'షాకింగ్‌లా అనిపిస్తోంది.. ఇంటిల్లిపాది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాం' | Pawan Kalyan Mohan Babu And Others Condolences To Mekapati Sudden Demise | Sakshi
Sakshi News home page

Mekapati Goutham Reddy: నమ్మలేకపోతున్నాం.. జీవితం ఊహించనిది

Published Mon, Feb 21 2022 4:25 PM | Last Updated on Mon, Feb 21 2022 8:46 PM

Pawan Kalyan Mohan Babu And Others Condolences To Mekapati Sudden Demise - Sakshi

మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది. ఎప్పుడూ చిరునవ్వుతో  ఫిట్‌గా, ఆరోగ్యంగా కనిపించే మంత్రి మేకపాటి ఆకస్మిక మరణం అందరినీ షాక్‌కి గురి చేసింది. చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడం కలచివేస్తుంది. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

దిగ్భ్రాంతికి గురయ్యాము : మోహన్‌ బాబు
మేకపాటి గౌతం రెడ్డి మృతిపట్ల నటుడు మోహన్‌ బాబు సంతాపం వ్యక్తం చేశారు. ‘నాకు అత్యంత ఆత్మీయులు, సహృదయులు, విద్యావంతులు ఆంధ్రప్రదేశ్‌ ఐటి శాఖ మంత్రివర్యులు శ్రీ మేకపాటి గౌతంరెడ్డి గారు గుండెపోటుతో పరమపదించారని తెలిసి మా ఇంటిల్లిపాది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాం. వారి ఆత్మకి శాంతి కలగాలని భగవంతున్ని కోరుకుంటున్నాము. వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము’ అంటూ ట్విట్టర్‌ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. 

అందుకే ఈవెంట్‌ క్యాన్సిల్‌ : పవన్‌ కల్యాణ్‌
మేకపాటి గౌతమ్‌రెడ్డి  హఠాన్మరణం ఎంతో బాధ కలిగించిందని జనసేన అధ్యక్షుడు, నటుడు పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఈ కారణంగానే ఈరోజు (సోమవారం) జరగాల్సిన భీమ్లా నాయక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ వేడుకలు రద్దు చేసుకున్నట్లు తెలిపారు. మేకపాటి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. 

పార్టీలకు అతీతంగా స్నేహపూర్వకంగా ఉండేవారు : బాలకృష్ణ
‘పార్టీలకు అతీతంగా అందరితో స్నేహపూర్వకంగా మెలిగేవారు. గౌతమ్‌ రెడ్డి ఇక లేరన్న మాట వినడానికే చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానభూతి’ అంటూ నటుడు బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. 

ఎంతో మంచి వ్యక్తి: సింగర్‌ స్మిత
‘అన్నా.. చాలా తొందరగా వెళ్లిపోయారు. ఎంతో మంచి వ్యక్తి. ఇది నిజంగా షాకింగ్‌గా అనిపిస్తోంది. కోవిడ్‌ తర్వాత కూడా పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి’ అంటూ స్మిత ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

షాక్‌కి గురి చేసింది: మంచు విష్ణు
‘మేకపాటి గౌతమ్‌ రెడ్డి హఠాన్మరణం షాక్‌కి గురి చేసింది. ఆయన ఎంతో ఉన్నతమైన వ్యక్తి. జీవితం ఊహించలేనిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అంటూ విష్ణు ట్వీట్‌ చేశారు. 

మిమ్మల్ని మిస్‌ అవుతాం అన్నయ్యా : మంచు మనోజ్‌
‘మేకపాటి గౌతమ్‌ రెడ్డి గారు ఇక లేరంటే నమ్మలేకపోతున్నాను. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. మిమ్మల్ని మిస్సవుతాం అన్నయ్యా. ఓం శాంతి’ అని  మంచు మనోజ్‌ సంతాపం వ్యక్తం చేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement