
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా వైజాగ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసింది. 25 కిలోవాట్ సూపర్‌ఫాస్ట్ చార్జింగ్ కేంద్రాన్ని టాటా పవర్ సహకారంతో అందుబాటులోకి తెచ్చింది.
ఎంజీ మోటార్ ఇప్పటికే దేశవ్యాప్తంగా 41 నగరాల్లో 44 సెంటర్స్‌ను ప్రారంభించింది. ఈజీ చార్జ్ బ్రాండ్ కింద టాటా పవర్ 180 నగరాలు, పట్టణాల్లో 1,000కిపైగా ఈవీ చార్జింగ్ కేంద్రాలను స్థాపించింది.