
అనకాపల్లి జిల్లా,సాక్షి: అనకాపల్లి జిల్లా టీడీపీలో విబేధాలు భగ్గుమన్నాయి. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల పెత్తనాలు టీడీపీలో ఎక్కువై పోయాయంటూ ఆ పార్టీలోని మరోవర్గం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య ప్రోటోకాల్ చిచ్చు పెట్టింది. జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే దీనిపై తాతయ్య బాబు అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లా అధ్యక్షుడి ఫోటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని మండిపడ్డారు. పార్టీలు మారి వచ్చిన వారు పెత్తనం టీడీపీలో ఎక్కువైందని మండిపడ్డారు. అనంతరం, ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఇదే పరిస్థితి ఉంటే త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నష్టపోతుంది’ అనే అభిప్రాయం వ్యక్తం చేశారు.