కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడ వెంకటేశ్వరస్వామి ఆలయంలో కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఆశీస్సులు అందుకుంటున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ (ఫైల్)
సాక్షి, హైదరాబాద్: కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి శివైక్యం చెందడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. ధార్మికత, ఆధ్యాత్మిక చింతన, అత్యున్నత మానవతా విలువలను జీవితమంతా ఆచరించి ప్రబోధించిన శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు జగద్గురువుగా ఖ్యాతిపొందారని జగన్ అన్నారు.
ఆదిశంకరుల వారసునిగా దాదాపు రెండున్నర దశాబ్దాలు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి కంచిపీఠానికి అందించిన సేవలు ఎన్నటికీ గుర్తుండిపోతాయని జగన్ తన సందేశంలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా జ్ఞాని అయిన శ్రీజయేంద్ర సర్వస్వతి శివైక్యం తీవ్ర దుఖానికి గురి చేసిందని పేర్కొంటూ జగన్ ఒక ట్వీట్ కూడా చేశారు.
Deeply saddened by the demise of Sri Sri Sri Kanchi Sankaracharya Jayendra Saraswati garu, the senior seer of Kanchi Kamakoti Peetham.
— YS Jagan Mohan Reddy (@ysjagan) 28 February 2018
Comments
Please login to add a commentAdd a comment