పాత తరానికి కొత్త ఊపిరి
ప్రాచీన వైద్యం, కళ, సాంస్కృతిక పద్ధతుల కొనసాగింపు
ఒత్తిడి జీవితాలకు అప్పటి థెరపీలతో సాంత్వన
బృందావనాన్ని స్వతహాగా ప్రారంభించిన సింగర్ స్మిత..
అధునాతన జీవన విధానం పేరుతో పెంచుకుపోతున్న శరీర కాలుష్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫ్యాషన్, బ్యూటీ, ట్రెండ్స్ మాయలో పడిపోయి గత తరం ఆరోగ్యకరమైన పద్ధతులు, సంస్కృతికి సంపూర్ణంగా దూరమవుతున్నాం. ఇప్పటికైనా మేల్కొని స్వీయ సంరక్షణకు, భవిష్యత్ తరం ఆరోగ్య భద్రతకు అమ్మమ్మల కాలం నాటి పద్ధతులను అంతరించిపోకుండా ప్రయత్నం చేయాలని ప్రముఖ సింగర్ స్మిత చెబుతున్నారు. దీని కోసం నగరంలోని ఫిల్మ్ నగర్ వేదికగా ప్రత్యేకంగా ‘ఓల్డ్ స్కూల్ బృందావనం’ను ఆమె ప్రారంభించారు. – సాక్షి, సిటీబ్యూరో
తాతల కాలం నాటి ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాల్లోని పద్ధతులను నగరవాసులకు అందించాలనే లక్ష్యంతో సనాతన çపద్ధతులతో సౌందర్య పోషణ కు శ్రీకారం చుట్టారు సింగర్ స్మిత. ఓల్డ్ స్కూల్ రిచువల్స్ నేపథ్యంలో దేశంలోనే మొదటిసారిగా ‘ఓల్డ్ స్కూల్ బృందావనం’ను సొంతంగా ప్రారంభించడం సంతోషంగా ఉందని స్మిత తెలిపారు. ఈ కేంద్రం పాత తరం వైవిధ్యాన్ని కొనసాగించడమే కాకుండా ఈ తరానికి ఆరోగ్య వైద్యంగా దోహదపడుతుందని, వైద్యం, స్వీయ–సంరక్షణ, కళలకు ఏకైక స్థానంగా సంప్రదాయ పద్ధతులకు ఆధునిక లగ్జరీ సమ్మేళనాన్ని అందిస్తామని చెబుతున్నారు..
ఆనాటి వైద్యం.. ఈనాటి వైవిధ్యం..
ఈ వెల్‌నెస్ సెంటర్‌లో ప్రత్యేకమైన క్రిస్టల్ ఆయిల్–ఇన్ఫ్యూజ్డ్ థెరపీలు, నేచురోపతిక్ హీలింగ్ పద్ధతులు, చర్మం, జుట్టు, శరీర సంరక్షణ ఆచారాలను అందిస్తున్నాం. ఇవన్నీ పెద్దలతో పాటు చిన్నారులకూ పాతకాలం నలుగు సంరక్షణను అందిస్తుందని ఆమె వివరించారు. ఈ ఉత్పత్తుల్లో ఎలాంటి రసాయనాలు లేకుండా నాచురల్ ప్రొడక్ట్స్‌ను మాత్రమే వాడతామని, ఎలాంటి జీవహింస చేయకుండా, పురాతన రహస్యాల నుంచి ఉత్పత్తుల తయారీ ఉంటుందని అన్నారు. పాత పద్ధతులలే అయినప్పటికీ 8 ఏళ్లుగా సైంటిఫిక్ పరిశోధనలు చేపట్టి, దాదాపు 2 లక్షల మంది వినియోగదారులపై పరీక్షలు చేశాకే అందుబాటులోకి తీసుకువస్తున్నామని వివరించారు. ఈ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను నగరంలోనే కాకుండా మరి కొద్ది రోజుల్లో గోవా, ఫోర్ట్ కొచ్చి, చెన్నైలలో ప్రారంభించనున్నామని అన్నారు.
ఇవి చదవండి: వర్షాకాలంలోనూ వదలకుండా.. జంపింగ్ జాక్స్!
Comments
Please login to add a commentAdd a comment