
సాక్షి, అమరావతి: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ గుండెపోటుతో శుక్రవారం మృతి చెందారు. ఆయన మరణవార్త సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. పునీత్ మృతిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
పునీత్ మృతిపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్య రోజా సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు.
Saddened and shocked to know that #PuneethRajKumar is no more. My deepest condolences to the family, friends and fans. We will miss you💔! pic.twitter.com/uweslQEuvU
— Roja Selvamani (@RojaSelvamaniRK) October 29, 2021