హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ సేవలు, ఉత్పత్తుల సంస్థ ఎవల్యూటిజ్ వచ్చే రెండేళ్లలో రూ. 650 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రస్తుతం ఇది రూ. 430 కోట్లుగా ఉంది. వైజాగ్ కేంద్రం ప్రారంభించి పదేళ్లయిన సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు, సీటీవో ఎ. శ్రీనివాస ఈ విషయాలు చెప్పారు.
భారతీయ టెకీలు 2011లో షికాగో కేంద్రంగా ఎవల్యూటిజ్‌ను ప్రారంభించారు. ఇది దేశీయంగా 2013లో వైజాగ్‌తో మొదలుపెట్టి హైదరాబాద్, నోయిడా, బెంగళూరు తదితర నగరాలకు కార్యకలాపాలు విస్తరించింది. ప్రస్తుతం భారత్‌లో 650 మంది సిబ్బంది ఉండగా.. వైజాగ్, హైదరాబాద్ కార్యాలయాల్లో 500 మంది పైగా ఉన్నారని శ్రీనివాస వివరించారు.
పటిష్టమైన వ్యూహాల దన్నుతో రెండేళ్లుగా ఆదాయం 140% వృద్ధి చెందిందని, రాబోయే రోజుల్లోను ఇదే స్ఫూర్తి తో పని చేయనున్నామని ఆయన పేర్కొన్నారు. కృత్రిమ మేథ, మెషీన్ లెర్నింగ్, బిగ్ డేటా మొదలైన సాంకేతికతల ఆధారిత సొల్యూషన్స్‌కి సంబంధించి పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment