
చిన్నతమ్మెగుల గ్రామంలో పంట కోతల వద్దే కోవిడ్ వ్యాక్సినేషన్ చేస్తున్న వైద్య సిబ్బంది
ముంచంగిపుట్టు: మండలం జర్జుల పంచాయతీ చిన్నతమ్మెగుల గ్రామం. సోమవారం వైద్యసిబ్బంది సూదిమందు (కోవిడ్ టీకా) వేసేందుకు వస్తున్నారని తెలిసి అమాయకులైన ఆ గిరిజన గూడెం వాసులు భయపడ్డారు. ఎలాగైనా తప్పించుకోవాలని ప్రయత్నం చేశారు. కొందరు పంట కోతల సాకుతో పొలాలకు వెళ్లారు. అయితే వైద్యసిబ్బంది మాత్రం వారిని వదల్లేదు.
టీకా ఎక్స్‌ప్రెస్ కేర్ ఇండియా డీఈవో పి.మనోహర్, ఏఎన్‌ఎంలు వి.దాలిమ్మ, ఎల్.పద్మ పొలాల వద్దకే వెళ్లి గిరిజన మహిళలకు అవగాహన కల్పించారు. పొలంలోనే వారికి కోవిడ్ టీకా వేశారు. చిన్నతమ్మెగుల, అమలగూడ గ్రామాల్లో సోమవారం మొత్తం 58 మందికి వ్యాక్సినేషన్ జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment