కార్యక్రమానికి స్వాగతించారు. జాజులపాలెం నుంచి అంజలి శనివారం వరకు సుమారు 6 కిలోమీటర్ల రహదారి పనులకు భూమిపూజ, శిలాఫలక ఆవిష్కరణలు కూడా చేపట్టారు. జన్మభూమి కార్యక్రమం ముగిసిన తర్వాత గిడ్డి ఈశ్వరి గ్రామం వైపు కన్నెత్తి చూడడం మానేశారు. దీంతో అస్తవ్యస్థ రహదారిలో గిరిజనులు అవస్థలు పడుతూనే ఉన్నారు. కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్న కారణంగా రహదారి బురదమయంగా మారింది. వాహన రాకపోకలకు అంతరాయం కలుగుతుండడంతో ఆమెకు గిరిజనుల సమస్యలు గుర్తుకు వచ్చాయి. రహదారి నిర్మించాలంటూ శనివారం టీడీపీ నాయకులతో కలిసి అక్కడ ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ డ్రామా చూసి చుట్టుపక్కల గ్రామాల గిరిజనులు నవ్వుకుంటున్నారు. అధికార పార్టీలో ఉన్నప్పుడు మూడు నెలల్లో రోడ్డు వేస్తానని చెప్పి.. తర్వాత పట్టించుకోని ఈశ్వరి ఇలా ఉత్తుత్తి నిరసనలు తెలపడం తగునా అని ప్రశ్నిస్తున్నారు. -
Vizag Steel Plant: ‘ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం’
సాక్షి,ఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ఉక్కు పరిరక్షణ సమితి పేర్కొంది. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనులు కేటాయించాలని డిమాండ్ చేసింది. శనివారం ఉక్కు పరిరక్షణ సమితి నేతలు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం కొత్త పరిశ్రమలు ఇవ్వకుండా ఉన్న పరిశ్రమలను ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. ఆంధ్రప్రదేశ్‌కి మణిహారంలాంటి విశాఖ స్టీల్‌ను కాపాడుకోవాలని పేర్కొన్నారు. రూ.వేలకోట్ల విలువైన విశాఖ స్టీల్‌ను చౌకగా అమ్మేస్తున్నారని, స్టీల్‌ప్లాంట్ అంశంపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కలుస్తామని తెలిపారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని విపక్షాలను కోరతామని చెప్పారు. తమ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని, పార్లమెంటరీ పార్టీ నాయకులు స్టీల్ ప్లాంట్ సమస్యకు మద్దతు పలికారని వెల్లడించారు. -
ప్రేయసి మరణాన్ని తట్టుకోలేక ప్రియుడు ఆత్యహత్య
అక్కిరెడ్డిపాలెం(గాజువాక): ప్రియురాలి మరణాన్ని తట్టుకోలేక ప్రియుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గాజువాకలో బుధవారం చోటుచేసుకుంది. గాజువాక పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లికి చెందిన అమ్మాయి, గాజువాక దేశపాత్రునిపాలేనికి చెందిన దట్టి రోహిత్ కుమార్ (25) ప్రేమించుకున్నారు. రోహిత్‌కుమార్ గాజువాకలో ఒక హోటల్లో పనిచేస్తున్నాడు. ఇటీవల అతడు ప్రేమించిన అమ్మాయి కరోనాతో గుంటూరులోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. అప్పటినుంచి అతడు ముభావంగా ఉంటున్నాడు. ప్రేమించిన అమ్మాయి లేని జీవితం తనకు వద్దనుకొని బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో రోహిత్ కణితి రోడ్డులోని తన రూమ్‌లో సీలింగ్ హుక్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దేశపాత్రునిపాలెంలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. -
భళా భరద్వాజ్.. అమెరికాలో తెలుగు విద్యార్థి అద్భుత ప్రతిభ
సీలేరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ ఆణిముత్యం ఖగోళ శాస్త్ర పరిశోధనలో అద్భుత ప్రతిభ కనబరిచాడు. అమెరికాలో ప్రత్యేక గుర్తింపు సాధించి మాతృదేశం గర్వించేలా పేరు తెచ్చుకున్నాడు. అతనే విశాఖ జిల్లా సీలేరులోని ఏపీ జెన్కో సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్ కామేశ్వర శర్మ కుమారుడు భరద్వాజ్. హైదరాబాద్‌లో ప్రాథమిక విద్య పూర్తిచేసి, విజయవాడలోని కార్పొరేట్ కాలేజీలో ఇంటర్, కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ (ఈసీఈ) పూర్తిచేశాడు. 2014లో ఉన్నత చదువుల నిమిత్తం అమెరికా వెళ్లాడు. అక్కడ యూఎంకేసీలో నిర్వహించిన అర్హత పరీక్షలో భరద్వాజ్ ప్రథమస్థానం సాధించి పరిశోధనలకు ఎంపికయ్యాడు. అప్పటి నుంచి ఏడేళ్లపాటు శాస్త్ర పరిశోధనలు చేశాడు. విశ్వంలో నక్షత్ర మండలాలు ఢీకొనే క్రమం గురించి భరద్వాజ్ పరిశోధనలు చేశాడు. దీంతో ఖగోళ భౌతిక శాస్త్రంలో అతని అపూర్వ పరిశోధనను గుర్తించి యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. తమ కుమారుడి పరిశోధనలకు వచ్చిన గుర్తింపుపై సోమవారం భరద్వాజ్ తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు. గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రంతో భరద్వాజ్ ఖగోళ భౌతిక శాస్త్రంలో మొట్టమొదటి డాక్టరేట్ ఖగోళ భౌతిక శాస్త్రంలో యూఎంకేసీ యూనివర్సిటీ నుంచి మొట్టమొదటి డాక్టరేట్ సాధించిన వ్యక్తి భరద్వాజ్ అని వారు తెలిపారు. తమ కుమారుడి కృషివెనుక ప్రొఫెసర్ డానియేల్ మాకింటోస్, మార్క్ బ్రాడ్‌విన్ ప్రోత్సాహం ఎంతో ఉందని, ఈ పరిశోధనల సమయంలో ఎనిమిది సంస్థల నుంచి ఉపకార వేతనాలు లభించాయని వారు చెప్పారు. ప్రస్తుతం భరద్వాజ్ కొనసాగిస్తున్న మరో పరిశోధనకు అమెరికాలోని నాసా ఉపకార వేతనం కూడా అందించనుందన్నారు. భరద్వాజ్ పరిశోధనలు మెచ్చి 2018లో అమెరికన్ అస్ట్రోనామికల్ సొసైటీ స్వర్ణ పతకం అందజేసిందని, భారత్‌కు తిరిగొచ్చి దేశంలోని విద్యార్థులకు భౌతికశాస్త్రంపై ఆసక్తి పెంచుకునేలా చేయడమే అతని ధ్యేయమన్నారు. భరద్వాజ్ మాట్లాడుతూ.. ఈ డాక్టరేట్‌ను స్ఫూర్తిగా తీసుకుని పోస్టు డాక్టరేట్ కూడా చేయనున్నట్లు తెలిపారు. పరిశోధనల అనంతరం స్వదేశానికి వచ్చిన భరద్వాజ్‌తో తల్లిదండ్రులు, సోదరి -
PV Sindhu: పీవీ సింధు అకాడమీకి స్థలం కేటాయింపు
ఆరిలోవ (విశాఖ తూర్పు): ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుకు బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం విశాఖ నగరంలోని తోటగరువులో స్థలం కేటాయించింది. దీనికి సంబంధించిన జీవో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసింది. దీని ప్రకారం విశాఖ రూరల్ (చినగదిలి) మండల పరిధిలో 73/11, 83/5,6 సర్వే నంబర్లలో 2 ఎకరాల స్థలం కేటాయించినట్లు తహసీల్దారు ఆర్.నర్సింహమూర్తి తెలిపారు. ఈ స్థలానికి మండల సర్వేయర్‌తో ఇప్పటికే సర్వే నిర్వహించామని చెప్పారు. పీవీ సింధు నెలకొల్పే అకాడమీకి రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో స్థలం కేటాయించడం పట్ల నగర వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అకాడమీ ఏర్పాటుతో నగరం నుంచి క్రీడాకారులు తయారవడానికి మంచి అవకాశం కలుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
విశాఖ ఉక్కు: 3వేల మంది కార్మికులతో ‘చలో పార్లమెంట్’
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కార్యాచరణ విడుదల చేసింది. ఇక నుంచి ఉద్యమాన్ని జాతీయస్థాయిలో ఉధృతం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆగస్టు 2, 3 తేదీల్లో 3వేల మంది కార్మికులతో ‘చలో పార్లమెంట్’ నిరసన కార్యక్రమాన్ని చేపడతమని పేర్కొంది. ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. -
Photo Feature: రుషికొండ బీచ్‌లో.. వీకెండ్ జోష్
సాక్షి, విశాఖపట్నం: చాలా రోజుల తరువాత వీకెండ్‌ను వైజాగ్ సిటి జనులు ఆస్వాదించారు. కర్ఫ్యూ వేళలు సడలింపులతోపాటు.. పర్యాటక ప్రాంతాలు తెరుచుకోవడంతో సందర్శకులు బీచ్‌లో వాలిపోయారు. అలలతో ఆడుకున్నారు. కెరటాలతో సయ్యాటలాడారు. ఆకాశమే హద్దుగా సరదాగా గడిపారు. రుషికొండ బీచ్‌లో ఆదివారం సందడి వాతావరణం నెలకొంది. -ఫొటోలు : సాక్షి ఫొటోగ్రాఫర్ -
9 మంది అప్పన్న వైదికులకు షోకాజ్ నోటీసులు
సింహాచలం (పెందుర్తి): శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో గడిచి జ్యేష్ట ఏకాదిశి రోజున జరిగిన లక్ష్మీనారాయణస్వామి వార్షిక కల్యాణోత్సవంలో అర్చకులు ఆలపించిన గరుడ గజ్జన పాటను మార్ఫింగ్ చేసిన ఘటనలో తొమ్మిది మంది వైదికులకు దేవస్థానం ఈవో ఎంవీ సూర్యకళ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తానే మార్ఫింగ్ చేసి ఇన్చార్జి ప్రధానార్చకుడికి పంపినట్టు ఇప్పటికే ఓ వేదపండితుడు అధికారుల వద్ద ఒప్పుకున్నట్టు కూడా ప్రచారం జరిగింది. మొత్తం సంఘటనపై ఈవో కొద్ది రోజులుగా విచారణ చేస్తున్నారు. ఈసంఘటనలో మొత్తం తొమ్మిది మంది వైదికులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అందరినుంచి సమాధానం వచ్చినవెంటనే ఈవో తదుపరి చర్యలు తీసుకోనున్నారు. వైదికుల సమాధానం ఆధారంగా విచారించి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపై సింహాలచలం దర్శనాలపై కఠిన నిబంధనలు అమలవుతాయని, ఉద్యోగులైనా సరే దర్శనం టికెట్ తీసుకోవాల్సిందేనని ఈవో సూర్యకళ తెలిపారు. -
Army Recruitment Rally: ఆగస్ట్ 16 నుంచి విశాఖలో..
బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆగస్ట్ 16 నుంచి 31 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్టు జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ చెప్పారు. కలెక్టరేట్లో బుధవారం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌ను ఆయన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. కరోనా నిబంధనలు పాటిస్తూ ర్యాలీ నిర్వహిస్తామని..ప్రతి ఒక్క అభ్యర్థి నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవాలని సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, కేంద్రపాలిత ప్రాంతం యానాంకు చెందిన యువత మాత్రమే రిక్రూట్మెంట్కు అర్హులని చెప్పారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్ట్ 3లోగా www.joinindianarmy.nic.inలో దరఖాస్తు చేసుకోవాలని, ఆగస్ట్ 9 నుంచి అడ్మిట్ కార్డ్స్ అందుబాటులోకి వస్తాయని వివరించారు. దళారులకు డబ్బులు చెల్లించి మోసపోవద్దని సూచించారు. భర్తీ చేసే పోస్టులివే: సోల్జర్–జనరల్ డ్యూటీ, సోల్జర్–టెక్నికల్/ ఏవియేషన్, సోల్జర్–టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్, సోల్జర్–క్లర్క్/స్టోర్ కీపర్, సోల్జర్ ట్రేడ్మన్. అర్హత: పోస్టులను బట్టి ఎనిమిదో తరగతి, 10వ తరగతి, సంబంధిత సబ్జెక్టులతో 10+2/ఇంటర్ ఉత్తీర్ణత ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలుండాలి. వయసు: అభ్యర్థుల వయసు సోల్జర్ జనరల్ డ్యూటీ పోస్టులకు 17 ఏళ్ల 6 నెలల నుంచి 21 ఏళ్లు ఉండాలి. మిగతా పోస్టులకు 17 ఏళ్ల 6 నెలల నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఉమ్మడి ప్రవేశ పరీక్ష, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. -
‘అయ్యన్న వ్యాఖ్యలు అర్థరహితం.. అమ్మ ఒడి సొమ్ము భద్రం’
ఆరిలోవ(విశాఖ తూర్పు): డీఈవో జాయింట్ అకౌంట్లోని అమ్మఒడి సొమ్ము రూ.3.42 కోట్లు భద్రంగా ఉందని జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. ఈ ఖాతా నుంచి రూ.30 లక్షలు విత్‌డ్రా చేసి దుర్వినియోగం చేశారని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు చేసిన ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో అమ్మ ఒడి పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన చేపట్టినప్పటి నుంచి వరుసగా రెండేళ్ల పాటు జిల్లాలో అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేశామన్నారు. 2019–20లో పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ, ఇతర అవసరాల కోసం విద్యార్థుల తల్లులు స్వచ్ఛందగా రూ.1000 చొప్పున అందజేశారని తెలిపారు. ఈ మొత్తాన్ని డీఈవో జాయింట్ అకౌంట్లో జమ చేశామన్నారు. ప్రస్తుతం ఆ నగదు రూ.3.42 కోట్లు పదిలంగా ఉన్నట్టు చెప్పారు. ఈ ఖాతా నుంచి రూ.30 లక్షలు విత్‌డ్రా చేసి దుర్వినియోగం చేశారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఈ నగదు నిల్వపై ఇంతవరకు ఎలాంటి ఆడిట్ జరగలేదన్నారు. ప్రస్తుతం నాడు–నేడు నిధులతో జిల్లాలోని పాఠశాలల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఈ పథకంలో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతున్నట్టు వివరించారు. దీంతో ప్రత్యేకంగా ఎక్కడా అమ్మ ఒడికి సంబంధించిన డబ్బులు వినియోగించలేదని స్పష్టం చేశారు. ఎప్పుడైనా వాటి అవసరం వస్తే ప్రభుత్వం ఆదేశాల మేరకు.. విత్ డ్రా చేసి పాఠశాలల్లో పనులు జరిపిస్తామన్నారు. దీనికి సంబంధించిన వాస్తవాలు తెలుసుకోకుండా మాజీ మంత్రి అధికారులపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. చదవండి: భావోద్వేగాలను రెచ్చగొట్టడం తగదు