ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌తో వస్తోన్న ఇండియన్ ఎస్‌యూవీగా చెప్పుకుంటున్న ఆస్టార్‌ని ఎంజీ మోటార్స్ లాంచ్ చేసింది. కేవలం పెట్రోలు ఇంజన్‌తోనే ఈ కారును మార్కెట్‌లోకి తెస్తున్నారు. ఈ ఎస్‌యూవీలో మొత్తం నాలుగు వేరియంట్లు ఉన్నాయి. వీటికి సంబంధించిన ధరల వివరాలను ఎంజీ మోటార్స్ వెల్లడిదంచింది.
ఎంజీ ఆస్టార్ ఎస్‌యూవీ స్టైల్, సూపర్, స్మార్ట్, షార్ప్ వేరియంట్లలో లభిస్తోంది. ఇందులో వీటీఐ-టెక్ ఎంటీ , స్టైల్ ఎంట్రీ లెవల్ మోడల్‌గా ఉంది. ఈ కారు ఎక్స్‌షోరూం ధర రూ. 9,78,000లుగా ఉంది. 220 టర్బో ఏటీలో షార్ప్ మోడల్ హై ఎండ్‌గా ఉంది. ఈ కారు ధర రూ.16,78,000లుగా ఉంది.
ప్రస్తుతం మార్కెట్‌లో హ్యుందాయ్ క్రెటా, మారుతి బ్రిజా, నెక్సా ఎస్‌క్రాస్ కార్లు మిడ్ రేంజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో జోరుమీదున్నాయి. వీటికి పోటీగా ఎంజీ మోటార్స్ ఆస్టార్‌ని మార్కెట్‌లోకి తెస్తోంది.
ఈకారు బుకింగ్స్‌కిని అక్టోబరు 21ని ప్రారంభమవుతాయని ఎంజీ మోటార్స్ తెలిపింది. నవంబరులో కస్టమర్లకు కారును డెలివరీ చేస్తామని తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా 5,000 కార్లు అమ్ముడవుతాయని అంచనా వేస్తున్నట్టు ఎంజీమోటార్స్ వెల్లడించింది.
ఫీచర్ల విషయానికి వస్తే 1.5 లీటరు పెట్రోలు ఇంజను 110 పీఎస్ పవర్‌ని రిలీజ్ చేస్తుంది, టార్క్ 144 ఎన్‌ఎంగా ఉంది. 1.3 లీటర్ టర్బో పెట్రోలు ఇంజను 140 పీఎస్ పవర్‌తో 220ఎన్‌ఎం టార్క్‌ని అందిస్తుంది.
ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్‌కి సంబంధించి లెవల్ 2 టెక్నాలజీ ఫీచర్లు ఈ కారులో పొందు పరిచారు. మొత్తం 80 రకాల ఏఐ ఫీచర్లను ఈ కారు అందిస్తోంది. ఎంజీ ఆస్టర్ ఒక 3-3-3 ప్యాకేజీతో వస్తుంది, ఇందులో మూడు సంవత్సరాల వారంటీ, అపరిమిత కిలో మీటర్లు, మూడేళ్లపాటు రోడ్‌సైడ్ అసిస్టెన్స్ లభిస్తుంది. అంతేకాదు మూడు లేబర్ ఫ్రీ పీరియాడిక్ సర్వీసులు కూడా అందిస్తోంది. ఆస్టర్ నిర్వహణా ఖర్చు కిలోమీటరుకు 47 పైసలు మాత్రమేని ఆ కంపెనీ చెబుతోంది.
Comments
Please login to add a commentAdd a comment