MG Motors
-
JSW MG Motor India: కొత్త ఎండీగా అనురాగ్ మెహ్రోత్రా
జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా తన కొత్త మేనేజింగ్ డైరెక్టర్‌గా 'అనురాగ్ మెహ్రోత్రా'ను నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఆటోమోటివ్ పరిశ్రమలో దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉన్న.. అనురాగ్ ప్రముఖ దేశీయ, అంతర్జాతీయ కంపెనీలలో పనిచేశారు.సేల్స్, మార్కెటింగ్, స్ట్రాటజీ, వ్యాపార అభివృద్ధిలో కీలక పదవులు చేపట్టిన 'అనురాగ్ మెహ్రోత్రా' (Anurag Mehrotra).. జేఎస్‌డబ్ల్యు మోటార్ ఇండియాలో చేరడానికి ముందు.. టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్‌లో స్ట్రాటజీ & ఇంటర్నేషనల్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. అంతకంటే ముందు ఫోర్డ్ ఇండియాకు ప్రెసిడెంట్ & మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశారు.కంపెనీ మాజీ సీఈఓ, రాజీవ్ చాబా.. ఇకపై జాయింట్ స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా నిర్వహణ, వాటాదారులకు సలహా ఇస్తుంటారు. బ్రాండ్‌ను దేశంలోని ప్రముఖ ఆటోమోటివ్ ప్లేయర్లలో ఒకటిగా తీర్చిదిద్దడంలో రాజీవ్ చాబా కీలక పాత్ర పోషించారు. ఈయన సారథ్యంలోనే కంపెనీ అనేక కొత్త ఉత్పత్తులను ప్రారంభించింది.ఇదీ చదవండి: ఫాస్ట్‌ట్యాగ్ కొత్త రూల్స్: ఈ రోజు నుంచే.. -
అమ్మకాల్లో తగ్గేదేలే.. మార్కెట్లో విండ్సర్ హవా!
భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని 'ఎంజీ మోటార్' (MG Motor) కొత్త 'విండ్సర్' (Windsor) లాంచ్ చేసింది. కంపెనీ ఈ కారును మార్కెట్లో లాంచ్ చేసినప్పటి నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. 2024 అక్టోబర్ నుంచి 3000 యూనిట్లకు తగ్గకుండా కంపెనీ విండ్సర్ కార్లను విక్రయిస్తోంది.ఎంజీ మోటార్ ఇండియా.. జనవరి 2025లో 3,277 యూనిట్ల విండ్సర్లను విక్రయించింది. డిసెంబర్ 2024లో 3,785 యూనిట్లు, నవంబర్ 2024లో 3,144 యూనిట్లు, అక్టోబర్ 2024లో 3,116 యూనిట్ల అమ్మకాలు సాధించినట్లు వెల్లడించింది. ఈ కారు ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, ఎసెన్స్ అనే వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 13.99 లక్షలు, రూ. 14.99 లక్షలు, రూ. 15.99 లక్షలు (ఎక్స్ షోరూమ్).ఎంజీ విండ్సర్ కారును బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) కింద కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ విధంగా కొనుగోలు చేస్తే.. ధరలు చాలా తగ్గుతాయి. ఈ ఎలక్ట్రిక్ కారు 38kWh లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీతో కూడిన మాగ్నెట్ సింక్రోనస్ మోటారును పొందుతుంది. ఒక ఫుల్ ఛార్జిపై ఇది 332 కిమీ రేంజ్ అందిస్తుంది.ఎంజీ విండ్సర్ ప్రకాశవంతమైన లోగో, ఎల్ఈడీ లైట్లు, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, ఏరో లాంజ్ సీట్లు, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ప్లేతో 15.6 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్‌గేట్, పనోరమిక్ సన్‌రూఫ్ వంగతి ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో 36 కంటే ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్, 80 కంటే ఎక్కువ కనెక్టెడ్ కార్ ఫీచర్స్ ఉన్నాయి. -
ఒకేసారి రెండు కార్లు లాంచ్ చేసిన ఎంజీ మోటార్: ధర & వివరాలు
జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా తన హెక్టర్ లైనప్‌ను విస్తరించడంతో భాగంగా.. ఒకేసారి రెండు కొత్త 7 సీటర్ వేరియంట్లను దేశీయ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో ఒకటి హెక్టర్ ప్లస్ 7 సీటర్ 'సెలెక్ట్ ప్రో' కాగా, మరొకటి 'స్మార్ట్ ప్రో'. ఈ రెండు వేరియంట్ల ధరలు వరుసగా రూ.19.71 లక్షలు, రూ.20.64 లక్షలు.హెక్టర్ ప్లస్ 7 సీటర్ సెలెక్ట్ ప్రో వేరియంట్ 1.5 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ కలిగి సీవీటీ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. స్మార్ట్ ప్రో వేరియంట్ 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ కలిగి మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. కాబట్టి ఇవి రెండూ కూడా ఉత్తమ పనితీరును అందిస్తాయని భావిస్తున్నాము.ఎంజీ హెక్టర్ కొత్త వేరియంట్లు వైర్లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఐ-స్మార్ట్ టెక్నాలజీతో కూడిన 14 ఇంచెస్ పోర్ట్రెయిట్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటివి ఉన్నాయి. ఈ కారులో సుమారు 75 కంటే ఎక్కువ కనెక్టెడ్ ఫీచర్స్ ఉన్నట్లు సమాచారం.ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, ఫ్లోటింగ్ టర్న్ ఇండికేటర్లు, ఎల్ఈడీ బ్లేడ్-స్టైల్ కనెక్టెడ్ టెయిల్ లాంప్, 18 ఇంచెస్ డ్యూయెల్ టోన్ మెషిన్డ్ అల్లాయ్ వీల్స్ వంటివి పొందిన కొత్త ఎంజీ హెక్టర్ ప్లస్ లెథెరెట్ సీట్లు, పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటివి కూడా కలిగి ఉంటుంది.ఇదీ చదవండి: వచ్చేసింది కొత్త మారుతి డిజైర్: ధర రూ.6.79 లక్షలు మాత్రమే..లేటెస్ట్ డిజైన్ కలిగిన ఎంజీ హెక్టర్ ప్లస్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం, హిల్ హోల్డ్ కంట్రోల్, ఏబీఎస్ విత్ ఈబీడీ, బ్రేక్ అసిస్ట్, ఇసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్ వంటి అప్డేటెడ్ సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. కంపెనీ ఇప్పుడు ఈ రెండు వేరియంట్లకు ఎంజీ షీల్డ్ ప్రోగ్రామ్ కింద.. 3 సంవత్సరాల వారంటీ, 3 సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్టెన్స్, 3 సంవత్సరాల లేబర్ ఫ్రీ పీరియాడిక్ సర్వీస్ వంటి వాటిని కూడా అందిస్తుంది. -
లాంచ్‌కు సిద్దమవుతున్న 'మిఫా 9' ఇదే..
భారతదేశంలో అతి తక్కువ కాలంలో అధిక ప్రజాదరణ పొందిన కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్ వచ్చే ఏడాది దేశీయ మార్కెట్లో 'మిఫా 9' (Mifa 9) ఎంపీవీ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. కాగా ఈ కారు విక్రయాలు 2025 మార్చిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంతకంటే ముందు 2025 జనవరిలో జరిగే భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శనకు రానున్నట్లు సమాచారం.ఎంజీ మిఫా 9 కారు 2023లోనే మొదటిసారి ఆటో ఎక్స్పోలోలో కనిపించింది. ఇది మార్కెట్లో లాంచ్ అయిన తరువాత కీయ కార్నివాల్‌కు ప్రత్యర్థిగా ఉండనుంది. ఈ కారు ఒట్టోమన్ సీట్లతో 7 సీటర్, 8 సీటర్ కాన్ఫిగరేషన్లలో లాంచ్ అవుతుందని తెలుస్తోంది.ఇదీ చదవండి: లాంచ్‌కు ముందే డిజైర్ ఘనత: సేఫ్టీలో సరికొత్త రికార్డ్స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్, ఫ్రంట్ ఫాసియా అంతటా విస్తరించి ఉండే ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్ ఉంటుంది. వెనుకవైపు ఎంపివి మధ్యలో లైట్ బార్‌తో వీ షేప్ ఎల్ఈడీ టైల్లైట్ సెటప్ ఉంటుంది. ఇది పవర్ స్లైడింగ్ రియర్ డోర్స్ పొందనున్నట్లు సమాచారం. ఈ కారు 2.0 లీటర్ పెట్రోల్, డీజిల్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుందని సమాచారం. కాగా కంపెనీ ఈ కారుకు సంబంధించిన చాలా విషయాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. -
హైదరాబాద్‌కు తొలి సీయూవీ ఎంజీ విండ్సర్
హైదరాబాద్: జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఆవిష్కరించిన భారతదేశపు మొదటి ఇంటెలిజెంట్ సీయూవీ విండ్సర్ ఈవీ హైదరాబాద్‌లో విడుదలైంది. టేబుల్ టెన్నిస్ స్టార్ నైనా జైస్వాల్ ఈ సరికొత్త వాహనాన్ని ప్రారంభించారు. దీని ప్రారంభ ధర రూ.13,49,800 (ఎక్స్-షోరూమ్).సెడాన్ సౌలభ్యాన్ని, ఎస్యూవీ విస్తీర్ణాన్ని సమ్మిళితం చేసి దీన్ని రూపొందించారు. ఫ్యూచరిస్టిక్ ఏరోడైనమిక్ డిజైన్, విశాలమైన లగ్జరీ ఇంటీరియర్స్, అధునాతన భద్రత వ్యవస్థ, స్మార్ట్ కనెక్టివిటీ, సౌకర్యవంతమైన డ్రైవింగ్ తదితర హైటెక్ ఫీచర్లతో ఈ సీయూవీ మోడల్ రూపొందింది. స్టార్బర్స్ట్ బ్లాక్, పెరల్ వైట్, క్లే బీజ్, టర్కోయిస్ గ్రీన్ అనే 4 రంగుల్లో అందుబాటులో ఉంది.ఇదీ చదవండి: హైదరాబాద్‌కు హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్లుఎంజీ విండ్సర్ ఎక్సైట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 13,49,800, ఎక్స్‌క్లూజివ్ రూ. 14,49,800, ఎసెన్స్ రూ. 15,49,800లుగా కంపెనీ పేర్కొంది. విండ్సర్ 38 kWh Li-ion బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది IP67 సర్టిఫికెట్ పొందింది. నాలుగు (ఎకో ప్లస్+, ఎకో, నార్మల్, స్పోర్ట్) డ్రైవింగ్ మోడ్లతో 100KW (136ps) పవర్, 200Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఒకే ఛార్జ్‌పై 332 కి.మీ. రేంజ్ (ARAI) అందిస్తుంది. ఈ వాహనానికి బుకింగ్స్ అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్నాయి. -
సెప్టెంబర్‌లో లాంచ్ అయ్యే ఎలక్ట్రిక్ కార్లు
పండుగ సీజన్లో దేశీయ మార్కెట్లో లాంచ్ కావడానికి కొత్త ఎలక్ట్రిక్ కార్లు సిద్ధమవుతున్నాయి. ఇందులో మెర్సిడెస్ మేబ్యాచ్ ఈక్యూఎస్, ఎంజీ విండ్సర్ ఈవీ, బీవైడీ ఈ6 ఫేస్‌లిఫ్ట్ ఉన్నాయి. త్వరలో లాంచ్ కానున్న ఈ కొత్త కార్ల గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.మెర్సిడెస్ మేబ్యాచ్ ఈక్యూఎస్జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తన మేబ్యాచ్ ఈక్యూఎస్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇది అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో ఒకటిగా నిలువనుంది. సరికొత్త ఈక్యూఎస్ సీబీయూ మార్గం ద్వారా భారతదేశానికి రానుంది. కాబట్టి దీని ధర కొంత ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది.మెర్సిడెస్ మేబ్యాచ్ ఈక్యూఎస్ ప్రత్యేకమైన కలర్ ఆప్షన్ కలిగి ఒక సింగిల్ చార్జితో 600 కిమీ రేంజ్ అందించేలా రూపొందించారు. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ 649 Bhp పవర్, 950 Nm టార్క్ అందిస్తుంది. ఈ కారు 4.4 సెకన్లలో 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 210 కిమీ.ఎంజీ విండ్సర్ ఈవీసెప్టెంబర్ 11న ఎంజీ విండ్సర్ ఈవీ లాంచ్ కానుంది. ఇది మార్కెట్లో అడుగుపెట్టనున్న కంపెనీ మూడో ఎలక్ట్రిక్ కారు. లాంచ్ తరువాత బుకింగ్స్ ప్రారంభమవుతాయని సమాచారం. దీని ధర రూ. 20 లక్షల లోపు ఉండే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఇప్పటికే పలుమార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది.త్వరలో లాంచ్ కానున్న కొత్త ఎంజీ విండ్సర్ ఈవీ.. కొత్త డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ఒక పెద్ద 15.6 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 135-డిగ్రీల రిక్లైనింగ్ ఫంక్షన్లతో రియర్ సీట్లు, 360 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి.బీవైడీ ఈ6 ఫేస్లిఫ్ట్బీవైడీ ఈ6 ఫేస్‌లిఫ్ట్ వచ్చే నెలలో లాంచ్ కానుంది. ఈ6 ఎలక్ట్రిక్ ఎమ్‌పివి ఇటీవలే గ్లోబల్ మార్కెట్లో ఎం6గా లాంచ్ అయింది. కంపెనీ ఈ కారుకు సంబంధించిన టీజర్‌ను ఇప్పటికే రిలీజ్ చేసింది. ఈ కొత్త కారు 55.4 కిలోవాట్, 71.8 కిలోవాట్ బ్యాటరీ ఫ్యాక్స్ ఉంటాయి. ఇవి వరుసగా 420 కిమీ, 530 కిమీ రేంజ్ అందిస్తాయి. -
ఇక నిశ్చితంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనేయొచ్చు!.. ఎందుకో తెలుసా?
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్నప్పటికీ.. మౌలిక సదుపాయాలైన ఛార్జింగ్ స్టేషన్స్ మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఈ కారణంగా కొంత మంది ఇప్పటికి కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేయడానికి కొంత వెనుకడుగు వేస్తున్నారు. ఈ తరుణంలో ఎంజీ మోటార్ ఇండియా.. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌తో చేతులు కలిపింది.ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేయడానికి ఎంజీ మోటార్.. హెచ్పీసీఎల్లో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నట్లు తెలుస్తోంది. రెండు కంపెనీలు హైవేలపై, ప్రధాన నగరాల్లోని ఎంపిక చేసిన ప్రదేశాలలో 50 kW, 60 kW DC ఫాస్ట్ ఛార్జర్లను ఇన్స్టాల్ చేయనున్నారు. ఫలితంగా ఇకపై ఎలక్ట్రిక్ వాహనం కొనాలనుకునేవారు నిశ్చింతగా కొనేయొచ్చు.‘‘భారతదేశంలో హెచ్‌పీసీఎల్ భారీగా విస్తరిస్తోంది. ఈ సంస్థతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవడంతో ఛార్జింగ్ స్టేషన్స్ సంఖ్య గణనీయంగా పెరుగుతాయి. బ్యాటరీ రీసైక్లింగ్ & బ్యాటరీల పునర్వినియోగం వంటి అంశాలపై కొత్తగా సమర్థమైన చర్యలు తీసుకోవచ్చు.’’ అని ఎంజీ మోటార్ ఇండియా చీఫ్ గ్రోత్ ఆఫీసర్ గౌరవ్ గుప్తా తెలిపారు.దేశమంతటా 15,000 ఛార్జింగ్ స్టేషన్స్ఇప్పటికే ఎంజీ మోటార్ కంపెనీ.. టాటా పవర్ డెల్టా ఎలక్ట్రానిక్స్, ఫోర్టమ్ వంటి సంస్థల భాగస్వామ్యంతో భారతదేశం అంతటా 15,000 పబ్లిక్, ప్రైవేట్ ఛార్జర్లను ఇన్స్టాల్ చేసింది. పబ్లిక్ EV ఛార్జర్ల ఇన్స్టాలేషన్ కోసం ఈ కార్ల తయారీ సంస్థ భారత్ పెట్రోలియం, జియో-బీపీతో భాగస్వామ్యాన్ని కూడా ప్రకటించింది.హెచ్‌పీసీఎల్ 3600 ఛార్జింగ్ స్టేషన్స్హెచ్పీసీఎల్ కంపెనీ కూడా అనేక కంపెనీలతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారులు, ఛార్జింగ్ సర్వీస్ ప్రొవైడర్లు దేశవ్యాప్తంగా పెట్రోల్ స్టేషన్లలో ఈవీ ఛార్జీల నెట్‌వర్క్‌ను విస్తరించాయి. హెచ్‌పీసీఎల్ దేశవ్యాప్తంగా 3600 కంటే ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్స్ కలిగి ఉంది. ఈ సంఖ్యను 2024 చివరి నాటికి 5000కు పెంచాలని సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం. -
ప్రతి మూడు నెలలకు ఓ కొత్త కారు
ముంబై: చైనాకు చెందిన ఎస్ఏఐసీతో దేశీ దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ ’జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా’ భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది. సెపె్టంబర్ నుంచి మొదలుపెట్టి ప్రతి 3–4 నెలలకు ఓ కొత్త కారును ఆవిష్కరించాలని భావిస్తోంది. ఉత్పత్తి సామర్థ్యాలను పెంచుకునేందుకు రూ. 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఎస్ఏఐసీతో భాగస్వామ్యం ఖరారు చేసుకోవడాన్ని ప్రకటించిన సందర్భంగా జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ ఈ విషయాలు తెలిపారు. మరోవైపు, హలోల్‌లో (గుజరాత్) ఇప్పుడు తమకున్న ప్లాంటుకు దగ్గర్లోనే మరో ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు ఎంజీ మోటార్ ఇండియా గౌరవ చైర్మన్ రాజీవ్ చాబా తెలిపారు. దీనితో తమ ఉత్పత్తి సామర్థ్యం ఏటా 1 లక్ష యూనిట్ల నుంచి 3 లక్షలకు పెరుగుతుందన్నారు. సామర్థ్యాల పెంపు, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణపై భాగస్వాములు భారీగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మారుతీ తరహా విప్లవం.. కొత్త ఇంధనాలతో నడిచే వాహనాల (ఎన్ఈవీ) విభాగంలో ఈ జేవీ ’మారుతీ తరహా విప్లవాన్ని’ తేగలదని సజ్జన్ జిందాల్ పేర్కొన్నారు. ‘నలబై ఏళ్ల క్రితం మారుతీ మార్కెట్లోకి వచి్చన తర్వాత ఆటో పరిశ్రమను మార్చేసింది. సమర్ధమంతమైన, తేలికైన, అధునాతనమైన కార్లను ప్రవేశపెట్టి ఇప్పుడు మార్కెట్ లీడరుగా ఎదిగింది. అంబాసిడర్లు, ఫియట్లు కనుమరుగయ్యాయి. కొత్త ఇంధనాలతో నడిచే వాహనాల విభాగంలో ఎంజీ కూడా ఆ ఫీట్‌ను పునరావృతం చేయగలదని విశ్వసిస్తున్నాం‘ అని ఆయన చెప్పారు. 2030 నాటికి ఏటా 10 లక్షల యూనిట్ల విక్రయాలతో ఎన్ఈవీ విభాగంలో తమ సంస్థ మార్కెట్ లీడరుగా ఎదగాలని నిర్దేశించుకున్నట్లు జిందాల్ వివరించారు. ఎంజీ మోటర్ మాతృ సంస్థ అయిన ఎస్ఏఐసీ మోటార్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ గతేడాది నవంబర్‌లో జేవీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. కొత్త స్వరూపం ప్రకారం జేవీలో జేఎస్డబ్ల్యూకి 35 శాతం, భారతీయ ఫైనాన్షియల్ సంస్థలకు 8 శాతం, ఎంజీ మోటార్ డీలర్లకు 3 శాతం, ఉద్యోగులకు 5 శాతం, మిగతా 49 శాతం వాటాలు ఎస్ఏఐసీకి ఉంటాయి. కాగా, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ – ఎస్ఏఐసీ మోటార్ జాయింట్ వెంచర్ క్రింద అభివృద్ధి చేసిన ఎంజీ సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు ఆవిష్కరణ జరిగింది. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్, జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్ పార్త్ జిందాల్, ఎంజీ మోటార్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రాజీవ్ చాబాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
డీలర్షిప్ నెట్‌వర్క్‌పై ఎంజీ మోటార్ కీలక నిర్ణయం
ఎంజీ మోటార్ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌తో కలిసి భాగస్వామ్యానికి సిద్ధమవుతున్న తరుణంలో డీలర్షిప్ నెట్‌వర్క్‌పై ప్రత్యక దృష్టి సారించింది. డీలర్‌షిప్‌నకు సంబంధించి కంపెనీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో తెలుసుకుందాం. ఎంజీ మోటార్ దాని పనితీరు తక్కువగా ఉన్న కొన్ని షోరూమ్‌లను మూసివేసి, ఇతర ప్రదేశాల్లో కొత్త డీలర్‌షిప్‌లను ఆఫర్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం 158 నగరాల్లో 330 షోరూమ్‌లు ఉన్నాయి. అయితే డిసెంబర్ 2023 నాటికి 270 నగరాల్లో 400కు షోరూమ్‌లకు పెంచుకోనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ నెలాఖరులోగా లేదా దీపావళి నాటికి ఇరు కంపెనీల భాగస్వామ్యానికి సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. చైనాకు చెందిన సాయిక్(SAIC) మోటార్, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ తమ కంపెనీల మధ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు చివరి దశ చర్చలు జరుపుతున్నారు. -
ఎంజీ మోటార్స్.. ఏడాది చివరి నాటికి 400 షోరూమ్స్ దిశగా..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆటోమొబైల్ సంస్థ ఎంజీ మోటార్స్ దేశీయంగా తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. ప్రస్తుతం దాదాపు 330 స్టోర్స్ ఉండగా.. ఏడాది ఆఖరు నాటికి వీటిని 400కు పెంచుకోనుంది. తెలంగాణలో 9 స్టోర్స్ ఉండగా.. వీటిని 20కి పెంచుకోనుంది. హైదరాబాద్‌లో కొత్తగా మూడు స్టోర్స్‌ను ప్రారంభించిన సందర్భంగా ఎంజీ మోటార్ ఇండియా డిప్యుటీ ఎండీ గౌరవ్ గుప్తా ఈ విషయాలు తెలిపారు. తెలంగాణలో 13,000 పైచిలుకు వాహనాలను విక్రయించినట్లు ఆయన వివరించారు. గతేడాది ఇక్కడ 4,000 పైచిలుకు వాహనాలను విక్రయించగా, ఈసారి 5,000 వాహనాలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు గుప్తా తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ వాహనాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండటంతో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పుంజుకుంటోందని చెప్పారు. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ విజయవాడ, విశాఖ, రాజమండ్రి తదితర ప్రాంతాల్లో తమ స్టోర్స్ ఉన్నట్లు తెలిపారు. ఏడాదికో కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టాలనే వ్యూహంతో ముందుకెడుతున్నామని.. వచ్చే సంవత్సరం మరో కొత్త వాహనాన్ని ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఉన్నామని ఆయన వివరించారు. ఎంజీ మోటార్స్ ప్రస్తుతం హెక్టర్, జియస్, కామెట్ తదితర వాహనాలను విక్రయిస్తోంది. -
ఎంజీ బుల్లి కామెట్ ఈవీస్పెషల్ గేమర్ ఎడిషన్: ధర పెరిగిందా?
MG unveils Comet EV Gamer Edition ఎంజీ మెటార్ ఇండియా తన బుల్లి ఈవీ కామెట్ లో కొత్త ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ‘గేమర్ ఎడిషన్’గా పేరుతో కామెట్ ఈవీ ఆల్-ఎక్స్‌క్లూజివ్ స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా ఈసీ సెగ్మెంట్లో ఇది కస్టమైజ్ చేసిన ఫస్ట్కారుగా నిలిచింది. గేమర్ ఎడిషన్ ట్రిమ్ గేమర్లు, యువ కొనుగోలుదారులే లక్ష్యంగా స్టీరింగ్ వీల్ కవర్, థీమ్డ్ మేట్స్ లాంటి స్పెషల్ యాక్ససరీస్‌తో ఆకర్ణణీయంగా తీసుకొచ్చింది. (ఇండియాలో అత్యధికంగా అమ్ముడుబోయిన కారు ఇదే: ఎన్ని కార్లు తెలుసా?) కామెట్ ఈవీ బేస్ ధరతో పోలిస్తే ఈ ఎడిషన్ ధర రూ. 64,999 ఎక్కువ. రూ. 8.65 లక్షలతో ఎక్స్‌క్లూజివ్ గేమర్ ఎడిషన్ ఎంజీ కామెట్ ఈవీ - పేస్, ప్లే, ప్లష్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు కామెట్ 'గేమర్ ఎడిషన్'ను ఆన్లైన్లో లేదా భారతదేశం అంతటా ఎంజీ డీలర్‌షిప్‌లలో బుక్ చేసుకోవచ్చు. (కొత్త సేఫ్టీ ఫీచర్లు, షాకింగ్ ధర: 2023 టయోటా వెల్ఫైర్ ) బోల్డ్, వైబ్రంట్, డైనమిక్ , టెక్నో వైబ్ ప్రేరణగా ఈ కామెట్ EV ఎడిషన్, గేమింగ్‌లో అడ్రినలిన్ రష్‌ని ఇష్టపడే Gen Z కోసం డార్క్ అంట్ లైట్ తేలికపాటి థీమ్‌లలో డార్క్ క్రోమ్, మెటల్ ఫినిషింగ్‌తో రీసైకిల్ చేయబడిన ప్లాస్టిక్ మెటీరియల్‌తో స్పెషల్ఎట్రాక్షన్గా ఉంటుందని కంపెనీ చెప్పింది. ఈస్తటిక్ అండ్ డిజైన్ ఓరియంటెడ్‌గా, గేమింగ్ స్ట్రీమర్, ఇన్ఫ్లుయెన్సర్ మోర్టల్ (నమన్ మాథుర్) సహకారంతో దీన్ని రూపొందించింది. సైడ్ మౌల్డింగ్‌లు, కార్పెట్ మ్యాట్లు, ఇంటీరియర్ ఇన్సర్ట్లు, బాడీ గ్రాఫిక్స్, స్టీరింగ్ వీల్ కవర్, సీట్ కవర్లు వంటి ప్రత్యేకతలున్నాయి. (శుభవార్త: భారీగా పడిన వెండి, మురిపిస్తున్న పసిడి) ఇంకా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS +EBD, ఫ్రంట్ & రియర్ 3 pt తోపాటు, సీట్ బెల్ట్‌లు, వెనుక పార్కింగ్ కెమెరా & సెన్సార్, TPMS (పరోక్ష) , ISOFIX చైల్డ్ సీట్లు లాంటి ఇతర ఫీచర్లున్నాయి. ఎంజీ కామెట్ EV 17.3 KWH Li-ion బ్యాటరీతో 230 కిమీ (క్లెయిమ్) బ్యాటరీ పరిధితో వస్తుంది మరియు దాదాపు 7 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. (టమాటా షాక్: ఇప్పట్లో తగ్గేదే లేదు, కారణాలివిగో..!) కాగా ఎంజీ మోటార్స కామెట్ ఎలక్ట్రిక్ వాహనం ఏప్రిల్ 2023లో భారతదేశంలో లాంచ్ చేసింది. దేశీయంగా ఇదే కాంపాక్ట్కారుగా పాపులర్ అయింది. పేస్ వేరియంట్ కోసం 7,98,000 నుండి (ఎక్స్-షోరూమ్), రూ. ప్లష్ వేరియంట్ కోసం 9,98,000 (ఎక్స్-షోరూమ్)గా ఉన్న సంగతి తెలిసిందే. -
అమ్మకాల్లో అదరగొట్టిన ఎంజీ మోటార్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా 2023 జనవరి–జూన్‌లో దేశవ్యాప్తంగా 29,000 యూనిట్లను విక్రయించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 21 శాతం వృద్ధి సాధించినట్టు కంపెనీ గురువారం ప్రకటించింది. ఈ ఏడాది జనవరిలో రంగ ప్రవేశం చేసిన హెక్టర్ తదుపరి తరం వేరియంట్‌తోపాటు జడ్ఎస్ ఈవీకి భారీ డిమాండ్ ఈ వృద్ధికి దోహదం చేసిందని వెల్లడించింది. కంపెనీ నుంచి అత్యధికంగా 2023 మార్చిలో 6,051 యూనిట్లు రోడ్డెక్కాయి. ఎంజీ మోటార్ ఇండియా భారత్‌లో మరో ప్లాంటును ఏర్పాటు చేయాలని భావిస్తోంది. 1.8 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఇది రానుంది. గుజరాత్‌లోని హలోల్ వద్ద 1.2 లక్షల యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యంతో కంపెనీకి ఇప్పటికే ప్లాంటు ఉంది. జనరల్ మోటార్స్ నుంచి ఈ కేంద్రాన్ని కొనుగోలు చేసింది. హలోల్ ప్లాంటు వార్షిక సామర్థ్యాన్ని ఈ ఏడాది 1.5 లక్షల యూనిట్లను చేర్చనుంది. ఈ ప్లాంటు విస్తరణకు రూ.820 కోట్లు వెచ్చిస్తోంది. భారత్‌లో అయిదేళ్ల వ్యాపార ప్రణాళికలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ 4–5 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాలని సంస్థ నిర్ణయించింది. 2028 నాటికి దేశంలో కార్యకలాపాల విస్తరణకు రూ.5,000 కోట్లు ఖర్చు చేస్తోంది. -
అమ్మకాల్లో పావు వంతు ఈవీలే
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం విక్రయాల్లో 25 శాతం ఎలక్ట్రిక్ వెహికిల్స్ కైవసం చేసుకుంటాయని భావిస్తోంది. ఈవీ విభాగంలో కొత్త ఉత్పత్తులను పరిచయం చేయనుండడం ఇందుకు కారణమని ఎంజీ మోటార్ ఇండియా డిప్యూటీ ఎండీ గౌరవ్ గుప్తా తెలిపారు. భారత్‌లో ఇప్పటి వరకు 10,000 పైచిలుకు ఈవీలు విక్రయించామని వెల్లడించారు. ‘దేశవ్యాప్తంగా 2023 జనవరి–జూన్‌లో 20.62 శాతం వృద్ధితో మొత్తం 29,040 యూనిట్లు రోడ్డెక్కాయి. 2022లో ఈ సంఖ్య 48,063 యూనిట్లు నమోదైంది’ అని వివరించారు. కొత్త వేరియంట్ ఫీచర్లు ఇవే.. జడ్ఎస్ ఈవీ టాప్ ఎండ్ వేరియంట్ అటానమస్ లెవెల్–2తో (అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) రూపుదిద్దుకుంది. ట్రాఫిక్ జామ్ అసిస్ట్, ఫార్వార్డ్ కొలిషన్ వారి్నంగ్, స్పీడ్ అసిస్ట్ సిస్టమ్ అలర్ట్స్, లేన్ ఫంక్షన్స్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ వంటి 17 రకాల ఫీచర్లను జోడించారు. ఇందులోని 176 పీఎస్ పవర్‌తో కూడిన 50.3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఒకసారి చార్జింగ్‌తో 461 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. పరిమిత కాల ఆఫర్లో ఎక్స్‌షోరూం ధర రూ.27.89 లక్షలు ఉంది. కంపెనీ నుంచి రెండవ ఈవీ అయిన కామెట్ ఎక్స్‌షోరూం ధర రూ.7.98 లక్షలు పలుకుతోంది. భారత్‌లో ఇదే చవకైన ఈవీ. -
మరింత అందంగా తయారైన ఎంజీ గ్లోస్టర్ - అదిరిపోయే లుక్ & అంతకు మించిన ఫీచర్స్!
MG Gloster Blackstorm edition: భారతదేశంలో అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన 'ఎంజీ మోటార్' కంపెనీ ఎట్టకేలకు గ్లోస్టర్ ఎస్యువి కొత్త ఎడిషన్ లాంచ్ చేసింది. దీని పేరు 'బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్'. ఈ ప్రీమియం కారు ధరలు, అప్డేటెడ్ డిజైన్, ఫీచర్స్ వంటి వివరాలను క్షుణ్ణంగా ఈ కథనంలో తెలుసుకుందాం. ధర దేశీయ విఫణిలో విడుదలైన కొత్త 'ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్' ధర రూ. 40.30 లక్షలు. ఇప్పటికే ప్రీమియం విభాగంలో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న గ్లోస్టర్ ఇప్పుడు మరింత అద్భుతంగా తయారైంది. ఇది తప్పకుండా మరింత మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము. డిజైన్ ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్ బయట, లోపలి భాగంలో ఎక్కువ భాగం బ్లాక్ థీమ్ పొందుతుంది. ఇది రెండు పెయింట్ ఆప్షన్లతో మెటల్ బ్లాక్ అండ్ మెటల్ యాష్‌తో పాటు రూప్ రైల్స్, టెయిల్ల్యాంప్, హెడ్‌ల్యాంప్ హౌసింగ్, విండో చుట్టూ ఉండే ట్రిమ్, ఫాగ్‌ల్యాంప్ హౌసింగ్, అల్లాయ్ వీల్స్ వంటివి బ్లాక్‌స్టార్మ్ ట్రీట్మెంట్ పొందుతుంది. అంతే కాకుండా బయట వైపు రెడ్ కలర్ యాక్సెంట్స్ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇది హెడ్‌ల్యాంప్స్, బ్రేక్ కాలిపర్స్, ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, వింగ్ మిర్రర్లపై చూడవచ్చు. పరిమాణం పరంగా దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. ఫీచర్స్ ఇంటీరియర్ విషయానికి వస్తే.. లోపలి భాగం బ్లాక్ అండ్ రెడ్ ట్రీట్మెంట్ పొందుతుంది. ఇది ఇంటీరియర్ అపోల్స్ట్రే, స్ట్రీరింగ్, డ్యాష్‌బోర్డ్‌లలో కనిపిస్తుంది. గ్లోస్టర్ బ్లాక్‌స్టార్మ్ 6 అండ్ 7-సీటర్ ఎంపికలలో అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. ఇక దాదాపు ఇతర ఫీచర్స్ అన్నీ కూడా దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటాయి. (ఇదీ చదవండి: మహీంద్రా ఎక్స్యువి700 సన్‌రూఫ్ మళ్ళీ లీక్.. ఇలా అయితే ఎలా? వైరల్ వీడియో!) Presenting THE ADVANCED GLOSTER BLACKSTORM with an all-new dark exterior, sporty-red accents and a luxurious dark-theme interior. With its Intelligent 4X4, 7-Terrain Modes & ADAS features you can take on anything the road throws at you and #DriveUnstoppable on your adventures! pic.twitter.com/bTqkG6BaLK — Morris Garages India (@MGMotorIn) May 29, 2023 ఇంజిన్ & పర్ఫామెన్స్ ఎంజీ గ్లోస్టర్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్ ఇంజిన్, పర్ఫామెన్స్ విషయంలో ఎటువంటి మార్పులు పొందలేదు. 2WD వెర్షన్ 163 hp ప్రొడ్యూస్ చేసే 2.0-లీటర్ సింగిల్ టర్బో-డీజిల్ ఇంజన్.. 4WD వెర్షన్ 218 hp పవర్ అందించే 2.0-లీటర్ ట్విన్ టర్బో-డీజిల్ ఇంజన్ పొందుతాయి. రెండు ఇంజిన్స్ 8-స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి. పనితీరు పరంగా ఉత్తమంగా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
చీపెస్ట్ ఈవీ ‘ఎంజీ కామెట్’ వెయిటింగ్‌కు చెక్: బుకింగ్ ప్రైస్ తెలిస్తే!
సాక్షి, ముంబై: ఎంజీ మోటార్స్ కాంపాక్ట్ ఈవీ కామెట్ కోసం ఎదురు చూస్తున్న వారికి కంపెనీ తీపి కబురు. భారతదేశపు చౌకైన ఎలక్ట్రిక్ కారు ఎంజీ కామెట్ ఇవీ ఇప్పుడు బుకింగ్‌లకు అందుబాటులో ఉంది. ఎంజీ మోటార్ ఇండియా వెబ్సైట్ ద్వారా లేదా ఎంజీ డీలర్‌షిప్‌ల వద్ద కస్టమర్లు కేవలం రూ. 11వేలు మాత్రమే చెల్లించి మే బుక్ చేసుకోవచ్చు. కంపెనీ ‘MyMG’ యాప్‌లో ‘ట్రాక్ అండ్ ట్రేస్’ ఫీచర్‌ను కూడా ప్రవేశపెట్టింది. కస్టమర్లు తమ కార్ బుకింగ్‌ల స్టేటస్‌ను వారి ఫోన్ల నుండే ట్రాక్ చేయవచ్చు. కామెట్ ఈవీ ప్రత్యేక ఆఫర్ ధరలో అందుబాటులో ఉంటుంది. పేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 7.98 లక్షలు. ప్లే, ప్లష్ వేరియంట్ ధరలు రూ. 9.28 లక్షలు, రూ. 9.98 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి. ఈ ఆఫర్ మొదటి 5వేల బుకింగ్‌లకు మాత్రమే పరిమితం. మే నెలలోనే దశలవారీ డెలివరీలు ప్రారంభమని కంపెనీ తెలిపింది. (టీ స్టాల్ కోసం ఐఏఎస్ డ్రీమ్‌ను వదిలేశాడు: ఏకంగా ఏడాదికి రూ. 150 కోట్లు) కామెట్ ఈవీ: 10.25-అంగుళాల డిజిటల్ క్లస్టర్‌తో ఫ్లోటింగ్ట్విన్ డిస్ప్లే వైడ్స్క్రీన్తో వస్తోంది. ఫుల్లీ కస్టమైజ్డ్ విడ్జెట్లతో కూడిన ఎంటర్టైన్మెంట్ సిస్టమ్, స్మార్ట్ కీ మరో ప్రత్యేక లక్షణం, స్టైలిష్ డిజైన్ కామెట్ ఒకే ఛార్జ్‌పై దాదాపు 230 కి.మీ పరిధిని అందజేస్తుందని కంపెనీ పేర్కొన్న సంగతి తెలిసిందే. Introducing the MG Comet EV, the no-nonsense car that keeps it real. The car’s latest tech keeps you connected with your squad and has all the space for your fam. Experience the plush interiors, latest tech and futuristic design of the Comet EV! Bookings open now! #MGCometEV — Morris Garages India (@MGMotorIn) May 13, 2023 ఇదీ చదవండి: స్వీట్ కపుల్ సక్సెస్ స్టోరీ: తొలి ఏడాదిలోనే రూ.38 కోట్లు -
భారత్‌లో ఎంజీ మోటార్ రెండో ప్లాంటు!
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా మరో ప్లాంటును ఏర్పాటు చేయాలని భావిస్తోంది. 1.8 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో ఇది రానుంది. గుజరాత్‌లోని హలోల్ వద్ద 1.2 లక్షల యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యంతో కంపెనీకి ఇప్పటికే ప్లాంటు ఉంది. జనరల్ మోటార్స్ నుంచి ఈ కేంద్రాన్ని కొనుగోలు చేసింది. భారత్‌లో అయిదేళ్ల వ్యాపార ప్రణాళికలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ 4–5 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాలని ఎంజీ మోటార్ ఇండియా నిర్ణయించింది. 2028 నాటికి మొత్తం విక్రయాల్లో ఈవీల వాటా 65–75 శాతానికి చేరవచ్చని కంపెనీ భావిస్తోంది. సంయుక్త భాగస్వామ్య కంపెనీ లేదా థర్డ్ పార్టీ ద్వారా సెల్ తయారీ, హైడ్రోజన్ ప్యూయల్ సెల్ టెక్నాలజీలోని ప్రవేశించే అవకాశాలను అన్వేషిస్తున్నట్టు వెల్లడించింది. దేశంలో ఉద్యోగుల సంఖ్యను 20,000 స్థాయికి చేర్చాలని భావిస్తోంది. మెజారిటీ వాటా విక్రయం.. వచ్చే 2–4 ఏళ్లలో మెజారిటీ వాటాలను స్థానిక భాగస్వాములకు విక్రయించాలన్నది ఎంజీ మోటార్ ఇండియా ప్రణాళిక. 2028 నాటికి దేశంలో కార్యకలాపాలను విస్తరించేందుకు రూ.5,000 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించిన ఈ సంస్థ.. తదుపరి దశ వృద్ధికి నిధులు సమకూర్చేందుకు కొంత కాలంగా మూలధనాన్ని సమీకరించాలని చూస్తోంది. చైనా నుండి భారత్‌కు మరింత మూలధనాన్ని తీసుకురావాలన్న కంపెనీ ప్రణాళికలు ఇప్పటివరకు విజయవంతం కాలేదు. రెండేళ్లుగా ప్రభుత్వ అనుమతి కోసం వేచి ఉన్న ఎంజీ మోటార్ ఇండియా మూలధనాన్ని పెంచడానికి ఇతర మార్గాలను వెతకడం ప్రారంభించింది. లక్ష మంది విద్యార్థులు.. ఎంజీ నర్చర్ కార్యక్రమం కింద 1,00,000 మంది విద్యార్థులను ఈవీ, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీస్ విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు ఎంజీ మోటార్ ఇండియా సీఈవో రాజీవ్ ఛాబా తెలిపారు. బ్రిటిష్ బ్రాండ్ అయిన ఎంజీ మోటార్ ప్రస్తుతం చైనాకు చెందిన దిగ్గజ వాహన తయారీ సంస్థ ఎస్ఏఐసీ మోటార్ కార్పొరేషన్ చేతుల్లో ఉంది. భారత మార్కెట్లో హెక్టర్, ఆస్టర్, గ్లోస్టర్, జడ్ఎస్ ఈవీని విక్రయిస్తోంది. ఇటీవలే చిన్న ఎలక్ట్రిక్ వాహనం కామెట్‌ను ఆవిష్కరించింది. -
ఎంజి కామెట్ అన్ని ధరలు తెలిసిపోయాయ్ - ఇక్కడ చూడండి
ఎంజి మోటార్ ఇండియా ఇటీవల తన కామెట్ (Comet) ఎలక్ట్రిక్ కారుని విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే లాంచ్ సమయంలో కంపెనీ కేవలం ప్రారంభ ధరలను మాత్రమే వెల్లడించింది, కాగా ఇప్పుడు వేరియంట్స్, వాటి ధరలను కూడా అధికారికంగా విడుదల చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వేరియంట్స్ & ధరలు: ఎంజి కామెట్ మొత్తం మూడు వేరియంట్స్ లో లభిస్తుంది. అవి పేస్ (Pace), ప్లే (Play), ప్లస్ (Plus). ఈ మూడు వేరియంట్ల ధరలు వరుసగా రూ. 7.98 లక్షలు, రూ. 9.28 లక్షలు, రూ. 9.98 లక్షలు(అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). ఈ ఎలక్ట్రిక్ కారు బుకింగ్స్ మే 15 నుంచి ప్రారంభమవుతాయి. డెలివరీలు ఈ నెల చివర నాటికి మొదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాము. అయితే మొదటి బుక్ చేసుకున్న 5000 మందికి మాత్రమే ప్రారంభ ధరలు వర్తిస్తాయి. ఇది తప్పకుండా గుర్తుంచుకోవాలి. (ఇదీ చూడండి: ఒక్క హాయ్ మెసేజ్.. రూ. 10 లక్షలు లోన్ - ట్రై చేసుకోండి!) డిజైన్ & ఫీచర్స్: దేశీయ మార్కెట్లో విడుదలైన ఎంజి కామెట్ చూడటానికి చిన్నదిగా ఉన్నపటికీ మంచి డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతుంది. రెండు వింగ్ మిర్రర్స్ కనెక్టెడ్ క్రోమ్ స్రిప్ కలిగి ముందు వెడల్పు అంతటా ఎల్ఈడీ లైట్ బాస్ కలిగి, సైడ్ ప్రొఫైల్ 12 ఇంచెస్ వీల్స్ తో ఉంటుంది. రియర్ ఫ్రొఫైల్ లో కూడా వెడల్పు అంతటా వ్యాపించి ఉండే లైట్ బార్ చూడవచ్చు. ఛార్జింగ్ పోర్ట్ వంటివి కూడా ముందు భాగంలో ఉన్నాయి. ఫీచర్స్ విషయానికి వస్తే.. 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ కలిగి లోపల వైట్ అండ్ గ్రే కలర్ ఇంటీరియర్ పొందుతుంది. ఇందులోనే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ & డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ రెండూ ఉంటాయి. ముందు ప్యాసింజర్ సీటులో వన్ టచ్ టంబుల్ అండ్ ఫోల్డ్ ఫీచర్స్ లభిస్తాయి. అయితే రియర్ సీట్లు 50:50 స్ప్లిట్ పొందుతాయి. అంతే కాకుండా ఇందులో ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి మరిన్ని ఫీచర్స్ ఉన్నాయి. (ఇదీ చూడండి: భారత్‌లో రూ. 15.95 లక్షల బైక్ లాంచ్ - ప్రత్యేకతలేంటో తెలుసా?) బ్యాటరీ అండ్ రేంజ్: ఎంజి కామెట్ 17.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ కోసం IP67 రేటింగ్ పొందుతుంది. ఈ కారు ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 230 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని ARAI ధ్రువీకరించింది. ఇది 42 bhp పవర్ అండ్ 110 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కామెట్ 3.3 కిలోవాట్ ఆన్ బోర్డ్ ఛార్జర్‌తో 0 నుంచి 100 శాతం ఛార్జ్ కావడానికి 7 గంటల సమయం పడుతుంది. -
మొదలైన 'ఎంజీ కామెట్' టెస్ట్ డ్రైవ్స్.. బుకింగ్స్ ఎప్పుడంటే?
ఇటీవల భారతదేశంలో విడుదలైన చిన్న హ్యాచ్‌బ్యాక్ ఎలక్ట్రిక్ కారు 'ఎంజీ కామెట్' ఎంతో మంది వాహన ప్రేమికుల మనసు దోచింది. ఈ ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే కస్టమర్లు 2023 మే 15 నుంచి బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ ఎలక్ట్రిక్ కారు డెలివరీలు, టెస్ట్ డ్రైవ్స్ వంటి వివరాలు ఇక్కడ చూసేద్దాం.. గత నెల చివరిలో విడుదలైన కొత్త ఎలక్ట్రిక్ కారు ఎంజి కామెట్ ఈవీ టెస్ట్ డ్రైవ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కావున ఆసక్తి కలిగిన కస్టమర్లు కంపెనీ డీలర్‌షిప్‌ల ద్వారా టెస్ట్ డ్రైవ్ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ధర రూ. 7.98 లక్షలు (ఎక్స్-షోరూమ్). కాగా డెలివరీలు మే నెల చివరి నాటికి ప్రారంభమవుతాయి. ఎంజి కామెట్ చూడటానికి చిన్న కారు అయినప్పటికీ అద్భుతమైన డిజైన్ కలిగి లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు డిజైన్ విషయానికి వస్తే ఎంజీ కామెట్ ఈవీ వెడల్పు అంతటా ఎల్ఈడీ లైట్ బార్ కలిగి చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఛార్జింగ్ పోర్ట్ లైట్ బార్ కింద ఉంటుంది. సైడ్ ప్రొఫైల్ లో 12 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉండటం గమనించవచ్చు. (ఇదీ చదవండి: ఒక్కసారిగా రూ. 171 తగ్గిన ఎల్పీజీ గ్యాస్ ధరలు.. కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?) ఫీచర్స్ విషయానికి వస్తే ఈ చిన్న కారు 10.25 ఇంచెస్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఇందులోనే ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, డ్రైవర్ డిస్ప్లే రెండూ ఉంటాయి. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, మ్యాన్యువల్ ఏసీ కంట్రోల్స్, కీలెస్ ఎంట్రీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్, USB ఛార్జింగ్ పోర్ట్ వంటి వాటితో పాటు 55కి పైగా కనెక్టెడ్ ఫీచర్స్ ఉన్నాయి. (ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా గురించి ఆసక్తికర విషయాలు - డోంట్ మిస్!) 3.67 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగిన ఎంజి కామెట్ ఎలక్ట్రిక్ కారు ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 230 కిమీ రేంజ్ అందిస్తుందని ARAI దృవీకరించింది. ఈ రేంజ్ అనేది వాస్తవ ప్రపంచంలో కొంత తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ఈ కారు 3.3 కిలోవాట్ ఛార్జర్ ద్వారా ఫుల్ ఛార్జ్ కావడానికి 7 గంటల సమయం పడుతుంది. ఎంజి కామెట్ చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ పరిమాణం పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా ఏబీఎస్ విత్ ఈబిడి, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, రివర్స్ కెమెరా వంటి ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ ఇందులో లభిస్తాయి. ఈ ఎలక్ట్రిక్ కారు దేశీయ మార్కెట్లో సిట్రోయెన్ ఈసీ3 ఎలక్ట్రిక్ కారుకి ప్రత్యర్థిగా ఉంటుంది. -
ఎంజీ ఇండియా నుంచి మరో చిన్న ఎలక్ట్రిక్ కార్
-
రూ.8 లక్షలకే ఎంజీ ఎలక్ట్రిక్ కారు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా దేశీయ మార్కెట్లో చౌకైన ఎలక్ట్రిక్ వెహికిల్ కామెట్‌ను ప్రవేశపెట్టింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.7.98 లక్షలు. ఒకసారి చార్జింగ్‌తో 230 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 17.3 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీ పొందుపరిచారు. ఏడు గంటల్లో చార్జింగ్ పూర్తి అవుతుంది. రెండు డోర్లు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, రెండు ఎయిర్‌బ్యాగ్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి హంగులు ఉన్నాయి. ఎలక్ట్రిక్ విభాగంలో ఎంజీ ఇప్పటికే భారత్‌లో జడ్ఎస్ ఈవీ మోడల్‌ను విక్రయిస్తోంది. గుజరాత్‌లోని హలోల్ ప్లాంటులో కామెట్ కార్లను తయారు చేస్తున్నారు. -
ఎంజీ కామెట్ కాంపాక్ట్ ఈవీ వచ్చేసింది..యూజర్లకు పండగే!
సాక్షి, ముంబై: ఎప్పటినుంచో ఎదురు చేస్తున్న ఎంజీ బుజ్జి ఈవీ కామెట్ లాంచ్ అయింది. అందరూ ఊహించినట్టుగానే రూ. 10లక్షల లోపు ధరతోనే తీసుకొచ్చింది. పరిచయ ఆఫర్‌గా దీని ప్రారంభ ధరను రూ.7.98 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ నిర్ణయించింది. సిటీ రన్‌అబౌట్ కోసం చూస్తున్న కొనుగోలుదారులే లక్ష్యంగా స్పోర్టీ లుక్, యూనిక్ కలర్స్‌లో కామెట్ ఈవీ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ను లాంచ్ చేసింది. అందుబాటులో లభ్యం కానున్న ఈ కారు ఛార్జింగ్ ఖర్చు చాలా తక్కువేనని సగటున నెలకు ధర రూ. 519 ఖర్చవుతుందని కంపెనీ వెల్లడించింది. ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ ధర, లభ్యత కామెట్ ఈవీ ప్రారంభ ధర రూ.7.98లక్షలు (ఎక్స్-షోరూమ్). ఏప్రిల్ 27 నుండి టెస్ట్ డ్రైవ్‌కి అందుబాటులో ఉంటుంది. బుకింగ్‌లు మే 15న ప్రారంభమవుతాయి. డెలివరీలు నెల తర్వాత మొదలవుతాయి. వైట్, బ్లాక్, సిల్వర్ సింగిల్ కలర్ ఆప్షన్లతో ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు వచ్చింది. బ్లాక్ రూఫ్‌తో గ్రీన్, బ్లాక్ రూఫ్‌తో వైట్ డ్యుయల్ టోన్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి. (ఏఐపై ఆనంద్ మహీంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు: అద్భుతమైన వీడియో ) ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ ఫీచర్లు ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు 17.3kWh బ్యాటరీతో వచ్చింది. ఇది 41 hp పీక్ పవర్‌ను, 110 Nm పీక్ టార్క్యూను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక దీని టాప్ స్పీడ్ గంటకు 100 కిలోమీటర్లు (100kmph)గా ఉంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని ఎంజీ మోటార్స్ పేర్కొంది. ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే మూడు డ్రైవింగ్ మోడ్లతో కామెట్ ఈవీని తీసుకొచ్చింది. 2,974mm పొడవు, 1,505mm వెడల్పు ,1,640mm ఎత్తును 2,010mm వీల్‌బేస్‌తో వచ్చింది. ఇక పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుంటే, భారతదేశంలో లభించే ఇతర చిన్న కారు ఆల్టో K10 కంటే , కామెట్ ఈవీ కంటే 556 మిమీ పొడవు తక్కువ. 10.25 ఇంచుల సైజ్ ఉండే రెండు స్క్రీన్లలో ఒకటి ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లేగా, రెండోది ఆల్-డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేగా ఉంటుంది. యాపిల్ కార్ ప్లేకు సపోర్ట్ చేసే ఆండ్రాయిడ్ ఆటో కంట్రోల్‌లతో కూడిన టూ స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంటుంది. ఇంకా 12 ఇంచుల వీల్స్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, టైల్ ల్యాంప్స్, డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఏబీఎస్, రేర్ పార్కింగ్ కెమెరా, కీలెస్ ఎంట్రీ లాంటి ప్రధాన ఫీచర్లున్నాయి. టాటా టియాగో ఈవీ, సిట్రాయిన్ ఈసీ3 ఎలక్ట్రిక్ కార్లకు ఎంజీ కామెట్ ఈవీ గట్టిపోటీ ఇవ్వనుంది. టాటా టియాగోతో పోలిస్తే ధర కూడా తక్కువే కావడం గమనార్హం. (ముంబై ఇండియన్స్ బాస్ గురించి తెలుసా? అంబానీని మించి సంపాదన) -
ఎంజీ మోటార్లో జేఎస్డబ్ల్యూకి వాటా!
న్యూఢిల్లీ: ఆటోరంగ కంపెనీ ఎంజీ మోటార్ ఇండియాలో వాటా కొనుగోలుకి డైవర్సిఫైడ్ దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా బీవైడీ ఇండియాలోనూ వాటాను సొంతం చేసుకునేందుకు స్టీల్ నుంచి స్పోర్ట్ వరకూ విభిన్న బిజినెస్‌లు కలిగిన జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ అవకాశాలను అన్వేషిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. గ్రూప్ స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై ఉత్సాహంగా చర్చిస్తున్నట్లు ఈ ఏడాది జనవరిలో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సీఎఫ్‌వో శేషగిరి రావు పేర్కొన్న సంగతి తెలిసిందే. వెరసి ఫోర్ వీలర్స్ తయారీపై గ్రూప్ దృష్టి సారించినట్లు వెల్లడించారు. తద్వారా మరిన్ని రంగాలలోకి గ్రూప్ విస్తరించనున్నట్లు తెలియజేశారు. కాగా.. ప్రస్తుతం అటు ఎంజీ మోటార్ ఇండియా, ఇటు బీవైడీ ఇండియాలతో వాటా కొనుగోలు నిమిత్తం ప్రాథమిక చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశాలపై స్పందించడానికి జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ప్రతినిధి నిరాకరించడం గమనార్హం! మరోపక్క కంపెనీ విధానాల ప్రకారం ఇలాంటి అంచనాలపై స్పందించలేమంటూ ఎంజీ మోటార్ ప్రతినిధి వ్యాఖ్యానించారు. -
ఈవీ విక్రయాలపై ఎంజీ మోటార్ కన్ను
న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్ మొబిలిటీపై దృష్టిపెట్టిన ఎంజీ మోటార్స్ ఈ ఏడాది ఈవీ విక్రయాల్లో 30 శాతం వృద్ధిని అంచనా వేస్తోంది. ఇందుకు అనుగుణంగా వచ్చే నెలలో ఈవీ విభాగంలో మరో మోడల్‌ను విడుదల చేయనుంది. ప్రస్తుతం స్థానిక మార్కెట్లో జెడ్ఎస్ ఈవీని విక్రయిస్తున్న కంపెనీ రెండు డోర్ల ఈవీ మోడల్ కామెట్‌ను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. మే నెల నుంచి దశలవారీగా దేశమంతటా వాహ నాలను విడుదల చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు కంపెనీ ఎండీ రాజీవ్ చాబా పేర్కొన్నారు. వెరసి ఈ ఏడాది రెండు ఈవీ మోడళ్ల ద్వారా 80, 000–90,000 యూనిట్ల విక్రయాలను సాధించగలమని విశ్వసిస్తున్నట్లు తెలియజేశారు. -
ఎంజీ చిన్న ఈవీ వస్తోంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా చిన్న ఎలక్ట్రిక్ కారు కామెట్ ఈవీ భారత్‌లో అడుగుపెడుతోంది. ఏప్రిల్ 26న కంపెనీ ఈ మోడల్‌ను ఆవిష్కరిస్తోంది. బుకింగ్స్ సైతం అదే రోజు మొదలు కానున్నాయి. ధర రూ.10–12 లక్షల మధ్య ఉంటుంది. ఇండోనేషియాలో ఎంజీ విక్రయిస్తున్న వ్యూలింగ్ ఎయిర్ ఈవీ ఆధారంగా ఇది రూపుదిద్దుకుంది. ఒకసారి చార్జింగ్‌తో 200 కిలోమీటర్లకుపైగా ప్రయాణించనుంది. రెండు డోర్లతో తయారైంది. నలుగురు కూర్చునే వీలుంది. పొడవు సుమారు 3 మీటర్లు, వెడల్పు ఒకటిన్నర మీటర్లు, ఎత్తు 1.63 మీటర్లు ఉంటుంది. 20 కిలోవాట్ అవర్ బ్యాటరీ, 10.25 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 2–స్పోక్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, హిల్ స్టార్ట్ అసిస్ట్, కీలెస్ ఎంట్రీ, వాయిస్ కమాండ్స్ వంటి హంగులు ఉన్నాయి. కామెట్ ఈవీని భారత్‌లో తయారు చేసేందుకు ఎంజీ కసరత్తు ప్రారంభించింది. బావొజున్ యెప్ ఎస్యూవీ 2025లో దేశీయ మార్కెట్లో రంగ ప్రవేశం చేయనుంది. -
MG Comet EV: ఇది పొట్టిది కాదండోయ్.. చాలా గట్టిది - బుకింగ్స్ & లాంచ్ ఎప్పుడంటే?
ఎంజీ మోటార్స్ భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే మంచి ఉత్పత్తులను ప్రవేశపెట్టి మంచి ఆదరణ పొందగలిగింది. కేవలం ఫ్యూయెల్ కార్లను మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో కూడా చరిత్ర తిరగరాసిన ఈ కంపెనీ త్వరలో ఓ బుజ్జి ఎలక్ట్రిక్ కారుని విడుదల చేయనుంది. ఈ ఎలక్ట్రిక్ కాంపాక్ట్ లాంచ్ డేట్, రేంజ్, డిజైన్ వంటి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. లాంచ్ టైమ్: ఎంజీ మోటార్ ఇండియా ఈ నెల 26న (2023 ఏప్రిల్ 26) దేశీయ మార్కెట్లో 'కామెట్ ఈవీ' (Comet EV) విడుదల చేయనున్నట్లు సమాచారం. కంపెనీ లాంచ్ సమయంలో ప్రారంభ ధరలను మాత్రమే వెల్లడిస్తుంది, ఆ తరువాత అన్ని వేరియంట్స్ ధరలను మే నాటికి వెల్లడించే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఇప్పటికే భారతదేశంలో అమ్మకానికి ఉన్న 'సిట్రోయెన్ సి3'కి ప్రధాన ప్రత్యర్థిగా ఉండనుంది. అంచనా ధరలు: ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఎక్కువ మంది కస్టమర్లకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ చిన్న కారుని విడుదల చేయనుంది. దీని ధర రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల మధ్య ఉంటుందని అంచనా. అయితే ధరలు అధికారికంగా వెల్లడికాలేదు. (ఇదీ చదవండి: భారత్‌లో విడుదలైన కోటి రూపాయల లెక్సస్ కారు, ఇదే.. చూసారా?) డిజైన్: ఈ చిన్న కారు చూడగానే ఆకర్షించే విధంగా రూపుదిద్దుకుంది. కావున ఇది ఇప్పటివరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న చాలా కార్లకంటే కూడా భిన్నంగా ఉంటుంది. ఇది కేవలం రెండు డోర్స్ కలిగి మంచి కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. ఇప్పటికే వెల్లడైన కొన్ని ఫోటోల ద్వారా ఈ కారు డిజైన్ చూడవచ్చు. ఫీచర్స్: ఆధునిక కాలంలో విడుదలవుతున్న దాదాపు అన్ని కార్లు లగ్జరీ ఫీచర్స్ పొందుతాయి. అయితే వీటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ఎంజి కామెట్ ఈవీ సరసమైన ధర వద్ద లభించే మంచి ఫీచర్స్ కలిగిన కారు కావడం విశేషం. ఇందులో 10.25 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ లేఅవుట్ ఉంటుంది. అంతే కాకుండా రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్ కలిగిన, నాలుగు-సీట్ల కారు ఈ కామెట్ ఈవీ. కార్ టెక్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, హిల్-స్టార్ట్ అసిస్ట్, కీలెస్ ఎంట్రీ అండ్ గో, డ్రైవ్ మోడ్స్, వాయిస్ కమాండ్ వంటివి ఇందులో లభిస్తాయి. (ఇదీ చదవండి: మరణం తర్వాత కూడా భారీగా సంపాదిస్తున్న యూట్యూబర్.. ఇతడే!) బ్యాటరీ ప్యాక్ & రేంజ్: త్వరలో విడుదల కానున్న ఈ ఎలక్ట్రిక్ కారు బ్యాటరీకి సంబంధించిన అధికారిక వివరాలను కంపెనీ వెల్లడించలేదు, కానీ ఇది ఒక ఫుల్ ఛార్జ్‌తో గరిష్టంగా 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కారు కోసం కంపెనీ ఏప్రిల్ 26 నుంచి బుకింగ్స్ స్వీకరించనుంది. -
ఎంజీ స్మార్ట్ కాంపాక్ట్ కామెట్ ప్రొడక్షన్ షురూ, లాంచింగ్ సూన్!
సాక్షి, ముంబై: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా స్మార్ట్ కాంపాక్ట్ ఈవీని ‘కామెట్’ ఉత్పత్తిని ప్రారంభించింది. గుజరాత్‌లోని తన హలోల్ ప్లాంట్ నుండి తొలి ఈవీని ప్రదర్శించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన జీస్ఈవీ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా, సాలిడ్ స్టీల్ ఛాసిస్‌పై నిర్మించిన 'హై స్ట్రెంగ్త్ వెహికల్ బాడీ'తో రానుంది. తమ కాంపాక్ట్ కామెట్ దేశీయ పోర్ట్‌ఫోలియోలో అతి చిన్న వాహనమని, మార్కెట్లో విక్రయించే అతి చిన్న ఆల్-ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనం కూడా అవుతుందని కంపెనీ భావిస్తోంది ఏప్రిల్ 19న ఇండియాలో దీన్ని ఆవిష్కరించనుంది. కామెట్ ఈవీ ధరలను రాబోయే రెండు నెలల్లో ప్రకటించవచ్చని భావిస్తున్నారు. అయితే 17.3 kWh బ్యాటరీ ప్యాక్‌తో రానున్న ఎంజీ కామెట్ ధర దాదాపు రూ. 10 లక్షల నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఫన్-టు-డ్రైవ్ ఎలిమెంట్స్‌తో అర్బన్ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కాంపాక్ట్ స్మార్ట్ ఈవీ కామెట్‌ను లాంచ్ చేయనున్నామని మోటార్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బిజు బాలేంద్రన్ వెల్లడించారు.ఇటీవలి నీల్సన్ నిర్వహించిన అర్బన్ మొబిలిటీ హ్యాపీనెస్ సర్వే ప్రకారం పట్టణ ప్రాంతాల్లో ఈవీలకు ప్రాధాన్యత లభిస్తుందన్నారు. కామెట్ ఇంటర్నెట్ ఆఫ్ వెహికల్స్ (IoV), మల్టీమీడియా, కనెక్టెడ్ ఫీచర్లతో సహా GSEV ప్లాట్‌ఫారమ్‌ను పూర్తి చేసే వివిధ స్మార్ట్ ఫీచర్లున్నాయని కంపెనీ తెలిపింది. కాగా లాంచింగ్‌కుముందు కంపెనీ విడుదల టీజర్ ప్రకారం డ్యూయల్ 10.25-ఇంచ్ డిజిటల్ స్క్రీన్, స్టీరింగ్ వీల్ డిజైన్‌తో పాటు డాష్‌బోర్డ్, స్టీరింగ్ రెండు వైపులా మౌంటెడ్ రెండు-స్పోక్ డిజైన్స్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, క్యాబిన్లో బాక్సీ డిజైన్ ఎల్ఈడీహెడ్లైట్లు ,టెయిల్ లైట్లు, యాంబియంట్ లైటింగ్ మొదలైని ఇతర ఫీచర్లుగాఉండనున్నాయి. అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగానూ, అలాగే టియాగో ఈవీ, CitroeneC3 కంటే చిన్నదిగా ఉండనుందని అంచనా. -
ఈ నెలలో విడుదలయ్యే కొత్త కార్లు, ఇవే!
కొత్త ఆర్ధిక సంవత్సరం మొదలైపోయింది. కొత్త కార్లు దేశీయ మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇందులో మారుతి సుజుకి ఫ్రాంక్స్, మెర్సిడెస్ బెంజ్ GT63 S ఈ-పెర్ఫార్మెన్స్ మొదలైనవి ఉన్నాయి. ఈ కార్లు మార్కెట్లో ఎప్పుడు విడుదలవుతాయి, ఇతర వివరాలేంటి అనే సమాచారం ఈ కథనంలో.. మారుతి సుజుకి ఫ్రాంక్స్: 2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టిన మారుతి ఫ్రాంక్స్ ఈ నెల రెండవ వారంలో దేశీయ విఫణిలో విడుదలయ్యే అవకాశం ఉంది. కంపెనీ ఈ కొత్త మోడల్ కోసం ఇప్పటికే మంచి సంఖ్యలో బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు 1.0-లీటర్ టర్బో, 1.2-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఆప్షన్స్ పొందనుంది. దీని ధర సుమారు రూ. 8 లక్షల నుంచి రూ. 11 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంటుంది. మెర్సిడెస్ ఏఎమ్‌జి జిటి63 ఎస్ ఈ-పర్ఫామెన్స్: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ దేశీయ విఫణిలో ఈ నెల 11న ఏఎమ్‌జి జిటి63 ఎస్ ఈ-పర్ఫామెన్స్ విడుదల చేయనుంది. ఇది 4-డోర్ కూపే నుంచి వచ్చిన ఫస్ట్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారు కావడం విశేషం. ఇది 4.0 లీటర్ ట్విన్-టర్బోచార్జ్డ్ వి8 ఇంజన్ & 204 హెచ్‌పి ఎలక్ట్రిక్ మోటారు పొందుతుంది. ఈ లగ్జరీ కారు ఫ్రంట్ బంపర్‌పై పెద్ద గ్యాపింగ్ ఎయిర్ ఇన్‌టేక్‌లు, పనామెరికానా గ్రిల్, బెస్పోక్ అల్లాయ్ వీల్స్, బూట్ లిడ్‌పై స్పాయిలర్ పొందుతుంది. దీని ధర కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు, కానీ సుమారు రూ. 3 కోట్ల (ఎక్స్-షోరూమ్) కంటే ఎక్కువ ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాము. లంబోర్ఘిని ఉరస్ ఎస్: ఇటలీకి చెందిన సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని దేశీయ మార్కెట్లో ఉరస్ ఎస్ SUVని విడుదల చేయడానికి సన్నద్ధమైంది. ఇది 2023 ఏప్రిల్ 13న అధికారికంగా విడుదలకానుంది. దీని ధర సుమారు రూ. 4.22 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా) కంటే ఎక్కువ ఉండవచ్చని అంచనా. ఇది 4.0 లీటర్, V8 ట్విన్-టర్బో పెట్రోల్ ఇంజన్ కలిగి అద్బుతంగా పర్ఫామెన్స్ అందిస్తుంది. ఎంజి కామెట్ ఈవీ: భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఎంజి మోటార్ ఈ నెల చివరిలో కామెట్ EV అనే ఎలక్ట్రిక్ కారుని విడుదలచేయనుంది. దీనిని నగర ప్రయాణాల కోసం అనుకూలంగా ఉండటానికి ప్రత్యేకంగా రూపొందించారు. కాంపాక్ట్ డైమెన్షన్లు, టూ-డోర్ బాడీ స్టైల్, ఫ్యూచరిస్టిక్ డిజైన్ ఎలిమెంట్స్ వంటివి దీనిని చాలా ఆకర్షణీయంగా కనపడేలా చేస్తాయి. ఈ ఎలక్ట్రిక్ కారు 250 కిమీ రేంజ్ అందిస్తుందని, ధర రూ. 10 లక్షల (ఎక్స్-షోరూమ్) కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా. -
ఎంజీ బుజ్జి ఈవీ: స్మార్ట్ కాంపాక్ట్ కామెట్ వచ్చేస్తోంది..150 కి.మీ. రేంజ్లో
సాక్షి, ముంబై: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఎంజి మోటార్ ఇండియా త్వరలోనే నగరాల్లో రోజువారీ ప్రయాణాలకనుగుణంగా ఉండేలా ఒక స్మార్ట్ కారును తీసుకొస్తోంది. ‘కామెట్’ పేరుతో స్మార్ట్ కాంపాక్ట్ ఈవీని లాంచ్ చేయనుంది. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లలో అందిస్తున్న Wuling Air EV ఆధారంగా తన 'కామెట్'ని తీసుకొస్తోందని సమాచారం. కేవలం 2,900mm పొడవుతో, కామెట్ Tiago EV , CitroeneC3 కంటే చిన్నదిగా ఉండనుంది. (ఇదీ చదవండి: నా కాస్ట్లీవిస్కీ మాయం: విమాన ప్రయాణికుడి ఆక్రోశం, ధర తెలిస్తే!) ఒక్క ఛార్జ్‌తో 150-200 కిలోమీటర్ల రేంజ్‌తో కామెట్ వస్తోంది. ఇది 25 kWh బాటరీ, 50kW మోటారుతో అందుబాటులోకి రానుంది. లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బాటరీ మెరుగైన బాటరీ లైఫ్, పెర్ఫార్మన్స్తో అతి తక్కువ నిర్వహణ ఖర్చుతో వాహన దారులకు అలరించనుంది. డ్యూయల్ 10.25-ఇంచ్ డిజిటల్ స్క్రీన్ , ఇతర కనెక్టెడ్ ఫీచర్స్ తో ప్రీమియం వాహనాలకు ఏమాత్రం తగ్గకుండా కామెట్ మార్కెట్లోకి రానుంది. ఇక ధర విషయానికి వస్తే రూ. 10 లక్షలోపు ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ, పెరుగుతున్న ఇంధన ఖర్చులు, పార్కింగ్ స్థలాల లేమి, కాలుష్యం మధ్య ఎంజీ కామెట్ వేగవంతమైన, సరసమైన, భవిష్యత్తు పరిష్కారమని కంపెనీ పేర్కొంది. -
బాలీవుడ్ నటి చేతికి కళ్లు చెదిరే లగ్జరీ కారు: వైరల్ వీడియో
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా లగ్జరీ కారును కొనుగోలు చేసింది. ఎంజీ గ్లోస్టర్ కొత్త SUVని కొనుగోలు చేసింది. దీని ధర సుమారు రూ.42 లక్షలు. గ్లోస్టర్. విలాసవంతమైన కారును కొనుగోలు చేసిన షెర్లిన్ చోప్రా ఫోటో, వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇండియాలో లభిస్తున్న ఎంజీ ఫ్లాగ్షిప్ మోడల్ ఎస్యూవీ గ్లోస్టర్. దీని ప్రారంభ ధర రూ. 32.59 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే తాజా నివేదికల ప్రకారం, షెర్లిన్ చోప్రా కొనుగోలు చేసిన మోడల్ ధర సుమారు రూ. 42.48 లక్షలు. గతంలో ఎంటీవీ స్ప్లిట్స్ విల్లా ప్రోగ్రామ్‌ను హోస్ట్ చేసిన షెర్లిన్ చోప్రా, నటి మోడల్ కూడా. తెలుగు, తమిళ సినిమాలతో పాటు ఇంగ్లీషు సినిమాల్లోనూ నటిస్తోంది. షెర్లిన్ చోప్రా రెండు టెలివిజన్ రియాలిటీ షోలతోపాటుబిగ్ బాస్ సీజన్ 3లో కూడా కనిపించింది. ఎంజీ గ్లోస్టర్ SUVలో డ్రైవర్ సీటు కోసం మెమరీ ఫంక్షన్, మోటరైజ్డ్ టెయిల్‌గేట్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఇంటర్నల్ ఎయిర్ ప్యూరిఫైయర్తో సహా అనేక సౌకర్యవంతమైన ఫీచర్లు ఉన్నాయి. 2022 ఎంజీ గ్లోస్టర్‌లో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, సెమీ-పారలల్ పార్కింగ్, అటానమస్ బ్రేకింగ్, లేన్ కీపింగ్ ఎయిడ్, అలాగే స్టాండర్డ్ ఫ్రంట్, సైడ్ మరియు కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌లు (ADAS) ఉన్నాయి. ఇది పెట్రోల్ లేదా డీజిల్ ఇంజన్‌తో కొనుగోలు చేయవచ్చు. 2.0L డీజిల్ ఇంజన్ కోసం ఒకే టర్బో లేదా ట్విన్ టర్బోలను కలిగి ఉంటుంది. టయోటా ఫార్చ్యూనర్ , ఇసుజు MU-X వంటి వాటితో పోటీ పడుతోంది. ధర పరంగా జీప్ మెరిడియన్, హ్యుందాయ్ టక్సన్ ,కియా కార్నివాల్ వంటి వాహనాలతో పోటీపడుతుంది. -
MG Motor: ఆ స్మార్ట్ ఈవీ పేరు ‘కామెట్’... రేసింగ్ విమానం స్ఫూర్తితో...
ప్రముఖ ఆటోమేకర్ ఎంజీ మోటర్స్ త్వరలో భారత్‌లో విడుదల చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ వాహనానికి పేరును ప్రకటించింది. తమ స్మార్ట్ ఈవీకి 'కామెట్'గా పేరు పెట్టినట్లు పేర్కొంది. ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మాక్‌రాబర్ట్‌సన్ ఎయిర్ రేస్‌లో పాల్గొన్న 1934 నాటి బ్రిటిష్ విమానం స్ఫూర్తితో ఈ పేరు పెట్టినట్లు వివరించింది. ఎంజీ మోటర్స్ ఇటీవల విడుదల చేసిన హెక్టర్ వంటి వాహనాలకు 1930 ప్రాంతంలో తయారు చేసిన రెండవ ప్రపంచ యుద్ధం నాటి యుద్ధ విమానం పేరు పెట్టారు. అదే విధంగా గ్లోస్టర్‌కు బ్రిటన్‌లో తయారు చేసి 1941లో ప్రయోగించిన జెట్-ఇంజిన్ విమానం పేరు పెట్టారు. త్వరలో రాబోతున్న కామెట్ ఈవీ రద్దీగా ఉండే పట్టణాలు, నగరాలకు చక్కగా సరిపోతుందని కంపెనీ పేర్కొంటోంది. ఇంధన ఖర్చులు, తక్కువ పార్కింగ్ స్థలాలు, పెరుగుతున్న కాలుష్యం నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయని, ఖర్చులను ఆదా చేస్తాయని చెబుతోంది. (ఇదీ చదవండి: Realme GT3: మార్కెట్లోకి ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్.. ధర మాత్రం...) అర్బన్ మొబిలిటీ అనేది ప్రస్తుతం ఎదురవుతున్న కీలక సవాలని, దీంతో పాటు రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి సరికొత్త పరిష్కారాలు కావాలని ఎంజీ మోటార్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా పేర్కొన్నారు. డిజిటల్ యుగంలోకి మరింత ముందుకు వెళుతున్నకొద్దీ కొత్త కొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీలను చూస్తామన్నారు. అందులో భాగంగానే ‘కామెట్’ను తీసుకొస్తున్నట్లు తెలిపారు. (ఇదీ చదవండి: ఆ నగరాల్లో చుక్కలనంటిన రియల్ ఎస్టేట్ ధరలు! రూ. 8 కోట్లకు ఎంత వస్తుందంటే..) -
కార్ల కొనుగోలు దారులకు భారీ షాక్!
న్యూఢిల్లీ: కార్ల ధరలు జనవరి నుంచి ప్రియం కానున్నాయి. ధరలను పెంచుతున్నట్టు మెర్సిడెస్ బెంజ్, ఆడి, రెనో, కియా ఇండియా, ఎంజీ మోటార్ బుధవారం ప్రకటించాయి. ముడిసరుకు వ్యయాలు, రవాణా ఖర్చులు అధికం అవుతున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాయి. కార్ల ధరలను సవరిస్తున్నట్టు మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ ఇప్పటికే ప్రకటించాయి. కంపెనీ, మోడల్‌నుబట్టి ఎక్స్‌షోరూం ధర 5 శాతం వరకు దూసుకెళ్లనుంది. ధరలు పెంచే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని హ్యుండై మోటార్ ఇండియా, హోండా కార్స్ తెలిపాయి. -
రెండో సారి నెం.1గా నిలిచిన ప్రముఖ కంపెనీ
న్యూఢిల్లీ: వినియోగదారులకు సేవలు అందించే విషయంలో ఎంజీ ఇండియా వరుసగా రెండో ఏడాది మొదటి స్థానంలో నిలిచినట్టు జేడీ పవర్ తెలిపింది. ఇండియా కస్టమర్ సర్వీసెస్ ఇండెక్స్ అధ్యయనాన్ని నీల్సన్ ఐక్యూ భాగస్వామ్యంతో జేడీ పవర్ నిర్వహించింది. సర్వీస్ అభ్యర్థనల ధ్రువీకరణ, సర్వీస్‌కు ముందు, సర్వీస్‌కు తర్వాత కస్టమర్ల అభిప్రాయం, ఎప్పటికప్పుడు సర్వీస్‌కు సంబంధించి తాజా సమాచారం అందించే విషయంలో ఎంజీ ఇండియా సేవల పట్ల ఎక్కువ మంది కస్టమర్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఎంజీ ఇండియా 25 ఇండెక్స్ పాయింట్లు (మొత్తం 1,000 పాయింట్ల స్కేల్‌పై) పెంచుకుంది. సర్వీసు నాణ్యత బాగుందని 80 శాతం మంది కస్టమర్లు చెప్పారు. ఇండెక్స్‌లో ఎంజీ ఇండియా అత్యధికంగా 860 స్కోర్ సంపాదించింది. హోండా 852, టయోటా 852 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చదవండి: రైల్వే ప్రయాణికులకు బంపరాఫర్.. మీ ట్రైన్ టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉంటే ఫ్రీగా ఫ్లైట్ జర్నీ చేయొచ్చు! -
ఆటోమొబైల్ రంగంలో సత్తా చాటుతున్న వనితలు
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ తయారీలో సహజంగా పురుషులదే ఆధిపత్యం. అలాంటి చోట మహిళలూ రాణిస్తున్నారు. క్రమంగా తమ స్థానాన్ని బలోపేతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో లింగ సమానత్వం/లింగవైవిధ్యం (పనివారిలో స్త్రీ, పురుషలకు సమ ప్రాధాన్యం) కోసం ప్రముఖ కంపెనీలైన టాటా మోటార్స్, ఎంజీ, బజాజ్ ఆటో, హీరో మోటో కార్ప్ చర్యలు తీసుకోవడం హర్షణీయం. టాటా మోటార్స్‌కు చెందిన ఆరు తయారీ ప్లాంట్లలోని షాప్ ఫ్లోర్లలో సుమారు 3,000 మంది మహిళలు పనిచేస్తున్నారు. చిన్న కార్ల నుంచి వాణిజ్య వాహనాల తయారీ వరకు వివిధ హోదాల్లో వీరు సేవలు అందిస్తున్నారు. తయారీ కేంద్రాల్లో మరింత మంది మహిళలను నియమించుకునే ప్రణాళికలతో టాటా మోటార్స్ ఉంది. టాటా మోటార్స్ పుణె ప్యాసింజర్ వాహన ప్లాంట్‌లో గత రెండేళ్లలోనే మహిళా కార్మికుల సంఖ్య 10 రెట్లు పెరిగింది. 2020లో 178 మంది ఉంటే, వారి సంఖ్య 1,600కు చేరింది. ‘‘పుణెలో పూర్తిగా మహిళలతో కూడిన తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడాన్ని సవాలుగా తీసుకున్నాం. ఇప్పటికే 1,100 మంది మహిళలను నియమించుకున్నాం. వచ్చే రెండేళ్లలో వీరి సంఖ్యను 1,500కు చేర్చే దిశగా పనిచేస్తున్నాం’’అని టాటా మోటార్స్ చీఫ్ హ్యుమన్ రీసోర్సెస్ ఆఫీసర్ రవీంద్ర కుమార్ తెలిపారు. ఎంజీ మోటార్ ఆదర్శనీయం.. ఎంజీ మోటార్ ఇండియా అయితే స్త్రీ, పురుషులు సమానమేనని చాటే విధంగా 2023 డిసెంబర్ నాటికి తన మొత్తం ఫ్యాక్టరీ సిబ్బందిలో మహిళల వాటాను 50 శాతానికి చేర్చాలన్న లక్ష్యం దిశగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థకు చెందిన గుజరాత్‌లోని హలోల్ ప్లాంట్‌లో మొత్తం 2,000 మంది పనిచేస్తుండగా.. మహిళల వాటా 34 శాతంగా ఉంది. తయారీలో కీలకమైన పెయింట్ నాణ్యత, సర్ఫెస్ టెస్టింగ్, పరిశోధన, అభివృద్ధి, అసెంబ్లీ తదితర బాధ్యతల్లోకి మహిళలను తీసుకుంటోంది. జనరల్ మోటార్స్ నుంచి 2017లో హలోల్ ప్లాంట్‌ను సొంతం చేసుకోగా, ఇక్కడి సిబ్బందిలో స్త్రీ, పురుషులను సమానంగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. దీనివల్లే మహిళా సిబ్బంది సంఖ్య గణనీయంగా పెరిగింది. పరిశ్రమలో అధిక లింగ వైవిధ్యాన్ని ఇప్పటికే ఎంజీమోటార్స్ సాధించినప్పటికీ.. 50:50 నిష్పత్తికి చేర్చే లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్టు సంస్థ డైరెక్టర్ (హెచ్ఆర్) యశ్వింద్ పాటియాల్ తెలిపారు. హీరో మోటోలో 9.3 శాతం ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్‌లో ప్రస్తుతం 1,500 మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. లింగ సమానత్వ రేషియో 2021–22 నాటికి 9.3 శాతంగా ఉంది. సమీప కాలంలో దీన్ని మరింత పెంచుకునే లక్ష్యంతో కంపెనీ ఉంది. బజాజ్ ఆటో చకాన్ ప్లాంట్‌లో డోమినార్ 400, ఆర్ఎస్ 200 తయారీకి ప్రత్యేకంగా మహిళలనే వినియోగిస్తోంది. 2012-14 నాటికి 148 మందిగా ఉన్న మహిళా ఉద్యోగుల సంఖ్య 2021-22 నాటికి 667కు పెరిగింది. హీరో మోటో కార్ప్ ‘తేజశ్విని’ పేరుతో మహిళా సిబ్బందిని పెంచుకునేందుకు ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టింది. దీనిద్వారా తయారీ కేంద్రాల్లో ఇప్పటికే మహిళల సంఖ్యను పెంచుకున్నట్టు కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. రిక్రూట్మెంట్లు, విద్య, శిక్షణ, మార్గదర్శక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్టు చెప్పారు. సవాళ్లు.. తయారీ కేంద్రాల్లో మరింత మంది మహిళలను తీసుకునే విషయంలో ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి టాటా మోటార్స్ చీఫ్ హ్యుమన్ రీసోర్సెస్ ఆఫీసర్ రవీంద్ర కుమార్ వివరించారు. ‘‘ఆటోమొబైల్ రంగం మొదటి నుంచీ పురుషుల ఆధిపత్యంతో కొనసాగుతోంది. టెక్నీషియన్లు, విక్రేతలు, ఇంజనీర్లుగా మహిళలు రావడం అన్నది ఓ కల. కానీ ఇందులో క్రమంగా మార్పు వచ్చింది. ఐటీఐ, 12వ తరగతి చదివిన మహిళలకు రెండు, మూడేళ్ల పాటు సమగ్రమైన శిక్షణ ఇచ్చేందుకు కౌశల్య కార్యక్రమాన్ని చేపట్టాం. దీని తర్వాత వారు బీఈ/బీటెక్‌ను ఎంపిక చేసుకోవచ్చు. లేదంటే కంపెనీ ఉద్యోగిగా కొనసాగొచ్చు’’అని వివరించారు. -
హైదరాబాద్‌లో ఎంజీ మోటార్స్ సర్వీస్ సెంటర్ ప్రారంభం!
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఎంజీ మోటార్ హైదరాబాద్‌లో సరికొత్త సర్వీస్ సెంటర్ ప్రారంభించింది. ఈ సర్వీస్ సెంటర్ మంత్రి పువ్వాడ అజయ్ ప్రారంభించారు. నగరంలో కస్టమర్ల మొబిలిటీ అవసరాలను తీర్చడానికే ఈ సర్వీస్ సెంటర్‌ను ప్రారంభించినట్లు ఎంజీ మోటార్స్ ప్రతినిధులు తెలిపారు. ఇక ఎంజీ మోటార్స్ దేశ వ్యాప్తంగా 310 టచ్ పాయింట్ కేంద్రాలు ఉండగా..తెలంగాణలో 13టచ్పాయింట్లను నిర్వహిస్తుంది. 2022 చివరి నాటికి రాష్ట్రంలో 18 టచ్పాయింట్లకు విస్తరించాలని యోచిస్తుంది. ఈ సందర్భంగా ఎంజీ మోటార్ ఇండియా మార్కెటింగ్ హెడ్ ఉదిత్ మల్హోత్రా మాట్లాడుతూ అత్తాపూర్ లో ఎంజీ మోటార్స్ సర్వీస్ సెంటర్ ప్రారంభంతో తన ఉనికిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు చేరువయ్యే ప్రణాళికలకు అనుగుణంగా ఉందన్నారు. తద్వారా ఈ సదుపాయం సర్వీసు, విడి భాగాలతో పాటు ఇతర అవసరాలను అందిస్తుందని స్పష్టం చేశారు. -
ఆర్డర్లే ఆర్డర్లు,ఈ ఎలక్ట్రిక్ కారుకు భలే గిరాకీ!
న్యూఢిల్లీ: ముడి వస్తువులు, సెమీ కండక్టర్ల పెరుగుతున్న ధరలు, ఉక్రెయిన్ ఉద్రిక్తతలతో సరఫరాపరమైన సమస్యలు మొదలైనవన్ని దేశీ ఆటోమొబైల్ పరిశ్రమకు ఈ ఏడాది సవాళ్లుగా ఉండనున్నాయని ఎంజీ మోటర్ ఇండియా ప్రెసిడెంట్ రాజీవ్ చాబా తెలిపారు. ఈ ఏడాది తొలినాళ్లలో 2022లో 10 శాతం పైగా వృద్ధిని దేశీ ఆటో పరిశ్రమ అంచనా వేసిందని .. కానీ పరిస్థితులు ఇలాగే కొనసాగితే డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ‘జనవరి, ఫిబ్రవరికి ముందు చూస్తే.. ఈ ఏడాది అమ్మకాలపరంగా అత్యుత్తమంగా ఉంటుందని, 2018లో సాధించిన దానికి మించి విక్రయాలు ఉండవచ్చని భారతీయ ఆటో పరిశ్రమ ఆశాభావంతో ఉంది. 10 శాతం పైగానే వృద్ధి ఉండొచ్చని అంచనా వేసింది. కానీ ఏప్రిల్ వచ్చే సరికి పరిస్థితులు మారాయి. డిమాండ్‌కు ప్రతికూల సవాళ్లు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి‘ అని చాబా పేర్కొన్నారు. ‘లోహాల ధరలు ఎగుస్తుండటంతో ముడి వస్తువుల రేట్లు భారీగా పెరిగిపోతుండటం ఇందుకు కారణం. సెమీకండక్టర్ల ధరలు కూడా పెరిగిపోయాయి. భౌగోళిక రాజకీయ అంశాల కారణంగా .. ముఖ్యంగా ఉక్రెయిన్ ఉద్రిక్తతల వల్ల సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ద్రవ్యోల్బణం కూడా పెరిగే కొద్దీ ఆటోమోటివ్ విభాగంపైనా ప్రభావం పడవచ్చు. దీంతో డిమాండ్ తగ్గవచ్చు‘ అని ఆయన వివరించారు. ప్రస్తుతానికైతే మార్కెట్‌పై ఈ ప్రభావం ఇంకా కనిపించడం లేదని .. కానీ ఇదే పరిస్థితి కొనసాగితే కచ్చితంగా సవాళ్లు ఎదురవుతాయని చాబా వివరించారు. జియస్ వాహనానికి భారీ ఆర్డర్లు.. ప్రస్తుతానికి తమ సంస్థ విషయానికొస్తే.. ఎలక్ట్రిక్ ఎస్యూవీ జియస్ ఈవీకి నెలకు సుమారు 1,500 ఆర్డర్లు వస్తున్నాయని, కానీ తాము 300 యూనిట్లు మాత్రమే అందించగలుగుతున్నామని చాబా చెప్పారు. గ్లోస్టర్, జియస్ ఈవీలకు సంబంధించి ఈ ఏడాది మొత్తానికి సరిపడేంత ఆర్డర్లు ఉన్నాయన్నారు. ఆస్టర్, హెక్టర్ మోడల్స్ వెయిటింగ్ పీరియడ్ రెండు నుంచి ఆరు నెలల వరకూ ఉంటోందన్నారు. నెలకు 7,000 పైచిలుకు వాహనాలకు డిమాండ్ ఉండగా తాము 4,000 యూనిట్లు మాత్రమే తయారు చేయగలుగుతున్నామని చెప్పారు. ఈ నెల నుంచి తమ హలోల్ ప్లాంటులో రెండో షిఫ్ట్ కూడా ప్రారంభించామని చాబా పేర్కొన్నారు. చదవండి: ఈ బుల్లి ఎలక్ట్రిక్ కారును ఎగబడికొంటున్నారు..రేంజ్ కూడా అదుర్స్! -
చిన్న ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేయనున్న ఎంజీ మోటార్స్..! ధర ఎంతంటే..?
న్యూఢిల్లీ: వాహన తయారీలో ఉన్న ఎంజీ మోటార్ భారత్‌లో రెండవ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏడాదికి 1.75 లక్షల యూనిట్ల కార్లను తయారు చేసేసామర్థ్యంతో ఇది రానుంది. ఇందుకోసం రూ.4,000 కోట్ల దాకా వ్యయం చేయనున్నట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. గుజ రాత్లో ఇప్పటికే సంస్థకు తయారీ కేంద్రం ఉంది. ఈ ఫెసిలిటీ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 70,000 యూనిట్లు. దీనిని వచ్చే ఏడాదికల్లా 1.25 లక్షల యూనిట్లకు చేర్చనున్నారు. నూతన ప్లాంటు కోసం గుజరాత్ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తున్నట్టు ఎంజీ మోటార్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రాజీవ్ ఛాబా తెలిపారు. ‘రెండేళ్లలో 3 లక్షల యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యం సొంతం చేసుకోవాలన్నది లక్ష్యం. ఇప్పటికే ఉన్న ప్లాంటును కొనుగోలు చేయాల్సిందిగా పలు సంస్థల నుంచి ఆఫర్ అందుకున్నాం. జూన్ చివరినాటికి నూతన ప్లాంటు విషయం కొలిక్కి వస్తుంది’ అని వివరించారు. ఏడాదిలో చిన్న ఈవీ.. రెండేళ్లలో కొత్త కేంద్రం సిద్ధం అవుతుందని రాజీవ్ వెల్లడించారు. ‘ఇందుకు కావాల్సిన మొత్తాన్ని పెట్టుబడి సంస్థలు, బాహ్య వాణిజ్య రుణాలు లేదా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) ద్వారా సమకూర్చుకుంటాం. ఎఫ్‌డీఐ దరఖాస్తు ఇప్పటికీ ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది’ అని వివరించారు. గుజరాత్ ప్లాంట్ సామర్థ్యం పెంచేందుకు రూ.2,500 కోట్లు వెచ్చిస్తున్నట్టు గతేడాది కంపెనీ ప్రకటించింది. 2021లో దేశవ్యాప్తంగా సంస్థ 40,000 వాహనాలను విక్రయించింది. చిప్ కొరత ఉన్నప్పటికీ ఈ ఏడాది 70,000, వచ్చే ఏడాది 1.25 లక్షల యూనిట్ల కార్ల అమ్మకాలను నమోదు చేస్తామని కంపెనీ ధీమా వ్యక్తం చేసింది. ఎంజీ మోటార్ చిన్న ఎలక్ట్రిక్ వాహనం 2023 మార్చి–ఏప్రిల్‌లో భారత్‌లో రంగ ప్రవేశం చేయనుంది. ధర రూ.10–15 లక్షల మధ్య ఉంటుంది. కంపెనీ ప్రస్తుతం దేశంలో హెక్టార్, గ్లోస్టర్, ఏస్టర్, జడ్ఎస్ ఈవీని విక్రయిస్తోంది. చదవండి: తగ్గేదేలే..! ఎలక్ట్రిక్ కార్ల తయారీలో టాటా మోటార్స్ దూకుడు..! -
ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారు.. త్వరలో దేశంలోకి.. ధరెంతో తెలుసా?
ఉక్రెయిన్-రష్యా మధ్య ఇంకా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో, చాలా మంది పెట్రోల్ వాహనాలకు ప్రత్యామ్న్యాయంగా లభిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. దేశీయంగా కూడా ఈ-వాహనాలకు భారీగానే డిమాండ్ ఏర్పడింది. ఇలాంటి సమయంలో ప్రముఖ ఆటో-మొబైల్ తయారీ సంస్థ ఎంజి మోటార్స్ త్వరలోనే ప్రపంచంలోనే చౌకైన ఎలక్ట్రిక్ కారును విడుదల చేసేందుకు సిద్దం అవుతుంది. మన దేశంలో కూడా త్వరలో లాంచ్ చేయనున్నారు. దీని ధర రూ.10 లక్షల కంటే తక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఎంజి మోటార్స్ చైనాకు చెందిన వులింగ్ గ్లోబల్ కంపెనీతో కలిసి ఈ కారును విడుదల చేయనుంది. ఎంజి నుంచి వస్తున్న ఈ కారుకి రెండు డోర్స్ మాత్రమే ఉండనున్నాయి. ఇది చూడటానికి వులింగ్ కంపెనీక చెందిన హాంగ్ గ్వాంగ్ మీని(Hongguang Mini EV) కారు లాగా ఉండనుంది. ఈ వాహనంలో 20కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ ఉంటుంది. దీనిని ఒకసారి ఛార్జ్ చేస్తే 150 కిలోమీటర్ల వరకు వెళ్లనుంది. చైనాలో ఇలాంటి అత్యంత ప్రజాదరణ లభిస్తుంది. అందుకే, బ్రిటిష్ తయారీదారు ఎంజి మోటార్స్ అలాంటి ఒక వాహనాన్ని మన దేశంలో విడుదల చేయలని నిర్ణయించుకుంటోంది. దీనిని 2023 ప్రారంభంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం భారతదేశంలో చౌకైన ఎలక్ట్రిక్ కారుగా టాటా టిగోర్ ఈవీ ఉంది. దీని ధర రూ.11.99 లక్షలు. (చదవండి: ఆర్బీఐ ఆదేశాలకు కట్టుబడి ఉన్నాం: పేటిఎమ్) -
సరికొత్త హంగులతో విడుదలైన ఎంజీ జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కారు..!
ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ మోరిస్ గ్యారేజీస్(ఎంజీ) మోటార్స్ నేడు తన స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్(ఎస్యువీ) 'జెడ్ఎస్ ఈవీ' అప్డేట్ వెర్షన్ కారును భారతదేశంలో లాంఛ్ చేసింది. ఎంట్రీ లెవల్ ఎక్స్ ప్లోజ్ వేరియంట్ కొత్త ధర ఇప్పుడు రూ.21.99 లక్షల అయితే, టాప్ వేరియంట్ కారు ధర రూ.25.88 లక్షలు(ఎక్స్ షోరూమ్, ఇండియా)గా ఉంది. గత వెర్షన్ కార్లతో పోలిస్తే ఈ కొత్త కారులో అనేక మార్పులు చేశారు. గతంలో ఉన్న డీప్ కాన్కేవ్ లే అవుట్ స్థానంలో ఎన్క్లోజ్డ్ గ్రిల్‌ను అమర్చారు. ఇక ఎంజీ లోగోకు పైన ఉన్న ఛార్జింగ్ సాకెట్‌ను మార్చారు. దానిని లోగోకు ఎడమ భాగంలోకి అమర్చారు. ద్ద సెంట్రల్ ఎయిర్ డ్యామ్, చివర్లలో నిలువు ఇంటేక్స్తో బంపర్ డిజైన్‌ను తీర్చిదిద్దారు. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అప్డేట్ చేశారు. వెనుక సీట్లకూ ఆర్మ్‌రెస్ట్‌ను అమర్చారు. వెనుక సీట్లకు ఏసీ వెంట్లు, సెంటర్ హెడ్ రెస్ట్‌ను కూడా అందుబాటులో ఉంచారు. ఇందులో 50.3కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంది. దీనిని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 461 కిలోమీటర్ల (ఐసీఏటీ ప్రకారం) వరకు వెళ్లగలదు అని ఎంజీ మోటార్స్ పేర్కొంది. ఇది మునుపటి వెర్షన్ క్లెయిమ్ చేసిన రేంజ్ కంటే 42 కిలోమీటర్లు ఎక్కువ. ఫెర్రిస్ వైట్, కర్రంట్ రెడ్, అషెన్ సిల్వర్, సాబుల్ బ్లాక్ అనే నాలుగు కలర్ రంగులలో కొత్త జెడ్ఎస్ కారు లభిస్తుంది. కేవలం 8.5 సెకన్లలోనే 0-100 కి.మీ/గం వేగాన్ని అందుకుంటుంది. ఇది 176హెచ్‌పి పవర్, 353 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు టాటా నెక్సన్ ఈవీ, హ్యుందాయ్ కోనాకు పోటీగా నిలుస్తుంది. జడ్ఎస్ కారు వైర్ లెస్ ఛార్జింగ్, డిజిటల్ బ్లూటూత్ కీ, పనోరమిక్ సన్ రూఫ్, అప్ డేట్ చేసిన ఐ-స్మార్ట్ కనెక్టెడ్ కార్ టెక్, 6 ఎయిర్ బ్యాగులతో కూడా వస్తుంది. కొత్త జడ్ఎస్ ఈవీలో 10.1 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, కొత్త 7.0 అంగుళాల డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. లేన్ ఛేంజ్ అసిస్టెన్స్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, హిల్ డీసెంట్ కంట్రోల్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ వంటి 360 డిగ్రీల కెమెరా జబర్దస్ట్ ఫీచర్స్ ఉన్నాయి. (చదవండి: 'బాబూ పుతిన్..మనదగ్గర బేరాల్లేవమ్మా') -
ఎలక్ట్రిక్ వెహికల్స్ యూజర్లకు గుడ్‌న్యూస్.. మరిన్ని ఛార్జింగ్ స్టేషన్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా కొత్త విభాగాన్ని ప్రకటించింది. ఎంజీ చార్జ్ పేరుతో ఎలక్ట్రిక్ వాహనాలకు కావాల్సిన చార్జింగ్ మౌలిక వసతులను కల్పిస్తారు. 1,000 రోజుల్లో దేశవ్యాప్తంగా నివాస ప్రాంతాల్లో 1,000 చార్జింగ్ కేంద్రాలను స్థాపించాలని కంపెనీ నిర్ణయించింది. సూపర్‌ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకై ఎంజీ మోటార్ ఇటీవలే ఫోర్టమ్, టాటా పవర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. -
ఏపీలో ఎంజీ మోటార్.. మరో రెండు ఔట్లెట్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా నెల్లూరు, తిరుపతిలో షోరూంలను ప్రారంభించింది. ఇప్పటికే ఏపీలో సంస్థకు 10 టచ్‌పాయింట్స్ ఉన్నాయి. మరో ఆరు కేంద్రాలు డిసెంబర్‌కల్లా ఏర్పాటు కానున్నాయి. దేశవ్యాప్తంగా ఎంజీ మోటార్ ఇండియాకు 307 ఔట్లెట్స్ ఉన్నాయి. -
గుడ్‌న్యూస్ వైజాగ్! నగరంలో ఈవీ చార్జింగ్ స్టేషన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇండియా వైజాగ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేసింది. 25 కిలోవాట్ సూపర్‌ఫాస్ట్ చార్జింగ్ కేంద్రాన్ని టాటా పవర్ సహకారంతో అందుబాటులోకి తెచ్చింది. ఎంజీ మోటార్ ఇప్పటికే దేశవ్యాప్తంగా 41 నగరాల్లో 44 సెంటర్స్‌ను ప్రారంభించింది. ఈజీ చార్జ్ బ్రాండ్ కింద టాటా పవర్ 180 నగరాలు, పట్టణాల్లో 1,000కిపైగా ఈవీ చార్జింగ్ కేంద్రాలను స్థాపించింది. -
అదిరిపోయిన ఎంజీ మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ కారు.. రేంజ్ కూడా అదుర్స్!
ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ ఇండియా జెడ్ఎస్ ఈవీ 2022 మోడల్ ఎలక్ట్రిక్ కారును త్వరలో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. బ్రిటిష్ ఆటోమేకర్ ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యువిని అక్కడ విడుదల చేసింది. భారతదేశంలో విడుదల కానున్న మోడల్ కారుతో పోలిస్తే ఇది భిన్నంగా కనిపిస్తుంది. యుకెలో, ఎంజీ మోటార్స్ కొత్త జెడ్ఎస్ ఈవీ ధరను కూడా ప్రకటించింది. దీని ధర 28,190 పౌండ్ల నుంచి 34,690 పౌండ్ల మధ్య ఉంటుంది. మన దేశ కరెన్సీలో ₹28.48 లక్షల నుంచి ₹35.05 లక్షలు(ఎక్స్ షోరూమ్) వరకు ఉండనుంది. మన దేశంలో లాంఛ్ చేసిన తర్వాత 2022 ఎంజి జెడ్ఎస్ ఈవీ కారు టాటా నెక్సన్ ఈవీ, హ్యుందాయ్ కోనా ఈవీతో పోటీ పడనుంది. 2022 జెడ్ఎస్ ఈవీ ఆర్కిటిక్ వైట్, బ్లాక్ పెర్ల్, బాటర్ సీ బ్లూ, మాన్యుమెంట్ సిల్వర్, డైనమిక్ రెడ్ అనే ఐదు విభిన్న రంగులలో లభ్యం అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ ఎస్యువి కొత్త డిజైన్ అలాయ్ వీల్స్'తో వస్తుంది. ప్రస్తుతం, లభిస్తున్న ఎలక్ట్రిక్ కారుతో పోల్చుకుంటే, ఈ కొత్త మోడల్ ఎక్స్టీరియర్, ఇంటీరియర్ పరంగా భారీ మార్పులు చేర్పులను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇందులో ముందు వైపు చేయబోయే అప్డేట్లు, కంపెనీ ఇటీవల విడుదల చేసిన ఎమ్‌జి ఆస్టర్ డిజైన్‌కు చేరువగా ఉండే అవకాశం ఉంది. ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీలో కొత్త ఫ్రంట్ గ్రిల్, కొత్త హెడ్లైట్లు, కొత్త టెయిల్‌ల్యాంప్‌లతో పాటుగా మరికొన్ని ఎక్స్టీరియర్ అప్‌గ్రేడ్స్ ఉండనున్నాయి. ఇంకా ఇందులో కొత్త బంపర్స్, ముందు వైపు పెద్ద ఎయిర్ ఇన్‌టేక్‌లతో ఇది మరింత ఏరోడైనమిక్‌గా కనిపించనుంది. లోపలి భాగంలో, అప్డేట్ చేయబడిన ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన కొత్త 10.1 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఎంజీ ఈస్మార్ట్ ప్లాట్‌ఫారమ్‌తో కూడిన కనెక్టింగ్ టెక్నాలజీ వంటి ఫీచర్లు కూడా ఉండనున్నాయి. 622 కిలోమీటర్ల రేంజ్ ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ 2022 రెండు విభిన్న బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ల్లో లభ్యం అవుతుంది. ఒకటి 51 కి.డబ్ల్యుహెచ్ బ్యాటరీ ప్యాక్, రెండవది 73 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ ప్యాక్. ఇ 73 కెడబ్ల్యుహెచ్ వాటర్ కూల్డ్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ పవర్డ్ ఎమ్‌జి జెడ్ఎస్ ఈవీ 2022 622 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది అని బ్రిటిష్ ఆటోమేకర్ పేర్కొంది. 51 కి.డబ్ల్యుహెచ్ బ్యాటరీ ప్యాక్ గల కారు 333 కిమీ రేంజ్ అందించనున్నట్లు తెలుస్తుంది. ఈ ఎస్యువి కారు 156 పీఎస్ పవర్, 280 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 8.2 సెకన్లలో గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదూ. కొత్త జడ్ఎస్ ఈవి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. దీని బ్యాటరీ సుమారు ఒక గంటలో 80 శాతం ఛార్జ్ కూడా కానుంది. (చదవండి: పొదుపు ఖాతా వడ్డీరేట్లను సవరించిన ఆ మూడు బ్యాంకులు..!) -
ఎంజీ మోటార్స్ అరుదైన ఘనత..! భారత్‌లో తొలి కంపెనీగా..!
ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీలతో సమానంగా ఎన్ఎఫ్టీ(నాన్ ఫంజిబుల్ టోకెన్స్)పై భారీ ఆదరణ లభిస్తోంది. నాన్ ఫంజిబుల్ టోకెన్స్‌ను ఆదరించే వాటిలో ప్రముఖ దిగ్గజ కంపెనీలు కూడా చేరాయి. ఇప్పటికే పెప్సీ, టాకో బెల్, బర్గర్ కింగ్, మెక్‌డొనాల్డ్స్ వంటి కంపెనీలు తమ ప్రత్యేక ఎన్ఎఫ్టీ కలెక్షన్లను తీసుకువచ్చాయి. తాజాగా వీటి సరసన బ్రిటన్ ఆటోమొబైల్ దిగ్గజం ఎంజీ మోటార్స్ కూడా చేరింది. మొట్టమొదటి కంపెనీగా ఎంజీ మోటార్స్..! ఎంజీ మోటార్స్ భారత్‌లో నాన్-ఫంజిబుల్ టోకెన్ల సిరీస్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో భారత ఆటోమొబైల్ సెక్టార్లో ఎన్ఎఫ్టీలను పరిచయం చేసిన మొట్టమొదటి కంపెనీగా ఎంజీ మోటార్స్ నిలవనుంది. సుమారు 1,111 యూనిట్ల డిజిటల్ క్రియేటివ్ ఎన్ఎఫ్టీలను ఎంజీ మోటార్స్ విడుదల చేయనుంది. డిసెంబర్ 28 నుంచి ఎంజీ మోటార్స్ ఎన్ఎఫ్టీ కలెక్షన్స్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. ఎన్ఎఫ్టీ అమ్మకాల కోసం KoineArthకు చెందిన NgageN ప్లాట్‌ఫారమ్ ఎంజీమోటార్స్ కలిసి పనిచేయనుంది. ఈ ఎన్ఎఫ్టీలు ఫోటోస్, గిఫ్, స్టాటిక్ ఇమేజ్స్ రూపంలో ఉండనున్నాయి. చదవండి: ఎన్ఎఫ్టీలో పెట్టుబడులు పెట్టిన ఇండియన్ సెలబ్రిటీస్ వీళ్లే.. నాలుగు రకాలైన ఎన్ఎఫ్టీలు..! 1111 యూనిట్ల డిజిటల్ క్రియేటివ్ ఎన్ఎఫ్టీలను ఎంజీ మోటార్స్ 4 "C" విభాగాలుగా విభజించింది. కలెక్టబుల్స్, కమ్యూనిటీ అండ్ డైవర్సిటీ, కోల్బరేటివ్ ఆర్ట్, కార్ యాజ్ ఏ ప్లాట్ ఫాం ఎన్ఎఫ్టీలుగా విభజించిన్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. విరాళంగా బాలికల కోసం..! ఈ ఎన్ఎఫ్టీలను విక్రయించడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని బాలికల విద్య కోసం ఖర్చు చేస్తామని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా రేషన్, వైద్య సహాయాన్ని అందించనుంది. గత త్రైమాసికంతో పోలిస్తే 8 రెట్లు అధికం..! ప్రపంచవ్యాప్తంగా ఎన్ఎఫ్టీ మార్కెట్స్ గణనీయమైన వృద్ధిని సాధిస్తున్నాయి. 2021 మూడో త్రైమాసికంలో ఎన్ఎఫ్టీల అమ్మకాల పరిమాణం గత త్రైమాసికంతో పోలిస్తే ఎనిమిది రెట్లు పెరిగింది. సుమారు 10.7 బిలియన్ డాలర్లకు(రూ. 79,820 కోట్లు) చేరిందని ఎన్ఎఫ్టీ మార్కెట్ ట్రాకర్ DappRadar ఒక నివేదికలో వెల్లడించింది. చదవండి: జస్ట్ ఒక్క ఫోటో కోసం రూ. 500 కోట్లు ఖర్చు చేసిన ఇండియన్..! అది కూడా మన కోసమే.. -
వచ్చే ఏడాదిలో ఎంజీ ఎలక్ట్రిక్ వెహికిల్, రేంజ్ ఎంతంటే..
న్యూఢిల్లీ: వాహన తయారీలో ఉన్న ఎంజీ(Morris Garages) మోటార్ ఇండియా రూ.10–15 లక్షల్లో ఎలక్ట్రిక్ వెహికిల్‌ను ప్రవేశపెట్టనుంది. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకున్న ఈ క్రాస్ఓవర్ భారత మార్కెట్‌కు తగ్గట్టుగా మార్పులు చెందనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం చివర్లో ఇది అందుబాటులోకి వస్తుందని కంపెనీ ప్రెసిడెంట్, ఎండీ రాజీవ్ ఛాబా తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో ఎంజీ జడ్ఎస్ ఈవీ రెండు వేరియంట్లలో లభిస్తోంది. ఎక్స్‌షోరూంలో ధర రూ.21 లక్షల నుంచి ప్రారంభంగా తెలుస్తోంది. చదవండి: ఎలక్ట్రిక్ వాహనాలకు స్టార్టప్‌ల జోరు! -
దేశంలో జోరందుకున్న ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు
Electric Cars Breaks Sales Records in India: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు జోరందుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎలక్ట్రిక్ స్కూటర్, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, ఈవీ వాహన ధరలు తగ్గడం వల్లే అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణం అని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో(ఏప్రిల్ 2021 - సెప్టెంబర్ 2021) మొత్తం 6,261 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. ఈవీ కార్ల అమ్మకాల్లో ఇది ఒక కొత్త రికార్డు. గత ఏడాది ఇదే కాలంలో(ఏప్రిల్ 2020 - సెప్టెంబర్ 2020) 1,872 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 234 శాతం అమ్మకాలు పెరిగాయి. నెంబర్ వన్ టాటా నెక్సన్ ఈవీ ఈ అమ్మకాల్లో ఎక్కువగా టాటా నెక్సన్ ఈవీ కార్లు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో 3,618 యూనిట్లు విక్రయించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ అమ్మకాలు 214 శాతం అధికం. మొత్తం అమ్మకాల్లో అమ్మకాల పరంగా ఏంజీ జెడ్ఎస్ ఈవీ రెండో స్థానాన్ని పొందింది. హెచ్1 ఎఫ్ వై21-22లో 1,789 యూనిట్లను విక్రయించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ అమ్మకాలు 250 శాతం అధికం. 801 యూనిట్ల అమ్మకాలతో టాటా టిగోర్ ఈవీ మూడవ స్థానంలో నిలిచింది. ఈ ఎలక్ట్రిక్ కారు 701 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది. హ్యుందాయ్ కోనా అమ్మకాల పరంగా నాల్గవ స్థానాన్ని కలిగి ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో 51 యూనిట్లు విక్రయించింది. కానీ, గత ఏడాదితో పోలిస్తే 50 శాతం తగ్గాయి. ఆ తర్వాత స్థానంలో మహీంద్రా వెరిటో ఉంది. ఈ ఆరు నెలల కాలంలో మహీంద్రా 2 యూనిట్లను మాత్రమే విక్రయించగలిగింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 75 శాతం అమ్మకాల క్షీణతను నమోదు చేసింది. సమీప భవిష్యత్తులో భారత మార్కెట్లో మరిన్ని ఈవీలు విడుదల కానున్నాయి. మహీంద్రా అండ్ మహీంద్రా త్వరలో ఈకెయువీ100ని లాంచ్ లాంచ్ చేయనున్నట్లు సమాచారం. టాటా మోటార్స్ కూడా త్వరలో మరిన్ని ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయనుంది. ఈ వరుసలో ఆల్ట్రోజ్ ఈవీ, పంచ్ ఈవీ ఉన్నాయి. ఏంజీ మోటార్ ఇండియా కూడా కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు గతంలో ప్రకటించింది. హ్యుందాయ్, కియా కూడా కొన్ని ఈవీలను ప్రారంభించాలని యోచిస్తున్నాయి. (చదవండి: జియో ఫోన్ అమ్మకాలు ప్రారంభం, ఎలా కొనాలో తెలుసా..?) -
హాట్‌కేకుల్లా అమ్ముడైన ఎమ్జీ ఆస్టర్..!
ప్రముఖ బ్రిటిష్ ఆటోమొబైల్ దిగ్గజం మోరిస్గ్యారేజ్ భారత్ మార్కెట్లలోకి ఎమ్జీ ఆస్టర్‌ను అక్టోబర్ 11న లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఎమ్జీ ఆస్టర్ కార్ మిడ్ సైజ్ ఎస్యూవీ ప్రీ బుకింగ్స్ నేడు (అక్టోబర్ 21) ప్రారంభమయ్యాయి. ప్రి బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ఎమ్జీ ఆస్టర్‌ను కొనుగోలుదారులు ఎగబడి కొన్నారు. బుకింగ్స్ ఒపెన్ చేసిన 20 నిమిషాల్లో 5 వేల ఎమ్జీ ఆస్టర్ హాట్‌కేకుల్లా అమ్ముడైనాయి. ఈ కార్లను వచ్చే నెల నవంబర్‌లో డెలివరీ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రి బుకింగ్స్ సమయంలో కొనుగోలుదారులు రూ. 25 వేలను చెల్లించారు. ఈ ఏడాదిగాను 5 వేల ఎమ్జీ ఆస్టర్ కార్లను కంపెనీ ప్రి-బుకింగ్స్‌ను ఉంచింది. ఈ ఏడాదిగాను ఎమ్జీ ఆస్టర్ కార్ సేల్స్ పూర్తిగా అమ్ముడైనట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎమ్జీ ఆస్టర్‌ను కొనాలంటే వచ్చే ఏడాది వరకు నిరీక్షించాల్సిందే. ఎమ్జీ ఆస్టర్ ఎక్స్‌షోరూమ్ ధర రూ 9.78 లక్షల నుంచి రూ. 17.38 లక్షలకు అందుబాటులో ఉంది. భారత తొలి ఏఐ పవర్డ్ కార్..! భారత ఆటోమొబైల్ మార్కెట్లో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారుగా ఎమ్జీ ఆస్టర్ నిలవనున్నట్లు తెలుస్తోంది. కారు ఇంటిరియర్స్లో భాగంగా 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను ఏర్పాటుచేశారు. ఈ కారు జియో ఈ-సిమ్‌తో కనెక్టింగ్ సదుపాయాన్ని కలిగి ఉంది. కారులో ఏర్పాటుచేసిన ఏఐ ఆధారిత రోబోట్ వ్యక్తిగత సహాయకుడిగా వినియోగదారుడికి వాయిస్ ఆదేశాలతో సమాధానమిస్తుంది. వికీపీడియా, జోక్స్, న్యూస్, ఎమోజి, చిట్-చాట్, ఫెస్విల్లే గిఫ్ట్, నావిగేషన్, మ్యూజిక్ సెలెక్ట్, వంటి ఫీచర్లు కారులో ఉన్నాయి. ఎమ్జీ గ్లోస్టర్, మహీంద్రా ఎక్స్‌యూవీ700 వంటి ఎస్‌యూవీలోని అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్(ఎడీఎఎస్) తో రానుంది. ఎమ్జీ ఆస్టర్‌లో లేన్ చేంజ్ అసిస్ట్, ఆరు ఎయిర్బ్యాగ్స్లను, ఇంటెలిజెంట్ హెడ్‌ల్యాంప్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, స్పీడ్ అసిస్ట్ సిస్టమ్, లేన్ కీప్ అసిస్ట్, వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి. MG ఆస్టర్ ఇంజన్ విషయానికి వస్తే రెండు పెట్రోల్ ఇంజన్ వేరియంట్ ఆప్షన్లతో రానుంది. మొదటి వేరియంట్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ 110 హెచ్‌పీ పవర్, 144 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గేర్‌బాక్స్ విషయానికి వస్తే ఆటో, మాన్యువల్ గేర్‌బాక్స్‌తో రానుంది. రెండో వేరియంట్ 1.3లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో 140 హెచ్‌పీ సామర్థ్యంతో 220 టార్క్‌ను ఉత్పతి చేస్తోంది. ఈ వేరియంట్లో 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సిస్టమ్ అందుబాటులో ఉంది. -
ఎలక్ట్రిక్ వెహికల్ చరిత్రను మార్చిన టెస్లా
ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల చూస్తే.. సామాన్యుడు బయటకి వెళ్లాలంటే బయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ ధరల ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఎలక్ట్రిక్ వాహన కంపెనీలు తమకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. నిన్న, మొన్న మొన్నటి వరకు ఎలక్ట్రిక్ వాహనాలు అంటే.. అమ్మో అనే ప్రజలు నేడు వాటి కొనుగోళ్లవైపు ఆసక్తి కనబరుస్తున్నారు. అలాగే, కాలం కలిసి రావడం వల్ల ఎలక్ట్రిక్ వాహన ధరలు కూడా భారీగా తగ్గుతున్నాయి. అయితే, చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలు గత 10 ఏళ్ల నుంచి మాత్రమే అందుబాటులో ఉన్నాయి అనుకుంటున్నారు. అలా అనుకుంటే పొరపాటే!. వీటికి ఒక చరిత్ర ఉంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహన చరిత్ర గురుంచి తెలుసుకుందాం. ఎలక్ట్రిక్ వాహనాల చరిత్ర మొదటి సారిగా 1830లో ప్రారంభమైంది. ఎలక్ట్రిక్ వాహనంలో గ్యాసోలిన్-శక్తితో పనిచేసే మోటారు కాకుండా ప్రొపల్షన్ కోసం ఎలక్ట్రిక్ మోటారును ఉపయోగిస్తారు. ఎలక్ట్రిక్ కారుతో పాటు, బైక్‌లు, మోటారు సైకిళ్ళు, పడవలు, విమానాలు, రైళ్లు అన్నీ విద్యుత్తుతో నడిచే అవకాశం ఉంది. ప్రస్తుతం నడుస్తున్నాయి కూడా... ఎలక్ట్రిక్ వెహికల్ ప్రారంభం 1828లో హంగేరియన్ అన్యోస్ జెడ్లిక్ అతను ఎలక్ట్రిక్ మోటారుతో నడిచే చిన్న తరహా మోడల్ కారును కనుగొన్నాడు. సుమారు 1832లో రాబర్ట్ ఆండర్సన్ మొదటి క్రూడ్ ఎలక్ట్రిక్ వాహనాన్ని అభివృద్ధి చేస్తాడు. 1835లో మరొక చిన్న-తరహా ఎలక్ట్రిక్ కారును హాలండ్‌లోని గ్రోనింగెన్‌కు చెందిన ప్రొఫెసర్ స్ట్రాటింగ్, అతని సహాయకుడు క్రిస్టోఫర్ బెకర్ కలిసి రూపొందించారు. 1835లో వెర్మోంట్లోని బ్రాండన్ కు చెందిన కమ్మరి థామస్ డావెన్‌పోర్ట్ ఒక చిన్న తరహా ఎలక్ట్రిక్ కారును నిర్మించాడు.(చదవండి: Starlink: శాటిలైట్ ఇంటర్నెట్పై అసహనం) 1842లో థామస్ డేవెన్పోర్ట్, స్కాట్స్ మాన్ రాబర్ట్ డేవిడ్సన్ ఇద్దరూ కలిసి ఒక ఎలక్ట్రిక్ వాహనాన్ని విజయవంతంగా తయారు చేశారు. కానీ, దీనిని చార్జ్ చేయాలంటే కొంచెం కష్టం అయ్యేది. ఫ్రెంచ్ వ్యక్తి గాస్టన్ ప్లాంటే 1865లో ఒక మంచి బ్యాటరీని కనుగొన్నాడు. దానిలో సమస్యలు రావడంతో అతని తోటి దేశస్థులు కామిల్లె ఫౌర్ 1881లో ఎలక్ట్రిక్ శక్తిని నిల్వ ఉంచుకునే బ్యాటరీని మరింత మెరుగుపరిచారు. ఎలక్ట్రిక్ వాహనాలు నడవాలంటే ముఖ్యంగా బ్యాటరీ అవసరం. 1899లో బెల్జియంలో నిర్మించిన ఎలక్ట్రిక్ రేసింగ్ కారు 68 మైలు వేగంతో వెళ్లి ప్రపంచ రికార్డు సృష్టించింది. దీనిని కామిల్లె జెనాట్జీ రూపొందించారు. 1900-1920 ఎలక్ట్రిక్ కార్లను ఉదయం ప్రారంభించడానికి చాలా సమయం పట్టేది. తర్వాత ఫోర్డ్ ఒక చౌకగ్యాస్ కారుని తయారు చేసింది. ఫోర్డ్ మోటార్ కంపెనీ మోడల్ టి పేరుతో పరిచయం చేసింది. అప్పట్లో ఇది చాలా ఉపయోగపడినప్పటికి అనుకున్నంత రాణించలేక పోయింది.జనరల్ మోటార్స్ కాడిలాక్ టూరింగ్ ఎడిషన్ కింద ఎలక్ట్రిక్ వాహనాన్ని పరిచయం చేస్తుంది. తర్వాత దశాబ్దాలలో గ్యాసోలిన్, డీజిల్ కార్ల జోరు పెరడంతో ఎలక్ట్రిక్ కార్లు కొద్ది కాలం పాటు కనుమరుగు అయ్యాయి. ఎలక్ట్రిక్ కార్ల పరిమిత డ్రైవింగ్ రేంజ్, ఎక్కువ ఛార్జింగ్ సమయం, భారీ బ్యాటరీల వల్ల నిలదొక్కుకోలేక పోయింది.(చదవండి: నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ 'స్క్విడ్ గేమ్' మరో రికార్డు) 1961-1970 ప్రధాన ఆటోమేకర్లు ఎలక్ట్రిక్ కార్ల తయారిని అపలేదు. బ్యాటరీలతో రన్ చేయడానికి జనరల్ మోటార్స్ ప్రయోగాలు చేసింది. అమెరికన్ మోటార్స్ కార్పొరేషన్ అమిట్రాన్ అనే ప్రోటోటైప్ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. కేవలం కొన్ని సంవత్సరాలలో అమిత్రాన్ ను అమ్మకానికి తీసుకొని రావాలని యోచిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కానీ అలా, జరగలేదు.(చదవండి: మహీంద్రా థార్‌కు పోటీగా మారుతి నుంచి అదిరిపోయే కార్...!) 1971 -1980 ఆ తర్వాత ఫ్లోరిడాలోని సెబ్రింగ్-వాన్ గార్డ్ కంపెనీ సిటీకార్ పరిచయం చేసింది. ఇది కొన్ని సంవత్సరాలలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా మారింది. చివరికి 4,400 కంటే ఎక్కువ కార్లు అమ్ముడయ్యాయి. సిటీకార్ టాప్ స్పీడ్ గంటకు 38 మైళ్లు. కానీ, ఆ తర్వాత ఈవీ కూడా కనుమరుగు అయ్యాయి. లిథియం-అయాన్ బ్యాటరీ గుండె అయిన కోబాల్ట్-ఆక్సైడ్ క్యాథోడ్ ను జాన్ గుడ్ ఎనౌన్, అతని సహచరులు ఆక్స్ ఫర్డ్ విశ్వ విద్యాలయంలో కనుగొన్నారు. రాబోయే దశాబ్దాల్లో, ఈ ఆవిష్కరణ ద్వారా సాధ్యమైన బ్యాటరీల వస్తాయి అని పేర్కొన్నారు. 2019లో గుడ్ ఎనౌన్, మరో ఇద్దరు పరిశోధకులకు లిథియం-అయాన్ బ్యాటరీలను అభివృద్ధి చేసినందుకు నోబెల్ బహుమతి లభించింది. 2000-2010 2003లో స్థాపించబడిన టెస్లా మోటార్స్ కంపెనీ మొదటి కారు టెస్లా రోడ్ స్టర్ రహదారి మీదకు రావడంతో ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఇది రెండు సీట్ల స్పోర్ట్స్ కారు. దీని ధర $80,000 కంటే ఎక్కువ. ఇది ఒకసారి చార్జ్ చేస్తే 200 మైళ్ల కంటే ఎక్కువ వెళ్ళగలదు. దీనిలో లిథియం-అయాన్ బ్యాటరీలను ఉపయోగించారు. ఇక ఆ తర్వాత నుంచి అనేక కంపెనీలు ఎలక్ట్రిక్ కార్ల తయారీ వైపు మొగ్గు చూపాయి. ఇప్పుడు ప్రస్తుతం మనదేశంలో టాటా మోటార్స్, హ్యూందాయి, టెస్లా, ఎంజి మోటార్స్ ఎలక్ట్రిక్ కార్లను తీసుకొనివస్తున్నాయి. -
ఎంజీ ఆస్టార్ వచ్చేసింది. ధర ఎంతంటే ?
ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌తో వస్తోన్న ఇండియన్ ఎస్‌యూవీగా చెప్పుకుంటున్న ఆస్టార్ని ఎంజీ మోటార్స్ లాంచ్ చేసింది. కేవలం పెట్రోలు ఇంజన్‌తోనే ఈ కారును మార్కెట్లోకి తెస్తున్నారు. ఈ ఎస్‌యూవీలో మొత్తం నాలుగు వేరియంట్లు ఉన్నాయి. వీటికి సంబంధించిన ధరల వివరాలను ఎంజీ మోటార్స్ వెల్లడిదంచింది. ఎంజీ ఆస్టార్ ఎస్యూవీ స్టైల్, సూపర్, స్మార్ట్, షార్ప్ వేరియంట్లలో లభిస్తోంది. ఇందులో వీటీఐ-టెక్ ఎంటీ , స్టైల్ ఎంట్రీ లెవల్ మోడల్‌గా ఉంది. ఈ కారు ఎక్స్‌షోరూం ధర రూ. 9,78,000లుగా ఉంది. 220 టర్బో ఏటీలో షార్ప్ మోడల్ హై ఎండ్‌గా ఉంది. ఈ కారు ధర రూ.16,78,000లుగా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా, మారుతి బ్రిజా, నెక్సా ఎస్‌క్రాస్ కార్లు మిడ్ రేంజ్ ఎస్యూవీ సెగ్మెంట్లో జోరుమీదున్నాయి. వీటికి పోటీగా ఎంజీ మోటార్స్ ఆస్టార్ని మార్కెట్లోకి తెస్తోంది. ఈకారు బుకింగ్స్కిని అక్టోబరు 21ని ప్రారంభమవుతాయని ఎంజీ మోటార్స్ తెలిపింది. నవంబరులో కస్టమర్లకు కారును డెలివరీ చేస్తామని తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా 5,000 కార్లు అమ్ముడవుతాయని అంచనా వేస్తున్నట్టు ఎంజీమోటార్స్ వెల్లడించింది. ఫీచర్ల విషయానికి వస్తే 1.5 లీటరు పెట్రోలు ఇంజను 110 పీఎస్ పవర్‌ని రిలీజ్ చేస్తుంది, టార్క్ 144 ఎన్ఎంగా ఉంది. 1.3 లీటర్ టర్బో పెట్రోలు ఇంజను 140 పీఎస్ పవర్‌తో 220ఎన్ఎం టార్క్‌ని అందిస్తుంది. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌కి సంబంధించి లెవల్ 2 టెక్నాలజీ ఫీచర్లు ఈ కారులో పొందు పరిచారు. మొత్తం 80 రకాల ఏఐ ఫీచర్లను ఈ కారు అందిస్తోంది. ఎంజీ ఆస్టర్ ఒక 3-3-3 ప్యాకేజీతో వస్తుంది, ఇందులో మూడు సంవత్సరాల వారంటీ, అపరిమిత కిలో మీటర్లు, మూడేళ్లపాటు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ లభిస్తుంది. అంతేకాదు మూడు లేబర్ ఫ్రీ పీరియాడిక్ సర్వీసులు కూడా అందిస్తోంది. ఆస్టర్ నిర్వహణా ఖర్చు కిలోమీటరుకు 47 పైసలు మాత్రమేని ఆ కంపెనీ చెబుతోంది. -
భారత తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారు ఇదే..!
ప్రముఖ బ్రిటిష్ కార్ల దిగ్గజం మోరిస్ గ్యారేజ్ భారత మార్కెట్లలోకి ఎమ్జీ ఆస్టర్ కాంపాక్ట్ ఎస్యూవీను అధికారికంగా ఆవిష్కరించింది. ఎమ్జీ ఆస్టర్‌ను ఈ పండుగ సీజన్లో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కొనుగోలుదారులకు టెస్ట్‌డ్రైవ్ కోసం సెప్టెంబర్ 19 నుంచి ఎమ్జీ మోటార్స్ కంపెనీ డీలర్ల వద్ద అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. అనేక ఆధునాతన టెక్నాలజీ ఫీచర్లు ఎమ్జీ ఆస్టర్ సొంతం. చదవండి: ఎలక్ట్రిక్ వాహన రంగంలో గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించిన స్విట్జర్లాండ్ సంస్థ..! కారు ఇంటిరియర్స్లో భాగంగా 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను ఏర్పాటుచేశారు. ఈ కారు జియో ఈ-సిమ్‌తో కనెక్టింగ్ సదుపాయాన్ని కలిగి ఉంది. కారులో ఏర్పాటుచేసిన ఏఐ ఆధారిత రోబోట్ వ్యక్తిగత సహాయకుడిగా వినియోగదారుడికి వాయిస్ ఆదేశాలతో సమాధానమిస్తుంది. వికీపీడియా, జోక్స్, న్యూస్, ఎమోజి, చిట్-చాట్, ఫెస్విల్లే గిఫ్ట్, నావిగేషన్, మ్యూజిక్ సెలెక్ట్, వంటి ఫీచర్లు కారులో ఉన్నాయి. ఎమ్జీ గ్లోస్టర్, మహీంద్రా ఎక్స్‌యూవీ700 వంటి ఎస్‌యూవీలోని అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్(ఎడీఎఎస్) తో రానుంది. ఎమ్జీ ఆస్టర్‌లో లేన్ చేంజ్ అసిస్ట్, ఆరు ఎయిర్బ్యాగ్స్లను, ఇంటెలిజెంట్ హెడ్‌ల్యాంప్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, స్పీడ్ అసిస్ట్ సిస్టమ్, లేన్ కీప్ అసిస్ట్, వంటి భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి. MG ఆస్టర్ ఇంజన్ విషయానికి వస్తే రెండు పెట్రోల్ ఇంజన్ వేరియంట్ ఆప్షన్లతో రానుంది. మొదటి వేరియంట్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ 110 హెచ్‌పీ పవర్, 144 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గేర్‌బాక్స్ విషయానికి వస్తే ఆటో, మాన్యువల్ గేర్‌బాక్స్‌తో రానుంది. రెండో వేరియంట్ 1.3లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో 140 హెచ్‌పీ సామర్థ్యంతో 220 టార్క్‌ను ఉత్పతి చేస్తోంది. ఈ వేరియంట్లో 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సిస్టమ్ అందుబాటులో ఉంది. చదవండి: Maruti Suzuki Swift : సరికొత్త రికార్డ్లను క్రియేట్ చేసిన మారుతి -
ఎంజీ ఎస్టర్ ఎస్యూవీ.... కీ ఫీచర్లు ఇవే
సాక్షి, వెబ్‌డెస్క్: ఆటోమొబైల్ ఇండస్ట్రీ టెక్నాలజీ బాట పట్టింది. ఎలక్ట్రిక్ వాహనాల జోరు కొనసాగుతుండటంతో కస్టమర్లను ఆకట్టుకునేందుకు సాంకేతిక హంగులు జోడిస్తున్నాయి. ఈ విషయంలో మిగిలిన కంపెనీల కంటే ఎంజీ మోటార్స్ ఒక అడుగు ముందే ఉంది. ఇప్పటికే రిలయన్స్ జియోతో జట్టు కట్టి నెట్ కనెక్టివిటీ అందిస్తుండగా ఇప్పుడు ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ మీద దృష్టి సారించింది. ధర తక్కువ హెక్టార్ ఎస్‌యూవీతో ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఎంజీ మోటార్, ఈసారి ఇండియన్ మార్కెట్‌కు తగ్గట్టుగా ఎస్టర్ పేరుతో ఎంట్రీ లెవల్ ఎస్యూవీసి మార్కెట్లోకి తెస్తోంది. ఎంజీ మోటార్స్ నుంచి తక్కువ ధరకు లభించే వాహనంగా ఇది ఇప్పటికే పేరు తెచ్చుకుంది. ఎస్టర్ ధర విషయంలోనే తక్కువని, ఫీచర్ల విషయంలో కాదంటోంది ఎంజీ మోటార్స్. సీఏఏపీ ఎంట్రీ లెవల్ ఎస్యూవీ సెగ్మెంట్లో డ్రైవర్ అసిస్టెంట్ అర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ వ్యవస్థ కలిగిన తొలి మోడల్‌గా ఎస్టర్ నిలవనుంది. ఇందులో ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ లెవల్ టూ టెక్నాలజీని ఉపయోగించారు. కాన్సెప్ట్ ఆఫ్ కార్ యాజ్ ఏ ప్లాట్ఫార్మ్ (సీఏఏపీ) సాఫ్ట్‌వేర్‌ని ఇందులో అందిస్తున్నారు. ఏఐ ఫీచర్లు డ్రైవర్ అసిస్టెంట్‌లో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ఫార్వర్డ్ కొలిజన్ వార్నింగ్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లైన్ కీప్ అసిస్టెంట్, లైన్ డిపాచర్ వార్నింగ్, లైట్ డిపాచర్ ప్రివెన్షన్, స్పీడ్ అసిస్ట్ సిస్టమ్ (మాన్యువల, ఇంటిలిజెంట్మోడ్), రియర్ డ్రైవ్ అసిస్టెంట్, ఇంటిలిజెంట్ హెడ్ ల్యాంప్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వాటికి పోటీగా ఈ కారు ధర ఎంత అనేది ఇంకా ఎంజీ మోటార్స్ వెల్లడించలేదు. అయితే హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ ధరల శ్రేణిలోనే ఎస్టర్ ధరలు ఉండవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. -
ఆ బుడ్డోడి పాటకు ఫిదా.. రూ. 23 లక్షల కారు గిఫ్ట్..!
Bachpan Ka Pyaar Boy: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాకు చెందిన హసదేవ్ డిర్డో అనే బాలుడు ఒక్కపాటతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన సంగతి తెలిసిందే. హసదేవ్ పాఠశాలలో ‘బచ్ పన్ కా ప్యార్ హై’ పాట పాడుతుండగా కొందరు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో ఒక్కసారిగా వైరల్‌గా మారి సామాన్యులతో పాటు సెలబ్రిటీల వరకు చేరింది. ఆ బుడతడి గొంతుకు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భాగేల్ కూడా ఫిదా అయ్యారు. హసదేవ్ డిర్డోని పిలిపించుకుని బచ్పన్ కా ప్యార్ పాట పాడించుకుని.. ఆశీర్వదించారు. ఇక అనుష్క శర్మ కూడా హసదేవ్ గొంతుకు పడిపోయారు. ఈ క్రమంలో హసదేవ్‌కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. అందేంటే హసదేవ్ పాటకు ఫిదా అయిన ఎంజీ కంపెనీ.. ఆ పిల్లాడికి 23 లక్షల రూపాయల విలువ చేసే ఎంజీ హెక్టార్ కారును బహుకరించిందనేది ఆ వార్తల సారాంశం. ఇక హసదేవ్ డిర్డో ఎంజీ కారు ముందు నిలబడి ఉన్న ఫోటో, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. వీటిలో హసదేవ్ చేతిలో కారు కీ పట్టుకుని ఉండటం.. పక్కనే కంపెనీ యజమాని, ఓ సేల్స్‌గర్ల్ ఉండటంతో అందరు ఇది నిజమని భావించారు. కానీ హసదేవ్‌కు కారు బహుకరించారనే వార్త అవాస్తవం. దీన్ని స్వయంగా ఎంజీ కంపెనీనే ప్రకటించింది. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘‘హసదేవ్ డిర్డో ఎంజీ కంపెనీ నిర్వహించిన ఓ డీలర్షిప్ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యాడు. ఆ సమయంలో హసదేవ్ కారు ముందు ఫోటో దిగాడు. ఇందుకు సంబంధించిన ఫోటో, వీడియో వైరల్ కావడంతో అందరూ మా కంపెనీ హసదేవ్‌కు ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చిందని భావించారు. అయితే ఈ వార్త అవాస్తం. ఆ కార్యక్రమానికి హాజరయినందుకు మేం హసదేవ్ డిర్డోకి కేవలం 21 వేల రూపాయలు బహుమతిగా ఇచ్చాం’’ అని వెల్లడించారు. ఇదే విషయాన్ని హస్దేవ్ కుటుంబీకులు కూడా ధ్రువీకరించారు. -
ఎంజీ గ్లూస్టర్ సావీలో కీలక మార్పులు.. ధర తగ్గనుందా?
MG Motors Glooster Saavy ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఇంటర్నెట్ కనెక్టివిటీ విషయంలో కటింగ్ టెక్నాలజీ అందించే లక్ష్యంతో ఇటీవల రిలయన్స్ జియోతో జట్టు కట్టిన ఎంజీ మోటార్స్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైఎండ్ లగ్జరీ వెహికల్‌గా ఉన్న గ్లూస్టర్లో మరో మార్పు చేసింది. ఎంట్రీ లెవల్ లగ్జరీ ఎస్యూవీ ఎంజీ మోటార్స్ సంస్థ ఎలాగైనా భారత మార్కెట్లో పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ బ్రాండ్ నుంచి ఎంజీ హెక్టార్, గ్లూస్టర్ మోడళ్లు సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్నాయి. ఎంజీ హెక్టార్ ఎస్యూవీ సెగ్మెంట్లో ఉండగా గ్లూస్టర్ ఎంట్రీ లెవల్ ప్రీమియం లగ్జరీ ఎస్యూవీ కేటగిరిలో ఉంది. గ్లూస్టర్లో సూపర్, స్మార్ట్, షార్ప్, సావీ వేరియంట్లలో ఈ కారు లభిస్తోంది. ఇందులో సూపర్, షార్ప్ వేరియంట్లు సెవన్ సీటర్లుగా ఉన్నాయి. సావీ పూర్తి లగ్జరీ కారుగా సిక్స్ సీట్ లే అవుట్తోనే మార్కెట్లో కొససాగుతోంది. ఆగస్టు 9న ఇండియన్ మార్కెట్ డిమాండ్‌కి తగ్గట్టుగా సేవీ సీటింగ్ లేవుట్‌లో మార్పులు చేసింది. సెవన్ సీటర్ కార్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని సావీ వేరియంట్లోనూ ఏడుగురు కూర్చునేలా మార్పులు చేసింది. సెవన్ సీటర్ సావీ కారుని ఆగస్టు 9న మార్కెట్లో విడుదల చేయనుంది. హై ఎండ్ మోడల్ ఎంజీ మోటార్ ఇండియాకు సంబంధించి గ్లూస్టర్ సావీనే హై ఎండ్ మోడల్. ఇందులో అనేక అధునాత ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా అడ్వాన్స్డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ సాయంతో ఈ కారును డ్రైవ్ చేయడం పార్క్ చేయడం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ స్పీడ్‌తో పాటు డిమాండ్‌ను బట్టి ఫోర్ డ్రైవింగ్‌ను సైతం అందిస్తోంది. ఇక సెవన్ డిఫరెంట్ టెర్రైన్ డ్రైవింగ్ మోడ్లు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 6 సీటర్ గ్లూస్టర్ సావీ ధర రూ. 44.59 లక్షలుగా ఉంది. సెవన్ సీటర్ లే అవుట్ ధర తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. -
కార్ల కంపెనీతో జియో ఒప్పందం.. నెట్ కనెక్టివిటీలో కొత్త శకం
ముంబై: ప్రయాణం చేసేప్పుడు మారుమూల ప్రాంతాల్లో తరచుగా ఎదురవుతున్న ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యకు చెక్ పెట్టేందుకు ఎంజీ మోటార్స్ ఇండియా, జియో నెట్‌వర్క్‌లు చేతులు కలిపాయి. అంతరాయం లేని ఇంటర్నెట్ అందిస్తామంటూ వినియోగదారులకు హమీ ఇస్తున్నాయి, ఈ మేరకు ఎంజీ మోటార్స్ ఇండియా, జియో నెట్‌వర్క్‌ల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. ఎంజీ ప్లస్ జియో మోరిసన్ గ్యారెజేస్ (ఎంజీ) ఇండియా నుంచి ఇప్పటికే హెక్టార్, గ్లూస్టర్ మోడళ్లు భారతీయ రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. కాగా త్వరలోనే మిడ్ రేంజ్ ఎస్‌యూవీని లాంఛ్ చేసేందుకు రెడీ ఎంజీ మోటార్స్ రెడీ అవుతోంది. అయితే ఈ ఎస్‌యూవీలో ఇన్ఫోంటైన్‌మెంట్‌కి సంబంధించి గేమ్ ఛేంజర్ ఫీచర్‌ని అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు ఇంటర్నెట్ కనెక్టివిటీలో సంచలనం సృష్టించిన జియో నెట్‌వర్క్‌తో జోడీ కట్టింది. నెట్ కనెక్టివిటీ త్వరలో రిలీజ్ చేయబోతున్న మిడ్ రేంజ్ ఎస్‌యూవీలో నిరంతం నెట్ కనెక్టివిటీ ఉండే ఫీచర్‌ని ఎంజీ మోటార్స్ జోడించనుంది. దీనికి సంబంధించిన సాంకేతిక సహకారం జియో నెట్వర్క్ అందిస్వనుంది. కారులో నిరంతరం నెట్ కనెక్టెవిటీ ఉండేందుకు వీలుగా ఇ-సిమ్‌తో పాటు ఇతర హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్లను జియో అందివ్వనుంది. దీంతో ఈ కారులో మారుమూల ప్రాంతాల్లో ప్రయాణించేప్పుడు కూడా 4G ఇంటర్నెట్ను పొందవచ్చు. ఏమూలనైనా కొత్తగా వస్తున్న కార్లలో ఇన్ఫోంటైన్మెంట్ విభాగంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జీపీఎస్ నావిగేషన్‌తో పాటు ఆడియో, వీడియోలకు సంబంధించి లేటెస్ట్ ఫీచర్లు యాడ్ చేస్తున్నారు. అయితే ఇంటర్నెట్ లేకపోతే ఇందులో సగానికి పైగా ఫీచర్లు నిరుపయోగమే,. దీంతో కారులో ప్రయాణించే వారు పల్లె పట్నం తేడా లేకుండా ఏ మూలకు వెళ్లినా నెట్ కనెక్టివిటీ లభిస్తుంది. టెక్నాలజీలో నంబర్ 1 జియోతో చేసుకున్న తాజా ఒప్పందం వల్ల ఆటోమొబైల్ ఇండస్ట్రీలో టెక్నాలజీకి సంబంధించి తమ బ్రాండ్ నంబర్‌వన్‌గా నిలుస్తుందని ఎంజీ మోటార్స్ ప్రెసిడెంట్స్, ఎండీ రాజీవ్ చాబా అన్నారు. కనెక్టివీటీ, ఇన్ఫోంటైన్మెంట్, స్ట్రీమింగ్, టెలిమాటిక్స్ విషయంలో ఇప్పటి వరకు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్న అవరోధాలు తీరిపోతాయని జియో ప్రెసిడెంట్ కిరణ్ థామస్ అన్నారు. -
టాప్‌గేర్‌లో వాహనాల అమ్మకాలు
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో సుస్థిరత, వినియోగదారుల విశ్వాసం పెరగడంతో ఈ జూలైలో మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి ప్రధాన వాహన కంపెనీల విక్రయాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. వ్యాధి సంక్రమణ రేటు భారీగా తగ్గుముఖం పట్టడంతో పాటు సెమి–కండెక్టర్ల సరఫరాను ఆటంకాలను ఆధిగమించి హోండా, నిస్సాన్, ఎంజీ మోటార్స్, స్కోడా కంపెనీలు అమ్మకాల్లో మెరుగైన వృద్ధిని సాధించాయి. దేశీయ వాహన దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ గతేడాది జూలైలో 1,01,307 వాహనాలను విక్రయించగా, ఈ ఏడాది జూలైలో 39 శాతం వృద్ధితో 1,41,238 వాహనాలను విక్రయించింది. హ్యుందాయ్ మోటార్ ఈ జూలైలో 48,042 వాహనాలను అమ్మింది. గతేడాది ఇదే జూలైలో విక్రయించిన 38,200 వాహనాలతో పోలిస్తే ఇది 26 శాతం అధికం. కంపెనీ జూలై2021 జూలై2020 వృద్ధి/క్షీణత మారుతీ సుజుకీ 1,41,238 1,01,307 39 హ్యుందాయ్ మోటార్స్ 48,042 38,200 26 టాటా మోటార్స్ 30,185 15,012 101 ఎంజీ మోటార్స్ 4225 2105 100 నిస్సాన్ 4,259 784 443 స్కోడా ఆటో 3,080 922 234 హోండా కార్ప్ 6,055 5,383 12 ద్విచక్రవాహనాలు హీరో మోటోకార్ప్ 5,20,104 4,54,398 (–)13 రాయల్ ఎన్ఫీల్డ్ 44,038 40,334 9 -
సింగిల్ ఛార్జ్ తో 800 కి.మీ ప్రయాణం!
ఎంజీ మోటార్స్ మార్చి 31న విడుదల కాబోయే సంస్థకు చెందిన ఎంజీ సైబర్ స్టార్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారుకు సంబందించిన కొన్ని చిత్రాలను బయటకి విడుదల చేసింది. విడుదలైన చిత్రాల ప్రకారం చూడటానికి హై ఎండ్ మోడల్ స్పోర్ట్స్ లుక్ లో కనిపిస్తుంది. ఈ కారులో చాలా ఫీచర్లు అన్నిటికంటే భిన్నంగా ఉన్నాయి. ముందుకు వంగి ఉన్న లిప్ స్పాయిలర్ల మధ్య ఎంజి లోగో ఇవ్వబడింది. ప్రపంచంలో మొట్ట మొదటి సారిగా గేమింగ్ కాక్‌పిట్‌తో వచ్చిన తోలి ఎలక్ట్రిక్ కారు ఇదే. దీని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 800 కి.మీ దూరం ప్రయాణించవచ్చు. ఎంజీ సైబర్ స్టార్ ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారు కేవలం 3 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. వినియోగదారులకు వాహనంలో 5జీ కనెక్టివిటీ కూడా లభిస్తుంది. ఎంజీ సైబర్‌స్టర్ వెనుక డిజైన్ ‘‘కాంబాక్’’ స్టైలింగ్‌ను కలిగి ఉంది. సైబర్‌స్టర్‌లో మ్యాజిక్ ఐ ఇంటరాక్టివ్ హెడ్లైట్లు ఇవ్వబడ్డాయి. కారు వైపు లేజర్ బెల్ట్ ఎల్ఈడి స్ట్రిప్ ఉంది. ఎంజీ మోటార్స్ యువతను దృష్టిలో పెట్టుకొని దీనిని తీసుకొస్తున్నట్లు అర్ధం అవుతుంది. చదవండి: డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేని ఎలక్ట్రిక్ బైక్ -
ఎంజీ హెక్టార్ సరికొత్తగా, ధర ఎంత?
సాక్షి, ముంబై: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్స్ తన ఎస్యూవీ హెక్టార్లో 8-స్పీడ్ సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్‌తో కొత్త వేరియంట్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఢిల్లీ షోరూం వద్ద దీని ప్రారంభ ధర రూ.16.51 లక్షలుగా ఉంది. మెరుగైన బ్యాటరీ ప్యాక్, చక్కటి డ్రైవింగ్ శ్రేణితో వీటిని తీసుకొచ్చింది. ఈ కొత్త వేరియంట్లో ఐదు సీట్లతో హెక్టార్ 2021, ఆరు సీట్లతో హెక్టార్ ప్లస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో పెట్రోల్ హెక్టార్ ఇప్పుడు మొత్తం నాలుగు ఆప్షన్లో లభ్యం కానుంది. మాన్యువల్, హైబ్రీడ్ మాన్యువల్, డ్యూయల్ - క్లచ్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లు ఇప్పటికే మార్కెట్లో లభిస్తున్న సంగతి తెలిసిందే. కొత్తగా ఆవిష్కరించిన సీవీటీ ఆప్షన్ వెర్షన్ ప్రయాణికులకు సౌకర్యవంతమైన, ప్రయాణాన్ని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. దీని ధర రూ. 12.89 లక్షలు నుండి రూ. 18.42 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఎంజీ హెక్టార్ సీవీటీ వేరియంట్లో స్మార్ట్, షార్ప్ ట్రిమ్ మోడళ్ల ధరలు రూ. 16.51 లక్షలు -18.09 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఆరు సీట్ల హెక్టార్లోప్లస్ కూడా కొత్త సీవీటి గేర్‌బాక్స్‌ను జోడించింది. వీటి ధరలు 17.21 లక్షలు - 18.89 లక్షలు (ఎక్స్-షోరూమ్) వద్ద లభిస్తాయి. -
మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ ఎంజీ మోటార్స్.. ఆధునీకరించిన జడ్ఎస్ ఎలక్ట్రిక్ వెహికిల్‌ను రెండు వేరియంట్లలో ప్రవేశపెట్టింది. ఇందులోని 44.5 కిలోవాట్ అవర్ బ్యాటరీతో ఒకసారి చార్జీ చేస్తే 419 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. 143 పీఎస్ పవర్, 350 ఎన్ఎం టార్క్, 8.5 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం అందుకోవడం దీని ప్రత్యేకత. ఎంజీ కొత్త జడ్ఎస్ ఎలక్ట్రిక్ వెహికిల్ పనోరమిక్ సన్‌రూఫ్, 17 అంగుళాల అలాయ్ వీల్స్, పీఎం 2.5 ఎయిర్ ఫిల్టర్ ఏర్పాటు ఉంది. 31 నగరాల్లో బుకింగ్స్‌కు జడ్ఎస్ 2021 వర్షన్ అందుబాటులో ఉంది. వినియోగదార్లకు మెరుగైన అనుభూతి కొరకు దేశంలో పెద్ద ఎత్తున చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఎంజీ మోటార్ ఇండియా ప్రెసిడెంట్, ఎండీ రాజీవ్ చాబ ఈ సందర్భంగా తెలిపారు. ప్రారంభ ధర ఢిల్లీ ఎక్స్‌షోరూంలో రూ.20.99 లక్షలు. జాగ్వార్ ఐ-పేస్ వాహన తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ మార్చి 9న జాగ్వార్ ఐ-పేస్ మోడల్‌ను భారత్‌లో ప్రవేశపెడుతోంది. ప్రపంచంలో తొలి ప్రీమియం పూర్తి ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారు ఇదేనని కంపెనీ అంటోంది. వాహనానికి 90 కిలోవాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీని పొందుపరిచారు. 696 ఎన్ఎం టార్క్, 4.8 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం అందుకోవడం దీని ప్రత్యేకత. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. 80కిపైగా అంతర్జాతీయ అవార్డులను ఈ కారు సొంతం చేసుకుంది. వీటిలో 2019లో అందుకున్న వరల్డ్ కార్ ఆఫ్ ద ఇయర్, వరల్డ్ గ్రీన్ కార్ ఆఫ్ ద ఇయర్, వరల్డ్ కార్ డిజైన్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు ఉన్నాయి. ఆఫీస్, హోం చార్జింగ్ సొల్యూషన్స్ కోసం టాటా పవర్‌తో కంపెనీ చేతులు కలిపింది. యమహా ఎఫ్‌జెడ్ మోటర్‌సైకిల్స్ కొత్త శ్రేణి జపాన్ ద్విచక్ర వాహనాల దిగ్గజం యమహా తాజాగా తమ ఎఫ్‌జెడ్ మోటర్‌సైకిల్స్ సిరీస్‌లో కొత్త శ్రేణిని ఆవిష్కరించింది. వీటి ధర రూ. 1,03,700 నుంచి (ఢిల్లీ ఎక్స్‌షోరూం) ప్రారంభమవుతుంది. కొత్త ఎఫ్‌జెడ్ సిరీస్‌లో ఎఫ్‌జెడ్ ఎఫ్ఐ, ఎఫ్జెడ్ఎస్, ఎఫ్ఐ మోడల్స్ ఉన్నాయి. బీఎస్6 ఇంజిన్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కటాఫ్ స్విచ్, ఏబీఎస్ (యాంటీ–లాక్ బ్రేకింగ్ సిస్టం), ఎల్ఈడీ హెడ్‌లైట్ వంటి ఫీచర్లతో ఇవి తేలికగా ఉంటాయని సంస్థ తెలిపింది. మోటర్‌సైకిల్ బరువును 137 కేజీల నుంచి 135 కేజీలకు తగ్గించినట్లు వివరించింది. ధర రూ. 1,03,700 నుంచి ప్రారంభం -
కారు.. జీరో
న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌తో ఆటోమొబైల్ పరిశ్రమ కుదేలైంది. చరిత్రలో మొదటిసారి.. ఏప్రిల్ మాసంలో దేశీయ మార్కెట్లో కార్లు, వాణిజ్య, ద్విచక్ర వాహన సంస్థలు ఒక్క వాహనాన్ని కూడా విక్రయించలేని పరిస్థితిని చూశాయి. కాకపోతే కొన్ని వాహనాలను మాత్రం ఎగుమతి చేయగలిగాయి. కార్ల మార్కెట్లో దిగ్గజ సంస్థలు మారుతి సుజుకీ ఇండియా(ఎంఎస్ఐ), హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) కంపెనీలు ఒక్క వాహనాన్ని కూడా ఏప్రిల్‌లో విక్రయించలేదని ప్రకటించాయి. దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా ఉత్పత్తితోపాటు, విక్రయాలకు బ్రేక్ పడడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అదే విధంగా ఎంజీ మోటార్ ఇండియా, టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం), ద్విచక్ర వాహన కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ (ఐచర్ మోటార్స్ అనుబంధ సంస్థ) సైతం దేశీయంగా విక్రయాలు సున్నాగానే ఉన్నాయని ప్రకటించాయి. ఇక మహీంద్రా అండ్ మహీంద్రా సైతం కార్లు, వాణిజ్య వాహన విభాగంలో దేశీయంగా ఒక్క యూనిట్ విక్రయాన్ని కూడా నమోదు చేయలేదు. కాకపోతే విదేశీ మార్కెట్లలో ఈ సంస్థలు కొన్ని వాహనాలను విక్రయించాయి. మారుతి సుజుకీ, హ్యుందాయ్ మోటార్, ఎంఅండ్ఎం, రాయల్ ఎన్ఫీల్డ్ ఎగుమతి చేసిన వాటిల్లో ఉన్నాయి. కొన్ని దేశాల్లో లాక్డౌన్ పరిస్థితులు లేకపోవడం వీటికి కలిసొచ్చింది. పునఃప్రారంభానికి సిద్ధం..: గ్రీన్, ఆరెంజ్ జోన్లలో కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతించడంతో దేశవ్యాప్తంగా ఆటోమొబైల్ కంపెనీలు ఈ దిశగా సన్నద్ధం అవుతున్నాయి. ఏప్రిల్ చివరి వారం లో గుజరాత్‌లోని హలోల్ ప్లాంట్ లో ఎంజీ మోటార్ ఇండియా తయారీని ఆరంభించింది. కార్యకలాపాల ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్టు టీకేఎం తెలిపింది. ఎన్నో సవాళ్లు: టయోటా వినియోగదారుల కొనుగోలు సెంటిమెంట్ తక్కువ స్థాయిలో ఉండడం, దెబ్బతిన్న సరఫరా వ్యవస్థను తిరిగి నిర్మించుకోవడం, కార్మికులు తిరిగి పనిలోకి వచ్చి చేరడం వంటి ఎన్నో సవాళ్లను పరిశ్రమ ఎదుర్కొంటోంది. ఎన్నో ఇతర రంగాల మాదిరే తయారీ, డీలర్‌షిప్‌లను మూసివేయడం వల్ల ఆటోమోటివ్ వ్యాల్యూ చైన్ పూర్తిగా నిలిచిపోయింది. తిరిగి కార్యకలాపాల ప్రారంభానికి వీలుగా డీలర్ భాగస్వాములతో సన్నిహిత సంప్రదింపులు జరుపుతున్నాం. సురక్షిత, ఆరోగ్యకరమైన వాతావరణంలో డిమాండ్‌కు ప్రేరణనిచ్చేందుకు వీలుగా వారికి మా పూర్తి మద్దతును అందిస్తున్నాం. విక్రయాలను పూర్తిగా డిజిటలైజ్ చేశాం. కస్టమర్లు కొనుగోలు చేస్తే ఇంటి వద్దకే వాహనాన్ని డెలివరీ చేసే ఏర్పాటు చేశాం. – నవీన్సోని, టీకేఎం సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ట్రాక్టర్ల డిమాండ్‌కు సానుకూలతలు: ఎంఅండ్ఎం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కొనసాగించడంతో వ్యాపారంపై ప్రభావం పడింది. కొన్ని రోజుల క్రితమే డీలర్లు పాక్షికంగా కార్యకలాపాలను ప్రారంభించారు. సమీప భవిష్యత్తులో పలు సానుకూలతలు కనిపిస్తున్నాయి. రబీ ఉత్పత్తి మంచిగా ఉండడం, ప్రభుత్వం కొనుగోళ్ల కేంద్రాలను ప్రారంభించడం, పంటలకు చక్కని ధరలు ఉంటాయన్న సంకేతాలు, రిజర్వాయర్లలో నీటి మట్టాలు.. ఇవన్నీ ట్రాక్టర్ల డిమాండ్‌ను పెంచుతాయి. కొన్ని వారాల విక్రయాలకు సరిపడా స్టాక్స్ ఉన్నాయి. లాక్డౌన్ సవరణల తర్వాత ఎన్‌బీఎఫ్‌సీల కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకోవడం, క్షేత్ర స్థాయిలో విక్రయ కార్యకలాపాలపైనే పనితీరు పురోగతి ఆధారపడి ఉంటుంది. – సందీప్ సిక్కా, మహీంద్రా ఫామ్ ఎక్విప్మెంట్ విభాగం ప్రెసిడెంట్ హెచ్ఎంఎస్ఐ చీఫ్‌గా అత్సుషి ఒగాటా హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) ప్రెసిడెంట్, సీఈవో, ఎండీగా అత్సుషి ఒగాటాను మాతృ సంస్థ హోండా మోటార్ కంపెనీ నియమించింది. ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న మినోరు కటు తిరిగి హోండా మోటార్ కంపెనీలో ఆపరేటింగ్ ఎగ్జిక్యూటివ్ పదవి చేపట్టనున్నారు. -
ఎంజీ మోటారు అమ్మకాలకు కరోనా షాక్
సాక్షి,ముంబై : కరోనా ప్రభావంతో ఆటో అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. ఇప్పటికే దేశీయ కార్ల దిగ్గజం మారుతి జీరో అమ్మకాలను నమోదు చేయగా తాజాగా ఈ జాబితాలో ఎంజీ మోటార్ ఇండియా చేరింది. దేశ వ్యాప్త లాక్డౌన్ కారణంగా విక్రయాలు సున్నా శాతానికి పడిపోయాయని సంస్థ శుక్రవారం ప్రకటనలో వెల్లడించింది. కరోనా వైరస్ మహమ్మారి కట్టడి దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా షోరూమ్‌లు మూసి వేయడంతో 2020 ఏప్రిల్ రిటైల్ అమ్మకాలు పడిపోయాయని ఎంజి మోటార్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఏప్రిల్ 2020 చివరి వారంలో హలోల్‌లోని తన సౌకర్యం వద్ద చిన్నస్థాయిలో కార్యకలాపాలు, తయారీని ప్రారంభించామని, దీంతో మే నెలలో ఉత్పత్తి తిరిగి పుంజుకుంటుందనే ఆశా భావాన్ని వ్యక్తం చేసింది. ఈ మేరకు స్థానిక సరఫరా చెయిన్ మద్దతు కోసం కృషి చేస్తున్నట్టు తెలిపింది. (కరోనా : అయ్యయ్యో మారుతి!) కాగా మార్చి 22న జనతా కర్ఫ్యూ అమలు, ఆ తరువాతి రోజునుంచి 21 రోజుల లాక్డౌన్ అమలైంది. అయినా వైరస్ కు అడ్డుకట్టపడకపోవడంతో పొడిగింపుతో మే 3 వరకు దేశవ్యాప్త లాక్ డౌన్ కొనసాగుతోంది. కరోనా వైరస్ బారిన పడకుండా వుండేందుకు ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని దేశప్రధాని పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశీయంగా, అంతర్జాతీయంగా రవాణా,ఇతర వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. అత్యవసర సేవలు, వస్తువుల విక్రయం మినహా అన్ని ఆర్థిక కార్యకలాపాలు నిలిచి పోయాయి. (లాక్డౌన్ పొడిగింపుపై ఇన్ఫీ మూర్తి స్పందన) (భారీగా తగ్గిన వంట గ్యాస్ ధర) -
ఎంజీ మోటార్స్ కార్లలో కరోనా నియంత్రణ సాంకేతికత
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్ల తయారీ కంపెనీ ఎంజీ మోటార్స్ తన కార్లలోని క్యాబిన్ ఎయిర్, ఉపరితల భాగాలను కరోనా నియంత్రణ కట్టడికి నేచురల్ స్టెరిలైజేషన్ టెక్నాలజీని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు క్యాబిన్ స్టెరిలైజేషన్ టెక్నాలజీ పేటెండ్ పొందిన సింగపూర్‌కు చెందిన మెడ్‌క్లిన్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. హెక్టార్, జెడ్ఎస్ ఈవీ కార్లలో ఏర్పాటుకు పరిశోధనలు జరుగుతున్నాయని కంపెనీ ఇండియా ఎండీ అండ్ ప్రెసిడెంట్ రాజీవ్ చాబా ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కస్టమర్ల ఆరోగ్య భద్రత దృష్ట్యా కార్ల ఉపరితల భాగాలను వైరస్ నియంత్రణ చర్యలు తీసుకోవటం అత్యవసరమన్నారు.