AI: ప్రపంచంలో మొదటి హెల్త్‌ మానిటరింగ్‌ ఏఐ యాప్‌ ఇది.. | Harish Bisam Designed And Developed Quick Health Information AI App | Sakshi
Sakshi News home page

Artificial Intelligence: ఆరోగ్య సంరక్షణలో.. క్విక్‌ హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ యాప్‌!

Published Thu, Aug 22 2024 9:23 AM | Last Updated on Thu, Aug 22 2024 10:59 AM

Harish Bisam Designed And Developed Quick Health Information AI App

హార్ట్‌ బీట్, వైటల్‌ చెక్‌ కోసం నూతన యాప్‌

ప్రపంచంలో మొదటి హెల్త్‌ మానిటరింగ్‌ ఏఐ యాప్‌

రూపొందించి, ఆవిష్కరించిన తెలుగు వ్యక్తి

సాక్షి, సిటీబ్యూరో: ఆరోగ్య సంరక్షణలో భాగంగా యాప్‌ ఆధారిత హెల్త్‌ టూల్స్‌లోకి కూడా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) అడుగులేస్తోంది. ఇందులో భాగంగా నగరంలోని హోటల్‌ ఆవాసా వేదికగా బుధవారం ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత డీప్‌ లెరి్నంగ్‌ పవర్డ్‌ హెల్త్‌ మానిటరింగ్‌ యాప్‌ క్విక్‌ వైటల్స్‌ను ఆవిష్కరించారు.

తెలుగు వ్యక్తి, బిసామ్‌ ఫార్మాస్యూటికల్స్‌ వ్యవస్థాపకులు ఎండీ హరీష్‌ బిసామ్‌ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ యాప్‌ స్మార్ట్‌ఫోన్‌ లేదా టాబ్లెట్‌ ద్వారా కీలకమైన హెల్త్‌ డేటాను అందిస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్కో డాక్టర్‌ వంద మందికిపైగా రోగులను పరీక్షిస్తుంటారు. ఇలాంటి తరుణంలో ఈ యాప్‌లు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రక్త పరిమాణంలోని వైవిధ్యాలను కాంతి శోషణ మార్పులను విశ్లేíÙంచడానికి ఈ యాప్‌లో ఫొటోప్లెథిస్మోగ్రఫీ(పీపీజీ) అనే సాంకేతికతను వినియోగించడం విశేషం.

డేటా భద్రత, గోప్యతకు మా హామీ..
ఈ నేపథ్యంలో హరీష్‌ బిసామ్‌ మాట్లాడుతూ.. ఈ వినూత్న సాంకేతికత ఆధారంగా మొబైల్‌ యాప్‌లో కేవలం సెకన్లలో ఆరోగ్య సూచికలను ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. డాక్టర్‌ను కలవకుండానే ప్రాథమిక సమాచారాన్ని పొందడానికి ఈ యాప్‌ దోహదపడుతుందని అన్నారు. ఈ యాప్‌ కెమెరా ఆధారిత కాంటాక్ట్‌లెస్‌ స్పాట్‌ చెక్‌లు, పీపీజీ సెన్సార్‌లతో పర్యవేక్షణ చేస్తుంది. ఇది బలమైన క్లౌడ్‌ రిజి్రస్టేషన్‌తో పాటు కఠినమైన భారతీయ డేటా రక్షణ ప్రమాణాలకు కట్టుబడి ఉంటుందని, కాబట్టి డేటా భద్రత, గోప్యతకు ప్రాధాన్యతనిస్తుందని అన్నారు.

ఈ ఆవిష్కరణలో భాగంగా ఏఐ, డీప్‌ లెరి్నంగ్‌: ది ఫ్యూచర్‌ ఆఫ్‌ హెల్త్‌కేర్‌ అంశంపై ప్రత్యేకంగా ప్యానెల్‌ చర్చ నిర్వహించారు. చర్చలో ప్లానింగ్‌ బోర్డు వైస్‌ ప్రెసిడెంట్‌ చిన్నారెడ్డి, ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌ ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ ప్రొఫెసర్‌ డా.సుధ, డ్రగ్‌ కంట్రోల్‌ అథారిటీ మాజీ డైరెక్టర్‌ డా.పి.వెంకటేశ్వర్లు, డా.పూరి్ణమ, ఇన్నోవేటర్‌–ప్రొడక్ట్‌ స్పెషలిస్ట్‌ డేనియల్‌ గోల్డ్‌మన్, కాటలిస్ట్‌ వ్యవస్థాపకులు ఆండ్రూ షోస్టాక్, డాక్టర్‌ ఉషతో పాటు టెక్‌ ఔత్సాహికులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

ఇవి చదవండి: పీక్స్‌లో.. పికిల్‌ బాల్‌! సిటిజనుల్ని ఉర్రూతలూగిస్తోన్న ఆట!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement