
వాషింగ్టన్: తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో భారత్ - చైనా సైనికుల మధ్య జరిగిన హింసాత్మక ఘటనపై అమెరికా స్పందించింది. దీనిపై అమెరికా విదేశాంగ ప్రతినిధి వాషింగ్టన్ నుంచి మాట్లాడుతూ.. భారత్, చైనా దళాల మధ్య వాస్తవాధీన రేఖ వద్ద ఏర్పడిన పరిస్థితులను ఎప్పటికప్పుడు అమెరికా నిశితంగా పరిశీలిస్తోంది. 20 మంది భారత సైనికులు మరణించినట్లు ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. మేము వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాము. భారత్- చైనా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు త్వరగా సద్దుమణిగి.. శాంతియుత పరిష్కారానికి రావాలనే ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తున్నాము. కాగా.. జూన్ 2న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీలు ఫోన్ ద్వారా సరిహద్దుల్లో పరిస్థితులపై చర్చించినట్లు ఆ దేశ ప్రతినిధి చెప్పారు. చదవండి: విషం చిమ్మిన చైనా..
ఐరాస ఆందోళన
భారత్- చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణపై ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని ఆయన మంగళవారం పిలుపునిచ్చారు. ఉద్రిక్తతను చల్లార్చేందుకు భారత్ - చైనా చర్యలు ప్రారంభించినట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment