condolences
-
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజబాబు మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి: ద్వారకాతిరుమల మండలంలోని సీహెచ్ పోతేపల్లికి చెందిన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెలికాని రాజమోహన్‌రావు(రాజబాబు) మృతిపై ఆ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు, సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. రాజబాబు మరణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా రాజబాబుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.రాజబాబు శనివారం రాత్రి మృతి చెందారు. ఇటీవల బాత్రూమ్లో కాలుజారి పడిపోవడంతో ఆయన ఎడమ కాలికి తీవ్ర గాయమైంది. కొద్దిరోజుల పాటు లక్ష్మీపురంలోని విర్డ్ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన, శస్త్రచికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరారు. అక్కడ వైద్యులు వారం రోజుల క్రితం ఆయన కాలికి శస్త్రచికిత్స చేశారు.ఈ నెల 12న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వాల్సి ఉండగా, అదే రోజు ఉదయం 11.30 గంటల సమయంలో ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అప్పటి నుంచి వైద్యులు ఆయనకు వెంటిలేటర్ సాయంతో వైద్యం చేస్తూ వచ్చారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. రాజబాబు మృతి చెందడంతో మండలంలోని పార్టీ శ్రేణులు, ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
మన్మోహన్ సింగ్ మృతిపట్ల వైఎస్ జగన్ సంతాపం
-
మన్మోహన్‌కు ప్రధాని,రాష్ట్రపతి నివాళి
మన్మోహన్సింగ్ పార్థివ దేహానికి ప్రధాని మోదీ నివాళులు..మన్మోహన్ సింగ్ ఇంటికి చేరుకున్న ప్రధాని మోదీమాజీ ప్రధాని పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించిన మోదీమన్మోహన్ సతీమణి గురుశరణ్‌కౌర్, కుటుంబ సభ్యులకు సంతాపంప్రధానితో పాటు మన్మోహన్ ఇంటికి వచ్చిన అమిత్ షా, జేపీ నడ్డా మన్మోహన్ పార్థివ దేహానికి రాష్ట్రపతి నివాళిమన్మోహన్సింగ్ పార్థివ దేహానికి రాషష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళిమన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపిన ముర్ము ఢిల్లీమన్మోహన్సింగ్ పార్థివ దేహానికి తెలంగాణ సీఎం రేవంత్ నివాళులుమన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిమన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్‌ను, ,కుటుంబ సభ్యులను పరామర్శించిన రేవంత్ రెడ్డిమన్మోహన్ నివాసానికి కాంగ్రెస్ అగ్రనేతలుమన్మోహన్ ఇంటికి వచ్చిన సోనియాగాంధీ రాహుల్‌గాంధీ, మల్లికార్జునఖర్గే, ప్రియాంకగాంధీమన్మోహన్ పార్థివ దేహానికి నివాళులర్పించిన నేతలు వ్యక్తిగతంగా నాకు తీరనిలోటు: మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మన్మోహన్ లేని లోటు పూడ్చలేనిదిచాలా కాలం నుంచి మన్మోహన్ నాకు తెలుసుసభ్యతకు నిలువెత్తు రూపం మన్మోహన్సింగ్వీడియో విడుదల చేసిన మాజీ రాష్ట్రపతిఆ మాటే నిజమైంది: శశిథరూర్ మాజీ ప్రధాని మన్మోహన్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ పోస్టు పెట్టిన శశిథరూర్చరిత్ర నా పట్ల దయతో ఉంటుందని 2014లో వ్యాఖ్యానించిన మన్మోహన్ఆయన చెప్పిన మాటలను గుర్తుచేస్తూ పోస్టు పెట్టిన కాంగ్రెస్ ఎంపీపదేళ్ల తర్వాత అదే నిజమైందని వ్యాఖ్యమన్మోహన్ దేశ సేవ..రాబోయే తరాలకు స్ఫూర్తి: సిక్కిం సీఎం తమాంగ్మన్మోహన్ మృతిపట్ల సంతాపం తెలిపిన సిక్కిం సీఎం ప్రేమ్‌సింగ్ తమాంగ్ఆర్థిక సంస్కరణలకు నాంది పలికి దేశాభివృద్ధికి గట్టి పునాది వేశారుదేశానికి మన్మోహన్ చేసిన సేవలు రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని వ్యాఖ్య మాజీ ప్రధాని మన్మోహన్ మృతి పట్ల అమెరికా సంతాపంగత రెండు దశాబ్దాల్లో అమెరికా,భారత్ సాధించిన మన్మోహన్ పునాది వేశారుఅమెరికా, భారత్ పౌర అణు సహకార ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మన్మోహన్ కీలక పాత్ర పోషించారుభారత్ వేగంగా అభివృద్ధి చెందడానికి ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు ప్రజలకు గుర్తుండిపోతాయిప్రకటించిన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ -
శోకసంద్రంలో మలైకా అరోరా, తరలి వచ్చిన బీటౌన్ పెద్దలు (ఫొటోలు)
-
అమెరికాలో ఏపీ యువకుడు మృతి.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అమెరికాలోని సూపర్ మార్కెట్లో జరిగిన కాల్పుల ఘటనలో బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం మజలి గ్రామానికి చెందిన దాసరి గోపీకృష్ణ మరణించారన్న వార్తపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోపీకృష్ణ కుటుంబానికి ప్రభుత్వం తోడుగా నిలవాలని, వారిని అన్నిరకాలుగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. గోపికృష్ణ కుటుంబానికి తగిన సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర విదేశాంగ శాఖను కోరారు. గోపికృష్ణ కుటుంబానికి వైఎస్ జగన్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. -
రామోజీరావు కన్నుమూత.. వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
జైన గురువు ‘సల్లేఖనం’
రాజ్‌నందన్‌గావ్: ప్రముఖ జైన గురువు ఆచార్య విద్యాసాగర్ మహారాజ్ ‘సల్లేఖన’ వ్రతం ద్వారా శరీరత్యాగం చేశారు. రాజ్‌నందన్‌గావ్ జిల్లా డొంగార్‌గఢ్‌లోని చంద్రగిరి తీర్థ్‌లో ఆదివారం ఉదయం ఆయన తుదిశ్వాస వదిలారని తీర్థ్ ఒక ప్రకటనలో తెలిపింది. గత ఆరు నెలలుగా మహారాజ్ దొంగార్‌గఢ్ తీర్థ్‌లోనే ఉంటున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మూడు రోజులుగా సల్లేఖన దీక్షను పాటిస్తున్నారు. జైన మతాచారం ప్రకారం సంపూర్ణ ఉపవాస దీక్ష (సల్లేఖనం)తో శరీరం వదిలారు. ఆత్మ శుద్ధీకరణార్థం ఈ దీక్ష చేపట్టారు’’ అని తీర్థ్ తెలిపింది. తీర్థ్‌లోనే అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. -
బన్నీకి ప్రత్యేక కృతజ్ఞతలు: బేబీ నిర్మాత
టాలీవుడ్లో వైవిధ్యమైన కథలతో కమర్షియల్ చిత్రాలు నిర్మిస్తూ మంచి పేరు తెచ్చుకున్న నిర్మాతల్లో ఎస్కేఎన్ ఒకరు. కాగా.. ఇటీవలే ఆయన ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే ఆయన తండ్రిని కోల్పోయారు. ఇంకా ఆ బాధ నుంచి ఎస్కేఎన్ బయటికి రాలేదు. అతని కుటుంబం అంతా ఆయన ఇంటి పెద్దను కోల్పోయిన బాధలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. తాజాగా ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్‌లోని ఎస్కేఎన్ నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఎస్కేఎన్ తండ్రి గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దీంతో తాను అభిమానించే బన్నీ తన ఇంటికి రావడం చాలా ఓదార్పునిచ్చిందని అన్నారు. ఇలాంటి కష్ట సమయంలో నా ఇంటికి వచ్చి.. నాకు ధైర్యం చెప్పినందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. ఇండస్ట్రీలో మొదటి నుంచి అల్లు అర్జున్ ప్రతిభ, అంకితభావాన్ని అభిమానించే ఎస్‌కెఎన్‌కు బన్నీ అంటే చాలా గౌరవం. ఎస్కేఎన్ 'బేబీ', 'టాక్సీవాలా' లాంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. -
ఎమ్మెల్యే సాయన్నకు సంతాపం!...ఎమోషనల్ అయిన సీఎం కేసీఆర్
-
సిగ్గు.. సిగ్గు.. చావు వార్తని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి..
న్యూఢిల్లీ: సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చేయడంతో అత్యధికులు తమకు తామే సెలెబ్రిటీలమన్న భావన ఉంటున్నారు. కొంతవరకు మంచిదే కానీ కేవలం లైకులు కామెంట్ల కోసం ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ లేనిపోని రాద్ధాంతాన్ని సృష్టిస్తున్నారు. ఇలాగే ఒకామె తొందరపడి తన అమ్మమ్మ చనిపోయారన్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభాసుపాలైంది. అమ్రిత్ అనే పేరుతో ట్విట్టర్ అకౌంట్ నడుపుతున్న ఒక యువతి తన అమ్మమ్మ చనిపోయారన్న విషయాన్ని చాలా క్రియేటివ్ గా పోస్ట్ చేసింది. ఆమె అమ్మమ్మ బ్రతికుండగా సోఫాలో కూర్చుని తింటున్న ఫోటోను ఒకపక్కన మరొపక్కన ఆమె లేకుండా ఖాళీగా ఉన్న సోఫా ఫోటోను పోస్ట్ చేసి.. ఫోటోలతో పాటు "నేను దీని నుండి ఎప్పటికీ కోలుకోలేను.." అని రాసింది. పెద్దావిడ మరణవార్తను తన ఫాలోవర్లకు చెప్పాలన్న కుతూహలం కన్నా వారి సానుభూతి రూపంలో లైకులు కామెంట్లు పొందాలన్న ఆమె ఆత్రుతే ఎక్కువగా కనిపించింది నెటిజన్లకు. దీంతో వారు కూడా సున్నిత శైలిలో విచారాన్ని వ్యక్తం చేస్తూ కఠినమైన కామెంట్లతో ఆ యువతిని చెడామడా వాయించేస్తున్నారు. "మీ అమ్మమ్మ మరణం తీరని లోటు. అలాగని ప్రతిదీ ఇంటర్నెట్లో పోస్ట్ చేయాలా?" అని కొందరు రాస్తే.. ఆమె చావు నీకు ఇలా ఉపయోగపడిందన్న మాట, మీకు రిప్లై ఇస్తే నాకు మెసేజులు మీద మెసేజులు వస్తున్నాయని మరొకరు.. కామెంట్లు చేశారు. ఎవరేమనుకుంటున్నారన్న విషయాన్ని పక్కనబెడితే.. సదరు వ్యక్తి చేసిన పోస్టుకు మాత్రం 40 లక్షల పైచిలుకు వీక్షణలు దక్కాయి. అదీ సోషల్ మీడియా పవర్ అంటే.. I’m never going to recover from this pic.twitter.com/yRhfdApZap — A (@ammmmmmrit) July 10, 2023 ఇది కూడా చదవండి: రైలుకు వేలాడుతూ బిత్తిరి చర్య.. పట్టుతప్పితే అంతే సంగతులు! -
ప్రకాశం జిల్లా ఆర్టీసీ బస్సు ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
-
ప్రకాశం: దర్శి బస్సు ప్రమాద ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పొదిలి నుంచి కాకినాడకు పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న ఎన్సీపీ కాల్వలో పడిపోయింది. ఈ ఘటనలో 7 గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన స్థలానికి పోలీసు సిబ్బంది సహా ఇతర అధికారులు వెళ్లారని, సహాయక చర్యలు చేపట్టారని, క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించిన విషయాన్ని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ఈ ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తోడుగా నిలవాలన్నారు. చదవండి: ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి -
Rakesh Master : రాకేష్ మాస్టర్ సంతాప సభ (ఫొటోలు)
-
ఒడిశా రైలు ప్రమాద ఘటన: ప్రపంచ నేతల దిగ్భ్రాంతి
లండన్/మాస్కో: దుర్ఘటనకు పలు ప్రపంచదేశాల నేతలు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. ఈ విషాద సమయంలో భారత్‌కు అండగా నిలుస్తామని భరోసానిస్తూ సంతాప సందేశాలు పంపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తదితరులు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తపరిచారు. ‘మృతుల కుటుంబాల బాధను మేమూ పంచుకుంటాం. గాయాలపాలైన ప్రయాణికులు త్వరగా కోలుకోవాలని మేం కోరుకుంటున్నాం’ అని టెలిగ్రామ్ ద్వారా ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒక సందేశం పంపారు. ‘విషాదంలో మునిగిన వారు, ప్రధాని మోదీ తరఫున మేం ప్రార్థనలు చేస్తున్నాం’ అంటూ రిషి సునాక్ ఒక ట్వీట్‌చేశారు. ‘ఒడిశా ప్రమాద ఘటనలో భారత్‌కు సంఘీభావంగా నిలుస్తున్నాం’ అని మాక్రాన్ ట్వీట్‌చేశారు. ప్రమాదంలో ఇంతటి ప్రాణనష్టం జరగడంపై చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. జపాన్ ప్రధాని కిషిదా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్ (ప్రచండ) , పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, శ్రీలంక విదేశాంగ మంత్రి, భూటాన్ ప్రధాని షెరింగ్, ఇటలీ ప్రభుత్వం, ఐక్యరాజ్యసమితి సర్వసభ్యసభ అధ్యక్షుడు కసాబా కొరొసో, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తమ సానుభూతి సందేశాలు పంపించారు. -
'శరత్ బాబు వెండితెర 'జమిందార్'': మెగాస్టార్ చిరంజీవి
సీనియర్ నటుడు శరత్ బాబు మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త నన్ను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. హుందాతనంతో ఉట్టిపడే నటనతో అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. ఆయనతో నాకు ప్రత్యేక అనుబంధం ఉందని.. అనేక చిత్రాలలో నా సహనటుడుగా ఉన్నారని గుర్తు చేసుకున్నారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. (ఇది చదవండి: ఫోన్ రావడంతో కన్నీళ్లాగలేదు..చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన నరేశ్!) కాగా.. అనారోగ్య కారణాలత హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో శరత్ బాబు సోమవారం మధ్యాహ్నాం కన్నుమూశారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 300కు పైగా చిత్రాల్లో నటించారు. ఆయన మరణ వార్త విన్న సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఫిల్మ్ ఛాంబర్‌కు తరలించిన కుటుంబసభ్యులు.. మంగళవారం చెన్నై ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. (ఇది చదవండి: 3 వేలమందిలో ఒకే ఒక్కడు.. దటీజ్ శరత్ బాబు!) వెండితెర 'జమిందార్', ప్రముఖ నటుడు శరత్ బాబు గారి మరణ వార్త కలచివేసింది. అందం హుందాతనం ఉట్టిపడే తన నటనతో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్న శ్రీ శరత్ బాబు గారితో నాకు ఎంతో అనుబంధం వుంది. అనేక చిత్రాలలో ఆయన నా సహనటుడుగా ఉన్నారు. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులందరికీ నా… pic.twitter.com/za0FpSyeJV — Chiranjeevi Konidela (@KChiruTweets) May 22, 2023 -
ఫోన్ రావడంతో కన్నీళ్లాగలేదు..చిన్న పిల్లాడిలా ఏడ్చేసిన నరేశ్!
సీనియర్ నటుడు శరత్ బాబు మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్లోని ఆయన పార్థీవదేహానికి నివాళులర్పించారు. టాలీవుడ్ నటులు నరేశ్, రాజేంద్ర ప్రసాద్, నందమూరి బాలకృష్ణ, మా అధ్యక్షుడు మంచు విష్ణు, జయసుధ, మురళీ మోహన్, ఏడిద రాజా, శివాజీ రాజా, శివబాలాజీ, పవిత్రా లోకేశ్ తదితరులు ఆయనకు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు. శరత్ బాబు పార్థీవదేహం వద్ద సీనియర్ నటుడు నరేశ్ బోరున విలపించారు. తాను ఒక మంచి మిత్రున్ని కోల్పోయానని కన్నీటి పర్యంతమయ్యారు. నరేశ్ మాట్లాడుతూ.. 'శరత్ బాబు గొప్పనటుడే కాదు.. అందగాడు. శరత్ బాబు నేను మంచి మిత్రులం. ఆయనతో కలిసి 12 సినిమాలు చేశాం. శరత్ బాబు ఒడ్డు పొడుగు చూసి అసూయపడేవాన్ని. మళ్లీ పెళ్లి చిత్రంలో జయసుధకు జోడిగా నటించమని అడిగితే వెంటనే ఒప్పుకున్నారు. ఆఖరి రోజుల్లో కుడా ఆరోగ్యంగా ఉన్నారు. పవిత్రను నన్ను దీవించి వెళ్లాడు. ఆఖరి రోజుల్లో తోడు అవసరమని చెప్పాడు. మనస్సు విప్పి మాట్లాడుకునే మంచి మిత్రుణ్ణి కోల్పోయా. మా బ్యానర్లో చివరి సినిమా చేశారనే ఆనంద పడాలో బాధపడాలో అర్థం కావడం లేదు. మళ్లీ పెళ్లి ఫస్ట్ కాపీ చూస్తుండగా ఆయన చనిపోయారని ఫోన్ రావడంతో కన్నీళ్లు ఆగలేదు.' అంటూ ఫుల్ ఎమోషనలయ్యారు. ఆయనతో పాటు పవిత్రా లోకేశ్ కూడా నివాళులర్పించారు. (ఇది చదవండి: కమెడియన్ సుధాకర్ చనిపోయాడంటూ ఫేక్ రూమర్స్..) మంచి వ్యక్తిత్వం ఉన్న నటుడు: రాజేంద్రప్రసాద్ శరత్ బాబు మృతి పట్ల నటుడు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ..' మంచి వ్యక్తిత్వం ఉన్న నటుడు శరత్ బాబు. నా ఎదుగుదలలో దగ్గరున్న వ్యక్తి శరత్ బాబు. ఆయన మరణం దైవ నిర్ణయం. శరత్ బాబు అనారోగ్యంతో పోరాడి తనను తాను కోల్పోయాడు. అత్యంత ఆప్తుడైన శరత్ బాబును కోల్పోవడం నాకు నా కుటుంబానికి ఎంతో తీరని లోటు.' అంటూ ఎమోషనలయ్యారు. అంకితభావం గల నటుడు: నందమూరి బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. 'శరత్ బాబు విలక్షణమైన నటనతో చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా తనదైన ముద్ర వేశారు. శరత్ బాబు గారు క్రమశిక్షణ, అంకితభావం గల నటులు. ఆయనతో కలసి పని చేయడం మర్చిపోలేని అనుభూతి. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరం. శరత్ బాబు మరణం పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా.' అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయనతో ఎన్నో సినిమాల్లో నటించా: జయసుధ సీనియర్ నటి జయసుధ మాట్లాడుతూ..' శరత్ బాబుతో నేను ఎన్నో సినిమాల్లో నటించా. నా బెస్ట్ మూవీస్ అన్నీ ఆయనతోనే ఉన్నాయి. ఇటీవలే ఆయనతో మళ్లీ పెళ్లి చిత్రంలో నటించాను. సినిమా షూటింగ్ అప్పుడు చాలా ఆరోగ్యంగానే ఉన్నారు. నెలరోజుల తర్వాత హాస్పిటల్లో ఉన్నాడని తెలిసింది. మంచి క్రమశిక్షణ కలిగిన నటుడు శరత్ బాబు. చిరునవ్వుతో పలకరించేవాడు. ఏ నటుడితో చులకనగా మాట్లాడేవాడు కాదు. శరత్ బాబు మరణం బాధగా ఉంది. శరత్ బాబు మరణం తెలుగు సినీ పరిశ్రమకే కాదు తమిళ సినీ పరిశ్రమకు కూడా తీరని లోటు.' అంటూ ఆయనను గుర్తు చేసుకున్నారు. (ఇది చదవండి: టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత) శరత్‌బాబు ఆత్మకు శాంతి చేకూరాలి : ఏడిద రాజా ఏడిద రాజా మాట్లాడుతూ.. 'దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు . మా పూర్ణోదయ సంస్థ తీసిన చిత్రాల్లో చాలా వైవిధ్యమైన పాత్రలు పోషించారు. తాయారమ్మ బంగారయ్య ,సీతాకోకచిలక సాగర సంగమం ,స్వాతిముత్యం ,సితార , ఆపద్భాంధవుడు చిత్రాల్లో చాలా అధ్బుతంగా నటించి ప్రేక్షకుల మన్ననలు పొందారు. మా సంస్థకు శాశ్వత ఆర్టిస్ట్‌గా పనిచేశారు. మా కుటుంబ సబ్యుడిని కోల్పోయాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలి.' అంటూ శరత్ బాబును కొనియాడారు. -
ఆయన సినిమాలు చూస్తూ పెరిగా: మంచు విష్ణు ఎమోషనల్
సీనియర్ నటుడు శరత్ బాబు మరణం పట్ల మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు సంతాపం తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్లో ఆయన పార్థివదేహం వద్ద నివాశులర్పించారు. శరత్ బాబు గొప్ప నటుడని విష్ణు కొనియాడారు. తెలుగు, తమిళం, మలయాళంలో ఎన్నో చిత్రాల్లో నటించి.. అందరూ గర్వించే విధంగా ఎదిగారని అన్నారు. ఈ సమయంలో వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. (ఇది చదవండి: కమెడియన్ సుధాకర్ చనిపోయాడంటూ ఫేక్ రూమర్స్..) మంచు విష్ణు మాట్లాడుతూ.. 'శరత్ బాబు గొప్ప నటుడు. ఆయన సినిమాలు చూస్తూ పెరిగా. ఆయనతో మాకు ప్రత్యేక బంధం ఉంది. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి అందరం అండగా ఉందాం.' అని అన్నారు. శరత్ బాబు పార్థివదేహానికి నటులు మురళీ మోహన్, శివాజీ రాజా, శివ బాలాజీ, ప్రసన్న కుమార్ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. (ఇది చదవండి: 3 వేలమందిలో ఓకే ఒక్కడు.. దటీజ్ శరత్ బాబు!) -
ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరం: సీఎం జగన్
సీనియర్ నటుడు శరత్ బాబు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చలనచిత్ర రంగంలో గొప్ప నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరమన్నారు. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా అన్ని రకాల పాత్రలను పోషించి ప్రత్యేక గుర్తింపు పొందారని గుర్తు చేసుకున్నారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు సీఎం ట్వీట్ చేశారు. (ఇది చదవండి: శరత్‌బాబు-రమాప్రభ లవ్‌స్టోరీ వెనుక ఇంత కథ నడిచిందా?) దాదాపు 300లకు పైగా చిత్రాల్లో నటించిన శరత్ బాబు అనారోగ్య కారణాలతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. 1973లో రామరాజ్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శరత్ బాబు.. చివరిసారిగా మళ్లీ పెళ్లి అనే చిత్రంలో కనిపించారు. శరత్ బాబు మృతి పట్ల ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంచ్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి, టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. (ఇది చదవండి: ఆయన మృతి ఇండస్ట్రీకి తీరని లోటు: పోసాని కృష్ణమురళి) తెలుగు చలనచిత్ర రంగంలో కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా అన్ని రకాల పాత్రలను పోషించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గొప్ప నటుడు శరత్‌బాబుగారు. నేడు ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం బాధాకరం. శరత్‌బాబు గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/NaTgovOKOW — YS Jagan Mohan Reddy (@ysjagan) May 22, 2023 -
ఎమ్మెల్యే మల్లాది విష్ణును పరామర్శించిన సీఎం జగన్
సాక్షి, విజయవాడ: విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఆయన కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. ఆయన తల్లి బాలాత్రిపుర సుందరమ్మ కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతూ ఆమె మృతి చెందారు. విజయవాడ ఎంజీ రోడ్‌లోని మల్లాది విష్ణు నివాసానికి చేరుకున్న సీఎం.. బాలా త్రిపుర సుందరమ్మ భౌతిక కాయానికి నివాళులర్పించారు. పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు సంఘీభావం తెలిపారు. (చదవండి: తుని రైలు దగ్ధం కేసును కొట్టివేసిన విజయవాడ రైల్వే కోర్టు) -
రవ్వా శ్రీహరి మృతిపై సీఎం వైఎస్ జగన్ సంతాపం
-
కే. విశ్వనాథ్ సతీమణి మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
దివంగత దర్శకుడు, కళాతపస్వి కే. విశ్వనాథ్ సతీమణి జయలక్ష్మి (86) మృతి పట్ల ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. కళాతపస్వి కన్నుమూసిన 24 రోజులకే ఆమె మృతి చెందడం గమనార్హం. గుండెపోటుతో ఆమె కన్నుమూశారు. కాగా.. ఫిబ్రవరి 2వ తేదీన వృద్ధాప్యరిత్యా సమస్యలతో దర్శకదిగ్గజం కాశీనాధుని విశ్వనాథ్(92) కన్నుమూశారు. అయితే.. ఆయన మృతి చెందినప్పటి నుంచి జయలక్ష్మి తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం గుండెపోటు రావడంతో మరణించారు. విశ్వనాథ్‌కు 20 ఏళ్ల వయసున్నప్పుడు జయలక్ష్మితో వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు సంతానం. ఎవరూ సినీ పరిశ్రమలోకి ప్రవేశించలేదు. అలాగే.. తన భార్య తనతో ఎప్పుడూ సినిమాల గురించి చర్చించేది కాదని, సినిమాలను కూడా విశ్లేషించేది కాదని తరచూ ఇంటర్వ్యూలలో ఆయన చెప్పారు కూడా. -
నందమూరి తారకరత్న మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం
నందమూరి తారకరత్న మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఆయన అకాల మరణం తనను బాధించిందని విచారం వ్యక్తం చేశారు. తారకరత్న సినీ ప్రపంచంలో తనకుంటూ ఓ ముద్ర వేసుకున్నారని కొనియాడారు. ఇలాంటి బాధాకర సమయంలో తారకరత్న కుటుంబసభ్యులకు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్లు మోదీ పేర్కొన్నారు. ఈమేరకు ప్రధాని కార్యాలయం పీఎంఓ ట్వీట్ చేసింది. Pained by the untimely demise of Shri Nandamuri Taraka Ratna Garu. He made a mark for himself in the world of films and entertainment. My thoughts are with his family and admirers in this sad hour. Om Shanti: PM @narendramodi — PMO India (@PMOIndia) February 19, 2023 రేవంత్ రెడ్డి సంతాపం.. తారకరత్న మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణవార్త తనను బాధించిందన్నారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబసభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. Deeply saddened by the untimely demise of shri #Tarakaratna garu… My deepest condolences to the friends and family.I pray God to give them strength in this hour of grief. pic.twitter.com/SmPINq1PZb — Revanth Reddy (@revanth_anumula) February 19, 2023 గుండెపోటుతో 23 రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన తారకరత్న శనివారం బెంగళూరులోని హృదయాలయలో కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నారు. బండి సంజయ్ ట్వీట్.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా తారకరత్న మృతికి సంతాపం తెలిపారు. తెలుగు సినిమా నటుడు నందమూరి తారకరత్న గారి అకాల మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. తన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి 🙏 pic.twitter.com/BXEIVTXwIM — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) February 18, 2023 హరీశ్‌రావు.. తారకరత్న మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు ట్వీట్ చేశారు. ఆయన కుటుంసభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. Deeply saddened to know the demise of actor Nandamuri Taraka Ratna. Heartfelt condolences to his family and friends at this time of grief. May his Soul Rest in Peace. Om Shanti🙏🏾 pic.twitter.com/XRn28J6afq — Harish Rao Thanneeru (@BRSHarish) February 18, 2023 డీకే అరుణ బీజేపీ నేత డీకే అరుణ కూడా తారకరత్న మృతికి ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. Extremely saddened to learn about the passing of #Telugu actor Shri Nandamuri #TarakaRatna Ji. His sudden demise has left the entire Telugu film industry in a state of shock and mourning. My deepest condolences to his family. Om Shanti 🙏🏻 pic.twitter.com/6q9bD2ZelS — D K Aruna (@aruna_dk) February 19, 2023 చంద్రబాబు సంతాపం.. తారకరత్న తమ కుటుంబానికి తీవ్ర విషాదం మిగిల్చి వెళ్లిపోయాడని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. 23 రోజుల పాటు మృత్యువు తో పోరాడిన తారకరత్న... చివరికి మాకు దూరం అయ్యి మా కుటుంబానికి విషాదం మిగిల్చాడు. తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.(2/2) — N Chandrababu Naidu (@ncbn) February 18, 2023 నారా లోకేష్.. తారకరత్న మృతి తమ కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఆయన మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. బావ అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ గొంతు ఇక నాకు వినిపించదు. నేనున్నానంటూ నా వెంట నడిచిన ఆ అడుగుల చప్పుడు ఆగిపోయింది. నందమూరి తారకరత్న మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది. తెలుగుదేశం యువతేజం తారకరత్న మృతి మా కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు.(1/2) pic.twitter.com/MLLlp3p60G — Lokesh Nara (@naralokesh) February 18, 2023 -
తారకరత్న మృతిపై ఎంపీ విజయసాయిరెడ్డి సంతాపం
సాక్షి, అమరావతి: నందమూరి తారకరత్న మృతిపై ఎంపీ విజయసాయిరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. తారకరత్న అకాల మరణం అత్యంత బాధాకరమని విజయసాయిరెడ్డి అన్నారు. ‘‘సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని కోరుకున్నాం. కాని విధి మరోలా తలచింది. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రార్థిస్తున్నాను. అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి’’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. తారకరత్న శనివారం రాత్రి కన్ను మూశారు. వైద్యులు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. 23 రోజులపాటు చావు బతుకుల మధ్య పోరాటం చేసిన తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన పార్థివ దేహాన్ని శనివారం రాత్రి హైదరాబాద్‌కు తరలించారు. తారకరత్న మృతిపై ఏపీ సీఎం వైఎస్ జగన్‌తోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. చదవండి: నందమూరి తారకరత్న కన్నుమూత సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని కోరుకున్నాం. కాని విధి మరోలా తలచింది. నందమూరి తారకరత్న అకాల మరణం అత్యంత బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రార్థిస్తున్నాను. అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/7JRmclqyLv — Vijayasai Reddy V (@VSReddy_MP) February 18, 2023 -
తారకరత్న మృతి పట్ల చిరంజీవి, రవితేజ సంతాపం..
హైదరాబాద్: ఆస్పత్రిలో 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి శనివారం కన్నుమూసిన నందమూరి తారకరత్న(39) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను కలచివేసిందన్నారు. ప్రకాశవంతమైన, ప్రతిభావంతుడైన, ఆప్యాయత గల యువకుడు చిన్నవయసులోనే మరణించాడని చిరంజీవి విచారం వ్యక్తం చేశారు. తారకరత్న కుటుంబసభ్యులతో పాటు అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు చిరంజీవి ట్వీట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. Deeply saddened to learn of the tragic premature demise of #NandamuriTarakaRatna Such bright, talented, affectionate young man .. gone too soon! 💔 💔 Heartfelt condolences to all the family members and fans! May his Soul Rest in Peace! శివైక్యం 🙏🙏 pic.twitter.com/noNbOLKzfX — Chiranjeevi Konidela (@KChiruTweets) February 18, 2023 రవితేజ సంతాపం.. మృత్యువుతో పోరాడి తారకరత్న మరణించారనే విషాద వార్త తెలిసి చాలా బాధపడ్డానని రవితేజ ట్వీట్ చేశారు. ఇతరులపట్ల దయగల స్వభావం కలగిన ఆయన ఎప్పటికీ గుర్తిండిపోతారని ట్వీట్ చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానూభూతి తెలిపారు. ఈమేరకు రవితేజ ట్వీట్ చేశారు. Profoundly saddened to learn about the tragic demise of dear Taraka Ratna after battling hard! He will always be fondly remembered for his kind-hearted nature towards everyone! My sincere condolences to his dear ones. Om Shanti 🙏 — Ravi Teja (@RaviTeja_offl) February 18, 2023 -
నందమూరి తారకరత్న మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గత 23 రోజులుగా బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం కన్నుమూశారు. తారకరత్న మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
వైవీ రావు మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీ రావు గుండెపోటుతో మృతిచెందారు. గొల్లపూడిలోని ఆయన నివాసంలో శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. వైవీ రావు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. చదవండి: వాహనదారులకు అలర్ట్! విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు.. -
గాయని వాణీ జయరాం మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: గాయని వాణీ జయరాం మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. పాన్-ఇండియా స్థాయిలో వాణీ జయరాం బలమైన శాస్త్రీయ పునాదిని నిర్మించారని సీఎం జగన్ అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రముఖ సింగర్ వాణీ జయరాం హఠాన్మరణం చెందారు. చెన్నైలోని తన నివాసంలో శనివారం ఆమె తుదిశ్వాస విడిచారు. కళాతపస్వి విశ్వానాథ్ మరణం నుంచి కోలుకోకముందే వాణీజయరాం మరణంతో మరోసారి సినీ పరిశ్రమ విషాదంలోకి వెళ్లింది. కాగా చెన్నైలో జన్మించిన ఆమె దాదాపు వెయ్యి సినిమాల్లో పది వేలకుపైగా పాటలు పాడారు. తెలుగు, తమిళంతో కలిపి 14 భాషల్లో 5 దశాబ్దాలుగా వాణీ జయరాం వెండితెరకు తన గ్రాత్రాన్ని అందించారు. ఇక సినీ పరిశ్రమకు ఆమె చేసిన కృషికి గానూ ఇటీవల భారత ప్రభుత్వం ఆమెకు పద్మ భూషన్ అవార్డును ప్రకటించింది. అయితే అవార్డును అందుకోకముందే వాణీ మృతి చెందడం విచారకరం. చదవండి: వాణీ జయరాం ముఖంపై తీవ్రగాయాలు.. అసలేం జరిగింది! కాగా 1945 నవంబర్ 30న తమిళనాడులోని వేలూరులో జన్మించారు వాణీ జయరాం. ఆమె అసలు పేరు కలైవాణి. 1971లో ఆమె గాయనిగా సినీరంగ ప్రవేశం చేశారు. రంగరామానుజా అయ్యంగార్ వద్ద ఆమె శాస్త్రీయ సంగీతంతో శిక్షణ తీసుకున్నారు. -
కె.విశ్వనాథ్ కన్నుమూతపై ప్రధాని మోదీ ఏమన్నారంటే..
దిగ్గజ దర్శకుడు, కళాతపస్వి కే విశ్వనాథ్ కన్నుమూతపై తెలుగు చలన చిత్ర పరిశ్రమతో పాటు ఆయనకు అనుబంధం ఉన్న ఇతర భాషల ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు. ఈ క్రమంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ ద్వారా సంతాపం ప్రకటించారు. కే విశ్వనాథ్‌గారు మృతి చెందడం బాధాకరం. ఆయన సినీ ప్రపంచంలో ఓ ప్రముఖుడు. తన సృజనాత్మకతతో పాటు బహుముఖ దర్శకుడిగా తనని తాను ప్రత్యేకం చేసుకున్న వ్యక్తి. వివిధ శైలిలో తెరకెక్కిన ఆయన సినిమాలు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించాయి. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. Saddened by the passing away of Shri K. Viswanath Garu. He was a stalwart of the cinema world, distinguishing himself as a creative and multifaceted director. His films covered various genres and enthralled audiences for decades. Condolences to his family and admirers. Om Shanti. — Narendra Modi (@narendramodi) February 3, 2023 విశ్వనాథ్ తన చిత్రాలతో అంతర్జాతీయ గుర్తింపు సైతం పొందారు. కమర్షియల్ సినిమాకు.. ఆర్ట్‌ను జోడించడం, తన చిత్రాల్లో సంగీతానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం ఆయన శైలి. కులవర్ణ లింగ వివక్ష, స్త్రీ ద్వేషం, మద్య వ్యసనం.. ఇలా సామాజిక-ఆర్థిక మేళవింపుగా ఉండేవి ఆయన చిత్రాలు. తెలుగులోనే కాకుండా హిందీ చలన చిత్ర పరిశ్రమలో ఆయన తొమ్మిది చిత్రాలు తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇక నటుడిగానూ తెలుగుతో పాటు తమిళ, కన్నడ చిత్రాల్లో అలరించారాయన. నటుడిగా ఆయన చివరి చిత్రం(కన్నడ) ఒప్పంద(2022). -
ఆడారి తులసీరావు కుటుంబానికి సీఎం జగన్ పరామర్శ (ఫొటోలు)
-
ఆడారి తులసీరావు భౌతికకాయానికి సీఎం జగన్ నివాళులు
సాక్షి, అనకాపల్లి: జిల్లాలోని యలమంచిలికి బయల్దేరి వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. తులసీరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. తులసీరావు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తులసీరావు భౌతికకాయానికి నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు సీఎం జగన్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
విశాఖ డెయిరీ ఛైర్మన్ ఆడారి తులసీరావు మృతిపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి: విశాఖ డెయిరీ ఛైర్మన్ ఆడారి తులసీరావు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆడారి తులసీరావు డెయిరీ రంగానికి ఎనలేని సేవ చేశారన్నారు. తులసీరావు కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆడారి తులసీరావు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన హైదరాబాద్ కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు. తులసీరావు మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు. 1939 ఫిబ్రవరి 1న అనకాపల్లి జిల్లా యలమంచిలిలో వెంకటరామయ్య, సీతయ్యమ్మ దంపతులకు జన్మించారు. సుమారు 35 ఏళ్లపాటు విశాఖ డైరీ చైర్మన్‌గా కొనసాగిన ఆయన విశాఖ డెయిరీని ప్రగతి పథంలో నడిపించారు. రైతుల కోసం విశాఖ డెయిరీ తరఫున కృషి ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. చదవండి: సాక్షి టీవీపై చంద్రబాబు అక్కసు -
ప్రధాని మోదీకి సీఎం జగన్ ప్రగాఢ సానుభూతి
సాక్షి, తాడేపల్లి: ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. హీరాబెన్ మృతి పట్ల అమిత్ షా, వెంకయ్యనాయుడు, యోగి ఆదిత్యనాథ్, దిగ్విజయ్‌సింగ్ సంతాపం తెలిపారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ (100) కన్నుమూశారు. అనారోగ్యంతో రెండు రోజుల క్రితం ఆమె ఆస్పత్రిలో చేరారు. అహ్మదాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గురువారం అర్ధరాత్రి సమయంలో మృతి చెందారు. చదవండి: (ప్రధాని మోదీకి మాతృ వియోగం) -
కందుకూరు ఘటనపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి
-
కందుకూరు ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన
సాక్షి, అమరావతి: కందుకూరు ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి రూ.50 వేల చొప్పున పరిహారం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఢిల్లీ పర్యనటలో ఉన్న ముఖ్యమంత్రి ఆమేరకు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఆయా కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అండగా నిలుస్తామన్నారు. గవర్నర్ దిగ్భ్రాంతి నెల్లూరు జిల్లా కందుకూరులో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఇద్దరు మహిళలతో సహా 8 మంది మృతి ఘటనపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతాపం ప్రకటించారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చదవండి: ‘మీరు ఇక్కడే ఉండండి.. నేను వెళ్లొచ్చి సభలో మాట్లాడతా’.. ఇదేం తీరు బాబూ.. -
ఆమె మనోస్థైర్యం ఎంతో అద్భుతం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కవయిత్రి సిరిసిల్ల రాజేశ్వరి(42) మరణం పట్ల తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సంతాపం తెలియజేశారు. సిరిసిల్ల పట్టణంలో ఓ నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించిన రాజేశ్వరి, తన వైకల్యాలను జయించి ఆత్మవిశ్వాసంతో కాళ్లనే చేతులుగా మల్చుకొని, అక్షరాలు నేర్చుకుని కవితలు రాసిన తీరు అద్భుతమని కేటీఆర్ కొనియాడారు. శరీరానికే వైకల్యం కానీ, ఆలోచనకి.. ఆశయానికి కాదని రాజేశ్వరి తన మనోస్థైర్యం నిరూపించిందన్నారు కేటీఆర్. ఆమె స్ఫూర్తివంతమైన జీవన ప్రయాణం ఎంతోమందికి ఆదర్శమన్న ఆయన.. రాజేశ్వరి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థించారు. సిరిసిల్ల నిరుపేద చేనేత కుటుంబంలో జన్మించిన రాజేశ్వరి జీవితాన్ని వైకల్యం కమ్ముకుంది. కానీ, చెదరని గుండె నిబ్బరంతో కాళ్లనే చేతులుగా మలుచుకుని తన ఆత్మవిశ్వాసాన్ని అక్షరాలుగా నిలబెట్టి ఎన్నో కవితలు రాశారామె. ఆత్మవిశ్వాసంతో ఆమె రాసిన కవితలు మంచి ఆదరణ పొందాయి. ‘‘సంకల్పం ముందు వైకల్యం ఎంత!. ధృడ చిత్తం ముందు దురదృష్టం ఎంత!. ఎదురీత ముందు విధిరాత ఎంత!. పోరాటం ముందు ఆరాటం ఎంత!.. అంటూ రాజేశ్వరి ఓ కవిత రాసిందామె. రాజేశ్వరి రాసిన కవితలను సుద్దాల ఫౌండేషన్ సిరిసిల్ల రాజేశ్వరి కవితలు పేరుతో కవిత సంకలనాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2014 లో వచ్చిన ఈ కవిత సంకలనానికి ‘‘జీవితమే కవిత్వం..’’ అంటూ ముందుమాట రాస్తూ డాక్టర్ శీలాలోలిత చివర్లో చెప్పిన మాటలు "బతుకుతున్నాం బాధపడుతున్నం అంతవరకే. కానీ అమె మాత్రం జీవిస్తుంది.. అనుభవిస్తుంది. అనుభవల నుంచి వచ్చింది రాజేశ్వరి కవిత్వం అంటూ పేర్కొన్నారు. సంబంధిత వార్త: కాళ్లతో కవితలు రాసిన ‘సిరిసిల్ల’ రాజేశ్వరి ఇక లేరు -
కైకాల సత్యనారాయణ మృతి.. తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం
సాక్షి, హైదరాబాద్: బహుముఖ కళాకారుడు, మాజీ లోక్‌సభ సభ్యుడు కైకాల సత్యనారాయణ మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. పురాణాల నుంచి క్రైమ్ థ్రిల్లర్స్ వరకు స్పష్టమైన వ్యక్తీకరణలతో విభిన్న పాత్రలను అలవోకగా పోషించిన మహోన్నత వ్యక్తిగా కైకాలను సీఎం జగన్ ప్రశంసించారు. నటుడిగా సుదీర్ఘకాలం సేవలందించిన కైకాలది తెలుగు చిత్ర సీమలో ప్రత్యేక స్థానం అంటూ కొనియాడారు. కైకాల మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు అన్నారు. ఈ సందర్భంగా కైకాల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కైకాల సత్యనారాయణ గారు. నటునిగా సుదీర్ఘ కాలం సేవలందించి ఎన్నో మరపురాని పాత్రలతో మెప్పించారు. ఎంపీ గానూ ప్రజలకు మరింత దగ్గరయ్యారు. కైకాల మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. pic.twitter.com/eJdUwqnINz — YS Jagan Mohan Reddy (@ysjagan) December 23, 2022 సీఎం కేసీఆర్ సంతాపం టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. చలన చిత్ర రంగంలో తొలితరం నటుడిగా పలు విభిన్నమైన పాత్రలను పోషిస్తూ తన వైవిధ్యమైన నటన ద్వారా, మూడు తరాల తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని సీఎం గుర్తుచేసుకున్నారు. కైకాల మరణం తెలుగు చలన చిత్ర రంగానికి తీరనిలోటని విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ప్రముఖ నటుడు శ్రీ కైకాల సత్యనారాయణ మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. తెలుగు చలన చిత్ర రంగంలో తొలితరం నటుడిగా విభిన్న పాత్రలను పోషిస్తూ, తమ వైవిధ్యమైన నటన ద్వారా, మూడు తరాల ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని సీఎం గుర్తుచేసుకున్నారు. — Telangana CMO (@TelanganaCMO) December 23, 2022 చదవండి: (నవరస నటనా సార్వభౌముడి సినీ, రాజకీయ ప్రస్థానం ఇదే..) -
తుమ్మలగుంటకు సీఎం జగన్.. ఎమ్మెల్యే చెవిరెడ్డి కుటుంబానికి పరామర్శ
సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తుమ్మలగుంటకు విచ్చేయనున్నారు. ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తండ్రి మణిరెడ్డికి నివాళులర్పించనున్నారు. అనంతరం ఆయన కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చనున్నారు. గురువారం సాయంత్రం 5.10 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గాన 5.40కు తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసానికి చేరుకోనున్నారు. భద్రతా ఏర్పాట్ల పరిశీలన ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో బుధవారం సాయంత్రం తిరుపతి వెస్ట్ డీఎస్పీ నరసప్ప, ఎస్పీడీసీఎల్ ఎస్ఈ కృష్ణారెడ్డి, ఎంఆర్‌పల్లి సీఐ సురేంద్రరెడ్డి, ఆర్అండ్బీ ఈఈ సుధాకర్‌రెడ్డి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించారు. లైటింగ్‌కు ఇబ్బంది లేకుండా విద్యుత్ అవసరమైన జనరేటర్లు, లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. చదవండి: (వైఎస్సార్ జిల్లాలో సీఎం జగన్ మూడు రోజుల పర్యటన.. షెడ్యూల్ ఖరారు) -
కృష్ణ పార్థివదేహం వద్ద బోరున ఏడ్చేసిన మోహన్ బాబు
సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహనికి సీనియర్ నటుడు మోహన్ బాబు నివాళులర్పించారు. కృష్ణ పార్థివదేహన్ని చూసిన ఆయన అక్కడే బోరున విలపించారు. కృష్ణను చూసిన వెంటనే బాధను దిగమింగుకోలేక పోయారు. ఆయనతో ఉన్న క్షణాలను మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు. ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. (చదవండి: ఆయన లేరన్న వార్త విని నా గుండె పగిలింది.. రామ్ చరణ్ ట్వీట్) అక్కడే మహేశ్ బాబును హత్తుకుని ఓదార్చారు. వారి కుటుంబసభ్యులను మోహన్ బాబు పరామర్శించారు. ఇలాంటి బాధాకర సమయంలో దేవుడు ఆ కుటుంబానికి ధైర్యాన్నివ్వాలని ఆకాంక్షించారు. కృష్ణ మన మధ్య నుంచి వెళ్లిపోవడం తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు. తెలుగు సినీ పరిశ్రమలో ఆయన చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కృష్ణ మృతి పట్ల నటుడు సాయి కుమార్ సంతాపం
-
కృష్ణ మృతి పట్ల నటుడు సుమన్ సంతాపం
-
కృష్ణ మృతిపట్ల సీఎం జగన్ దిగ్బ్రాంతి
-
ములాయం మృతిపై తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం
తాడేపల్లి/హైదరాబాద్: సమాజ్‌వాదీ వ్యవస్థాపకులు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతాపం తెలిపారు. 82 ఏళ్ల ములాయం అనారోగ్య సమస్యలతో గురుగ్రామ్ మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ములాయం మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. జాతీయ రాజకీయాల్లో ములాయం కీలక పాత్ర పోషించారని, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారని సీఎం జగన్ సంతాప ప్రకటనలో తెలియజేశారు. ఇక ములాయం మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం ములాయం తన జీవితాంతం పని చేశారని సీఎం కేసీఆర్ కొనియాడారు. ములాయం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. -
ములాయం కన్నుమూత.. ప్రధాని భావోద్వేగం
రాజకీయ దిగ్గజం, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకులు, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల పలువురు సంతాపం తెలియజేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు ములాయంతో ఉన్న అనుబంధాన్ని ట్విటర్ వేదికగా గుర్తు చేసుకున్నారు. ములాయం సింగ్ యాదవ్‌గారు ఒక అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న మనిషి. ప్రజల సమస్యల పట్ల సున్నితంగా ఉండే నిరాడంబరమైన నాయకుడిగా విస్తృతంగా ప్రశంసించబడ్డారు. శ్రద్ధతో ఆయన ప్రజలకు ఎన్నో ఏళ్లు సేవలదించారు. లోక్‌నాయక్ జయప్రకాశ్, డాక్టర్ లోహియా ఆదర్శాలను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ములాయం తన జీవితాన్ని అంకితం చేశారు అని మోదీ ట్వీట్ చేశారు. యూపీ, జాతీయ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యంలో కీలక సైనికుడిగా పనిచేశారు. రక్షణ మంత్రిగా, బలమైన భారతదేశం కోసం పనిచేశారు. ఆయన పార్లమెంటరీ జోక్యాలు తెలివైనవి. వేర్వేరు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయం నుంచే ములాయం సింగ్‌ను ఎన్నోసార్లు కలిశాను. ఆయన అభిప్రాయాలను వినడానికి నేను ఎప్పుడూ ఎదురుచూస్తాను. ఆయన మరణం బాధించింది. ఆయన కుటుంబ సభ్యులకు, లక్షల మంది కార్యకర్తలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా.. ఓం శాంతి అంటూ ట్వీట్ చేశారు. Shri Mulayam Singh Yadav Ji was a remarkable personality. He was widely admired as a humble and grounded leader who was sensitive to people’s problems. He served people diligently and devoted his life towards popularising the ideals of Loknayak JP and Dr. Lohia. pic.twitter.com/kFtDHP40q9 — Narendra Modi (@narendramodi) October 10, 2022 I had many interactions with Mulayam Singh Yadav Ji when we served as Chief Ministers of our respective states. The close association continued and I always looked forward to hearing his views. His demise pains me. Condolences to his family and lakhs of supporters. Om Shanti. pic.twitter.com/eWbJYoNfzU — Narendra Modi (@narendramodi) October 10, 2022 Rest in peace Pahlwan ji 🙏🏽#MulayamSinghYadav pic.twitter.com/o9ksAs8jHy — Vijender Singh (@boxervijender) October 10, 2022 రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు, పీసీసీ చీఫ్‌లు, రాజకీయ ప్రముఖులతో పాటు ఇతర సెలబ్రిటీలు సైతం ములాయం కన్నమూత పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. Deeply saddened to hear about the demise of Former Union Defence Minister and Chief Minister of Uttar Pradesh Mulayam Singh Yadav Ji. Netaji was one of the tallest socialist leader our country has seen. pic.twitter.com/nraDdLim5O — Supriya Sule (@supriya_sule) October 10, 2022 End of an Era ! Extremely saddened by the demise of Samajwadi Party supremo and ex-UP CM Sh #MulayamSinghYadav ji . He was a true Statesman . Deepest condolences 🙏🏻 May his departed soul be blessed 🙏🏻 Om Shanti 🙏🏻 pic.twitter.com/t3pazMAzyM — Sonal Goel IAS (@sonalgoelias) October 10, 2022 Former UP CM & one of tallest Indian politician #MulayamSinghYadav ji passes away. A true people’s leader respected across different parties 🙏 Deepest condolences to his family members. May he rest in peace. Om shanti! pic.twitter.com/DiVYfOXYgl — YSR (@ysathishreddy) October 10, 2022 Saddened to learn about the demise of Former Uttar Pradesh chief minister and Samajwadi Party Patron Mulayam Singh Yadav ji. He gave a strong foothold to Samajwadi Party in UP and worked for the upliftment of weaker sections of the society. My condolences. Om Shanti 🙏🏻 pic.twitter.com/ZjegjYuxTP — Praful Patel (@praful_patel) October 10, 2022 -
జాతీయవాద ఉద్యమానికి తీరని లోటు
ప్రముఖ విద్యావేత్త, జాతీయవాది, హిందూధర్మ పరిరక్షకులు గుజ్జుల నర్సయ్య సార్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర మాజీ అధ్యక్షులుగా, ఆలిండియా స్థాయిలో ఉపాధ్యక్షులుగా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులుగా గణనీయమైన స్థాయిలో సేవలు అందించారు. నర్సయ్య తన 81 ఏళ్ల వయసులో 2022 సెప్టెంబర్ 24 హన్మకొండ హంటర్ రోడ్‌లోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య రాజ్యలక్ష్మి, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మారుమూల గ్రామం మండలగూడెంలో 1942 ఆగస్ట్ 8న ఆయన జన్మించారు. 1952లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో స్వయంసేవక్‌గా జీవితాన్ని ప్రారంభిం చారు. 1967లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తగా విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1981లో ఇంగ్లిష్ లెక్చరర్‌గా ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంగ్లిష్ భాషను సులభ శైలిలో బోధించి వారిలో ఇంగ్లిష్ భాష అధ్యయనం పట్ల ఆసక్తి పెంచే మెలకువలు నేర్పించిన ఉత్తమ అధ్యాపకులుగా గుర్తింపు పొందారు. 1986లో ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఆయన బాధ్యతలు స్వీకరించిన సమయంలో రాష్ట్రంలో వామపక్ష భావజాలం కలిగిన విద్యార్థి సంఘాలతో జరిగిన అనేక సంఘర్షణ ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారు. ఉత్తర తెలంగాణ పరిధిలో గల జిల్లాల్లో విశేష పర్యటనలు చేసి విద్యార్థి పరిషత్ కార్యకర్తల్లో జాతీయవాద దృక్పథాన్ని ప్రేరేపించారు. 1992లో ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా వ్యవహరించారు. కొంతకాలం వరంగల్ విభాగ్ ప్రముఖ్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఏబీవీపీ సంస్థకు పూర్తి సమయ కార్యకర్తగా వరంగల్ నుండి దేశ నలుమూలల పని చేయడానికి వెళ్లారు. క్లిష్ట పరిస్థితులలో జాతీయవాద వ్యాప్తి కోసం నిరంతరం పరితపించిన మహానుభావుడు నర్సయ్య. బిహార్ విశ్వవిద్యాలయం ఈసీ మెంబర్‌గా కూడా ఆయన చాలాకాలం సేవలు అందించారు. 2001లో హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల నుండి ఇంగ్లిష్ లెక్చరర్‌గా ఉద్యోగ విరమణ చేశారు. 2007లో భారతీయ జనతా పార్టీ పక్షాన ఎమ్మెల్సీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. ఇంగ్లిష్ లెక్చరర్‌గా నర్సయ్య వడ్డేపల్లిలోని పింగిలి కాలేజీలో, గోదావరిఖని, మంథని, మంచిర్యాల, పెద్దపల్లి, హుజురాబాద్ డిగ్రీ కళాశాలలో పని చేశారు. పలు జూనియర్ డిగ్రీ కళాశాలలు నిర్వహించిన జాతీయ సేవాపతకం శిబిరాల్లో జాతీయ పునర్నిర్మాణంలో యువత పాత్ర అనే అంశంపై అనర్గళంగా ఉపన్యసించి యువతలో సేవాభావం, దేశభక్తి, సంకల్పబలం, మనోధైర్యం కల్పించే ప్రయత్నం చేసిన సామాజిక చైతన్యశీలి ఆయన. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హన్మకొండ చౌరస్తాలోని వేదికపై ఆయన ప్రసంగాలు ప్రజలను ఆలోచింపజేసే విధంగా సాగేవి. నక్సలైట్ల చేతిలో ఏబీవీపీ కార్యకర్తలు మరణించిన సమయంలో నర్సయ్య మొక్కవోని ధైర్యంతో వెళ్లి వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చిన సందర్భాలు అనేకం. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక కార్యక్రమాలలో విద్యార్థులను జాగృతం చేయడంలో కూడా కీలక భూమిక పోషించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఏబీవీపీ చేపట్టిన పాదయాత్రకు పాటలు, మాటలు అందించారు. గుజ్జుల నర్సయ్యసార్ మరణం విద్యారంగానికి, సామాజిక చైతన్యానికి తీరని లోటు. వారి ఆశయాల సాధనకు కృషి చేయడమే ఘనమైన నివాళి. (క్లిక్: సాయుధ పోరాటాన్ని రగిల్చిన అగ్ని కణం చాకలి ఐలమ్మ) - నేదునూరి కనకయ్య వ్యాసకర్త రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ ఎకనామిక్ ఫోరం, సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక, తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం -
బీజేపీ ఎమ్మెల్యే హఠాన్మరణం..ప్రధాని మోదీ సంతాపం
ఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, ఒడిషా ఎమ్మెల్యే బిష్ణు చరణ్ సేథీ(61) హఠాన్మరణం చెందారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన.. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూసినట్లు సమాచారం. లంగ్ ఇన్ఫెక్షన్, మెదడులో రక్తస్రావం గత రెండు నెలలుగా ఆయన ఐసీయూలోనే ఉన్నట్లు ఎయిమ్స్ వర్గాలు వెల్లడించాయి. బిష్ణు చరణ్ మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా ఆయన అందించిన సేవలను గుర్తు చేస్తూ కొనియాడారు. ఒడిషా గవర్నర్ గణేషీ లాల్, సీఎం నవీన్ పట్నాయక్ సంతాపం తెలియజేశారు. Shri Bishnu Charan Sethi Ji made an outstanding contribution to Odisha's progress. He distinguished himself as a hardworking legislator and contributed greatly to social empowerment. Saddened by his demise. Condolences to his family and supporters. Om Shanti. — Narendra Modi (@narendramodi) September 19, 2022 బీజేపీ ఒడిషా విభాగం వైస్ ప్రెసిడెంట్‌గా పని చేశారు బిష్ణు చరణ్. టికెట్ మీద మొదటిసారిగా 2000 సంవత్సరంలో బిష్ణు చరణ్ గెలుపొందారు. భద్రక్ జిల్లా ధామ్‌నగర్ నియోజకవర్గం నుంచి 2019లో గెలుపొందారు. ఒడిషా అసెంబ్లీలో ప్రతిపక్ష ఉపనేతగా ఆయన పనిచేశారు. -
సికింద్రాబాద్ ప్రమాద ఘటనపై ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లో ఓ లాడ్జిలో జరిగిన ఘోర ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. సెల్లార్లో ఈ-బైకులు పేలి.. ఆ అగ్నిప్రమాదంతో అదే కాంప్లెక్స్‌లోని లాడ్జిలో బస చేసిన ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని మోదీ.. గాయపడినవాళ్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక ఈ ప్రమాదంలో మరణించిన వాళ్లకు పీఎంఎన్ఆర్ఎఫ్(ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి) తరపున రూ.2 లక్షలు, గాయపడిన వాళ్లకు రూ.50వేలు ఆర్థిక సాయం అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ట్విటర్లో ఓ ట్వీట్ చేసింది. Saddened by the loss of lives due to a fire in Secunderabad, Telangana. Condolences to the bereaved families. May the injured recover soon. Rs. 2 lakh from PMNRF would be paid to the next of kin of each deceased. Rs. 50,000 would be paid to the injured: PM @narendramodi — PMO India (@PMOIndia) September 13, 2022 -
ఓ లెజెండ్‌ని కోల్పోయాం.. కృష్ణంరాజు మృతిపై అల్లు అర్జున్ దిగ్భ్రాంతి
సీనియర్ నటుడు కృష్ణంరాజు(83) మరణం పట్ల అల్లు అర్జున్ దిగ్భ్రాంతి వ్యకం చేశారు. ఆయన మరణ వార్త తెలియగానే ఎంతో డిస్టర్బ్ అయ్యానని, టాలీవుడ్ ఓ లెజెండ్‌ని కోల్పోయిందన్నారు. ‘ కృష్ణంరాజు గారి మరణ వార్త తెలియగానే ఎంతో డిస్టర్బ్ అయ్యాను, ఆయన మరణం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటు. 50 సంవత్సరాలకు పైగా ఆయన ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించారు. సినీ రంగం పై ఆయన తనదైన ముద్ర వేశారు. అలాంటి అద్భుతమైన ఒక లెజెండ్ ను కోల్పోవడం టాలీవుడ్ కు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. మరో వైపు హీరో నాని కూడా కృష్ణంరాజు మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. Extremely saddened to learn about the sudden passing of Krishnam Raju garu. His contribution to the film industry was immense. My deepest condolences to his family, friends & fans . May his soul rest in peace. — Allu Arjun (@alluarjun) September 11, 2022 ‘అద్భుతమైన జ్ఞాపకాలు పంచినందుకు ధన్యవాదాలు సార్. మీతో కలసి నటించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలి. ప్రభాస్ అన్న , ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని నాని ట్వీట్ చేశారు. కాగా, నాని హీరోగా నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో కృష్ణం రాజు ఓ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. Thank you for all the memories sir. Honoured to have shared screen space with you. Rest in peace krishnam raju gaaru 🙏🏼 Strength and condolences to Prabhas anna and family. — Nani (@NameisNani) September 11, 2022 -
ఆరోగ్యంగా తిరిగివస్తారనుకున్నా.. ఇలా అవుతుందని ఊహించలేదు: చిరంజీవి
ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు భౌతికకాయాన్ని జూబ్లిహిల్స్‌లోని నివాసానికి తరలించారు.అక్కడ కుటుంసభ్యులతో పాటు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. కృష్ణంరాజును కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు.ఈ సందర్భంగా కృష్ణంరాజుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఈరోజు చాలా దుర్ధినమని, ఆయన లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని చిరంజీవి పేర్కొన్నారు. ఆయన తీరు ఎంతో రాజసంగా ఉండేది : చిరంజీవి ఆయన గతంలో చాలాసార్లు అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లారు. చికిత్స అనంతరం ప్రతిసారి ఆరోగ్యంగా తిరిగి వచ్చేవారు. ఈసారి కూడా అలాగే ఆరోగ్యంగా తిరిగివస్తారనుకున్నా. ఇలా అవుతుందని ఊహించలేదు. మొగల్తూరులో చిన్నపుడు అయన చూడటం కోసం ఎగబడిన వాళ్ళలో నేను ఉన్నను. ఇంకా ఆ దృశ్యం నా కళ్ళలో కదలాడుతూ ఉంది.ఆయన తీరు ఎంతో రాజసంగా ఉండేది.రావుగోపాల్ రావు లాంటి వాళ్లు రాజావారు రాజావారు అని పిలిచేవారు.కృష్ణంరాజు మహావృక్షం లాంటివారు ఈరోజు ఆ మహావృక్షం నేలకొరిగింది.పరిపూర్ణమై జీవితాన్ని అనుభవించారు..ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోుకుంటున్నాను అని పేర్కొన్నారు. చాలా మంచి మనిషి.. దురదృష్టకరం : దిల్‌రాజు 'మంచి మనిషి, మహ మనిషి అయన్ని కోల్పోవడం దురదృష్టకరం. ఆయన లానే అన్ని గుణాలు ప్రభాస్‌లో ఉన్నాయి. కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను' నాకు చాలా బాధాకరమైన రోజిది : మహేష్ బాబు 'కృష్ణంరాజు గారి మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. నాకు, చిత్ర పరిశ్రమకు చాలా బాధాకరమైన రోజిది. కృష్ణంరాజు గారి జీవితం, పని చేసిన విధానం, సినిమాకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.ప్రభాస్, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను'. మా ఇంట్లో ఎక్కువగా మాట్లాడుకునే వ్యక్తి కృష్ణంరాజు: పవన్ కళ్యాణ్ ఎంతో సుప్రసిద్ధ నటుడు, మా కుటుంబానికి ఎంతో సానిహిత్యం ఉన్న వ్యక్తి. అందరి మంచి కోరుకునే వ్యక్తి. మా ఇంట్లో ఎక్కువగా మాట్లాడుకునే వ్యక్తి కృష్ణం రాజు.ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Krishnam Raju: కృష్ణంరాజు మృతి.. ప్రముఖుల సంతాపం
ప్రముఖ నటుడు రెబల్‌స్టార్ కృష్ణం రాజు(83) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ సంతాపం Saddened by the passing away of Shri UV Krishnam Raju Garu. The coming generations will remember his cinematic brilliance and creativity. He was also at the forefront of community service and made a mark as a political leader. Condolences to his family and admirers. Om Shanti pic.twitter.com/hJyeGVpYA5 — Narendra Modi (@narendramodi) September 11, 2022 కృష్ణంరాజు మృతిపట్ల సీఎం జగన్ సంతాపం ప్రముఖ నటుడు, మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి మృతి బాధాకరం. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయం. కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. — YS Jagan Mohan Reddy (@ysjagan) September 11, 2022 ఏపీ గవర్నర్ సంతాపం మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ చలనచిత్ర నటుడు కృష్ణంరాజు ఆకస్మిక మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణం రాజు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు గవర్నర్ సంతాపం తెలిపారు. కృష్ణంరాజు మరణం, తెలుగు వెండితెరకు తీరని లోటు: సీఎం కేసీఆర్ ప్రముఖ చలనచిత్ర నటుడు, తెలుగు సినీహీరో, మాజీ కేంద్రమంత్రి.. కృష్ణం రాజు (ఉప్పలపాటి వెంకట కృష్ణం రాజు) మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. తన సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి, తన విలక్షణ నటనా శైలితో, 'రెబల్ స్టార్'గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం, తెలుగు వెండితెరకు తీరని లోటని సీఎం కేసిఆర్ పేర్కొన్నారు. లోక్‌సభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా, రాజకీయ పాలనా రంగం ద్వారా, దేశ ప్రజలకు సేవలందించిన కృష్ణంరాజు మరణం విచారకరమని సీఎం అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. దివంగత కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు సంతాపం విజయవాడ: మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడు కృష్ణంరాజు మృతికి ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు సంతాపం ప్రకటించారు. ఉభయగోదావరి జిల్లాల నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున కేంద్ర మంత్రిగా సేవలందించిన పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు కృష్ణంరాజు మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. వారి పవిత్ర ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. కృష్ణంరాజు మృతికి చంద్రబాబు సంతాపం ప్రముఖ సినీ నటులు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు మృతికి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. తన విలక్షణమైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కృష్ణంరాజు మరణం ఎంతో బాధ కలిగించిందని చంద్రబాబు అన్నారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన సానుభూతి తెలిపారు. టీపీసీసీ రేవంత్‌రెడ్డి సంతాపం ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్రమంత్రి కృష్ణం రాజు మృతికి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు.'రెబల్ స్టార్' గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు మరణం, తెలుగు వెండితెరకు తీరని లోటని.. కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మహేష్‌బాబు సంతాపం Shocked to learn that Krishnam Raju garu is no more... A very sad day for me and the entire industry. His life, his work and his immense contribution to cinema will always be remembered. My deepest condolences to Prabhas and the entire family during this difficult time 🙏 — Mahesh Babu (@urstrulyMahesh) September 11, 2022 అనుష్క సంతాపం కృష్ణం రాజు మృతిపట్ల నటి అనుష్క దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కృష్ణంరాజు మనసు చాలా గొప్పదని, ఎప్పటికీ అందరి హృదయాల్లో జీవించి ఉంటారని పేర్కొంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించింది. ఈ మేరకు కృష్ణంరాజుతో కలిసి తీసుకున్న ఓ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ►తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రముఖ నటుడు కృష్ణంరాజు మృతిపట్ల సంతాపం ప్రకటించారు. Saddened to learn about the demise of one of the most popular stars of Telugu Cinema, Rebel star Sri Krishnam Raju Garu My wholehearted condolences to Prabhas Garu, his family members & friends Rest in peace #KrishnamRaju Garu 🙏 — KTR (@KTRTRS) September 11, 2022 ► మంచు విష్ణు సంతాపం Heartbroken 😔. #KrishnamRaju 😢 Our family has lost our elder. A Legend. — Vishnu Manchu (@iVishnuManchu) September 11, 2022 సుబ్బి రామి రెడ్డి సంతాపం కృష్ణంరాజు మృతి పట్ల మాజీ ఎంపీ సుబ్బిరామిరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘కృష్ణం రాజు లేడంటే నమ్మలేక పోతున్నాను. దాదాపుగా 50 ఏళ్లుగా సన్నిహితుడు. నా సినిమాల్లో వంశోదరకుడు, గాంగ్ మాస్టర్ చిత్రాల్లో నటించాడు. ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. ప్రభాస్ అంటే ఆయనకు చాలా ప్రేమ. ఏన్నాఆర్, ఎన్టీఆర్ తర్వాత కృష్ణం రాజు మలీ తరం నాయకుడు. ఆయనకు ఆత్మకు శాంతి కలిగి, కుటుంబానికి దైర్యం చేకూరాలని కోరుకుంటున్నాను’అని రామిరెడ్డి అన్నారు. -
ఈటల మల్లయ్య మృతిపట్ల మంత్రి కేటీఆర్ సంతాపం
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తండ్రి మల్లయ్య(104) మృతిపట్ల తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. ఈటల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించిన కేటీఆర్.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కొంతకాలంగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్న మల్లయ్య మెదక్ జిల్లాలోని ఆర్వీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి బ్రెయిన్‌డెడ్‌తో తుదిశ్వాస విడిచారు. మృతుడు మల్లయ్యకు ముగ్గురు కుమారులు, ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. My wholehearted condolences to Sri @Eatala_Rajender Garu and his family members on the loss of Sri Eatala Mallaiah Garu May his soul rest in peace 🙏 — KTR (@KTRTRS) August 24, 2022 -
కశ్మీర్ ప్రమాదంలో ఏపీ జవాన్ వీరమరణం.. సీఎం వైఎస్ జగన్ సంతాపం
సంబేపల్లె: కశ్మీర్ లోయలో బస్సు పడిన ఘటనలో అన్నమయ్య జిల్లా సంబేపల్లె మండలం దేవపట్లకు చెందిన జవాన్ దేవరింటి రాజశేఖర్ (35) మృతి చెందినట్లు బంధువులకు సమాచారం అందింది. బద్రీనాథ్ బందోబస్తు ముగించుకుని తిరిగి వస్తున్న ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) బస్సుకు మంగళవారం ప్రమాదం జరిగి ఏడుగురు మృతిచెందిన విషయం పాఠకులకు తెలిసిందే. ఈ ఘటనలో జవాన్ రాజశేఖర్ మృతి చెందినట్లు ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందింది. డి.చిన్నయ్య, రాములమ్మల పెద్దకుమారుడు అయిన రాజశేఖర్ ఐటీబీపీలో 12 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నాడు. రెండు నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి వెళ్లాడు. రాజశేఖర్‌కు భార్య ప్రమీల, కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీర జవాన్ల మృతిపై సీఎం సంతాపం సాక్షి, అమరావతి: విధినిర్వహణలో వీరమరణం పొందిన ఐటీబీపీ జవాన్ అన్నమయ్య జిల్లా దేవపట్టకు చెందిన డి. రాజశేఖర్ అతని సహచరుల మృతి పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలిపారు. ఇది కూడా చదవండి: అర్థం చేసుకోండి.. ప్రతి పథకానికీ ఒక అర్థం.. పరమార్థం ఉన్నాయి -
గుండెముక్కలైంది.. టాలీవుడ్ ప్రముఖుల సంతాపం
Actress Meena Husband Vidya Sagar Dies Celebrities Condolence: ప్రముఖ నటి, సీనియర్ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ మరణించారు. పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్న విద్యాసాగర్ చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (జూన్ 28) రాత్రి హఠాత్తుగా కన్నుమూశారు. దీంతో సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. విక్టరీ వెంకటేశ్, మంచు లక్ష్మీ, ఖుష్బూతోపాటు పలువురు సినీ తారలు విద్యాసాగర్ మృతిపట్ల సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. 'విద్యాసాగర్ మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇది చాలా బాధకరం. మీనా, ఆమె కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.' అని వెకంటేశ్ ట్విటర్లో పేర్కొన్నారు. Extremely sad and shocked by the demise of Vidyasagar gaaru! My heartfelt condolences to Meena gaaru and the entire family! Wishing them with all the strength to sail through this! 🙏🏼 — Venkatesh Daggubati (@VenkyMama) June 29, 2022 'మీనా భర్త మరణించారన్న విషాదకరమైన వార్తతో మేల్కొన్నాను. విద్యాసాగర్ కోవిడ్ సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి' అని లక్ష్మీ మంచు ట్వీట్ చేశారు. Woke up to devastating news of #meena garu’s husband, Vidyasagar garu passed away due to Covid complications. My deepest and heartfelt condolences to the entire family. — Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) June 29, 2022 'చాలా బాధకరమైన వార్తతో మేల్కొన్నాను. మీనా భర్త సాగర్ ఇక మాతో లేడని తెలిసి గుండె ముక్కలైంది. అతను చాలా కాలంగా ఊపిరితిత్తుల సమస్యతో పోరాడుతున్నాడు. విధి చాలా క్రూరమైంది. బాధను వ్యక్తపరిచేందుకు మాటలు సరిపోవు. మీనా కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.' అని ఖుష్బూ తెలిపారు. Waking up to a terrible news.Heartbroken to learn actor Meena's husband, Sagar, is no more with us. He was battling lung ailment for long. Heart goes out to Meena n her young daughter. Life is cruel. At loss of words to express grief. Deepest condolences to the family. #RIP 🙏😭 — KhushbuSundar (@khushsundar) June 29, 2022 'మీనా భర్త విద్యాసాగర్ అకాల మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. మీనా, ఆమె కుటుంబ సభ్యులకు నా కుటంబం తరఫున ప్రగాఢ సానుభూతి. విద్యాసాగర్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను' అని నటుడు, రాజకీయవేత్త శరత్ కుమార్ తెలిపారు. It is shocking to hear the news of the untimely demise of Actor Meena's husband Vidyasagar, our family's heartfelt condolences to Meena and the near and dear of her family, may his soul rest in peace pic.twitter.com/VHJ58o1cwP — R Sarath Kumar (@realsarathkumar) June 28, 2022 -
మాస్టారు పాడె మోసిన మంత్రి ‘ఎర్రబెల్లి’
దేవరుప్పుల/బయ్యారం: జనగామ జిల్లా దేవరుప్పుల మండల పరిధి కామారెడ్డిగూడెంలో కన్నుమూసిన విశ్రాంత ఉపాధ్యాయుడు, టీఆర్ఎస్ మండల నేత బిల్లా సోమిరెడ్డి అంత్యక్రియల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చివరి వరకు మాస్టారి పాడె మోసి ఆయనతో తనకున్న అనుబంధాన్ని చాటుకున్నారు. సోమిరెడ్డి భౌతికకాయాన్ని మంత్రి మంగళవారం సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. అనంతరం దయాకర్‌రావు మాట్లాడుతూ.. తాను పాలకుర్తి నియోజకవర్గంలో అడుగు పెట్టినప్పటి నుంచి వెన్నంటి ఉండి రాజకీయ సూచనలు, సలహాలు అందజేసిన మాస్టారు సేవలు మరువలేనివంటూ కన్నీటి పర్యంతమయ్యారు. పంచాయతీలకు బాకీ లేదు: గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం పైసా కూడా బాకీ లేదని మంత్రి దయాకర్‌రావు అన్నారు. పల్లెప్రగతిలో భాగంగా మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో మంగళవారం మంత్రి మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు సర్పంచులను రెచ్చగొడుతున్నారన్నారు. కరోనా మూలంగా మూడేళ్లు కొత్త పెన్షన్లు మంజూరు చేయని మాట వాస్తవమేనన్నా రు. సమావేశంలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. చదవండి: (పలుమార్లు లైంగిక దాడి.. వారం రోజుల క్రితం) -
ఆమె జీవన గమనం స్ఫూర్తిదాయకం: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, భారత కమ్యూనిస్టు పార్టీ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, పీడిత ప్రజల పక్షపాతి, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం మరణం పట్ల సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు, ఆమె మృతిపై తీవ్ర సంతాపం తెలిపారు. ‘‘ఆనాడు.. రైతాంగ పోరాటానికి కేంద్రంగా నిలిచిన తుంగతుర్తి గడ్డ అందించిన చైతన్యంతో ఎదిగిన మహిళా యోధురాలు మల్లు స్వరాజ్యం అని కొనియాడారు సీఎం కేసీఆర్. తన జీవితాంతం ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసిన ఆమె జీవన గమనం.. గమ్యం రేపటి తరాలకు స్ఫూర్తిదాయకం అని తెలిపారు. మల్లు స్వరాజ్యం వంటి మహిళా నేతను కోల్పోవడం తెలంగాణకు తీరని లోటన్న సీఎం కేసీఆర్.. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ► ‘‘స్వాతంత్య్ర సమరయోధురాలు మల్లు స్వరాజ్యం అనారోగ్యంతో మరణించారన్న వార్త తీవ్రంగా బాధించింది. చివరివరకు నమ్మిన సిద్ధాంతం కొసం పని చేసిన వ్యక్తి ఆమె. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం వారి పక్షాన నిలబడి పోరాడారు. ఆమె మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు. మల్లు స్వరాజ్యం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ.. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. జి కిషన్ రెడ్డి, కేంద్ర సాంస్కృతిక పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి ► మల్లు స్వరాజ్యం.. గొప్ప నేత. తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా పేదల పక్షాన పోరాటం చేసిన తెలంగాణ చైతన్య దీపిక మల్లు స్వరాజ్యం. ఆమె మరణం తెలంగాణ కు తీరని లోటు. ఎంపీ రేవంత్ రెడ్డి. టీపీసీసీ అధ్యక్షులు ►నల్లగొండ జిల్లా తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ శాసనసభ్యురాలు మల్లు స్వరాజ్యం మృతి పట్ల తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. నైజాం గుండాలను తరిమికొట్టి తెలంగాణ సాయుధపోరాటంలో పోరాడిన ఆమె పోరాట పటిమ ఎందరికో ఆదర్శమని గుర్తు చేసుకున్నాయన. ప్రజా సేవకు పరితపిస్తూ నిత్యం సేవ కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల గుండెల్లో ఆమె నిలిచారని, ప్రజా ప్రతినిధిగానూ ఆమె ఎంతో గొప్ప కార్యక్రమాలను నిర్వహించారన్నారు. మల్లు స్వరాజ్యం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నట్లు గుత్తా ఒక ప్రకటనలో తెలిపారు. ► సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు, తెలంగాణ సాయుధ పోరాట నాయకురాలు శ్రీమతి మల్లు స్వరాజ్యం మరణం బాధాకరమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. వేర్వేరు సిద్దాంతాలు అయినా.. పేదల పక్షాన శ్రీమతి స్వరాజ్యం చేసిన పోరాటాలు చిరస్మరణీయమన్నారు. మల్లు స్వరాజ్యం కుటుంబ సభ్యులకు బీజేపీ తెలంగాణ శాఖ పక్షాన ప్రగాఢ సానుభూతి చెబుతూ.. ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు. -
ఇండస్ట్రీలో మరో విషాదం.. లెజండరీ నటి కన్నుమూత
Actress KPAC Lalitha Passes Away Celebrities Condolences: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటి కేపీఏసీ లలిత మంగళవారం రాత్రి (ఫిబ్రవరి 22) కేరళలోని త్రిపుణితురలో కన్ను మూశారు. గత కొన్ని రోజులుగా లలిత అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కేపీఏసీ లలిత అసలు పేరు మహేశ్వరి అమ్మ. కేపీఏసీ సినిమాలో లలిత నటనకు అదే ఇంటిపేరుగా మారిపోయింది. మలయాళం సినిమా కమర్షియల్ అండ్ ఆర్ట్ స్కూల్ రెండింటిలోనూ బాగా రాణించింది ఈ లెజండరీ నటి. ఆమె ఐదేళ్ల సినీ కెరీర్లో 550కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. కేరళ సంగీత నాటక అకాడమీకి 5 సంవత్సరాలు చైర్‌పర్సన్‌గా సేవలు కూడా అందిచారు లలిత. దివంగత మలయాళ చిత్ర నిర్మాత భరతన్‌ను వివాహం చేసుకున్న ఆమె ఉత్తమ సహాయ విభాగంలో రెండు జాతీయ అవార్డులు, 4 రాష్ట్ర అవార్డులను గెలుచుకున్నారు. 74 ఏళ్ల లలితకు కుమారుడు సిద్ధార్థ్ భరతన్, కుమార్తె శ్రీకుట్టి భరతన్ ఉన్నారు. లిలిత మృతిపట్ల సౌత్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. Rest in peace Lalitha aunty! It was a privilege to have shared the silver screen with you! One of the finest actors I’ve known. 🙏💔#KPACLalitha pic.twitter.com/zAGeRr7rM0 — Prithviraj Sukumaran (@PrithviOfficial) February 22, 2022 పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు అనేకమంది సెలబ్రిటీలు, రాజకీయనాయకులు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపం తెలుపుతున్నారు. ఈ లెజండరీ నటి మృతిపట్ల కీర్తి సురేష్, మంజూ వారియర్ భావోద్వేగపు పోస్ట్‌లు పెట్టారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా సంతాపం తెలియజేశారు. 'లలిత తన నటనా నైపుణ్యంతో విభిన్న తరాల హృదయాల్లోకి అల్లుకుపోయారు. చరిత్రలో నిలిచిపోయారు' అని పేర్కొన్నారు. Extremely saddened to hear about the passing of the legendary KPAC Lalitha aunty. My heartfelt condolences to the family. pic.twitter.com/nGqxO5tpGb — Keerthy Suresh (@KeerthyOfficial) February 22, 2022 -
గౌతమ్ రెడ్డి అంత్యక్రియలకు ఏర్పాట్లు
-
న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో గౌతమ్‌రెడ్డి సంతాపసభ
-
ఏపీ భవన్లో గౌతమ్‌రెడ్డి సంతాపసభ
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి సంతాప సభను న్యూఢిల్లీలోని ఏపీ భవన్లో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌతమ్‌రెడ్డి చిత్రపటానికి మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీలు సత్యవతి, రెడ్డప్ప, తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్, సిబ్బంది పుష్పాంజలి ఘటించారు. గౌతమ్‌రెడ్డి అకాల మృతికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సోమవారం ఉదయం గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. బుధవారం నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్(మెరిట్స్) వద్ద అంత్యక్రియలు జరగనున్నాయి. సంతాప సభలో ఎంపీ సత్యవతి మాట్లాడుతూ.. చురుకైన మంత్రిని కోల్పోవడం రాష్ట్రానికి తీరని లోటు అని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మేకపాటి కుటుంబం, గౌతమ్‌రెడ్డి చేసిన కృషి అనన్య సామాన్యమని ఎంపీ గోరంట్ల మాధవ్ తెలిపారు. ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ.. గౌతమ్‌రెడ్డి మరణవార్త నిజం కాకుంటే బాగుండని అన్నారు. ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ.. అత్యంత క్రమశిక్షణ, ఎనర్జీ కలిగిన నేత గౌతమ్‌రెడ్డి, పాలిటెక్నిక్, ఐటిఐలను ఇంటిగ్రేట్ చేయాలన్న ఆలోచన చేశారని గుర్తుచేసుకున్నారు. ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. తనను ఒక తమ్ముడి లాగా చూసేవారని, అనేక విషయాల్లో తనను గైడ్ చేశారని తెలిపారు. తిరుపతి ఎంఆర్ఓ సెంటర్ తీసుకురావడంలో ఆయన ఎంతో కృషి చేశారని తెలిపారు. రాష్ట్రానికి అయిదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకువచ్చి నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశారని ఎంపీ రెడ్డప్పా గుర్తు చేసుకున్నారు. గౌతమ్ రెడ్డి మృతి అత్యంత దురదృష్టకరమని, చిన్న పరిశ్రమల బాగుకోసం పరితపించిన వ్యక్తి అని ఎంపీ చంద్రశేఖర్ అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. అందరికంటే ఫిట్‌గా ఉండే వ్యక్తి హఠాత్తుగా మృతిచెందడం జీర్ణించుకోలేకపోతున్నానని, ఈ వార్త అబద్దం అయితే బాగుండని అన్నారు. -
మంచి మిత్రుణ్ని కోల్పోయా: సీఎం వైఎస్ జగన్
-
'షాకింగ్‌లా అనిపిస్తోంది.. ఇంటిల్లిపాది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాం'
మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది. ఎప్పుడూ చిరునవ్వుతో ఫిట్‌గా, ఆరోగ్యంగా కనిపించే మంత్రి మేకపాటి ఆకస్మిక మరణం అందరినీ షాక్‌కి గురి చేసింది. చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించడం కలచివేస్తుంది. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దిగ్భ్రాంతికి గురయ్యాము : మోహన్ బాబు మేకపాటి గౌతం రెడ్డి మృతిపట్ల నటుడు మోహన్ బాబు సంతాపం వ్యక్తం చేశారు. ‘నాకు అత్యంత ఆత్మీయులు, సహృదయులు, విద్యావంతులు ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రివర్యులు శ్రీ మేకపాటి గౌతంరెడ్డి గారు గుండెపోటుతో పరమపదించారని తెలిసి మా ఇంటిల్లిపాది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాం. వారి ఆత్మకి శాంతి కలగాలని భగవంతున్ని కోరుకుంటున్నాము. వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము’ అంటూ ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. అందుకే ఈవెంట్ క్యాన్సిల్ : పవన్ కల్యాణ్ మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం ఎంతో బాధ కలిగించిందని జనసేన అధ్యక్షుడు, నటుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఈ కారణంగానే ఈరోజు (సోమవారం) జరగాల్సిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలు రద్దు చేసుకున్నట్లు తెలిపారు. మేకపాటి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా స్నేహపూర్వకంగా ఉండేవారు : బాలకృష్ణ ‘పార్టీలకు అతీతంగా అందరితో స్నేహపూర్వకంగా మెలిగేవారు. గౌతమ్ రెడ్డి ఇక లేరన్న మాట వినడానికే చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానభూతి’ అంటూ నటుడు బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. ఎంతో మంచి వ్యక్తి: సింగర్ స్మిత ‘అన్నా.. చాలా తొందరగా వెళ్లిపోయారు. ఎంతో మంచి వ్యక్తి. ఇది నిజంగా షాకింగ్‌గా అనిపిస్తోంది. కోవిడ్ తర్వాత కూడా పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి’ అంటూ స్మిత ట్విట్టర్లో పేర్కొన్నారు. షాక్‌కి గురి చేసింది: మంచు విష్ణు ‘మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం షాక్‌కి గురి చేసింది. ఆయన ఎంతో ఉన్నతమైన వ్యక్తి. జీవితం ఊహించలేనిది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’ అంటూ విష్ణు ట్వీట్ చేశారు. మిమ్మల్ని మిస్ అవుతాం అన్నయ్యా : మంచు మనోజ్ ‘మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఇక లేరంటే నమ్మలేకపోతున్నాను. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. మిమ్మల్ని మిస్సవుతాం అన్నయ్యా. ఓం శాంతి’ అని మంచు మనోజ్ సంతాపం వ్యక్తం చేశారు. నాకు అత్యంత ఆత్మీయులు, సహృదయులు, విద్యావంతులు ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రివర్యులు శ్రీ మేకపాటి గౌతంరెడ్డి గారు గుండెపోటుతో పరమపదించారని తెలిసి మా ఇంటిల్లిపాది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాము. (1/2) — Mohan Babu M (@themohanbabu) February 21, 2022 Deepest condolences to the Mekapati family. Shocked behind words on the sudden demise of Sri. Mekapati Gautham. Such a humble and wonderful human being. Life is so unpredictable 😞 — Vishnu Manchu (@iVishnuManchu) February 21, 2022 — Smita (@smitapop) February 21, 2022 Absolutely shocked by the sudden demise of our IT minister Goutham Reddy Gaaru! My prayers are with his family and friends. RIP🙏🏼 pic.twitter.com/RMhiD5KNLH — Venkatesh Daggubati (@VenkyMama) February 21, 2022 Can’t believe @MekapatiGoutham garu is no more .. strength to family .. will miss you my dear brother .. Om Shanti pic.twitter.com/cyTWmHXfAm — Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) February 21, 2022 -
రాహుల్ బజాజ్ మృతి... సీఎం వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: ప్రముఖ పారిశ్రామికవేత్త, బజాజ్ గ్రూప్ మాజీ చైర్మన్ రాహుల్ బజాజ్ (83) మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భారత పారిశ్రామిక రంగంలో రాహుల్ బజాజ్ అనేక సేవలనందించారని సీఎం గుర్తు చేశారు. కాగా గత కొద్ది రోజులుగా రాహుల్ బజాజ్ న్యుమోనియా, గుండె సమస్యలతో బాధ పడుతున్నారు. చికిత్స నిమిత్తం నెల రోజులుగా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో ఫిబ్రవరి 12 శనివారం రోజున మధ్యాహ్నం 2. 30 గంటలకు తుదిశ్వాస విడిచారని బజాజ్ గ్రూప్ ఒక ప్రకటనను విడుదల చేసింది. 40 ఏళ్ల పాటు బజాజ్ గ్రూప్ చైర్మన్‌గా ఆయన సేవలను అందించారు. 2001లో భారత మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ రాహుల్ బజాజ్‌కు లభించింది. అంతేకాకుండా రాజ్యసభ ఎంపీగా ఆయన పనిచేశారు. రాహుల్ బజాజ్ మృతి పట్ల గవర్నర్ సంతాపం సాక్షి, విజయవాడ: ప్రముఖ పారిశ్రామికవేత్త, బజాజ్ గ్రూప్ మాజీ ఛైర్మన్, పద్మభూషణ్ రాహుల్ బజాజ్ మృతిపైట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు జమ్నాలాల్ బజాజ్ మనవడు రాహుల్ బజాజ్ దేశంలో ఆటోమొబైల్ రంగం ఉన్నతికి దోహద పడ్డారని వివరించారు. బజాజ్ స్కూటర్‌ను ఆవిష్కరించి దేశంలోని ప్రతి ఇంటికి దానిని చేరువ చేశారన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు గవర్నర్ హరి చందన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. (చదవండి: చంద్రబాబు నిద్రపోవట్లేదు.. నిద్రపోడు కూడా: ఎమ్మెల్యే జోగి రమేష్) -
జంగారెడ్డి మృతిపట్ల పీఎం మోదీ సంతాపం
సాక్షి, ఢిల్లీ: మాజీ బీజేపీ ఎంపీ జంగారెడ్డి మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం వ్యక్తం చేశారు. జంగారెడ్డి కుమారుడికి ప్రధాని మోదీ ఫోన్ చేసి.. సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ట్విటర్ ద్వారా ప్రధాని మోదీ సంతాప ప్రకటన విడుదల చేశారు. ‘జనసంఘ్, బీజేపీ విజయ పథంలోకి తీసుకెళ్లడానికి మాజీ ఎంపీ జంగారెడ్డి విశేష కృషి చేశారని గుర్తుచేసుకున్నారు. అనేకమంది బీజేపీ కార్యకర్తలకు ఆయన ప్రేరణ ఇచ్చార’ని ప్రధాని కొనియాడారు. Shri C Janga Reddy Garu devoted his life to public service. He was an integral part of the efforts to take the Jana Sangh and BJP to new heights of success. He made a place in the hearts and minds of several people. He also motivated many Karyakartas. Saddened by his demise.— Narendra Modi (@narendramodi) February 5, 2022 బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చందుపట్ట జంగారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జంగారెడ్డి.. హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. కరెంట్ జంగన్నగా పేరుపొందారు బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే చందుపట్ట జంగారెడ్డి పట్ల కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ వ్యవస్థాపకుల్లో జంగారెడ్డి ఒకరని ఆయన మరణం రాష్ట్రానికి, పార్టీకి తీరని లోటని రైతు కుటుంబంలో జన్మించిన జంగారెడ్డి కష్టపడి పనిచేస్తూ పైకొచ్చిన నాయకుడని, జనం మధ్య పనిచేస్తూ ప్రజా ప్రతినిధిగా అనేక సార్లు గెలిచారని గుర్తుచేసుకున్నారు. పీవీ నర్సింహారావుపై ఎంపీగా విజయం సాధించిన నాయకుడు జంగారెడ్డి.. గ్రామీణ ప్రాంతాల్లో కరెంట్ సరఫరా చేయించడంలో, మోటార్లు కరెంటు మోటార్లు బిగించడంలో విశేష కృషి చేస్తూ కరెంట్ జంగన్నగా పేరుపొందారని తెలిపారు. జంగారెడ్డి కృషి చిరస్మరణీయం బీజేపీ మాజీ ఎంపీ జంగారెడ్డి మృతి పట్ల మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్. విద్యా సాగర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో తనకు స్పూర్తి ప్రదాత చందుపట్ల జంగారెడ్డి.. పార్టీని గ్రామాల్లో బలోపేతం చేయడానికి, ప్రజలకు సేవ చేసేందుకు జంగారెడ్డి చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపారు. ఈరోజు బీజేపీ తెలంగాణలో ఈ స్థాయిలో ఉందంటే.. అందులో ఆయన పాత్ర ఉందని పేర్కొన్నారు. జంగారెడ్డి.. నేటి తరానికి ఆదర్శనీయం.. బీజేపీ మాజీ ఎంపీ జంగారెడ్డి మృతి పట్ల బీజేపీ నేత లక్ష్మణ్ సంతాపం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలోపేతం చేయడానికి జంగారెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు. జంగారెడ్డి లాంటి వ్యక్తులు వేసిన పునాదులే ఈరోజు బీజేపీ మహావృక్షంగా ఎదగడానికి కారణమయ్యాయని తెలిపారు. జంగారెడ్డి.. నేటి తరానికి కూడా ఎంతో ఆదర్శనీయమని చెప్పారు. రాజకీయాల్లో ఉండేవాళ్లు మడమ తిప్పకుండా జనం కోసం నిరంతరం శ్రమించాలని జంగారెడ్డి చెప్పేవారని తెలిపారు. విద్యార్థి సమస్యలపై పోరాడేవారు బీజేపీ మాజీ ఎంపీ జంగారెడ్డి మృతి పట్ల బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి సంతాపం వ్యక్తంచేశారు. తాను కాలేజీ విద్యనభ్యసించే రోజుల్లోనే జంగారెడ్డి ఎమ్మెల్యేగా ఉంటూ.. విద్యార్ధి సమస్యలపై పోరాడేవారని గుర్తుచేసుకున్నారు. తనను నిరంతరం రాజకీయాల్లో ప్రోత్సహించిన నాయకుడు జంగారెడ్డి అని చెప్పారు. -
'రమేష్‌బాబు మృతి మాకు తీరని లోటు'
సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్‌బాబు మృతి పట్ల ఘట్టమనేని కుటుంబం విచారం వ్యక్తం చేసింది. ''రమేష్‌బాబు మృతి మాకు తీరని లోటు. రమేష్‌బాబు మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారు. రేపు ఉదయం అభిమానుల సందర్శనార్థం రమేష్‌బాబు భౌతికకాయాన్ని పద్మాలయ స్టూడియోకు తరలించనున్నాం. ప్రస్తుత పరిస్థితుల దృష్యా శ్రేయోభిలాషులందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరుతున్నాం. అంతక్రియల సమయంలో గుమిగూడకుండా ఉండాలి.'' అని పేర్కొంది. Official statement from The Ghattamaneni family. https://t.co/bFWZgUAlNn pic.twitter.com/uUV8d7wh58 — BA Raju's Team (@baraju_SuperHit) January 8, 2022 కాగా రమేష్‌బాబు మృతి పట్ల సినీపరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. పలువురు సినీ ప్రముఖులు రమేశ్‌బాబు మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ''రమేష్‌బాబు మృతిపట్ల ఆయన కుటుంబానికి నా ప్రగాడ సానభూతి. రమేష్‌బాబు మృతి కృష్ణగారి కుటుంబానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నా'' - దర్శకుడు మెహర్ రమేశ్ ''నటుడు, నిర్మాత ఘట్టమనేని రమేష్‌బాబు గారు కన్నుమూశారని తెలిసి దిగ్ర్బాంతికి లోనయ్యాను. వారి కుటుంబానికి నా ప్రగాడ సానుభూతి తెలియచేస్తున్నాను. ప్రముఖ నటులు కృష్ణగారి నట వారసత్వాన్ని కొనసాగించి అనంతరం చిత్ర నిర్మాణంలో వచ్చి మంచి విజయాలు సాధించారు. రమేష్‌బాబు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను'' - సినీహీరో పవన్ కళ్యాణ్ -
రోశయ్య మృతి పట్ల ప్రముఖుల సంతాపం
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి,కేవీపీ రామచంద్రారావు, షబ్బీర్ అలీ, మల్లు భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంతాపం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, మంత్రిగా, తమిళనాడు గవర్నర్‌గా, ప్రజా ప్రతినిధిగా అర్ధశతాబ్ధానికి పైగా ప్రజలకు సేవలందించిన కొణిజేటి రోశయ్య మృతి పట్ల భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరిస్తూ, పరిపాలనా దక్షుడిగా పేరు పొందిన రోశయ్య మృతి తెలుగు వారికి తీరనిలోటన్నారు. ప్రధాని మోదీ సంతాపం: మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్విటర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. తాను, రోశయ్య ముఖ్యమంత్రులుగా ఒకే సమయంలో పనిచేశామని తెలిపారు. అదేవిధంగా రోశయ్య తమిళనాడు గవర్నర్‌గా పనిచేసిన సమయంలో ఆయనతో మంచి అనుబంధం ఉందని గుర్తుచేశారు. ఆయన సేవలు మరువలేమని తెలిపారు. రోశయ్య కుటుంబ సభ్యులకు పీఎం మోదీ సానుభూతి తెలియజేశారు. Saddened by the passing away of Shri K. Rosaiah Garu. I recall my interactions with him when we both served as Chief Ministers and later when he was Tamil Nadu Governor. His contributions to public service will be remembered. Condolences to his family and supporters. Om Shanti. pic.twitter.com/zTWyh3C8u1 — Narendra Modi (@narendramodi) December 4, 2021 సోనియాగాంధీ సంతాపం ►మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. రోశయ్య కుమారుడితో ఫోన్లో మాట్లాడి సంతాపం వ్యక్తం చేశారు. రోశయ్య మరణం తీరని లోటు: వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతిపై వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయ సాయిరెడ్డి సంతాపం తెలిపారు. ‘మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నా. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రోశయ్యగారి మరణం తీరని లోటు’ అని ట్విటర్లో సంతాపం తెలిపారు. ►రాజకీయాల్లో ఉన్నత విలువలు కలిగిన వ్యక్తిని తెలుగు రాష్ట్రాలు కోల్పోయామని ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయనతో అసెంబ్లీలో కలిసి పనిచేసి చాలా విషయాలు నేర్చుకున్నానని కృష్ణదాస్ అన్నారు. ►కొణిజేటి రోశయ్య పట్ల ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తీవ్ర దిగ్బ్రాంతి సంతాపం వ్యక్తం చేశారు. రోశయ్య మరణం అత్యంత బాధాకరమన్నారు. దివంగత నేత వైస్ రాజశేఖరరెడ్డికి రోశయ్య అత్యంత సన్నిహితులన్నారు. ఆయనకు భగవంతుడు ఆత్మశాంతి ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నాన్నారు. ►మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంతాపం వ్యక్తం చేశారు.ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. Saddened by the demise of Former Chief Minister of Andhra Pradesh Sri K Rosaiah Garu. My heartfelt condolences to the family and loved ones. His demise has truly left a deep void in the lives of many who he inspired. pic.twitter.com/WjcQ94UeYJ— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 4, 2021 ►మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం పట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్య గారు పరమపదించారని తెలిసి విచారించాను. వారు నాకు చిరకాల మిత్రులు. విషయ పరిజ్ఞానంతో కూడిన వారి అనుభవం కీలక సమయాల్లో రాష్ట్రానికి దిశానిర్దేశం చేసిందని’’ ఆయన ట్వీట్ చేశారు. ఓర్పు, నేర్పు కలిగిన మంచి వక్తగా రోశయ్య అందరి అభిమానాన్ని చూరగొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నానని’’ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ కొణిజేటి రోశయ్య గారు పరమపదించారని తెలిసి విచారించాను. వారు నాకు చిరకాల మిత్రులు. విషయపరిజ్ఞానంతో కూడిన వారి అనుభవం కీలక సమయాల్లో రాష్ట్రానికి దిశానిర్దేశం చేసింది. pic.twitter.com/du3n90Jv59— Vice President of India (@VPSecretariat) December 4, 2021 విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీక రోశయ్య : ఏపీ గవర్నర్ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య మృతి పట్ల ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నాటి తరం నాయకునిగా విలువలతో కూడిన రాజకీయాలకు ప్రతీకగా రోశయ్య నిలిచారన్నారు. ఉదయం అస్వస్థతకు గురైన ఆయనను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందడం విచారకరమన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ఫ్రగాడ సానుభూతి తెలియజేస్తున్నానని గవర్నర్ హరి చందన్ పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్‌భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. -
Sirivennela Seetharama Sastry: నా ఉచ్ఛ్వాసం కవనం.. నా నిశ్వాసం గానం
Sirivennela Seetharama Sastry Passed Away: నా మొదటి సినిమా ఏ ‘కుక్క’ అని అయి ఉంటే నా గతేంకాను అని నవ్వాడాయన ఒకసారి. కాని ‘విధాత తలంపు’ అలా ఎందుకు ఉంటుంది. విధాత ఆయనకు ‘సిరివెన్నెల’ రాసి పెట్టాడు. విధాత ఆయనకు తెలుగువారికి కాసిన్ని మంచి పాటలు ఇచ్చి రావోయ్ అని భువికి పంపాడు. విధాత ఆయనను నీ మార్గాన నడుచు శిష్యకవులను సిద్ధం చేయమని ఆదేశించాడు. ఇపుడు? ఇక చాలు నేను వినాల్సిన నీ పాటలు ఉన్నాయి... తెలిమంచు వేళల్లో మబ్బులపై మార్నింగ్ వాక్ చేస్తూ ఆ స్వర సంచారం పదసంవాదం చేద్దాం పద అని వెనక్కి పిలిపించుకున్నాడు. ‘కొండతల్లి నేలకిచ్చు పాలేమో నురుగుల పరుగుల జలపాతం వాగు మొత్తం తాగేదాకా తగ్గదేమో ఆశగా ఎగిరే పిట్టదాహం’... కవి ఊహ అది. సిరి ఉన్న కవి ఊహ. ‘గళము కొలను కాగా ప్రతి పాట పద్మమేగా’.. ఓహో.. ఏమి ఇమేజరీ. ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ ఇంత సరళమా పల్లవి? ‘పుట్టడానికీ పాడె కట్టడానికి మధ్య అంతా తనే అంది మనీ మనీ’ ఈ చేదు వాస్తవం పలకనివాడు కవి ఎలా అవుతాడు? ‘ఏదీ సొంతం కోసం కాదను సందేశం పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం’ ఈ హితం చెప్పే కవి లేని సమాజం అదేల? సిరివెన్నెల సీతారామశాస్త్రి సినీ కవిగా చిరాయువును పొందారు. ఆయన రాజకీయ భావాల పట్ల అభ్యంతరాలు ఉన్నవారు సైతం ఆయన పాటను ఆనందించారు. ఆస్వాదించారు. సిరివెన్నెల పండిత కవి. తెరపై పండు వెన్నెల కాయించిన కవి. ఆయనకు నివాళి. ‘బటర్‌ఫ్లై’ ఎఫెక్ట్ అంటే? ఇక్కడ జరిగే ఘటన ఎక్కడి ప్రతిఫలనానికో అని. భలేవాడివే. అది విధాత తలంపు కదా. 1980.. ‘శంకరాభరణం’ రిలీజైంది. ఊరూవాడా సంబరాలు. సన్మానాలు. కాకినాడకు యూనిట్ వస్తోందట. సన్మానం చేయాలట. ఆ ఊళ్లో అప్పటికి ఒక బుల్లి కవి ఉన్నాడు. ప్రతి సాహిత్య సభలో ప్రారంభ గీతాన్ని పాడుతూ ఉంటాడు. ‘అతణ్ణి అడుగుదాం... విశ్వనాథ్‌ని కీర్తిస్తూ ఒక పాట కట్టమందాం’ అనుకున్నారు మిత్రులు. ‘నేను విశ్వనాథ్ మీద కట్టను. వ్యక్తి మీద పాట ఏమిటి? శంకరాభరణం సినిమా మీద కడతాను. తెలుగువారి కళాదృష్టి దాహార్తిని తీర్చడానికి గంగలా ఆ సినిమా అవతరించింది. కనక గంగావతరణం పేరుతో గేయం రాస్తాను’ అన్నాడా కవి. రాశాడు. సన్మానం జరిగే రోజు వచ్చింది. యూనిట్‌ని చూడటానికి జనం విరగబడితే పోలీసులు ఈ బుల్లి కవిని లోపలికి పంపలేదు. కవికి అహం ఉంటుంది. ‘నా పాట వినే అదృష్టం విశ్వనాథ్‌కు లేదు’ అనుకుంటూ అక్కణ్ణుంచి వచ్చేశాడు. అంతేనా? ‘నా పేరు ఎప్పటికైనా అతనికి తెలుస్తుంది’ అనుకున్నాడు. నిజంగానే తెలిసింది కొన్నాళ్లకు. సిహెచ్.సీతారామశాస్త్రి. చెంబోలు సీతారామశాస్త్రి. ‘కైలాసాన కార్తీకాన శివరూపం ప్రమిదే లేని ప్రమథాలోక హిమదీపం’... అని రాశాడు వేటూరి ‘సాగర సంగమం’లో. ‘శంకరా నాద శరీరాపరా’ అని కూడా రాశాడాయన ‘శంకరాభరణం’లో. కె.విశ్వనాథ్‌కు నిజంగా తన సినిమాలో ‘గంగావతరణం’ పెట్టాల్సి వస్తే వేటూరి సంతోషంగా రాసేవాడు. విశ్వనాథ్ సినిమాలకు వేటూరిది సింగిల్ కార్డ్. కాని ‘జననీ జన్మభూమి’లో ఆ సింగిల్ కార్డ్‌కు తోడు సిహెచ్ సీతారామ శాస్త్రి అనే పేరు తోడయ్యింది. ఆ సినిమాలో ‘గంగావతరణం’ అనే చిన్న డాన్స్ బ్యాలేకు సీతారామశాస్త్రి గతంలో రాసిన ‘గంగావతరణం’లోని కొన్ని పంక్తులను వాడారు. అలనాడు కాకినాడలో సీతారామశాస్త్రి రాసిన గేయం ఆ నోట ఈ నోట విశ్వనాథ్ దాకా వెళ్లి అది విని ఆయన ముచ్చటపడి సినిమాలో వాడాల్సి వచ్చింది. తెలుగు తెర మీద సీతారామశాస్త్రికి అది తొలి పాట లెక్క ప్రకారం. అంతటితో ఆ పాట ఆగిపోయేదేమో. కాని కొనసాగాల్సి వచ్చింది. ఎందుకంటే అలా కొత్త కవి చొరబాటుకు వేటూరి అలిగాడు. ‘ఇక విశ్వనాథ్‌కు పాటలు రాయను’ అన్నాడు. విశ్వనాథ్‌కు అప్పటికి సీతారామశాస్త్రి చేత రాయించాలని లేదు. సీతారామశాస్త్రి ఎవరో కూడా ఎప్పుడూ చూళ్లేదు. దాంతో ఆయన ‘స్వాతిముత్యం’ సినిమాకు సినారెను, ఆత్రేయను ఆశ్రయించాల్సి వచ్చింది. ఆ తర్వాత ‘సిరివెన్నెల’ తీయాలి. ఇటు చూస్తే తనకు అలవాటైన వేటూరి అలిగి ఉన్నాడు. అటు చూస్తే సీనియర్లు తనకు ఎక్కువ టైమ్ ఇవ్వలేనంత బిజీగా ఉన్నారు. ఏం చేయాలి? బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అంటే అదే. ఎవరో అలిగారు. సీతారామశాస్త్రికి ‘సిరివెన్నెల’ వచ్చింది. ‘విధాత తలపున ప్రభవించినది అనాది జీవనవేదం ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం’.. 1985 అక్టోబర్ 4న అఫీషియల్‌గా సీతారామశాస్త్రి తొలి పాట రికార్డ్ అయ్యింది. పాడటానికి వచ్చిన బాలూ ఆ వొత్తుజుట్టు, దళసరి కళ్లద్దాలు, పలుచటి శరీరం ఉన్న కవిని చూసి ‘మీరు కవిగా అమిత శక్తిమంతులు. రాబోయే దశాబ్దాలు మీవే’ అన్నాడు. అలాగే జరిగింది. ఒకటి కాదు రెండు కాదు నాలుగు దశాబ్దాల పాటు సీతారామశాస్త్రి పాట సాగిపోయింది. మొదటి సినిమాలోనే ప్రశంసల వెన్నెల కురిసింది. ఇంటి పేరు సిరివెన్నెల అయ్యింది. మద్రాసులో ఈ క్షణం కోడంబాకంలో కబురు పుడితే మరునిమిషం అది తడ దాకా పాకుతుంది. ఎవరో కొత్త కవి అట. సీతారామశాస్త్రి అట. విశ్వనాథ్‌కు రాస్తున్నాడట. నిజమే. మరి మసాలా పాట రాస్తాడా? వెళ్లిన వాళ్లకు ఆ కవి చెప్పిన జవాబు.. పెట్టిన షరతులు మూడు. 1. స్త్రీలను కించ పరచను 2. సమాజానికి చెడు సందేశాలు ఇవ్వను. 3. యువతకు కిర్రెక్కించే పాట రాయను. విన్న నిర్మాతలు సడేలే అనుకుని ముఖం తిప్పుకుని పోవడం మొదలెట్టారు. కాని సుకవి సుగంధం, సత్కవి మకరందం ఎవరు వదలు కుంటారు. ‘శృతిలయలు’ విడుదలైంది. అంతవరకూ ఎప్పుడూ వినని అన్నమయ్య కీర్తన అందులో ఉంది. ‘తెలవారదేమో స్వామి నీ తలపుల మునకలో అలసిన దేవేరి అలమేలు మంగకూ’... ఈ కీర్తనను వెతికి పట్టాడంటే విశ్వనాథ్ ఎంత గొప్పవాడవ్వాలి. ఆ తర్వాత ‘నంది’ అవార్డులకు ఆ పాట వస్తే జడ్జిగా ఉన్న సి.ఎస్.రావు ‘ఏమయ్యా... ఇప్పుడు అన్నమయ్యకు నంది అవార్డు అవసరమా’ అనంటే ‘అది సీతారామశాస్త్రి రాసిన పాటండీ’ అని చెప్పారు. అన్నమయ్య రాసేడా అనిపించేలా సీతారామశాస్త్రి రాసిన పాట. ‘నంది’ ఆయన ఇంటికి నడుచుకుంటూ వచ్చింది. రాంగోపాల్ వర్మ గొప్ప టెక్నీషియన్. కనుక గొప్పవాళ్లే తన సినిమాకు పని చేయాలనుకున్నాడు. సీతారామశాస్త్రితో కాలేజీ పాటా? బోటనీ పాఠముంది మేటనీ ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా? మిగిలిన సినిమా అంతా కుర్రకారు ఎంత ఉద్వేగంగా చూశారో ఈ పాటకు అంత ఉత్సాహంగా టక్కులు ఊడబెరికి గంతులేశారు. అయినా సరే.. ‘కమర్షియల్ సాంగ్’ అనేది ఒకటి ఉంటుంది. శాస్త్రిగారు ఆ ఒక్క తరహా కూడా రాసేస్తే? రాయలేడా ఆయనా? ‘బొబ్బిలి రాజా’ వచ్చింది. ‘బలపం పట్టి భామ బళ్లో.. అఆఇఈ నేర్చుకుంటా’... పాటా సినిమా సూపర్‌డూపర్ హిట్. ఇప్పుడు... సిరివెన్నెల సీతారామశాస్త్రి ‘సమగ్ర సినీ కవి’ అయ్యాడు. హంసలా బతకాలని నిశ్చయించుకోవాలే గాని బతకొచ్చు. కాకిలా కశ్మలంలో వాలాలనుకుంటే వాలొచ్చు. చాయిస్ మనదే. నిర్ణయం తీసుకుంటే అలా బతికే వీలు ప్రకృతి కల్పిస్తుంది. ‘శుభ్రమైన పాట’ రాయాలని సీతారామశాస్త్రి అనుకున్నాడు. దారిన వెళుతుంటే అదిగో ఆ మంచి పాట రాసింది అతనే అనుకోవాలి... ఏదైనా సభకు పిలవాలి... ఎదుటపడితే నమస్కారం పొందేలా ఉండాలి... ‘శాస్త్రిగారు’లా ఉండాలి... ‘గాడు’... పేరు చివర పొరపాట్న కూడా పడకూడదు. ఆయన తన తుదిశ్వాస వరకూ ‘శాస్త్రిగారు’గానే ఉన్నాడు. పల్లవి మర్యాద. చరణం గౌరవం. కాంటెక్స్›్టలో పెట్టి చూపితే తప్ప సిరివెన్నెల గొప్పతనం అర్థం కాదు. గండు చీమ, బెల్లం, ఒడి, తడి, గొళ్లెం, తాళం వంటి పదాలు పాటలుగా చెలామణి అవుతున్న రోజుల్లో ‘చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి’ రాయడం కోసం కలాన్ని రిజర్వ్ చేసి పెట్టుకోవడం సిసలైన వ్యక్తిత్వం. అసలైన సంస్కారం. సరే. ఈ కవి పండితుడు కదా. ఈతనికి గ్రామీణుడి పదం తెలుసా... జానపదుని పాదం తెలుసా? ‘స్వయం కృషి’ విడుదలైంది. ‘సిగ్గూ పూబంతి యిసిరే సీతామాలచ్చి’ రాశాడు. ‘రాముడి సిత్తంలో కాముడు సింతలు రేపంగా’ అని జానపద శృంగారం ఒలికించాడు. ‘ఆపద్బాంధవుడు’లో? ‘ఔరా అమ్మకచెల్ల... ఆలకించి నమ్మడమెల్లా... అంత వింత గాధల్లో ఆనందలాల’ రాశాడు. ‘శుభసంకల్పం’లో ‘నీలాల కన్నుల్లో సంద్రవే నింగి నీలవంతా సంద్రవే’ అని బెస్తపడవలో మీన మెరుపు వంటి పదాలను అల్లాడు. సిరివెన్నెలకు రాని విద్య లేదు. పాట వచ్చి దాని మీద కేవలం డబ్బు సంపాదించేవాడు సగటు కవి అవుతాడు. దాని ద్వారా సమాజాన్ని జాగృతం చేయాలని తపించేవాడు ఉదాత్త కవి అవుతాడు. ‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని’ అని రాశాడు సిరివెన్నెల. సమాజంలో పాలకుల్లో ఎంత పెడధోరణి ఉన్నా ఎన్ని అకృత్యాలు సాగుతున్నా ‘మనకెందుకులే’ అని సాగిపోయే జనం ఈ పాటను విని భుజాలు తడుముకున్నారు. తమ నిస్సహాయతకు సిగ్గుపడ్డారు. ‘ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుకు అటు ఇటు ఎటో వైపు’ అని ‘అంకురం’లో రాశాడు. ఒక్కళ్లే నడవడానికి భయమా? ‘మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి’ అని చెప్పాడు. ఎంత ధైర్యం ఇలాంటి కవి పక్కన ఉంటే. ‘నువ్వు తినే ప్రతి మెతుకు ఈ సంఘం పండించింది’ అన్నాడు ‘రుద్రవీణ’లో. ‘రుణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా... తెప్ప తగల బెట్టేస్తావా ఏరు దాటగానే’ అని ఈసడిస్తాడు. ‘నిత్యం కొట్టుకుచచ్చే జనాల స్వేచ్ఛను చూద్దామా.. దాన్నే స్వరాజ్యమందామా’... అని ఆయన ఈ దేశపు వర్తమానాన్ని ఎద్దేవా చేస్తాడు. ఒక్క పాట వేయి మోటివేషనల్ స్పీచ్‌లకు సమానం. నిరాశలో కూరుకుపోయి, నిర్లిప్తతలో కుదేలైన వారికి లే.. లేచి నిలబడు అని ఉపదేశం ఇచ్చినవాడు సిరివెన్నెల. ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి’ అన్నాడు. సిరివెన్నెలకు 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు 40 ఏళ్ల వయసు కలిగిన తండ్రి చనిపోయాడు. ఇద్దరు తమ్ముళ్లు. ఇద్దరు చెల్లెళ్లు. జీవచ్ఛవంలా మారిన తల్లి. వారి కోసం బతికాడు సిరివెన్నెల. అందుకే– ‘నొప్పిలేని నిముషమేది జననమైన మరణమైన జీవితాన అడుగడుగున నీరసించి నిలిచిపోతే నిముషమైన నీది కాదు బతుకు అంటే నిత్యఘర్షణ దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది అంతకంటే సైన్యముండునా ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి’... అని రాశాడు. ‘మనసు కాస్త కలత పడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు’ అని ‘శ్రీకారం’ కోసం ఆయనే రాశాడు. ‘భయం లేదు భయం లేదు నిదర ముసుగు తీయండి... తెల్లారింది లెగండోయ్’ అని కోడికూతను వినిపించాడు. ‘ఒరే ఆంజనేయులు... తెగ ఆయాస పడిపోకు చాలు మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు కరెంటు రెంటు ఎట్సెట్రా మన కష్టాలు కర్రీలో కారం ఎక్కువ అయితే కన్నీళ్లు నైటంతా దోమల్తో ఫైటింగే మనకు గ్లోబల్ వార్ భారీగా ఫీలయ్యే టెన్షన్లేం పడుకు గోలీమార్’... అని ‘అమృతం’ టైటిల్ సాంగ్. రోజూ వింటే బి.పి ట్యాబ్లెట్ అవసరం రానే రాదు. ‘నా మొదటి సినిమా ఏ ‘కుక్క’ అని అయి ఉంటే నా గతేంకాను’ అని నవ్వాడాయన ఒకసారి. కాని ‘విధాత తలంపు’ అలా ఎందుకు ఉంటుంది. విధాత ఆయనకు ‘సిరివెన్నెల’ రాసిపెట్టాడు. విధాత ఆయనకు తెలుగువారికి కాసిన్ని మంచి పాటలు ఇచ్చి రావోయ్ అని భువికి పంపాడు. విధాత ఆయనను నీ మార్గాన నడుచు శిష్యకవులను సిద్ధం చేయమని ఆదేశించి పంపాడు. ఇపుడు? ఇక చాలు నేను వినాల్సిన నీ పాటలు ఉన్నాయి... తెలిమంచు వేళల్లో మబ్బులపై మార్నింగ్ వాక్ చేస్తూ ఆ స్వర సంచారం పదసంవాదం చేద్దాం పద అని వెనక్కి పిలిపించుకున్నాడు. ఉపదేశం ఇచ్చే కవి ఊరికే ఉంటాడా? ‘దేవుడా.. ఈ లోకాన్ని మార్చు’ అని పాట వినిపించడూ? అందాక ఆ కవిని గౌరవించడానికి ఆయన మంచిపాటలు పాడుకుందాం. ఈ జగత్తు మనదిగా అనుకోవాలి. జనులందరి బాగు కోరుకోవాలి. మనల్ని బాధించే మోహాల దాహాల ఒంటరి నిర్మోహత్వాన్ని సాధన చేయాలి. సిరివెన్నెల పాట చిరాయువుగా ఉండాలి. జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాదె... సన్యాసం శూన్యం నాదె... ప్రముఖుల నివాళి బహుముఖ ప్రజ్ఞ, సాహితీ సుసంపన్నత సిరివెన్నెల రచనల్లో ప్రకాశిస్తుంది. తెలుగు భాష ప్రాచుర్యానికి శాస్త్రి ఎంతో కృషి చేశారు. ఆయన కుటుంబసభ్యులకు, మిత్రులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి. – నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి తెలుగు పాటకు అందాన్నే గాక, గౌరవాన్ని కూడా తీసుకువచ్చారు. తెలుగు భాషకు పట్టం కడుతూ వారు రాసిన విలువలతో కూడిన ప్రతి పాటనూ అభిమానించే వారిలో నేనూ ఒకణ్ని. 2017లో గోవాలో వారికి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డును అందజేసిన క్షణాలు నాకు ఇంకా గుర్తున్నాయి. సీతారామశాస్త్రి అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారని తెలిసి, వైద్యులతో ఫోన్ ద్వారా మాట్లాడుతూ వారి ఆరోగ్య పరిస్థితి గురించి విచారిస్తూ వచ్చాను. వారి ఆరోగ్యం కుదుటపడుతోందని, త్వరలోనే కోలుకుంటారని భావించాను. సీతారామశాస్త్రి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. – ఎం.వెంకయ్యనాయుడు, ఉప రాష్ట్రపతి సీతారామశాస్త్రి ఇక లేరని తెలిసి ఎంతో విచారించాను. తెలుగు సినీ నేపథ్య గీతాల్లో సాహిత్యం పాలు తగ్గుతున్న తరుణంలో శాస్త్రి ప్రవేశం పాటకు ఊపిరులూదింది. నలుగురి నోటా పది కాలాలు పలికే పాటలతో తెలుగు సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు సీతారామశాస్త్రి. సాహితీ విరించి సీతారామశాస్త్రికి నా శ్రద్ధాంజలి. వారి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులకు నా సానుభూతి. – ఎన్.వి.రమణ, భారత ప్రధాన న్యాయమూర్తి తెలుగు సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి. అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాల ద్వారా తెలుగు వారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులుగా ఉంటారు. ఆయన మరణం తెలుగు వారికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. – వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎలాంటి సంగీత ప్రక్రియలతోనైనా పెనవేసుకుపోయే అద్భుత సాహిత్యాన్ని సృష్టించిన సిరివెన్నెల పండిత, పామరుల హృదయాలను గెలిచారు. ఆయన సాహిత్య ప్రస్థానం సామాజిక, సంప్రదాయ అంశాలను స్పృశిస్తూ మూడున్నర దశాబ్దాల పాటు సాగింది. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి మరణం తెలుగు చలన చిత్ర రంగానికి, సాహిత్య అభిమానులకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. – కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు స్వర్గస్తులు కావడం నాకు, తెలుగు సినిమా రంగానికి, జాతీయ భావజాలంతో కూడిన కవులు, కళాకారులకు ఎంతో లోటు. దేశభక్తిపై ఆయన రాసిన పాటలను సీడీ రూపంలో 15రోజుల క్రితం నన్ను కలిసి ఇచ్చారాయన. కోలుకుంటున్న సమయంలో స్వర్గస్తులు కావడం చాలా దురదృష్టకరం. నా భావజాలం జాతీయ భావజాలం అని స్పష్టంగా చెప్పేవారు ఆయన. – కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బాలసుబ్రహ్మణ్యం మృతి చెందినప్పుడు కుడి భుజం పోయిందనుకున్నాను. సిరివెన్నెల మృతితో ఎడమ భుజం కూడా పోయింది. ఎంతో సన్నిహితంగా మాట్లాడుకునేవాళ్లం.. ఒక్కసారిగా దూరమయ్యాడంటే నమ్మశక్యం కావడం లేదు. తన ఆత్మకు శాంతి చేకూరాలి.. తన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. – కె.విశ్వనాథ్, దర్శకుడు సిరివెన్నెలగారు ఆస్పత్రిలో చేరిన తర్వాత దాదాపు 20 నిమిషాల పాటు ఫోనులో నాతో ఎంతో హుషారుగా మాట్లాడారు. నవంబరు నెలాఖరుకల్లా వచ్చేస్తానని వెళ్లిన మనిషి ఈ విధంగా జీవం లేకుండా వస్తారని ఊహించలేదు. వేటూరిగారి తర్వాత అంత గొప్ప రచయిత సిరివెన్నెల. ఆయన సాహిత్యంలో శ్రీశ్రీగారి పదును కనబడుతుంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు, సిరివెన్నెలగారు.. ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోవడం చిత్ర పరిశ్రమకు ఎవరూ పూరించలేని లోటు. అలాంటి గొప్ప వ్యక్తి, గొప్ప కవి మళ్లీ మనకు తారసపడటం కష్టమే. – చిరంజీవి, నటుడు సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని కలిగించిన వ్యక్తి సిరివెన్నెలగారు. – బాలకృష్ణ, నటుడు సీతారామశాస్త్రి నాకు అత్యంత సన్నిహితుడు, సరస్వతీ పుత్రుడు. విధాత తలపున ప్రభవించిన సాహిత్య శిఖరం నేలకొరిగింది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. – మంచు మోహన్‌బాబు, నటుడు అందమైన పాటలు, పదాలను మాకు మిగిల్చి, మీరు వెళ్లిపోయారు. వాటి రూపంలో ఎప్పటికీ జీవించే ఉంటారు. – నాగార్జున, నటుడు బలమైన భావాన్ని.. మానవత్వాన్ని.. ఆశావాదాన్ని చిన్న చిన్న మాటల్లో పొదిగి జన సామాన్యం గుండెల్లో నిక్షిప్తం చేసేలా గీత రచన చేసిన అక్షర తపస్వి సీతారామశాస్త్రిగారు. ఆ మహనీయుడు ఇకలేరు అనే వాస్తవం జీర్ణించుకోలేనిది. – పవన్ కల్యాణ్, నటుడు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి మరణవార్త విని దిగ్భ్రాంతి చెందాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. – మహేశ్‌బాబు, నటుడు అలుపెరుగక రాసిన ఆయన కలం ఆగినా, రాసిన అక్షరాలు తెలుగు భాష ఉన్నంతకాలం అందరికీ చిరస్మరణీయంగా ఉంటాయి. – ఎన్టీఆర్, నటుడు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి మరణవార్త విని షాకయ్యాను. తెలుగు సాహిత్యానికి, తెలుగు సినిమాకు ఆయన అందించిన సేవలు అసామాన్యమైనవి. – రామ్‌చరణ్, నటుడు గత శనివారం సిరివెన్నెలగారితో ఫోనులో మాట్లాడాను. ‘మీలాగ నేను కూడా ఓ పాట పరిపుష్టిగా రాయాలి’ అని ఆయనతో అంటే, ‘నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు.. నువ్వు రాయగలవు’ అన్నారు. మా అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉంటూ ఇంత గొప్పగా రాయాలని ఓ బెంచ్ మార్క్ సృష్టించారాయన. ఇంట్లో తండ్రిని చూసి పిల్లలు నేర్చుకున్నట్లు ఆయన్ని చూసి నేను నేర్చుకున్నాను. నాలో ఆత్మ విశ్వాసాన్ని బలంగా నింపిన గురువు ఆయన. – రామజోగయ్య శాస్త్రి, సినీ గేయ రచయిత 1996లో ‘అర్ధాంగి’ సినిమాతో మేం సంపాదించుకున్న డబ్బు, పేరు మొత్తం పోయింది. ఇంటి అద్దె ఎలా కట్టాలో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నాకు ధైర్యాన్నిచ్చి, వెన్నుతట్టి ముందుకు నడిపించినవి ‘ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి’, ‘ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి’ అన్న సీతారామశాస్త్రిగారి పదాలు. భయం వేసినప్పుడల్లా గుర్తుతెచ్చుకుని పాడుకుంటే ధైర్యం వచ్చేది. నా జీవన గమనానికి దిశా నిర్దేశం చేసిన సీతారామశాస్త్రిగారికి శ్రద్ధాంజలి. – రాజమౌళి, దర్శకుడు ‘సాహసం నా రథం. సాహసం జీవితం’.. పాట నన్ను ఎంతో ఇన్స్పైర్ చేసింది. ఆయన కచ్చితంగా స్వర్గానికే వెళ్లి ఉంటారు. – రామ్‌గోపాల్ వర్మ, దర్శకుడు సీతారామశాస్త్రిగారు తెలుగు సినిమాకు గొప్పవరం. బాలూగారు మనకు దూరమైనా ఆయన్ను గుండెల్లో పెట్టుకుని స్మరించుకుంటున్నాం. ‘సిరివెన్నెల’గారు కూడా మన గుండెల్లో నిలిచే ఉంటారు. – వీవీ వినాయక్, దర్శకుడు గుండె నిండు గర్భిణిలా ఉంది. ప్రసవించలేని దుఃఖం పుట్టుకొస్తోంది. తల్లి కాగితానికి దూరమై అక్షరాల పిల్లలు గుక్కపట్టి ఏడుస్తున్నాయ్. మీరు బతికే ఉన్నారు. పాట తన ప్రాణం పోగొట్టుకుంది. – సుకుమార్, డైరెక్టర్ ∙ఇంకా అశ్వనీదత్, బీవీఎస్‌యన్ ప్రసాద్, ఎమ్మెస్ రాజు, ‘స్రవంతి’ రవికిశోర్, ‘దిల్’ రాజు, వైవీఎస్ చౌదరి, మారుతి తదితర ప్రముఖులు నివాళులు అర్పించారు. చదవండి: దాని ముందు తలవంచా.. స్మోకింగ్‌పై గతంలో సిరివెన్నెల కీలక వ్యాఖ్యలు -
సిరివెన్నెల మృతిపై రాజకీయ ప్రముఖుల సంతాపం
AP CM YS Jagan Mourns On Sirivennela Seetharama Sastry Death: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. తెలుగు సినీ గేయ ప్రపంచంలో సిరివెన్నెల విలువల శిఖరం అన్నారు. ఆయన మరణం తెలుగువారికి తీరని లోటన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్.. ‘‘అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులు. ఆయన హఠాన్మరణం మొత్తంగా తెలుగువారికి తీరనిలోటు. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అన్నారు. తెలుగు సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల. అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ చిరంజీవులు. ఆయన హఠాన్మరణం మొత్తంగా తెలుగువారికి తీరనిలోటు. 1/2 — YS Jagan Mohan Reddy (@ysjagan) November 30, 2021 సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. 2/2 — YS Jagan Mohan Reddy (@ysjagan) November 30, 2021 చదవండి: సిరివెన్నెలను ఎక్కువగా శ్రమ పెట్టిన పాట ఏంటి..? సిరివెన్నెల పండిత, పామరుల హృదయాలను గెలిచారు: సీఎం కేసీఆర్ ప్రముఖ తెలుగు సినీగేయ రచయిత, పద్మశ్రీ చంబోలు (సిరివెన్నెల) సీతారామ శాస్త్రి మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఎటువంటి సంగీత ప్రక్రియలతోనైనా పెనవేసుకుపోయే అద్భుత సాహిత్యాన్ని సృష్టించిన సిరివెన్నెల, పండిత పామరుల హృదయాలను గెలిచారని సీఎం కేసీఆర్ తెలిపారు. సినిమా పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న ఆయన సాహిత్య ప్రస్థానం, సామాజిక, సాంప్రదాయ అంశాలను స్పృశిస్తూ మూడున్నర దశాబ్దాల పాటు సాగిందని గుర్తు చేసుకున్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి, సంగీత సాహిత్య అభిమానులకు తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సాహిత్య లోకానికి తీరని లోటు: విశ్వభూషన్ హరిచందన్ ప్రఖ్యాత గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి పట్ల రాష్ట్ర గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సిరివెన్నెల మృతి తెలుగు చలన చిత్ర పరిశ్రమతో పాటు సాహిత్య లోకానికి తీరని లోటన్నారు. సిరివెన్నెల కలం నుంచి ఆణిముత్యాల వంటి గీతాలు జాలువారాయన్నారు. తెలుగు సినీ గేయ ప్రపంచంలో ఆయన అక్షర నీరాజనాన్ని ఎవ్వరూ మరువలేరన్నారు. తెలుగు చరిత్రలో ఆయన పాటలు, మాటలు సజీవంగా నిలిచి పోతాయని గవర్నర్ ప్రస్తుతించారు. సిరివెన్నెల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానన్న గవర్నర్, ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ‘సిరివెన్నెల’ మృతి తెలుగు సినిమాకు తీరని లోటు: అవంతి ‘సిరివెన్నెల’ మృతి తెలుగు సినిమాకు తీరని లోటు. తెలుగు సినిమా సాహిత్యానికి సొబగులు అద్దిన దిగ్గజ సినీ గేయరచయిత ‘సిరివెన్నెల’.. సీతారామశాస్త్రి మృతి సాహితీ ప్రియులు, సినీ ప్రేమికులకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం’ అన్నారు మంత్రి అవంతి. సిరివెన్నెల జాతీయ భావజాలం కలిగిన కవి: కిషన్‌రెడ్డి ‘‘సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబం ఆర్ఎస్ఎస్కు అత్యంత సన్నిహితులు. జాతీయ భావజాలం కలిగిన కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి. 1985 నుంచి ఆయన నాకు అత్యంత సన్నిహిత మిత్రుడు. 15 రోజుల కిందటే ఆయన నాకు జాతీయ గీతాల సీడీ ఇచ్చారు. ఆయన లేని లోటు పూడ్చలేనిది’’ అన్నారు కేంద్ర పర్యటక మంత్రి కిషన్ రెడ్డి. -
రజనీకాంత్ ఎమోషనల్.. పునీత్ మరణాన్ని తట్టుకోలేక పోతున్నా..
చెన్నై(తమిళనాడు): పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం సినీ లోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈయన మృతికి నటుడు రజనీకాంత్ కాస్త ఆలస్యంగా సంతాపం వ్యక్తం చేశారు. అందుకు కారణం లేకపోలేదు. పునీత్‌రాజ్‌కుమార్ మరణానికి ముందు రోజే రజినీకాంత్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరా రు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రజినీకాంత్ ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈనేపథ్యంలో బుధవారం సంతాపం తెలిపారు. దీని గురించి రజినీకాంత్ హూట్ యాప్‌లో మాట్లాడుతూ.. ‘‘నువ్వు లేవన్న విషయాన్నే జీరి్ణంచుకోలేకపోతున్నాను పునీత్.. రెస్ట్ ఇన్ పీస్ మై చైల్డ్’’ అని పేర్కొన్నారు. చదవండి: సుందర్‌పై అందరికి జాలి కలుగుతుంది: ఆనంద్ దేవరకొండ -
పునీత్ రాజ్‌కుమార్ మృతి.. సంతాపం తెలిపిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో శుక్రవారం మృతి చెందారు. ఆయన మరణవార్త సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. పునీత్ మృతిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పునీత్ మృతిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్య రోజా సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు. Saddened and shocked to know that #PuneethRajKumar is no more. My deepest condolences to the family, friends and fans. We will miss you💔! pic.twitter.com/uweslQEuvU — Roja Selvamani (@RojaSelvamaniRK) October 29, 2021 చదవండి: తండ్రి సమాధి దగ్గరే పునీత్ అంత్యక్రియలు -
మాజీ ఎంపీ, సీనియర్ జర్నలిస్ట్ కన్నుమూత, ప్రధాని సంతాపం
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ మాజీ ఎంపీ, సీనియర్ జర్నలిస్ట్ చందన్ మిత్రా (65) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం అర్థరాత్రి తుదిశ్వాస విడిచారు. చందన్ మిత్రా కుమారుడు కుషన్ మిత్రా ట్విటర్ ద్వారా ఈ సమాచారాన్ని అందించారు. ఎడిటర్, పొలిటీషియన్ చందన్ మిత్రా అస్తమయంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతాపం ప్రకటించారు. అపూర్వ మేథస్సుతో మీడియా, రాజకీయ ప్రపంచంలోచందన్ మిత్రా తన ప్రత్యేకతను చాటుకున్నార న్నారు. ఈ సందర్బంగా ఆయన కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తూ ప్రధాని ట్వీట్ చేశారు. అటు రాజ్యసభ సభ్యుడు స్వపన్ దాస్‌గుప్తా కూడా ప్రియ మిత్రుడిని కోల్పోయానంటూ మిత్రా మరణంపై విచారాన్ని వెలిబుచ్చారు. ఈ సందర్భంగా మిత్రతో ఉన్న 1972 నాటి ఒక ఫోటో షేర్ చేశారు. కాగా ఈ ఏడాది జూన్‌లో ది పయనీర్ ప్రింటర్ పబ్లిషర్ పదవికి చందన్ మిత్రా రాజీనామా చేశారు. Shri Chandan Mitra Ji will be remembered for his intellect and insights. He distinguished himself in the world of media as well as politics. Anguished by his demise. Condolences to his family and admirers. Om Shanti. — Narendra Modi (@narendramodi) September 2, 2021 I am posting a photograph of Chandan Mitra and me together during a school trip in 1972. Be happy my dear friend wherever you are. Om Shanti pic.twitter.com/58vMvU6Wa9 — Swapan Dasgupta (@swapan55) September 2, 2021 -
భారతీయ సినిమాకు ఆద్యుడు...అభినయం ఒక విశ్వవిద్యాలయం
సాక్షి, ముంబై: బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ అస్తమయంపై సినీ సెలబ్రిటీలతోపాటు, పలువురు రాజకీయ రంగ ప్రముఖులు, ఇతర నేతలు కూడా తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భారతీయ సినిమాకు ఆయన ఆద్యుడు అంటూ కొనియాడారు. 60 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం సినీరంగంలో చిరస్థాయిగా నిలిచి పోతుందంటూ దిలీప్ కుమార్‌కు ఘన నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సినిమా లెజెండ్‌గా దిలీప్ ఎప్పటికీ గుర్తుండిపోతారనిపేర్కొన్నారు. ‘అసమాన తేజస్సు ఆయన సొంతం..అందుకే ప్రేక్షకులు ఆయనను చూసి మంత్రముగ్ధులవుతారు. సాంస్కృతిక ప్రపంచానికి ఆయన మరణం తీరని లోటని’ మోదీ ట్వీట్ చేశారు. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాజీ రాజ్యసభ సభ్యుడు దిలీప్ నిష్క్రమణపై సంతాపం తెలిపారు. సినీ ప్రపంచం ఒక గొప్ప నటుడుని కోల్పోయిందంటూ వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. Deeply anguished by the passing away of veteran actor & former Rajya Sabha member. In the death of Shri Dilip Kumar, the world of cinema has lost one of the greatest Indian actors. #DilipKumar pic.twitter.com/kW7RMoBBJD — Vice President of India (@VPSecretariat) July 7, 2021 కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా దిలీప్ కుమార్ మృతిపై సంతాపం వెలిబుచ్చారు. భారతీయ సినిమాకు ఆయన చేసిన అసాధారణ సేవలు రానున్న తరాలకు కూడా గుర్తుండి పోతాయన్నారు. ఈ సందర్భంగా దిలీప్ కుమార్ కుటుంబానికి, స్నేహితులకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. బాలీవుడ్లో ఒక అధ్యాయం ముగిసిందంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దిలీప్ కుమార్ మృతిపై సంతాపం తెలిపారు. యూసుఫ్ సాబ్ అద్భుతమైన నటనా కౌశలం ప్రపంచంలో ఒక విశ్వవిద్యాలయంలా నిలిచిపోతుందన్నారు. ఆయన మనందరి హృదయాల్లో ఎప్పటికి నిలిచిపోతారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ సీఎం ట్వీట్ చేశారు. భారతీయ సినిమాకు లెజెండ్ దిలీప్ కుమార్ ఆద్యుడు. ఆయన ఎప్పటికీ చిరంజీవిగా మిగిలిపోతారని మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నివాళులర్పించారు. భారతీయ సినీ చరిత్రను లిఖిస్తే.. దిలీప్ కుమార్‌కు ముందు, దిలీప్ కుమార్‌కు తరువాత అని పేర్కొనాల్సి వస్తుందని బాలీవుడ్ మరో సీనియర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తన సహ నటుడు దిలీప్ కుమార్‌ను గుర్తు చేసుకున్నారు. కాగా పాకిస్థాన్‌లోని పెషావర్‌లో 1922 డిసెంబర్ 11న జన్మించిన దిలీప్ కుమార్ అసలు పేరు యూసుఫ్ ఖాన్. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తున్న సమయంలో చాలామంది లాగే ఆయన కూడా తన పేరును మార్చుకున్నారు. 1944 తన తొలి సినిమా జ్వర్ భాటా నిర్మాత దేవికా రాణి సూచన మేరకు యూసుఫ్ ఖాన్ తన పేరును దిలీప్ కుమార్‌గా మార్చుకున్నారు. రొమాంటిక్ హీరోగా ప్రఖ్యాతి గాంచిన ఆయన మధుమతి, దేవదాస్, మొఘల్ ఏ ఆజమ్, గంగా జమునా, రామ్ ఔర్ శ్యామ్, కర్మ లాంటి ఎన్నో ప్రసిద్ధ సినిమాల్లో తన నటనతో అజరామరంగా నిలిచిపోయారు. हिंदी फ़िल्म जगत के मशहूर अभिनेता दिलीप कुमार जी का चले जाना बॉलीवुड के एक अध्याय की समाप्ति है। युसुफ़ साहब का शानदार अभिनय कला जगत में एक विश्वविद्यालय के समान था। वो हम सबके दिलों में ज़िंदा रहेंगे। ईश्वर दिवंगत आत्मा को अपने श्री चरणों में स्थान दें। विनम्र श्रद्धांजलि pic.twitter.com/PEUlqSYk3i — Arvind Kejriwal (@ArvindKejriwal) July 7, 2021 My heartfelt condolences to the family, friends & fans of Dilip Kumar ji. His extraordinary contribution to Indian cinema will be remembered for generations to come. pic.twitter.com/H8NDxLU630 — Rahul Gandhi (@RahulGandhi) July 7, 2021 Dilip Kumarji was the doyen of Indian Cinema and will forever be remembered. Condolences to his family and friends. May the legend's soul rest in eternal peace. pic.twitter.com/s8kRj8cFdw — Mohanlal (@Mohanlal) July 7, 2021 T 3958 - An institution has gone .. whenever the history of Indian Cinema will be written , it shall always be 'before Dilip Kumar, and after Dilip Kumar' .. My duas for peace of his soul and the strength to the family to bear this loss .. 🤲🤲🤲 Deeply saddened .. 🙏 — Amitabh Bachchan (@SrBachchan) July 7, 2021 -
అజిత్ సింగ్ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మాజీమంత్రి అజిత్ సింగ్ మరణం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. దివంగత అజిత్ సింగ్ కుటుంబ సభ్యులకు సీఎం వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కేంద్ర మంత్రిగా అజిత్ సింగ్ రైతులకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్(82) గురువారం ఉదయం కన్నుమూశారు. ఆయన కరోనా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖనాయకుడైన అజిత్ సింగ్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా గురుగ్రామ్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు ఏప్రిల్ 20న కరోనా వైరస్ సోకింది. దీంతో ఆయన ఆరోగ్యం మరింత క్షిణించింది. గురువారం అజిత్ సింగ్ ఆరోగ్యం పరిస్థితి పూర్తిగా విషమించటంతో మృతి చెందినట్లు ఆయన కుమారుడు, మాజీ ఎంపీ జయంత్ చౌదరి ట్విటర్లో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సంతాపం కేంద్ర మాజీమంత్రి, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ అధ్యక్షుడు, చౌదరి అజిత్ సింగ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. దివంగత అజిత్ సింగ్ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.పలు దఫాలు కేంద్ర మంత్రిగా కీలక బాధ్యతలను చేపట్టిన అజిత్ సింగ్ మాజీ ప్రధాని చరణ్ సింగ్ వారసత్వాన్ని సమర్థవంతంగా కొనసాగించారని, రైతునేతగా భారత రాజకీయాల్లో తనదైన ముద్రవేశారని సీఎం తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన రాజకీయ ప్రక్రియకు అజిత్ సింగ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మద్దతు పలికిన వారి జ్ఞాపకాలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తించుకుంటారని సీఎం కేసీఆర్ అన్నారు. -
వివేక్ మృతి పట్ల ప్రముఖుల సంతాపం
-
తమిళనాడు: ప్రముఖ హాస్యనటుడు వివేక్ కన్నుమూత
-
హాస్యనటుడు వివేక్ మృతి.. తమిళనాట దిగ్భ్రాంతి
చెన్నై : ప్రముఖ కోలీవుడ్ హాస్యనటుడు వివేక్ (59) కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ప్రముఖ దర్శకులు కె. బాలచందర్ పరిచయం చేసిన నటుల్లో వివేక్ కూడా ఒకరు. మొదట స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేసిన వివేక్ 'మనదిల్ ఉరుది వేండం' సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశారు. ఆ తర్వాత తమిళంలో టాప్ కమెడియన్‌గా ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. ఒకనొక సమయంలో ఆయన లేకుండా తమిళంలో సినిమాలు రిలీజ్ అయ్యేవి కావని, అంతటి పాపులారిటీ ఉండేదని సినీ ప్రముఖులు గుర్తు చేసుకుంటున్నారు. దాదాపు 500కు పైగా చిత్రాల్లో నటించిన ఆయనను 2009లో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. తెలుగులోనూ డబ్బింగ్ చిత్రాలతో వివేక్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. బాయ్స్, శివాజీ, ప్రేమికుల రోజు, అపరిచితుడు, సింగం వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వివేక్ కొడుకు ప్రసన్నకుమార్ 13 ఏళ్ల వయసులో మొదడులో రక్తం గట్టకట్టడంతో చనిపోయాడు. అనారోగ్యం కారణంగా వివేక్ తల్లి కూడా మరణించింది. కొడుకు, తల్లి ఆకస్మిక మరణాలతో వివేక్ బాగా కృంగిపోయాడని, అప్పటినుంచి సినిమాలు చేయడం కూడా తగ్గించాడని ఆయన సన్నిహితులు తెలిపారు. గురువారం చెన్నైలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వివేక్.. ప్రజలంతా టీకా తీసుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇంతలోనే వివేక్ ఆకస్మిక మరణంతో తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. వివేక్ మృతి పట్ల దేవీశ్రీ ప్రసాద్, ఏఆర్. రెహమాన్, సుహాసిని, ప్రకాశ్‌రాజ్, రాఘవ లారెన్స్, జీవా, సమంత, ధనుష్, విజయ్, సహా పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే పెద్ద పేరు హాస్యనటుడు వివేక్ మృతిపట్ల తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అద్భుతమైన నటనతో చిన్న కలైవానర్‌గా పేరుతెచ్చుకుని కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారని తెలిపారు. తన తమ్ముడిలాంటి వివేక్ ఇక లేడనే విషయం జీర్ణించుకోలేకపోతున్నానని పేర్కొన్నారు. వివేక్ కుటుంబ సభ్యులకు సత్యరాజ్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈమేరకు ఆయన వీడియో సందేశం విడుదల చేశారు. Shattered. Heart broken. How is this even possible vivek. Too young too smart too talented too intelligent to go so early. — Suhasini Maniratnam (@hasinimani) April 17, 2021 OMG..cant believe I woke up to this Shocking news abt Legendary @Actor_Vivek sir🙏🏻 Heartbreaking.. Greatest Comedian of our Times who always incorporated a Social Message into his COMEDY I hav always been his diehard FAN U wl live in our Hearts forever dear Sir🙏🏻💐#ripvivek pic.twitter.com/4ferfSsgDm — DEVI SRI PRASAD (@ThisIsDSP) April 17, 2021 Ahhh.. #vivek ...gone too soon dear friend ..thank you for planting thoughts n trees ...thank you for entertaining and empowering us with your wit and humour..will miss you...RIP pic.twitter.com/oyoOkx8G9q — Prakash Raj (@prakashraaj) April 17, 2021 Frozen in disbelief. Cannot digest that Vivek sir is no more.This is a dark day for all of us . I have lost a valuable friend. Tamil cinema has lost a favorite son. The country has lost a wonderful role model. Om Shanti Vivek 😟😥 pic.twitter.com/ZWvji6m2x5 — Kasturi Shankar (@KasthuriShankar) April 17, 2021 What a great loss 😔. Shocked and saddened .. #RIPVivekSir pic.twitter.com/GVDojaTTOh — Samantha Akkineni (@Samanthaprabhu2) April 17, 2021 చదవండి : ప్రముఖ హాస్యనటుడు వివేక్ కన్నుమూత -
సీనియర్ జర్నలిస్టు కన్నుమూత : సంతాప సందేశాల వెల్లువ
సాక్షి,న్యూఢిల్లీ: సుప్రసిద్ధ జర్నలిస్ట్, ఎడిటర్, రచయిత అనిల్ ధార్కర్ కన్నుమూశారు. గుండెజబ్బుతో బాధ పడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ధార్కర్ మృతిపై పలువురు జర్నలిస్టు ప్రముఖులు, ఇతర ముఖ్యలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఆర్ఐపీ అనిల్ ధార్కర్ అంటూ సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. పత్రికా,సాహిత్య ప్రపంచానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులర్పిస్తున్నారు. ముంబై ఇంటర్నేషనల్ లిటరేచర్ ఫెస్టివల్ అండ్ లిటరేచర్ లైవ్ వ్యవస్థాపకుడు అనిల్ ధార్కర్. ఐదు దశాబ్దాలకుపైగా సుదీర్ఘ కరియర్లో కాలమిస్ట్‌గా, రచయితగా, ఫిల్మ్ సెన్సార్ బోర్డు సలహా కమిటీ సభ్యుడిగా ఇలా అనేక బాధ్యతల్లో పనిచేశారు. మిడ్-డే, ది ఇండిపెండెంట్‌తో సహా పలు పత్రికలకు ఆయన సంపాదకుడిగా పనిచేశారు. అలాగే దక్షిణ ముంబైలోని ఆకాశవాణి ఆడిటోరియంను ఆర్ట్ మూవీ థియేటర్‌గా రూపుదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. ది రొమాన్స్ ఆఫ్ సాల్ట్ రచయిత అయిన ధార్కర్ రచనలు దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందాయి. Sad to hear that Anil Dharker is no more. RIP. https://t.co/8ieBjHds1R — Nirmal Ghosh (@karmanomad) March 26, 2021 RIP Anil Dharker. Your contribution to the world of literature is priceless & unforgettable! Above all, your warm demeanour and tall presence at all literary events will be missed! Will always remember you as the person who made me meet @sachin_rt#RIPAnilDharker@anildharker pic.twitter.com/9XKWP9rQIp — Mangalam Maloo (@blitzkreigm) March 26, 2021 I am extremely saddened to hear about the passing away of a lovely human being, always in his immaculate bespoke churidaar-Kurta :Anil Dharker. The ultimate intellectual liberal who made Tata Literature Live event a global brand and loved books. He loved life. We will miss him. — Sanjay Jha (@JhaSanjay) March 26, 2021 I am extremely saddened to hear about the passing away of a lovely human being, always in his immaculate bespoke churidaar-Kurta :Anil Dharker. The ultimate intellectual liberal who made Tata Literature Live event a global brand and loved books. He loved life. We will miss him. — Sanjay Jha (@JhaSanjay) March 26, 2021 Sad news coming in of @anildharker passing away. Was my editor at Mud-Day & The Independent. Man of delectable prose and varied interests. Sports buff. Compassionate and caring. Freethinker and fiercely democratic. RIP — Cricketwallah (@cricketwallah) March 26, 2021 -
దివంగత ఎమ్మెల్యేలకు అసెంబ్లీ నివాళి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి రోజు ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్ధేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. నేడు(మార్చి 16న) దివంగత ప్రజాప్రతినిధుల మృతి పట్ల సభలు సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. తెలంగాణలో ఇటీవలి కాలంలో మరణించిన ఎమ్మెల్యేలకు శాసనసభ నివాళులర్పించింది. నాగార్జున సాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్, ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే నాయిని నర్సింహారెడ్డి, పరిగి మాజీ ఎమ్మెల్యే కమతం రాంరెడ్డి, కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కటికనేని మధుసూదన్ రావు, మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకట నర్సయ్య, చెన్నూరు మాజీ సభ్యులు దుగ్యాల శ్రీనివాస్ రావు, జహీరాబాద్ మాజీ ఎమ్మెల్యే చెంగల్ బాగన్న, అమరచింత మాజీ ఎమ్మెల్యే కే వీరారెడ్డికి సభ నివాళులర్పించింది. వీరందరి ఆత్మలకు శాంతి చేకూరాలని సభ్యులందరూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో నోముల నర్సింహయ్య మృతి పట్ల సభలో సీఎం కేసీఆర్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సంతాప తీర్మానాన్ని మంత్రులు జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, చిరుమర్తి లింగయ్య, బొల్లం మల్లయ్య యాదవ్, రవీంద్ర నాయక్, జైపాల్ యాదవ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ బలపరిచారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ్యులందరూ బలపరిచి నోముల నర్సింహయ్య మృతికి సంతాపం తెలిపారు. చదవండి: (విమర్శించిన వారి నోళ్లు మూతపడ్డాయి: గవర్నర్) ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆత్మీయతను ఎప్పటికీ మరువలేనన్నారు. ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని సీఎం అన్నారు. ఇలాంటి బాధాకరమైన తీర్మానం ప్రవేశపెడుతానని అనుకోలేదని,. నోముల నర్సింహయ్య తనకు వ్యక్తిగతంగాదగ్గరి మిత్రులని పేర్కొన్నారు. ఆయనతో కలిసి చాలా సంవత్సరాలు పని చేశామని, తెలంగాణ ఉద్యమంలోనూ కీలకపాత్ర పోషించారని కొనియాడారు. నర్సింహయ్య గురువు రాఘవరెడ్డిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందన్న సీఎం కేసీఆర్. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి నర్సింహయ్య బాధపడేవారని అన్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని నర్సింహయ్య హఠాత్తుగా మరణించడం దురదృష్టకరమన్నారు. అనంతరం సభ వాయిదా పడింది. 17న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పనున్నారు.18న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. -
తుర్లపాటి మృతికి సీఎం జగన్ సంతాపం
సాక్షి, విజయవాడ: సీనియర్ జర్నలిస్ట్, పద్మశ్రీ తుర్లపాటి కుటుంబరావు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. కుటుంబరావు కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తుర్లపాటి కుటుంబరావు(89) గత రాత్రి కన్నుమూశారు. గుండెపోటుకు గురికావడంతో వెంటనే విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. టంగుటూరి ప్రకాశం దగ్గర కార్యదర్శిగా తుర్లపాటి పనిచేశారు. ఆయన మృతి పట్ల ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులు సంతాపం తెలిపారు. -
కంటతడి పెట్టుకున్న తెలంగాణ మంత్రి..
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్ పల్లి గ్రామంలో వీర జవాన్ ర్యాడ మహేష్‌కు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, పోలీస్ కమిషనర్ కార్తికేయలు నివాళుర్పించారు. మహేష్ వీరమరణం తలుచుకుని మంత్రి ప్రశాంత్ రెడ్డి కంటతడి పెట్టారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. మహేష్ కుటుంబాన్ని అన్నిరకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ అండగా ఉంటారని చెప్పారు. సైనిక, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తామని భరోసా ఇచ్చారు. రేపు సాయంత్రం మహేష్ పార్థివ దేహం హైదరాబాద్ చేరుకుంటుందని, ఎల్లుండి స్వగ్రామంలో అంత్యక్రియలు జరుగుతాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి తెలిపారు. చదవండి: ఉగ్ర పోరులో నిజామాబాద్ జవాన్ వీర మరణం కాగా జమ్మూ కశ్మీర్‌లోని మచిల్ సెక్టార్లో ఆదివారం రోజు ఉగ్రవాదులు, పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు భద్రతా దళాల సిబ్బంది మృతి చెందిన విషయం తెలిసిందే. వీరిలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహేష్(25) కూడా మరణించాడు. మహేష్ సంవత్సరం క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నాడు. అతని మృతితో కోమాన్‌పల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. మహేష్ మరణించాడని తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
నర్సన్న మరణం తెలంగాణకు తీరని లోటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మాజీ హోంమంత్రి, కార్మిక నాయకుడు నాయిని నర్సింహారెడ్డి (80) బుధవారం అర్ధరాత్రి దాటాక కన్నుమూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అర్ధరాత్రి విషమించడంతో నాయిని తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆయన కోవిడ్ బారిన పడ్డారు. దాని నుంచి కోలుకున్న తర్వాత నిమోనియా సోకిన విషయం తెలిసిందే. నాయిని మృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్మిక సంఘాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. నర్సన్న మరణం పార్టీకి, తెలంగాణకు తీరనిలోటు: మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మరణం టీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ సమాజానికి తీరని లోటని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. అయిదు దశాబ్దాలుగా ప్రజల మనిషిగా ఆయన రాజకీయాల్లో, కార్మికనేతగా పనిచేశారని, 1969 తెలంగాణ ఉద్యమంలో, 2001 నుండి మలిదశ తెలంగాణ ఉద్యమంలో వారి పాత్ర అనన్య సామాన్యమని గుర్తు చేశారు. 2001 నుండి 2014 వరకు తెలంగాణ ఉద్యమ సమయంలో వారితో ఉన్న అనుబంధం మరువలేనిదని, నర్సన్న ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం: నాయినితో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నానని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. ఉద్యమాలు, త్యాగాలు, పదవులు ఆయన నుంచి నేర్చుకున్న పాఠాలని తెలిపారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు. నాయిని చనిపోవడం బాధాకరం: తెలంగాణ ఉద్యమంలో నాయిని కీలక పాత్ర పోషించారని ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బి. వినోద్ కుమార్ అన్నారు. 2001 నుంచి ఆయనతో ఎన్నో విషయాలు చర్చించుకున్నామని తెలిపారు. తొలి హోంమంత్రిగా పనిచేశారని,1975 ఎమర్జెన్సీ కాలంలో రైల్వేను స్తంభింపచేసిన వ్యక్తి అని గుర్తు చేశారు. హైదరాబాద్, హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో కార్మిక సంఘ ఎన్నికల్లో గెలిచారని అన్నారు. కార్మిక పక్షపాతి నాయిని నర్సింహారెడ్డి కార్మిక పక్షపాతి అని, వారి హక్కుల్ని కాపాడారని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఆయన మరణం చాలా బాధకమని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాయినిది చిన్నపిల్లల మనస్తత్వమని ఆయన మృతికి తీవ్ర సంతాపం ప్రకటించారు. మంత్రుల నివాస ప్రాంగణంలో నాయిని పార్థివదేహాన్ని ఆయన ఉదయం తన సతీమణి సునీతా జగదీష్ రెడ్డితో కలసి సందర్శించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో దేవరకొండ ప్రాంతం నుండి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి కార్మిక నాయకుడిగా తొలి తెలంగాణా ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేశారని అన్నారు. ఉద్యమ సమయంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పార్టీ బాధ్యతలు పంచుకున్న నేతగా నాయిని అందించిన సేవలను మంత్రి జగదీష్ రెడ్డి స్మరించుకున్నారు. ఉద్యమ కాలం నుండి తొలి తెలంగాణా మంత్రి వర్గంలో నాయినితో తనకున్న సంబంధాలను గుర్తు చేసుకున్నారు. అటువంటి నేత మరణం తీరని లోటు అని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు మరింత ధైర్యంగా ఉండాలని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. నాయిని మరణం అత్యంత బాధాకరం నాయిని నర్సింహారెడ్డి మరణం అంత్యంత బాధకరమని మంత్రి హరీష్ రావు అన్నారు. తొలి మలిదశ ఉద్యమాల్లో నాయిని పోరాటం గొప్పది గుర్తుచేశారు. కార్మికులు, పేదల సంక్షేమం కోసం అహర్నిశలు కృషిచేశారని అన్నారు. ఆయన లేని లోటు ఎన్నటికి పూడ్చలేనిదని తెలిపారు. నాకు అత్యంత ఆత్మీయుడు నాయిని తనకు అత్యండ ఆత్మీయుడని కాంగ్రెస్ నేత జానారెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా వాసి అని, ఆయన తమకు ఆదర్శం అన్నారు. నాయిని చనిపోవడం బాధాకరమని తెలిపారు. ఆయన్ని చూసి ప్రభావితుడనై రాజకీయాల్లోకి వచ్చానని జానారెడ్డి అన్నారు. కార్మిక నాయకునిగా సుదీర్ఘ కాలం: నాయిని నర్సింహారెడ్డి మరణం పట్ల ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రగాఢ సంతాపం తెలిపారు. కార్మిక నాయకునిగా సుదీర్ఘ కాలం రాజకీయ జీవితం గడిపిన నేత నాయిని అని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటాల్లో కలిసి వచ్చేవారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర మొట్ట మొదటి హోంమంత్రిగా పనిచేసిన నరసింహారెడ్డి మరణం బాధాకరం అన్నారు. ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు. నిబద్ధత గల నాయకుడు తెలంగాణ తొలి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మృతికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. నాయిని నరసింహారెడ్డి కార్మికుల పక్షపాతి అని, తన జీవితాంతం కార్మికుల అభివృద్ధి కోసమే పాటుపడ్డారని గుర్తు చేశారు. ఆయన చాలా నిబద్ధత గల నాయకుడు అని తెలిపారు. నాయిని తెలంగాణ ఉద్యమంలో మొదటి నుండి సీఎం కేసీఅర్ వెంట నడిచిన వ్యక్తి అని అన్నారు. కార్మికుల కొరకు తన పూర్తి జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మొదటి హోం మంత్రిగా పోలీస్ శాఖలో అనేక సంస్కరణలు చేపట్టారని గుర్తుచేశారు. అందరినీ తమ్మి.. బాగున్నావా.. అంటూ పలకరించే ఎటువంటి కల్మషం లేని వ్యక్తి నాయిని అని గుర్తు చేసుకున్నారు. నాయకుని మృతి కార్మిక లోకానికి, తెలంగాణ ప్రజలకు తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నానని తెలిపారు.ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేశారు. తెలంగాణ పోరాట యోధుడు: మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆకస్మిక మృతి పట్ల రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలలో పాల్గొన్న తెలంగాణ పోరాట యోధుడు నాయిని అని గుర్తు చేశారు. కార్మిక నాయకుడిగా ఉంటూ కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. ఆయన మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు అన్నారు. నాయిని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నర్సన్న లేకపోవడం బాధాకరం నాయిని నర్సింహారెడ్డి పార్థివ దేహానికి మంత్రి మల్లారెడ్డి నివాళులు అర్పించారు. కార్మిక నాయకులు నర్సన్న లేకపోవడం బాధాకరం అన్నారు. కార్మిక లోకానికి నాయిని చేసిన సేవలు మరచిపోలేమని తెలిపారు. ప్రభుత్వాలతో కోట్లాడి కార్మికుల హక్కులను కాపాడే వారు నాయిని అని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నాయిని చేసిన పోరాటం మరచిపోలేమన్నారు. తెలంగాణ తొలి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పార్థివ దేహానికి తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ నివాళులు అర్పించారు. నాయిని నర్సింహారెడ్డి మృతి పట్ల మాజీ మంత్రి సమరసింహారెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నాయిని నర్సింహారెడ్డి మృతి చాలా బాధాకరం: డిప్యూటీ స్పీకర్ పద్మారావు -
శోభా నాయుడు నన్ను ప్రశంసించారు: చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ కూచిపూడి నాట్యకళాకారిణి శోభా నాయుడు కన్నుమూశారు. ఈ క్రమంలో మెగస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఆమె మృతికి సంతాపం తెలిపారు. ఆమెతో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘శోభా నాయుడు గొప్ప కూచిపూడి కళాకారిణి. నృత్య కళకు జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి. వెంపటి చిన్న సత్యం తర్వాత ఆయన శిష్యురాలిగా ఆయనంత ఖ్యాతినీ, కీర్తినీ కూచిపూడి నృత్య కళకు తీసుకొచ్చిన గొప్ప కళాకారిణి ఆమె. కూచిపూడి నృత్యం ద్వారా ఆమె మన సంస్కృతి గొప్పతనాన్ని విదేశాల్లో కూడా చాటారు. ఆమెతో నాకు వ్యక్తిగతంగా ఎంతో పరిచయం ఉంది. ఒకరిని ఒకరు అభిమానించుకొని ప్రశంసించుకునే వాళ్లం. శుభలేఖ చిత్రంలో నా క్లాసికల్ డ్యాన్స్ చూసి ఆమె నన్ను ఎంతో ప్రశంసించారు. అది నాకు లభించిన గౌరవంగా భావిస్తాను. ఆ సంప్రదాయం అలా కొనసాగుతూనే ఉంది. సినిమాల్లో ఆమెకు ఎంతో గొప్ప భవిష్యత్తు ఉన్నప్పటికి నృత్యానికే అంకితం అయ్యారు’ అని తెలిపారు. (చదవండి: ‘ఏ వార్త వినకూడదు అనుకున్నామో.. ’) Rest in peace #ShobhaNaidu garu. pic.twitter.com/y3zgf4VrBM — Chiranjeevi Konidela (@KChiruTweets) October 14, 2020 ‘ఈ మధ్య కాలంలో కూడా కరోనా గురించి జనాలకు అవగాహన కల్పించడం కోసం శోభా నాయుడు ఒక డ్యాన్స్ వీడియోను రూపొందించారు. అది చూసిన వెంటనే నేను ఆమెకు కాల్ చేసి అభినందించాను. సమాజ శ్రేయస్సు కోసం తన కళను వినియోగించారు. భారత దేశానికి, తెలుగు జాతికి ఆమె చేసిన సేవకు సెల్యూట్ చేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.