
విశాఖ,సాక్షి: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు గాయపడ్డ బాధితుల్ని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్లతో మంటల్ని ఆర్పుతున్నారు.
ప్రమాదంపై పోలీసుల ప్రాథమిక సమాచారం మేరకు.. కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామ శివారులో బాణా సంచా తయారీ కేంద్రంలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదలో మృతుల సంఖ్య అంతకంత పెరుగుతున్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ మిగిలిన క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.
ఆదివారం కావడంతో బాణా సంచా కేంద్రంలో పని చేసేందుకు 15మంది మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. లేదంటే అపార ప్రాణ నష్టం జరిగి ఉండేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు, ప్రమాద ఘటనపై జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ విచారణకు ఆదేశించారు.
బాణాసంచా పేలుడు ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు:
1. దాడి రామలక్ష్మి (35),
W/oవెంకటస్వామి,
R/o రాజుపేట .
2. పురం పాప (40),
W/o అప్పారావు,
R/o కైలాసపట్నం.
3. గుంపిన వేణుబాబు (34),
S/o దేముళ్ళు,
R/o కైలాసపట్నం.
4. సంగరాతి గోవిందు (40),
S/o సత్యనారాయణ,
R/o కైలాసపట్నం.
5. సేనాపతి బాబూరావు (55)
S/o గెడ్డప్ప ,
R/o చౌడువాడ.
6. అప్పికొండ పల్లయ్య (50)
S/o నూకరాజు ,
R/o కైలాసపట్నం.
7. దేవర నిర్మల (38)
W/o వీర వెంకట సత్యనారాయణ,
R/o వేట్లపాలెం.
8. హేమంత్ (20)
R/o భీమిలి.
