తమిళనాడులోని ప్రసిద్ధ కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి(82) శివైక్యం చెందారు. కాంచీపురంలోని ఏబీసీడీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయేంద్ర సరస్వతి తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలం నుంచి కంచి పీఠాధిపతి శ్వాస సంబంధిత సమస్యలతో సతమవుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చికిత్స కోసం కాంచీపురంలోని ఏబీసీడీ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు చేసిన ప్రయత్నం సఫలం కాకపోవడంతో జయేంద్ర సరస్వతి బుధవారం శివైక్యం చెందినట్లు సమాచారం.