విజయవాడ (లబ్బీపేట): కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. విజయవాడలోని శ్రీ చంద్రమౌళేశ్వర వేంకటేశ్వరస్వామి దేవాలయంలో చాతుర్మాస దీక్షలో ఉన్న ఆయనకు బుధవారం శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. దీంతో ఉదయం 11.30 సమయంలో ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్‌కు తరలించారు.
వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించి ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరి నిమోనియాగా మారినట్లు తెలిపారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రి పల్మనాలజిస్ట్ డాక్టర్ టి.రవీంద్రనాథ్ ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాగానే ఉన్నారని, శ్వాస తీసుకోవడంలో మరింత ఇబ్బంది తలెత్తితే వెంటిలేటర్‌పై ఉంచాల్సివస్తుందని వైద్యులు తెలిపారు.