సాక్షి, వైఎస్సార్ జిల్లా: అమెరికాలోని సూపర్ మార్కెట్లో జరిగిన కాల్పుల ఘటనలో బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం మజలి గ్రామానికి చెందిన దాసరి గోపీకృష్ణ మరణించారన్న వార్తపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గోపీకృష్ణ కుటుంబానికి ప్రభుత్వం తోడుగా నిలవాలని, వారిని అన్నిరకాలుగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. గోపికృష్ణ కుటుంబానికి తగిన సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర విదేశాంగ శాఖను కోరారు. గోపికృష్ణ కుటుంబానికి వైఎస్ జగన్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment