Jayendra Saraswathi
-
జయేంద్ర సరస్వతి మహాసమాధి
కాంచీపురం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: శివైక్యం చెందిన కంచి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి (82) బృందావన ప్రవేశం (అంత్యక్రియలు) గురువారం ముగిసింది. మఠంలోని బృందావనంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య సంప్రదాయపద్ధతిలో ఆయన భౌతికకాయాన్ని మహాసమాధి చేశారు. శిష్యులు, వేదపండితులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో అశ్రునయనాల మధ్య స్వామి ‘బృందావన ప్రవేశ’ (అధిష్టానం అని కూడా అంటారు) కార్యక్రమం ముగిసింది. గురువారం ఉదయం 7.45 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం మూడున్నర గంటలసేపు కొనసాగింది. ఉదయం అభిషేకంతో ప్రారంభమైన అంతిమసంస్కారం హారతితో ముగిసింది. దీంతో దాదాపు నాలుగు దశాబ్దాల పాటు మఠ పీఠాధిపతిగా దేశ, విదేశాల్లో కీర్తించబడిన శ్రీ జయేంద్ర సరస్వతి శంకరాచార్య భౌతిక శరీరం పంచభూతాల్లో కలిసి పోయింది. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్, కేంద్ర మంత్రులు రాధాకృష్ణన్, సదానంద గౌడ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అంతిమసంస్కారం జరుగుతున్నంతసేపు కైలయ వాద్యం (శివారాధన సందర్భంగా గుళ్లలో వాయించే తమిళ సంప్రదాయ వాయిద్యం) మోగుతూనే ఉంది. రాత్రంతా మఠంలో ప్రార్థనలు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, శిష్యులు, వైరాగ్య పండితులు బుధవారం రాత్రంతా మండపాల్లో స్వామీజీ పార్థివదేహం ముందు ప్రార్థనలు చేశారు. ఉదయం 7 గంటలకు బృందావన ప్రవేశ కార్యక్రమం ప్రారంభమైంది. స్వామీజీ భౌతికకాయాన్ని సమాధి చేసే తంతును మఠం నిర్వాహకులు బృందావన ప్రవేశ కార్యక్రమంగా పేర్కొన్నారు. గురువారం నుంచి మఠం పీఠాధిపతి బాధ్యతలు చేపట్టిన శ్రీ విజయేంద్రసరస్వతి పర్యవేక్షణలో అధిష్టాన పూజాధికాలు ప్రారంభమయ్యాయి. ఉద్విగ్నం.. ఉద్రిక్తం జయేంద్ర సరస్వతిని కడసారి చూసేందుకు మందిర ప్రాంగణంలోకి వచ్చిన వారిని అంతిమసంస్కారం సమయంలో కాసేపు పోలీసులు ఆపివేశారు. అప్పటివరకు ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా మొత్తం కార్యక్రమాన్ని భక్తులకోసం మఠం నిర్వాహకులు అందుబాటులో ఉంచారు. అయితే అలంకరణ సమయంలో కాసేపు ప్రత్యక్షప్రసారాన్ని నిలిపేశారు. దీంతో పోలీసుల వలయాన్ని దాటుకుని లోపలకు వెళ్లేందుకు భక్తులు ప్రయత్నించారు. ఈ సమయంలో అక్కడున్న వాలంటీర్లు కొందరు కిందపడిపోవటంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. వెంటనే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే కాసేపటికే అభిషేకం, అలంకరణ తర్వాత స్వామీజీ భౌతికకాయాన్ని మండపంలోకి తీసుకురావటంతో మళ్లీ భక్తులందరూ చూసేందుకు అవకాశం లభించింది. కడసారి స్వామీజీని చూసిన భక్తుల ఆవేదనతో మండపం, మఠం ప్రాంగణం ఒక్కసారిగా ఉద్వేగంగా మారిపోయింది. జయేంద్ర సరస్వతి శివైక్యంపై నటుడు రజనీకాంత్ ట్వీటర్లో సంతాపం వ్యక్తం చేయగా.. కమల్ çహాసన్ పార్టీ మక్కల్ నీతి మయ్యం కూడా ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేసింది. శంకరాచార్యుని బోధనలతో.. గురువు శంకరాచార్య జయేంద్ర సరస్వతి బోధనలను భక్తులు అలవర్చుకుని.. ఆధ్యాత్మిక జీవితాన్ని గడపాలని కంచిమఠం కొత్త పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ఉపదేశించారు. శివైక్యం పొందిన జయేంద్ర సరస్వతి స్వామీజీకి ప్రజలు, దేశం నాడీ బాగా తెలుసన్నారు. ప్రజల మధ్య వివక్ష చూపకుండా అందరం ఒకటేననే భావనను ఆయన ప్రచారం చేశారన్నారు. బృందావన ప్రవేశం ఇలా స్వామీజీ భౌతిక కాయానికి శాస్త్రబద్ధంగా చందన, పుష్ప, క్షీరాభిషేకాలు జరిపారు. ఆపైన వేదపండితులందరూ కలిసి చంద్రమౌళేశ్వర పూజ నిర్వహించారు. అనంతరం పుష్పాలు, సుగంధ ద్రవ్యాలు, పరిమళాలు వెదజల్లే పూలమాలలతో స్వామీజీని అలంకరించారు. పట్టువస్త్రాలు చుట్టి, అమ్మవారి కుంకుమను దిద్దారు. భక్తులందరూ చూసేందుకు వీలుగా ఎత్తైన బల్లపై భౌతిక కాయాన్ని కూర్చోబెట్టారు. చుట్టూ విజయేంద్ర స్వామీజీ, పండితులు, ముఖ్యమైన శిష్యులు నిలబడి అధిష్టాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మఠం ఆచారాల ప్రకారం, సనాతన సంప్రదాయాల ప్రకారం 13 అడుగుల లోతు, 15 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పుతో గొయ్యి తీశారు. ధ్యానముద్రలో ఉన్న స్వామి పార్థివదేహాన్ని సింహాసనం లాంటి కుర్చీలో కూర్చోబెట్టి గొయ్యిలోకి మెల్లిగా దించారు. ఈ సమాధిలో పూలు, వాసంబు (ఔషధ మొక్క), చందనం చెక్కలతోపాటు పలు సుగంధ ద్రవ్యాలు, ఉప్పు, ఇసుక వంటి వాటితో నింపేశారు. ఆపైన రాహుకాలం ప్రవేశించే 10.30 గంటలకు ముందే అశేష భక్త జనావళి సమక్షంలో స్వామీజీ భౌతిక కాయాన్ని బృందావన ప్రవేశం చేశారు. ఈ ప్రక్రియకు ముందు స్వామీజీకి ప్రియ శిష్యుడిని ఎంపిక చేసి ఆయన చేతుల మీదుగా నారికేళంతో కపాలమోక్షం చేయించారు. కార్యక్రమానికి హాజరైన వందలాది మంది ప్రజలు -
అశ్రునయనాలతో ‘అధిష్టానం’
కంచి మఠంలో కన్నీటి ధారలు కురిశాయి. శిష్యబృందం మూగబోయింది. శివైక్యం పొందిన జయేంద్ర సరస్వతిని కడసారి చూసేందుకు కలవరపడింది. కట్టలు తెంచుకునే దుంఖాన్ని ఆపుకోలేక భక్తులు సాగిలపడి బోరున విలపించారు. వేలాది మంది శిష్యులు, వేదపండితులు, సినీ, రాజకీయ ప్రముఖులు వెంట రాగా అశ్రునయనాల నడుమ శ్రీ జయేంద్ర సరస్వతి ‘బృందావన ప్రవేశ’ (అధిష్టానం) కార్యక్రమం ముగిసింది. గురువారం ఉదయం సరిగ్గా 10.30 గంటలకు మఠం ఆచార, సంప్రదాయాల ప్రకారం మహా సమాధి ప్రక్రియ పూర్తయ్యింది. బుధవారం తెల్లవార్లూ కంచి మఠం కన్నీటి కీర్తనలు ఆలపించింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన కంచి కామకోటి పీఠం భక్తులు, శిష్యులు, వైరాగ్య పండితులు మండపాల్లో కూలబడి అశ్రునయనాలతో స్వామీజీ పార్థివ దేహం ముందు ప్రార్థనలు చేశారు. ఆపుకోలేని కన్నీటితో కీర్తనలు ఆలపించారు. ‘మహానుభావా...మళ్లీ రావా’ అంటూ చేతులు జోడించి వేడుకున్నారు. జయేంద్ర సరస్వతి జీవిత చరిత్ర, ధార్మిక ప్రస్థానాన్ని వివరించే పుస్తకాలను పఠిస్తూ దైవ సంకీర్తన చేస్తూ ముక్తికి మార్గాన్ని అన్వేషించారు. కొంత మంది వేద పండితులు తమ చుట్టూ శిష్యులను కూర్చుండబెట్టుకుని జయేంద్ర సరస్వతి నీతి సూత్రాలను, ధర్మమార్గాలను వివరిం చారు. మధ్య మధ్యలో మఠం నిర్వాహకులు ఇచ్చే హారతులు స్వీకరిస్తూ, గోవింద నామ సంకీర్తనల్లో గొంతు కలుపుతూ రాత్రంతా గడిపారు. ఉదయం 7 గంటలకు బృందావన ప్రవేశ కార్యక్రమం ప్రారంభమైంది. స్వామీజీ భౌతిక కాయాన్ని సమాధి చేసే తంతును మఠం నిర్వాహకులు బృందావన ప్రవేశ కార్యక్రమంగా పేర్కొన్నారు. గురువారం నుంచి మఠం పీఠాధిపతి బాధ్యతలు చేపట్టిన శ్రీ విజయేంద్ర సరస్వతి పర్యవేక్షణలో అధిష్టాన పూజాదికాలు ప్రారంభం అయ్యాయి. బృందావన ప్రవేశం ఇలా... మొదట స్వామీజీ భౌతిక కాయానికి శాస్త్రబద్దంగా చందన, పుష్ప, క్షీరాభిషేకాలు జరిపారు. ఆపైన వేదపండితులందరూ కలిసి చంద్రమౌళేశ్వర పూజ నిర్వహించారు. అనంతరం పుష్పాలు, సుగంధ ద్రవ్యాలు, విశేష పరిమళాలు వెదజల్లే పూలమాలలతో స్వామీజీని అలంకరించారు. పట్టువస్త్రాలు చుట్టి, అమ్మవారి కుంకుమను దిద్దారు. భక్తులందరూ చూసేందుకు వీలుగా ఎల్తైన బల్లపై భౌతిక కాయాన్ని కూర్చుండబెట్టారు. చుట్టూ విజయేంద్ర స్వామీజీ, పండితులు, ముఖ్యమైన శిష్యులు నిలబడి అధిష్టాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మఠం మహాస్వామిగా చెప్పే శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి సమాధి బృందావన మండపంలోనే ఉంది. దానికి కాస్త దిగువన జయేంద్ర సరస్వతి సమాధికి ఏర్పాట్లు చేశారు. మఠం ఆచారాల ప్రకారం, సనాతన సంప్రదాయాల ప్రకారం 13 అడుగుల లోతు, 15 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పుతో గొయ్యి తీశారు. ఇందులో పూలు, చందనం, ఇతర సుగంధ ద్రవ్యాలను నింపారు. ఆపైన ఉదయం 10.30 గంటలకు ముందే అశేష భక్త జనావళి సమక్షంలో స్వామీజీ భౌతిక కాయాన్ని బృందావన ప్రవేశం జరిపారు. కుర్చీతో సహా అలాగే స్వామివారిని గొయ్యిలో కూర్చుండబెట్టి మట్టితో సమాధి చేశారు. ఈ ప్రక్రియకు ముందు స్వామీజీకి ప్రియ శిష్యుడిని ఎంపిక చేసి ఆయన చేతుల మీదగా నారికేళంతో కపాలమోక్షం చేయించారు. ఈ తంతును చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు, శిష్యులు ఆసక్తి చూపారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు మఠ పీఠాధిపతిగా దేశ, విదేశాల్లో కీర్తించబడిన శ్రీ జయేంద్ర సరస్వతి శంకరాచార్య భౌతిక శరీరం పంచభూతాల్లో కలిసి పోయింది. తరలి వచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు... శ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీని కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున సినీ, రాజకీయ ప్రముఖులు తరలి వచ్చారు. కేంద్రమంత్రి పొన్ను రాధాకృష్ణన్, మాజీ మంత్రి సదానందగౌడలు కంచి మఠానికి చేరుకుని స్వామీజీ పార్థివ దేహం ముందు ప్రణమిల్లి ప్రధాని కార్యాలయం భక్తిపూర్వకంగా పంపిన ప్రత్యేక పుష్ఫగుచ్ఛాలను అందజేశారు. తమిళనాడు గవర్నర్ బన్వర్‌లాల్ పురోహిత్ స్వామి వారిని కడసారి దర్శించి నివాళులు అర్పించారు. తమిళనాడు బీజేపీ నేతలు సౌందరరాజన్, హెచ్. రాజా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్, కాంచీపురం జిల్లా కలెక్టర్ పొన్నయ్యన్ తదితరులు స్వామీ వారిని దర్శించిన వారిలో ఉన్నారు. ఆయన ప్రజ్వరిల్లే ధార్మికజ్యోతి.. ప్రపంచానికి ఆధ్యాత్మిక ప్రభోదాలను వివరించే కంచి మఠం ధార్మిక జ్యోతి జయేంద్ర సరస్వతని టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్‌కుమార్ సింఘాల్ అభిప్రాయపడ్డారు. గురువారం ఉదయం 8 గంటలకు ఆయన డాలర్ శేషాద్రితో కలిసి కంచి శంకర మఠానికి విచ్చేశారు. జయేంద్ర స్వామి భౌతిక కాయాన్ని దర్శించి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి భక్తిపూర్వకంగా తెచ్చిన వరివట్టం, చందన కట్టలను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జయేంద్ర సరస్వతి తిరుమల వచ్చినపుడల్లా ముఖ్యమైన సూచనలు ఇచ్చేవారనీ, శాంత స్వభావం, మృదుభాషిత్వం ఆయన స్వభావమని కొనియాడారు. ఇటీవల తిరుమల యాగానికి వచ్చినపుడు చివరిసారిగా చూశానని చెప్పారు. భక్తుల హృదయాల్లో చిరస్తాయిగా వెలిగే ధార్మిక జ్యోతిగా జయేంద్ర సరస్వతిని అభివర్ణించారు. అత్యంత బాధాకరం... కంచి స్వామి జయేంద్ర సరస్వతి కన్నుమూయడం అత్యంత బాధాకరమని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. గురువారం ఉదయం ఆయన కంచి స్వామి భౌతికదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. (కాంచీపురం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) -
మానవతా విలువలకు మారుపేరు
సాక్షి, హైదరాబాద్: కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి శివైక్యం చెందడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. ధార్మికత, ఆధ్యాత్మిక చింతన, అత్యున్నత మానవతా విలువలను జీవితమంతా ఆచరించి ప్రబోధించిన శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారు జగద్గురువుగా ఖ్యాతిపొందారని జగన్ అన్నారు. ఆదిశంకరుల వారసునిగా దాదాపు రెండున్నర దశాబ్దాలు శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి కంచిపీఠానికి అందించిన సేవలు ఎన్నటికీ గుర్తుండిపోతాయని జగన్ తన సందేశంలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా జ్ఞాని అయిన శ్రీజయేంద్ర సర్వస్వతి శివైక్యం తీవ్ర దుఖానికి గురి చేసిందని పేర్కొంటూ జగన్ ఒక ట్వీట్ కూడా చేశారు. Deeply saddened by the demise of Sri Sri Sri Kanchi Sankaracharya Jayendra Saraswati garu, the senior seer of Kanchi Kamakoti Peetham. — YS Jagan Mohan Reddy (@ysjagan) 28 February 2018 -
కంచి మఠం ఆస్తులు వేల కోట్లు
కాంచీపురం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: శివైక్యం చెందిన కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి హయాంలో కంచి మఠం ఆస్తులు గణనీయంగా వృద్ధి చెందాయి. వేలకోట్ల ఆస్తులు పెరిగి మఠం పేరు ప్రతిష్టలు దేశ, విదేశాలకు వ్యాప్తిచెందాయి. ప్రస్తుతం ఉన్న శిష్యగణంలో 40% అదనంగా శిష్యులు, భక్తులు పెరిగారు. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ స్థిర, చరాస్తులు పెరిగాయి. అమెరికా, ఇంగ్లండ్ తదితర దేశాల్లోనూ స్వామీజీ భక్తులు పెరిగారు. జయేంద్ర సరస్వతి కంటే ముందు 68 మంది పీథాధిపతులు పనిచేయగా వీరంతా హిందూమత ప్రచారానికే పరిమితమయ్యారు. జయేంద్ర సరస్వతి మాత్రం కంచి కామకోటి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మత ప్రచారంతో పాటు స్కూళ్లు, ఆస్పత్రులు నిర్మించారు. పారిశ్రామికవేత్తలను శిష్యులుగా చేర్చుకుని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి అధిక మొత్తంలో విరాళాలు రాబట్టారు. ఆయుర్వేద ఆస్పత్రి, వర్సిటీలు నిర్మించి.. గ్రామాల్లో మంచినీటి సదుపాయాలు, రోడ్లు వేయించారు. దేశవ్యాప్తంగా 38 శాఖలను ప్రారంభించి భక్తుల నుంచి వేల కోట్ల విరాళాలను ట్రస్ట్‌కు రాబట్టారు. ఈ సొమ్ములతో సేవా కార్యక్రమాలను చేపట్టడంతో ప్రముఖుల దృష్టి కంచి మఠం వైపు మళ్లింది. ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది.. మఠం మేనేజర్ సుందరేశ్ అయ్యర్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పలు రాష్ట్రాల సీఎంలు, ప్రధాని కార్యాలయం నుంచి తమకు ఫోన్లు వచ్చినట్లు చెప్పారు. స్వామీజీ అధిష్టానం గురించి వారు వాకబు చేశారని వివరించారు. దీనికి ఎవరెవరు వస్తున్నారో తెలియపర్చలేదని తెలిపారు. బుధవారం రాత్రి తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కంచి మఠానికి చేరుకుని జయేంద్రసరస్వతి పార్థీవదేహానికి నమస్కరించారు. స్వామీజీ ఆకస్మిక మరణం మనస్సును కలచివేసిందని చెప్పారు. -
కథ కంచి పీఠానిది...
కంచి కామకోటి పీఠాధిపతుల్లో అత్యంత వివాదాస్పదమైన ఆధ్యాత్మిక గురువుగా జయేంద్ర సరస్వతిని పరిగణిస్తే ఆయనకు ముందు 88వ పీఠాధిపతిగా దాదాపు 87 ఏళ్లు కొనసాగిన చంద్రశేఖరేంద్ర సరస్వతిని అత్యధిక గౌరవ ప్రతిపత్తులున్న ‘పరమాచార్య’గా గౌరవిస్తారు. అసలు కంచి పీఠం హోదాపైనే చాలా కాలం వివాదం సాగింది. హిందూ మత పునరుద్ధరణకు పునాదులు వేసిన ఆది శంకరాచార్య స్థాపించిన నాలుగు పీఠాల్లో కంచి లేదనీ, దీన్ని ఆయనే ఏర్పాటు చేశారనే మాటల్లో నిజం లేదని అనేక మంది వాదిస్తారు. ఎనిమిదో శతాబ్దంలో జీవించిన ధర్మసంస్కర్త శంకరాచార్య అద్వైత వేదాంత ప్రచారానికి తూర్పున పూరీ(ఒడిశా), పశ్చిమాన ద్వారక(గుజరాత్), ఉత్తరాన జ్యోతిర్మఠ్బదరీనాథ్(ఉత్తరాఖండ్), దక్షిణాన శృంగేరి(కర్ణాటక)లో నాలుగు మఠాలు స్థాపించారని, కంచి పీఠం వీటిలో లేదని కొందరు చెబుతారు. అయితే, కంచి కామకోటి పీఠాన్ని ఆది శంకరుడే (ఆది శంకర భగవత్పాద)స్థాపించారని, ఆయనే తొలి పీఠాధిపతి(కీస్తుపూర్వం 482477) అని కంచి పీఠం పేర్కొంది. ఈ పీఠం లెక్క ప్రకారం చూస్తే దాదాపు 2500 సంవత్సరాల చరిత్రలో జయేంద్ర సహా 69 మంది ఇప్పటీ వరకూ కంచి కామకోటి పీఠాధిపతులుగా ఉన్నారు. చెన్నైకి సమీపంలో ఉన్న కారణంగా కంచిపీఠం అత్యధిక హిందువులతోపాటు ఐరోపా దేశాలకు చెందిన పలువురిని ఆకట్టుకుంది. ‘పరమాచార్య’ హయాంలో పెరిగిన జనాదరణ 190794 మధ్య కంచి కామకోటి పీఠాధిపతిగా ఉన్న జగద్దురు చంద్రశేఖరేంద్ర సరస్వతి మిగిలిన అన్ని పీఠాలతో పోల్చితే తన పీఠానికి ఎప్పుడూ లేనంత జనాదరణ సంపాదించిపెట్టారు. ఈ కాలంలో బ్రిటిష్అధికారులు, స్వాతంత్య్ర సమరయోధులు, తర్వాత ప్రధానులు, ముఖ్యమంత్రులు, మంత్రులు సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కంచి పరమాచార్యను కలిసి ముచ్చటించడం ఆనవాయితీగా ఉండేది. 1947కు ముందు చంద్రశేఖరేంద్రతో ప్రఖ్యాత ఇంగ్లిష్రచయిత, జర్నలిస్ట్పాల్బ్రంటన్సమావేశం పరమాచార్యకు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చింది. స్వాతంత్య్ర పోరాట సమయంలో అప్పటి మద్రాసులో అంతర్భాగమైన పాలకాడ్లో పరమాచార్యను మహత్మా గాంధీ కలుసుకున్నారు. కుల వ్యవస్థ, స్త్రీ విద్య, బాల్య వివాహాలు, వితంతువుల హోదా వంటి విషయాల్లో చంద్రశేఖరేంద్ర సంప్రదాయవాది అయినా ఆయనకు ఎనలేని గౌరవం ఉండేది. జాతీయ నాయకులతోపాటు శాస్త్రవేత్తలు, రచయితలు అన్ని ఖండాల నుంచి వచ్చి ఆయనతో భేటీ అయ్యేవారు. ఆయన హయాంలో కంచి పీఠం పేరు బాగా విస్తరించింది. దేశంలో ఎమర్జెన్సీ విధించి అప్రదిష్ఠపాలైన ప్రధాని ఇందిరాగాంధీ క్రమం తప్పకుండా పరమాచార్యతో సమావేశం కావడం అందరికీ తెలిసిన విషయమే. ఎమర్జెన్సీ కాలంలో కంచి వచ్చిన ఇందిరను పరమాచార్య నిరాకరించడం వల్లే ఆమె ఆత్యయికస్థితిని తొలగించి ఎన్నికలు ప్రకటించారని కూడా కొందరు ప్రముఖులు చెబుతారు. వివాదాస్పద శంకరాచార్య జయేంద్ర! చంద్రశేఖరేంద్ర మతతత్వ పార్టీలకు దూరంగా ఉండడమేగాక ఏ ఒక్క రాజకీయపక్షానికి దగ్గరకాలేదు. కాని, 1996 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అప్పటి ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి జయలలిత తన పార్టీ అభ్యర్థుల జాబితా విడుదలకు ముందు జయేంద్ర సరస్వతి ఆశీర్వాదాల కోసం ఆయనతో భేటీ అయ్యారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో చెన్నై బీజేపీ ఎన్నికల కార్యాలయాన్ని జయేంద్ర ప్రారంభించారు. 1994లో చంద్రశేఖరేంద్ర కన్నుమూశాక కంచి పీఠం ఇలాంటి పరిణామాలకు అవకాశమిచ్చింది. అప్పటి నుంచి కంచి మఠం కార్యకలాపాలు కొత్త రంగాలకు విస్తరించాయి. రాజకీయాలకు దూరంగా ఉండాలనే సంప్రదాయానికి స్వస్తిపలికారు. ఏఐఏడీఎంకే(జయలలిత) తొలి పాలనాకాలంలో దేవాలయ ఆస్తుల పరిరక్షణ కమిటీ అధిపతిగా జయేంద్ర నియమితులయ్యారు. తిరుమల వెంకటేశ్వర ఆలయంలో జరిగే పూజా విధానంలో ఆయన కొన్ని మార్పులు సూచించి వివాదం సృష్టించారు. తిరుపతి గుడి వ్యవహారాల్లో కంచి పీఠాధిపతి జోక్యం తగదని త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్‌స్వామి వంటి వైష్టవ పీఠాధిపతులు అభ్యంతరం చెప్పారు. అయితే, 1990ల్లో దేశంలో దళితుల్లో చైతన్యం పెరగడంతో వారిని ‘హిందూ ప్రధాన జీవన స్రవంతి’లోకి తీసుకురావడానికి జయేంద్ర కృషిచేశారు. దళితుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టారు. మొత్తంమీద చంద్రశేఖరేంద్ర సనాతనవాదిగా ఉంటూనే కంచి పీఠానికి ప్రాచుర్యం తీసుకొస్తే, జయేంద్ర వివాస్పద పీఠాధిపతిగా కొన్నాళ్లు కొనసాగి చివరి రోజుల్లో ప్రశాంత జీవనం గడిపారు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
సేవల స్వామీజీ
ధర్మమే నిలుస్తుంది.. సత్యమే గెలుస్తుంది ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనే విధంగా మా గురువులు నన్ను తీర్చిదిద్దారు. కష్టం అన్న పరిస్థితే ఎదురుకాదు – జయేంద్ర సరస్వతి తిరువళ్లూరు (తమిళనాడు): తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన కంచి కామకోటి 69వ పీఠాధిపతిగా సేవలు కొనసాగించిన స్వామి జయేంద్రసరస్వతి శివైక్యం చెందడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన భక్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. పీఠాధిపతిగా తన సేవలను ఆధ్యాత్మికకే పరిమితం కాకుండా నిరుపేదలకు సేవ చేస్తూ సేవల స్వామీజీగా పేరు సంపాదించుకున్నారు. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలకు ఆసరాగా ఉండాలన్న ఉద్దేశంతో వైద్యశాలలు, పాఠశాలలు డీమ్డ్ యూనివర్సిటీ, గోశాల, వృద్ధాశ్రమం ప్రారంభించి తమ సేవలను అన్ని వైపులా విస్తరించారు. రాష్ట్ర వ్యాప్తంగా శిథిలావస్థకు చేరుకున్న పలు ప్రసిద్ధ ఆలయాలను పునరుద్ధరించి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చారు. సేవలు చిరస్మరణీయం కంచి మఠం పీఠాధిపతిగా బాధ్యతను నిర్వహిస్తూనే సేవలకు అపరిమత ప్రాధాన్యతను ఇచ్చారు. కాంచీపురం సమీపంలోని ఏనత్తూరు గ్రామం వద్ద 1993లో కంచి మఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ చంద్రశేఖర సరస్వతి విశ్వ విద్యాలయం ద్వారా తక్కువ ఫీజుతో నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించారు. 1994లో ఎడ్యుకేషన్ వింగ్ ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో 22 పాఠశాలలను ఏర్పాటు చేసి గ్రామీణ విద్యార్థులకు విద్యను అందిస్తున్నారు. నిరుపేదలకు వైద్య సేవలు మానవ సేవే మాధవసేవ అన్నది జయేంద్రసరస్వతి నినాదం. 1978లోనే శంకరనేత్రాలయం ప్రారంభమైనా, జయేంద్రసరస్వతి పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన తరువాతే సేవలు విస్తృతమయ్యాయి. శంకరనేత్రాలయ ద్వారా ఉచిత కంటి ఆపరేషన్‌తో పాటు కంటి అద్దాలు, భోజనం, రవాణా సదుపాయాలను సైతం అందిస్తున్నారు. ఈ వైద్యశాలలో రోజుకు 1,200 మందికి చిక్సిత, రెండు వందల మందికి ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఇండియన్ మిషన్ వైద్యశాల, చెన్నైలోని నుంగంబాక్కం వద్ద ఉన్న చైల్డ్ హాస్పిటల్, కోల్‌కతా, గువాహుటి, రామేశ్వరం, తిరుపతిలోని వైద్యశాలలు సైతం జయేంద్రసరస్వతి ప్రత్యేక చొరవతోనే నిరుపేదలకు వైద్య సేవలను అందిస్తున్నాయి. ఆయన జీవన విధానం ఆదర్శనీయం - కొన ఊపిరి వరకూ ధర్మం కోసం పోరాటం చేశారు - విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ పెందుర్తి: కంచికామకోటి పీఠాధిపతి జగద్గురువు జయేంద్ర సరస్వతి మహాస్వామి పరమపదించడం తనను ఎంతో బాధకు, దిగ్బ్రాంతికి గురి చేసిందని విశాఖ శ్రీశారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ అన్నారు. జయేంద్ర సరస్వతి లేకపోవడం భారతదేశానికి తీరనిలోటని పేర్కొన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలోని శారదాపీఠంలో స్వామీజీ విలేకరులతో మాట్లాడుతూ దేశంలో జయేంద్రసరస్వతి చేసిన ధర్మప్రచారం ఏ పీఠాధిపతి చేయలేదన్నారు. ధర్మం కోసం కొన ఊపిరి వరకు ఆయన పోరాటం చేశారని, తనలాంటి వారికి ఆయన జీవనవిధానం ఎంతో ఆదర్శప్రాయమన్నారు. వారి మార్గంలోనే శారదాపీఠం వంటి పీఠాలు ఆమోదయోగ్యంగా నడుస్తున్నాయని చెప్పారు. ఆదిశంకరాచార్యులు అనుసరించిన మార్గంలోనే కేవలం ఆధ్యాత్మిక చింతనే కాకుండా సామాజిక దృక్పథంతో పేదలకు సహాయం చేయాలన్న సదుద్దేశంతో కంటి ఆసుపత్రి, వైద్యశిబిరాలు, వేదపాఠశాలలు నడుపుతూ సమాజానికి మేలు చేకూర్చుతున్న జీవన్ముక్తులు జయేంద్రసరస్వతి అని కొనియాడారు. విశాఖ శ్రీశారదాపీఠానికి, కంచికామకోటి పీఠానికి ఎంతో అవినావభావ సంబంధం ఉందన్నారు. జయేంద్ర సరస్వతి ఎప్పుడు విశాఖ వచ్చినా శారదాపీఠానికి వచ్చి తమకు ఆశీర్వచనం అందించేవారని గుర్తు చేశారు. వారు (జయేంద్ర) మరికొంతకాలం ఈ లోకంలో ఉండి మా అందరినీ నడిపించాలని ఆకాంక్షించామని.. కానీ దైవం మరోలా తలచిందని విచారం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు ఆదిశంకరాచార్యుల అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ఆ శంకరులను ప్రార్థిస్తున్నామని పేర్కొన్నారు. 19 ఏళ్ల వయస్సులో యువ పీఠాధిపతిగా.. సాక్షి, చెన్నై: జయేంద్ర సరస్వతి 19 ఏళ్ల వయస్సులోనే కంచి మఠానికి యువ పీఠాధిపతిగా పట్టాభిషిక్తులయ్యారు. 1935 జూలై 18వ తేదీ తమిళనాడులోని నేటి తంజావూరు జిల్లాలోని ఇరుల్నీక్కి గ్రామంలో జన్మించిన జయేంద్ర సరస్వతి అసలు పేరు సుబ్రహ్మణ్య మాదే అయ్యర్. చిన్న తనంలోనే హిందూ మత పెద్దలతో కలిసి ఆధ్యాత్మిక బాటలో నడిచారు. అప్పటి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర సరస్వతిస్వామి సుబ్రహ్మణ్య మాదే అయ్యర్‌ను 19 ఏళ్ల వయస్సుల్లో జయేంద్ర సరస్వతిగా నామకరణం చేస్తూ 1954లో మార్చి 22న కంచిమఠానికి యువ పీఠాధిపతిని చేశారు. విదేశాల్లోనూ: 1988లో నేపాల్ పర్యటించారు. మానస సరోవరణాన్ని, ముక్తినాథ్ను సందర్శించారు. ఇక్కడకు అడుగు పెట్టిన తొలి ఆచార్యులు జయేంద్ర సర్వతి. మానస సరోవరంలో శంకరాచార్యుల విగ్రహాన్ని ప్రతిష్టించారు. 2000 సంవత్సరంలో బంగ్లాదేశ్‌లో పర్యటించారు. ఆశీస్సుల కోసం : జయేంద్ర సరస్వతి పాదాన్ని తాకి పునీతులయ్యేందుకు ఎదురుచూసే భక్తులు దేశ విదేశాల్లోనూ ఎక్కువే. కంచిలోని కామాక్షి అమ్మవారిని దర్శించిన భక్తులు పక్కనే ఉన్న కంచి మఠంలో జయేంద్ర సరస్వతి స్వామి వారి ఆశీస్సుల కోసం బారులుతీరే వారు. చివరి పూజ: కామాక్షి అమ్మవారి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ అమ్మ వారి సేవలో జయేంద్ర సరస్వతి పాల్గొంటూ వచ్చారు. మంగళవారం రాత్రి 9 గంటలకు అమ్మవారికి దీపారాధన చేసి మండపానికి వెళ్లారు. ఇదే స్వామి వారి చివరి పూజ. దేశం గొప్ప ఆధ్యాత్మిక నేతను కోల్పోయింది: రాష్ట్రపతి కోవింద్ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి శివైక్యం పొందటం పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తనకు దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. గొప్ప ఆధ్యాత్మిక నేతను, సాంఘిక సంస్కర్తను మన దేశం కోల్పోయిందన్నారు. ఈ మేరకు బుధవారం ట్విట్టర్లో సందేశం పోస్ట్ చేశారు. ఆదర్శప్రాయులు: ఉపరాష్ట్రపతి వెంకయ్య కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి శివైక్యం చెందడం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మానవాళి సంక్షేమానికి ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు. చిరస్థాయిగా నిలిచిపోతారు: ప్రధాని మోదీ శ్రీ కంచి కామకోటి పీఠం జగద్గురు పూజ్యశ్రీ జయేంద్ర సరస్వతి శంకరాచార్య శివైక్యం చెందడం తనను తీవ్ర ఆవేదన కలిగించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉన్నతమైన ఆలోచనలు, విశిష్టమైన సేవల ద్వారా ఆయన లక్షలాది మంది మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ మేరకు బుధవారం ప్రధాని ట్వీట్ చేశారు. దిగ్భ్రాంతి కలిగించింది: రాహుల్ గాంధీ కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి శివైక్యం పట్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తనకు దిగ్భ్రాంతి కలిగించినట్లు బుధవారం ఓ ట్వీట్లో పేర్కొన్నారు. స్వామీజీ మరణం బాధాకరం: పన్నీరు సెల్వం కంచి కామకోటి పీఠం మఠాధిపతి శ్రీ జయేంద్రస్వామి సరస్వతి అకాల మరణం తమిళనాట ప్రజలందరికీ తీరని లోటని డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం అన్నారు. స్వామీజీ మరణం అత్యంత బాధాకరమన్నారు. బుధవారం సాయంత్రం హుటాహుటిన కాంచీపురం చేరుకున్న డిప్యూటీ సీఎం సెల్వం, మంత్రులు స్వామీజీ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. జయేంద్ర సరస్వతి లేని లోటు తీరనిది: గవర్నర్ సాక్షి, హైదరాబాద్: కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు జయేంద్ర సరస్వతి శివైక్యం చెందడం పట్ల తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ విచారంవ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆశేష భక్తజనానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జయేంద్ర సరస్వతి లేని లోటు తీరనిదని అన్నారు. చంద్రబాబు సంతాపం కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి శివైక్యం చెందడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి తీవ్ర విచారకరమన్నారు. కేసీఆర్ సంతాపం కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి శివైక్యం చెందడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన చేసిన ఆధ్యాత్మిక సేవలను గుర్తు చేసుకున్నారు. జయేంద్ర సరస్వతి అంతిమ సంస్కారాల్లో పాల్గొనేందుకు తెలంగాణ దేవాదాయశాఖ అధికారులు కంచికి బయల్దేరారు. -
70వ పీఠాధిపతిగా శంకర విజయేంద్ర
సాక్షి, చెన్నై: జయేంద్ర సరస్వతి శివక్యైం పొందడంతో కంచి కామకోటి మఠం 70వ పీఠాధిపతిగా శంకర విజయేంద్ర సరస్వతికి పట్టాభిషేకం చేయనున్నారు. ఈయన అసలు పేరు శంకరనారాయణన్. 1969 మార్చి 18న జన్మించారు. తిరువళ్లూరు జిల్లా ఆరణి సమీపంలోని పెరియపాళయం గ్రామం ఆయన స్వస్థలం. 1983 మే 29న పోలూరులో ఆధ్యాత్మిక గురువయ్యారు. జయేంద్ర సరస్వతితో కలసి అడుగులు వేశారు. వివాదాల్లోనూ, కారాగారవాసంలోనూ తోడుగానే నిలబడ్డారు. మేఘాలయ వరకు పర్యటించి ఆధ్యాతిక బోధనలు చేశారు. పెడదారి పడుతున్న యువతను సన్మార్గంలో నడిపించడంతో పాటు విద్యా ప్రమాణాల పెంపు, దేశంలో సాంస్కృతిక, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ, కొరవడుతున్న నైతిక, మానవీయత విలువల్ని రక్షించే రీతిలో ఆయన పయనం సాగించారు. యువకుల్లో చైతన్యం లక్ష్యంగా ఎక్కువ సమయాన్ని కేటాయించారు. పురాతన సాహిత్యాన్ని కాపాడడం, భారతీయ, విదేశీ భాషల్లో భక్తుల కోసం అనేక ప్రచురణలను తీసుకొచ్చారు. పంచ భూతాల్లో పృథ్వీ క్షేత్రం.. కాంచీపురం దక్షిణ భారతంలో ఉన్న శివ ఆరాధనలో పంచ భూతాల్లో పృథ్వీ క్షేత్రంగా కాంచీపురం అలరారుతోంది. ఈ క్షేత్రంలోని కంచి కామకోటి పీఠానికి విశిష్ట చరిత్ర ఉంది. ఆది శంకరాచార్య చేతుల మీదుగా ఆవిర్భవించిన ఈ మఠం ద్వారా హిందూ మత సేవలో రెండు దశాబ్దాలకు పైగా జయేంద్ర సరస్వతి నిమగ్నమయ్యారు. భౌగోళికంగా భూమి(కాంచీపురం), ఆకాశం(కడలూరు జిల్లా చిదంబరం), గాలి( చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి), అగ్ని(తిరువణ్ణామలై), నీరు(తిరువన్నై కోయిల్) క్షేత్రాలను పిలుస్తుంటారు. వీటన్నింటి సమ్మేళనంతో శ్రీ కంచి కామకోటి పీఠం ఆవిర్భవించినట్టు చరిత్ర చెబుతోంది. ఈ మఠానికి తల భాగంగా శంకరాచార్య వారిని అభివర్ణిస్తుంటారు. క్రీ.శ 482లో ఆది శంకర భగవత్పదచార్య స్వామి ఈ మఠాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. ఈ కామకోటి పీఠం సంప్రదాయంగా కామాక్షి అమ్మవారిని సూచిస్తుంటుంది. కామకోటి దుర్గాదేవిని సూచిస్తుంది. శ్రీ శంకర భగవత్పాడ(శ్రీశంకరాచార్య) స్వామి వారు కంచిలో స్థిరపడుతూ తన కంటూ ఓ సొంత నివాసంగా ఈ మఠాన్ని నెలకొల్పారు. ఆయన అడుగు జాడల్లో శిష్యులైన శ్రీ సురేశ్వర చార్య, సర్వజ్నాత్మాన్, సత్య భోదేంద్ర సరస్వతి, జ్ఞానందేంద్ర సరస్వతి, సుధానందేంద్ర సరస్వతి వంటి పీఠాధిపతుల నేతృత్వంలో సనాతన హిందూ ధర్మ పరిరక్షణలో ఈ పీఠం ముందుకు సాగింది. ఇది వరకు ఉన్న 68 మంది పీఠాధిపతులతో పోల్చితే, జయేంద్ర సరస్వతి ఈ పీఠం పరిరక్షణకు, హిందూ ధర్మ ప్రచారంలో విశిష్ట సేవల్ని అందించారు. ఆధ్యాత్మికమే కాదు, విద్య, వైద్య, సేవాపరంగానూ ఈ మఠాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లిన ఘనత ఆయనదే. -
సదాచరణకు స్ఫూర్తి
నివాళి పేదవాడిని ప్రేమించడమే పెరుమాళ్లును సేవించడమని ఆయన మనసావాచా నమ్మారు. అందుకే మఠం సొమ్ముతో కంచి కామకోఠి ఆస్పత్రులు, నేత్ర వైద్యశాలలు, నామమాత్రంగా రుసుము తీసుకునే విద్యాసంస్థలు నెలకొల్పారు. సనాతన ధర్మాన్ని నిలబెట్టడం కోసం జగద్గురు ఆది శంకరాచార్య స్థాపించి, స్వయంగా వారే ఆధిపత్యం వహించిన కంచి పీఠం ఎంతో విశిష్టమైనది. ఆ పరంపరలో 68వ పీఠాధిపతిగా అందరినీ తరింప చేసిన పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు సాక్షాత్తూ భూమిపైకి దిగివచ్చిన శంకరులుగా, నడిచే దైవంగా, త్రికాలజ్ఞులుగా అందరికీ తెలుసు. మఠ సంప్రదాయాన్ని అను సరించి, ఆయన జీవించి ఉండ గానే, ఆయన సంకల్పంతో, తన తరువాతి పీఠాధిపతిగా వారసు లుగా నియమితు లయ్యారు శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి. ఆ కంచిమఠ ప్రాధాన్యాన్ని నిలబెడుతూ మనందరికీ మార్గదర్శకులు అయ్యారు. అయితే ఆయన మహిమలేమీ చూపలేదు. మాయలూ చేయలేదు. కానీ ఆచరించదగ్గ మంచి మాటలెన్నో చెప్పారు. వాటిలో కొన్నింటిని మననం చేసుకుందాం... తల్లిదండ్రులు చిన్నప్పుడు పిల్లలకు నేర్పిందే వారికి జీవితాంతం ఉంటుంది. పిల్లలను ప్రేమించడం అంటే వారికి ఏ కష్టమూ రాకుండా చూసుకోవడం కాదు, కష్టం వచ్చినప్పుడు దానిని అధిగమించడం ఎలాగో నేర్పడం. వారికి బాల్యం నుంచి రామాయణ భారత భాగవత కథలు చెబుతూ, అందులోని నీతిని, ధర్మాన్ని, న్యాయాన్ని నేర్చుకునేలా చేయి. ఎలా బతకాలో, ఎలా బతకకూడదో, పొరుగువారిని ప్రేమించడం ఎలాగో నేర్పు... నీకేదో నాలుగు అక్షరం ముక్కలు వచ్చినాయని గర్వ పడటం కాదు, నీకు తెలిసిన విద్యను, నీ సంస్కారాన్ని వారు నేర్చుకునేలా చేయాలి. కాబట్టి ముందు నువ్వు మంచి ప్రవర్తనతో మెలుగు అనేవారు. అదేవిధంగా నువ్వు పూజా పురస్కారాలు చేయడం కాదు, నీ కుమారుడికి నేర్పు, నీవు రుచికరమైన వంటలు చేయడం కాదు, నీ కుమార్తెకు మంచి మంచి వంటకాలు చేయడం నేర్పించు. మన సంస్కృతిలోని గొప్పదనాన్ని వారంతట వారే తెలుసుకునేలా చేయి. ధనం సంపాదించడం ఒక్కటే కాదు, నీతి నిజాయితీలతో జీవించగలిగే ఇంధనాన్ని వారి జీవన ప్రయాణంలో నింపు అని చెప్పేవారు తన వద్దకొచ్చిన వారితో. అయితే, ఎన్ని మంచి మాటలు చెప్పినా, సమాజానికి వారు ఎంత సేవ చేసినా, వారిపైన కూడా కొన్ని నీలినీడలు, అపవాదులు, అభి యోగాలు ఉన్నాయి. మాయలో ఉన్న ప్రకృతిలో కలిప్రభావంతో వచ్చే అపవాదులవంటి వాటిని సహనంతో తట్టుకొని, దైవశక్తితో నిష్కళంకులై, ధర్మప్రబోధానికి ప్రత్యక్షసాక్షులు అయ్యారు! వారు సిద్ధిపొంది, భౌతిక కాయాన్ని విడిచినా, ఆ దైవశక్తి పరంపరగా కొనసాగుతుంది. ఆదిశంకరులు మనకందించిన ధర్మాచరణ విధానం, అద్వైత మత ఆచరణ – ఆ కంచి పీఠం ద్వారా, శ్రీశ్రీశ్రీ విజయేంద్ర ఇందిరా సరస్వతీ మార్గదర్శనంలో మనం పనిచేస్తాము. శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి మన మధ్యలో భౌతి కంగా లేకపోయినా, పరంపరాగత శక్తి మనకి మార్గదర్శనం చేస్తూ ఉంటుంది. అనంతానికి ఎంత కలసినా అనంతమే! అనంతంలో నుంచీ ఎంత తీసేసినా అనంతమే! మానవాళి కోసం, విశ్వ శాంతి కోసం ఆచార్యుల వారు చేసిన కృషి అనన్య సామాన్యమైనది. పేదవాడిని ప్రేమించడమే పెరుమాళ్లును సేవిం చడమని మనసా వాచా నమ్మిన వారాయన. అందుకే మఠం సొమ్ముతో మఠం పేరుతో కంచి కామకోఠి ఆస్పత్రులు, నేత్ర వైద్యశాలలు, నామ మాత్రంగా రుసుము తీసుకునే విద్యాసంస్థలు నెలకొల్పారు. ఆయన చేసిన మహా మంచి పనులకు లెక్క కట్టటం కూడా కష్టసాధ్యమైనదే ననడం అతిశయోక్తి కాదు.. సామాన్యుల నుంచి అసాధారణమైన వారి వరకు ఆయనకు పాదాభివందనం చేయటం కోసం వేచి ఉండేవారు. అలాంటి ఒక ఉత్తమో త్తములకు, శిఖరాగ్రం అయినటువంటి మహా మనీషికి ఎవరు ఎంతటి మర్యాద ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆయన విలువ మాత్రం ఎపుడూ అలానే నిలిచి ఉంటుంది.. అది ఆచంద్ర తారార్కం.. అలాంటి ఒక గురుతుల్యులకు, భగవత్సమానులకు అంజలి ఘటిస్తూ దేశం యావత్తూ కన్నీటి వీడ్కోలు సమర్పిస్తోంది. –డి.వి.ఆర్.భాస్కర్ -
కంచి స్వామి శివైక్యం
కాంచీపురం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి శివైక్యం పొందారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. కాంచీపురంలోని ఓ ఆస్పత్రిలో బుధవారం ఉదయం 9 గంటలకు జయేంద్ర తుదిశ్వాస విడిచారు. ఆయన కొద్ది నెలలుగా శ్వాస సంబంధ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. బుధవారం ఉదయం ఛాతీలో నొప్పిగా ఉందనడంతో మఠం నిర్వాహకులు ఉదయం 7.30 గంటలకు శంకర మఠానికి అను బంధంగా ఉన్న ఆది భగవత్పాద కార్డియాక్ అండ్ డయాలసిస్ (ఏబీసీడీ) ఆస్పత్రికి స్వామీజీని తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం చికిత్స ప్రారంభించిన వైద్యులు 8.30 గంటలకు పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. స్వామీజీ తుదిశ్వాస విడిచినట్లు ఉదయం 9 గంటలకు ప్రకటించారు. దీంతో దేశ, విదేశాల్లో ఉన్న స్వామీజీ శిష్యులు, భక్తులు, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఒక్కసారిగా దుఃఖసాగరంలో మునిగిపోయారు. స్వామీజీ శివైక్యం విషయం తెలిసిన వెంటనే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చారు. స్వామీజీ నేతృత్వంలో సాగిన ఆధ్యాత్మిక, ధార్మిక, సేవా కార్యక్రమాలను కొనియాడారు. నేడు శాస్త్రబద్ధంగా ‘అధిష్టాన’ కార్యక్రమం స్వామీజీ శివైక్యం గురించిన వార్త విన్నంతనే ఆయన శిష్యులు, భక్తజనావళి హుటాహుటిన కంచి మఠానికి తండోప తండాలుగా తరలి వచ్చారు. భక్తుల సందర్శనార్థం స్వామీజీ పార్థివ దేహాన్ని ఆయన మండపంలోనే ఉంచారు. అక్కడి ఏర్పాట్లను మఠం మేనేజర్ సుందరేష్ అయ్యర్, బాల పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి ప్రభృతులు పర్యవేక్షిస్తున్నారు. గురువారం ఉదయం వేద ఘోష, విష్ణుపారాయణ, అధిష్టాన పూజ, అభిషేకాల ప్రక్రియ ముగిశాక ‘అధిష్టానం’ (సమాధి) కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు వివరించారు. దీనిని ‘బృందావన ప్రవేశ కార్యక్రమం’గా పిలుస్తామని వారు తెలిపారు. కంచి కామకోటి మఠం ఆవరణలో మహాస్వామి చంద్రశేఖరేంద్ర స్వామిని అధిష్టానం చేసిన ప్రదేశం పక్కనే జయేంద్ర సరస్వతి భౌతిక కాయాన్ని కూడా శాస్త్రబద్ధంగా అధిష్టానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కంచి మఠానికి 69వ పీఠాధిపతి.. తమిళనాడులోని తిరువారూర్ జిల్లా ఇరుల్నీకి గ్రామంలో 1935 జులై 18న జన్మించిన జయేంద్ర సరస్వతి చిన్నతనంలోనే వేదా«భ్యాసం, వివిధ శాస్త్రాల పఠనం పూర్తి చేశారు. స్వామీజీ అసలు పేరు సుబ్రహ్మణ్య మహాదేవ అయ్యర్. తన 19వ ఏట అనగా 1954 మార్చి 22న కంచి శంకర మఠానికి చేరుకుని బాలస్వామీజీగా బాధ్యతలు స్వీకరించారు. అప్పట్లో మఠం బా«ధ్యతల్లో ఉన్న చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామీజీ ఈయనను తన వారసునిగా శిష్యబృందానికి స్వయంగా పరిచయం చేశారు. 1994లో చంద్ర శేఖరేంద్ర స్వామి కన్నుమూశాక జయేంద్ర సరస్వతి ప్రధాన పీఠాధిపతి బాధ్యతలను చేపట్టారు. హిందూ ధర్మ ప్రచారం, కంచి మఠ విస్తరణ, శిష్య పరంపర అభివృద్ధి, సేవా, ధార్మిక కార్యక్రమాల అమలు, ఆధ్యాత్మిక ప్రచార కార్యక్రమాలను జయేంద్ర సరస్వతి విస్తృతంగా చేపట్టారు. వివిధ సందర్భాలలో రాజకీయ వివాదాలు, కేసులు చుట్టుముట్టినా వాటిని అధిగమించి శిష్య పరంపరను ఏకతాటిపై నడిచేలా చేశారు. ఆధ్యాత్మిక, విద్యా, వైద్య సంబంధ విభాగాల్లో శంకర మఠం ట్రస్ట్‌ను ఎంతో అభివృద్ది చేశారు. మఠం ని«ధులతో దక్షిణ భారత దేశంలోని ఎన్నో పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ పనులు చేపట్టారు. విద్యా వ్యవస్థను పేదలకు అందుబాటులోకి తీసుకెళ్లి పేద, మధ్య తరగతి వర్గాలకు ఆరాధ్యనీయుడయ్యారు. 1988లో నేపాల్ వెళ్లిన సందర్భంలో అప్పటి నేపాల్ రాజు జ్ఞానేంద్ర స్వామీజీని ఘనంగా సత్కరించారు. 1998లో స్వామి జయేంద్ర హిమాలయాల్లో ఉన్న మానస సరోవర్, కైలాసగిరి క్షేత్రాలను సందర్శించారు. ఆదిశంకరాచార్య తరువాత అక్కడికెళ్లిన పీఠాధిపతి ఈయనొక్కరే. 2000లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వెళ్లిన స్వామీజీ అక్కడున్న తగేశ్వరి ఆలయానికి సొంత నిధులతో స్వాగత తోరణం నిర్మించారు. 2004లో వరదరాజ పెరుమాళ్ ఆలయ మేనేజర్ శంకర రామన్ హత్య కేసులో ఆరోపణలపై జయేంద్ర అరెస్టవడం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఆ తరువాత ఆయన నిర్దోషిగా విడుదలయ్యారు. గత నాలుగేళ్లుగా ఆయన ఆరోగ్యం సరిగా లేక ఇబ్బంది పడుతున్నారు. రెండు నెలల కిందట శ్వాస సంబంధ సమస్యలతో చెన్నైలోని రామచంద్రా ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్నారు. ఈ మధ్యనే కాంచీపురం చేరుకున్న స్వామీజీ అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నారు. -
కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి శివైక్యం
-
జయేంద్ర సరస్వతి నిర్యాణంపై ప్రముఖుల సంతాపం
సాక్షి, హైదరాబాద్ : కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి నిర్యాణం పట్ల ప్రముఖులు సంతాపం తెలియజేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సంతాపం తెలిపారు. జయేంద్ర సరస్వతి మృతి ఆయన భక్తులకు తీరని లోటు అని మోదీ పేర్కొన్నారు. లక్షలాది మంది భక్తుల హృదయాల్లో జయేంద్ర సరస్వతి ఉంటారని మోదీ ట్వీట్ చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఈ సందర్భంగా ప్రార్థించారు. జయేంద్ర సరస్వతి మృతి తీవ్ర విషాదాన్ని నింపిందని అమిత్ షా తెలిపారు. Deeply anguished by the passing away of Acharya of Sri Kanchi Kamakoti Peetam Jagadguru Pujyashri Jayendra Saraswathi Shankaracharya. He will live on in the hearts and minds of lakhs of devotees due to his exemplary service and noblest thoughts. Om Shanti to the departed soul. pic.twitter.com/pXqDPxS1Ki — Narendra Modi (@narendramodi) February 28, 2018 జయేంద్ర సరస్వతి ఆత్మకు శాంతి చేకూరాలని గవర్నర్ నరసింహన్ ప్రార్థించారు. జయేంద్ర సరస్వతి నిర్యాణం ఆయన భక్తులకు తీరని లోటు అని పేర్కొన్నారు. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మహానిర్యాణంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కంచి పీఠం అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. హిందూత్వంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువుగా ఉన్న జయేంద్ర సరస్వతి శివైక్యం పొందడం బాధాకరమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన తన మార్గదర్శకత్వంలో కంచి పీఠాన్ని బలమైన సంస్ధగా తీర్చిదిద్దారు. పాఠశాలలు, కంటి ఆస్పత్రులు, పిల్లల వైద్యశాలలను నడుపుతూ ప్రజాసేవలో పునీతులయ్యారు. జయేంద్ర సరస్వతి స్వామి బుధవారం శివైక్యం చెందడంపై టీటీడీ ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ సంతాపం వ్యక్తం చేశారు. హిందూ సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా టీటీడీ నిర్వహించిన ధార్మిక కార్యక్రమాలకు కంచి స్వామి అందించిన సహకారాన్ని మరువలేమన్నారు. ఈ సందర్భంగా వారితో గల అనుబంధాన్ని ఈవో గుర్తు చేసుకున్నారు. గత కొంతకాలం నుంచి శ్వాస సంబంధిత సమస్యలతో సతమవుతున్న కంచి పీఠాధిపతి మంగళవారం మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చికిత్స కోసం కాంచీపురంలోని ఏబీసీడీ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు మెరుగైన చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో బుధవారం ఉదయం సమయంలో ఆయన తుదిశ్వాస విడిచారు. 1935 జూలై 18న తమిళనాడులోని తంజావురు జిల్లా ఇరునీకల్ గ్రామంలో జయేంద్ర సరస్వతి జన్మించారు. ఆయన అసలు పేరు సుబ్రహ్మణ్య మహదేవ అయ్యర్. 1954 మార్చి 24న ఆయన జయేంద్ర సరస్వతిగా మారారు. కంచి కామకోటి పీఠానికి జయేంద్ర సరస్వతి 69వ అధిపతి. 1994 జనవరి 3 నుంచి కంచి పీఠాధిపతిగా జయేంద్ర సరస్వతి బాధ్యతలు చేపట్టారు. కాగా జయేంద్ర సరస్వతి స్వామి భౌతికకాయాన్ని ఆసుపత్రి నుంచి కంచి మఠానికి తీసుకుని వచ్చారు. అనంతరం ఆయన పార్థివదేహానికి శాంతి పూజ తదితర శాస్త్రోక్తమైన పూజలు నిర్వహించి ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆయన మరణ వార్త తెలియగానే కాంచీపురం, చెన్నై తదితర ప్రాంతాల నుంచి భక్తులు కడసారి దర్శనానికి పెద్ద ఎత్తున మఠానికి తరలివస్తున్నారు. -
కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి శివైక్యం
-
జయేంద్ర సరస్వతి శివైక్యం
సాక్షి, చెన్నై: తమిళనాడులోని ప్రసిద్ధ కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి(82) శివైక్యం చెందారు. కాంచీపురంలోని ఏబీసీడీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయేంద్ర సరస్వతి తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలం నుంచి కంచి పీఠాధిపతి శ్వాస సంబంధిత సమస్యలతో సతమవుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చికిత్స కోసం కాంచీపురంలోని ఏబీసీడీ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు చేసిన ప్రయత్నం విఫలమవడంతో జయేంద్ర సరస్వతి బుధవారం శివైక్యం చెందినట్లు సమాచారం. కాగా, గత నెలలోనూ శ్వాసకోశ ఇబ్బందులతో అస్వస్థతకు గురైన జయేంద్ర సరస్వతిని చెన్నై పోరూరులోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కొన్ని రోజుల చికిత్స అనంతరం కంచి పీఠాధిపతి కోలుకున్న విషయం తెలిసిందే. జయేంద్ర సరస్వతి 1935 జూలై 18న తంజావూరు జిల్లాలోని ఇరుల్ నీకిలో జన్మించారు. జయేంద్ర సరస్వతి అసలు పేరు సుబ్రహ్మణ్య మహాదేవ. 1954 మార్చి 22న కంచి పీఠంలో చేరిన ఆయన జయేంద్ర సరస్వతిగా మారారు. కంచి పీఠానికి ఆయన 69వ పీఠాధిపతిగా సేవలు అందించారు. -
కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతికి అస్వస్థత
చెన్నై : కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి అస్వస్థతకు గురయ్యారు. శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్న జయేంద్ర సరస్వతిని చెన్నైలోని పోరూరులో ఉన్న ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం జయేంద్ర సరస్వతి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. -
తెరపైకి మరో వివాదాస్పద చిత్రం
ఇటీవల సినిమాలు వివాదాలతోనే ఎక్కువగా ప్రచారం పొందుతున్నాయి. కొన్ని సినిమాలు అనుకోకుండా వివాదాల్లో చిక్కుకుంటే, కొంత మంది మేకర్స్ వివాదాస్పద అంశాలనే సినిమాలకు ఎంచుకుంటున్నారు. తాజాగా అలాంటి వివాదాస్పద సంఘటనతో తమిళ కన్నడ భాషల్లో ఓ సినిమా తెరకెక్కనుంది. దండుపాళ్యం సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు శ్రీనివాస రాజు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 2004లో కంచిపీఠంలో జరిగిన ఆలయ మేనేజర్ శంకర రామన్ హత్య, ఆ తరువాత పరిణామాలు పీఠాధిపతి జయేంద్ర సరస్వతి అరెస్ట్ నేపథ్యంలో ఆచార్య అరెస్ట్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. తమిళ, కన్నడ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్న ఈ సినిమాను ఒకేసారి తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కథ కోసం శంకర రామన్‌ను హత్య చేసిన గ్యాంగ్ కు చెందిన వారిని కూడా కలిసినట్టుగా తెలిపాడు దర్శకుడు శ్రీనివాస రాజు. అంతేకాదు త్వరలోనే కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిని కలిసి మరిన్ని అంశాలపై చర్చిస్తానని, సినిమాలో అప్పటి సంఘటనకు సంబంధించిన రాజకీయ కోణంతో పాటు ప్రచారంలో ఉన్న ఎన్నో అనుమానాలను నివృత్తి చేసే విధంగా సినిమా తెరకెక్కిస్తానని తెలిపారు. -
నేటి నుంచి తిరుమలలో కారీ రిష్టియాగం
తిరుమల: నేటి నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో కారీ రిష్టియాగం జరగనుంది. దీనికోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఆలయ పరిసరాల్లోని పార్వేట మండపం వద్ద ఐదురోజుల పాటు ఈ యాగం నిర్వహించబోతున్నారు. కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో కారీ రిష్టియాగం జరగనుంది. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా సరైన వర్షాలు కురవాలని, దేశం సుఖశాంతులతో వర్ధిల్లాలనే ఉద్దేశంతో యాగం నిర్వహిస్తున్నట్లు తిరుమల తిరపతి దేవస్థానం అధికారులు తెలిపారు. సోమవారం కూడ తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. స్వామి వారి దర్శనానిని, సర్వదర్శన భక్తులకు 12గంటలు, కాలినడక భక్తులకు 10గంటల సమయం పడుతోంది. వేసవి సెలవులు కావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రొటోకాల్ ప్రకారమే వీఐపీ బ్రేక్ దర్శనాన్ని అనుమతిస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
భావితరాలకు సంస్కృతి విత్తనాలను నాటాలి
అవనిగడ్డ: భారతదేశం పురాతన సంస్కృతి, సంప్రదాయాలకు నిల యమని, దీనిని భావితరాలకు తీసుకెళ్లాలంటే సంస్కృతి అనే విత్తనాలను నాటాలని కంచి కామకోటి పీఠాధిపతులు జయేంద్ర సరస్వతి, శంకర విజయేంద్ర సరస్వతిస్వామి అన్నారు. మండలంలోని కొత్తపేట పుష్కర ఘాట్ వద్ద చంద్రశేఖర సరస్వతిస్వామి చిత్తరువు శిలాఫలకాన్ని వారు బుధవారం ఆవిష్కరించారు. అనంతరం గాంధీక్షేత్రంలో భక్తుల కు అనుగ్రహ భాషణం చేశారు. విజయేంద్ర సరస్వతిస్వామి మాట్లాడుతూ శంకరాచార్యులు వేదాంతం అనే విత్తనాలను నాటడం వల్ల భారతదేశం గొప్ప సంససస్కృతీ సంప్రదాయంతో విరసిల్లుతూ విద్యలోనూ ముం దంజలో ఉందన్నారు. ఏబీసీడీలతోపాటు మన పిల్లలకు సంస్కృతి, సంప్రదాయాలను నేర్పించాలని అన్నారు. సంస్కృతిని కాపాడేందుకు ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ దంపతులతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, పలు విద్యాసంస్థల నిర్వాహకులు, విద్యార్థులకు ఆశీస్సులు అందజేశారు. విద్యార్థినిలు ప్రదర్శించిన కోలాట నృత్యాన్ని పీఠాధిపతులు తిలకించారు. శ్రీలంకమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో రూ.13.80 లక్షలతో నిర్మించిన అర్చనా మండçపాన్ని పీఠాధిపతులు జయేంద్రసరస్వతి, శంకర విజయేంద్ర సరస్వతి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ బండే వెంకటనాగకనకదుర్గ, జెడ్పీటీసీ కొల్లూరి వెంకటేశ్వరరావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
గురుమార్గం ఉత్తమం
అయిభీమవరం (ఆకివీడు) : గురుమార్గం మానవుడికి సన్మార్గమని కంచి కామకోటి పీఠాధిపతి శంకర జయేంద్ర సరస్వతి అన్నారు. అయిభీమవరంలోని టీటీడీ బోర్డు మాజీ చైర్మ¯ŒS కనుమూరి బాపిరాజు నివాసంలో సోమవారం ఆయన బస చేశారు. ఈ సందర్భంగా కంచి పీఠాధిపతులు అయిభీమవరం గ్రామం సందర్శించినప్పటి చిత్రాలను బాపిరాజు ఆయనకు చూపించారు. గురుపూజ చేయడం ద్వారా ప్రతి మనిషి సన్మార్గంలో నడుస్తాడని స్వామీజీ అన్నారు. షష్ఠి పండగను అమృత లింగేశ్వరస్వామి ఆలయంలో జరుపుకునే భాగ్యం దక్కిందన్నారు. పురాతన ఆలయాల్ని తక్షణం పునర్నిర్మించాలని సూచించారు. ఆలయాలు వైభవంగా ఉంటేనే గ్రామం సుభీక్షంగా ఉంటుందని చెప్పారు. -
జయేంద్ర సరస్వతికి మళ్లీ అస్వస్థత
విజయవాడ (లబ్బీపేట): కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. విజయవాడలోని శ్రీ చంద్రమౌళేశ్వర వేంకటేశ్వరస్వామి దేవాలయంలో చాతుర్మాస దీక్షలో ఉన్న ఆయనకు బుధవారం శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దీంతో ఉదయం 11.30 సమయంలో ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్‌కు తరలించారు. వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించి ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరి నిమోనియాగా మారినట్లు తెలిపారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రి పల్మనాలజిస్ట్ డాక్టర్ టి.రవీంద్రనాథ్ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాగానే ఉన్నారని, శ్వాస తీసుకోవడంలో మరింత ఇబ్బంది తలెత్తితే వెంటిలేటర్‌పై ఉంచాల్సివస్తుందని వైద్యులు తెలిపారు. -
జయేంద్ర సరస్వతిని కలిసిన వైఎస్ జగన్
-
జయేంద్ర సరస్వతిని కలిసిన వైఎస్ జగన్
విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం విజయవాడలో కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం లబ్బిపేటలోని షిరిడీసాయిని వైఎస్ జగన్ దర్శించుకున్నారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఆలయంలో వైఎస్ జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరికాసేపట్లో పున్నమిఘాట్లో ఆయన పుష్కర స్నానమాచరించనున్నారు. అనంతరం నందిగామ నియోజకవర్గంలో ఆయన పర్యటించనున్నారు. పుష్కర స్నానాలకెళ్లి మృత్యువాత పడిన విద్యార్థుల కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. -
శ్రీవారి సేవలో కంచిపీఠాధిపతి
తిరుమల:కంచిపీఠాధిపతి జయేంద్ర సరస్వతి శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆయనకు అధికారులు, వేదపండితులు స్వాగతం పలికారు. పీఠాధిపతి ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని, తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు పీఠాధిపతి ఆశీస్సులు అందుకున్నారు. -
వేదాలే మార్గదర్శకాలు
వేదాలను పాటించేవారు సమాజంలో అందరికీ మార్గదర్శకులుగా నిలుస్తారని కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి తెలిపారు. యూనివర్సిటీ క్యాంపస్, న్యూస్‌లైన్: వేదాలను పాటించేవారు సమాజంలో అందరికీ మార్గదర్శకులుగా నిలుస్తారని కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి అన్నారు. ఎస్వీ యూనివర్సిటీలోని ప్రాచ్య పరిశోధన సంస్థలో మహాభారతంపై మంగళ వారం అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. శ్రీనివాస ఆడిటోరియంలో ప్రారంభమైన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి తన సందేశం అందించారు. సనాతన ధర్మం ఎంతో గొప్పదన్నారు. గ్రంథాలు, పురాణాలు, ఇతిహాసాలు, సనాతన ధర్మ విశిష్టతను తెలియపరుస్తున్నాయన్నారు. సనాతన ధర్మం వేదాల నుంచి వచ్చిందన్నారు. ఈ ధర్మమే అన్ని యుగాల్లో గొప్పగా నిలిచిందన్నారు. ధర్మ పరిరక్షణ కోసం మహావిష్ణువు పది అవతారాలు ఎత్తారన్నారు. శ్రీకృష్ణుడు ధర్మపరిరక్షణలో కీలక పోత్ర పోషించాడన్నారు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడుకి చేసిన గీతోపదేశం సారాంశం అన్ని కాలాలకు అనువర్తితం అవుతుందన్నారు. మహాభారతంలో లేని అంశాలే లేవన్నారు. అంద రూ ధర్మమార్గంలో నడిస్తే భారతదేశం విదేశాలకు ధీటుగా నిలుస్తుందన్నారు. మనది పవిత్ర దేశం విశిష్ఠ అతిథిగా హాజరైన రామానుజ మిషన్ ట్రస్ట్(చెన్నై)కు చెందిన చతుర్వేదస్వామి ప్రసంగిస్తూ భారతదేశం పవిత్రమైనదన్నారు. దేవుడు గొప్పవాడన్నారు. అలానే మానవులు ధర్మ పరిరక్షణ ధర్మాలు పాటించడం ద్వారా దైవత్వాన్ని పొందుతారన్నారు. పురాణాలు, శాస్త్రాలు దేవుడి గొప్పతనాన్ని వివరిస్తాయన్నారు. మహాభారతం, రామాయణం మహాకావ్యాలే కాకుండా అందులో సైన్స్‌కు సంబంధించిన అనేక అంశాలున్నాయన్నారు. ఏ యుగంలోనైనా ఏ కాలంలోనైనా ధర్మ పరిరక్షణే పరమార్థమని మహాభారతంలో శ్రీకృష్ణుడు చెప్పారన్నారు. అలానే మానవీయ విలువలు, నీతినియమాలు పాటించలేని వారు సమాజానికి అవసరం లేదన్నారు. భీమిలిలోని శివమహా పీఠాధిపతి కందుకూరి శివానందమూర్తి ప్రసంగిస్తూ ఎప్పటికైనా ధర్మమే విజయం సాధిస్తుందని మహాభారతం ద్వారా తెలుస్తుందన్నారు. 41 రోజుల పాటు అంపశయ్యపైన నిలిచిన భీష్ముడు చనిపోతూ అర్జునుడికి బోధించిన హితోపదేశంలో అనేక అంశాలు ఉన్నాయని ఇవి ఏ కాలానికైనా అచరించదగినవని చెప్పారు. టీటీడీ ఈవో ఎంజీ.గోపాల్ మాట్లాడుతూ రామాయణ, మహాభారతాలు ప్రస్తుత సమాజంలో నెలకొన్న అనేక సమస్యలకు పరిష్కారం చూపుతాయన్నారు. మహాభారతాన్ని మేనేజ్మెంట్ పుస్తకంగా ఉపయోగించవచ్చన్నారు. ఈ కార్యక్రమానికి ఎస్వీయూ వీసీ రాజేంద్ర అధ్యక్షత వహించారు. రెక్టార్ సుకుమార్, రిజిస్ట్రార్ కె. సత్యవేలురెడ్డి, ఎస్వీయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కిరణ్ క్రాంత్ చౌదరి, సదస్సు నిర్వహణ కార్యదర్శి వేమూరి వెంకటరమణారెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. -
‘కంచి’కి చేరిన కథ
కంచి స్వాములపై మోపిన హత్య అభియోగం కథ కంచికి చేరింది. జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి సహా మొత్తం 23 మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. దీంతో కంచిలో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. స్వాముల భక్తులు, అభిమానులు, స్థానికులు బాణ సంచా కాల్చి పండుగ చేసుకున్నారు. చెన్నై, సాక్షి ప్రతినిధి:ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిత్యం మునిగితేలే కంచి మఠం పీఠాధిపతులు హత్య కేసులో ఇరుక్కోడం దేశంలోనే కలకలం రేపింది. కంచి మఠం నిధులు దారి మళ్లుతున్నాయని ఆరోపిస్తూ కంచి వరదరాజ పెరుమాళ్ కోవిల్ మేనేజర్ శంకరరామన్ ప్రభుత్వానికి ఉత్తరాలపై ఉత్తరాలు రాస్తున్న తరుణంలోనే 2004 సెప్టెంబరు 3వ తేదీన హత్యకు గురయ్యారు. శంకరామన్ తన ఉత్తరాల్లో కంచి మఠాధిపతులు జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతిని నిందించడంతో హత్యకు వారే పురమాయించి ఉంటారని పోలీసులు భావించారు. ఈ మేరకు వీరిద్దరు సహా 25 మందిని నిందితులుగా చేర్చారు. ఆశ్చర్యకరంగా ఆరోపించిన వారే కోర్టు విచారణలో సహకరించక పోవడం తీర్పును ప్రభావితం చేసింది. హతుని భార్య, కుమారుడు ఆనందశర్మ, కుమార్తె ఉమా మైత్రేయి సైతం హత్యకు పాల్పడిన నిందితులను గుర్తించలేక పోతున్నామని కోర్టుకు విన్నవించడంతో అందరూ నిర్దోషులుగా బయటపడ్డారు. కంచి స్వాముల కేసులో తీర్పు వెలువడుతుందని తెలియడంతో పుదుచ్చేరిలోని కోర్టు ప్రాంగణం బుధవారం కిటకిటలాడింది. ప్రజలంతా టీవీలకు అతుక్కుపోయారు. మరో వైపు జాతీయ, రాష్ట్ర మీడియా ప్రతినిధులు పోటీపడ్డారు. తీర్పు వెలువడిన అనంతరం విజయేంద్ర స్వామి అభిప్రాయాన్ని తీసుకునేందుకు ఎలక్ట్రానిక్ మీడియా అనేక ప్రయత్నాలు చేసింది. స్వామి మౌనవ్రతంలో ఉన్నారంటూ శిష్యులు వారించడంతో మీడియా నిరాశగా వెనుతిరగక తప్పలేదు. కేసు విచారణలో నిందితుడు హత్యకు గురికావడం, విచారణను నిలుపుదల చేయాలని శంకరరామన్ కుమారుడు ఆనందశర్మ పిటిషన్, కేసు పరిధి, న్యాయవాది, న్యాయమూర్తి మారడం వంటి అనేక అడ్డంకులు, ఆటుపోట్ల నడుమ కేసు విచారణ 9 ఏళ్లు సాగింది. ఆనందోత్సాహాలు కంచి స్వాములు నిర్దోషులంటూ తీర్పు వెలువడగానే కంచిలో ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి. ప్రజలు, భక్తులు, అభిమానులు బాణ సంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కోర్టు నుంచి వెలుపలకు వచ్చిన జయేంద్ర సరస్వతి ప్రత్యేక కారులో తిరుచందూరుకు, విజయేంద్ర సరస్వతి కంచి మఠానికి వెళ్లిపోయారు. జయేంద్ర సరస్వతి గురువారం సాయంత్రం తిరుమలకు చేరుకుని శుక్రవారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. అక్కడి నుంచి కంచికి చేరుకుంటారు. -
కంచి స్వాములు నిర్దోషులు..
-
శంకర్ రామన్ హత్య కేసులో కంచి పీఠాధిపతులకు ఊరట
చెన్నై : కాంచీపురంలోని వరదారాజ పెరుమాళ్ ఆలయం మేనేజర్ శంకర్రామన్ హత్య కేసులో కంచి కామకోటి పీఠాధిపతులకు ఊరట లభించింది. జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి నిర్దోషులని పుదుచ్చేరి జిల్లా కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో స్వాముల ప్రమేయంపై దర్యాప్తు బృందం ఆధారాలు చూపలేకపోయారని కోర్టు అభిప్రాయపడింది. స్వాములతో పాటు మిగిలిన నిందితులపైనా అభియోగాలు నిరూపించడంలో దర్యాప్తు బృందం విఫలమవడంతో అందరినీ నిర్దోషులుగా న్యాయస్థానం ప్రకటించింది. 2004లో సెప్టెంబర్3న కాంచీపురంలోని వరదాజ పెరుమాళ్ ఆలయం మేనేజర్ శంకర్రామన్ ఆలయ ప్రాంగణంలో అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. దాంతో ఆ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఆ హత్యలో కంచి పీఠాధిపతులు పాత్ర ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కంచి పీఠాధిపతులు జయేంద్ర, విజయేంద్ర సరస్వతులతోపాటు పలువురిపై వివిధ సెక్షన్ల కింద నిందితులుగా కేసులు నమోదుయ్యాయి. ఈ కేసుకు సంబంధించి పుదుచ్చేరి కోర్టు 9 సంవత్సరాల పాటు 189 మంది సాక్షులను విచారించింది.