Smitha
-
Singer Smita: ఓల్డ్ స్కూల్ బృందావనం! నగరంలో కొత్త కాన్సెప్ట్..
అధునాతన జీవన విధానం పేరుతో పెంచుకుపోతున్న శరీర కాలుష్యం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫ్యాషన్, బ్యూటీ, ట్రెండ్స్ మాయలో పడిపోయి గత తరం ఆరోగ్యకరమైన పద్ధతులు, సంస్కృతికి సంపూర్ణంగా దూరమవుతున్నాం. ఇప్పటికైనా మేల్కొని స్వీయ సంరక్షణకు, భవిష్యత్ తరం ఆరోగ్య భద్రతకు అమ్మమ్మల కాలం నాటి పద్ధతులను అంతరించిపోకుండా ప్రయత్నం చేయాలని ప్రముఖ సింగర్ స్మిత చెబుతున్నారు. దీని కోసం నగరంలోని ఫిల్మ్ నగర్ వేదికగా ప్రత్యేకంగా ‘ఓల్డ్ స్కూల్ బృందావనం’ను ఆమె ప్రారంభించారు. – సాక్షి, సిటీబ్యూరోతాతల కాలం నాటి ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాల్లోని పద్ధతులను నగరవాసులకు అందించాలనే లక్ష్యంతో సనాతన çపద్ధతులతో సౌందర్య పోషణ కు శ్రీకారం చుట్టారు సింగర్ స్మిత. ఓల్డ్ స్కూల్ రిచువల్స్ నేపథ్యంలో దేశంలోనే మొదటిసారిగా ‘ఓల్డ్ స్కూల్ బృందావనం’ను సొంతంగా ప్రారంభించడం సంతోషంగా ఉందని స్మిత తెలిపారు. ఈ కేంద్రం పాత తరం వైవిధ్యాన్ని కొనసాగించడమే కాకుండా ఈ తరానికి ఆరోగ్య వైద్యంగా దోహదపడుతుందని, వైద్యం, స్వీయ–సంరక్షణ, కళలకు ఏకైక స్థానంగా సంప్రదాయ పద్ధతులకు ఆధునిక లగ్జరీ సమ్మేళనాన్ని అందిస్తామని చెబుతున్నారు..ఆనాటి వైద్యం.. ఈనాటి వైవిధ్యం..ఈ వెల్నెస్ సెంటర్లో ప్రత్యేకమైన క్రిస్టల్ ఆయిల్–ఇన్ఫ్యూజ్డ్ థెరపీలు, నేచురోపతిక్ హీలింగ్ పద్ధతులు, చర్మం, జుట్టు, శరీర సంరక్షణ ఆచారాలను అందిస్తున్నాం. ఇవన్నీ పెద్దలతో పాటు చిన్నారులకూ పాతకాలం నలుగు సంరక్షణను అందిస్తుందని ఆమె వివరించారు. ఈ ఉత్పత్తుల్లో ఎలాంటి రసాయనాలు లేకుండా నాచురల్ ప్రొడక్ట్స్‌ను మాత్రమే వాడతామని, ఎలాంటి జీవహింస చేయకుండా, పురాతన రహస్యాల నుంచి ఉత్పత్తుల తయారీ ఉంటుందని అన్నారు. పాత పద్ధతులలే అయినప్పటికీ 8 ఏళ్లుగా సైంటిఫిక్ పరిశోధనలు చేపట్టి, దాదాపు 2 లక్షల మంది వినియోగదారులపై పరీక్షలు చేశాకే అందుబాటులోకి తీసుకువస్తున్నామని వివరించారు. ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్‌ను నగరంలోనే కాకుండా మరి కొద్ది రోజుల్లో గోవా, ఫోర్ట్ కొచ్చి, చెన్నైలలో ప్రారంభించనున్నామని అన్నారు.ఇవి చదవండి: వర్షాకాలంలోనూ వదలకుండా.. జంపింగ్ జాక్స్! -
ప్రీతిస్మిత ప్రపంచ రికార్డు..!
లిమా (పెరూ): ప్రపంచ యూత్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి ప్రీతిస్మిత భోయ్ మూడు స్వర్ణ పతకాలు సాధించింది. ఈ క్రమంలో క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది.మహిళల 40 కేజీల విభాగంలో బరిలోకి దిగిన ఒడిశాకు చెందిన 15 ఏళ్ల ప్రీతిస్మిత మొత్తం 133 కేజీలు (క్లీన్ అండ్ జెర్క్‌లో 76 కేజీలు+స్నాచ్‌లో 57 కేజీలు) బరువెత్తి విజేతగా నిలిచింది. మూడు విభాగాల్లో (క్లీన్ అండ్ జెర్క్+స్నాచ్+టోటల్) వేర్వేరుగా పతకాలు అందించగా... ఈ మూడింటిలోనూ ప్రీతిస్మిత అగ్రస్థానంలో నిలిచి మూడు పసిడి పతకాలను సొంతం చేసుకుంది.40 కేజీల విభాగంలోనే పోటీపడ్డ భారత లిఫ్టర్ జోష్నా సబర్ రెండు రజతాలు, ఒక కాంస్యం సాధించింది. 45 కేజీల విభాగంలో పాయల్ ఒక రజతం, రెండు కాంస్యాలు గెలిచింది. పురుషుల 49 కేజీల విభాగంలో బాబూలాల్ రెండు కాంస్య పతకాలు దక్కించుకున్నాడు.ఇవి చదవండి: జ్యోతి సురేఖకు నిరాశ.. క్వార్టర్ ఫైనల్లో ఓటమి -
చంద్రబాబు,లోకేష్ నమ్మించి మోసం చేశారు టీడీపీ మహిళా నేత దేవినేని స్మిత ఆవేదన
-
బ్లాక్ మెయిల్ చేసేవారికే TDP టికెట్లా..?
-
‘బ్లాక్మెయిల్ చేసేవారికే TDP టికెట్లా?’
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: విపక్ష కూటమిలో టికెట్ల పంచాయితీ కొలిక్కి రావడం లేదు. పొత్తులో భాగంగా ఓ పార్టీకి టికెట్ వెళ్లడంతో మిగిలిన పార్టీల్లోని ఆశావాహులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్ దక్కకపోవడంతో బహిరంగంగా ఆందోళనకు, విమర్శలకు దిగుతున్నారు. తాజాగా పెనమలూరు టీడీపీలో ముసలం రాజుకుంది. బొడే ప్రసాద్‌కు పెనమలూరు టికెట్ ఇవ్వడంపై చలసాని పండు(వెంకటేశ్వరరావు) కుమార్తె దేవినేని స్మిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బోడే ప్రసాద్‌కు టికెట్ కేటాయించడంపై తీవ్ర అభ్యతరం వ్యక్తం చేస్తూ.. పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌పై ఫైర్ అయ్యారు. చంద్రబాబు,లోకేష్ తమ కుటుంబాన్ని నమ్మించి మోసం చేశారని స్మిత ఆవేదన వ్యక్తం చేశారు. 2009లో తమ తండ్రి ఓటమికి పార్టీనే కారణమని మండిపడ్డారు. సొంత పార్టీ నేతలే తన తండ్రికి వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. తండ్రి చనిపోయిన తర్వాత అండగా ఉంటామని అందరూ హామీ ఇచ్చారన్నారు. మామగారు చనిపోయిన బాధలో ఉన్నా పార్టీ కోసం రైతు ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. అయినా 2014, 2019 లోనూ టిక్కెట్ ఇవ్వలేదని విమర్శించారు. చదవండి: చంద్రన్న దెబ్బ! చౌదరిగారికి పరాభవం ఈసారి టికెట్ ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చారని.. చంద్రబాబు, లోకేష్ మాటలు నమ్మి ఇంటింటికీ తిరిగి పార్టీని బలోపేతం చేసినట్లు తెలిపారు. బోడే ప్రసాద్‌కే ఏవిధంగా సీటిస్తారని ప్రశ్నించారు. గ్రౌండ్ వర్క్ చేసుకునేది తామైతే.. టిక్కెట్లు లాబీయిస్టులకిస్తారా అని మండిపడ్డారు. ఈసారి తమకు టికెట్ ఇవ్వాలని రెండేళ్లుగా అడుగుతున్నామని.. మా నాన్నను గెలిపించుకుంటామని బాబుని కోరినట్లు చెప్పారు. చంద్రబాబు, లోకేష్ అనేక మార్లు టిక్కెట్ కోసం అడిగామన్నారు. ‘టికెట్ ఎందుకు ఇవ్వలేకపోయారో కనీసం పిలిచి కూడా చంద్రబాబు మాకు చెప్పలేదు. చంద్రబాబు, లోకేష్ అపాయింట్మెంట్ కోసం ట్రై చేశాం. లోకేష్‌కు వాట్సాప్‌లలో మెసేజ్‌లు పెట్టాం. మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. మా మెసెజ్‌లకు సమాధానం ఇవ్వం లేదు. చంద్రబాబు అరెస్ట్ సమయంలోనూ మేం భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం చేశాం. టికెట్ లేదంటే బోడే ఏడ్చాడు.. బ్లాక్ మెయిల్ చేశాడు. మేం బోడేలా చేయలేదు కదా. మాకు పార్టీ ఇచ్చే విలువ ఇదేనా? బోడే ప్రసాద్ లాగా బ్లాక్ మెయిల్ చేసే వారికే చంద్రబాబు టికెట్లు ఇస్తారా? నా వెనుక ఎవరూ లేరనేగా ఆడిపిల్లనైన నన్ను ఏడిపిస్తున్నారు. మాకు తీవ్ర అన్యాయం జరిగింది. మేం చేసిన తప్పేంటో చంద్రబాబు సమాధానం చెప్పాలి. విలువలేని పార్టీకోసం మేం ఎందుకు పనిచేయాలి?. చంద్రబాబు సతీమణిలాగే మేం కూడా నిజం గెలవాలని కోరుకుంటున్నాం. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం’ అని దేవినేని స్మీత తెలిపారు. -
తను చేసే బిజినెస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
-
హీరోయిన్ గా చేయాలనుకున్న కానీ వేరే రోల్స్ వచ్చాయి..!
-
నాగార్జున గారు చేసిన హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను
-
నేను చేసిన రీమిక్స్ పాటలకు చాల కామెంట్స్ వచ్చాయి..!
-
పాప్ సింగర్ స్మిత భర్త పుట్టిన రోజు వేడుక (ఫొటోలు)
-
స్మిత, మనోజ్ ఎపిసోడ్.. రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనంగా మారిన శామీర్‌పేట్ కాల్పుల ఘటనలో మరిన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసు రిమాండ్ రిపోర్టులో షాకింగ్ విషయాలు ఉన్నాయి. మనోజ్‌కు స్మిత ఫేస్బుక్ ద్వారా పరిచయం కాగా.. స్మితతో కలిసి డిఫ్రెషన్ కౌన్సిలింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ఆమెతో మనోజ్ సన్నిహితంగా మెలిగినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఇక, రిమాండ్ రిపోర్టు ప్రకారం.. 2003లో స్మితతో సిద్ధార్థ్ దాస్‌కు వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు(కుమారుడు-17ఏళ్లు, కుమార్తె-13ఏళ్లు) ఉన్నారు. గతంలో వీరిద్దరూ మూసాపేటలో ఉండేవారు. ఇక, 2018లో సిద్ధార్ధ్‌పై స్మిత గృహహింస కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం విడాకులకు అప్లయ్ చేసింది. అప్పటి నుండి భార్యభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. మరోవైపు.. తమను మనోజ్ హింసిస్తున్నట్లుగా స్మిత కొడుకు CWCకి ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో తండ్రి సిద్ధార్థ్ దాస్ హైదరాబాద్ వచ్చారు. ఈ విషయమే అడగడానికి శనివారం ఉదయం 8.30గంటలకి సెలెబ్రిటీ విల్లా వెళ్లారు. సిద్ధార్ధ్‌ను చూడగానే మనోజ్‌ని స్మిత పిలిచారు. ఆవేశంలో ఫ్రెండ్ గిప్ట్గా ఇచ్చిన ఏయిర్ గన్‌తో సిద్ధార్థ్‌పై మనోజ్ కాల్పులు జరిపాడు. కాగా, సిద్ధార్ధ్ తప్పించుకుని పారిపోయాడు. వెంటనే డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, స్మితతో తన బంధానికి ఇబ్బంది కలిగిస్తున్నందుకు సిద్ధార్థ్ దాస్‌ను చంపేయాలనుకుని మనోజ్ అనుకున్నాడు. మనోజ్ పలు సినిమాలు, సీరియల్స్‌లో నటించాడు. అవకాశాలు రాకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్లినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: శామీర్‌పేట ఘటన: అందమైన అమ్మాయిలకు ట్రాప్, వయసులో పెద్దదైన స్మితతో మనోజ్.. -
శామీర్‌పేట ఘటన: అందమైన అమ్మాయిలకు ట్రాప్!
క్రైమ్: శామీర్‌పేట కాల్పుల ఘటన కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులకు.. మరో కొత్త విషయం తెలిసింది. మనోజ్, స్మితా గ్రంథిలు కలిసి పలు మోసాలకు పాల్పడ్డారు. యాక్టింగ్ పేరుతో అందమైన అమ్మాయిలను ట్రాప్ చేశారు. స్మిత ఇటీవలే ఓ సంపన్న యువతిని ట్రాప్ చేయగా.. ఇద్దరూ కలిసి సదరు యువతి నుంచి నుంచి రూ.50 లక్షలు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఒరాకిల్‌లో పని చేస్తూనే.. స్మిత మోసాలకు దిగింది. మనోజ్‌తో కలిసి బంజారాహిల్స్‌లో డెన్ ఏర్పాటు చేసింది. షాకన్యోరా సొల్యూషన్స్ పేరిట షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు. నిత్యం పార్టీలతో వీళ్లిద్దరూ బిజీ బిజీగా గడిపేవారు. అక్కడి నుంచి తారసపడిన అందమైన అమ్మాయిలకు అవకాశాల పేరిట వల వేయడం ప్రారంభించారు. ఈ తరుణంలో ఇప్పుడు కాల్పలు ఘటన తర్వాత వీళ్ల మోసాలు వెలుగు చూశాయి. దీంతో.. వీళిద్దరి అక్రమాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. స్మితా బాధితుల్లో ప్రముఖులు సైతం ఉన్నట్లు సమాచారం. మనోజ్ తండ్రి హల్ చల్ మనోజ్-స్మితల నడుమ వివాహేతర సంబంధం ఉందంటూ వస్తున్న కథనాలపై మనోజ్ తండ్రి మీడియాతో దురుసుగా స్పందించారు. అలాంటిదేం లేదని.. స్మితా గ్రంధి కేవలం ఎంప్లాయి మాత్రమేనని అంటున్నాడు. ఒకేచోట.. ఇద్దరూ సన్నిహితంగా ఉన్నంత మాత్రానా సంబంధం అంటగట్టడం సరికాదని.. పైగా స్మిత మనోజ్ కంటే వయసులో పెద్దదని ఆయన అంటున్నాడు. ఈ ఘటనపై న్యాయపోరాటం చేసి తీరతామని అంటున్నాడాయన. ఈ క్రమంలో శామీర్‌పేట పోలీస్ స్టేషన్ వద్ద హల్ చల్ చేశాడాయన. జరిగిన కథ.. శామీర్‌పేట్ సెలబ్రిటీ రిసార్ట్‌లోని విల్లాలో సిద్ధార్థ దాస్‌పై జరిగిన కాల్పుల కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. మూడేళ్లుగా సిద్ధార్ధ్‌దాస్ భార్యతో మనోజ్ సహజీవనం చేస్తున్నాడు. 2019లో భర్త సిద్ధార్ధ్ దాస్‌తో విడిపోయిన శ్వేతతో మనోజ్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. విడాకుల కోసం స్మిత కూకట్పల్లి కోర్టులో దరఖాస్తు చేసింది. దాంతో పాటు తాను నివాసం ఉంటున్న వైపు భర్త రాకుండా ఇంజక్షన్ ఆర్డర్ కూడా స్మిత తెచ్చుకుంది. మనోజ్‌తో కలిసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేసిన స్మిత.. సెలబ్రిటీ రిసార్ట్స్‌లోని తాముంటున్న ఇంట్లోనే ఆఫీస్ ఏర్పాటు చేశారు. పిల్లలతో పాటు స్మిత, మనోజ్ కలిసి అక్కడే నివాసం ఉంటున్నారు. జులై 12న స్మిత కుమారుడు 17 ఏళ్ల బాలుడిని మనోజ్ కొట్టాడు. దీంతో ఆ బాలుడు అల్వాల్ సీడబ్ల్యుూసీలో ఫిర్యాదు చేశాడు. దీంతో 17 ఏళ్ల బాలుడిని సీడబ్ల్యూసీ తమ సంరక్షణలో ఉంచుకుంది. తనతో పాటు తన చెల్లెలును కూడా మనోజ్ వేధిస్తున్నారని సీడబ్ల్యుసీకి స్మిత కుమారుడు ఫిర్యాదు చేశాడు. దీంతో జులై 18న తమ ముందు పాపతో పాటు హాజరుకావాలని స్మితకు సీడబ్ల్యూసీ నోటీసులు జారీ చేసింది. అలాగే.. మనోజ్ చిత్రహింసల గురించి తండ్రి సిద్ధార్థ్‌కు కుమారుడు చెప్పాడు. దీంతో పాపను తీసుకెళ్లడానికి ఈ రోజు(శనివారం) ఉదయం సిద్ధార్థ్ దాస్ విల్లాకు చేరుకున్నాడు. సిద్ధార్థ వెంట పాపని పంపడం ఇష్టం లేక స్మిత అతడితో గొడవకు దిగింది. దీంతో ముగ్గురికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం మనోజ్ ఎయిర్ గన్ తీసుకొని కాల్పులు జరిపాడు. సిద్ధార్థ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమ్స్ ఆక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎయిర్ గన్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. గన్‌లో మంద గుండు సామాగ్రి ఉందా అన్నది నిర్ధారించుకోవడానికి ఫోరెన్సిక్ ల్యాబ్ గన్ను పంపించారు. ఇదీ చదవండి: పతీ.. పత్నీ ఔర్ వో.. హైప్రొఫైల్ స్టోరీ ఇది -
జనాలు నాపై కోడిగుడ్లు విసిరారు: చిరంజీవి
సింగర్ స్మిత త్వరలో నిజం విత్ స్మిత అనే టాక్ షోతో ముందుకు రాబోతున్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత, కెరియర్ విషయాలను అభిమానులతో పంచుకునేందుకు ఈ షో ఒక వేదిక కానుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీలివ్‌లో ప్రసారం కానున్న ఈ షో మెగాస్టార్ చిరంజీతో ప్రారంభం కానుంది. ఈమేరకు ఓ ప్రోమో కూడా విడుదలైంది. స్టార్డమ్ అనేది కొంతమందికే సాధ్యం అవుతుంది, ఆ స్టేజీకి వెళ్లడానికి ఎన్నో అవమానాలు పడి ఉంటారు, అవునా? అని స్మిత అడిగింది. దీనికి చిరు స్పందిస్తూ.. జగిత్యాలలో నాపై నుంచి పూల వర్షం కురిసింది. కొంత ముందుకు వెళ్లగానే కోడిగుడ్లు విసిరారు అని తను ఎదుర్కొన్న చేదు అనుభవాలను వెల్లడించాడు చిరు. అసలు తనపై కోడిగుడ్లు ఎందుకు విసిరారు? మెగాస్టార్ పంచుకున్న ఆసక్తికర విషయాలేంటో తెలియాలంటే ఫిబ్రవరి 10న ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: చేతిపై పచ్చబొట్టు.. నా భార్య.. కన్నతల్లిలా చూసుకుంది: కల్యాణ్ రామ్ -
స్మార్ట్ ఫిల్మ్; ఉమెన్ @ 40
మానసిక కల్లోలం, డిప్రెషన్, నిద్రలేమి, జ్ఞాపకశక్తి సమస్యలు.. 40 ఏళ్లు దాటిన చాలా మంది మహిళలు ఈ లక్షణాలన్నీ లేదా వీటిలో ఏదో ఒకదానిని అనుభవిస్తుంటారు. మెనోపాజ్‌కి కొన్ని సంవత్సరాల దూరంలో ఉన్నందువల్లనో, ప్రీ మెనోపాజ్ దశను అధిగమించలేకనో నాలుగుపదులు దాటిన వారి జీవితం కొంచెం కష్టంగా అనిపిస్తుంటుంది. ఈ సమస్యలనే ఇతివృత్తంగా తీసుకొని గి@40 (ఉమన్ ఎట్ ఫార్టీ) పేరుతో 12 నిమిషాల నిడివిగల షార్ట్ ఫిల్మ్‌ను తీశారు స్మితా సతీష్. స్మితా సతీష్ కౌన్సెలింగ్ సైకాలజిస్ట్, సామాజిక కార్యకర్త, మోటివేషనల్ ట్రైనర్. గతంలో స్మిత జువైనల్ జస్టిస్ బోర్డ్‌లో సభ్యురాలుగా ఉన్నారు. కేరళలోని త్రిసూర్‌లో ఉంటారు ఈమె. 43 ఏళ్ల స్మిత తన వ్యక్తిగత జీవితంలో చూసినవి, తనను కలిసిన కొంత మంది మహిళల సమస్యలను ఉదాహరణగా తీసుకుని 40 ఏళ్లు దాటిన గృహిణి పరిస్థితులతోబాటు, వారికి కుటుంబ మద్దతు ఎంత వరకు అవసరమో గి@40 షార్ట్ ఫిల్మ్‌లో కళ్లకు కడుతుంది. హాట్ ఫ్లాష్ ఈ ఏడాది మొదట్లో ‘హాట్ ఫ్లాష్’ అనే పేరుతో షార్ట్ ఫిల్మ్‌ను రూపొందించారు స్మిత. ముందస్తు మెనోపాజ్ లక్షణాలలో ఒకటైన హాట్ ఫ్లాష్‌తో (అకస్మాత్తుగా వేడిగా అనిపించడం, తీవ్రమైన చమట పట్టడం) ఉన్న నలభై ఏళ్ల గృహిణి గురించి వివరించారు. ఉన్నట్టుండి చిరాకుగా మారడం, కోపం తెచ్చుకోవడం లేదా కారణం లేకుండా ఏడవడం, అందరూ తనను నిర్లక్ష్యం చేస్తున్నట్టు భావించడం .. ఇవన్నీ డాక్టర్, సైకాలజిస్ట్ సహాయంతో అధిగమించడం వరకు పాత్ర భావోద్వేగ ఎత్తుపల్లాల గుండా వెళుతుంది. ‘శరీరం మార్పులకు లోనవుతుంటుంది. రుతుక్రమంలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ సమయంలో నలభై దాటిన వారి ప్రతి చర్యలను గమనించిన తర్వాత ఏదైనా చేయాలనుకున్నాను. అలా ఈ లఘు చిత్రాన్ని తీశాను’ అంటారామె. ఈ ఫిల్మ్‌కి స్మిత ఫొటోగ్రాఫర్‌గా వ్యవహరించగా, ఇతర నటీనటులు వివిధ రంగాలలో ఉన్నవారు మొదటిసారి నటించారు. మహిళలకు అవగాహన తప్పనిసరి నలభై ఏళ్ల దాటిన మహిళల రోజువారీ సాధారణ లక్షణాలను హైలైట్ చేయడానికి ఆమె వివిధ పాత్రల ద్వారా మన ముందుకు తీసుకువచ్చారు. ‘మీరు బాగున్నారా?’ అనే ప్రశ్న సాధారణంగా మంచి అనుభూతిని ఇస్తుంది. కానీ, సమస్య ఏంటంటే, ఈ దశలో ఉన్న మహిళలు తాము ఎందుకు కష్టంగా ఉన్నారో వారికై వారే అర్థం చేసుకోలేరు. కుటుంబ సభ్యులకు కూడా ఈ మహిళల మానసిక కల్లోలం, ప్రవర్తనలో మార్పుల గురించి ఏ మాత్రం తెలియదు’ అంటారు స్మిత. అలాంటి మహిళలకు అవగాహన కల్పించేందుకు ఈ ఫిల్మ్ సాయపడుతుంది. ‘చాలామంది ప్రసూతి వైరాగ్యం అంటే ప్రసవానంతరం డిప్రెషన్ గురించి ఇప్పుడిప్పుడే చర్చిస్తున్నారు. అలాగే, ప్రీ మెనోపాజ్ లేదా మెనోపాజ్ గురించి మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది. తప్పనిసరి పరిస్థితులలో అవసరం అనుకుంటే వైద్యులు కొన్నిసార్లు హార్మోన్ల చికిత్సను సూచిస్తారు. (క్లిక్ చేయండి: తొమ్మిది నెలల్లో 40 కేజీల బరువు తగ్గి...) ఈ వయసులో ఆరోగ్యకరమైన జీవనశైలి వల్ల వారి ప్రపంచం అందంగా మారుతుంది. అభిరుచులను పెంచుకోవడానికి, సృజనాత్మకమైన పనులు చేయడానికి సహాయపడుతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే.. కుటుంబం, స్నేహితులు వారికి అండగా ఉండాలి. వారి సమస్యలు అందరి చెవికెక్కాలి’ అనే విషయాన్ని స్మిత తన ఫిల్మ్ ద్వారా వివరించారు. డబ్ల్యూ ఎట్ ఫార్టీ ఫిల్మ్ నలభై ఏళ్ల వయసు దాటిన మహిళలకు చక్కటి సూచికలా ఉపయోగపడుతుంది. (క్లిక్ చేయండి: ఉచితంగా చదువుకోండి.. ఉన్నతంగా ఎదగండి) -
'షాకింగ్‌లా అనిపిస్తోంది.. ఇంటిల్లిపాది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాం'
మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది. ఎప్పుడూ చిరునవ్వుతో ఫిట్‌గా, ఆరోగ్యంగా కనిపించే మంత్రి మేకపాటి ఆకస్మిక మరణం అందరినీ షాక్‌కి గురి చేసింది. చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడం కలచివేస్తుంది. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దిగ్భ్రాంతికి గురయ్యాము : మోహన్ బాబు మేకపాటి గౌతం రెడ్డి మృతిపట్ల నటుడు మోహన్ బాబు సంతాపం వ్యక్తం చేశారు. ‘నాకు అత్యంత ఆత్మీయులు, సహృదయులు, విద్యావంతులు ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రివర్యులు శ్రీ మేకపాటి గౌతంరెడ్డి గారు గుండెపోటుతో పరమపదించారని తెలిసి మా ఇంటిల్లిపాది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాం. వారి ఆత్మకి శాంతి కలగాలని భగవంతున్ని కోరుకుంటున్నాము. వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము’ అంటూ ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. అందుకే ఈవెంట్ క్యాన్సిల్ : పవన్ కల్యాణ్ మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం ఎంతో బాధ కలిగించిందని జనసేన అధ్యక్షుడు, నటుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఈ కారణంగానే ఈరోజు (సోమవారం) జరగాల్సిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలు రద్దు చేసుకున్నట్లు తెలిపారు. మేకపాటి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా స్నేహపూర్వకంగా ఉండేవారు : బాలకృష్ణ ‘పార్టీలకు అతీతంగా అందరితో స్నేహపూర్వకంగా మెలిగేవారు. గౌతమ్ రెడ్డి ఇక లేరన్న మాట వినడానికే చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానభూతి’ అంటూ నటుడు బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. ఎంతో మంచి వ్యక్తి: సింగర్ స్మిత ‘అన్నా.. చాలా తొందరగా వెళ్లిపోయారు. ఎంతో మంచి వ్యక్తి. ఇది నిజంగా షాకింగ్‌గా అనిపిస్తోంది. కోవిడ్ తర్వాత కూడా పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి’ అంటూ స్మిత ట్విట్టర్లో పేర్కొన్నారు. షాక్‌కి గురి చేసింది: మంచు విష్ణు ‘మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం షాక్‌కి గురి చేసింది. ఆయన ఎంతో ఉన్నతమైన వ్యక్తి. జీవితం ఊహించలేనిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అంటూ విష్ణు ట్వీట్ చేశారు. మిమ్మల్ని మిస్ అవుతాం అన్నయ్యా : మంచు మనోజ్ ‘మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఇక లేరంటే నమ్మలేకపోతున్నాను. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. మిమ్మల్ని మిస్సవుతాం అన్నయ్యా. ఓం శాంతి’ అని మంచు మనోజ్ సంతాపం వ్యక్తం చేశారు. నాకు అత్యంత ఆత్మీయులు, సహృదయులు, విద్యావంతులు ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రివర్యులు శ్రీ మేకపాటి గౌతంరెడ్డి గారు గుండెపోటుతో పరమపదించారని తెలిసి మా ఇంటిల్లిపాది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాము. (1/2) — Mohan Babu M (@themohanbabu) February 21, 2022 Deepest condolences to the Mekapati family. Shocked behind words on the sudden demise of Sri. Mekapati Gautham. Such a humble and wonderful human being. Life is so unpredictable 😞 — Vishnu Manchu (@iVishnuManchu) February 21, 2022 — Smita (@smitapop) February 21, 2022 Absolutely shocked by the sudden demise of our IT minister Goutham Reddy Gaaru! My prayers are with his family and friends. RIP🙏🏼 pic.twitter.com/RMhiD5KNLH — Venkatesh Daggubati (@VenkyMama) February 21, 2022 Can’t believe @MekapatiGoutham garu is no more .. strength to family .. will miss you my dear brother .. Om Shanti pic.twitter.com/cyTWmHXfAm — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) February 21, 2022 -
ఒరాకిల్ నుంచి స‘రాగాల’ దాకా...
సాఫ్ట్ వేర్ ఉద్యోగం.. ఐదంకెల జీతం.. అయినా ఇవేవీ ఆమెకు సంతృప్తినివ్వలేదు. సంగీతంపైనే మనసు మళ్లింది. పదేళ్లపాటు ఉద్యోగం చేస్తూనే వీకెండ్లో సంగీత ప్రదర్శనలిచ్చింది. అయితే కొద్ది సంవత్సరాల తరువాత ఆమెకు జాబ్ బోర్ కొట్టేసింది.సంగీతమే తన ప్రపంచం అనుకుంది. ఉద్యోగం మానేసి సంగీతప్రదర్శనలకేఅంకితమైంది. ఆమే ముంబైకు చెందినసూఫీ గాయని స్మిత బెల్లూర్. తాజాగానగరంలోని ఆషియాన గార్డెన్స్‌లో ప్రదర్శన ఇచ్చారు. ‘సాక్షి’తో ఆమె ప్రత్యేకంగాముచ్చటించారు. సాక్షి, సిటీబ్యూరో: నిజామ్ కాలంలో గజల్, సూఫీ సంగీతానికి నగరం కేంద్రంగా వర్ధిల్లిన సంగతి తెలిసిందే. ఆధునిక సంగీతపు ప్రవాహంలో ఆ అలనాటి సంగీతపు విశేషాలు అంతగా వినిపించనప్పటికీ... ఇప్పటికీ సంపన్నుల, సంప్రదాయ హైదరాబాదీల వేడుకల్లో గజల్ సవ్వడులు, çసూఫీ రాగాలు వీనుల విందు చేస్తూనే ఉంటాయి. అలాంటి వేడుకల కోసం ప్రముఖ గాయనీ గాయకులు నగరానికి రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు. అదే క్రమంలో నగరానికి వచ్చిన స్మిత బెల్లూర్ పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే... ఒరాకిల్నుంచిస‘రాగాల’దాకా... జన్మతః కర్నాటకవాసిని. బెంగుళూర్లో పుట్టాను. మా తల్లిదండ్రులకు మ్యూజిక్ అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి సంప్రదాయ సంగీతంనేర్చుకుంటూ వచ్చా. ఇంజనీరింగ్ చదువైపోయాక ఉద్యోగంలో చేరాను. ఒరాకిల్‌లో పదేళ్లు పనిచేశాను. అదే సమయంలో ఉద్యోగంలో సరిపడా తృప్తి లభించక హాబీగానూ కచేరీలు ఇచ్చేదాన్ని. వీకెండ్లో శుక్రవారం సాయంత్రం అన్నీ ప్యాక్ చేసుకుని వెళ్లిపోయి కన్సర్ట్ అయిపోయాక సోమవారం ఆఫీస్‌కి తిరిగొచ్చేదాన్ని. సూఫీ గాయకుల్లో మహిళలు చాలా తక్కువనేది నిజమే. నా అదృష్టం కొద్దీ దేశంలోనే అగ్రగామి సూఫీ గాయకులు వార్సీ బ్రదర్స్ దగ్గర శిష్యరికం నన్ను గాయనిగా తీర్చిదిద్దింది. మా అమ్మాయి పుట్టి స్కూల్ ఏజ్ వచ్చాక... ఇక ఉద్యోగం చేయడానికి మనస్కరించలేదు. సంగీతానికి పూర్తిగా అంకితమయ్యాను. అన్నింట్లో... సిటీ మేటి... ఈ నగరంలో ఆషియాన గార్డెన్స్‌లో షామ్ ఎ గజల్ లో పొల్గొనడానికి ఇక్కడికి వచ్చాను. నా అభిమాన కవులు పుట్టిన ఈ సిటీకి రావడం అంటే చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. హైదరాబాదీ ఆడియన్స్ కూడా గొప్ప శ్రోతలు. మంచి పొయెట్రీ వినడానికి బాగా ఇష్టపడతారు. రాత్రి 9గంటలకు మొదలుపెడితే ఒక్కోసారి తెల్లవారే దాకా కూడా అలా వింటూ ఉండిపోతారు. వాళ్లు నన్ను ఆలపించమని కోరే గీతాలు, చాలా సునిశితంగా ప్రతి పదం వినడం,. పొరపాటున తప్పు పాడితే కనిపెట్టేయగలగడం అబ్బురమనిపిస్తాయి. నా వరకూ ఈ తరహా సంగీత వేదికల విషయంలో ఈ సిటీ దేశంలోనే బెస్ట్ ప్లేస్. సిటీ కవిత్వం.. విశ్వవ్యాప్తం కావాలి... ఈ నగరానికి చాలా సార్లు వచ్చాను. ఇక్కడ కవులతో పాటు మరెందరో కళాకారులున్నారు. నేనెప్పుడూ పాడడానికి నా బృందంతో ఇక్కడికి రాను. నా కార్యక్రమాల్లో తబలా పలికించే సర్ధార్ ఖాన్ , హోర్మోనియం ప్లే చేసే యాకుబ్ అలీ , కీబోర్డ్ ని కదిలించే రాజు , గిటారిస్ట్ ఫ్రాన్సిస్,హరిజీత్ సింగ్... వీళ్లందరూ హైదరాబాదీలే. ఈ నగరం చారిత్రకంగా, సాహిత్యపరంగా సుసంపన్నం. ఇక్కడ మోజమ్ షాజీ, లాస్ట్ నిజామ్, అంజాద్ హైదరాబాదీ, షఫీ హైదరాబాదీ...అద్భుతమైన, నిగూఢమైన అర్ధాలు ఉన్న కవిత్వం వారిది. హైదరాబాదీ పొయెట్స్కి సంబంధించిన కవిత్వాన్ని మరింత లోతుకు వెళ్లి పరిశోధించే ప్రాజెక్ట్ చేపట్టాను. దీనిని ప్రపంచమంతా తీసుకెళ్లాలని ఆకాంక్ష. భక్త‘మహిళ’లపై కొత్త ప్రాజెక్టు... వుమెన్ మిస్టిక్స్ ఆఫ్ ఇండియా అండ్ ద సబ్‌కాంటినెంట్ పేరుతో మరో ప్రాజెక్ట్ కూడా చేపడుతున్నా. మన దేశంలో దేవుడితో మహిళకు అనుబంధం విభిన్న రూపాల్లో ఉంటుంది. దేవుడ్ని భర్త, స్నేహితుడు, బిడ్డ... ఇలా చూసిన ఎందరో మహిళలు అద్భుతమైన కీర్తనలు ఆలపించారు. వీరిలో ఆండాళ్, మీరాబాయి, అక్క మహాదేవి ఇలా ఎందరో. మహిళలకు ఏ రకమైన ప్రోత్సాహం లేని సమయాల్లో కూడా వీళ్లు తమదైన అస్తిత్వాన్ని ప్రదర్శించారు. వీరి గురించి నా కొత్త ప్రాజెక్టు ద్వారా వివరించనున్నా. ఇక సినిమా పాటల విషయానికి వస్తే... తెలుగు సినిమాతో స్వల్ప పరిచయం ఉంది. హార్ట ఎటాక్ అనే చిత్రంలో ఆలాపన పాడాను. మంచి అవకాశాలు వస్తే సినిమాలకు పాడడానికి సిద్ధమే. -
ఇదొక అందమైన ప్రయాణం
‘‘పాడుతా తీయగా’ కోసం 1996లో తొలిసారి మైక్ పట్టుకున్న క్షణం నుంచి నిన్నమొన్నటి వరకు కూడా నాలో అదే ఉత్సాహం.. ఎంజాయ్మెంట్ ఉన్నాయి. ఇప్పటికి కూడా ప్రతి చిన్న విషయానికి నాలో ఎగై్జట్‌మెంట్ కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక్క ‘ఇండిపాప్’ నేనే అయినందుకు చాలా గర్వంగా ఉంది’’ అని గాయని, సంగీత దర్శకురాలు, నటి స్మిత అన్నారు. ఆమె సంగీత ప్రయాణం 20ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లో ఈ నెల 22న ‘ఎ జర్నీ 1999–2019’ పేరుతో వేడుక నిర్వహించనున్నారు. దానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. అనంతరం స్మిత మాట్లాడుతూ– ‘‘ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో? ఎలా ఉంటుందో? తెలియకుండానే వచ్చాను. ఆ తర్వాత నేర్చుకోవడం మొదలు పెట్టాను.. మ్యూజిక్, డ్యాన్స్‌లో మరింత శోధన చేసి ఎదిగాను. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నా ప్రయాణం ఎంతో ఆనందంగా ఉంది. 10 కంటే ఎక్కువ భాషల్లో పాటలు పాడాను. 12 ఆల్బమ్స్, 17 మ్యూజికల్ వీడియోలు, 100 కు పైగా ప్లే బ్యాక్ సాంగ్స్, 8 దేశాల్లో 200కు పైగా కాన్సర్ట్స్, ఓ ట్రోఫీ ఇంటికి తీసుకురావడం... ఇవన్నీ జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని తీపి అనుభూతులే. నేను ఇంత సాధించడానికి ఎంతో చేసిన వాళ్లందర్నీ గుర్తు చేసుకోడానికి.. వాళ్లకు మనసారా కృతజ్ఞతలు చెప్పుకోడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నా.. కళకు నేను ఇవ్వాలనుకుంటున్న గౌరవం ఇది. అదే రోజు నా భవిష్యత్ లక్ష్యాలను చెబుతా’’ అన్నారు. -
ఈ షార్ట్ ఫిల్మ్ ఎందుకు చూడాలంటే..
ఆర్థిక స్వాతంత్ర్యం అంటే ఏమిటో.. దాని ఆవశ్యకత ఏమిటో తెలియజేస్తూ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రముఖ దర్శకుడు దేవాకట్ట 'డైయింగ్ టు బి మీ ఒక షార్ట్ ఫిలింను విడుదల చేశాడు. ఇందులో ప్రముఖ పాప్ సింగర్ స్మిత ముఖ్యపాత్ర పోషించారు. బాగా విద్యావంతురాలై ఉండి, ఉద్యోగం చేయడానికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇంట్లోనే ఉంచాలన్న భర్త ఆలోచనతో సతమతమయ్యే మహిళగా ఆమె కనిపించింది. తాను ఆర్థిక సంకెళ్ల మధ్య ఉన్నానంటూ బాధపడుతుంది. చివరకు, అతడి అభిప్రాయంతో విభేదించి తనను స్వేచ్ఛగా వదిలేయమని చెప్పి వెళ్తుంది. 'ఒక మహిళ తన జీవిత నియంత్రణ తన చేతుల్లోకి తీసుకున్నప్పుడు మాత్రమే ఆర్థిక స్వాతంత్ర్యం వచ్చినట్లు' అని చెప్పడమే ఈ షార్ట్ ఫిల్మ్ ఉద్దేశం. 'స్వేచ్చగా జీవించండి.. స్వేచ్చగా జీవించనీయండి' అనే వాక్యంతో ఈ రెండు నిమిషాల నిడివి ఉన్న లఘు చిత్రం ముగుస్తుంది. ఈ వీడియో ముగుస్తుండగా.. దేశ జనాభాలో మహిళలు 50శాతం ఉన్నారని.. వారిలో 70శాతం మహిళలు గృహిణిలుగా పనిచేస్తున్నారని, కేవలం పది శాతంమంది మహిళలు మాత్రం సంపాదిస్తున్నారని, అది దేశ సంపదలో ఒకశాతం మాత్రమే గణాంకాలు వెల్లడించాడు దర్శకుడు. -
మధుర భాషణంతో కార్యసాధన
ఆస్ట్రేలియాలో ఒక న్యాయమూర్తి ఉండేవాడట. ఆయనకు రోజూ ఉదయం పార్కులో వ్యాహ్యాళికి వెళ్లే అలవాటు ఉండేది. ఆ పార్కు సమీపంలో పేవ్మెంటు మీద ఓ భిక్షకుడు ఆయనకు తరచుగా కనిపించేవాడు. న్యాయమూర్తి ఉదయం పార్కులోకి వెళ్తుంటే ఒకటి రెండుసార్లు వెటకారానికి ‘న్యాయమూర్తీ శుభోదయం’ అని ఆయన వెనకనించీ కేకవేశాడు. న్యాయమూర్తి వెనక్కి తిరిగి మర్యాదగా సమాధానం చెప్పాడు. మూడోసారి కలిసినప్పుడు ఆ న్యాయమూర్తి తనే ఆ భిక్షుకుడిని పలకరించి పార్కులోకి వెళ్తుంటే, ఓ పెద్ద మనిషి చూసి ‘న్యాయమూర్తి గారూ! మంచీ మర్యాద తెలియని ఆ మూర్ఖుడూ సోమరిపోతూ మిమ్మల్ని ఆట పట్టించటానికి పలకరిస్తున్నాడని మీకు తెలియదా? అతనిస్థాయి ఏమిటి, మీ స్థాయి ఏమిటి? మీరే స్వయంగా అతన్ని పలకరించటం మీ హోదాకు భంగకరం కాదా?’ అని సూచించబోయాడు. న్యాయమూర్తి ‘పెద్ద మనిషి గారూ, మంచీ మర్యాదా తెలియని మూర్ఖ భిక్షుకుడి కంటే మర్యాదలో నేను తీసిపోవాలని మీ ఉద్దేశమా?’ అన్నాడు. మర్యాద అనగానే మర్యాదాపురుషోత్తముడు శ్రీ రామచంద్రుడు గుర్తుకు వస్తాడు. మర్యాద అంటే ‘క్రమం, పద్ధతి’ అని ఒక నిర్వచనం, ‘మర్యాద’ అంటే సంస్కృతంలో హద్దు, లేక పరిధి అని అర్థం చెప్పారు. నీతి, సత్సంప్రదాయం, ధర్మం పరిధిలో ఎప్పుడూ నడుచుకొనేవాడు కనక రాముడు మర్యాదా పురుషోత్తముడు. శ్రీరాముడిని ‘వచస్వి’గా ‘వాగ్మి’(చక్కని వక్త)గా వాల్మీకి వర్ణించాడు. రామచంద్రుడు మృదుభాషి, మితభాషి, మధురభాషి, పూర్వభాషి, స్మితపూర్వభాషి అని ప్రశంసించాడు. మృదువైన మాట మనిషికి పెట్టని సొమ్ము. దానిని మెలకువలో, సహనంలో, సమర్థంగా వాడినవాడు శ్రీరాముడు. ఆయనది ఒక మాట, ఒక బాణం. మాట మృదువు, బాణం వాడి. ఆయన శూర్పణఖతో మాట్లాడినా, సుగ్రీవుడితో మాట్లాడినా, విభీషణుడితో సంభాషించినా, విశ్వామిత్రుడితో మాట్లాడినా మృదువుగానే మాట్లాడాడు. రాముడు మితభాషి కూడా. రాముడే కాదు, సత్యమే మాట్లాడాలని నియమం గలవాడు, ఆడిన మాట నిలబెట్టుకోవాలనే నిష్ట కలవాడెవడూ మితిమీరి మాట్లాడలేడూ, మాట్లాడడు. శ్రీరాముడి దగ్గర ఉన్న మరొక మహత్తరమైన సుగుణం ‘పూర్వభాషిత్వం’ అని చెప్తారు. ఎవరినైనా తనే ముందు పలకరించి అనురాగంతో, ఆప్యాయతతో కుశలం తెలుసుకునే ప్రయత్నం చెయ్యటం పూర్వభాషిత్వం. ఇది ఉత్తమ సంస్కారానికి చిహ్నం. శ్రీరాముడు పూర్వభాషి మాత్రమే కాదు. బంగారానికి తావి అబ్బినట్టు, స్మిత పూర్వభాషి కూడా. ముందు చిరునవ్వుతో పలకరించి, తరువాత మధురమైన మాటలతో మనసు చల్లబరచేవాడు. వాక్కు జంతుకోటిలో మనిషికి మాత్రమే ఉన్న విశిష్ట శక్తి. దానివల్లనే మానవుడు చరాచర సృష్టిలో శిఖరాయమానంగా భాసిస్తూ స్థావర జంగమాలను తన నియంత్రణలోకి తెచ్చుకొనేంత శక్తిశాలి అయ్యాడు. సరిగా వాడుకొంటే వాక్కు సుహృద్భావపూర్వకమైన మానవ సంబంధాలకు దోహదం చేసి, కార్యసిద్ధినీ విజయాన్నీ అందించగల సాధనం. తొందరపాటుతో, అనాలోచితంగా, అశ్రద్ధగా, అహంకార పూర్వకంగా వాడితే అది ఇతరులను తీవ్రంగా గాయపరచి, మానవ సంబంధాలను ధ్వంసం చేసి దుష్పరిణామాలకు దారితీసే ఆయుధం అవుతుందన్న సత్యం అందరికీ తెలిసిందే. కానీ ఆ ఎరుకను ఆచరించగలవాడు నొప్పించక, తానొవ్వక జీవించగల నేర్పరి. - ఎం. మారుతిశాస్త్రి